Hawala case
-
నాకేమీ తెలీదు.. ట్రాప్‌లో పడ్డాను: బోరుమన్న రన్యారావు
బెంగళూరు: విదేశాల నుంచి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు.. తాను అమాయకరాలునని అంటోంది. తాను ట్రాప్ లో పడ్డానని, కావాలని ఇలా అక్రమంగా బంగారు కడ్డీలను తరలించలేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్((DRI)అధికారుల ముందు బోరుమంది.తాను నేరం చేసినట్లు ఒప్పుకుంటూనే, ఇది తాను కావాల్సి చేసిన పని కాదని అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. డీఆర్ఐ అధికారుల తాజా విచారణలో తాను దుబాయ్ తో పాటు, యూరప్, అమెరికా, మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలను తిరిగి వచ్చినట్లు పేర్కొంది.గతేడాది కూడా ఇదే తరహాలో,..ప్రస్తుత రన్యారావు కేసుకు, గతేడాది చెన్నైలో జరిగిన బంగారం స్మగ్మింగ్ కేసుకు పోలికలు ఉండటంతో ఆ కోణంలో విచారణ ఆరంభించారు అధికారులు. గత సంవత్సరం సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య 12 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి తరలిస్తూ అధికారులకు పట్టుబడింది. అయితే తాను ఒక ఫ్రెండ్ వలలో చిక్కుకునే బంగారం స్మగ్మింగ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. ఇప్పుడు ఈ కేసును కూడా అదే కోణంలో పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇందులో ఎవరు పాత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. తాను ట్రాప్ లో చిక్కుకునే ఈ కథ నడిపినట్లు ఆమె పేర్కొనడంతో దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.ఆమె ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్..ప్రస్తుతం డీఆర్ఐ విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో రన్యారావుకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అధికారాలు ముందుగా సీజ్ చేశారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తదితర వస్తువుల్ని డీఆర్ఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆమెకు ఎవరితో లింకులు ఉన్నాయనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 2024 నుంచి ఆమె జరిపిన ఫైనాన్షియల్ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ రాకెట్ వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది.కాగా, గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. -
నటి రన్యా రావు కేసు.. తండ్రి కూడా 'తేడా'నే!
విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డిన కన్నడ నటి రన్యా రావు (Kannada Actor Ranya Rao) కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాన్నాళ్లుగా ఆమె ఈ దందా సాగిస్తున్నట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం అక్రమ రవాణాలో ఆమె కేవలం పాత్రధారి మాత్రమేనని సూత్రధారులు వేరే ఉన్నారని అనుమానిస్తున్నారు. రాజకీయ నేతల హస్తం కూడా ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. పోలీసుల దర్యాప్తులో ఎవరి పేర్లు వెలుగులోకి వస్తాయోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.సవతి తండ్రిపైనా ఆరోపణలు రన్యా రావు అరెస్ట్ ఘటనలో తనకేం సంబంధం లేదని స్పష్టంచేసిన ఆమె సవతి తండ్రి కె.రామచంద్రరావు పైనా గతంలో ఆరోపణలున్నట్లు తాజాగా మీడియాలో వార్తలొచ్చాయి. ఐపీఎస్ అధికారి (IPS Officer) అయిన రామచంద్రరావు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్)గా సేవలందిస్తున్నారు. 2014లో మైసూరు సదరన్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిలో ఉన్నప్పుడు హవాలా కేసులో ఈయన పాత్ర ఉందని ఆనాడు ఆరోపణలు వచ్చాయి.మైసూరులోని యెల్వాల్ నుంచి కేరళకు వెళ్తున్న బస్సును అడ్డగించిన పోలీసులు అందులోంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి ఆ బస్సు నుంచి రూ.2.07 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని రూ.20లక్షలు మినహా మిగతా కరెన్సీ పంచుకున్నారని ఒక వ్యాపారి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదంతంపై కేసు నమోదైంది. బస్సు వెళ్తున్న మార్గం వివరాలను వెల్లడించిన పోలీస్ ఇన్‌ఫార్మర్లతోపాటు రామచంద్రరావు వ్యక్తిగత గన్‌మెన్‌ను అరెస్ట్‌చేశారు. దీంతో రామచంద్రరావును ఈ పోస్ట్ నుంచి తప్పించి హెడ్‌క్వార్టర్స్‌కు ట్రాన్స్ఫర్చేశారు.తర్వాత రెండేళ్లకు మరో కేసులోనూ రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపించింది. గ్యాంగ్స్టర్లు ధర్మరాజ్, గంగాధర్‌ల నకిలీ ఎన్కౌంటర్ కేసు (Fake Encounter Case)లో రామంచంద్రరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.చదవండి: రన్యా రావు నాలుగు నెలలుగా ఇంటికి రాలేదు రన్యా రావుకు 3 రోజుల కస్టడీకర్ణాటకలోని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలు తెస్తూ రన్యా రావు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమెను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేసిన విజ్ఞప్తిని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతించింది. -
గవర్నర్‌పై సంచలన ఆరోపణలు
కోల్‌కతా: తమ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ పచ్చి అవినీతిపరుడని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికే ఆయన ఇటీవల ఉత్తర బెంగాల్లో పర్యటించారని మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్ ధన్కర్ అవినీతిపరుడు. 1996 నాటి జైన్ హవాలా కేసు చార్జీషీట్లో ఆయన పేరు ఉంది. అవినీతి మకిలి అంటిన ఇలాంటి గవర్నర్‌ను ఇంకా ఎందుకు పదవిలో కొనసాగిస్తున్నారో కేంద్రం సమాధానం చెప్పాలి’అని మమత డిమాండ్ చేశారు. గవర్నర్‌ను› తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, అయినా స్పందించలేదని విమర్శించారు. ఆ ఆరోపణలు నిరాధారం: గవర్నర్ సీఎం మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని, తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని గవర్నర్ ధన్కర్ దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి తరహాలో మమత వ్యవహరించడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తాను చేయాల్సిన ప్రసంగంలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తానని, అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జైన్ హవాలా కేసుకు సంబంధించిన ఏ చార్జిషీట్లోనూ తన పేరు లేదని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఆరోపణలు నిరాధారమని చెప్పారు. -
హైదరాబాద్‌లో మరో హవాలా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో హవాలా గుట్టు రట్టయ్యింది. మల్లేపల్లి దగ్గర రూ.18.65 లక్షలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాచిగూడకు చెందిన బిపిన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హబీబ్‌నగర్ పోలీసులకు నిందితుడిని వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పగించారు. ఈ సొమ్ము ఎక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హవాలా కేసులో కర్ణాటక మంత్రి
సాక్షి, బెంగళూరు: హవాలా వ్యవహారంతో కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌కు సంబంధం ఉందని ఐటీ అధికారులు గురువారం బెంగళూరు ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈ మేరకు కోర్టు ఆయనకు నోటీసు జారీ చేసింది. మంత్రి శివకుమార్ లెక్కల్లో చూపని రూ.5 కోట్ల నగదును ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి అందజేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. 2017 జనవరి 1న ఏఐసీసీకి రూ.3 కోట్లు, అదే నెల 9న మరో రూ.2 కోట్లు కర్ణాటక కాంగ్రెస్ నేత ద్వారా ఏఐసీసీకి అందజేసినట్లు తెలిపింది. ఇందుకోసం తన హవాలా నెట్‌వర్క్‌ను వినియోగించుకున్నారని ఆరోపించింది. గతేడాది ఆగస్టులో శివకుమార్, అతని అనుచరుల ఇళ్లు, ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు జరిపి రూ.20 కోట్ల నగదుతోపాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకునే శివకుమార్‌పై ఐటీ అధికారులు తాజాగా ఫిర్యాదు చేశారు. పన్ను ఎగవేత కేసుల్లో ఇది ఆయనకు నాలుగో నోటీసు కావటం గమనార్హం. -
హవాలాపై సీబీ‘ఐ’
నరసాపురం : విశాఖ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం గురువారం నరసాపురంలో దాడులు జరిపింది. పట్టణంలో పేరుమోసిన బంగారం వ్యాపారి దుకాణం, ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిం చింది. వేకువజాము నుంచి రాత్రి 7 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. దాడుల విషయాన్ని సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచారు. సీబీఐ డీఎస్పీ, మరో 9మంది సిబ్బంది వేకువజామునే నరసాపురం చేరుకుని, వాహనాలను గోదావరి గట్టు సమీపంలో పార్కింగ్ చేశారు. ఉదయం 5 గంటల సమయంలో కాలినడకన అతని ఇంటికి చేరుకున్నారు. కొందరు ఇంట్లో, మరికొందరు అతడి జ్యూయలరీ షాపులో సోదాలు చేశారు. స్థానిక పోలీసులను కూడా లోపలికి అనుమతించలేదు. సోదాలు పూర్తయిన తర్వాత గాని ఇక్కడకు వచ్చింది సీబీఐ అధికారులన్న విషయం తెలియలేదు. హవాలా కేసులో భాగంగానే.. ఇటీవల విశాఖలో వెలుగు చూసిన రూ.1,300 కోట్ల హవాలా కుంభకోణానికి సంబంధించిన కేసులో భాగంగానే సీబీఐ అధికారులు సోదాలు చేసినట్టు తెలిసింది. హవాలా కేసుకు సంబంధించి వడ్డి మహేష్, అతని స్నేహితుడు శ్రీనివాస్‌ను ఇటీవల విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. తరువాత ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ఇదే కేసులో మరో ఇద్దరిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు ఉన్నట్టు దర్యాప్తులో తేల్చారు. అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్న సందర్భంగా వారిచి్చన సమాచారంతో నరసాపురంలో కూడా దాడులు చేసినట్టు సమాచారం. ఈ కేసులో రూ.650 కోట్ల మేర హవాలా లావాదేవీలు సాగి నట్టు ముందుగా విశాఖ పోలీసులు తేల్చారు. అయితే ఈ మొత్తం రూ.1,300 కోట్ల మేర ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సీబీసీఐడీ పర్యవేక్షిస్తున్న ఈ కుంభకోణం కేసు వ్యవహారం రూ.వందల కోట్లలో ఉండటంతో సీబీఐ అధి కారులు రంగప్రవేశం చేసినట్టు భావిస్తున్నారు. సోదాల సందర్భంగా కీలక వివరాలు సేకరించిన అధికారులు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు వారు ఏ కేసుకు సంబంధించి వచ్చారు, ఎవరెవరిని విచారించారనే విషయాలు వెల్లడించ లేదు. మొత్తానికి వందలాది కోట్ల రూపాయల హవాలా కేసు వ్యవహారం విశాఖ నుంచి నరసాపురం చేరింది. సీబీఐ దాడులు పట్టణంలో సంచలనం రేకెత్తించాయి. ముఖ్యంగా బులియన్ వ్యాపారులు హడలిపోయారు. -
తీగలాగితే కదులుతున్న డొంక!
హైదరాబాద్: హవాలా మార్గంలో విదేశాలకు భారీగా నగదు తరలిస్తుండగా పట్టుకున్న కేసును టాస్క్ పోర్స్ పోలీసులు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్)కు అప్పగించారు. ఈడి ఈ కేసు విచారణను చేపట్టింది. ఈ విచారణలో కొత్త విషయాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. హవాలా వ్యవహారం గురించి పక్కా సమాచారంతో హైదరాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. విదేశాలకు అక్రమంగా డబ్బు తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను శనివారం హిమాయత్ నగర్లో టీటీడీ కళ్యాణమండపం సమీపంలో అరెస్ట్ చేశారు. వారిలో షేక్ మహ్మద్ ఆష్రఫ్ అనే యువకుడుతోపాటు హైదరాబాద్ హిరా గ్రూపుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. హిరా గ్రూపుకు చెందిన నౌహెరా షేక్ అనే మహిళ కూడా ఉంది. వారి నుంచి పోలీసులు రూ. 84.75 లక్షల నగదుతోపాటు 2 కార్లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చాంద్‌బాగ్‌కు చెందిన లక్ష్మణ్ అనే హవాలా ఏజంట్‌కు ఈ డబ్బు ఇవ్వడానికి వారు వెళుతున్నట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్ అదనపు డిసిపి ఎన్ కోటిరెడ్డి కథనం ప్రకారం అకౌంటెంట్ షేక్ మహ్మద్ అష్రాఫ్ రూ. 84.75 లక్షల హవాలా నగదును రాజేంద్రకుమార్ అంబాలాల్‌కు ఇచ్చాడు. అంబాలాల్, పి రెడ్డికుమార్, పటేల్ జయేష్‌కుమార్, పటేల్ మహేంద్ర, రాథోడ్ కనక్లతో కలిసి డబ్బును తరలిస్తుండగా నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ సొమ్మును హవాల ద్వారా వారు దుబాయ్‌కి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఆదాయంపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అప్పగించారు. హీరా సంస్థ హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిబంధనలకు విరుద్ధంగా ఇస్లామిక్ యూనివర్సిటీ భవన నిర్మాణం వివాదాలకు దారితీసింది. హీరా ఇంటర్నేషనల్ సంస్థ తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోనూ, శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వెంకన్న ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన ఆరు అంతస్థుల భవనాలు నిర్మిస్తోంది. అక్కడ హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ అరబిక్ కళాశాల పేరిట బోర్డులు కూడా పెట్టారు. రెండస్థుల భవన నిర్మాణానికి మాత్రమే అనుమతి పొంది, ఆరు అంతస్థుల భవనం నిర్మించారు. ఈ సంస్థ ప్రభుత్వ స్థలం ఆక్రమించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ హీరా గ్రూపే హవాలా మార్గంలో డబ్బును దుబాయ్ పంపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
హవాలా కేసు ఐటీ శాఖకు అప్పగింత
హైదరాబాద్ : హవాలా మార్గంలో విదేశాలకు భారీగా నగదు తరలిస్తు పట్టుకున్న కేసును నారాయణగూడ పోలీసులు ఐటీ శాఖకు అప్పగించారు. రెండు రోజుల క్రితం హిమాయత్ నగర్లో విదేశాలకు అక్రమంగా డబ్బు తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి రూ. 84.75 లక్షల నగదుతోపాటు 2 కార్లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హవాలా వ్యవహారం గురించి పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు హిమాయత్ నగర్ నుంచి కారులో డబ్బు తరలిస్తున్న వ్యక్తులను వలపన్ని పట్టుకున్నారు. వీరిలో హిమాయత్ నగర్‌లోని హైదరాబాద్ హిరా గ్రూపుకు చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో నలుగురు ఉన్నారు. చాంద్‌బాగ్‌కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి ఇవ్వడానికి వారు డబ్బు తరలిస్తున్నట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఆదాయంపన్ను శాఖ అధికారులకు అప్పగించారు.