first reaction
-
‘ఢిల్లీ’లో ఓటమి.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నానన్నారు. హామీలు నెరవేర్చాలని కోరుతున్నానన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు. తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఢిల్లీ ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాగా, స్వయంగా కేజ్రీవాల్ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై ఓటమి పాలవడం గమనార్హం. పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సిసోడియా,సత్యేందర్‌జైన్ వంటి ఆప్ నేతలంతా ఓటమి పాలవడం హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఆప్ సీనియర్ నేత, ప్రస్తుత సీఎం అతిషి మాత్రం కల్కాజి నియోజకవర్గంలో బీజేపీ నేత రమేష్ బిదూరిపై విజయం సాధించడం విశేషం. -
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్
-
డీకే శివకుమార్ ఫస్ట్ రియాక్షన్
-
సీఎం అభ్యర్థి ఎవరంటే..
-
చంద్రబాబు అరెస్ట్ పై సీఎం వైఎస్ జగన్ ఫస్ట్ రియాక్షన్..
-
విడాకుల తరువాత నిహారిక మొదటి పోస్ట్.. ఎవరి కోసమంటే..
సినిమా రంగంలోని సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి అయితే చెప్పనవసరం ఉండదు. తాజాగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోవడంతో ప్రతి విషయం ఇప్పుడు వైరల్ అవుతూనే ఉంది. నిహారిక-చైతన్యల పెళ్లి 2020 డిసెంబర్ 9న గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. తాజాగా వారిద్దరి అంగీకారంతో కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరంటూ..) పెళ్లి తర్వాత కూడా నిహారిక తన కెరీర్‌ను బిల్డప్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అంతకు ముందు అడపాదడపా సినిమాలు చేసిన నిహారిక, పెళ్లి తర్వాత నిర్మాతగా మారింది. ఈ మధ్యే సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరు మీద హైదరాబాద్‌లో ఆఫీస్ ఓపెన్ చేసింది. అలా చైతన్యకు దూరంగా ఉన్నా తను ఏదో ఒక సినిమా పనిలో బిజీగానే ఉండేది. (ఇదీ చదవండి: ఆయనంటే భక్తి.. అందుకే మా అబ్బాయికి 'నీల్' అని పేరు పెట్టాం: కాజల్) అయితే నిహారిక విడాకుల విషయం మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత.. తను ఏమైనా నోరు విప్పుతుందా? అని అందరూ భావించారు. కానీ నిహారిక మాత్రం వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆమె విడాకులకు సంబంధించిన వార్తలు వైరల్ అయిన కొద్దిసేపటికి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒకరికి పుట్టిన రోజు విషెస్ చెబుతూ స్టోరీ షేర్ చేసింది. నిహారిక సినిమాలకు అమెరికా నుంచి ప్రమోషన్స్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఆమె బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ విడాకుల వార్తల గురించి పలు రకాలుగా వార్తలు వస్తున్నా.. ఆమె స్పందించకపోవడంతో వీటిన లైట్ తీసుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మెగా ప్రిన్సెస్ పై నిహారిక షాకింగ్ కామెంట్స్
-
ఏం మాట్లాడాలో తెలియటం లేదు.. ఫస్ట్ రియాక్షన్ విత్ సాక్షి
-
ఎన్నికల్లో భారీ విజయం..! పంజాబ్ సీఎం అభ్యర్థి ఫస్ట్ రియాక్షన్
-
ఆయనతో పెళ్లంటే..
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్, రెహం ఖాన్ విడాకుల విషయంలో ఆయన భార్య, జర్నలిస్టు భార్య రెహం ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. తనను వంట ఇంటికి పరిమితం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని వ్యాఖ్యానించారు. చపాతీలు చేస్కో కానీ, బయటకు రావద్దని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీలోని పెద్దలు తనను ఆదేశించారన్నారు. రెండు వారాల తర్వాత తొలిసారిగా నోరువిప్పిన ఆమె తాము విడిపోవడానికి గల కారణాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని వివాదాస్పద కమెంట్లు చేశారు. 'నన్ను ప్రేమిస్తున్నానని నమ్మించిన వ్యక్తి ని పెళ్లి చేసుకున్నా....ఇద్దరం ఒంటరిగా ఉన్నాం.. ఇద్దరి కష్టాలు.. భావాలు,లక్ష్యం ఒకటే అని నేను నమ్మాను..కానీ మేం పూర్తిగా ఒకరికొకరం భిన్నమని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ తో వివాహ జీవితం ఒక స్వర్గంలా ఉంటుందనుకున్నా, కానీ అంతా తారుమారైంది. ఆయనతో రాజకీయాలు తప్ప, ఇంటి విషయాలు కానీ, కనీసం బాలీవుడ్ సినిమాల గురించి కానీ మరే విషయాలే మాట్లాడే అవకాశం ఉండదని వాపోయారు. ఈ విషయంలో తాను ఎంత మధనపడిందీ ఆ భంగవంతుడికి తెలుసని వ్యాఖ్యానించారు. అసలు ఇమ్రాన్ తో పెళ్లి అయిన దగ్గర్నించి తాను చాలా విధాలుగా నష్టపోయాయనన్నారు. కూతురుతో సహా, ఇస్లామాబాద్ లోని ఇమ్రాన్ నివాసానికి చేరుకున్నప్పటినుంచి అణచివేత మొదలైందని ఆరోపించారు. తన కరీర్ మొత్తం చిక్కుల్లో పడిందనీ, ముఖ్యంగా పెషావర్ లో వీధి బాలల కోసం ప్రతినిధిగా ఎంపికైనప్పటినుంచీ మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కానీ, దీనికి సంబంధించి ఒక్క సమావేశానికి కూడా హాజరు కాలేకపోయానని, తీవ్రమైన అభద్రతా భావం వెంటాడిందన్నారు. భర్త ఇమ్రాన్ తో సత్సంబంధాలు కొనసాగాలనే ఉద్దేశంతోనే చాలా టెలివిజన్ షో లను వదులుకున్నానని చెప్పారు. అయినా తన మీద అసత్య ఆరోపణలతో దాడి చేశారన్నారు. ఇకముందు పాకిస్తాన్ వీధి బాలల కోసం తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో రెండు సినిమాలను నిర్మించే ఆలోచనలో రెహం ఖాన్ ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాల్సి అవసరం ఉందన్నారు. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న ఇమ్రాన్, రెహం ఖాన్ కనీసం ఏడాది తిరగక ముందే విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ విడాకుల విషయంలో అనేక కథనాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.