పోస్ట్‌పార్టం సమస్యలతో శ్రద్ధా ఆర్య, ట్విన్స్ జిబ్లీ ఫోటోలు సూపర్ క్యూట్
నటి శ్రద్ధా ఆర్య ఇటీవల పండంటి కవలల పిల్లలకు జన్మనిచ్చింది. ముద్దుల మూటగట్టే తన కవలల సంరక్షణలో బిజీగా ఉంది. ఇటీవల, శ్రద్ధా తన పిల్లల పేర్లను గిబ్లి-శైలి చిత్రంతో ప్రకటించింది. మరోవైపు తొలి సారిగా ప్రతి స్త్రీ ఎదుర్కొనే ప్రసవానంతర సమస్యల గురించి (Postpartum Problem) మాట్లాడింది.వివాహం పిల్లలతో ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న శ్రద్ధా ఆర్య (Shraddha Arya) మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ప్రసవానంతర సమస్యలు గురించి మాట్లాడింది. సాధారణంగా మాతృత్వం అనేది మహిళలకు వరం మాత్రమే కాదు.. అనేక సమస్యలకు మూలం కూడా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసవానంతర సమస్యలతో మహిళలు చాలా ఇబ్బంది పడతారు. శారీరక సమస్యలతోపాటు,మానసిక ఒత్తిడితో మరికొన్ని ఇబ్బందు లొస్తాయి. దీనినే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (పీపీడీ)అని వ్యవహరిస్తారు. ఈ ఒత్తిడి కారణంగా, ఆత్మన్యూనతా భావంతో కుంగిపోవడం, తానే హాని చేసుకోవడం, శిశువును కూడా గాయ పరచడం వంటి స్థితికి వెళతారు. శరీరంలో మార్పులు, అధిక బరువు , మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, తదితర ప్రసవానంతరం వచ్చే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రసవ సమయంలో బిడ్డను ఈ లోకంమీదికి తెచ్చేందుకు తల్లి పడే బాధ,ఆ వేదన వర్ణనాతీతం. వీటి గురించే ఆమె ఇన్‌స్టాలో ప్రస్తావించింది. ముఖ్యంగా జుట్టు రాలడం గురించి తన అభిప్రాయాలను షేర్ చేసింది. విపరీతంగా జుట్టురాలడంపై ఆవేదన వ్యక్తం చేసింది. కుచ్చులుగా రాలిపోతున్న వెంట్రుకల ఫోటోను పంచుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12)శ్రద్ధా ఆర్య, రాహుల్ నాగల్, జిబ్లి ఆర్ట్ ట్రెండ్టీవీ నటిగా అద్భుతమైన నటనతో పాపులర్ అయింది శ్రద్ధా ఆర్యా. 2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో 'కలవనిన్ కదలై' అనే తమిళ సినిమాద్వారా హీరోయిన్గా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించింది. పాటు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసిన శ్రద్ధా కుండలి భాగ్య సీరియల్‌తో మరింత పాపులర్ అయింది.ఏడాది పాటు డేటింగ్ చేసిన నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్ని ,శ్రద్ధా ఆర్యా 2021, నవంబరులో పెళ్లాడింది. ఈ జంటకు 2024 నవంబరు 29న ట్విన్స్( పాప, బాబు) పుట్టారు. కుమారుడికి ‘శౌర్య' అని కుమార్తెకు 'సియా' అంటూ పూర్లు కూడా పెట్టేశారు. తాజాగా జిబ్లి తరహా క్యూట్ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి సోషల్ మీడియా ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించాయి.