Exclusive
-
Upasana Konidela Photos: కొణిదెలవారి కోడలు ఉపాసన.. ప్రత్యేక క్షణాలు (ఫొటోలు)
-
బంజారాహిల్స్ లో ఎక్సక్లూజివ్ పాప్-అప్ ఎగ్జిబిషన్.. (ఫోటోలు)
-
సీఎం జగన్ వైపే కాపు సామజిక వర్గం..!
-
ఎక్కడికి వెళ్లిన అలానే పిలుస్తున్నారు అందుకే చాలా సినిమాలు రిజెక్ట్ చేశాను
-
టీచర్ To ప్రెసిడెంట్
-
వైఎస్ జగన్ విజయం చూస్తుంటే ఆనందంగా ఉంది.. నేను ఆయన శ్రేయోభిలాషిని
-
Disha Patani Latest Photos: యంగ్ బ్యూటీ దిశా అందాల మాయ (ఫొటోలు)
-
యూపీలో బీజేపీ జైత్రయాత్రకు ఈ రెండు అంశాలు కీలకం
-
ఎగ్జిట్ పోల్ ఫలితాలపై సాక్షి టీవీ ప్రత్యక్ష విశ్లేషణ
-
18 Years Of Anushka Shetty : టాలీవుడ్ 18 ఏళ్లు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టి ఫోటోలు
-
సాయిధరమ్ తేజ్ ఎక్స్క్లూసివ్ వీడియో
-
మెడల్ గెలిచిన తర్వాత సాక్షితో పివి సింధు ఎక్సక్లూసివ్ వీడియో కాల్
-
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా స్పెషల్ ఫోటోలు
-
దిశా పటానీ హాట్ ఫొటోలు
-
సురేఖా వాణి కూతురు సుప్రీత గ్లామర్ ఫోటోలు
-
కియారా అద్వానీ అదిరిపోయే ఫోటోలు
-
హీరోయిన్ సాయి మంజ్రేకర్ స్టన్నింగ్ ఫోటోలు
-
గద్దలకొండ గణేష్ స్పెషల్ సాంగ్ భామ హయాతీ ఫొటోలు
-
అపూర్వ శ్రీనివాసన్ గ్లామర్ ఫోటోలు
-
హీరోయిన్ పూనమ్ బజ్వా స్టన్నింగ్ ఫోటోలు
-
హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
Trisha Birthday : త్రిష కృష్ణన్ బర్త్‌డే స్పెషల్ ఫొటోలు
-
హీరోయిన్ మాళవిక మోహన్ గ్లామర్ ఫోటోలు
-
హీరోయిన్ అమృత అయ్యర్ బ్యూటిపుల్ ఫోటోస్
-
యాంకర్ హరితేజ ఫోటోలు
-
హీరోయిన్ సంజన ఆనంద్ గ్లామర్ ఫోటోలు
-
హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్లామర్ ఫోటోలు
-
హీరోయిన్ తమన్నా అదిరే స్టిల్స్
-
బుల్లితెర యాంకర్ భానుశ్రీ అదిరే స్టిల్స్
-
హీరోయిన్ అషిమా నర్వాల్ గ్లామర్ ఫోటోలు
-
హీరోయిన్ మధు శాలిని అదిరే స్టిల్స్
-
హీరోయిన్ వేదిక గ్లామర్ ఫోటోలు
-
రొమాంటిక్ మూవీ హీరోయిన్ కేతికా శర్మ ఫోటోలు
-
హీరోయిన్ దక్ష నగార్కర్ క్యూట్ ఫోటోలు
-
హీరోయిన్ మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు
-
మళయాలం హీరోయిన్ అను సితార అదిరే స్టిల్స్
-
హీరోయిన్ శ్రద్ధా కపూర్ గ్లామర్ ఫోటోలు
-
బుల్లితెర యాంకర్ మేఘన కుమార్ గ్లామర్ ఫోటోలు
-
హాలీవుడ్ నటి జెన్నీఫర్ లోపెజ్ ఫోటోలు
-
హీరోయిన్ హెబ్బా పటేల్ ఫోటోలు
-
హీరోయిన్ ‘నయనతార’ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
లవ్లీ భామ శాన్వీ శ్రీవాస్తవ ఫోటోలు
-
హీరోయిన్ సొనారిక ఫోటోలు
-
యాంకర్ మంజూష గ్లామర్ ఫోటోలు
-
హీరోయిన్ నిత్యామీనన్ ఫోటోలు
-
హీరోయిన్ నివేదా పేతురాజ్ ఫోటోలు
-
హీరోయిన్ ‘ధన్య బాలకృష్ణ’ క్యూట్ ఫోటోలు
-
బుల్లితెర యాంకర్ ఇందు ఫోటోలు
-
ఆర్ ఎక్స్100 గ్లామర్ భామ ‘ పాయల్ రాజ్‌పుత్ ’ ఫోటోలు
-
యాంకర్ విష్ణుప్రియ ఫొటోలు
-
అందాల భామ జాన్వీ కపూర్ ఫోటోలు
-
హీరోయిన్ మెహ్రీన్ ఫోటోలు
-
హీరోయిన్ కీర్తీ సురేశ్ ఫోటోలు
-
హీరోయిన్ రాధికా ఆప్టే ఫోటోలు
-
హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ ఫోటోలు
-
హీరోయిన్ రెజీనా కసండ్ర ఫోటోలు
-
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు
-
రాయ్‌లక్ష్మీ పుట్టినరోజు స్పెషల్ ఫొటోలు
-
అదిరిందబ్బా... ఈషా రెబ్బా ఫోటోలు
-
హీరోయిన్ క్యాథరిన్ ట్రెసా ఫోటోలు
-
అందాల భామ ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు
-
హీరోయిన్ లావణ్యా త్రిపాఠి ఫోటోలు
-
హీరోయిన్ అమలాపాల్ ఫోటోలు
-
హీరోయిన్ ప్రణీత ఫోటోలు
-
హీరోయిన్ దిశా పటానీ హాట్ ఫోటోషూట్
-
హీరోయిన్ కపిలాక్షి మల్హోత్రా ఫోటో షూట్
-
హీరోయిన్ రష్మికా మందన్నా ఫోటోలు
-
శ్రీముఖి అదిరే స్టిల్స్
-
అందాల నిధి అగర్వాల్
-
హీరోయిన్ నభా నటేష్ అదిరిపోయే ఫోటోలు
-
సంచలనం సృష్టిస్తున్న జయ చివరి మాటలు
-
పోలవరం వ్యయం భారీగా పెంపు
-
మందుల మాయాజాలం
-
రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం
-
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ధర్నా
-
గుండె విజయగర్వంతో నిండిపోయే సమయం
-
అలరిస్తున్న 'జాతీయ' గీతాలాపనలు
-
'ఇంటర్ జంబ్లింగ్' పై సర్కార్ పునరాలోచన
-
అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను
-
స్వాతితో ముచ్చట్లు
-
కథక్ భూషణుడు
ఆయన చేయి కదిపితే కథక్... కాలు కదిపితే కథక్... కనుల భావాలు కథక్... పెదవి పలికితే కథక్... ఆపాద మస్తకం కథక్... దక్కనీ కథక్ ను సృష్టించారు... వరల్డ్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహించారు... కథక్ మీద పుస్తకం ప్రచురించారు... గోపీకృష్ణ, బిర్జూ మహరాజ్‌లను కలుసుకున్నారు... తబలా వాయించారు... నటరాజ రామకృష్ణను ఆదర్శంగా తీసుకున్నారు... ఆరు పదుల వయసు మీద పడుతున్నా... ఆలోచనలు మాత్రం రెండు పదులు దాటనివ్వని ఆ కథక్ డాన్సర్ పేరు అంజుబాబు... తన నాట్య ప్రయాణం గురించి సాక్షికి ప్రత్యేకంగా చెప్పిన వివరాలు... మా నాన్నగారిది విజయవాడ. ఆయన ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాం. అక్కడే విద్యాభ్యాసం, నాట్యాభ్యాసం కూడా. నాకు బాల్యం నుంచి చదువు మీద కంటె నాట్యం మీద శ్రద్ధ ఉండేది. ముఖ్యంగా ప్రతి యేడూ జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో నాట్య ప్రదర్శనలు చూసేవాడిని. అలాగే నిమజ్జనం సమయంలో డాన్స్ చేసేవాణ్ని. నేను లయబద్ధంగా చేయడం చూసిన మా అమ్మగారి స్నేహితులు, ‘‘మీఅబ్బాయి డాన్స్ చాలా బాగా చేస్తున్నాడు. అతడికి మంచి గురువు దగ్గర నాట్యం నేర్పించండి’ అని సలహా ఇచ్చారు. ఇంకేమీ ఆలోచించకుండా అమ్మ నన్ను ‘ైెహ దరాబాద్, రామ్కోఠీలో వున్న మ్యూజిక్ కాలేజీలో చేరమంది. నేను సరేనని ఆ కాలేజీకి వెళ్లాను. అక్కడ అన్ని నాట్య రీతులు చూసిన మీదట, మగవారికి కథక్ నాట్యమైతే బావుంటుందనిపించి, కథక్ విభాగంలో చేరాను. అప్పుడు నాకు పన్నెండేళ్లు. అలా నా నాట్య ప్రయాణం కథక్‌తో ప్రారంభమైంది. అక్కడ కోర్సు పూర్తయ్యాక ‘ఢిల్లీ సంగీత నాటక అకాడెమీ’ లో కథక్ విభాగంలో 120 రూపాయల ఉపకార వేతనం మీద ఢిల్లీలో అడ్వాన్స్డ్ కోర్సు నేర్చుకున్నాను. సాధారణంగా ఢిల్లీ వెళ్లినవారు అక్కడే స్థిరపడిపోతారు. అయితే నేను మాత్రం మళ్లీ అక్కడికే వచ్చి కథక్ నాట్యాన్ని విద్యార్థులకు నేర్పాను. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి పట్టణంలోనూ శిష్యులతో కలిసి నాట్య ప్రదర్శనలు ఇచ్చాను. మొదటిసారిగా కోస్తా జిల్లాల్లో కథక్ నాట్యాన్ని ప్రచారం చేసి, ఆ నాట్యం ఇలా ఉంటుందని చూపింది నేనే. ‘కథక్’ దక్షిణాది వారిది కూడా... చాలామంది కథక్ నాట్యం ఉత్తరాది వారిదే అనుకుంటారు. అయితే అవ్వచ్చు కానీ, హైదరాబాద్‌లో మొఘలుల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల, హైదరాబాద్ నగరం కథక్‌కి నిలయంగా ఉండేది. నటరాజ రామకృష్ణ వంటి వారు భాగ్యనగరానికి వచ్చాక ఇక్కడ కథక్ నాట్యం కొద్దిగా వెనుకబడింది. ప్రభుత్వాలు కూడా ‘మనం తెలుగువాళ్లం, మన కూచిపూడిని ప్రోత్సహిద్దాం’ అని ఆ నాట్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో, ఇక్కడ కూచిపూడి నేర్చుకునేవారు ఎక్కువై, కథక్ మరికొంత వెనుకబడింది. మరచిపోలేని సంఘటనలు... ప్రతి నాట్య ప్రదర్శనలోనూ నాకు తగినంత ప్రోత్సాహం వచ్చింది. అయితే అందరిలాగే నా జీవితంలోనూ మరపురాని సంఘటనలు ఉన్నాయి. 1970 ప్రాంతంలో, రవీంద్రభారతి మినీ థియేటర్లో నా నాట్య ప్రదర్శన చూసిన ఈల పాట రఘురామయ్యగారు నా దగ్గరకు వచ్చి, భుజం తట్టి, ‘చాలా బాగా చేశావు. వృద్ధిలోకి వస్తావు’ అని నన్ను ప్రశంసించి, ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వదించినట్లే నేను వృద్ధిలోకి వచ్చాను. మరో సంఘటన... టెక్సాస్‌లో వారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశానికి సంబంధించిన అనేక నృత్యరీతుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కథక్‌కి సంబంధించి నన్ను ఆహ్వానించారు. నా నాట్యం చూసి, ‘ఇలాంటి డ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు’ అని కమిటీ వారు మెచ్చుకోవడం, నా జీవితంలో మర్చిపోలేను. దక్కనీ ఘరానా... నటరాజ రామకృష్ణ ‘ఆంధ్రనాట్యం’ సృష్టించాక, నాకు కూడా కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. అలా వచ్చిన ఆలోచనకు రూపకల్పనే ‘దక్కనీ ఘరానా’. ప్రతి ఒక్కరూ సులువుగా నేర్చుకునేలా హస్త ముద్రలలో, కదలికలో చిన్న చిన్న మార్పులు చేశాను. ఈ మార్పుల వల్ల, ఏడాది లోపే ప్రదర్శన ఇవ్వగలుగుతున్నారు. వరల్డ్ డాన్స్ ఫెస్టివల్... కోణార్క, ఖజురహో వంటి ప్రదేశాలలో నాట్యోత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి. నేను మన హైదరాబాద్‌లో ‘డెక్కన్ డ్యాన్స్ ఫెస్టివల్’ ప్రారంభించాను. అలాగే ప్రతి యేడాదీ ‘వరల్డ్ డ్యాన్స్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నాను. అన్నిరకాల నృత్య రీతులకు సంబంధించిన ప్రసిద్ధ కళాకారుల నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసి, వారిని ఘనంగా సన్మానిస్తాను. ప్రత్యేకంగా రూపొందించినవి... ‘నిర్భయ’ సంఘటన మీద చేసిన బ్యాలే చూసి, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నన్ను ప్రశంసించారు. జాతీయ సమైక్యత మీద తయారు చేసిన ‘ఏక్తా కా దివస్’ ప్రదర్శనకు అమెరికాలోని దూరదర్శన్ ‘ఉత్తమ ప్రదర్శన’ అవార్డు వచ్చింది. ఇంకా... జటాయు వధ, ‘రంగ రంగ రంగపతి’ అనే అన్నమయ్య కీర్తనకు నృత్యం సమకూర్చాను. మరిన్ని కీర్తనలకు కూడా నాట్యం సమకూరుస్తున్నాను. కథక్ కళాక్షేత్ర... కథక్ నృత్య వికాసం... చెన్నైలో శ్రీమతి రుక్మిణీ అరండేళ్ స్థాపించిన ‘కళాక్షేత్ర’ స్ఫూర్తితో హైదరాబాద్‌లో కథక్ కళాక్షేత్ర స్థాపించాను. దక్షిణభారతదేశంలో కథక్‌కి సంబంధించిన కళాక్షేత్రం ఇదొక్కటే. పూర్వం రోజుల్లో కథక్‌కి సంబంధించిన పుస్తకాలన్నీ బ్రిజ్ భాషలోనే ఉండేవి. అందువల్ల అందరికీ అర్థం అయ్యేవి కాదు. నటరాజ రామకృష్ణ మాస్టారి సూచనల మేరకు ఆ పుస్తకాన్ని ‘కథక్ నృత్య వికాసం’ పేరుతో తెనిగించాను. ఇందులో కథక్ నాట్యానికి సంబంధించిన అన్ని అంశాలూ ఉంటాయి. ఇప్పటికీ నేను చాలామంది శిష్యులను తయారుచేస్తున్నాను. వారి నాట్యంలో న న్ను నేను చూసుకుంటూ ఆనందిస్తాను. - సంభాషణ: డా.పురాణపండ వైజయంతి మధురానుభూతులు... మొదటి జార్జ్‌బుష్ దగ్గర ప్రదర్శన. {పముఖ కథక్ డ్యాన్సర్లు... గోపీకృష్ణ, బిర్జూ మహరాజ్‌లను కలుసుకోవడం అవార్డులు... 1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నృత్యభూషణ అవార్డు రాజమంద్రి కళాసమితి వారిచే వెండి కిరీట బహూకరణ హోస్టన్‌లో ఇందిరా గాంధీ సాంస్కృతికసంస్థ వారి అవార్డు 2011లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం మరెన్నో పురస్కారాలు... -
నాన్న ఆశీర్వాదమే లేకపోతే...బంగారు తల్లి నా జీవితంలోకి అడుగుపెట్టేది కాదు!
‘నా రూటే... సెపరేటు...’ ఇది మోహన్‌బాబు ఫేమస్ డైలాగ్. కానీ, లక్ష్మీ ప్రసన్నకు మాత్రం అది టైలర్ మేడ్ డైలాగ్. ఎస్... ఆమె రూటే సెపరేటు. హీరోల ఇంటి బిడ్డకీ, ఫిలిం ఫీల్డ్కీ... ఫ్రీక్వెన్సీ కలవదని ఆమెకు బాగా తెలుసు. అయినా... బ్రేక్ ది రూల్స్! ఫస్ట్ స్టెప్పే... హాలీవుడ్లో. నెక్ట్స్... ‘అనగనగా ఒక ధీరుడు’లో విలన్ వేషం! ఎన్ని గట్స్ ఉండాలి! మంచు లక్ష్మీ ప్రసన్న... సారీ... ధైర్యలక్ష్మీ ప్రసన్న ఏం చేసినా అంతే! ఆర్టిస్టుగా... ఫిలిం మేకర్‌గా... ఇంకా చాలా చాలా విషయాల్లో ఆమె... డేరింగ్.. డాషింగ్... డైనమిక్! లేటెస్ట్గా సరొగసీ ద్వారా మదర్‌హుడ్. సదరన్ సెలబ్రిటీస్‌లోనే సెన్సేషనల్ స్టెప్! అసలు ఈ స్టెప్ గురించి లక్ష్మి ఏం చెబుతారో వినాలని... అందరూ ఈగర్లీ వెయిటింగ్! లక్ష్మి ఫస్ట్ టాక్ ఎక్స్‌క్లూజివ్‌గా ‘సాక్షి’కే..! - ఇందిర పరిమి, ఫీచర్స్ ఎడిటర్ ఇందిర: బిగ్ కంగ్రాచ్యులేషన్స్!! లక్ష్మి: థాంక్యూ వెరీ మచ్! ఇందిర: జూన్ 15న ప్రపంచమంతా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటే, లక్ష్మి మంచు మదర్స్‌డేని చేసుకున్నారు. అంతేకాక, అదేరోజు మీ భర్త ఆండీ బర్త్‌డే కూడా అవడం... యాదృచ్చికమా, అలా వచ్చేలా ప్లాన్ చేసుకున్నారా? లక్ష్మి: యాదృచ్చికమే! అసలు బేబీ రెండు వారాల తర్వాత పుట్టాల్సుంది.. అయితే, మెడచుట్టూతా బొడ్డుతాడు చుట్టుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముందే సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఇందిర: ఒకసారి వెనక్కెళితే... పిల్లలు పుట్టకపోవడం వల్ల సహజంగా ఏ భార్యాభర్తల మధ్యయినా చికాకులు వస్తుంటాయి... మీ మధ్య కూడా ఏమైనా..? లక్ష్మి: అఫ్కోర్స్ వచ్చాయి! చాలామంది డాక్టర్ల చుట్టూ తిరిగాం... ఎన్నో కాంప్లికేషన్స్... వీటన్నిటి మధ్యలో నేనూ, ఆండీ గొడవపడడం మొదలెట్టాం.... ఇద్దరి మధ్యలో చికాకులు రావడం మొదలెట్టాయి. ఆయన వర్క్ వల్ల ఒక అపాయింట్మెంట్ మిస్సవడం, ఒక్కోసారి నా వల్ల! దానివల్ల ఇంట్లో కొంత స్ట్రెస్ఫుల్ వాతావరణం ఏర్పడింది. ఇది టెన్షన్‌తో కూడుకున్న విషయం కాబట్టి, ప్రతి చిన్న విషయం కూడా దానికి తోడయ్యేది. అప్పుడోసారి ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం - ‘‘చూడు.. మనం అనుకున్నట్టు జరగట్లేదు... వద్దు, పిల్లల గురించి ఇంక టెన్షన్ పడద్దు... మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం... పిల్లల కోసమని ఇద్దరి మధ్య స్ట్రెస్ రావడం బాలేదు.. ఏదైనా మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. పిల్లలు పుట్టకపోవడం అందరూ శాపం అనుకుంటే, దీన్ని మనం వరంగా తీసుకుందాం. బాధ్యతలు లేవు కాబట్టి ఇద్దరం ఎవరి కెరీర్లలో వారు ముందుకు పోవచ్చు, దేశదేశాలు తిరగొచ్చు, లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఒకరికొకరం ఉన్నామనుకుని జీవితాన్ని హ్యాపీగా గడుపుదాం’’ అని! ఇందిర: మరి బేబీ కావాలనే ఆలోచన మళ్లీ ఎలా వచ్చింది? లక్ష్మి: విష్ణు పిల్లలు అరీ, వివీని చూశాక! ఎప్పుడైతే వాళ్లు మా జీవితాల్లోకి వచ్చారో అప్పుడు నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. ‘అత్తా.. అత్తా’ అంటూ వాళ్లు ముద్దుగా నా వెనక తిరుగుతుంటే, నాకంటూ ఓ బిడ్డ ఉంటే బాగుంటుందనిపించింది. మళ్లీ ట్రై చెయ్యాలనుకున్నాను. అయితే, అప్పటికే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్‌నూ ట్రై చేసేసరికి నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. నేను అంత సిక్‌గా ఉండి, పిల్లల్ని కనడంలో ఏమైనా అర్థం ఉందా అని ఆలోచించి, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని నా గైనకాలజిస్ట్ డాక్టర్ దుర్గారావును సంప్రదించాను. అప్పుడావిడ సరొగెసీని ట్రై చేద్దామని సూచించారు. గూగుల్‌కు వెళ్లి కంప్లీట్‌గా రిసెర్చ్ చేశాను. ‘మెడిసిన్ మనకు కల్పిస్తున్న అత్యాధునిక వైద్యప్రక్రియను ఎందుకు వద్దనుకోవాలి. 9 నెలలు వేరేవాళ్ల గర్భంలో పెరిగిందనే కానీ, అన్ని విధాలా అది మన బేబీనే కదా... ఐయుఐ, ఐవీఎఫ్ ఎలాగో ఇది కూడా ఇంకొక ఆప్షన్’ అనిపించింది. అందుకే నాకేమీ అభ్యంతరంగా గానీ, ఇబ్బందిగా గానీ అనిపించలేదు. చాలా ధైర్యంగా ఉన్నాను. అయితే దీని గురించి సమాజంలో స్టిగ్మా (అపవాదు) ఉంటుందని తెలుసు కాబట్టి, మొదట ఆండీతో మాట్లాడాను. అప్పుడు తను అమెరికాలో ఉన్నారు. ‘‘ముందు మీ నాన్నతో మాట్లాడు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోలేము. అయినా, ఇది మన ఒక్కరి ఫ్యామిలీ విషయమే కాదు. నువ్వు పబ్లిక్ పర్సన్‌వి అవ్వడంతో మీడియాతో సహా అందరూ దీని గురించి ఏవేవో చర్చిస్తారు... నువ్వు దాన్ని హ్యాండిల్ చెయ్యగలవనుకుంటే ముందుకెళ్దాం. ఈ విషయంలో నేను నీతోనే...’’ అన్నారు. అప్పుడు నాన్న దగ్గరికెళ్లి - ‘‘నాన్నా, నాకు ఇప్పుడున్న ఆప్షన్ ఇది.. ఏం చెయ్యమంటారు’’ అని అడిగా! క్షణం కూడా ఆలోచించకుండా ఆయన - ‘నువ్వు ముందుకెళ్తున్నావు. అంతే! అమెరికాకు వెళ్దామంటే అమెరికాకు, లండన్ అంటే లండన్‌కు వెళ్దాం’’ అన్నారు. అప్పుడు నేను - ‘‘లేదు నాన్నా, ఇతర దేశాల కన్నా మనదేశంలోనే సరోగసీకి చట్టాలు అనుకూలంగా ఉన్నాయని విదేశీయులే ఇక్కడికొస్తున్నారు. మనం ఎందుకు విదేశాలకెళ్లడం... ఇక్కడే చేద్దాం’’ అన్నాను. ‘‘నాకివన్నీ అర్థం కావమ్మా. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నువ్వు చూసుకో. మనింటికి బేబీ రావాలి అంతే!’’ అన్నారు. దాంతో సరొగసీతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. అసలు నాన్న ఆశీర్వాదమే లేకపోతే ఈ బంగారు తల్లి నా జీవితంలోకి అడుగుపెట్టేది కాదు. ఇక్కడోమాట చెప్పాలి - అసలు నాన్న ఎక్కువ కూడా అనక్కర్లేదు.... ‘ఎందుకమ్మా టెన్షన్ నీకు, అరీ వివీ చాల్లే’ అని అన్నా నేను ముందుకెళ్లేదాన్ని కాదు. మేము దేశాలు తిరిగాము... చదివాము కానీ... ఆయన రాయలసీమ బిడ్డ... చాలా ట్రెడిషనల్! అయినా ఆయన అంత ఓపెన్ మైండెడ్‌గా, బ్రాడ్మైండెడ్గా ఆలోచిస్తారని నేననుకోలేదు! ఇందిర: మరి ఆ మార్పుకి కారణం ఏంటంటారు... కాలమా? కూతురా? లక్ష్మి: (నవ్వి) మొత్తం క్రెడిట్ నేను తీసుకోలేను... కొంత ఇది కొంత అది అయ్యుండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే పూర్తి మార్పుకు కారణం అరీ, వివీ అనుకుంటున్నాను. నాన్న మమ్మల్ని కూర్చోమంటే కూర్చునేవాళ్లం, లేవమంటే లేచేవాళ్లం. మమ్మల్ని ట్రైన్ చేయడం అయిపోయింది. ఇప్పుడవే మనవరాళ్ల దగ్గర పనిచేయడంలేదు. వాళ్లు కూర్చోమంటే ‘నో తాతా, మీరు కూర్చోండి’ అంటున్నారు. సో నాన్న ఇంతలా మారడానికి నాకన్నా క్రెడిట్ వాళ్ల ఇద్దరికే దక్కుతుందేమో! ఇందిర: ఇంతకీ మీది పార్షియల్ సరొగసీనా (అండం కూడా ఆమె (సరగసీ మామ్)ది)? ఫుల్ సరొగసీనా.. (అండం ఈమెది)? అసలు సరొగేట్ మామ్‌ని మీరు ఎంచుకున్నారా? డాక్టర్ ఎంపిక చేశారా? ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ, ఎలా జరిగింది? లక్ష్మి: ఇది పూర్తి సరొగసీనే.. ఈ ప్రక్రియ కొంతవరకు హైదరాబాద్‌లో జరిగాక, సరొగేట్ మామ్ గర్భంలో పెట్టడం కోసం గుజరాత్‌కి వెళ్లాం. మొదట ఇదంతా హైదరాబాద్‌లోనే చేయించుకోవాలనుకున్నా. కానీ, మీడియాకు తెలిసిపోతుందన్న భయంతో వద్దనుకున్నాను. ఇందిర: మామూలుగా మీరు చాలా బోల్డ్‌గా, ఓపెన్‌గా ఉండే వ్యక్తి. ప్రతి చిన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా పబ్లిక్‌కి చెప్తుంటారు. మరి ఇంత పెద్ద విషయాన్ని చివరిదాకా అంత సీక్రెటివ్గా ఎందుకు ఉంచారు? లక్ష్మి: కారణం ఉంది... చెప్పిన దగ్గర నుంచీ అందరూ బేబీ గురించి మరచిపోయి, ‘లక్ష్మి మంచు ఇలా... లక్ష్మి మంచు అలా’ అంటూ నా గురించే మాట్లాడేవారు. అది నాకు ఇష్టం లేదు. మొత్తం అటెన్షన్ అంతా బేబీ మీద ఉంటే బాగుంటుందనిపించింది. అంతేకాదు, ఇంతకుముందు చాలా ట్రై చేశాం. ఏదీ వర్కవుట్ కాలేదు. అందుకే ఈసారి చాలా సెలైంట్‌గా ఉండాలనుకున్నాం. బేబీ సేఫ్‌గా బయటికొచ్చేవరకు ఎవరికీ చెప్పకూడదనుకున్నాం. (నవ్వుతూ) నేనింత జాగ్రత్తగా ఉన్నా ఒకరోజు ముందు అందరూ దీని గురించి మాట్లాడడం మొదలెట్టారు. బేబీని తీసుకురావడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరేసరికే అందరికీ తెలిసిపోయింది. అందుకే ఎవరికీ చెప్పలేదు. మా ఫ్యామిలీకి, అత్తమామల ఫ్యామిలీకి తప్ప ఏ ఒక్కరికి చెప్పలేదు. కానీ, ఈ 9 నెలలు అమ్మానాన్నల్ని కంట్రోల్ చేసేసరికి నా పని అయిపోయింది. మీడియా సంగతి మరచిపోండి... మా నాన్నను కంట్రోల్ చేసినందుకే మీరు నాకొక అవార్డ్ ఇవ్వొచ్చు. మొదటి నుంచి నాన్న ఎంత ఎగ్జైట్ అయ్యారంటే... స్కాన్ చూసినప్పుడల్లా చెప్పేస్తాననేవారు. ఇందిర: కానీ ముందురోజు ఆయన చాలా ఎగ్జైటెడ్‌గా ‘రేపు మీకు ఒక వండర్ఫుల్ న్యూస్ చెప్పబోతున్నాను’ అని ట్విటర్లో మెసేజ్ పెట్టారు..? లక్ష్మి: అప్పుడు కూడా పూర్తిగా విషయం చెప్పేస్తాననే గోల! బేబీ చేతికి వచ్చాక చెప్తువు గాని అని గట్టిగా ఆపాను. ఇందిర: అవును... ఇండస్ట్రీలో కూడా ఎవరికీ తెలీదా? లక్ష్మి: తెలీదు! బేబీ బయటికొచ్చే 2-3 రోజుల ముందు మాత్రం నా క్లోజ్ ఫ్రెండ్ ప్రకాష్‌కి, రాణాకి చెప్పాను. ఇందిర: ఇప్పుడు మాత్రం అన్నీ బోల్డ్‌గా, ఓపెన్‌గా చెప్తున్నారు..! లక్ష్మి: ఇప్పటికి కూడా నేను చెప్పకుండా ఉండొచ్చు. రెండు రోజులు మాట్లాడుకుంటారు. మూడో రోజు చర్చించుకుంటారు. నాలుగో రోజు మర్చిపోతారు. చివరికది స్పెక్యులేషన్‌గానే ఉండిపోయేది. అయితే, ఇప్పుడు ఇంత ఓపెన్‌గా మాట్లాడడానికి కారణం... మన దేశంలో పిల్లలు పుట్టలేదంటే, లోపం ఎటువైపున్నా భార్యకు విడాకులివ్వడం లేదా భర్తకు రెండో పెళ్లి చేస్తుంటారు. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే... మీది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అయితే కేవలం పిల్లలు పుట్టలేదన్న కారణంతో దాన్ని బ్రేక్ చేయొద్దు. సమాజంలో ఎవరో ఏదో అనుకుంటారని, మీ జీవితాన్ని మీరు ఆస్వాదించని పరిస్థితి తెచ్చుకోవద్దు. సమస్య వచ్చినప్పుడు ఓపెన్‌గా ఉండండి... చెప్పుకోవాల్సిన వాళ్లతో చెప్పుకోండి... ధైర్యంగా ఫేస్ చెయ్యండి, సొల్యూషన్ కోసం వెతుక్కోండి! ఈ పర్టిక్యులర్ విషయంలో అయితే... పిల్లలు పుట్టకపోవడం అనే ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు, ఇలాంటి ఒక ఆప్షన్ ఉందని తెలీక కొంత, తెలిసినా భయం వల్ల కొంత వెనకడుగు వేస్తుంటారు. నా లాంటి ఒక సెలబ్రిటీ ఈరోజు బయటికొచ్చి ఇలా చెప్పడం వల్ల కొందరైనా ఇలా చేయడానికి ధైర్యం చేస్తారని! నేనిలా ఓపెన్‌గా ఉండడం వల్ల నలుగురికి మేలు చేసినదాన్నవుతాననుకున్నాను. ఇందిర: ఇండియాలో కమర్షియల్ సరొగసీ లీగలే కదా..? అయినా ఇంకేమైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయా? లక్ష్మి: లీగలే కాదు.. అన్నిటికీ పక్కా పేపర్ వర్క్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇతర దేశాల కన్నా మనదేశంలోనే దీనికి చట్టాలు పక్కాగా ఉన్నాయి. ఇందిర: అసలు సరొగేట్ మదర్స్ మెడికల్ నీడ్స్, న్యూట్రిషన్ నీడ్స్... ఓవరాల్‌గా ఎవరు టేక్కేర్ చేస్తారు. డబ్బుపరంగా కానీ, దగ్గరుండి చూసుకోవడం కానీ..? లక్ష్మి: మామూలుగా అయితే అంతా డాక్టరే టేక్కేర్ చేస్తారు. మనం ఇన్వాల్వ్ అవ్వదల్చుకుంటే అవ్వచ్చు. ఇందిర: మామూలు వ్యక్తులను వదిలేస్తే... హిందీలో అమిర్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లు చేశారు... సౌత్ ఇండియన్ ఫిలిం సెలబ్రిటీస్‌లో మీరే మొదటి వ్యక్తి అనుకుంటా ఇలా చేసింది... లక్ష్మి: (నవ్వుతూ) అసలు నాకు ఆ ఆలోచనేదు! బేబీ సేఫ్‌గా బయటికి రావలనే ఆలోచన తప్ప ఇంకోటి రాలేదు నాకు. మీరు నమ్మరు... ఈ బేబీ కోసం నేను ఎన్ని మొక్కులు మొక్కి ఉంటానో, ఎన్ని గుళ్లకు వెళ్లి వుంటానో, ఎంతగా ఆధ్యాత్మికంగా తయారయ్యానో! ఇందిర: గుళ్లు గోపురాలతోపాటు, సరగసీ మదర్ని కూడా విజిట్ చేస్తూనే ఉన్నారా? లక్ష్మి: అవును... ఈ 9 నెలల కాలంలో ఆమెను ఆరేడుసార్లు కలిశాను. ఆ అమ్మాయికి నేనెవరో క్లియర్‌గా చెప్పాను... దాచలేదు. మామూలుగా అయితే సరొగేట్ మదర్‌తో డెలివరీ తర్వాత సంబంధాలు ఉండవు. కానీ నేను మాత్రం మానవీయ సంబంధాలను కొనసాగిస్తూ ఆమెతో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాను. అంతేకాదు, నేను ఏదిచేసినా 100% చేస్తాను. అంతేకాదు, ప్రతి పనీ క్రియేటివ్‌గా, ఫన్‌గా, హెల్దీగా ఈజీయెస్ట్ పద్ధతిలో చూసుకుంటాను. అలాగే ఈ బేబీ విషయంలో కూడా ప్రతి ఒక్క స్టెప్‌ను ఎంజాయ్ చేశాను. ఇందిర: అవును, ఈ 9 నెలల్లో బేబీ ఎలా ఉండబోతుందనే ఆలోచనలు ఉండేవా? లక్ష్మి: నాకెప్పుడూ అందంగా ఉండాలని ఉంటుంది. ఏదున్నా లేకున్నా పిల్లకి నా ముక్కు రావాలని గట్టిగా ఉండేది. ఎందుకంటే మా ఫ్యామిలీలో నా ఒక్కదానికే నాన్న ముక్కు వచ్చిందని గర్వంగా ఫీలైపోతుంటాను. అయితే, స్కాన్‌లో పాపకి సొట్ట ముక్కు ఉన్నట్టు అనిపించింది. స్కాన్ రిపోర్ట్ చూసినప్పుడల్లా ‘‘నాన్నో, ఇది నా కూతురు కాదు నాన్నో... దీనికి విష్ణు, మనోజ్‌లా సొట్ట ముక్కు వచ్చింది నాన్నో’’ అంటూ గోల చేసేదాన్ని. ఇందిర: ఇప్పుడు పుట్టేసింది కదా... మరి ఎవరిలా ఉంది? ఇంతకీ మీ ముక్కు వచ్చిందా? రాలేదా? లక్ష్మి: (నవ్వుతూ) సొట్టముక్కు మాత్రం రాలేదు! పాప అచ్చు ఆండీలా ఉంది. అయినా రోజూ ముక్కుని నొక్కుతున్నాను... నా ముక్కులా సన్నగా చెయ్యాలని! అయితే కాళ్లు చేతులు నాలా ఉన్నాయి. మరచిపోయా... మా మంచు గడ్డం కూడా వచ్చింది దానికి! ఇందిర: ట్విటర్లో మీది, ఆండీది, పాపది ముగ్గురివి చేతులు పెట్టారు... అలా ఓ టీజర్ వదిలే బదులు పాప ఫుల్ ఫోటో పెట్టొచ్చు కదా? లక్ష్మి: ఓ వారం ఆగి పెట్టాలనుకున్నాను... కానీ ఫస్ట్ ఫోటో మాత్రం మీకే ఇస్తాను. ఇందిర: అవును, బేబీ పుట్టగానే అందరి ఫస్ట్ రియాక్షన్..? లక్ష్మి: ‘జూనియర్ ఆండీ పుట్టేసింది’ అని! ఇందిర: అరియానా, వివియానా ఎలా రియాక్టయ్యారు.? లక్ష్మి: ఇంట్లో వాళ్లందరూ ఒకెత్తయితే వీళ్లిద్దరిదీ ఒకెత్తు. వాళ్లిద్దరూ ‘సోప్‌తో చేతులు కడుక్కోకుండా డోంట్ టచ్ అత్తా’ అంటూ... వాళ్ల నాన్న దగ్గర్నుంచీ వాళ్ల తాతదాకా... ఎవ్వర్నీ లోపలికి రానివ్వట్లేదు. నాకసలు ‘జాయ్’ అంటే ఇంతలా ఉంటుందని వాళ్లను చూస్తే అనిపిస్తుంది. (నవ్వుతూ) ఇక పాపను నేను పెంచనక్కర్లేదు... అరీ, వివీ పెంచేస్తారు. ఇందిర: ఇంతకీ పేరేం పెట్టబోతున్నారు. అరియానా, వివియానాకు ప్రాస కలిసొచ్చేలానా? అమ్మ పేరు ‘విద్య’ కలిసొచ్చేలానా? లక్ష్మి: ఫ్యామిలీలో అందరి పేర్లూ కలిసొచ్చేలా పెట్టాలనుకుంటున్నాం. ఇందిర: ఫాదర్స్ డే రోజు పుట్టింది, ఫాదర్ బర్త్ డే రోజు పుట్టింది, పాదర్లా పుట్టింది... ఆండీ మస్ట్ బీ ద హ్యాపియెస్ట్ డాడ్? లక్ష్మి: ఆయనే కాదు, ఆమె కూడా హ్యాపీ డాటరే! పొద్దుటి నుంచి నేను చూసుకున్నా పట్టదు కానీ, వాళ్ల డాడీ వచ్చేసరికి ఇటునుంచి అటువరకు నవ్వుతుంది. అది చూస్తే నాకు కోపమొస్తుంది... గిల్లడమో, తొడపాశమో పెట్టాలనిపిస్తుంది! ఇందిర: మీరెలా మీ నాన్న కూచో, మీ పాప కూడా అంతేగా! లక్ష్మి: నిజమే... అందుకోసమే అబ్బాయి పుడితే బాగుండనుకున్నాను. పుట్టాలనుకున్నాను... ‘మమ్మీస్ బాయ్’గా ఉంటాడని, ఇంట్లో అటెన్షన్ అంతా నాకే ఉంటుందని! మీకో విషయం తెలుసా... విష్ణుకి కూడా అబ్బాయిలే పుట్టాలని చాలా కోరుకున్నా. అందరికీ కొడుకులు పుట్టేస్తే ఇంట్లో నేనే క్వీన్‌ని అని! కట్‌చేసి చూస్తే అందరూ అమ్మాయిలే పుడుతున్నారు. నాకు ఇప్పుడే భయమేస్తుంది... నన్ను ఇక లెక్కచేయరేమో అని! ఇప్పటికే నేను ఆండీని సతాయిస్తున్నాను - ‘డు యు లవ్ మి ఆర్ ద బేబీ’ అని! ‘నీ తర్వాతే బేబీ’ అని నన్ను బుజ్జగిస్తుంటాడు. తనే కాదు ఇంట్లో అందరూ! ఇప్పుడు నాన్న శంషాబాద్‌లో ఇల్లు కట్టిస్తున్నారు. పాప పుట్టాక మనోజ్ - ‘నాన్నా, ఆ ఇంటిపేరు శంషాబాద్ గర్ల్స్ హాస్టల్ అని పేరు పెట్టుకుందాం’ అని జోక్లేశాడు. దానికి నాన్న - ‘ఇంతమంది ఆడపిల్లలుంటే నేను ఇంటి బయట క్రికెట్ బ్యాట్ పట్టుకుని కాపలా ఉండాలి’ అని! ఇందిర: ఆండీయేమో అమెరికాలో... బేబీయేమో ఇక్కడ... ఉండగలరా? లక్ష్మి: లేదు.. లేదు... తను ఇప్పుడు పూర్తిగా ఇండియా వచ్చేశారుగా! ఇన్‌ఫ్యాక్ట్ బేబీకోసం డిసెంబర్ నుంచి ఇండియాలోనే ఉంటున్నారు. (నవ్వుతూ) మేమిద్దరం చాలా యాక్టివ్ అండ్ ఇన్వాల్డ్ పేరెంట్స్ అండీ! ఇందిర: మరి మీది బిజీ లైఫ్ కదా? ఎలా బ్యాలెన్స్ చేసుకోబోతున్నారు లైఫ్‌ని? లక్ష్మి: (నవ్వుతూ) మమ్మీ డాడీ పెంచేస్తారండీ. విష్ణు - విన్నీ అయితే మరీ... పాపను నా దగ్గర ఉంచరట... వాళ్లే పెంచుతారట! ఆన్ ఎ సీరియస్ నోట్... అంతదూరం ఆలోచించట్లేదు... వన్ డే ఎట్ ఎ టైం అండీ! ప్రస్తుతం బేబీకి 100% టైం ఇస్తున్నాను. నేను అబ్బాయి అని మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి, బట్టలు, షూలు... అన్నీ అబ్బాయికి తగ్గట్టు కొనేశాను. ఐషఫుల్లో బేబీకి కొన్ని బేబీ బుక్స్ స్వయంగా చదివి, రికార్డ్ చేసి పెట్టి, బేబీ బడ్స్ (పొట్టమీద పెట్టే హెడ్‌ఫోన్స్) సాయంతో ఆరు నెలలుగా బేబీకి నా గొంతు వినిపిస్తూనే ఉన్నాను. మొదటి మూడు రోజులు ఆడపిల్లంటే ఆడపిల్లలా జెంటిల్‌గా ఉంది. కట్‌చేసి చూస్తే అరుస్తోంది... మా మంచు గొంతు వచ్చేసింది! Follow @sakshinews