Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Chief YS Jagan Fires On Chandrababu Govt1
బిహార్‌ను మించి భయోత్పాతం: వైఎస్‌ జగన్‌

చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసులు తమ టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్‌ చేయకుండా ఆయనకు వాచ్‌మెన్‌ల మాదిరిగా పని చేస్తున్నారు. వారికి ఒకటే చెబుతున్నా..! ఎల్లకాలం చంద్రబాబు నాయుడు పరిపాలనే ఉండదు. అలా వ్యవహరించిన పోలీసుల బట్టలూడదీసి ప్రజల ముందు, చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరిస్తున్నా. మీ యూనిఫామ్‌ తీయించి ఉద్యోగాలు ఊడగొడతామని చెబుతున్నా. మీరు చేసిన ప్రతి పనికీ వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం -వైఎస్‌ జగన్‌ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారు.. సూపర్‌ సిక్స్‌ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో.. రెడ్‌బుక్‌ పాలనతో దాడులు కొనసాగిస్తున్నారు. పోలీసులను ఉపయోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెగబడుతున్న దౌర్జన్య కాండను ప్రజలంతా చూస్తున్నారు. కచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి..’ అని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. గత నెల 30వ తేదీన టీడీపీ గూండాల పాశవిక దాడిలో మృతిచెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరామర్శించిన అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. గతంలో బిహార్‌.. ఇప్పుడు ఏపీ!! రాప్తాడు నియోజకవర్గంలో ఈ ఘటన ఎందుకు జరిగింది? రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయి..? అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. భర్తను కోల్పోయిన లింగమయ్య భార్య దిక్కు తోచక తల్లడిల్లిపోతోంది. గతంలో బిహార్‌ గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ పరువును చంద్రబాబు రోడ్డున పడేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయి. ఇటీవల 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు పార్టీ గెలిచే పరిస్థితి లేదని గ్రహించడంతో పోస్ట్‌పోన్‌ చేయించారు. అనివార్యం కావడంతో 50 చోట్ల ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభ పెట్టినా.. 39 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. అసలు ఆ 57 చోట్ల చంద్రబాబుకు సంఖ్యా బలమే లేదు. అక్కడ గెలిచిన వారంతా వైఎస్సార్‌సీపీ సభ్యులే. మా పార్టీ గుర్తు మీద గెలుపొందిన వారే. చంద్రబాబు తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేదని తెలిసి కూడా భయపెడుతూ, పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్‌మెన్‌ల కంటే కూడా హీనంగా వాడుకుంటూ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. ఒక ఎంపీపీ పోతే ఏమవుతుంది బాబూ? చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి! ఒకచోట ఎంపీపీ పోతే ఏమవుతుంది? ఒకచోట జెడ్పీ చైర్మన్, ఉప సర్పంచ్‌ పదవి పోతే ఏమవుతుంది? ఆయన సీఎం కాబట్టి.. అధికారంలో ఉన్నారు కాబట్టి.. బలం లేకపోయినా.. తాను ముఖ్యమంత్రినన్న అహంకారంతో ఏ పదవైనా తమకే దక్కాలనే దురుద్దేశంతో శాంతిభద్రతలను పూర్తిగా నాశనం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి రహదారిలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌ రామగిరిలో రాక్షసత్వం.. రామగిరి మండలంలో పది మంది ఎంపీటీసీలు ఉంటే వైఎస్సార్‌సీపీకి చెందిన 9 మంది సభ్యులు గెలిచారు. కేవలం ఒకటి మాత్రమే టీడీపీది. మరి ఇక్కడ ఎంపీపీ పదవికి నోటిఫికేషన్‌ జారీ అయితే 9 మంది సభ్యులున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పదవి దక్కాలా? లేక ఒకే ఒక సభ్యుడున్న టీడీపీకి రావాలా? తొమ్మిది మంది సభ్యులు చంద్రబాబు ప్రలోభాలకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లి తమకు ప్రాణహాని ఉందని, ఎంపీపీ పదవికి పోటీ చేయాలంటే పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. కోర్టు ఆదేశాలతో సభ్యులను తీసుకొస్తుంటే.. ప్రొటెక్షన్‌ ఇవ్వాల్సిన పోలీసులు మధ్యలో రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ అనే వ్యక్తిని వీళ్ల కాన్వాయ్‌లోకి ఎక్కించారు. వీళ్లందరికి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడితో వీడియో కాల్‌ చేయించారు. నువ్వు ఓటు వేయకుంటే మీ అమ్మనాన్న ఇంటికి రారని భారతమ్మ అనే ఎంపీటీసీని వీడియో కాల్‌ చేయించి బెదిరించారు. వీటికి లొంగకపోవడంతో కోరం లేదని ఎన్నికలు వాయిదా వేశారు. ఆ తరువాత ఇదే ఎస్‌ఐ పెనుకొండకు తీసుకెళ్లి ఎంపీటీసీ సభ్యులను బైండోవర్‌ చేశారు. దీంతో ప్రకాష్‌రెడ్డి (రాప్తాడు మాజీ ఎమ్మెల్యే), ఉషశ్రీ (పార్టీ జిల్లా అధ్యక్షురాలు) మా పార్టీకి చెందిన ఎంపీటీసీలకు మద్దతుగా వెళ్లడంతో వారిద్దరిపై కేసులు పెట్టారు. అసలు వీళ్లిద్దరు ఏం తప్పు చేశారని కేసులు పెట్టారు? వాళ్లు టీడీపీ ఎంపీటీసీలనేమైనా తెచ్చారా? మా పార్టీ సభ్యుల కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు వెళ్లి ధర్నా చేసినందుకు వాళ్ల మీద కేసులు బనాయించారు. భయోత్పాతం సృష్టించారు.. ఈ ఎన్నికల ప్రక్రియ జరగకూడదన్న దురుద్దేశంతో పాపిరెడ్డిపల్లిలో మా పార్టీకి చెందిన జయచంద్రారెడ్డిపై దాడి చేశారు. 28న మళ్లీ దాడి చేశారు. లింగమయ్య అన్న ఈ దాడిని అడ్డుకుని పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. తమపై దాడులను అరికట్టాలని వేడుకుంటే పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో మార్చి 30న కురుబ లింగమయ్య కుమారుడు బైక్‌పై వెళ్తుంటే రాళ్లతో దాడి చేశారు. కుమారుడు ఈ విషయాన్ని లింగమయ్యకు చెప్పడంతో.. 20 మందికిపైగా టీడీపీ మూకలు మరోసారి లింగమయ్య ఇంటికి వెళ్లి బేస్‌బాల్‌ బ్యాట్, మచ్చుకత్తులు, కర్రలతో దాడి చేసి హింసించడంతో లింగమయ్య చనిపోయారు. రాష్ట్రం ఈ రోజు బిహార్‌ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుతో తల వంచుకునేలా వ్యవహరిస్తున్నారు. 20 మంది దాడి చేస్తే.. ఇద్దరిపై కేసులా? లింగమయ్యపై 20 మంది దాడి చేస్తే కేసులు ఇద్దరి మీదే పెట్టారు. ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్‌నాయుడుపై ఎందుకు కేసు పెట్టలేదు? మిగిలిన వారిని ఎందుకు వదిలేశారు? నిందితులంతా ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యే బంధువులు. ఎమ్మెల్యే కుమారుడు మార్చి 27న ఆ గ్రామానికి వెళ్లి రెచ్చగొడితే ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేపై గానీ, ఆమె కుమారుడిపైగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎస్‌ఐ సుధాకర్‌ భయపెడుతుంటే అతడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? లింగమయ్య కుమారుడు శ్రీనివాస్‌పై కూడా దాడి జరిగింది. కానీ కంప్లయింట్‌ లింగమయ్య కుమారుడితో కాకుండా.. పోలీసులే ఒక ఫిర్యాదు రాసుకుని వచ్చి నిరక్షరాస్యురాలైన లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్రలు వేయించుకుని వెళ్లారు. వాళ్లు ఏం రాసుకున్నారో తెలియదు..! నిందితులనే సాక్షులుగా చేర్చి.. లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతోనే బేస్‌బాల్‌ బ్యాట్‌తో దాడి చేశారు. పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదులో బేస్‌బాల్‌ బ్యాట్‌ ఉన్నట్లు రాయలేదు. చిన్న చిన్న కర్రలతో దాడి చేసినట్లు వక్రీకరించారు. పోలీసులు విచారించిన 8 మందిలో ఐదుగురు మాత్రమే లింగమయ్య కుటుంబీకులు. మిగిలిన ముగ్గురూ టీడీపీకి చెందినవారు. నిందితులనే సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో ఇంతకంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షులను కూడా వీళ్లకు కావాల్సిన వాళ్లను పెట్టుకున్నారు. వీళ్లే తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం చూస్తే.. పోలీసు వ్యవస్థ ఇంతకన్నా దారుణంగా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మీ కుటుంబానికి అండగా ఉంటాం⇒ లింగమయ్య హత్యను మానవ హక్కుల సంఘానికి నివేదిస్తాం⇒ పాపిరెడ్డిపల్లిలో బాధిత కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్‌ జగన్‌ టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన తమ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ నెల 30న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో లింగమయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లింగమయ్య కుటుంబాన్ని పరామ­ర్శించేందుకు వైఎస్‌ జగన్‌ వస్తున్నట్లు తెలియడంతో పల్లెలకు పల్లెలు పాపిరెడ్డిపల్లికి తరలివచ్చాయి. హెలిప్యాడ్‌ నుంచి జగన్‌ నేరుగా లింగమయ్య ఇంటికి చేరుకుని తొలుత చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం కింద కూర్చుని లింగమయ్య భార్య, కుమారులు, కుమార్తెతో చాలాసేపు మాట్లాడి ఓదార్చారు. లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున న్యాయం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. లింగమయ్య పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. లింగమయ్య అన్న హత్య అత్యంత కిరాతకమన్నారు. టీడీపీ మూకల దుర్మార్గాలను రాష్ట్రవ్యాప్తంగా తెలియచెప్పేందుకు వచ్చామ­న్నారు. ఈ కేసును మానవ హక్కుల సంఘానికి నివేదిస్తామని ప్రకటించారు. టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..జగన్‌ పరామర్శిస్తున్న సమయంలో లింగమయ్య కుమార్తె కన్నీటి పర్యంతమైంది. అన్నా..! మా నాన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త.. అందుకే 20 మందితో వచ్చి దాడి చేసి చంపారన్నా..! టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..! అంటూ రోదించింది. మా అమ్మ, తమ్ముళ్లకు ఏమీ తెలియదన్నా..! మీరే అండగా నిలవాలన్నా..! గ్రామంలో టీడీపీ దుర్మార్గాలను తట్టుకో­లేక­పోతు­న్నామన్నా..! పండుగలు కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నా..! అంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ‘వైఎస్సార్‌సీపీ హయాంలో ఎలాంటి గొడవలూ లేవన్నా..! ఇప్పుడు ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉందన్నా..’ అంటూ కొందరు మహిళలు ఆందోళన వ్యక్తం చేయగా.. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్రమంతా.. రెడ్‌బుక్‌ దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ.. కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపిస్తున్నారు: జగన్‌ ‘రామగిరిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వీళ్లు చేస్తున్న అన్యాయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏం జరుగుతోందంటే.. ‘దొంగ సాక్ష్యాలను వీళ్లే సృష్టిస్తున్నారు. నచ్చని నేతలను కేసుల్లో ఇరి­కించి జైళ్లకు పంపిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ⇒ తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక జరిగితే బస్సులో ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని ఏకంగా పోలీసులే కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పం ఎంపీపీ ఉప ఎన్నిక కూడా దౌర్జన్యంగా జరిపించారు. పశి్చమ గోదావరి జిల్లా అత్తిలిలో కూడా ఇలాగే దౌర్జన్యం చేశారు. ఎక్కడా వీళ్లకు సంఖ్యా బలం లేదు. విశాఖలో 98 మంది సభ్యుల్లో 56 మంది వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచారు. అక్కడ కూడా భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నంరాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే.. ఈ నెల 6న ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్లలో ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారు. ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతాప్‌రెడ్డి గుడికి వెళ్లి పూజ చేస్తుండగా ఆయన అన్నను చంపేశారు. మా ప్రభుత్వంలో ప్రతాప్‌రెడ్డికి గన్‌మెన్‌ సౌకర్యం కల్పిస్తే చంద్రబాబు వచ్చాక తొలగించారు. పసుపులేటి సుబ్బరాయుడును చంపారు.. గతేడాది ఆగస్ట్‌ 3న శ్రీశైలం నియోజకవర్గం మహానందిలోని సీతారాంపురంలో పసుపులేటి సుబ్బరాయుడిని చంపేశారు. నేను ఆ ఊరికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించా. నంద్యాల హెడ్‌ క్వార్టర్‌కు కూతవేటు దూరంలో మర్డర్‌ జరిగినా పోలీసులు స్పందించలేదు. అక్కడే ఎస్పీ ఆఫీసు ఉన్నా ఎలాంటి చర్యలు లేవు. సాంబిరెడ్డిపై దారుణంగా దాడి.. గతేడాది జులై 23న పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఈద సాంబిరెడ్డిని ఇనుప రాడ్‌లతో కొట్టి కారుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో గతేడాది జూలై 17న వైఎస్సార్‌సీపీకి చెందిన రషీద్‌ అనే యువకుడిని దారుణంగా నరికి చంపారు. ఏడేళ్ల తర్వాత పోసానిపై కేసులు సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన తప్పేమిటంటే... ఆయనకు నంది అవార్డు ఇస్తే తీసుకోకపోవడం! కుల వివక్ష పాటిస్తున్నారని ఆయన 2017లో స్టేట్‌మెంట్‌ ఇస్తే ఇప్పుడు ఆయనపై 18 కేసులు బనాయించి అరెస్టు చేసి నెల రోజులకుపైగా జైల్లో పెట్టించారు. 145 రోజులకుపైగా జైలులో నందిగం సురేష్‌.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మా మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు మోపి 145 రోజులకుపైగా జైల్లో పెట్టారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజులు జైల్లో పెట్టారు. దాడులు చేసేది టీడీపీ వాళ్లయితే.. జైళ్లలో పెట్టేది మాత్రం వైఎస్సార్‌సీపీ నాయకులను!! వంశీపై అన్యాయంగా కేసులు.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ.. టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో లేరని ఆ పార్టీకి చెందిన వ్యక్తే కోర్టుకు వచ్చి చెప్పారు. అసలు అక్కడ వంశీ లేడని చెప్పినా.. అన్యాయంగా కేసులో ఇరికించి.. 50 రోజులుగా జైల్లో పెట్టారు.అడుగడుగునా భద్రతా వైఫల్యంరామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీ­సులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవు­తోంది. మంగళవారం వైఎస్‌ జగన్‌ పర్యటనలో అడుగ­డుగునా భద్రతా లోపాలు కనిపించాయి. వైఎస్‌ జగన్‌ను చూసేందుకు హెలికాప్టర్‌ను చుట్టుముట్టిన భారీ జనసందోహం పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదా­రుల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకు­నేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్‌ భద్రత విషయంలో చూపకపో­వడం గమనార్హం. హెలిప్యాడ్‌ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది­మంది హెలిప్యాడ్‌ వద్దకు పోటెత్తారు. జగన్‌ ప్రయాణిస్తున్న హెలి­కా­ప్టర్‌ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. హెలికాప్టర్‌ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్‌ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభి­మా­నుల తాకిడితో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్‌ తిరిగి వెళ్లిపోయింది. జగన్‌ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్‌ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

Dominican Republic Nightclub Roof Collapses2
Dominican Republic: నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు

సంతో డొమింగో: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సంతో డొమింగోలోని ప్రముఖ జెట్ సెట్ నైట్‌క్లబ్‌(Jet Set Nightclub)లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. సంగీత కచేరీ జరుగుతుండగా నైట్‌క్లబ్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 79 మంది వరకు మరణించారని, 160 మందికి పైగా జనం గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ సంగీత కచేరీని వీక్షించేందుకు సుమారు 600 మంది హాజరైనట్లు తెలుస్తోంది.స్థానిక రెస్క్యూ బృందాలు(Rescue teams) అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారిలో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మాజీ బేస్‌బాల్ ఆటగాళ్లు ఎమిలియో బోనిఫాసియో, లూయిస్ రామిరెజ్ కూడా ఉన్నారు. అలాగే ఒక ప్రావిన్స్ గవర్నర్ కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంగీత కచేరీకి హాజరైన వారిలో ప్రముఖులు, స్థానిక నేతలు ఉన్నట్లు సమాచారం. 🚨🇩🇴13 DEAD, 93 INJURED IN NIGHTCLUB ROOF COLLAPSE IN THE DOMINICAN REPUBLICThis comes after the roof of the Jet Set nightclub in Santo Domingo, Dominican Republic, collapsed earlier this morning.The national police confirmed the death toll and said search and rescue… pic.twitter.com/yAdkTqw8yX— Mario Nawfal (@MarioNawfal) April 8, 2025నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అధిక జనసమూహం కారణంగా భవనంపై ఒత్తిడి పెరిగి పైకప్పు కూలివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. నైట్‌క్లబ్ యాజమాన్యంతో పాటు స్థానిక నిర్మాణ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కచేరీ జరుగుతున్న సమయంలో పైకప్పు కూలిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది.ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పైకప్పు కుప్పకూలడం ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఈ దృశ్యాలు చూసిన వారు ఘటన తీవ్రతను అర్థం చేసుకోగలుగుతారు. డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా సంతాప దినం ప్రకటించారు. బాధితులకు సహాయం చేయడానికి అత్యవసర నిధులను కేటాయించారు. ఈ ఘటన అంతర్జాతీయంగానూ చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: ఏఐ చేతుల్లో పిల్లల ఎదుగుదల.. ఒడిశాలో శ్రీకారం

Indian Shruti Chaturvedi Detained At Alaska Airport3
అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం

వాషింగ్టన్‌: విదేశీ పర్యాటకులతో తరచూ అనుమాన, అవమానకర రీతిలో ప్రవర్తించిన అమెరికా దర్యాప్తు అధికారులు మరోమారు తమ బుద్ధిచూపించారు. వ్యాపార, వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న భారతీయ యువపారిశ్రామికవేత్త శ్రుతి చతుర్వేది పట్ల అలాస్కాలోని యాంకరేజ్‌ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా పురుష ఆఫీసర్‌తో ‘వ్యక్తిగత’తనిఖీలు చేయించారు. చలివాతా వరణంలో వెచ్చదనం కోసం ధరించిన అదన పు దుస్తులను విప్పించారు. కనీసం బాత్రూమ్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏకధాటిగా 8 గంటలపాటు తమ అ«దీనంలో నిర్బంధించి పలురకాల ప్రశ్నలతో వేధించారు. కనీసం సాయంకోసం ఎవరికీ ఫోన్‌చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని శ్రుతి తర్వాత భారత్‌కు చేరుకున్నాక ‘ఎక్స్‌’సామాజిక మాధ్యమంలోని తన ఖాతాలో పోస్ట్‌చేశారు.పవర్‌ బ్యాంక్‌పై అనుమానంతో.. ‘‘ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు నా హ్యాండ్‌బ్యాగ్‌లో స్మార్ట్‌ఫోన్‌ పవర్‌బ్యాంక్‌ ఉంది. అదేదో కొత్తరకం వస్తువు అన్నట్లు దానిని పోలీసులు అనుమానంగా చూశారు. వెంటనే ఎఫ్‌బీఐ అధికారులను రప్పించి తనిఖీలు చేయించారు. తర్వాత నన్ను ఇష్టమొచ్చినట్లు, అర్థంపర్థంలేని ప్రశ్నలతో వేధించారు. వాస్తవానికి మహిళా ఆఫీసర్‌కు తనిఖీలు చేయాల్సిఉన్నా ఒక పురుష అధికారి వచ్చి నన్ను తనిఖీలు చేశాడు. విపరీతమైన చలికారణంగా ధరించిన వెచ్చటి దుస్తులను విప్పించాడు. ఏకధాటిగా 8 గంటలపాటు ఎటూ వెళ్లనివ్వలేదు. కనీసం బాత్రూమ్‌కు కూడా పోనివ్వలేదు. సాయం కోసం ఎవరికైనా ఫోన్‌ చేసుకోవడానికి వీల్లేకుండా ఫోన్, మనీ పర్సు లాక్కున్నారు. అన్ని రకాల తనిఖీలు చేసి చివరకు ఏమీ లేవని నిర్ధారించుకుని వదిలేశారు. నా ఖరీదైన లగేజీ బ్యాగ్‌ను వాళ్లే అట్టిపెట్టుకున్నారు. నా వస్తువులను బయటకుతీసి నాసిరకం వేరే బ్యాగులో కుక్కి ఇచ్చారు. భారత్‌కు ఆవల ఉన్నప్పుడు భారతీయులు శక్తిహీనులు అన్నట్లు అమెరికా పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు ప్రవర్తించారు’’అని శ్రుతి ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన పోస్ట్‌ను భారత విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖకు ట్యాగ్‌ చేశారు. ‘ఇండియా యాక్షన్‌ ప్రాజెక్ట్‌’, చర్చా వేదిక అయిన ‘ఛాయ్‌పానీ’లను శ్రుతి స్థాపించారు. మహిళను గంటల తరబడి అమెరికా అధికారులు వేధించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. 🛑 Shruti Chaturvedi, an entrepreneur from India🇮🇳, was held for eight hours at a US airport because of a power bank in her luggage that was deemed suspicious.#Ukraine #ShrutiChaturvedi #USA #Entrepreneur pic.twitter.com/2lrKWXRzPR— Dainik Shamtak Samachar (@DainikShaamTak) April 8, 2025

Rasi Phalalu: Daily Horoscope On 09-04-2025 In Telugu4
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.ద్వాదశి రా.11.55 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: మఖ ఉ.11.30 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.7.57 నుండి 9.41 వరకు, దుర్ముహూర్తం: ప.11.35 నుండి 12.24 వరకు, అమృతఘడియలు: ఉ.8.56 నుండి 10.37 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.52, సూర్యాస్తమయం: 6.10. మేషం.... రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.వృషభం... కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.మిథునం... కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలబ్ధి. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.కర్కాటకం... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో జాప్యం. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.సింహం... నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. కళాకారులకు సన్మానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి.కన్య.... ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో విభేదాలు.ఆరోగ్యసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.తుల..... పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.రాబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.వృశ్చికం... ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. పనులు చకచకా సాగుతాయి..ధనుస్సు.... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.మకరం.... అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. బంధువులను కలుసుకుంటారు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు.కుంభం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.మీనం... ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబసమస్యలు తీరతాయి.

Donlad Trump administration food aid cuts millions at risk5
ట్రంప్‌ సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి మరణశాసనం

రోమ్‌: లక్షలాది మందికి ఆహార సాయాన్ని నిలిపేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) తీవ్రంగా తప్పుబట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆకలితో అలమటిస్తున్న లక్షలాది మంది పాలిన మరణశాసనంగా అభివర్ణించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం విజ్ఞప్తి చేసింది. ప్రాణాలను కాపాడే కార్యక్రమాలకు నిరంతరం మద్దతివ్వాలని కోరేందుకు ట్రంప్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది.అఫ్గానిస్తాన్, సిరియా, యెమన్, మరో 11 పేద దేశాల్లో లక్షలాది మంది అన్నార్తులకు సాయపడే యూఎస్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం అత్యవసర కార్యక్రమాలకు ట్రంప్‌ ప్రభుత్వం నిధులను నిలిపేయడం తెలిసిందే. ఎలాన్‌ మస్క్‌ డోజ్‌లో టాప్‌ లెఫ్టినెంట్‌ జెరెమీ లెవిన్‌ ఆదేశాల మేరకు వాటికి నిధుల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అత్యవసర ఆహార కార్యక్రమాలకు సాయాన్ని కోతల నుంచి మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇతర ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా లాభం లేకపోయింది.ట్రంప్‌ టార్గెట్‌ చేసిన కార్యక్రమాలు 13 ఏళ్ల అంతర్యుద్ధం, ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు తిరుగుబాటు తర్వాత సిరియా పేదరికం, ఆకలి, అభద్రతతో సతమతమవుతోంది. ఆ దేశానికి తాజాగా 23 కోట్ల డాలర్ల ఒప్పందాలను అమెరికా రద్దు చేసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవీయ విపత్తును ఎదుర్కొంటున్న యెమన్‌లో డబ్ల్యూఎఫ్‌పీ ఆహార కార్యక్రమాలకు సాయం నిలిపేసింది. సిరియా శరణార్థులు తీవ్రంగా ప్రభావితమయ్యే లెబనాన్, జోర్డాన్లలో కార్యక్రమాలూ పడకేశాయి.సోమాలియా, అఫ్గాన్, జింబాబ్వేల్లో యుద్ధాలతో నిరాశ్రయులైన వారికి జలకు ఆహారం, నీరు, వైద్య సంరక్షణ, ఆశ్రయం వంటి కార్యక్రమాలు కూడా ప్రభావితమయ్యాయి. అఫ్గాన్‌కు మానవతా సహాయంలో అమెరికా 56 కోట్ల డాలర్లు కోత పెట్టింది. తాలిబన్‌ ఆంక్షల వల్ల విదేశాల్లో చదువుతున్న అఫ్గాన్‌ యువతులకు అందించే సాయాన్ని శుక్రవారం నిలిపేసింది. అమెరికా కోతలతో ప్రపంచవ్యాప్తంగా ఇలా సుమారు 1,000కి పైగా కార్యక్రమాలు నిలిచిపోయాయి. 5,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. డబ్ల్యూఎఫ్‌పీకి గతేడాది అందిన 980 కోట్ల డాలర్ల విరాళాల్లో 450 కోట్లు అమెరికా ఇచ్చినవే! 🚨 US emergency food aid cuts by the Trump administration threaten millions in 14 countries, warns the UN. Despite earlier pledges to protect aid, these cuts put vulnerable communities at risk. 🔵 Calls for urgent action to restore funding. #UN #FoodAid #GlobalCrisis pic.twitter.com/EGLNbz8D8n— Thomas MORE (@ThomaMore) April 8, 2025

Allu Arjun Music Director Sai Abhyankkar Personal Details6
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?

అల్లు అర్జున్ (Allu Arjun) కొత్త సినిమా ప్రకటించాడు. తమిళ దర్శకుడు అట్లీతో (Director Atlee) కలిసి సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్ తీయబోతున్నాడు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఇదంతా అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా 20 ఏళ్ల కుర్రాడిని పరిచయం చేయబోతున్నారు. ఇంతకీ అతడెవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)యూట్యూబ్ లో గతేడాది వైరల్ ‍అయిన ఆల్బమ్ సాంగ్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా 'కచ్చి సేరా', 'ఆశా కూడా' పాటలు ఉంటాయి. ఎందుకంటే తలో ఒకటి 200 మిలియన్ వ్యూస్ సాధించాయి. వీటిని పాడి, ఇందులో కనిపించిన కుర్రాడే సాయి అభయంకర్(Sai Abhyankkar).అప్పట్లో తెలుగు, తమిళ సినిమాల్లో పాటలు పాడిన సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే సాయి. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. అనిరుధ్ దగ్గర స్పెషల్ ప్రోగ్రామ్ కంపోజర్ గా పనిచేశాడు. గతేడాది బెంజ్ అనే తమిళ మూవీలో సంగీత దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. దీంతో పాటు మరో రెండు-మూడు ప్రాజెక్టులు కూడా సొంతం చేసుకున్నాడు.(ఇదీ చదవండి: తమన్నా 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్)మిగతా సినిమాల సంగతేమో గానీ అల్లు అర్జున్-అట‍్లీ సినిమా కోసం సాయి ఎంపికవడం మాత్రం అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కోసం 20 ఏళ్ల కుర్రాడిని ఎంపిక చేశారంటే విషయం గట్టిగానే ఉందనమాట. అనౌన్స్ మెంట్ వీడియోకు ఇచ్చిన మ్యూజిక్ వింటేనే ఈ విషయం అర్థమైపోతుంది. ప్రస్తుతానికి ఇతడు బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు ‍అధికారికంగా చెప్పలేదు. త్వరలో మంచిరోజు చూసి ప్రకటిస్తారేమో చూడాలి. ఇకపోతే సాయి అభయంకర్ కి ట్విన్ సిస్టర్ ఉంది. ఆమె పేరు సాయిస్మృతి. ఈమె కూడా సింగరే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)

Supreme Court finds Tamil Nadu Governor RN Ravi conduct on 10 re passed Bills was unconstitutional7
గవర్నర్‌కు గడువు 3 నెలలే

న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి ఎట్టకేలకు విజయం లభించింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ ఆమోద ముద్ర వేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్‌ ముందుకు వచ్చిన బిల్లులపై నిర్దేశిత గడువులోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి 10 బిల్లులను పెండింగ్‌లో పెట్టడాన్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జె.బి.పార్డీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించామన్న సాకుతో 10 బిల్లులను చాలాకాలం పెండింగ్‌లో కొనసాగించడం సమంజసం కాదని స్పష్టంచేసింది. బిల్లులను శాశ్వతంగా పెండింగ్‌లో పెట్టే అధికారం గవర్నర్‌కు లేదని తెలియజేసింది. తమిళనాడు గవర్నర్‌ నిర్ణయం చట్టవిరుద్ధం, నిర్హేతుకం, ఏకపక్షం అని విమర్శించింది. ఆయన నిర్ణయాన్ని తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది. ‘‘అసెంబ్లీలో ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్‌ సమ్మతి కోసం పంపించగా ఆయన తిరస్కరించారు. దీంతో అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి పంపించారు. వాటిపై గవర్నర్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతికి నివేదించామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమే. అందుకే రెండోసారి పంపిన తేదీ నుంచే అవి గవర్నర్‌ సమ్మతి పొందినట్లు పరిగణిస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు ప్రకటించింది. విఫలమైతే జ్యుడీషియల్‌ రివ్యూ తప్పదు రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 200 ప్రకారం.. బిల్లులను గవర్నర్‌ ఎప్పటిలోగా ఆమోదించాలన్నదానిపై ఎలాంటి కాలపరిమితి లేదు. ఫలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాజ్యాంగం నిర్దేశించలేదు. కానీ, బిల్లులపై గవర్నర్‌ ఎటూ తేల్చకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెడితే ప్రభుత్వ పరిపాలనకు అవరోధాలకు ఎదురవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టాలు చేసే శాసన వ్యవస్థకు అడ్డంకులు సృష్టించినట్లు అవుతుంది పేర్కొంది. అందుకే బిల్లులపై గవర్నర్లు ఎక్కువకాలం నాన్చకుండా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని, ఈ మేరకు గడువు నిర్దేశిస్తున్నట్లు తేల్చిచెప్పింది.బిల్లుకు సమ్మతి తెలపడం లేదా రాష్ట్రపతికి నివేదించడం లేదా శాసనసభకు తిప్పిపంపడం మూడు నెలల్లో పూర్తి కావాలని వెల్లడించింది. గవర్నర్‌ వెనక్కి పంపిన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపిస్తే నెల రోజుల్లోగా కచ్చితంగా సమ్మతి తెలపాలని స్పష్టంచేసింది. ఈ టైమ్‌లైన్‌ పాటించే విషయంలో విఫలమైతే.. కోర్టుల జ్యుడీషియల్‌ రివ్యూకు గవర్నర్‌ సిద్ధపడాల్సి ఉంటుందని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తర్వాత గవర్నర్‌కు పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 142 ద్వారా తమకు సంక్రమించిన అధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. తమిళనాడులో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపకుండా గవర్నర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డీఎంకే సర్కారు మండిపడుతోంది. 12 బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆమోదించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రభుత్వం 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, తన వద్ద 10 బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయని గవర్నర్‌ 2023 నవంబర్‌ 13న ప్రకటించారు. తర్వాత అసెంబ్లీ నవంబర్‌ 18న ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ 10 బిల్లులను మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. తన వద్దకు వచ్చిన బిల్లును గవర్నర్‌ నవంబర్‌ 28న రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్‌ చేశారు. మిత్రుడిగా, మార్గదర్శిగా గవర్నర్‌ పనిచేయాలి ‘‘గవర్నర్లు చాలా వేగంగా పనిచేయాలని, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని రాజ్యాంగం ఆశిస్తోంది. నిర్ణయాల్లో విపరీతమైన జాప్యం చేయడం ప్రజాస్వామ్య పరిపాలన స్ఫూర్తిని దెబ్బతీసినట్లే. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ వీటో చేయడం అనేది మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం గవర్నర్‌ తన విచక్షణ మేరకు వ్యవహరించవచ్చు. బిల్లు ప్రజలకు హాని కలిగిస్తుందని భావించినప్పుడు, రాష్ట్రపతి సమ్మతి కచ్చితంగా అవసరమని అనుకున్నప్పుడు కొంతకాలం జాప్యం చేయొచ్చు. గవర్నర్‌ విచక్షణాధికారానికి సైతం ఆర్టికల్‌ 200 కొన్ని పరిమితులు విధిస్తోంది. బిల్లుపై నిర్ణయం తీసుకోకుండా ఉండడం సరైంది కాదు. గవర్నర్‌ స్పందించకపోతే బిల్లు కేవలం ఒక కాగితం ముక్కగా, మాంసం లేని అస్థిపంజరంగానే ఉండిపోతుంది. శాసనసభలో ఆమోదించిన బిల్లును ఇష్టంవచ్చినట్లు తొక్కిపెడతామంటే కుదరదు. అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లుకు (మొదటి దాని కంటే వైవిధ్యమైనది అయితే తప్ప) తప్పనిసరిగా సమ్మతి తెలపాల్సిందే. రాష్ట్రపతికి నివేదించకూడదు. అలాంటి బిల్లుపై గవర్నర్‌కు వీటో పవర్‌ ఉండదు. ప్రజల బాగు కోసం పని చేస్తామంటూ గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ప్రజలకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంటుంది. ప్రజల చేత ఎన్నికైన శాసనసభ్యులకు అడ్డంకులు సృష్టించకూడదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలి. మంత్రివర్గం సూచనల మేరకు గవర్నర్‌ వ్యవహరించాలని ఆర్టీకల్‌ 200 చెబుతోంది. గవర్నర్‌ ఒక మిత్రుడిగా, మార్గదర్శిగా వ్యవహరించాలి. రాజకీయపరమైన ఉద్దేశాలతో పనిచేయొద్దు. గవర్నర్‌ ఉ్రత్పేరకంగా ఉండాలి తప్ప నిరోధకంగా ఉండొద్దు. గవర్నర్‌ సైతం న్యాయ సమీక్షకు అర్హుడేనన్న సంగతి మర్చిపోవద్దు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. గవర్నర్‌కు న్యాయస్థానం స్పష్టమైన గడువు నిర్దేశించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చరిత్రాత్మకం: స్టాలిన్‌చెన్నై: గవర్నర్‌ వద్ద పెండింగ్‌ ఉన్న బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ చెప్పారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని హర్షం వ్యక్తంచేశారు. ఇది తమిళనాడుతోపాటు దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు దక్కిన గొప్ప విజయమని పేర్కొన్నారు. స్టాలిన్‌ మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. సభలో బల్లలు చరిచి సుప్రీంకోర్టు తీర్పుపై సంబరాలు జరుపుకోవాలని అధికారపక్ష సభ్యులకు సూచించారు. తమిళనాడు ప్రజలకు, తమ న్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తూ స్టాలిన్‌ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో సమతూకాన్ని పునరుద్ధరించే విషయంలో ఈ తీర్పు ఒక కీలకమైన ముందడుగు అని ఉద్ఘాటించారు. అసలైన సమాఖ్య భారత్‌లో ప్రవేశం కోసం ఎడతెగని పోరాటం చేస్తున్న తమిళనాడుకు విజయం దక్కిందన్నారు. తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ మినహా ఇతర పారీ్టలన్నీ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాయి. అధికార డీఎంకే నాయకులు మిఠాయిలు పంచుకొని, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తమ గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా ఉండే అధికారం కోల్పోయారని డీఎంకే నేత ఒకరు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం హర్షం వ్యక్తంచేశారు.

Ready for exploitation in the name of diagnostic tests8
యువనేత సమర్పించు 104 స్కామ్‌

సాక్షి, అమరావతి: స్కామ్‌ల కోసమే కొత్త కొత్త స్కీమ్‌­లను ప్రవేశపెట్టడంలో చంద్రబాబును మించిన నాయకుడు ఇంకొకరు ఉండరు. నీరు–చెట్టు, ఇసుక, మద్యం, ప్రజారోగ్య శాఖ.. ఇలా ఆయన కుంభకోణాల ట్రాక్‌ రికార్డులో పెద్ద చిట్టానే ఉంటుంది. ఈ పరంపరలో 2014–19 మధ్య రక్త పరీక్షల పేరిట మెడాల్‌ కుంభకోణానికి పాల్పడినట్టే ఇప్పుడు వైద్య శాఖలో మరో స్కామ్‌కు సమా­యత్తం అవుతు­న్నారు. 108 అంబులెన్స్‌లు, 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్స్‌ (ఎంఎంయూ), ఎమ­ర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌(ఈఆర్‌సీ) నిర్వహణ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ‘యువ’ నేత తన అస్మదీయ సంస్థకు కట్టబెట్టేలా చక్రం తిప్పారు. అత్యవసర సేవల్లో అనుభవం లేనప్పటికీ ఐదేళ్ల కాలానికి ఏకంగా రూ.3 వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను తమ వారి సంస్థకు దక్కేలా అడ్డగో­లుగా నిబంధనలు రూపొందించారు. సేవ­లను మరింత బలోపేతం చేస్తున్నామంటూ 104 ఎంఎంయూల్లో రోగ నిర్ధారణ పరీక్షల పేరిట పెద్ద దోపిడీకి స్కెచ్‌ వేశారని విశ్వసనీయ సమాచారం. పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో రక్త పరీ­క్షల నిర్వహణను మెడాల్‌ ద్వారా చేపట్టి 2014–19 మధ్య రూ.300 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఇలానే గ్రామీణ ప్రజలకు 104 ఎంఎంయూల్లో రోగ నిర్ధా­రణ పరీక్షల పేరిట రూ.840 కోట్ల మేర ప్రజాధ­నా­నికి యువనేత ఎసరు పెట్టారని సమాచారం.ఒక్కో ఎంఎంయూకు నెలకు రూ.1.55 లక్షలుగ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశ­పెట్టారు. 104 ఎంఎంయూలకు కొత్తగా 904 వాహ­నా­లను సమకూర్చారు. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కింద పీహెచ్‌సీల్లోని వైద్యులు 104 వాహనాల్లో తమ పరిధిలోని గ్రామాలను నెలలో రెండుసార్లు పర్యటి­స్తున్నారు. ఈ వాహనాల్లో పలు రోగ నిర్ధారణ పరి­క­రాల సమకూర్చి, గ్రామాల్లోనే ప్రజలకు ల్యాబ్‌ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో ఎంఎంయూలో రోజుకు 30 మందికి వైద్య పరీక్షలు చేసేలా నెలకు రూ.1.60 లక్షలు ఖర్చు అవుతుందన్న అంచనాతో 104, 108 నిర్వహణ టెండర్‌లలోనే వైద్య పరీక్షల అంశాన్ని చేర్చారు. యువ నేతకు అస్మదీయ సంస్థ వైద్య పరీక్షల కోసం రూ.1.55 లక్షల వరకు టెండర్‌లలో కోట్‌ చేసినట్టు వెల్లడవుతోంది. కాంట్రాక్టరే వాహనాల్లో ల్యాబ్‌ పరి­క­రాలు సమకూర్చుకుని, పరీక్షలు చేయాలనేది నిబ­ంధన. ఈ నేపథ్యంలో నెలకు 904 ఎంఎంయూ­లకు రూ.14 కోట్లపైనే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.168 కోట్ల చొప్పున ఐదేళ్ల కాంట్రాక్ట్‌ కాలానికి వైద్య పరీక్షల సేవల కోసమే ప్రభుత్వం రూ.840 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద దోపిడీకి తెరతీసినట్టు తెలు­స్తోంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్‌లో 14 రకాల టెస్ట్‌ కిట్‌లు అందుబాటులో ఉంటు­న్నాయి. గ్రామాలకు నాలుగైదు కి.మీ. దూరంలో ఉండే పీహెచ్‌సీల్లోని ల్యాబ్‌లలో 63 రకాల వైద్య పరీక్షలకు వీలుంటోంది. ఇలా ప్రభుత్వం పరిధి­లోనే ఎంతో పకడ్బందీ వ్యవస్థ ఉండగా, ఎంఎంయూ­ల్లో వైద్య పరీక్షల పేరిట భారీ ఎత్తున ప్రజా­ధనం ఖర్చు చేయడానికి సిద్ధం అవ్వడం ఏంటని వైద్య వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది కూడా 2014–19 మధ్య వైద్య శాఖలో చోటు చేసుకున్న మెడాల్‌ స్కామ్‌ వంటిదేనని అందరూ అనుకుంటున్నారు. ఏమిటా మెడాల్‌ స్కామ్‌?ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదిక రక్త పరీక్షల నిర్వహణ పేరిట వైద్య శాఖలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. పరీక్షల నిర్వహణ కాంట్రాక్ట్‌ను అప్పట్లో ‘మెడాల్‌’ అనే ప్రభుత్వ పెద్ద జేబు సంస్థకు కట్ట­బెట్టారు. 32 పరీక్షలకు రూ.235గా రేటు ఖరారు చేశారు. రోగి నుంచి నమూనా తీసి ఒకే పరీక్ష చేసి­నా సరే నిర్దేశించిన మొత్తం ప్రభుత్వం చెల్లించేలా కాంట్రాక్ట్‌ నిబంధనలున్నాయి. దీంతో ప్రజాధనం లూటీనే లక్ష్యంగా ప్రభుత్వ వైద్యులను కాంట్రాక్ట్‌ సంస్థ మేనేజ్‌ చేసుకుని, అవసరం లేకున్నా రోగు­లకు పరీక్షలు చేసి బిల్లులు పెట్టడం ద్వారా రూ.300 కోట్లు కొట్టేసింది. అవినీతి కోసం రూపొందించిన ఈ స్కీమ్‌ను పద్ధతి ప్రకారం చేయడం కోసం తొలుత పైలట్‌గా, అనంతరం రాష్ట్రం మొత్తం అమలు చేశారు. ఇప్పుడు కూడా 104 ఎంఎంయూ­ల్లో రోగ నిర్ధారణ పరీక్షల ప్రవేశపెట్టడం కోసం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పైలట్‌గా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం రాష్ట్రం మొత్తం అమలు చేసేలా ప్రణాళికలున్నాయి. అప్ప­ట్లో మెడాల్‌కు అడ్డదారుల్లో కాంట్రాక్ట్‌ కట్టబెట్టారు. ఈ సంస్థ ఒక నమూనాకు రూ.235కు మరో సంస్థ రూ.145కు కోట్‌ చేశాయి. కానీ ఎక్కువకు కోట్‌ చేసినా మెడాల్‌కే కాంట్రాక్ట్‌ను ముట్టజెప్పారు.వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గ్రామ స్థాయిలో 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేశారు. 105 రకాల మందులు, 14 రకాల రోగ నిర్ధారణ కిట్‌లు అందుబాటులోకి తెచ్చారు. ఏడాది పొడ­వునా బీపీ, షుగర్‌ బాధితులు, గర్భిణులు, వృద్ధులకు ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. నెలలో రెండుసార్లు 104లలో పీహెచ్‌సీ వైద్యులు విలేజ్‌ క్లినిక్‌లను సందర్శించి, రోజంతా గ్రామంలో ఉంటూ వైద్య సేవలందిస్తు­న్నారు. కూటమి ప్రభుత్వం చెబు­తున్న వైద్య పరీక్షలు 104 గ్రామానికి వెళ్లిన రోజు మాత్రమే నిర్వహిస్తారు. చంద్రబాబు ప్రభు­త్వానికి చిత్త­శుద్ధి ఉంటే అందుబాటులో ఉన్న వ్యవస్థలనే వాడుకునేదని వైద్య నిపుణులు అభిప్రాయప­డుతున్నారు. విలేజ్‌ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ (సీహెచ్‌వో)లు ఉన్నారు. వీరికి రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించడంలోనూ అనుభవం ఉంది. ఈ క్రమంలో 104 గ్రామానికి వచ్చిన రోజు వైద్యులు సూచించిన రోగుల నుంచి నమూ­నాలు సేకరించి ఆస్పత్రు­లకు తరలిస్తే ఉచితంగా 63 రకాల పరీక్షలు చేయడానికి వీలు­ంది. వాటి ఫలితాల ఆధారంగా వైద్యుడు సీహెచ్‌­వోలకు వర్చువల్‌గా అవసరమైన మందులు సూచిస్తే సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశాల ద్వారా నేరుగా రోగి ఇంటి వద్దకు డెలివరీ చేయవచ్చు. స్పెషలిస్ట్‌ కన్సల్టేషన్‌ అవసరమైతే విలేజ్‌ క్లినిక్‌ నుంచే టెలీమెడిసిన్‌ ద్వారా అవ­కాశం ఉంది. ఒకవేళ మెరుగైన వైద్యం అవ­సరమైతే గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ద్వారా­నే ప్రభుత్వా­స్పత్రులు/ఆరోగ్యశ్రీ నెట్‌­వర్క్‌ ఆస్ప­త్రు­లకు రెఫర్‌ చేసే ఆస్కారం ఉంది. కానీ, ఇంత పకడ్బందీ వనరులను కాదని చంద్ర­బాబు ప్రభు­త్వం 104లో ఔట్‌సోర్సింగ్‌ పరీక్ష­లను ప్రవే­శ­పెట్టడం వెనుక ప్రజారోగ్య పరిరక్షణ కన్నా, దురు­ద్దేశమే ఎక్కువగా ఉందని స్పష్టం అవుతోంది.

Punjab Kings win over Chennai Super Kings9
ప్రియాంశ్‌ పటాకా

‘కింగ్స్‌’ పోరులో చెన్నైపై పంజాబ్‌దే పైచేయి అయింది. యువ ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య మెరుపులకు శశాంక్‌ సింగ్, యాన్సెన్‌ ఫినిషింగ్‌ టచ్‌ తోడవడంతో పంజాబ్‌ భారీ స్కోరు చేయగా... ఛేదనలో చెన్నై చతికిలబడింది. కాన్వే, దూబే రాణించినా... మధ్య ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లు పుంజుకోవడంతో చెన్నైకి వరుసగా నాలుగో పరాజయం తప్పలేదు. ‘ఫినిషర్‌’ ధోని దూకుడు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది! ముల్లాన్‌పూర్‌: యువ ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య (42 బంతుల్లో 103; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) రికార్డు సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్‌ 18వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నాలుగో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్‌ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నైకిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ప్రియాంశ్‌ ఆర్య సెంచరీతో కదంతొక్కగా... శశాంక్‌ సింగ్‌ (36 బంతుల్లో 52 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్కో యాన్సెన్‌ (19 బంతుల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (9)తో పాటు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (0), స్టొయినిస్‌ (4), నేహల్‌ వధేరా (9), మ్యాక్స్‌వెల్‌ (1) విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కాన్వే (49 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... రచిన్‌ (37; 6 ఫోర్లు), శివమ్‌ దూబే (27 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధోని (12 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) పోరాడారు. ఫటాఫట్‌... ఖలీల్‌ అహ్మద్‌ వేసిన తొలి బంతికే పాయింట్‌ మీదుగా సిక్స్‌ కొట్టిన ప్రియాంశ్‌ ఆర్య... రెండో బంతికి క్యాచ్‌ మిస్‌ కావడంతో బతికిపోయాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని ఈ 24 ఏళ్ల కుర్రాడు అదే ఓవర్‌లో మరో సిక్స్‌ బాదాడు. రెండో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ డకౌట్‌ కాగా... ఆర్య ఇంకో సిక్స్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఖలీల్‌ తదుపరి ఓవర్‌లో శ్రేయస్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేయగా... నాలుగో ఓవర్‌లో ఆర్య ‘హ్యాట్రిక్‌’ ఫోర్లతో విరుచుకుపడ్డాడు.స్టొయినిస్‌ క్రీజులోకి వచ్చినంతసేపు కూడా నిలవలేకపోగా... అశ్విన్‌ ఓవర్‌లో 4, 6తో ఆర్య 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అశ్విన్‌ ఒకే ఓవర్‌లో నేహల్‌ , మ్యాక్స్‌వెల్‌ను ఔట్‌ చేశాడు. వికెట్లు పడుతున్నా దూకుడు తగ్గించని ఆర్య... అశ్విన్‌ ఓవర్‌లో మూడు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. పతిరణ ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 4 కొట్టిన ప్రియాంశ్‌ 13వ ఓవర్‌లోనే 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తదుపరి ఓవర్‌లో ఆర్య ఔట్‌ కాగా... చివర్లో యాన్సెన్, శశాంక్‌ చక్కటి షాట్‌లతో పంజాబ్‌కు భారీ స్కోరు అందించారు. 39 ప్రియాంశ్‌ ఆర్య సెంచరీకి తీసుకున్న బంతులు. ఐపీఎల్‌లో ఇది నాలుగో వేగవంతమైన శతకం. గేల్‌ (30 బంతుల్లో), యూసుఫ్‌ పఠాన్‌ (37 బంతుల్లో), మిల్లర్‌ (38 బంతుల్లో) ట్రావిస్‌ హెడ్‌ (39 బంతుల్లో) ముందున్నారు. స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాంశ్‌ ఆర్య (సి) శంకర్‌ (బి) నూర్‌ 103; ప్రభ్‌సిమ్రన్‌ (బి) ముకేశ్‌ 0; శ్రేయస్‌ (బి) ఖలీల్‌ 9; స్టొయినిస్‌ (సి) కాన్వే (బి) ఖలీల్‌ 4; నేహల్‌ (సి) ధోని (బి) అశ్విన్ 9; మ్యాక్స్‌వెల్‌ (సి అండ్‌ బి) అశ్విన్ 1; శశాంక్‌ (నాటౌట్‌) 52; యాన్సెన్‌ (నాటౌట్‌) 34; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–17, 2–32, 3–54, 4–81, 5–83, 6–154. బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–45–2; ముకేశ్‌ 2–0–21–1; అశ్విన్ 4–0–48– 2; జడేజా 3–0–18–0; నూర్‌ 3–0–32–1; పతిరణ 4–0–52–0. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ (స్టంప్డ్‌) ప్రభ్‌సిమ్రన్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 37; కాన్వే (రిటైర్డ్‌ అవుట్‌) 69; రుతురాజ్‌ (సి) శశాంక్‌ (బి) ఫెర్గూసన్‌ 1; దూబే (బి) ఫెర్గూసన్‌ 42; ధోని (సి) చహల్‌ (బి) యశ్‌ 27; జడేజా (నాటౌట్‌) 9; శంకర్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–61, 2–62, 3–151, 4–171, 5–192, బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–39–0; యశ్‌ 4–0–39–1; మ్యాక్స్‌వెల్‌ 2–0–11–1; యాన్సెన్‌ 4–0–48–0; ఫెర్గూసన్‌ 4–0–40–2; స్టొయినిస్‌ 1–0–10–0; చహల్‌ 1–0–9–0.ఐపీఎల్‌లో నేడుగుజరాత్‌ X రాజస్తాన్‌ వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Telangana SOT Police Raids On Moinabad Farm House10
HYD: ఫామ్‌ హౌస్‌లో ముజ్రా పార్టీ.. ఏడుగురు అమ్మాయిలతో..

సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడుల సందర్భంగా ఫామ్‌ హౌస్‌లో ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసుల తెలిపారు.వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు.ఏతబర్ పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫార్మ్ హౌస్‌లో పుట్టినరోజు వేడుకల పేరుతో ముజ్రా పార్టీ జరిపారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను ఇక్కడికి తీసుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో దాడుల్లో భాగంగా.. ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి భారీగా మద్యం, హుక్కా, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement