నాలుగు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది. గత యూపీఏ ప్రభుత్వం హయాంలో నియమితులైన ఇద్దరు గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేసింది
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది. గత యూపీఏ ప్రభుత్వం హయాంలో నియమితులైన ఇద్దరు గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేసింది. మంగళవారం రాష్ట్రపతి భవన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశాకు చెందిన బీజేపీ నేత ద్రౌపది ముర్మును జార్ఖండ్ గవర్నర్‌గా, పశ్చిమబెంగాల్‌కు చెందిన తథాగత రాయ్‌ని త్రిపుర గవర్నర్‌గా నియమించారు. రాయ్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు.
అస్సాం మాజీ ముఖ్య కార్యదర్శి జేపీ రాఖోవాను అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, మేఘాలయ గవర్నర్‌గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ నేత వి.షణ్ముగనాథన్‌ను నియమించారు. జార్ఖండ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సయ్య ద్ అహ్మద్‌కు ఆయన మిగతా పదవీ కాలం ముగిసే వరకు(2016) మణిపూర్ గవర్నర్ బాధ్యతలను అప్పగించారు. అరుణాచల్ గవర్నర్‌గా ఉన్న నిర్భయ్ శర్మను మిజోరంకు బదిలీ చేశారు. గత ఏడాది కాలంలో మిజోరాంకు వచ్చిన 8వ గవర్నర్ ఈయన.