four states
-
'పూడికతీత పనులపై వివరణ ఇవ్వండి'
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలోని బ్యారేజీల్లో పూడికతీత పేరుతో జరుపుతున్న ఇసుక తవ్వకాలపై వివరణ ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం గురువారం విచారించింది. ప్రకాశం బ్యారేజీలో, తెలంగాణలోని మేడిగడ్డ–అన్నారంలో, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పూడికతీత పనుల పేరుతో బ్యారేజీల్లో పెద్ద ఎత్తున యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, వీటిని వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయండని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
నాలుగు రాష్ట్రాలకూ పంచాలి
♦ కృష్ణా నదీజలాలపై ఏపీ ప్రభుత్వ వాదన ♦ రాష్ట్రాలకు సరిహద్దులు ఉంటాయి, నదులకు కాదు సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీజలాలను నాలుగు రాష్ట్రాలమధ్య కేటాయింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ మంగళవారం వాదనలు కొనసాగిస్తూ.. రాష్ట్రాలకు రాజకీయంగా సరిహద్దులుండవచ్చునని, అయితే కృష్ణా నది విస్తీర్ణం, సరిహద్దుల్లో ఏమాత్రం మార్పులుండవని పేర్కొన్నారు. అందువల్ల కృష్ణా నదిని ఒకే హైడ్రోలాజికల్ యూనిట్‌గా పరిగణించి, రాష్ట్రాలమధ్య నీటి కేటాయింపులు చేసే బాధ్యత ట్రిబ్యునల్‌పై ఉందన్నారు. ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, వాటికింద నిల్వ అవుతున్న నీరు, నదిలో నీటిలభ్యతలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారానే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు సాధ్యమవుతాయని చెప్పారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రత్యేకతను వివరిస్తూ గతంలో రాష్ట్రాల విభజన సమయంలో చేసిన చట్టాలను గంగూలీ ప్రస్తావించారు. గతంలో కొత్తగా రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు వాటిమధ్య నీటి పంపిణీని కేంద్రప్రభుత్వమే నిర్ణయించిందని, సెక్షన్ 89 తరహా వివరణ ఎక్కడా లేదని ఆయన అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఉనికిలో ఉన్నందున నీటి కేటాయింపుల బాధ్యతను ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పజెప్పిందన్నారు. నీటి పంపకాల్ని తెలంగాణ, ఏపీలకు పరిమితం చేయాలని కేంద్రం భావించలేదని, అందువల్లే సెక్షన్ 89ని చట్టంలో చేర్చారని ఆయన పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాలకు ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులతోపాటుగా నీటి ప్రవాహం, లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఏవిధంగా వినియోగించాలో తెలియచేసే ఆపరేషన్ ప్రోటోకాల్‌ను కూడా ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాలమధ్య నీటి వివాదాలు రాకుండా చూడడానికే సెక్షన్ 89ని విభజన చట్టంలో చేర్చారన్నారు. ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలమధ్య కృష్ణా జలాల్ని బచావత్ ట్రిబ్యునల్, తర్వాత బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గుండుగుత్తగా కేటాయింపులను చేశాయని, అందువల్లే ఆల్మట్టి విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్పి వచ్చిందని చెప్పారు. ట్రిబ్యునల్ ముందు బుధవారం మహారాష్ట్ర, కర్ణాటకలు వాదనలు కొనసాగించనున్నాయి. -
నాలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు!
జస్టిస్ రోహిణి మద్రాసు హైకోర్టుకు! న్యూఢిల్లీ: మేఘాలయ, రాజస్తాన్, కర్ణాటక, గువాహటి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు(సీజే)గా నియమించాలంటూ నలుగురు సీనియర్ జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ హైకోర్టులకు ప్రస్తుతం ఆపద్ధర్మ సీజేలేఉన్నారు. వారిలో కర్ణాటక హైకోర్టు ఆపద్ధర్మ సీజే జస్టిస్ ఎస్కే ముఖర్జీని అదే హైకోర్టుకు సీజేగా నియమించాలని కొలీజియం సూచించింది. పంజాబ్, హరియాణా హైకోరు జడ్జి జస్టిస్ సతీశ్ కుమార్ మిట్టల్‌ను రాజస్తాన్ హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ అజిత్ సింగ్‌ను గువాహటి హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని మేఘాలయ హైకోర్టుకు సీజేలుగా నియమించాలంది. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ జీ రోహిణిని మద్రాసు హైకోర్టుకు అదే హోదాలో బదిలీ చేయాలని, మద్రాసు హైకోర్టు సీజే జస్టిస్ ఎస్కే కౌల్‌ను అలహాబాద్ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ఢిల్లీ హైకోర్టు సీజేగా పంపించాలని సిఫారసు చేసింది. -
ఏపీలో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం
హైదరాబాద్: మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఏపీలో మ్యాగీ నూడుల్స్ ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. మ్యాగీ నూడుల్స్ కు సంబంధించి సరఫరా, అమ్మకాలు జరపరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఆహారభద్రత అధికారాలు మ్యాగీ నూడుల్స్ పై తాజా ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆమె ఆదేశించారు. కాగా, మ్యాగీ సరఫరా చేసే తొమ్మిదిరకాల ఉత్పత్తులను వెనక్కితీసుకోమని చెప్పినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
మరో నాలుగు రాష్ట్రాల్లో మ్యాగీ నిషేధం
-
మరో నాలుగు రాష్ట్రాల్లో నిషేధం
ఉత్తరాఖండ్, తమిళనాడు, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లో ‘మ్యాగీ నూడుల్స్’పై చర్యలు ♦ సరుకును తక్షణమే ఉపసంహరించాలని నెస్లే ఇండియాకు ఆదేశం ♦ చర్యలకు సిద్ధమవుతున్న బిహార్, ఉత్తరప్రదేశ్ న్యూఢిల్లీ: హానికారక రసాయనాల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌పై మరో నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఉత్తరాఖండ్, తమిళనాడులో మూడు నెలలు, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో ఒక నెల చొప్పున నిషేధం విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు గురువారం ప్రకటించాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని లేదని పరీక్షల్లో తేలిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టంచేశాయి. అలాగే తమ రాష్ట్రాల నుంచి మ్యాగీ నూడూల్స్ సరుకును తక్షణమే ఉపసంహరించాలని నెస్లే ఇండియా సంస్థను ఆదేశించాయి. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మ్యాగీపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు నూడుల్స్‌పై పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఫలితాలు రాగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం బుధవారమే మ్యాగీ నూడుల్స్‌పై 15 రోజులపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గుజరాత్ సర్కారు మ్యాగీ నూడుల్స్‌తోపాటు సన్‌ఫీస్ట్, ఎస్కేఎస్ ఫుడ్స్‌కు చెందిన న్యూడుల్స్పైనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఎస్కేఎస్ నూడుల్స్‌లో లెడ్(సీసం) మోతాదు పరిమితికి మించి ఉండడంతో వాటిపైనా 15 రోజుల నిషేధం విధించింది. ‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 27 మ్యాగీ నూడుల్స్ శాంపిళ్లను సేకరించి పరీక్షలు చే శాం. అందులో 14 శాంపిళ్లలో సీసం శాతం మోతాదుకు మించి నమోదైంది. ఇక అన్ని నమూనాల్లో హానికారక మోనోసోడియం గ్లుటామేట్(ఎస్ఎస్జీ) ఆనవాళ్లు కనిపించాయి’’ అని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. ఇక పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ హానికారకం కాదు అని తేలే వరకు ఒక్క జిల్లాలో కూడా వాటిని అమ్మకుండా చూడాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యాగీపై మూడునెలలపాటు నిషేధం విధించినట్లు ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఓం ప్రకాశ్ తెలిపారు. పరీక్షలకు పంపిన కొన్ని శాంపిళ్లలో ఎంఎస్‌జీ ఉన్నట్టు తేలిందని, మరికొన్ని ఫలితాలు రావాల్సి ఉందని ఆయన వివరించారు. కాగా, భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న మ్యాగీ నూడుల్స్‌పై నేపాల్ కూడా దృష్టి సారించింది. వాటిని పరీక్షలకు పంపింది. ఫలితాలు వచ్చాక నిషేధంపై నిర్ణయం తీసుకోనుంది. నూడుల్స్ ఉపసంహరించిన వాల్‌మార్ట్, మెట్రో ఏజీ వాల్‌మార్ట్, మెట్రో ఏజీ సంస్థలు తమ హోల్‌సేల్ స్టోర్ల నుంచి మ్యాగీ నూడుల్స్‌ను ఉపసంహరించాయి. ‘మ్యాగీ 2-మినిట్ నూడుల్స్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మా సంస్థకు చెందిన 20 స్టోర్ల నుంచి ఆ సరుకును ఉపసంహరిస్తున్నాం. ప్రజారోగ్యానికి మేం పెద్దపీట వేస్తాం’ అని వాల్‌మార్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ కూడా భారత్‌లో 18 స్టోర్ల నుంచి మ్యాగీని ఉపసంహరిస్తున్నట్లు పేర్కొంది. -
నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది. గత యూపీఏ ప్రభుత్వం హయాంలో నియమితులైన ఇద్దరు గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేసింది. మంగళవారం రాష్ట్రపతి భవన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశాకు చెందిన బీజేపీ నేత ద్రౌపది ముర్మును జార్ఖండ్ గవర్నర్‌గా, పశ్చిమబెంగాల్‌కు చెందిన తథాగత రాయ్‌ని త్రిపుర గవర్నర్‌గా నియమించారు. రాయ్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. అస్సాం మాజీ ముఖ్య కార్యదర్శి జేపీ రాఖోవాను అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, మేఘాలయ గవర్నర్‌గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ నేత వి.షణ్ముగనాథన్‌ను నియమించారు. జార్ఖండ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సయ్య ద్ అహ్మద్‌కు ఆయన మిగతా పదవీ కాలం ముగిసే వరకు(2016) మణిపూర్ గవర్నర్ బాధ్యతలను అప్పగించారు. అరుణాచల్ గవర్నర్‌గా ఉన్న నిర్భయ్ శర్మను మిజోరంకు బదిలీ చేశారు. గత ఏడాది కాలంలో మిజోరాంకు వచ్చిన 8వ గవర్నర్ ఈయన. -
4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్
న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ సోమవారమిక్కడ ప్రారంభమైంది. 18 అసెంబ్లీ స్థానాలకు లెక్కింపు జరుగుతోంది. బీహార్‌లో 10, పంజాబ్‌లో 2, మధ్యప్రదేశ్‌లో 3, కర్ణాటకలో 3 స్థానాలకు గతవారం ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో విజయంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇక కర్ణాటకలోని శికారిపుర, బళ్లారి రూరల్, చిక్కొడి-సదలగ నియోజక వర్గాలకు ఈ నెల 21న ఉపఎన్నికలు జరిగిన వైనం విదితమే. శికారిపుర నియోజకవర్గం ఓట్ల లెక్కింపును శివమొగ్గలోని సహ్యాద్రి కళాశాలలో చేపట్టారు. చిక్కొడి - సదలన నియోజకవర్గం ఓట్ల లెక్కింపును చిక్కొడి లోని ఆర్.డి.కళాశాలలో, బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఓట్లను బళ్లారిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. -
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం