Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Padma Shri Vanajeevi Ramaiah Passed Away Condolences pour1
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత

సాక్షి, ఖమ్మం: జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లి. ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న మొక్కల ప్రేమికుడు ఈయన. కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2017లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది.

Tamil Nadu minister Ponmudy removed from DMK post2
డీఎంకే మంత్రి అసభ్యకర వ్యాఖ్యలు.. పార్టీ పదవి నుంచి తొలగింపు

చెన్నై: శైవ, వైష్ణవాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధిష్టానం పార్టీ పదవి నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్‌ స్పందించారు. పొన్ముడిని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అయితే, శైవ, వైష్ణవాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే క్రమంలో మహిళలను కూడా అవమానించేలా పొన్ముడి మాట్లాడారు. పలువురు మహిళలను ఉదహరిస్తూ ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యల తాలూకు వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వాటిపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొన్ముడి వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. మరోవైపు.. ఆయనను మంత్రి పదవి నుంచి కూడా వెంటనే తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిమాండ్‌ చేశారు. హిందూ ధర్మంపై దాడులు చేస్తున్న డీఎంకే వ్యవస్థ ఆసాంతం అసభ్యకరంగా తయారైందన్నారు. పొన్ముడికి వివాదాలు కొత్తేమీ కాదు. హిందీ మాట్లాడే వారినుద్దేశించి పానీపురీ అమ్ముకుంటారంటూ గతంలోనూ ఆయన అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తమిళనాడు మరోసారి రాజకీయంగా వేడెక్కింది. This is DMK’s standard of political discourse in Tamil Nadu. Thiru Ponmudi was once the Higher Education Minister of Tamil Nadu & now Minister for Forests and Khadi, and the youth of Tamil Nadu are expected to tolerate this filth? Not just this Minister, the entire DMK ecosystem… pic.twitter.com/ENMq47hiPf— K.Annamalai (@annamalai_k) April 11, 2025కాగా.. పొన్ముడి ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడుతూ మహిళలను వలసదారులతో పోల్చడం విమర్శలకు దారితీసింది. ఇక, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఆయనకు మద్రాసు హైకోర్టు జైలుశిక్ష కూడా విధించింది. దీంతో ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటు కూడా పడింది. అనంతరం శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో తిరిగి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు.

Tahawwur Rana has finally arrived in our country3
రాణా గుప్పిట కీలక రహస్యాలు!

పదిహేడేళ్ల క్రితం ముంబై మహానగరంలో 10 మంది ఉగ్రవాదులు 78 గంటలపాటు విచక్షణా రహితంగా దాడులకు తెగబడి 166 మంది ప్రాణాలు బలితీసుకున్న ఘోర ఉదంతంలో కీలక కుట్ర దారైన తహవ్వుర్‌ రాణా ఎట్టకేలకు మన దేశంలో అడుగుపెట్టాడు. రానున్న 18 రోజుల్లో మన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో అతగాడు ఆ ఘోర ఉదంతానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తాడన్నది చూడాలి. ఆ ఉగ్రవాదులు బాంబులూ, ఇతర మారణాయుధాలతో పాకి స్తాన్‌లోని కరాచీ నుంచి సముద్ర మార్గంలో ముంబై చేరుకుని ఆ నగరంలో అనేకచోట్ల తుపాకు లతో, గ్రెనేడ్లతో చెలరేగిపోయారు. ఆ దాడుల్లో సాధారణ పౌరులూ, కర్కరే వంటి పోలీస్‌ ఉన్నతాధి కారులూ ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిదిమంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హత మార్చగా, ఉగ్రవాది కసబ్‌ పట్టుబడ్డాడు. విచారణానంతరం 2012లో అతన్ని ఉరితీశారు. రాణా వెల్లడించేఅంశాలు మన నిఘా వర్గాల దగ్గరున్న సమాచారంతో ధ్రువీకరించుకోవటానికీ, మరో ఉగ్రవాది, ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్న డేవిడ్‌ హెడ్లీపై మరిన్ని వివరాలు రాబట్టడానికీ తోడ్పడుతాయి.రాణా అప్పగింత అతి పెద్ద దౌత్యవిజయమని మన ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటు అమెరికా కూడా ఉగ్రదాడుల్లో హతమైనవారికీ, ఇతర బాధితులకూ న్యాయం చేకూర్చటంలో ఇది కీలకమైన ముందడుగని ప్రకటించింది. కావచ్చు. అయితే కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై చెబుతున్నట్టు ‘అతగాడి దగ్గర చెప్పడానికేం లేదు గనుకనే...’ అప్పగించారా? రాణా పాత్ర కూడా తక్కువేం కాదు. దాడులకు పక్షం రోజుల ముందు భార్యతో కలిసి ముంబైలో చాలా ప్రాంతాలు వెళ్లి చూశాడు. అతను ఎంపిక చేసిన ప్రాంతాలను హెడ్లీ భార్యాసమేతంగా వచ్చి తనిఖీ కూడా చేశాడు. ఇంచుమించు ఆ ప్రాంతాల్లోనే ఉగ్రవాదుల దాడులు జరిగాయి. రాణా ముంబైతోపాటు ఢిల్లీ, కొచ్చి వంటి నగరాలకు కూడా పోయాడు. 1971 నాటి యుద్ధవీరులకై నిర్మించిన ముంబైలోని జల వాయు విహార్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో భార్యతో కలిసి బస చేశాడు. ఆ కాంప్లెక్స్‌ పేల్చివేతకు అవకాశం ఉందా లేదా చూసుకుని, అసాధ్యమని నిర్ణయించుకున్నాక భారత్‌ నుంచి వెళ్లిపోయాడని అంటారు. పిళ్లై వాదన పూర్తిగా కొట్టిపారేయదగింది కాదు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో రాణాతో పోలిస్తే అసలు సిసలు కుట్రదారు డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ. ప్రస్తుతం రాణా అప్పగింత కీలకమైన ముందడుగుగా చెబుతున్న అమెరికా హెడ్లీ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకంటే అతగాడు అమెరికా మాదకద్రవ్య నియంత్రణ విభాగం (డీఈఏ) ఏజెంట్‌గా పని చేశాడు. అదే సమయంలో ఐఎస్‌ఐకీ, లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ)కీ కూడా ఏజెంట్‌గా ఉన్నాడు. ఇవన్నీ అమెరికా నిఘా సంస్థలకూ తెలుసు. అంతేకాదు... ముంబై మారణకాండ పథక రచన మొదలుకొని అన్ని విషయాలపైనా అమెరికా దగ్గర ముందస్తు సమాచారం వుంది. ఆ సంగతలా వుంచి భారత్‌లో సేకరించిన సమస్త సమాచారాన్నీ, ముంబైకి సంబంధించిన జీపీఎస్‌ లోకేషన్‌లనూ హెడ్లీకి రాణా అందించాడు. దాని ఆధారంగానే కొలాబా తీరప్రాంతంలోని బధ్వర్‌ పార్క్‌ దగ్గర ఉగ్రవాదులు బోట్లు దిగారు. రాణా ఇచ్చిన సమాచారాన్ని హెడ్లీ పాకిస్తాన్‌ పోయి అక్కడ ఐఎస్‌ఐ తరఫున తనతో సంప్రదిస్తున్న మేజర్‌ ఇక్బాల్‌ అనే వ్యక్తికి అందజేశాడని ఇప్పటికే మన నిఘా సంస్థలకు రూఢి అయింది. ఉగ్రవాదులకు ఐఎస్‌ఐ ఇచ్చిన శిక్షణేమిటో హెడ్లీకి తెలుసు. వీటిపై అమెరికా భద్రతా సంస్థలకు క్షణ్ణంగా తెలిసినా మన దేశాన్ని ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదన్న సంశయాలున్నాయి. ఇది బయటపడుతుందన్న ఉద్దేశంతోనే అమెరికా ఏవో సాకులు చెబుతోందన్నది వాస్తవం. సందేహం లేదు... రాణా కన్నా హెడ్లీ అత్యంత కీలకమైనవాడు. అతను ఎల్‌ఈటీలో చేరడమే కాక, ముంబై దాడులకు పన్నాగం పన్నిన ఉగ్రవాదులు హఫీజ్‌ సయీద్, లఖ్వీల దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ముంబై దాడుల సమయంలో దగ్గరుండి చూస్తున్నట్టుగా ఉగ్రవాదులకు ఎప్పటి కప్పుడు ఫోన్‌లో లఖ్వీ ఆదేశాలివ్వటం వెనక హెడ్లీ ప్రమేయం వుంది. తమకు ఏజెంటుగా పని చేసినవాడిని అప్పగించరాదని అమెరికా భావించటం మూర్ఖత్వం. అదే పని భారత్‌ చేస్తే అంగీకరించగలదా? హెడ్లీని అప్పగిస్తే తమ గూఢచార సంస్థల నిర్వాకం బయటపడుతుందని అది సంకోచిస్తున్నట్టు కనబడుతోంది. రాణా అప్పగింత ప్రక్రియ తమ హయాంలోనే మొదలైందని గర్వంగా చెబుతున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హెడ్లీ విషయంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలి. వికీలీక్స్‌ పత్రాలు ఈ సంగతిని చాన్నాళ్ల క్రితమే వెల్లడించాయి. హెడ్లీ అప్పగింతకు పట్టుబట్టవద్దని అప్పటి మన జాతీయ భద్రతాసలహాదారు ఎంకే నారాయణన్‌ను నాటి అమెరికా రాయబారి తిమోతీ రోమెర్‌ కోరినట్టు అందులో ఉంది. అలా అడిగినట్టు కనబడకపోతే తమకు ఇబ్బందులొస్తాయని నారాయణన్‌ బదులిచ్చినట్టు కూడా ఆ పత్రాల్లో ఉంది. హెడ్లీ ఎలాంటివాడో అతని కేసులో 2009లో తీర్పునిచ్చిన అమెరికా న్యాయమూర్తే చెప్పారు. ‘హెడ్లీ ఉగ్రవాది. అతని నుంచి ప్రజలను రక్షించటం నా విధి. మరణశిక్షకు అన్నివిధాలా అర్హుడు. కానీ ప్రభుత్వ వినతి మేరకు 35 ఏళ్ల శిక్షతో సరిపెడుతున్నాను’ అన్నారాయన. ఎటూ పాకిస్తాన్‌ తన రక్షణలో సేద తీరుతున్న లఖ్వీ, సయీద్‌లను అప్పగించదు. ఆ దేశంతో మనకు నేరస్థుల అప్పగింత ఒప్పందం కూడా లేదు. కానీ అమెరికాతో ఆ మాదిరి ఒప్పందం ఉంది గనుక హెడ్లీ కోసం మన దేశం గట్టిగా పట్టుబట్టాలి. అది సాధిస్తేనే నిజమైన విజయం దక్కినట్టవుతుంది.

AP Inter Result 2025 Live Updates: Direct Link to Check AP Inter Result Online4
ఒక్క క్లిక్‌తో క్షణాల్లో ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11గం. సమయంలో రిజల్ట్స్‌ను వెల్లడించనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రకటించింది. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే.. ఇంటర్‌లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్‌ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్‌ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించనున్నారు. AP Inter Results 2025.. ఎలా చెక్‌ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్‌ చేయండి.➤ "AP Inter 1st Year / 2nd Year Results 2025" అనే లింక్‌పై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి.➤ వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.➤ భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌/ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

Sunrisers Hyderabad vs Punjab Kings match today5
సన్‌రైజర్స్‌కో విజయం కావాలి!

సాక్షి, హైదరాబాద్‌: ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో పరాజయం... భారీ అంచనాలు పెట్టుకున్న టాప్‌–3 వరుసగా విఫలం...టోర్నీలో అన్ని జట్లకంటే చెత్త ఎకానమీ (10.73) నమోదు చేసిన బౌలర్లు... బౌలింగ్‌ సగటు కూడా అన్నింటికంటే ఎక్కువ (41.47)... బ్యాటర్ల నుంచి పరుగులు రావడం లేదు... బౌలర్ల ప్రదర్శన పేలవం... ఇలా అన్నీ సమస్యలే! ఇలాంటి స్థితిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత మైదానంలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నేడు జరిగే సమరంలో పంజాబ్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడుతుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లో మూడు విజయాలతో ఫామ్‌లో ఉన్న పంజాబ్‌ను రైజర్స్‌ ఏమాత్రం నిలువరిస్తుందనేది చూడాలి. మ్యాచ్‌ ముందు రోజు నగరంలో కాస్త చల్లటి వాతావరణం ఉన్నా... శనివారం రోజు వర్షసూచన లేదు. వరుస వైఫల్యాలు... హైదరాబాద్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 286 పరుగుల స్కోరుతో సీజన్‌ను సన్‌రైజర్స్‌ ఘనంగా ప్రారంభించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో జట్టు వరుసగా 190, 163, 120, 152 పరుగులు చేసింది. అయితే ఇవేవీ విజయానికి సరిపోలేదు. తొలి మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ సెంచరీని మినహాయిస్తే ఓవరాల్‌గా ఈ నాలుగు మ్యాచ్‌లలో కలిపి రైజర్స్‌ నుంచి 2 అర్ధసెంచరీలు నమోదయ్యాయి. క్లాసెన్‌ గరిష్టంగా 152 పరుగులే చేయగా... హెడ్‌ 148, అభిషేక్‌ 51 పరుగులు సాధించడం బ్యాటింగ్‌ పరిస్థితిని చూపిస్తోంది. నితీశ్‌ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. స్కోర్లు మాత్రమే కాదు, జట్టు ఆటగాళ్లలో ఒక రకమైన నిరాసక్తత కనిపిస్తోంది. మైదానంలో చురుకుదనం లోపించగా... గత ఏడాది తరహాలో పరుగులు సాధించాలనే తపన, కసి బ్యాటర్లలో కనిపించడం లేదు. వరుస ఓటముల ప్రభావం కూడా ఆటగాళ్లపై పడింది.అయితే దీని నుంచి కోలుకొని మళ్లీ చెలరేగేందుకు ఈ మ్యాచ్‌కు మించి మంచి అవకాశం లభించదు. కెపె్టన్‌ కమిన్స్‌ వికెట్లు తీయకపోవడంతో పాటు ఏకంగా 11.16 ఎకానమీతో పరుగులు ఇస్తున్నాడు. షమీలాంటి ప్రధాన పేసర్‌ కూడా 9.29 ఎకానమీతో పరుగులు ఇవ్వడం చూస్తే బౌలింగ్‌ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. ఈసారి ఓడితే మాత్రం కోలుకొని ప్లే ఆఫ్స్‌ రేసులోకి రావడం సన్‌రైజర్స్‌కు దాదాపు అసాధ్యం కావచ్చు. జోరు మీదున్న కింగ్స్‌... శ్రేయస్‌ అయ్యర్, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, ప్రియాన్ష్ ఆర్య... పంజాబ్‌ గెలిచి మూడు మ్యాచ్‌లలో వీరు ముగ్గురు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’లుగా నిలిచిన ఆటగాళ్లు. అంటే జట్టు ఏ ఒక్కరి బ్యాటింగ్‌పైనే ఆధారపడటం లేదు. పరిస్థితిని బట్టి ఒక్కో ప్లేయర్‌ బాధ్యత తీసుకొని నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురికి తోడు నేహల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌లతో జట్టు బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. అద్భుత ఫామ్‌లో ఉన్న అయ్యర్‌ 200 పరుగులు స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. స్టొయినిస్, మ్యాక్స్‌వెల్‌లాంటి ఆటగాళ్లు రాణించకపోయినా పంజాబ్‌ మెరుగైన స్థితిలో ఉంది. ఇదే జోరు కొనసాగిస్తే జట్టు మరో సారి భారీ స్కోరు సాధించడం ఖాయం. బౌలింగ్‌లో అర్ష్ దీప్, ఫెర్గూసన్‌ ముందుండి నడిపిస్తుండగా... యశ్‌ ఠాకూర్‌ కూడా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 ఓవర్లు వేసి ఒకే ఒక వికెట్‌ తీసిన చహల్‌ మాత్రం ఇంకా లయ అందుకోలేదు. అతనూ రాణిస్తే రైజర్స్‌ను కట్టడి చేయవచ్చు. తుది జట్లు (అంచనా) సన్‌రైజర్స్‌: కమిన్స్‌ (కెప్టెన్‌), హెడ్, అభిషేక్, ఇషాన్‌ కిషన్, నితీశ్‌ రెడ్డి, క్లాసెన్, అనికేత్, కమిందు, అన్సారీ, హర్షల్, షమీ, రాహుల్‌ చహర్‌. పంజాబ్‌ కింగ్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్, వధేరా, శశాంక్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, యాన్సెన్, చహల్, అర్ష్ దీప్, ఫెర్గూసన్, యశ్‌ ఠాకూర్‌.

Tamannaah Odela 2 producer D Madhu opens up about the film6
ఎండల్లో చెప్పులు లేకుండా తమన్నా నటించారు: డి. మధు

‘‘ఓదెల 2’ చిత్రకథ వినగానే తమన్నా ఎగ్జైట్‌ అయ్యారు. తొలిసారి ఆమె నాగసాధువు పాత్ర చేశారు. అద్భుతంగా నటించడంతో పాటు ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారామె. ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లోనూ చెప్పులు లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. సరైన టైమ్‌లో సరైన కథ తమన్నా దగ్గరకెళ్లిందని నమ్ముతున్నాను’’ అని నిర్మాత డి. మధు అన్నారు. తమన్నా లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, హిందీలో విడుదలవుతోంది.ఈ సందర్భంగా డి. మధు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఓదెల రైల్వేస్టేషన్‌’ మూవీ నాకు బాగా నచ్చింది. అనుకోకుండా ఓ రోజు సంపత్‌ నందిగారు ‘ఓదెల 2’ కథని నాకు చెప్పడం... చాలా నచ్చడంతో ఈప్రాజెక్టు మొదలైంది. ‘ఓదెల 2’ కథ లాజికల్‌గా ఉంటుంది. అశోక్‌ తేజ చక్కగా తీశారు. ఇందులో ఉన్న థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తాయి.అజినీష్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్, నేపథ్య సంగీతం చాలా బాగుంటాయి. సౌందర్‌ రాజన్‌గారు అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. వశిష్ఠ, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్, హెబ్బా పటేల్‌ పాత్రలన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలని, అలాగే మంచి సక్సెస్‌ అందుకోవాలనే ప్యా షన్‌తో బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా ‘ఓదెల 2’ని గ్రాండ్‌గా తీశాం. ఇక భావోద్వేగాలున్న చిత్రాలతో పాటు లేడీ ఓరియంటెడ్‌ కథలంటే నాకు ఇష్టం’’ అన్నారు.

Complaints to the Higher Education Council and the Higher Education Department regarding Fee Reimbursement7
అప్పు చేసి ఫీజులు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలానికి చెందిన మన పార్టీ కార్యకర్త కుమార్తె పి.పుష్పిత నూజివీడు పాలిటెక్నిక్‌ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. రూ.30 వేలు ఫీజు కట్టలేదని హాల్‌ టికెట్‌ ఇవ్వలేదు. దయచేసి హాల్‌ టికెట్‌ ఇప్పించి పరీక్ష రాసేలా సాయం చేయగలరని ప్రార్థన..! – మంత్రి లోకేశ్‌కు ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ టీడీపీ కార్యకర్త అభ్యర్థన ఇదీ!! పిల్లల ఫీజుల విషయం రచ్చకెక్కడంతో వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకనే ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం ఆ ఒక్క విద్యార్థినికి మాత్రం హాల్‌టికెట్‌ విడుదల చేసింది. కానీ ఫీజులు మంజూరుకాక, కాలేజీకి వెళ్లలేక మౌనంగా కుమిలిపోతున్న లక్షల మంది పిల్లల గోడును పట్టించుకునేవారే కరువయ్యారు. సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా ఫీజు డబ్బులు అందుకుని ఆత్మ విశ్వాసంతో చదువులపై దృష్టి సారించిన విద్యార్థులంతా ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో దిక్కు తోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఒకపక్క విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఫీజుల డబ్బులు అందకపోవడం, సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతుండగా.. కొందరు విద్యార్థులు చదువులకు దూరమై కూలీలుగా మారిపోయి పొలం పనులకు వెళుతున్న దుస్థితి మళ్లీ కనిపిస్తోంది. రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.7,800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా వసతి దీవెన కింద ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్ల చొప్పున హాస్టల్‌ ఖర్చుల కోసం అందచేయాలి. అంటే ఒక విద్యా సంవత్సరంలో రూ.3,900 కోట్లు విద్యార్థులకు ఇవ్వాలి. మొత్తంగా రెండేళ్లలో రూ.7,800 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పలు దఫాలు తల్లిదండ్రులు, పిల్లలు నిలదీయడంతో రూ.వెయ్యి కోట్లు విడుదల చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా అవి తమకు చేరలేదని చాలా కాలేజీలు అంటున్నాయి. ఇక ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ ఫీజులకు చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోతలు విధించడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. రాజకీయాలకు అతీతంగా చదువులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పిల్లలను బలి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల వేధింపులపై ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎక్కడా స్పందన కనిపించట్లేదు. పైగా దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నత విద్యా మండలి అధికారాలకు త్వరలో కత్తెర వేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. క్వార్టర్‌కే దిక్కులేదు.. సెమిస్టర్‌ బాంబు..! గత ప్రభుత్వం విద్యార్థుల చదువులకు సంపూర్ణ భరోసా కల్పిస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసింది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఫీజులను విద్యార్థుల తల్లులు ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానాన్ని తెచ్చింది. క్రమం తప్పకుండా ఫీజులు చెల్లించడంతో కళాశాలలపై ఆర్థిక భారం చాలావరకు తగ్గింది. టీడీపీ కూటమి సర్కారు వచ్చాక పారదర్శకతకు పాతరేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకే ఫీజులు చెల్లిస్తామని చెప్పి అది కూడా అమలు చేసిన పాపాన పోలేదు. త్రైమాసికం వారీగా ఫీజులు చెల్లించటానికే ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఇకపై సెమిస్టర్‌ వారీగా ఇస్తామని ప్రకటించడంతో ప్రైవేట్‌ విద్యా సంస్థల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేట్‌ పీజీ రీయింబర్స్‌మెంట్‌ గాలికి.. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలిచ్చారు. దీన్ని నమ్మి ప్రైవేటు కాలేజీల్లో పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులంతా అప్పులు చేసి ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.3 వడ్డీకి రూ.20 వేలు అప్పు చేశా మా అమ్మాయి విజయవాడలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇవ్వకపోవడంతో మూడు రూపాయల వడ్డీకి రూ.20 వేలు అప్పు చేసి కాలేజీకి కట్టా. ప్రతి నెలా రూ.600 వడ్డీ కడుతున్నా. నా భర్త పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యాడు. పనులు దొరకడం లేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. – కె.కుమారి, ఇంటర్‌ విద్యార్థిని తల్లి, విజయవాడ అప్పు చేసి రూ.40 వేలకు పైగా కట్టాంతిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మా అబ్బాయి బీటెక్‌ చదువుతున్నాడు. ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడంతో అప్పు చేసి రూ.40 వేలకు పైగా కాలేజీకి కట్టాం. నా భర్త మేస్త్రీ పని చేస్తారు. ఆయన కూలితోనే కుటుంబం గడవాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందనే ఆశతో పెద్దబ్బాయిని ఇంజనీరింగ్‌లో చేర్పించాం. ఇప్పుడు పరిస్థితి తల్లకిందులైంది. ఇంకో అబ్బాయి ఇంటర్‌ చదువుతున్నాడు. – ప్రభావతమ్మ, ఇంజినీరింగ్‌ విద్యార్థి తల్లి, తిరుపతి జగన్‌ హయాంలో ఆదుకున్నారిలా..జగనన్న విద్యా దీవెన: రూ.12,609.68 కోట్లు వసతి దీవెన : రూ.4,275.76 కోట్లు 2017-19 మధ్య టీడీపీ పెట్టిన బకాయిల చెల్లింపు: రూ.1,778 కోట్లు ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.18,663.44 కోట్లు వైఎస్సార్‌సీపీ హయాంలో హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు (పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ - ఎంటీఎఫ్‌) విభాగం చెల్లింపులు(ఒక్కో విద్యార్థికి) ఐటీఐ రూ.10 వేలు పాలిటెక్నిక్‌ రూ.15 వేలు డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు రూ.20 వేలు (నోట్‌: వీలైనంత ఎక్కువ మందిని అర్హులుగా చేర్పించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు వార్షిక ఆదాయ పరిమితి రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలకు ఉండేది. 2019 - 24 మధ్య వైఎస్సార్‌ సీపీ హయాంలో అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువమందికి లబ్ధి చేకూర్చారు)

Rasi Phalalu: Daily Horoscope On 12-04-2025 In Telugu8
ఈ రాశి వారికి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. ఆత్మీయులు దగ్గరవుతారు.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: పౌర్ణమి తె.4.22 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం: హస్త సా.5.11 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: రా.2.01 నుండి 3.44 వరకు,దుర్ముహూర్తం: ఉ.5.47 నుండి 7.26 వరకు, అమృతఘడియలు: ఉ.10.34 నుండి 12.22 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.10.మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవచింతన. విందువినోదాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అరుదైన పురస్కారాలు.వృషభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.మిథునం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనులలో అవాంతరాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో మార్పులు.కర్కాటకం: ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు.యత్నకార్యసిద్ధి. దేవాలయ దర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.కన్య: శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి.గౌరవమర్యాదలకు లోటు ఉండదు. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.తుల: ధనవ్యయం. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో చిక్కులు.వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో ఊహించని ఉన్నతి.ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు.సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.మకరం: కొత్తగా అప్పులు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ధనవ్యయం. శ్రమ తప్పదు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవచింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.కుంభం: రాబడి కన్నా ఖర్చులు అధికం. పనులలో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.మీనం: విందువినోదాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. దైవదర్శనాలు. ఆస్తిలాభ సూచనలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.

visa cancellations, US education associations fight for students9
విదేశీ  విద్యార్థులపై... ఎందుకీ కత్తి?

విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్‌ సర్కారు ఎడాపెడా రద్దు చేస్తుండటాన్ని అమెరికన్లు కూడా హర్షించడం లేదు. ఈ ధోరణి అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయమై అక్కడి విద్యా సంస్థలే గళమెత్తుతున్నాయి. అమెరికన్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ (ఏసీఈ)తో పాటు మరో 15 సంస్థలు బాధిత విదేశీ విద్యార్థుల తరఫున రంగంలోకి దిగాయి. ఏ కారణాలూ చూపకుండా వారి వీసాలను రద్దు చేయడం, సంబంధిత యూనివర్సిటీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వారి స్టూడెంట్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సి స్టం (సెవిస్‌) రికార్డులను గల్లంతు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. దీనిపై తక్షణం వివరణ ఇవ్వాలంటూ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) వి భాగానికి సంయుక్తంగా ఓ లేఖ రాశాయి. డీహెచ్‌ఎస్‌ మంత్రి క్రిస్టీ నోయెమ్‌తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు కూడా లేఖ ప్రతిని పంపాయి. విద్యార్థి వీసాల రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు బయట పెట్టాల్సిందేనని ఏసీఈ అధ్యక్షుడు టెడ్‌ మిషెల్‌ డిమాండ్‌ చేశారు. ‘‘స్వీయ డీపో ర్టేషన్‌ ద్వారా దేశం వీడండంటూ విద్యార్థులకు వస్తున్న ఈ మెయిళ్లు, మెసేజీల ద్వా రా మాత్రమే విషయం తెలుస్తోంది. అందుకు కారణాలైనా చెప్పకపోవడం మరీ దారుణం. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అభ్యంతరకర సోషల్‌ మీడియా కార్యకలాపాలకు, డాక్యుమెంటేషన్‌ తప్పిదాలకు, చివరికి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం దారుణం’’అంటూ ఆయన ఆక్షేపించారు. ‘‘మీ తీరుతో అమెరికావ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది మన దేశానికి కూడా మంచిది కాదు’’అని ఆవేదన వెలిబుచ్చారు. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జాతీయ భద్రత పేరిట విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. ఇప్పటిదాకా కనీసం 300 మందికి పైగా పాలస్తీనా సానుభూతిపరులైన విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్టు రూబి యో ఇటీవల వెల్లడించారు. గతంలో ఏ కారణంతోనైనా విద్యార్థి వీసాలను రద్దు చేసినా విద్యాభ్యాసం పూర్తయ్యేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుండేది. ఇప్పుడు మాత్రం వీసా రద్దుతో పాటు సెవిస్‌ రికార్డులను కూడా శాశ్వతంగా తుడిచిపెడుతుండటంతో బాధిత విద్యార్థులు తక్షణం అమెరికాను వీడటం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. వర్సిటీల్లోనూ ఆందోళన విద్యార్థి వీసాల రద్దు అమెరికా యూనివర్సిటీలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. చాలాసార్లు ఈ ఉదంతాలు తమ దృష్టికి కూడా రావడం లేదని ప్రఖ్యాత హార్వర్డ్‌ వర్సిటీ పేర్కొంది. ‘‘మేం స్వయంగా పూనుకుని మా విద్యార్థుల రికార్డులను పరిశీలించాల్సి వస్తోంది. మా వర్సిటీకీ చెందిన ముగ్గురు విద్యార్థులతో పాటు ఇటీవలే విద్యాభ్యాసం ముగించుకున్న మరో ఇద్దరి వీసాలను రద్దు చేసినట్టు తెలియగానే వారికి న్యాయ సాయాన్ని సిఫార్సు చేశాం’’అని వెల్లడించింది. అరిజోనా స్టేట్‌ వర్సిటీలో 50 మంది విదేశీ విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదరైంది. వారి వీసాల రద్దుకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. నార్త్‌ ఈస్టర్న్‌ వర్సిటీలోనూ 40, కాలిఫోర్నియా వర్సిటీలో 35 మంది విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మసాచుసెట్స్‌ వర్సిటీ చాన్స్‌లర్‌ వాపోయారు. విదేశీ విద్యార్థులే కీలకం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విదేశీ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో వారినుంచి అమెరికాకు ఏకంగా 4,380 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరినట్టు ‘ఓపెన్‌ డోర్స్‌’నివేదిక పేర్కొంది. అమెరికా వర్సిటీల్లో ఉన్నతవిద్య పూర్తి చేసుకుంటున్న విదేశీ విద్యార్థులను, ముఖ్యంగా భారతీయులను అమెరికా ఐటీ సంస్థలు కళ్లు చెదిరే వేతనాలిచ్చి మరీ తీసుకుంటున్నాయి. కొన్నేళ్లలోనే ఆ సంస్థలకు వాళ్లు వెలకట్టలేని ఆస్తిగా మారుతున్నారు. ‘అమెరికా ఫస్ట్‌’పేరిట విదేశీ విద్యార్థులపై వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల నుంచి అగ్ర రాజ్యానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న మేధో వలసకు అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టమని అక్కడి విద్యా సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Blue Origin is set to launch an all-female crew to space on 14 April 202510
కౌంట్‌ డౌన్‌: ఐకానిక్‌ మహిళల అంతరిక్ష యాత్ర

ఆరుగురు ఐకానిక్‌ మహిళలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే న్యూ షెపర్డ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ పైలట్‌ లేకుండానే పనిచేస్తుంది. సబ్‌ ఆర్బిటల్‌ ప్రయాణానికి ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలదు. సుమారు 11 నిమిషాల పాటు పయనించి భూమికి 62 మైళ్ల ఎత్తులో ఉన్న కార్మాన్‌ రేఖను దాటుతుంది. దీన్ని అంతరిక్షానికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు.ఈ ప్రయాణంలో ప్రయాణికులు గాలిలో తేలిపోతున్నట్టుగా అనుభూతిని పొందుతారు. క్యాప్సూల్‌కు సంబంధించిన పెద్ద కిటికీల ద్వారా భూమి విహంగ వీక్షణను ఆస్వాదిస్తారు. ‘న్యూ షెపర్డ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌’ను చిన్న చిన్న గగన యాత్రల కోసం రూపొందించారు. ఇది బిఇ–3 పిఎమ్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఎన్‌.ఎస్‌.–31 మిషన్‌ టెక్నాలజీ ఫీట్‌ మాత్రమే కాదు ఒక చారిత్రాత్మక ఘట్టం కూడా.‘నా భయాన్ని పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తున్నాను’ అంటోంది గేల్‌ కింగ్‌.‘కాస్త భయంగా ఉంది. అయినా చాలా ఉత్సాహంగా ఉంది’ అంటోంది లారెన్‌ సాంచెజ్‌.ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఆరుగురు ఐకానిక్‌ మహిళల అంతరిక్షయాత్ర హాట్‌ టాపిక్‌గా మారింది.అయేషా బోవ్‌నాసా మాజీ రాకెట్‌ శాస్త్రవేత్త అయిన అయేషా బోవ్‌ మిచిగన్‌ యూనివర్శిటీ నుండి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, స్పేస్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో కలిసి పనిచేసే ‘స్టెమ్‌ బోర్డ్‌’ అనే ఇంజినీరింగ్‌ కంపెనీకి అయేషా బోవ్‌ సీఈవో.అమంద గుయెన్‌హార్వర్డ్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్, ఎంఐటీ, నాసా, ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఆస్ట్రోనాటికల్‌ సైన్సెస్‌లో పనిచేసింది అమంద గుయెన్‌. లైంగిక బాధితులకు అండగా నిలబడి పోరాడిన గుయెన్‌ నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయింది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డ్‌కు ఎంపికైంది. తొలి వియత్నామీస్, ఆగ్నేయాసియా మహిళా వ్యోమగామిగా ఈ అంతరిక్ష యాత్రతో గుయెన్‌ చరిత్ర సృష్టించనుంది. ‘సేవింగ్‌ ఫైవ్‌: ఎ మెమోరియల్‌ ఆఫ్‌ హోప్‌’ అనే పుస్తకాన్ని గత నెలలో విడుదల చేసింది.లారెన్‌ సాంచెజ్‌ లారెన్‌ సాంచెజ్‌ రచయిత్రి, పాత్రికేయురాలు. ఎన్నో వార్తా సంస్థలలో యాంకర్‌గా పనిచేసింది. లారెన్‌ హెలికాప్టర్‌ పైలట్‌ కూడా. ‘బ్లాక్‌ ఆప్స్‌ ఏవియేషన్‌’ సంస్థను స్థాపించింది. ఇది మహిళా యాజమాన్యంలో నిర్వహితమవుతున్న తొలి ఏరియల్‌ ఫిల్మ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ. ‘ది ఫ్లై హూ ఫ్లై టు స్పేస్‌’లాంటి ఎన్నో పిల్లల పుస్తకాలు రాసింది.గేల్‌ కింగ్‌మేరీల్యాండ్‌ యూనివర్శిటీ నుండి సైకాలజీలో పట్టా పొందిన గేల్‌ కింగ్‌కు రేడియో, టెలివిజన్, ప్రింట్‌ మీడియాలలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ‘గేల్‌ కింగ్‌ ఇన్‌ ది హౌజ్‌’ అనే రేడియో షోని హోస్ట్‌ చేసింది. ఉత్తమ రేడియో టాక్‌ షో కోసం ఇచ్చే ‘అమెరికన్‌ ఉమెన్‌ ఇన్‌ రేడియో అండ్‌ టెలివిజన్‌ గ్రేసి అవార్డ్‌’ను సొంతం చేసుకుంది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా–2019’లో చోటు సాధించింది.కేటీ పెర్రీఆల్‌ టైమ్‌ బెస్ట్‌ సెల్లింగ్‌ మ్యూజిక్‌ ఆర్టిస్ట్‌లలో పాప్‌ స్టార్‌ కేటీ పెర్రీ ఒకరు. 2010లో విడుదలైన ఆమె మొదటి ఆల్బమ్‌ రికార్డ్‌లు బ్రేక్‌ చేసింది. 13 గ్రామీ అవార్డ్‌లకు కేటీ నామినేట్‌ అయింది. బిల్‌బోర్డ్‌ ‘విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2012’ అవార్డ్‌ అందుకుంది. ‘ఫైర్‌ వర్క్‌ ఫౌండేషన్‌’ మొదలుపెట్టి యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సేవలు అందిస్తోంది.కెరియానే ప్లిన్‌కెరియానే ప్లిన్‌ నిర్మాత. డాక్యుమెంటరీలు, చిత్రాలు తీసింది. హాలీవుడ్‌లో ఆమె తీసిన దిస్‌ చేంజెస్‌ ఎవ్రీ థింగ్‌ (2018), లిల్లీ (2024) చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్లిన్‌కు అంతరిక్ష ప్రయాణాలపై ఆసక్తి. ‘నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అంటోంది తన అంతరిక్ష ప్రయాణం గురించి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement