Top Stories
ప్రధాన వార్తలు

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలైంది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2018లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు.అయితే, ప్రసుత్తం ఆయన కూటమి ప్రభుత్వంలో కూడా నామినేటెడ్ పోస్ట్‌లో కొనసాగుతున్నారు. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఏబీ మంతనాలు జరిపారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు కీలక దశలో ఉండగా.. నిందితుడు శ్రీనివాస్ కుటుంబసభ్యులతో ఏబీ వెంకటేశ్వరరావు రహస్యంగా చర్చలు జరపడం చర్చాంశనీయంగా మారింది. శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీనే హత్యాయత్నం చేయించిందని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంతో టీడీపీతో నిందితుడు శ్రీనివాస్‌కు ఉన్న సంబంధాలు బట్టబయలైంది. కొద్దిరోజుల నుంచి జగన్‌పై విషం కక్కుతూ ఏబీవీ ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎక్స్‌లో జగన్‌పై ఏబీవీ తన అక్కసును వెళ్లగక్కారు.

భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
న్యూఢిల్లీ: భారత్ అమ్ములపొదిలో హై పవర్ లేజర్ ఆయుధం వచ్చి చేరింది. అధునాతన అధిక శక్తి కల్గిన 30 కిలోవాట్ల లేజర్ బీమ్ ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఫలితంగా లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్( (DEW) సిస్టమ్ ద్వారా అధునాతన పవర్ ఫుల్ వెపన్ ను తయారు చేసిన దేశాల జాబితాలో భారత్ చేరిపోయింది. ఇప్పటివరకూ ముందు వరుసలో అమెరికా, రష్యా, చైనాలు ఉండగా, ఇప్పుడు వాటి సరసన భారత్ చేరింది.ఆదివారం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (NOAR)లో ఈ విజయవంతమైన ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో ఫిక్స్ డ్ వింగ్ డ్రోన్ లు, స్వార్మ్ డ్రోన్ లపై అధునాతన లేజర్ బీమ్‌ను ప్రయోగించారు. ఇది భారత్ సాధించిన మరో విజయందీన్ని సక్సెస్ ఫుల్ గా లేజర్ బీమ్ కూల్చివేయడంతో డీఆర్డీవో సంబరాలు చేసుకుంది. టెక్నాలజీలో ఇది భారత్ సాధించిన మరో విజయంగా పేర్కొంది. భారత్ ట్రయల్ రన్ నిర్వహించిన ఈ లేజర్ బీమ్ కు ఎయిర్ క్రాఫ్ట్ లను, మిస్సెల్స్ ను క్షణాల్లో కూల్చివేసి సామర్థ్యం ఉంది. డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ ఆధ్వర్యంలోని ఈ ప్రయోగం చేపట్టారు. ఇది విజయవంతమైన తర్వాత టీమ్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా ఆయన జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఇది గగనతలం రక్షణ దళాన్ని మరింత పటిష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయం కావడంతో అధునాతన టెక్నాలజీ కల్గిన అరుదైన దేశాల జాబితాలో చేరినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల చైనా కూడా ఇదే తరహా టెక్నాలజీతో ఓ పవర్ ఫుల్ బీమ్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే.మనముందు ఇంకా చాలా లక్ష్యాలే ఉన్నాయి..కామత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ శక్తి సామర్థ్యాలను కల్గి ఉండగా, ఇప్పుడు మనం కూడా వాటి సరసన చేరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ కూడా ఇదే తరహా టెక్నాలజీతో వెపన్స్ తయారు చేసే పనిలో ఉందన్నారు.మనం ఇంకా చాలా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. వాటిని సాధించే పనిలోనే ఉన్నాం. హై ఎనర్జీ సిస్టమ్ తో అత్యధిక పవర్ కల్గిన మైక్రోవేవ్స్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నటిక్ ఆయుధాలను తయారు చేయడానికి సమాయత్తమైనట్లు ఆయన వెల్లడించారు. మనకున్న పలు రకాలైన సాంకేతిక విజ్ఞానంతో స్టార్ వార్స్ శక్తిసామర్థ్యాలను కల్గిన ఆయుధాలను తీసుకురావచ్చన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా స్టార్ వార్స్ సామర్థ్యం కల్గిన వెపనే అంటూ ఆయన పేర్కొన్నారు. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… https://t.co/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025

ఐదేళ్ల బాలికపై హత్యాచార నిందితుడు ‘ఎన్ కౌంటర్’!
బెంగళూరు: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడు తాజాగా పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయినట్లు తెలుస్తోంది. నిందితుడ్ని పట్టుకునే క్రమంలో తప్పించుకోబోయిన 35 ఏళ్ల నితీష్ కుమార్.. పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. ఇదే విషయాన్ని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు.‘మేము నిందితుడి నితీష్ కుమార్ ను పట్టుకున్న తర్వాత మాపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే పారి\పోయే యత్నం చేశాడు. దీనిలో భాగంగా మేము ఓ హెచ్చరిక జారీ చేస్తూ ‘వార్నింగ్ షాట్( అతనిపై కాల్చాం. అయినా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. మేము కేసు రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా అతని ఊరికి తీసుకెళ్లాం. అక్కడ మా టీమ్ పై దాడికి పాల్పడ్డాడు. హుబ్బాల్లి పోలీస్ అధికారి శశి కుమార్ మీడియాకు వెల్లడించారు.తప్పించుకునే క్రమంలో తమ వాహనాలను కూడా అతడు ధ్వంసం చేశాడని, ఈ క్రమంలో తమ టీమ్ లోని ఒక పోలీస్ అధికారి గాల్లోకి కాల్పులు జరపాడన్నారు. అయినా కూడా తప్పించుకునేందుకు యత్నించడంతో అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపామన్నారు. ఆపై వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే యత్నం చేశామని, కానీ డాక్టర్లు అతను చనిపోయినట్లు ధృవీకరించారని సదరు పోలీస్ అధికారి వెల్లడించారు.కన్నేసి.. కిడ్నాప్ చేసి హత్యాచారంఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని కొప్పాల్ జిల్లాలో ఐదేళ్ల బాలిక కిడ్నాప్ కు గురి కావడమే కాకుండా ఆపై అత్యాచారం, హత్య గావించబడింది. ఇళ్లలో పని చేసుకునే ఓ మహిళ కూతుర్ని నితీష్ కుమార్ అనే వ్యక్తి హత్యాచారం చేశాడు. తల్లి పనిలో వెళ్లడాన్ని గమనించిన అతను.. పాపను ఇంటి నుంచి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై ఆ పాపను హత్య చేశాడు. ఈ విషయం సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో అతన్ని పోలీసులు పట్టుకుని కస్టడీకి తీసుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు అతని ఊరికి తీసుకెళ్లగా, పోలీసుల్ని ఎదురించి దాడికి యత్నించాడు. దాంతో పోలీసులు జరిగిపన కాల్పుల్లో నితీష్ కుమార్ మరణించాడు.

ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025 వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

IPL 2025: రోహిత్ శర్మ మళ్లీ ఫెయిల్.. వెళ్లి రెస్ట్ తీసుకో భయ్యా?
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఆట తీరు ఏ మాత్రం మారడం లేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు.12 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. స్పిన్నర్ విప్రజ్ నిగమ్ బౌలింగ్ రివర్స్ స్వీప్ ఆడి వికెట్ల ముందు హిట్‌మ్యాన్ దొరికిపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు. 0,8,13,17,18 ఇవి వరుసగా రోహిత్ శర్మ చేసిన స్కోర్లు ఇవి. దీంతో మరోసారి విఫలమైన రోహిత్‌ను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఆడింది చాలు వెళ్లి రెస్టు తీసుకో రోహిత్ అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. మరికొంత మంది విరాట్ కోహ్లి అద్బుతంగా ఆడుతుంటే నీకు ఏమైంది రోహిత్ అంటూ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్లో కూడా రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. Rohit Sharma has become a joke . Failed again and again.. But no former indian player will talk about it because all these former players lick Rohit Sharma's feet.Pure liability in cricket. pic.twitter.com/wvIVk8GwRM— Suprvirat (@ishantraj51) April 13, 2025

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య
విశాఖ,సాక్షి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పుతున్నారు.ప్రమాదంపై పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో మృతుల సంఖ్య అంతకంత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆదివారం కావడంతో బాణా సంచా కేంద్రంలో పని చేసేందుకు 15మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ విచారణకు ఆదేశించారు. బాణాసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు:1. దాడి రామలక్ష్మి (35),W/oవెంకటస్వామి, R/o రాజుపేట .2. పురం పాప (40),W/o అప్పారావు, R/o కైలాసపట్నం. 3. గుంపిన వేణుబాబు (34),S/o దేముళ్ళు,R/o కైలాసపట్నం.4. సంగరాతి గోవిందు (40),S/o సత్యనారాయణ, R/o కైలాసపట్నం.5. సేనాపతి బాబూరావు (55)S/o గెడ్డప్ప ,R/o చౌడువాడ.6. అప్పికొండ పల్లయ్య (50)S/o నూకరాజు ,R/o కైలాసపట్నం.7. దేవర నిర్మల (38)W/o వీర వెంకట సత్యనారాయణ, R/o వేట్లపాలెం.8. హేమంత్ (20)R/o భీమిలి.

జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,యాదాద్రి భువనగిరి జిల్లా: తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటుంది.. జానారెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయని.. ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పా?. పదవి అడుక్కునే పరిస్థితిలో నేను లేను. నాకు చాలా బాధగా ఉంది. నన్ను చూసి అందరూ భయపడుతున్నారు. అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి?. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు.. కేపాసిటీ బట్టి వస్తుంది. 30 ఏళ్లు మంత్రి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.

'మా సినిమాలు చూసి అసూయ పడుతున్నారు'.. స్టార్ హీరో
మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కుంచకో బోబన్. మాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇటీవలే సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. అయితే మలయాళంలో 100కు పైగా చిత్రాల్లో నటించిన కుంచకో బోబన్.. ఇతర భాషల్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ విషయంపై ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పటివరకు మలయాళం కాకుండా మరే ఇతర భాషలో ఎందుకు పని చేయలేదన్న ప్రశ్నపై స్పందించారు.కుంచకో బోబన్ మాట్లాడుతూ.. 'నేను నిరంతరం నా క్రాఫ్ట్ గురించి నేర్చుకుంటూనే ఉంటా. నన్ను మరింత మెరుగుపరుచుకుంటున్నా. ప్రస్తుత రోజుల్లో కంటెంట్ పరంగా చూస్తే మలయాళ చిత్ర పరిశ్రమ మంచి దశలో ఉందని అనుకుంటున్నా. నిజానికి మలయాళంలో విడుదల చేస్తున్న విభిన్నమైన చిత్రాలను చూసి ఇతర పరిశ్రమలు అసూయపడుతున్నాయి. ఎందుకంటే మా చిత్రాల్లో నాణ్యత, ఇతివృత్తం, కథ కూడా కారణం కావొచ్చు. మా సినిమాలు స్థానికంగా తీస్తున్నప్పటికీ పాన్-ఇండియా, గ్లోబల్ రేంజ్‌కి మారిపోతున్నాయి. ఇప్పుడు మలయాళంలో రూపొందుతున్న సినిమాలు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటున్నాయి. అయితే ఇతర భాషల్లోనూ నటించేందుకు అసక్తిగా ఉన్నా. కానీ ప్రత్యేకించి తమిళంలో ఏదైనా ఒక అద్భుతమైన పాత్ర వచ్చినట్లయితే కచ్చితంగా చేస్తా. అలాంటి అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నా' అని అన్నారు.

అనకాపల్లి అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి,సాక్షి: అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఈ విషాదంపై వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడంపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైఎస్సార్సీపీ నాయకులను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. 13-04-2025బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ సీఎం @ysjagan దిగ్భ్రాంతి బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తివైయస్.జగన్ ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనకాపల్లి జిల్లా కోటవురట్లలో ఒక బాణా సంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన పట్ల మాజీ…— YSR Congress Party (@YSRCParty) April 13, 2025

రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
'అంబేద్కర్ జయంతి'ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14ను జాతీయ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా సోమవారం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు దినంగా పేర్కొంది. అంటే అన్ని బ్యాంకులు మూసి ఉంటాయన్నమాట.బ్యాంకులు అన్నీ క్లోజ్ అయినప్పటికీ.. ఆన్లైన్ బ్యాంకింగ్ (ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ మొదలైనవి) సేవలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. బ్యాంకులకు వెళ్లి చేసుకోవలసిన పనులన్నీ ఎల్లుండికి (మంగళవారం) వాయిదా వేసుకోవాలి.ఇతర సెలవు దినాలు➤15 ఏప్రిల్: బెంగాలీ నూతన సంవత్సరం, భోగ్ బిహు (అసోం, పశ్చిమ్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤18 ఏప్రిల్: గుడ్ ఫ్రైడే (ఛండీగఢ్, త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤20 ఏప్రిల్: ఆదివారం➤21 ఏప్రిల్: గరియా పూజ (త్రిపురలోని బ్యాంక్‌లకు సెలవు)➤26 ఏప్రిల్: నాల్గవ శనివారం➤27 ఏప్రిల్: ఆదివారం➤29 ఏప్రిల్: పరశురామ జయంతి (హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤30 ఏప్రిల్: బసవ జయంతి, అక్షయ తృతీయ (కర్ణాటకలోని బ్యాంక్‌లకు సెలవు)
ఐదేళ్ల బాలికపై హత్యాచార నిందితుడు ‘ఎన్ కౌంటర్’!
వారి వల్లే ఈ విజయం.. చాలా సంతోషంగా ఉంది: ఆర్సీబీ కెప్టెన్
క్షమించు అత్తా.. ఇక నిన్ను బాధించే పని చేయను..!
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
పాత బైక్ ధరకే 2025 సుజుకి హయబుసా
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
IPL 2025: రోహిత్ శర్మ మళ్లీ ఫెయిల్.. వెళ్లి రెస్ట్ తీసుకో భయ్యా?
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
మీరట్ కేసు.. నిందితురాలికి జైల్లో స్పెషల్ సదుపాయాలు
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
భువనేశ్వర్ కుమార్ 'ట్రిపుల్' సెంచరీ
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
రూ.75 లక్షలు అడ్వాన్స్.. నితిన్ మోసం చేశాడు: నిర్మాత
అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
తిరుమలలో మరో అపచారం
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
'మా సినిమాలు చూసి అసూయ పడుతున్నారు'.. స్టార్ హీరో
తీరు మార్చుకోని బాబర్ ఆజమ్.. చెలరేగిన ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్
అంత ఎనర్జీ ఎక్కడా చూడలేదు.. సింగిల్ షాట్లో చేశారు: సునీల్
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
వామ్మో.. అంత ఫీజులా!
అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణ
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
మైదానంలోనే మాక్సీ, స్టొయినిస్‌తో గొడవ.. స్పందించిన ట్రవిస్ హెడ్
క్షమించు అత్తా.. ఇక నిన్ను బాధించే పని చేయను..!
నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో సెంచరీ
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్
'హిట్ 3' సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్లన్నీ బ్లర్!
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్
మీరట్ కేసు.. నిందితురాలికి జైల్లో స్పెషల్ సదుపాయాలు
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
సాక్షి కార్టూన్ 13-04-2025
రికార్డు అర్ద శతకంతో సత్తా చాటిన విరాట్.. రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్‌లోనూ..
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
గోల్డెన్ డేస్..
బీఆర్ఎస్ సభకు అనుమతి
IPL 2025: రోహిత్ శర్మ మళ్లీ ఫెయిల్.. వెళ్లి రెస్ట్ తీసుకో భయ్యా?
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..
భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..
హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం.. ఆర్ఎంపీ డాక్టర్ మృతి
భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?
ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
ఈ రాశి వారికి వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
బాబూ.. పని భారం తగ్గించండి
బేబీ.. ఇలా అయితే కష్టమే!
గోశాల ఘటనపై టీటీడీ ఛైర్మన్ చులకన వ్యాఖ్యలు!
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. మూడు రోజుల్లోనే సెంచరీ!
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
దానివల్లే గెలిచానని నిత్యం పూజిస్తూ ఉంటార్సార్!
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
జ్వరంతో బాధపడుతున్నా.. వారు సపోర్ట్‌గా నిలిచారు: అభిషేక్ శర్మ
జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ విజయం
వైఎస్ జగన్‌కి ముద్రగడ పద్మనాభం లేఖ
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య
పైన మావోయిస్టులు... కిందన జవాన్లు
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
మహిళల కోసం సూపర్ ఉమెన్ టర్మ్: ప్రయోజనాలెన్నో..
ఈయన సక్సెస్ నెవర్ ఎండ్
జైలర్ - 2లో నేనున్నా.. సీనియర్ హీరోయిన్
అనకాపల్లి అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఐదేళ్ల బాలికపై హత్యాచార నిందితుడు ‘ఎన్ కౌంటర్’!
వారి వల్లే ఈ విజయం.. చాలా సంతోషంగా ఉంది: ఆర్సీబీ కెప్టెన్
క్షమించు అత్తా.. ఇక నిన్ను బాధించే పని చేయను..!
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
పాత బైక్ ధరకే 2025 సుజుకి హయబుసా
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
IPL 2025: రోహిత్ శర్మ మళ్లీ ఫెయిల్.. వెళ్లి రెస్ట్ తీసుకో భయ్యా?
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
మీరట్ కేసు.. నిందితురాలికి జైల్లో స్పెషల్ సదుపాయాలు
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
భువనేశ్వర్ కుమార్ 'ట్రిపుల్' సెంచరీ
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
రూ.75 లక్షలు అడ్వాన్స్.. నితిన్ మోసం చేశాడు: నిర్మాత
అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
తిరుమలలో మరో అపచారం
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
'మా సినిమాలు చూసి అసూయ పడుతున్నారు'.. స్టార్ హీరో
తీరు మార్చుకోని బాబర్ ఆజమ్.. చెలరేగిన ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్
అంత ఎనర్జీ ఎక్కడా చూడలేదు.. సింగిల్ షాట్లో చేశారు: సునీల్
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
వామ్మో.. అంత ఫీజులా!
అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణ
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
మైదానంలోనే మాక్సీ, స్టొయినిస్‌తో గొడవ.. స్పందించిన ట్రవిస్ హెడ్
క్షమించు అత్తా.. ఇక నిన్ను బాధించే పని చేయను..!
నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో సెంచరీ
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్
'హిట్ 3' సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్లన్నీ బ్లర్!
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్
మీరట్ కేసు.. నిందితురాలికి జైల్లో స్పెషల్ సదుపాయాలు
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
సాక్షి కార్టూన్ 13-04-2025
రికార్డు అర్ద శతకంతో సత్తా చాటిన విరాట్.. రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్‌లోనూ..
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
గోల్డెన్ డేస్..
బీఆర్ఎస్ సభకు అనుమతి
IPL 2025: రోహిత్ శర్మ మళ్లీ ఫెయిల్.. వెళ్లి రెస్ట్ తీసుకో భయ్యా?
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..
భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..
హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం.. ఆర్ఎంపీ డాక్టర్ మృతి
భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?
ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
ఈ రాశి వారికి వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
బాబూ.. పని భారం తగ్గించండి
బేబీ.. ఇలా అయితే కష్టమే!
గోశాల ఘటనపై టీటీడీ ఛైర్మన్ చులకన వ్యాఖ్యలు!
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. మూడు రోజుల్లోనే సెంచరీ!
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
దానివల్లే గెలిచానని నిత్యం పూజిస్తూ ఉంటార్సార్!
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
జ్వరంతో బాధపడుతున్నా.. వారు సపోర్ట్‌గా నిలిచారు: అభిషేక్ శర్మ
జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ విజయం
వైఎస్ జగన్‌కి ముద్రగడ పద్మనాభం లేఖ
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య
పైన మావోయిస్టులు... కిందన జవాన్లు
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
మహిళల కోసం సూపర్ ఉమెన్ టర్మ్: ప్రయోజనాలెన్నో..
ఈయన సక్సెస్ నెవర్ ఎండ్
జైలర్ - 2లో నేనున్నా.. సీనియర్ హీరోయిన్
అనకాపల్లి అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సినిమా

'హిట్ 3' సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్లన్నీ బ్లర్!
నాని(Nani) అంటే కుర్రాళ్ల దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు నచ్చే హీరో. కానీ గత కొన్నాళ్ల నుంచి ట్రెండ్ కి తగ్గట్లు తను కూడా మారుతున్నాడు. యాక్షన్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీకి తాజాగా సెన్సార్ జరగ్గా.. పిల్లలు, సున్నిత మనస్కులకు నో ఎంట్రీ అనే టాక్ వినిపిస్తోంది.చాన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. హిట్ 3(Hit 3 Movie) గురించి హింట్ ఇచ్చేశాడు. యాక్షన్ గట్టిగా ఉంటుందని, కచ్చితంగా పిల్లలు చూడకూడదని అన్నాడు. ఇప్పుడు అదే జరిగింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ మూవీ చూసేందుకు అర్హులు.(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ) మరోవైపు గతకొన్నాళ్ల క్రితం రిలీజై టీజర్(Hit 3 Teaser) కూడా రక్తపాతం అనేలా ఉంది. దీంతో మూవీ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే సినిమాలోనూ అలాంటి సీన్లు చాలానే ఉన్నాయని, సెన్సార్ వాటిని బ్లర్ చేయమని ఆదేశించిందని తెలుస్తోంది. బూతులు కూడా ఉన్నాయని అందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తోంది.నాని పోలీస్ గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. మే 1న థియేట్రికల్ రిలీజ్. కానీ మూడు వారాల ముందే సెన్సార్ చేయించేశారు. సోమవారం ఉదయం ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అలా ప్రమోషన్స్ షురూ చేస్తారనమాట.(ఇదీ చదవండి: తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?)

మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఆ మధ్య కాస్త సైలెంట్ అయిపోయారనుకునేలోపే మరోసారి వీరి కుటుంబంలో చిచ్చు రాజుకుంది. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ మోహన్‌బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు మనోజ్ (Manchu Manoj). కూతురి బర్త్‌డే కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని ఆరోపించారు. అటువైపు మనోజ్, మోహన్‌బాబు మాత్రం ఈ ఆరోపణలపై స్పందించనేలేదు.కూతురితో ర్యాంప్ వాక్ఇలా కుటుంబ గొడవలతో మంచు ఫ్యామిలీలో ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా పోతోంది. మోహన్‌బాబు కూతురు లక్ష్మీ (Manchu Lakshmi Prasanna).. ఈ వివాదాలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు. తాజాగా ఆమె 'టీచ్ ఫర్ ఛేంజ్' వార్షిక ఫండ్రైజర్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కూతురితో కలిసి ర్యాంప్ వాక్ కూడా చేసింది. మనసారా ఏడ్చేసిన మంచు లక్ష్మిఆమె స్టేజీపై నిలబడిన సమయంలో మనోజ్ దంపతులు వెనక నుంచి వచ్చి సర్ప్రైజ్ చేశారు. తమ్ముడిని చూసి లక్ష్మికి కన్నీళ్లు ఆగలేదు. స్టేజీపై ఉన్న సంగతి కూడా మర్చిపోయి అతడిని పట్టుకుని మనసారా ఏడ్చేసింది. దీంతో మనోజ్-మౌనిక దంపతులు ఆమెను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. అక్కాతమ్ముళ్ల అనుబంధం ఎంత గొప్పదో అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by NAMASTE.BIGGBOSS (@namaste_biggboss) చదవండి: సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్.. అమ్మ ఒప్పుకోవట్లే

చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
కొన్ని సినిమాలు చూసినప్పుడు అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఒకవేళ వచ్చిన ఎలా తీసారబ్బా అని మనం అనుకుంటాం. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనూ రిలీజైన ఓ మూవీ చూస్తే సరిగ్గా ఇదే అనిపిస్తుంది. చెబితే బుతులా ఉంటుంది కానీ చూస్తుంటే తెగ నవ్వొస్తుంది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి)కథేంటి?పరంధామయ్య ఓ పెద్దమనిషి. ఇతడికి స్వామి (సునీల్), దొర (వైభవ్) అని ఇద్దరు కొడుకులు. వీళ్లకు పెళ్లిళ్లు కూడా అయిపోయింటాయి. ఓ రోజు టీవీ చూస్తూ పరంధామయ్య చనిపోతాడు. కాకపోతే ఆయన విషయంలో బయటకు చెప్పుకోలేని ఓ సంఘటన జరుగుతుంది. అలా ఎందుకో జరిగిందో కుటుంబ సభ్యులకు అర్థం కాదు. దీంతో చావు గురించి బయటకు చెప్పలేని పరిస్థితి. మరి కుటుంబ పరువు ప్రతిష్టలు పోకుండా అంత్యక్రియలు ఎలా నిర్వహించారు? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'పెరుసు' అంటే తెలుగులో పెద్దాయన అని అర్థం. ఊరికి పెద్దమనిషిలా ఉండే ఒకతను చనిపోతాడు. కాకపోతే అతడి శరీరంలో జరిగిన చిన్న మార్పు వల్ల కుటుంబానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. దాన్ని కవర్ చేసి ఎలా అంత్యక్రియలు చేశారనేదే స్టోరీ.చెబితే బూతులా అనిపిస్తుంది కానీ ఇలాంటి పాయింట్ తీసుకుని సినిమా తీయడమే షాకింగ్ అంటే.. దాన్ని కామెడీగా చెప్పాలనుకోవడం మరింత పెద్ద షాకిస్తుంది. ఎందుకంటే ఏ మాత్రం తేడా కొట్టినా నవ్వుల పాలైపోవడం గ్యారంటీ. కానీ దర్శకుడు చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు.(ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్)సినిమా మొదలైన ఐదు నిమిషాలకే కథలో కాన్ ఫ్లిక్ట్ పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి తొలి 45 నిమిషాల పాటు శవం చుట్టూ జరిగే కామెడీ తెగ నవ్విస్తుంది. ఆ తర్వాత మాత్రం చాలాచోట్ల సాగతీతగా అనిపిస్తుంది. మళ్లీ చివరకొచ్చేసరికి క్లైమాక్స్ సర్ ప్రైజ్ చేస్తుంది.శవంతో కామెడీ చేయడం ఏంట్రా బాబు అనుకుంటే మాత్రం సినిమా అస్సలు చూడకండి. ఎందుకంటే ప్రతి సీన్ బూతులానే అనిపిస్తుంది. అడల్ట్ కామెడీ సినిమాలంటే ఇష్టముంటేనే దీన్ని చూడండి. లేదంటే మాత్రం ఒంటరిగా చూసేందుకు ప్రయత్నించండి. ఫ్యామిలీతో చూశారా మీరు బుక్ అయిపోతారు.ఎవరెలా చేశారు?పెద్దాయన కొడుకులుగా చేసిన వైభవ్, సునీల్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఏ మాత్రం ఎక్కువ చేయకుండా కామెడీ భలే పండించారు. వీరికి తోడు భార్యలుగా నటించిన నిహారిక, చాందిని ఆకట్టుకున్నారు. రెడిన్ కింగ్ స్లీ, వీటీవీ గణేశ్ తదితరులు కూడా నవ్వించారు. మిగిలిన పాత్రధారులు కూడా జీవించేశారనే చెప్పాలి.సినిమా టెక్నికల్ గా భలే తీశారు. ఎందుకంటే రెండు గంటల సినిమాలో దాదాపు సీన్లన్నీ ఒక ఇంటిలో పెద్దాయన శవంతోనే ఉంటాయి. కానీ బోర్ కొట్టిన సందర్భాలు చాలా తక్కువ. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చివరకు డైరెక్షన్ గురించి చెప్పాలి. ఇళంగో రామ్.. బూతులా అనిపించే విషయాన్ని చాలా చాకచక్యంగా తీశాడు. మరి వీకెండ్ ఏదైనా డిఫరెంట్ గా ఉండే కామెడీ సినిమా చూద్దామనుకుంటే 'పెరుసు' ట్రై చేయండి. కాకపోతే ఒంటరిగానే చూడండి.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ))

గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
తింటూ కూర్చుంటే కొండలైనా కరుగుతాయంటారు. తింటేనే కాదు.. అందరికీ పంచిపెడుతూ కూర్చుంటే కూడా చివరికి చేతిలో ఏవీ మిగలకుండా పోతాయి. ఈ స్టార్ కమెడియన్ విషయంలోనూ ఇదే జరిగింది. అటు దానాలు, ఇటు భర్త చేసిన జల్సాలతో డబ్బంతా పోయి రోడ్డునపడింది. ఆమె మరెవరో కాదు.. ఆన్‌స్క్రీన్‌పై నవ్వులు పూయించే గిరిజ.పెళ్లితో కష్టాలుతరాలు తరబడి కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించింది గిరిజ (Girija). అడిగినవారికి కాదనకుండా సాయం చేసేది. పెళ్లి అనే నిర్ణయంతో ఆమె జీవితమే తలకిందులైంది. జల్సాగా తిరిగే భర్త ఆస్తిని కర్పూరంలా కరిగించేశాడు. తాగిన మైకంలో ఆమెపై చేయి చేసుకునేవాడు కూడా! ఓసారి చేతికందిన వస్తువుతో కొట్టడంతో ఆమె తలకు పద్నాలుగు కుట్లు పడ్డాయి.ఆత్మాభిమానం చంపుకుని..ఖర్చు చేయడానికి ఏమీ మిగల్లేదన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తర్వాత అప్పులపాలైన గిరిజ విశాలవంతమైన ఇల్లు వదిలేసి చిన్న గదికి షిఫ్ట్ అయింది. చివరి రోజుల్లో తన ఆత్మాభిమానాన్ని చంపుకుని డబ్బు కోసం చేయి చాచి అర్థించింది. అనాథగా బస్టాప్‌లో తనువు చాలించింది. ఆమె మలి జీవితంలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంది ప్రముఖ నటి వై.విజయ (Y Vijaya).అలాంటి పరిస్థితి..తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. గిరిజగారు సొంత ఖర్చులతో ఆర్టిస్టులను, స్నేహితులను కలకత్తాలో దేవీపూజకు తీసుకువెళ్లి వచ్చేవారు. అంత పెద్ద, మంచి నటి తర్వాత దయనీయ స్థితిలో బతుకు సాగించారు. చెన్నైలో మా ఇంటికి వచ్చి రూ.50, రూ.100 అడిగేవారు. వాళ్ల అమ్మ వచ్చి.. చీరలేమైనా ఉంటే ఇవ్వండి అని అడిగేవారు. ఎన్నో దానధర్మాలు చేసిన ఆర్టిస్టులు చివరి క్షణాల్లో ఆర్థికంగా చితికిపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని చెప్తూ విజయ భావోద్వేగానికి లోనైంది.సినిమావై. విజయ.. పద్నాలుగేళ్లవయసులో సినీరంగంలో ప్రవేశించింది. నిండు హృదయాలు సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. విచిత్ర బంధం, గంగ మంగ, మయూరి, ముద్దుల కృష్ణయ్య, నువ్వు వస్తావని, రాజా, బడ్జెట్ పద్మనాభం, ఛత్రపతి, అమ్మోరు, ఎఫ్ 2, ఎఫ్ 3.. ఇలా పలు సినిమాల్లో నటించింది.చదవండి: అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వెళ్లిపోతానంటూ..
న్యూస్ పాడ్‌కాస్ట్

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు
క్రీడలు

RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో సెంచరీ
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విరాట్.. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి భారత్ మరియు ఆసియా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా చూసినా డేవిడ్ వార్నర్ మాత్రమే విరాట్ కంటే ముందు టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. వార్నర్ 400 టీ20 మ్యాచ్‌ల్లో 108 హాఫ్ సెంచరీలు చేయగా.. విరాట్ తన 388వ టీ20 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో విరాట్ 388 ఇన్నింగ్స్‌లు ఆడి 9 సెంచరీలు, 100 హాఫ్ సెంచరీల సాయంతో 13100 పైచిలుకు పరుగులు చేశాడు.THE HISTORIC MOMENT - 100 FIFTIES FOR KING KOHLI IN T20 HISTORY 🎯 pic.twitter.com/e4uvnxh0Vd— Johns. (@CricCrazyJohns) April 13, 2025టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన టాప్-5 ప్లేయర్లువార్నర్- 108విరాట్- 100బాబర్ ఆజమ్- 90గేల్- 88బట్లర్- 86కాగా, రాయల్స్‌తో మ్యాచ్‌లో విరాట్ రికార్డు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. విరాట్ హాఫ్ సెంచరీల సెంచరీని విరాట్ సిక్సర్‌తో అందుకోవడం విశేషం. ప్రస్తుత సీజన్లో విరాట్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ సీజన్లో విరాట్ 6 మ్యాచ్‌ల్లో 62 సగటున, 143.35 స్ట్రయిక్ రేట్‌తో 248 పరుగులు చేశాడు. 6 మ్యాచ్‌ల్లో 349 పరుగులు చేసిన పూరన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.

ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ విజయం
IPL 2025 MI vs DC Live Updates: ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి.ముంబై ఇండియన్స్ విజయంఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కరుణ్ నాయర్(40 బంతుల్లో 12 ఫోర్లు,5 సిక్స్‌లతో 89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అభిషేక్ పోరెల్(33) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో కరణ్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ రెండు , బుమ్రా, చాహర్ తలా వికెట్ సాధించారు. ఢిల్లీ రెండో వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన పోరెల్.. కరుణ్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.కరుణ్ నాయర్ ఫిప్టీ..ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను నాయర్ అందుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.క్రీజులో కరుణ్ నాయర్(50), అభిషేక్ పోరెల్(16) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న కరుణ్ నాయర్..5 ఓవర్లు మగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో కరుణ్ నాయర్(32), అభిషేక్ పోరెల్(16) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.చెలరేగిన ముంబై బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(59) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(41), సూర్యకుమార్(40), నమాన్ ధీర్(38) పరుగులతో రాణించారు.ఔటైన సూర్య, హార్దిక్ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 40 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(2) విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న తిలక్, సూర్య13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(40), తిలక్ వర్మ(30) ఉన్నారు.ముంబై రెండో వికెట్ డౌన్. ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన రికెల్టన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(4), సూర్యకుమార్ యాదవ్(14) ఉన్నారు.ముంబై తొలి వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న ముంబై..3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(16), ర్యాన్ రికెల్టన్(22) ఉన్నారు.ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ స్టార్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

రికార్డు అర్ద శతకంతో సత్తా చాటిన విరాట్.. రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టీ20 కెరీర్లో 100 హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. రాయల్స్ అదే ఏడో స్థానంలో కొనసాగుతుంది.

భువనేశ్వర్ కుమార్ 'ట్రిపుల్' సెంచరీ
టీమిండియా వెటరన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. 300 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత్ పేసర్‌గా భువనేశ్వర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2025లో ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్బంగా భువీ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.భువనేశ్వర్ 2009 ఛాంపియన్స్ లీగ్‌లో ఆర్సీబీ తరపునే టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2011లో పూణే వారియర్స్ తరపున ఐపీఎల్ డెబ్యూ చేశాడు. ఆ తర్వాత ఈ యూపీ ఫాస్ట్ బౌలర్ 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చేరాడు. పదేళ్లపాటు ఎస్ఆర్హెచ్కు అతడు ప్రాతినిథ్యం వహించాడు.ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ భువనేశ్వర్‌ను విడిచిపెట్టడంతో ఆర్సీబీలో చేరాడు. రూ. 10.75 కోట్ల భారీ ధరకు అతడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో భువనేశ్వర్ ఫర్వాలేదన్పిస్తున్నాడు. ఇప్పటివరకు 300 టీ20లు ఆడిన భువనేశ్వర్.. తన ఖాతాలో 316 వికెట్లు ఉన్నాయి. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భువనేశ్వర్ తర్వాత హార్దిక్ పాండ్యా(291) ఉన్నాడు.అత్యధిక టీ20లు ఆడిన భారత పేసర్లు వీరే..భువనేశ్వర్ కుమార్- 300హార్దిక్ పాండ్యా- 291జస్ప్రీత్ బుమ్రా- 234హర్షల్ పటేల్- 204సందీప్ శర్మ- 201
బిజినెస్

డిస్క్ బ్రేక్‌తో స్ల్పెండర్ ప్లస్
ప్రముఖ టూవీలర్ విక్రయ సంస్థ హీరో స్ల్పెండర్ ప్లస్ మోడల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఈ బైక్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వెసులుబాటును అందిస్తున్నట్లు పేర్కొంది. ఇది బైక్ భద్రత, బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పింది. ఈ ఫీచర్ స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ వేరియంట్లో తీసుకురాబోతున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇందులో ఫుల్ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వస్తాయని చెప్పాయి.ఇదీ చదవండి: కొత్తగా 34 బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభంపట్టణ రవాణా పరిస్థితుల్లో డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఎంతో అవసరమని భావించి ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. బైక్‌లో మెరుగైన బ్రేకింగ్ నియంత్రణ కోసం 240 మిమీ ఫ్రంట్ డిస్క్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. వెనుక భాగంలో ప్రస్తుతం ఉన్నట్లుగానే డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుందని తెలిపారు. ఈ బైక్ 97.2 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8.02 పీఎస్, 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ వేరియంట్ ధర రూ.83,461 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

మారుతున్న ట్రెండ్.. 2025లో ఆ కార్లకే డిమాండ్!
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో చాలామంది సొంతంగా వాహనం కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే కార్ల కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025 మొదటి త్రైమాసికంలో కార్ల అమ్మకాలకు సంబంధించిన డేటాను యూజ్డ్ కార్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ విడుదల చేసింది.స్పిన్నీ డేటా ప్రకారం.. 2025 మొదటి త్రైమాసికంలో ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్లో గణనీయమైన మార్పులను నివేదించింది. అమ్మకాలలో 77 శాతం డిజిటల్ లావాదేవీల ద్వారా జరుగుతున్నాయి. మహిళా కొనుగోలుదారుల సంఖ్య 28 శాతం పెరిగింది. మొదటిసారి కారు కొనుగోలు చేసినవారు 74 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిక్ కార్ల అమ్మకాలు 29 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలు, పూణేలలో కార్ల కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా బ్రాండ్ కార్లను అధికంగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారని నివేదిక ద్వారా తెలుస్తోంది. తెలుపు, బూడిద, ఎరుపు రంగు కార్లకే డిమాండ్ ఎక్కువని స్పిన్నీ స్పష్టం చేసింది.డిజిటల్ లావాదేవీలు 2023లో 70 శాతం, 2024లో 75 శాతం ఉండగా 2025 మొదటి త్రైమాసికంలో 77 శాతానికి చేరింది. 25 నుంచి 30 ఏళ్ల వయసున్న వారిలో 57 శాతం మంది లోన్ ద్వారానే కార్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. మహిళా కొనుగోలుదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2024లో 26 శాతం మంది మహిళా కొనుగోలుదారులు ఉండగా.. 2025 నాటికి వీటి సంఖ్య 28 శాతానికి పెరిగింది.ఇదీ చదవండి: భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఏదంటే..60 శాతం మంది మహిళలు ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌లను ఇష్టపడుతుంటే.. 18 శాతం మంది కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. లోన్ ద్వారా కార్లను కొనుగోలుచేస్తున్న మహిళలు 27 శాతం ఉన్నారని నివేదికలో వెల్లడైంది.రెనాల్ట్ క్విడ్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి వాహనాలు అధిక ప్రజాదరణ పొందుతుండగా.. కాంపాక్ట్ SUVల విభాగంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ ఉన్నాయి. అమ్మకాల్లో 84 శాతం పెట్రోల్ కార్లు, 10 శాతం డీజిల్ కార్లు, 4 శాతం CNG కార్లు, 2 శాతం ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. టాటా నిక్సన్ ఈవీ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ కూడా బాగా అభివృద్ధి చెందితోంది. అంటే కొనుగోలుదారుల్లో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

పెట్స్‌కు ఫోన్ చేయండి.. కుక్కల భాష తెలుసుకోండి!
పెంపుడు జంతువులపై ప్రేమతో వాటికి కావాల్సిన వస్తువులు, దుస్తులు, బొమ్మలు ఇలా చాలానే కొంటుంటారు. కాని, ఇప్పుడు ఆ జంతువులకు, వాటి యజమానులకు ఎంతగానో ఉపయోగపడే అత్యాధునిక గాడ్జెట్స్ మీ కోసం..పెట్ ఫోన్పెంపుడు జంతువులకు కూడా ఫోన్ చేసి మాట్లాడే వీలు కల్పిస్తుంది ఈ ‘పెట్ ఫోన్’. దీని ద్వారా మీ పెట్స్ ఎక్కడున్నా, ఎప్పుడైనా సరే వాటికి ఫోన్ చేసి టచ్‌లో ఉండొచ్చు. క్లౌడ్ సిమ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్ టూ వే కమ్యూనికేషన్ ఫీచర్‌తో పనిచేస్తుంది. ఇందులోని జీపీఎస్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్ సాయంతో సిగ్నల్ తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ వాటి లొకేషన్‌ను గుర్తించి సమాచారం ఇస్తుంది. ధర రూ. 32,411 మాత్రమే!పెంపుడుజీవాల ఆరోగ్యానికి రక్షణపెంపుడు జంతువుల అనారోగ్యం గుర్తించడంలో ఆలస్యం అయితే, వాటి ప్రాణాలకే ప్రమాదం. వాటి ఆరోగ్యం విషయంలో ఎంతగానో జాగ్రత్త తీసుకోవాలి. పెంపుడు జంతువుల హెల్త్ చెకప్ కోసం తయారు చేసినదే ఈ ‘విజ్డమ్ ప్యానెల్ ప్రీమియం’. ఇది డీఎన్ఏ పరీక్ష కిట్‌తో పాటు, వివిధ పరీక్షల ప్యాకేజింగ్‌తో వస్తుంది. ఈ పరీక్షలతో దాదాపు 211 జన్యు, ఇతర ఆరోగ్య పరిస్థితుల ఫలితాలు, వాటి వివరాలను తెలుసుకోవచ్చు. ధర వివిధ ప్యాకేజీలను బట్టి ఉంటుంది.శునక భాషను అనువదిస్తుంది..శునకాలు మూగజీవులైనప్పటికీ వాటికీ ఓ భాష ఉంటుంది. అవి కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాయి. మనకే అర్థం కావు. తాజాగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కుక్కల భాషను అర్థం చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన ‘పెట్ ట్రాన్స్‌లేటర్’ను అభివృద్ధి చేశారు. ఈ ప్రత్యేకమైన పరికరం కుక్కలు మొరిగే తీరు, అవి చేసే వివిధ శబ్దాల ఆధారంగా అవి చెప్పాలనకున్న విషయాన్ని మనకు తెలిసిన భాషలో వివరిస్తుంది. ధర 220 డాలర్లు. (రూ. 18,817) మాత్రమే!పాటీ క్లీనర్ ప్రేమగా పెంచుకున్నప్పటికీ పెంపుడు జంతువుల విసర్జనను శుభ్రం చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు. అయితే, ‘ఐ రోబో రోంబా జే7’ వాక్యూమ్ ఈ పనిని చాలా చక్కగా చేస్తుంది. సాధారణ రోబో వ్యాక్యూమ్స్ పాటీలను గుర్తించలేవు. కాబట్టి, వాటిని సరిగ్గా శుభ్రం చేయలేవు. కాని, ఈ రోంబా జే7 పెట్ పాటీలను గుర్తించి ప్రత్యేకంగా వాటిని శుభ్రం చేస్తుంది. ధర 799 డాలర్లు (రూ. 68,322). ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది.

40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
ప్రతిఒక్కరి జీవితంలో 40వ దశకం చాలా కీలకమైంది. ఉద్యోగాలు చేస్తున్నవారికైతే అదో ముఖ్యమైన దశ. 40 ఏళ్లు దాటాయంటే ఉద్యోగాల్లో అప్పటికే ఎంతో అనుభవం సంపాదించి ఉంటారు. అధిక జీతభత్యాలు, పదోన్నతులు అందుకునే అత్యంత కీలకమైన దశ అది. అయితే లేఆఫ్స్ విస్తృతమైన నేటి కార్పొరేట్ వాతావరణంలో నలభైలలో ఉన్న ఉద్యోగులే తొలగింపులకు తొలి లక్ష్యంగా మారుతున్నారు.ఈ ధోరణిపై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి కోసం చేసిన అప్పుల ఈఎంఐలు ఇలా సవా లక్ష ఆర్థిక భారాలను నలభైలలోకి అడుగుపెట్టిన ఉద్యోగులు మోస్తున్నారని దేశ్‌పాండే ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతటి సమస్యలతో నెట్టుకొస్తున్న వీరినే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది కుదింపు సందర్భాల్లో మొదట నలభైలలోని ఉద్యోగులనే తొలగించి ఇంటికి పంపిస్తున్నాయని అప్రమత్తం చేశారు.పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, ఈ వయస్సులో ఉద్యోగం కోల్పోవడం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు గురిచేస్తుందని దేశ్ పాండే హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు మూడు కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన అందించారు. కృత్రిమ మేధపై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, పొదుపు ఎక్కువగా చేయాలని, వ్యవస్థాపక మనస్తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. శంతను దేశ్ పాండే వ్యాఖ్యలకు ఆన్లైన్లో మిశ్రమ ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి. చాలా మంది తమ వ్యక్తిగత దృక్పథాలను పంచుకున్నారు.
ఫ్యామిలీ

పాలరాతి శిల్పంలా ఉండే నేహా శెట్టి ఇష్టపడే ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే..!
‘లైఫ్‌లో గోలా ఉండాలి, గోలూ ఉండాలి..’ అన్నట్లు కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా, సరదాగా గడపటం, అందంగా కనిపించడం ముఖ్యం. అందుకే, నటి నేహా శెట్టి ఇంట్లో ఉన్నా, స్టేజ్ మీద ఉన్నా, స్క్రీన్ మీదనైనా ఎప్పుడూ అందంగా కనిపించే ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం ఆమె ఎంచుకున్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ మీ కోసం.. ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయటం ఇష్టం. వాటివల్లే చాలా నేర్చుకున్నా. సడన్‌గా ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాల్సి వచ్చినా కూడా, త్వరగా స్టయిలింగ్ చేసుకొని, అందంగా కనిపిస్తా. నా దగ్గర ఎప్పుడూ వివిధ రకాల ఉంగరాలు, ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉంటాయని అంటోంది నేహా శెట్టి.మహిళ అందాన్ని పెంచడంలో ముందు ఉండే ఆభరణమే ముక్కెర. ఇది ఒకప్పటి ఓల్ట్ ఫ్యాషన్. కాని, ఇప్పుడు ఓల్ట్ ఈజ్ గోల్డ్ అనే రేంజ్లో స్టయిలింగ్‌లో దూసుకొచ్చి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసులనూ దోచేస్తోంది. ట్రెండింగ్ ఆభరణం కావడంతో మార్కెట్లో ఇవి రకరకాల డిజైన్స్, మెటల్స్‌లో లభిస్తున్నాయి. అయితే, వీటిని కొనేటప్పుడు ముక్కుపుడకలో ఉన్న రాళ్లు, వజ్రాలను బాగా పరిశీలించి, ఊడిపోకుండా ఉండే రాళ్ల ముక్కు పుడకలను కొనుక్కోవాలి. ఆ స్టోన్స్ పోతే చూడ్డానికి అస్సలు బాగోదు. కొంతమందికి చిన్న ముక్కు, కొందరికి పెద్ద ముక్కు ఉంటుంది. ముక్కుకు తగ్గ సైజు ముక్కు పుడకను ఎంచుకోవాలి. ఒకసారి ముక్కుకి పెట్టుకొని అది మీకు నప్పుతుందా లేదా అని చూసుకొని తీసుకోవటం మంచిది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రెస్డ్ నోస్ రింగ్స్దే. ఇది ముక్కు కుట్టించుకోని వారు కూడా ధరించి మురిసిపోతున్నారు. పైన చూపించిన నటి నేహా శెట్టిలా. ఇక ఇక్కడ నేహా ధరించిన జ్యూలరీ.. ఇయర్ రింగ్స్ బ్రాండ్: సంస్కృతి సిల్వర్ ధర: రూ. 8,600, ఉంగరం బ్రాండ్: తంత్ర బ్రాస్ జ్యూలరీ ధర: రూ. 450, కాగా, చీర బ్రాండ్: సురుమయే ధర: రూ. 22,000/- (చదవండి: నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!)

న్యూ కెరీర్ ఎక్స్‌ప్రెస్.. సూపర్ బోగీలెన్నో..!
రొటీన్స్ కోర్సులు.. రొడ్డకొట్టుడు చదువులు..వీటితోనే భవిష్యత్తుకు భరోసా అనేది ఓ అపోహ! ఇంజినీరింగ్, మెడిసిన్స్, మేనేజ్మెంట్ కోర్సులతోనే..కెరీర్ అద్భుతంగా ఉంటుందనేది ఓ భ్రమ! మరి అవికాక, ఈ పోటీ ప్రపంచంలో బతకనేర్పే విద్యలేవీ లేవా? ఆసక్తికి, ఆదరణకు తులతూగే కోర్సులే లేవా? అంటే..కొత్తకొత్త కోర్సులు చాలానే కనిపిస్తున్నాయి. విద్యార్థులను తమవైన రంగాల్నిఎంచుకోమంటూ ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, అకాడమీలు, ప్రైవేట్ సంస్థలు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాయి. దేశ విదేశాల్లో చక్కని ఉపాధి అవకాశాలనూ అందిస్తున్నాయి. అలాంటి కొన్ని అరుదైన కోర్సుల గురించే ఈ ప్రత్యేక కథనం.. ఎథికల్ హ్యాకింగ్సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎథికల్ హ్యాకింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఎథికల్ హ్యాకింగ్ కోర్సులకు నిర్దిష్టమైన అర్హతలు లేనప్పటికీ, కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై అవగాహన ఉండాలి. కొన్ని కోర్సులకు 12వ తరగతి ఉత్తీర్ణత లేదా డిగ్రీ అవసరం కావచ్చు. సైబర్ సెక్యూరిటీలో ఆసక్తి, నేర్చుకోవాలనే తపన రెండూ ముఖ్యమే. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి ఇన్ఫర్మేషన్స్ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ కన్సల్టెంట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. కోర్సును ఎంచుకునే ముందు సంస్థ గుర్తింపు, కోర్సు సిలబస్, ఫీజుల వివరాలు సరిచూసుకోవడం ఉత్తమం. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు లభిస్తాయి. యాక్టే టెక్నాలజీస్ అనే ఐటీ శిక్షణ సంస్థ ఎథికల్ హ్యాకింగ్‌పై మాతృభాషలోనే కోర్సులను అందిస్తోంది.పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ ఇది మానవ సమాజంలో శాంతిని నెలకొల్పడానికి, సంఘర్షణలను తగ్గించడానికి, పరిష్కరించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, అవగాహనను అందించే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్ మొదలైన అంతర్జాతీయ సంస్థలలో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటి ప్రభుత్వ సంస్థలలో పని చేయొచ్చు. ఈ కోర్సులో జాయిన్ కావడానికి ఇంగ్లిష్‌పై పట్టుతో పాటు సాంఘిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యం ఇస్తుంటాయి.హోరాలజీఇది కాలగమనానికీ, గడియారాల తయారీకి సంబంధించిన శాస్త్రం. ఈ కోర్సులను అందించే సంస్థలను బట్టి అర్హతలు మారతాయి. సాధారణంగా 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది. కొన్ని సంస్థలు సైన్స్ స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మరికొన్ని సంస్థలు ప్రవేశ పరీక్షలు నిర్వహించి, కోర్సులో జాయిన్ చేసుకుంటాయి. పలు సాంకేతిక విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలు దీనికి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. ఈ రంగంలో ప్రత్యేకమైన డిగ్రీ కోర్సులు లేవు. అయితే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు హోరాలజీలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.ఎథ్నోబోటనీమానవులు, మొక్కల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. ఇది బోటనీ, ఆంత్రొపాలజీల సమ్మేళనం. ఇందులో ఔషధ విలువలు, ఆహార విలువలు, సాంకేతిక ఉపయోగాలు మొదలైన అంశాలను విశ్లేషిస్తారు. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, బోటనీ, ఫార్మసీ, ఆయుర్వేదం, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు సోషల్ సైన్సెస్, ఆంత్రొపాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తున్నాయి.ఏనిమల్ బిహేవియర్ అండ్ సైకాలజీజంతువుల మనస్తత్వానికి, వాటి భావోద్వేగాలకు చెందిన శాస్త్రం ఇది. దీనిలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, జువాలజీ, సైకాలజీ లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు వెటర్నరీ సైన్స్ ్స, బయాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తున్నాయి.ఫైర్ ఇంజినీరింగ్ఇది అగ్ని ప్రమాదాలను నివారించడం, వాటిని ఎదుర్కోవడం, ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించే కోర్సు. దీనిలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బి.ఈ/బీటెక్), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్.ఈ/ఎమ్‌టెక్) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అనుమతిస్తాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.డెయిరీ హెర్డ్ మేనేజ్మెంట్ఇది పాడి పశువుల నిర్వహణకు సంబంధించిన కోర్సు. ఇందులో పాడి పశువుల పెంపకం, పోషణ, ఆరోగ్యం, పాల ఉత్పత్తి, మార్కెటింగ్, నిర్వహణ వంటి అంశాలను నేర్పిస్తారు. డెయిరీ హెర్డ్ మేనేజ్మెంట్లో సాధారణంగా డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు వెటర్నరీ సైన్స్ ్స, యానిమల్ సైన్స్ ్స లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.ప్రాప్ మేకింగ్ ఇది సినిమా, థియేటర్, టెలివిజన్, ఈవెంట్స్, ప్రకటనలు మొదలైన వాటి కోసం ప్రత్యేకమైన వస్తువులను (ప్రాప్స్) తయారు చేయడానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కోర్సు. సినిమాల్లోను నటీనటులు రకరకాల వస్తువులను ఉపయోగిస్తుంటారు. సన్నివేశాల్లోనూ రకరకాల వస్తువులు అలంకరణలు ఉంటాయి. వీటిని సినీ పరిభాషలో సెట్ ప్రాపర్టీస్ అంటారు. వీటి తయారీ గురించిన అధ్యయనం. ప్రాప్ మేకింగ్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫైన్స్ ఆర్ట్స్, డిజైన్, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.డెత్ స్టడీస్ ఇది మరణం, మరణ ప్రక్రియ, దుఃఖం, మరణానంతర జీవితం వంటి అంశాలను అధ్యయనం చేసే ఒక ప్రత్యేకమైన కోర్సు. ఇది మరణం గురించి శాస్త్రీయ, మానసిక, సామాజిక, తాత్త్విక కోణాలను పరిశీలిస్తుంది. ఇది సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఏ/ ఎం.ఎస్.సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ, రెలిజియస్ స్టడీస్ లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు మెడికల్, నర్సింగ్, సోషల్ వర్క్ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తాయి.ట్రీ క్లైంబింగ్ఇది చెట్లు ఎక్కడం, వాటిని నిర్వహించడం, రక్షించడం వంటి నైపుణ్యాలను నేర్పించే ఒక ప్రత్యేకమైన కోర్సు. ఇది అటవీ నిర్వహణ, అర్బోరికల్చర్, వన్యప్రాణుల పరిశోధన వంటి రంగాలలో ఉపయోగపడుతుంది. ట్రీ క్లైంబింగ్ కోర్సులలో సాధారణంగా సర్టిఫికెట్, డిప్లొమా స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. కొన్ని కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత, మరికొన్ని కోర్సులకు 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని సంస్థలు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అడుగుతాయి. కొన్ని ప్రైవేట్ అడ్వెంచర్ స్కూల్స్, సంస్థలు కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.పోలార్ లాఈ కోర్స్‌లో ధ్రువప్రాంతాల చట్టాల గురించిన అధ్యయనం చేయవచ్చు. పోలార్ లా అనేది ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలకు సంబంధించిన చట్టాలు, ఒప్పందాలు, నిబంధనలను అధ్యయనం చేసే ఒక ప్రత్యేకమైన న్యాయ విభాగం. ఇది అంతర్జాతీయ చట్టం, పర్యావరణ చట్టం, సముద్ర చట్టం, మానవ హక్కుల చట్టం వంటి వివిధ రంగాలను కలుపుతుంది. పోలార్ లాలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎల్ఎల్ఎమ్), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, లా (ఎల్ఎల్బీ) లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. పీహెచ్డీ చేయడానికి, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు సంబంధిత పని అనుభవం ఉన్న విద్యార్థులను కూడా అనుమతిస్తాయి.పారాసైకాలజీపారాసైకాలజీ అనేది మానసిక శక్తులు, అతీంద్రియ అనుభవాలు వంటి వాటిని అధ్యయనం చేసే కోర్సు. ఇందులో టెలిపతీ, క్లేర్వోయన్స్ ్స, ప్రీకాగ్నిషన్, సైకోకైనెసిస్, పునర్జన్మ వంటి అంశాలను విశ్లేషిస్తారు. పారాసైకాలజీలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఏ/ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సైకాలజీ, ఫిలాసఫీ, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫిజిక్స్, బయాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తాయి. పీహెచ్డీ చేయడానికి, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.జెరంటాలజీ ఇది వృద్ధాప్య ప్రక్రియను, వృద్ధులను అధ్యయనం చేసే శాస్త్రం. దీనికి జీవశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి వివిధ రంగాలతో సంబంధం ఉంటుంది. వృద్ధుల జీవితాలను ఎలా మెరుగుపరచవచ్చో అధ్యయనం చేస్తుంది. కోర్సు స్థాయిని బట్టి, అర్హతలు మారుతుంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీకి దరఖాస్తు చేయడానికి, విద్యార్థులు సాధారణంగా డిప్లొమా లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు జీవశాస్త్రం, మనస్తత్త్వశాస్త్రం, సాంఘిక శాస్త్రం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.స్టాండప్ కామెడీస్టాండప్ కామెడీ అనేది ఒక ప్రత్యేకమైన కళ, దీనికి అధికారిక విద్యార్హతలు అవసరం లేదు. ఇది ఎక్కువగా ప్రాక్టీస్, అనుభవంతో నేర్చుకునే కళ. అయినప్పటికీ, కొన్ని సంస్థలు స్టాండప్ కామెడీకి సంబంధించిన కోర్సులు, వర్క్‌షాప్‌లు అందిస్తున్నాయి. స్టాండప్ కామెడీ కోర్సులకు సాధారణంగా అధికారిక విద్యార్హతలు అవసరం లేదు. కొన్ని సంస్థలు, వర్క్‌షాప్‌లు 18 సంవత్సరాలు నిండిన వారిని అనుమతిస్తాయి. మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్, హాస్య చతురత, స్టేజ్ ఫియర్ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే ఈ కోర్సుకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఆన్స్ లైన్స్ వేదికలు కూడా స్టాండప్ కామెడీ కోర్సులు అందిస్తున్నాయి.పప్పెట్ ఆర్ట్ ఇది ఒక ప్రత్యేకమైన కళ, దీనికి గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. ఈ కోర్స్ తోలుబొమ్మల కళపై అధ్యయనం. పప్పెట్ ఆర్ట్‌లో సాధారణంగా డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎఫ్ఏ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎఫ్ఏ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫైన్స్ ఆర్ట్స్, థియేటర్ ఆర్ట్స్, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.విటికల్చర్ ఇది ద్రాక్ష సాగు శాస్త్రం. ఇందులో ద్రాక్ష రకాలు, నేల, వాతావరణం, సాగు పద్ధతులు, తెగుళ్ళు, వ్యాధుల నిర్వహణ వంటి అంశాలు ఉంటాయి. విటికల్చరిస్టులు నాణ్యమైన ద్రాక్షను ఉత్పత్తి చేయడానికి ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేస్తారు. ఈనాలజీ–ఇది వైన్ తయారీ శాస్త్రం. ఇందులో ద్రాక్ష రసాలను వైన్స్ గా మార్చే ప్రక్రియ, కిణ్వన ప్రక్రియ, వైన్ నాణ్యతను అంచనా వేయడం వంటి అంశాలు ఉంటాయి. ఈనాలజిస్టులు వివిధ రకాల వైన్లను తయారు చేయడానికి, వాటి నాణ్యతను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని సంస్థలు సైన్స్ ్స స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. కొన్ని సంస్థలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాయి. కొన్ని సర్టిఫికెట్ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. బ్రూవింగ్ అండ్ డిస్టిలింగ్ఆల్కహాల్ ఉత్పత్తి ప్రక్రియలు, నిర్వహణ గురించి ఈ కోర్సులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తాయి. బీర్, వైన్, స్పిరిట్స్, ఇతర ఆల్కహాలిక్ పానీయాల తయారీలో ఉపయోగించే సాంకేతికతలు, పదార్థాలు గురించి అవగాహన కల్పిస్తాయి. ఈ కోర్సులో చేరడానికి సైన్స్ ్స స్ట్రీమ్‌లో 10+2 విద్యార్హత కలిగి ఉండాలి. కొన్ని సంస్థలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కూడా ప్రవేశం ఉంటుంది. కొన్ని ప్రత్యేక కోర్సులకు రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ వంటి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ ఉండాలి. ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి కొన్ని కళాశాలల్లో సీటు లభిస్తుంది.బేకింగ్ సైన్స్ ్స అండ్ టెక్నాలజీఇది ఆహార శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం కలయికతో కూడిన ఒక ప్రత్యేకమైన కోర్సు. పాకకళలో బేకింగ్ చాలా పురాతన ప్రక్రియ. ఓవెన్లలో రొట్టెలు, బిస్కట్లు, కేకులు వంటివి తయారు చేసే పద్ధతులు, ఈ ప్రక్రియలో నవీన సాంకేతికల గురించిన అధ్యయనం ఇది. ఇందులో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని వర్సిటీలు హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ వంటి అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి. ఇంటర్నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాంపస్‌లలో ఈ కోర్సులు లభిస్తాయి.ఇవే కాదు, మాంటిస్సోరీ టీచర్స్ ట్రైనింగ్ కోర్స్, లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ వంటి పలు కోర్స్‌లు ఆసక్తిగల విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజెస్, ఎన్విరాన్మెంట్ సైన్స్‌లో కూడా కొత్త ధోరణులు మొదలయ్యాయి. ఏది ఏమైనా ప్రేరణ, ప్రక్షాళన లేనిదే ఏ ప్రయాణం విజయవంతం కాదు. భవిష్యత్తు నిర్దేశానికి అవే అసలైన వారధులు. నిజానికి ఇలాంటి ఎన్నో రంగాలు విద్యావ్యవస్థల్లో పట్టభద్రులను చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆసక్తిని బట్టి అడుగులు వేయడమే ఆలస్యం.

సేమ్యా ఐస్... ఆరంజీ సోడా...
వేసవి అలాగే ఉంది.. సూరిబాబు కూడా ఏం మార్లేదు.కాని రోజులే మారిపోయాయి. అలనాటి వేసవికి ఇప్పటి వేసవికి సేమ్యా ఐస్‌కు క్రీమ్ స్టోన్ కు ఉన్నంత తేడా ఉంది. ఊళ్లకు వెళ్లడం బంధువుల పిల్లలతో గడపడం ఇప్పుడు ఏడ? పరీక్ష... పరీక్ష తర్వాత ఎంట్రన్స్... లేదా బ్రిడ్జ్ కోర్స్... కాకుంటే స్పెషల్ ఇంగ్లిష్... ఓహ్.. అలా చూడండి సీమచింత గుబ్బలు గుర్తు చేసుకోండి. మీ పిల్లలకు వేసవి హక్కులు ఇవ్వండి. వారి రాజ్యాంగాన్ని పరిరక్షించండి!సెలవులొచ్చాయంటే పరీక్షలు అయిపోయినట్టు. లేదా పరీక్షలైపోయాయంటే సెలవులొచ్చినట్టు. సరిగా చెప్పాలంటే ఏప్రిల్, మే నెలలు వచ్చాయంటే పిల్లలకు పండుగ వచ్చినట్టు. ఆ నెలలు వారివి. ఆ నెలలకు రాజులు వారు. ఆ నెలలు వారికి ఆహ్లాదం పంచేందుకు వచ్చేవి. ఆటలు నేర్పేందుకు వచ్చేవి. సరదాలు తీర్చేందుకు వచ్చేవి. బస్సెక్కి వస్తావో రైలెక్కి వస్తావో అని... ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేందుకు, వెళ్లి ఉండేందుకు ఆ నెలలు వచ్చేవి.వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లల కోసం జ్ఞాపకాలు తెచ్చాయని అర్థం. కాని ఇవాళ? సెలవులైన వెంటనే ఐఐటి ఫౌండేషన్ అంటున్నారు. పై క్లాసులకు బ్రిడ్జ్ కోర్స్ అంటున్నారు. స్పెషల్ ఇంగ్లిష్ క్లాసుల్లో పెడుతున్నారు. ఎప్పుడో రాబోయే పరీక్షలకు ఇప్పటినుంచే ప్రిపేర్ చేయిస్తున్నారు. పరీక్షలు అయిపోయినా పరీక్షల బాధ తప్పడం లేదు. ఇలా బాధిస్తున్న తల్లిదండ్రులందరూ ఒకప్పుడు వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేసిన వారే. వారికి దక్కింది పిల్లలకు కూడా దక్కాలని ఎందుకు కోరుకోవడం లేదు?ఏ ఊరికి వెళుతున్నారు? పరీక్షలు మొదలైనప్పటి నుంచి పరీక్షలయ్యాక ఏ ఊరికి వెళ్లబోతున్నారో పిల్లలకు తెలిసేది. బాబాయి ఊరా? మేనత్త ఊరా? అమ్మమ్మ ఊరా? ఏ ఊరు వెళితే ఎవరు తోడుంటారు... వారితో ఎలాంటి ఆటలు ఆడొచ్చు. ఎగ్జయిట్‌మెంట్‌తో నిద్ర పట్టేది కాదు. పరీక్షలు ఎంత త్వరగా అవుతాయా అని ఎదురు చూపులు. నాన్న పర్మిషన్ దొరికితే అమ్మతోపాటు చలో ఊరు. వేసవి సెలవుల్లో ఊళ్లకు ఎందుకు వెళతారంటే వచ్చాక ఫ్రెండ్స్‌కు గొప్పలు చెప్పుకోవాలి గదా మరి. మేం వెళ్లిన ఊళ్లో ఎన్ని సినిమా హాళ్లు ఉన్నాయో తెలుసా? సెకండ్ షోలకు ఎలా వెళ్లామో తెలుసా? ఏం తిన్నాం ఏం తాగాం... ఏ స్టిక్కర్లు కొనుక్కున్నాం... ఎన్ని గోలీలు సేకరించాం... క్రికెట్ ఆడితే బంతి ఎన్నిసార్లు కనపడనంత దూరం వెళ్లి మాయమైంది... పొలాలు చూడటం... తాటి ముంజలు తినడం... సముద్ర స్నానంలో జేబుల్లో నిండిన ఇసుక... నది ఒడ్డున జలకాలాట... ఎడ్లబండి సవారీ... ఆరుబయట పక్కలేసుకుని నిద్ర.... ఎన్నని! వింటున్న స్నేహితులు కుళ్లుకుంటే ఆనందం. కాని నేడు? వేసవి సెలవుల్లో పిల్లల్ని ఇల్లు కదలనీకుండా చేయడం వల్ల తెల్లమొహాలేసుకుని తర్వాతి క్లాసుకు వెళుతున్నారంతే.మేసే నోళ్లు... సీజన్ చిరుతిళ్లుప్రతి సీజన్‌కు చిరుతిళ్లు ఉంటాయి. వేసవి చిరుతిళ్లు మాత్రం పిల్లల కోసమే తయారవుతాయి. ఐస్‌బండ్లు గంట గణగణలాడిస్తూ ఊళ్లలో తిరుగుతాయి. ఆరంజ్ ఐస్, ద్రాక్షా ఐస్, బాదం ఐస్, పాల ఐస్, సేమ్యా ఐస్.... ఐస్ చప్పరించడం కూడా కళే. విరిగి కింద పడకుండా పుల్ల మిగిలేలా ఐస్ తిన్నవాడే మొనగాడు. ఇవిగాక ముద్ద ఐస్. అంటే ఐస్ గోలా. ఐస్‌ను పిండి పిండి చేసి ఒక పుల్లకు ముద్దలా అదిమి దాని మీద రంగు రంగుల ఎసెన్స్ పోసి ఇస్తారు. ఈ ముద్ద ఐస్‌ను జుర్రుకుంటూ ఉంటే నా సామిరంగా. ఇవేనా? ఐస్‌సోడా... సుగంధ... మసాలా మజ్జిగ.... పుదీనా నీరు... చెరకు రసం... కొబ్బరి నీళ్లు... ప్రతి ఇంట్లో రస్నా కొన్నాళ్లు రాజ్యం ఏలింది.... బెంగళూరు మామిడిని పలుచగా కోసి ఉప్పు కారంతో పాటుగా అమ్ముతారు... వహ్వా... జీడిమామిడి కాయలు అమ్ముతారు... సీమచింత గుబ్బలు అమ్ముతారు.... పిల్లలు బకాసురులవుతారు. సెలవుల్లో ఖర్చు పెట్టడానికి దాచిన మట్టి కుండీలను పగుల గొడతారు.ఆటలో ఆటలురాబోయే విద్యా సంవత్సరానికి సరిపడా శారీరక బలం, దృఢత్వం వేసవిలో పిల్లలకు వస్తుంది. అలాంటి ఆటల డిజైన్ మనకు ఉంది. కుందుడు గుమ్మ, ఒంగుళ్లు దూకుళ్లు, దాగుడుమూతలు, కోతి కొమ్మచ్చి, నేలా మిట్ట, దొంగ పోలీస్, ఐస్బాయ్, గోలీలాట, బిళ్లంగోడు... ఇవన్నీ శరీరానికి తర్ఫీదు ఇస్తే, కూచుని ఆడే ఆటలు పరమపద సోపానపటం, చుక్కుచుక్కుపుల్ల, పులిజూదం, గవ్వలాట, సీతారాములు... ఇవన్నీ బుద్ధిని పదును పెడతాయి. కొత్త ఊళ్లో కొత్త స్నేహితులవుతారు. మళ్లీ వేసవికి తప్పకుండా రావాలని వీరు మాట తీసుకుంటారు.అనుబంధాల కాలంవేసవి సెలవులొచ్చేది అనుబంధాలు పెనవేయడానికి... బంధాలు నిలబెట్టడానికి. తల్లి తరఫువారు తండ్రి తరుపు వారు ఎవరు ఎవరో పిల్లలకు ఈ సీజన్లో తెలుస్తుంది. వారి పిల్లలు తెలుస్తారు. వీరంతా మనవారన్నమాట అనే భావం వారికి ఆనందం ఇస్తుంది. వారిలో వారు పార్టీలు కట్టుకుంటారు. పెద్దవాళ్లు పిల్లలను దగ్గరకు తీస్తారు. బట్టలు కుట్టిస్తారు. కానుకలు కొనిపెడతారు. ముద్దు చేస్తారు. అమ్మా నాన్న కాకుండా మనల్ని ముద్దు చేసే వారు వేరే ఉన్నారన్న భావన కూడా పిల్లలకు చాలా బాగుంటుంది. కొందరికి మేనత్త నచ్చుతుంది. కొందరు బాబాయికి అంటుకు పోతారు. కొందరు పెదనాన్న పార్టీ. కొందరు పెద్దమ్మలకు ఫ్యాన్స్ అవుతారు. తాతయ్య ఎన్నో కబుర్లు చెబుతాడు. ఆకాశం కింద పక్కలు వేసి నానమ్మ చెప్పే కథలు జీవితాంతం తోడుంటాయి.ఏవీ ఆ నిరుడు కురిసిన హిమ సమూహాలు?ఆలోచించి చూడాలి. పిల్లలు ఏం పొందుతున్నారు. జీవితంలో ఏ జ్ఞాపకాలు దాచుకుంటున్నారు. ఏ బంధాలను బలపరుచుకుంటున్నారు. వారిని ఈ జీవన ధోరణి ఒంటరిని చేస్తూ పోతోందా లేదా తనవాళ్లతో బలపడేలా చేస్తోందా? ఇవాళ పిల్లలు ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రులతో చెప్పుకోలేక ఏ అత్తయ్యకో, బాబాయికో చెప్పుకోవాలనుకుంటే అలాంటి బంధాలను ఈ వేసవిలోనే కదా పాదువేయాలి. పొదువుకునేలా చేయాలి. కజిన్స్ బలం లేకుండా పోయిన పిల్లలు ఎందుకు పెరుగుతున్నారు. పెద్దల మధ్య తగాదాలు పిల్లల మధ్య వరకూ ఎందుకొస్తున్నాయి. మన సొంత మనుషులే లేకపోతే బయట వారు జీవితంలో ఎందుకు తోడు నిలబడతారు? వేసవి ఎండల్ని కాదు. సందేశాలను తీసుకువస్తుంది. వేసవి సెలవులు సంవత్సరం మొత్తానికి అవసరమైన రిపేర్లు చేసుకోమని చెప్పడానికి వస్తుంది. పిల్లలకు హక్కులు వున్నాయి. వేసవి సెలవులు అయినవారితో గడపడం వారి హక్కు. ఆ హక్కును వారికి ఇవ్వండి. వాటిని కోల్పోయేలా చేస్తే వారు పెద్దయ్యాక మనం మరేదో కోల్పోయేలా చేస్తారు.– కె

షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
మెనోపాజ్ గురించి ఎంత మాట్లాడితే అంత అర్థమవుతుంది.. అర్థమైతేనే దాని మేనేజ్మెంట్ తెలుస్తుంది! అందుకే మెనోపాజ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకోవడానికి ముందుకొచ్చారు టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి.. ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా మెనోపాజ్ గురించి మాట్లాడుతూంటే అది చర్చగా మారుతుంది. అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల పట్ల కేర్ పెరుగుతుంది అంటున్నారు...నిజంగా చెప్పాలంటే ఇది నేను ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్న ఫేజ్. మానసికంగా ఇదెంత ప్రభావం చూపుతోందంటే.. కోపం.. బాధ.. దుఃఖం.. ఆవేశం.. ఇలా ఎమోషన్స్ ఏవీ మన కంట్రోల్లో ఉండవు. దేనికి ఎలా రెస్పాండ్ అవుతున్నామో తెలియదు. ఒకరకమైన అలజడి. వణుకు తెప్పిస్తుంది. భయపెడుతుంది. మనల్ని మనమే గుర్తుపట్టలేని పరిస్థితిని కల్పిస్తుంది.గట్టి దెబ్బే కొడుతుంది.. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఈ మూడ్ స్వింగ్స్ వల్ల మనమేం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ సమయంలో మన పనులు డ్యామేజింగ్‌గా కూడా ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తులను హర్ట్ చేయొచ్చు. మన ఈ ప్రవర్తన ఇంట్లో వాళ్లకూ అర్థమవడం కష్టం. ఫ్రెండ్స్‌కి చెప్పుకుందామనుకుంటే.. ఎక్కడి నుంచి .. ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అసలు ఇది షేర్ చేసుకునే విషయమేనా అనే సంశయం. ఇలా అన్నిరకాలుగా ఇది మనల్ని ఒంటరిని చేస్తుంది. మానసికంగా గట్టి దెబ్బే కొడుతుంది.ముందు మనల్ని మనం.. ఈ ఫేజ్‌ను డీల్ చేస్తూ నేను తెలుసుకున్నదేంటంటే.. డైట్, మెడిసిన్ అంతగా హెల్ప్ చేయవని. ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే ఈ మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్నిస్తుందని. అందుకే ఎక్సర్సైజ్, యోగాను లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవాలి. ట్రావెల్ లేదా మనకు నచ్చిన పనితో మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. నేను నేర్చుకున్నది ఇదే! దీన్ని ఫాలో అవుతూ నా ప్రొఫెషనల్ లైఫ్ ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే అదే ఇన్కమ్ సోర్స్ కాబట్టి. అంతేకాదు మన వ్యక్తిగత సమస్యలు వర్క్ ప్లేస్‌లో చర్చకు తావు ఇవ్వకూడదు! ఇంకో విషయం ఏంటంటే.. మన మూడ్‌స్వింగ్స్ నేరుగా ప్రభావం చూపించేది కుటుంబం మీదనే. ఎంత ఇబ్బంది అయినా వర్క్ ప్లేస్‌లో ఒక ఎరుకతో ఉంటాం.. ఉండాలి కూడా! అందుకే ముందు మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్లతో మన పరిస్థితిని వివరించి.. వాళ్ల సపోర్ట్ కూడా తీసుకోవాలి. దీనివల్ల వర్క్ ప్లేస్‌లో డీల్ చేయడమూ తేలికవుతుంది. సందర్భం దొరికినప్పుడు.. ఈ ఫేజ్‌లోని ఆడవాళ్లకు కచ్చితంగా సపోర్ట్ కావాలి. ఆల్రెడీ ఆ ఫేజ్‌ను అధిగమించిన వాళ్లు తమ అనుభవాలను, డీల్ చేసిన తీరును షేర్ చేసుకోవడం వల్ల ఆ ఫేజ్‌లోకి ఎంటర్ అయిన మహిళలు ధైర్యం తెచ్చుకుంటారు. ఈజీగా మేనేజ్ చేయగలమనే భరోసా వస్తుంది. దీనివల్ల సిస్టర్హుడ్ డెవలప్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి సందర్భం, ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన మహిళలు దీనిగురించి మాట్లాడటమో.. తమ అనుభవాన్ని పంచుకోవడమో చేస్తే.. మెనోపాజ్ మీద అందరికీ అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల సమస్యలు, బాధలు అర్థమవుతాయి. ఇంటా, బయటా కూడా సపోర్ట్ అందే ఆస్కారం పెరుగుతుంది. నార్మలైజ్ చేయాలి‘మెనోపాజ్‌ను అనకూడని, వినకూడని మాటలా భావిస్తారు మన సమాజంలో! దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే.. ఎంతగా చర్చిస్తే అంతగా అవగాహన పెరుగుతుంది.. అంత ఎక్కువగా మహిళలకు మద్దతు అందుతుంది. సమాజం మీద సెలబ్రిటీల ప్రభావం ఎక్కువ కాబట్టి ఈ బాధ్యతలోనూ వాళ్లు ముందుండాలి. మెనోపాజ్ గురించి మాట్లాడుతూ దాన్ని నార్మలైజ్ చేయాలి!’– లారా దత్తా, బాలీవుడ్ నటి.– శిరీష చల్లపల్లి
ఫొటోలు


Meenakshi Chaudhary : తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి (ఫోటోలు)


వితిక-వరుణ్ సందేశ్ తిరుమల ట్రిప్ (ఫోటోలు)


Arjun Son of Vyjayanthi : ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 13-20)


SRH vs PBKS : ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)


హైదరాబాద్‌లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర (ఫోటోలు)


చాహల్‌తో డేటింగ్ నిజమేనా? ఆర్జే మహ్వాష్ (ఫోటోలు)


సీరియల్ బ్యూటీ స్రవంతి.. భర్తతో సరదాగా ఇలా (ఫొటోలు)


సూర్య ‘రెట్రో’ మూవీ స్టిల్స్


ఒంటిమిట్ట : కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం (ఫోటోలు)
అంతర్జాతీయం

‘ట్రంప్ సూపర్ విలన్.. మస్క్ సైడ్ విలన్’
ఒట్టావా: అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అధికార పీఠాన్ని అధిష్టించాక, అతను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు మింగుడుపడటం లేదు. ఇదే సందర్భంలో ట్రంప్ కెనడాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా పిలవడంతో కెనెడియన్లు మండిపడుతున్నారు. వారు తమలోని ఆగ్రహాన్ని పలు రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కెనడియన్ సూపర్‌హీరో ‘కెప్టెన్ కెనక్’(కామిక్ బుక్ క్యారెక్టర్) సరికొత్త కామిక్ బుక్ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చాడు.ఈ కామిక్‌లో ట్రంప్‌ను సూపర్ విలన్(Super villain)గా, ఎలాన్ మస్క్‌ను అతని పరమ విధేయునిగా చిత్రీకరించారు. కెప్టెన్ కెనక్ ఈ ఇద్దరి నుంచి కెనడా సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఎదుర్కొనే సన్నివేశాలను కామిక్‌లో ఆకర్షణీయంగా చూపించారు. ఈ కామిక్ కెనడాలో అందరినీ అలరిస్తోంది. ఈ కామిక్లతో కెనాడాలోని బుక్ స్టోర్లు, లైబ్రరీలలోని అరలు నిండిపోతున్నాయి. కెప్టెన్ కెనక్ను 1975లో రిచర్డ్ కోమెలీ సృష్టించాడు. ఈ సూపర్ హీరో కెనడా సార్వభౌమత్వాన్ని, సంస్కృతిని కాపాడే ఒక ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తుంటాడు. అతను ఒక రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆఫీసర్, గ్రహాంతరవాసులతో జరిగిన ఒక సంఘటన కారణంగా అతీంద్రియ శక్తులను పొందుతాడు. కెప్టెన్ కెనక్ ఎరుపు, తెలుపు రంగుల దుస్తులు ధరించి, ఒక మాపుల్ లీఫ్ చిహ్నంతో కనిపిస్తాడు. ఇది కెనడా జాతీయ గుర్తింపును సూచిస్తుంది. 2025లో, కెప్టెన్ కెనక్ 50వ వార్షికోత్సవ సంచికలో.. కెనడాను ట్రంప్, మస్క్ బెదిరింపుల నుంచి కాపాడే సూపర్‌హీరోగా కనిపించాడు. ఈ కామిక్ కెనడియన్ జాతీయవాద భావనను అక్కడి ప్రజలలో మరింత బలపరిచింది. ఈ కామిక్‌లో ట్రంప్‌ను కెనడాపై ఆధిపత్యం చెలాయించాలనే కుట్రలతో రగిలిపోతున్న ఒక సూపర్విలన్గా చిత్రీకరించారు. ఎలాన్ మస్క్‌ను ట్రంప్‌కు విధేయునిగా చూపించారు. ఈ కామిక్‌లోని ఒక సన్నివేశంలో, కెప్టెన్ కెనక్.. ట్రంప్ మస్క్‌లను కాలర్ పట్టుకొని బయటకు లాగుతూ కనిపిస్తాడు. ఇది కెనడియన్ పాఠకులకు అమితమైన ఆనందాన్ని కలిగించిందట.ఈ కామిక్ విజయం తర్వాత కెప్టెన్ కెనక్ కొత్త కామిక్ సిరీస్(Captain Canuck's new comic series)లు, యానిమేటెడ్ సిరీల అమ్మకాలు పెరిగాయి. కెప్టెన్ కెనక్ సృష్టికర్త అయిన రిచర్డ్ కోమెలీ (74) ఈ కామిక్ పునరాగమనం గురించి మాట్లాడుతూ 1970లలో కెనడియన్లు తమకొక ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకున్నారని, ఆ సమయంలోనే కెప్టెన్ కెనక్ను సృష్టించానన్నారు. ఇప్పుడు ట్రంప్ విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో కెనడియన్లు మళ్లీ ఈ హీరోను స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వ్యక్తిగాచూస్తున్నారని అన్నారు.ఇది కూడా చదవండి: 26/11 దాడుల్లో ‘దుబాయ్ వ్యక్తి’? : ఎన్ఐఏ ఆరా

పేరుకు ‘కృత్రిమ మేథ’.. పనిచేసేది మనుషులే.. అమెరికాలో మరో మోసం
న్యూయార్క్: ఇటీవలి కాలంలో విస్తృతంగా వినియోగమవుతున్న కృతిమమేథ(Artificial intelligence) మనిషి ఆలోచనలకు సవాల్ విసురుతోంది. ఇటువంటి తరుణంలో అమెరికాలో ఒక వింత మోసం చోటుచేసుకుని, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫిన్‌టెక్ స్టార్టప్ నిర్వాహకుడు ఆల్బర్ట్ సానిగర్ తన ‘నేట్’ (Nate)షాపింగ్ యాప్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా నడుస్తున్నదని ప్రచారం చేసి, 50 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 420 కోట్లు) పైగా నిధులు సేకరించాడు. అయితే ఈ యాప్ ఫిలిప్పీన్స్‌లోని ఒక కాల్ సెంటర్లోని సిబ్బంది ద్వారా నడుస్తున్నదని విచారణలో తేలింది. ఈ మోసం బయటపడటంతో, సానిగర్పై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్.. సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఆరోపణలు నిజమైతే ఆల్బర్ట్ సానిగర్కు గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.నేట్ యాప్‌ను ఆల్బర్ట్ సానిగర్(Albert Saniger) 2018లో రూపొందించాడు. ఈ యాప్ ఒక యూనివర్సల్ షాపింగ్ కార్డ్‌గా ప్రచారం చేశాడు. దీని ద్వారా యూజర్లు ఎలాంటి ఇ-కామర్స్ సైట్ నుంచైనా ఒకే క్లిక్‌తో దేనినైనా కొనుగోలు చేయవచ్చని తెలిపాడు. ఈ యాప్ ఏఐ టెక్నాలజీ ద్వారా షాపింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుందని, బిల్లింగ్, షిప్పింగ్ వివరాలను దానికదే నిర్వహిస్తుందని సానిగర్ పేర్కొన్నాడు. ఈ యాప్ కోసం ఆయన కోట్యూ, ఫోర్రన్నర్ వెంచర్స్, రెనెగేడ్ పార్టనర్స్ తదితర వంటి పెట్టుబడిదారుల నుంచి 50 మిలియన్ డాలర్లకుపైగా నిధులు సేకరించాడు.అయితే ఈ యాప్‌లో ఏఐ ఆటోమేషన్(Automation) దాదాపు శూన్యం అని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తేల్చింది. యాప్ ద్వారా జరిగే కొనుగోళ్లను ఫిలిప్పీన్స్‌లోని కాల్ సెంటర్‌లోగల వందలాది ‘పర్చేజింగ్ అసిస్టెంట్స్’ నెరవేరుస్తున్నారని తేలింది. ఈ నేపధ్యంలో ఆల్బర్ట్ సానిగర్ ఏఐ టెక్నాలజీ పేరును ఉపయోగించి, తప్పుడు కథనాన్ని సృష్టించాడని డిపార్ట్మెంట్ పేర్కొంది. 2021 హాలిడే షాపింగ్ సీజన్లో యాప్ డిమాండ్‌ను తట్టుకునేందుకు సానిగర్ తన ఇంజనీరింగ్ టీమ్‌ను కొన్ని లావాదేవీలను ఆటోమేట్ చేయడానికి ‘బాట్లు’ అభివృద్ధి చేయాలని ఆదేశించాడు. అయితే ఈ బాట్లు ఏఐ ఆధారితం కాకుండా, మానవ సిబ్బంది ఆధారంగా పనిచేశాయి. ఆల్బర్ట్ సానిగర్ చేసిన మోసం బయటపడటంతో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) అతనిపై సివిల్ కేసు నమోదు చేసింది. అతనిని ఇకపై ఇలాంటి కంపెనీలలో అధికారిగా పనిచేయకుండా నిషేధించాలని కోరింది. అలాగే పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను సానిగర్ తిరిగి వారికి ఇవ్వాలని ఆదేశించింది. ఇదేవిధంగా గతంలో ప్రెస్టో ఆటోమేషన్ అనే కంపెనీ ఏఐ ఆధారిత డ్రైవ్ త్రూ సేవలను అందిస్తామని చెప్పి, ఫిలిప్పీన్స్‌లోని సిబ్బందితో కార్యకలాపాలు సాగించి మోసానికి పాల్పడింది. ఇది కూడా చదవండి: గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన

జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు
మెటా అధినేత మార్క జుకర్‌బర్గ్‌పై ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ విజిల్‌బ్లోయర్(వేగు) సారా విన్ విలియమ్స్ సంచలన ఆరోపణలకు దిగారు. జుకర్‌బర్గ్‌కు అమెరికా ప్రయోజనాల కన్నా డబ్బే ముఖ్యమని, ఈ క్రమంలోనే చైనాతో చేతులు కలిపి తన సొంత దేశం జాతీయ భద్రతా విషయంలో రాజీ పడ్డారని వెల్లడించారామె. సెనేటర్ జోష్ హవ్యూలే నేతృత్వంలోని కౌంటర్‌టెర్రరిజం సబ్ కమిటీ ఎదుట హాజరైన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. సీబీఎస్ కథనం ప్రకారం సారా విన్ వాంగ్మూలంలో.. చైనాలో వ్యాపార ఉనికిని పెంచుకోవడానికే మెటా కంపెనీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. చైనాతో మార్క్ జుకర్‌బర్గ్ చేతులు కలిపారు. అందుకే.. పదే పదే అమెరికా జాతీయ భద్రతా విషయంలో మెటా రాజీ పడుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారామె. మెటా కంపెనీ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్ సెన్సార్షిప్ను టూల్స్‌ను రూపొందించింది. తద్వారా కంటెంట్ విషయంలో నియంత్రణ వాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. తాను స్వేచ్ఛావాదినని, దేశ భక్తుడినని అమెరికా జెండా కప్పేసుకుని ప్రకటించుకునే జుకర్‌బర్గ్.. గత దశాబ్దకాలంగా 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం అక్కడ ఎలా స్థాపించుకోగలిగారు?. ఇది అమెరికన్లను మోసం చేయడమే అని ఆమె అన్నారు. సారా విన్ విలియమ్స్ గతంలో ఫేస్బుక్లో గ్లోబల్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పని చేశారు. ఏడేళ్లపాటు సంస్థలో పని చేసిన ఆమె.. ఈ ఏడాది మార్చిలో కేర్లెస్ పీపుల్ పేరిట ఒక నివేదికను పుస్తకాన్ని విడుదల చేసి తీవ్ర చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ పుస్తంపై మెటా కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిషేధించింది. అయితే బుధవారంనాటి విచారణ సందర్భంగా.. ‘‘ఫేస్బుక్ ఆ పుస్త విషయంలో ఆమెను ఎందుకు నిలువరించాలని అనుకుంటోంది?.. అమెరికన్లకు వాస్తవం తెలియాల్సి ఉంది’’ అని సెనేటర్ జోష్ హవ్యూలే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తమ ఎదట హాజరై వివరణ ఇవ్వాలంటూ గురువారం జుకర్‌బర్గ్‌కు ఆయన ఓ లేఖ రాశారు. వాస్తవాలు బయటపెడితే తనను కోర్టుకు ఈడుస్తామంటూ మెటా బెదిరిస్తోందని సారా విన్ విలియమ్స్ చెబుతుండగా.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమేనని, చైనాలో తమ కార్యకలాపాలు నడవడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
ఇప్పటికే అద్భుతాలకు నెలవైన చైనా త్వరలో ప్రపంచానికి మరో అద్భుతాన్ని చూపించబోతోంది. అదేమిటో తెలిసినవారంతా ఇప్పుటికే చైనా ప్రతిభకు కితాబిస్తున్నారు. చైనానోలోని గుయిజౌ ప్రావిన్స్‌లో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జి(Huajiang Grand Canyon Bridge) జూన్ 25న ఆవిష్కృతం కానుంది. ఇదే ప్రపంచాన్ని అబ్బురపరిచే మరో వండర్. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా సరికొత్త రికార్డు సృష్టించనుంది.చైనా ఈ నూతన వంతెనను.. రెండు మైళ్ల దూరం మేరకు విస్తరించి ఉన్న ఒక భారీ లోయను దాటడానికి నిర్మించింది. ఈ నిర్మాణానికి చైనా సుమారు 216 మిలియన్ పౌండ్లు (₹2200 కోట్లు) వెచ్చించింది. ఇప్పటివరకూ ఈ లోయను వాహనాల్లో దాటేందుకు ఒక గంట సమయం పడుతుండగా, ఈ వంతెన నిర్మాణంతో కేవలం ఒక్క నిముషం(One minute)లో ఈ వెంతెనను దాటేయవచ్చని చైనా చెబుతోంది. ఈ వంతెన ఎత్తు పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు రెట్టింపు ఎత్తును కలిగి ఉంటుంది. China's Huajiang Grand Canyon Bridge is set to open this year, becoming the world's tallest bridge at 2050 feet high. Recent footage of the bridge has been released, showing crews putting on the finishing touches. One of the most insane facts about the bridge is that… pic.twitter.com/DLWuEV2sXQ— Collin Rugg (@CollinRugg) April 8, 2025ఈ వంతెన మీద ఒక గాజు నడక మార్గం ఏర్పాటవుతోంది. ఫలితంగా సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూడగలుగుతారు. ఈ వంతెన నుంచి అత్యంత ఎత్తైన బంజీ జంప్‌ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. ఇది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంతెన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది. ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.ఈ వంతెన చైనాకున్న ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని(Engineering ability) ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప నిర్మాణంగా నిలుస్తుంది. అగాథంలాంటి లోయ మీద, ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఈ వంతెన స్థానికుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది. చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనలను నిర్మించింది. అయితే ఈ కొత్త వంతెన ఈ జాబితాలో మరో మైలురాయిగా నిలిచిపోనుంది.ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే..
జాతీయం

హనుమజ్జయంతి వేడుకల్లో ఉద్రిక్తత
గునా: మధ్యప్రదేశ్‌లోని గునాలో జరిగిన హనుమజ్జయంతి వేడుకల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. హనుమాన్ రథయాత్ర ఉత్సాహంగా సాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గునాలో శనివారం సాయంత్రం 7:30 గంటల సమయంలో హనుమాన్ రథయాత్ర ఒక ప్రార్థనా స్థలం సమీపంలో కొనసాగుతుండగా, రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న పోలీసులు , స్థానిక అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొంది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది భద్రతను కొనసాగిస్తున్నారు. మీడియాతో మాట్లాడిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ కుమార్ సిన్హా.. స్థానికులు ఎలాంటి వదంతులపై దృష్టి పెట్టకూడదని కోరారు. ఇది కూడా చదవండి: ఎన్ఐఏ విచారణలో రాణా మూడు డిమాండ్లు

ఎన్ఐఏ విచారణలో రాణా మూడు డిమాండ్లు
న్యూఢిల్లీ: మహానగరం ముంబై 26/11 దాడులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency)(ఎన్ఐఏ) ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న కెనడా-పాకిస్తానీ పౌరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణాను విచారిస్తోంది. ఈ నేపధ్యంలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతలో తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎన్ఐఏ ముందు కొన్ని డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తోంది. ఇది అతని మానసిక స్థితిని తెలియజేసేదిగా ఉందని ఎన్ఐఏ పేర్కొంది.వివరాల్లోకి వెళితే ఎన్ఐఏ విచారణలో ఉన్న తహవ్వూర్ రాణా(Tahawwur Rana) ఎన్ఐఏ ముందు ఉంచిన డిమాండ్ పలు చర్చలకు దారితీస్తున్నాయి. కస్టడీలో ఉన్న రాణా తనకు ఖురాన్ (ఇస్లామిక్ పవిత్ర గ్రంథం), ఒక పెన్ను, 26/11 దాడుల గురించి అధికారికంగా ప్రశ్నించే అవకాశాన్ని కోరాడు. ఇవి అతని మానసిక స్థితిని, మతపరమైన నమ్మకాన్ని, ఈ కేసులో అతని పాత్ర గురించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాణా ఖురాన్‌ను అడగడం అతని మతపరమైన అభిరుచులను సూచిస్తుండగా, పెన్ను కావాలనడం ఏదైనా ముఖ్యమైన రాతపూర్వక ప్రకటన లేదా నోట్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక ముడవది.. అతి ముఖ్యమైనది 26/11 దాడుల(26/11 attacks) గురించి ప్రశ్నించే అవకాశం కోరడం.. దీనిని చూస్తుంటే రాణా ఈ ఘటనలో తన పాత్రను వివరించాలనుకుంటున్నాడో లేక మరేదైనా సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాణా పాకిస్తాన్ ఆధారిత టెరరిస్ట్ సంస్థ లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2008లో 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న 26/11 ముంబై దాడులలో అతని పాత్రను తెలుసుకునేందుకు ఎన్ఐఏ కఠినమైన విచారణ కొనసాగిస్తున్నది. ఇది భారత్-పాకిస్తాన్ టెరరిజం, అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్టమైన కేసుగా మారింది. అలాగే ఈ కేసు భారత్.. ఉగ్రవాదంపై సాగిస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. ఎన్ఐఏ విచారణలో తహవ్వూర్ రాణా 26/11 ముంబై దాడులకు సంబంధించి ఏఏ విషయాలు వెల్లడించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: ఈ ఇద్దరు అధికారులే.. తహవ్వూర్ రాణా విచారణ సారధులు

ఔరంగజేబ్ ఓటమిపాలై సమాధి అయ్యిందిక్కడే
రాయ్‌గఢ్: జగజ్జేత(అలంగీర్)నని చెప్పుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ జీవితమంతా మహారాష్ట్రలో మరాఠాలతో పోరాటంతోనే గడిపి, ఓటమిపాలై ఈ గడ్డపైనే సమాధి అయ్యాడని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు. శివాజీ 345 వర్ధంతి సందర్భంగా ఆయన శనివారం రాయ్‌గఢ్ కోటలో ఆయనకు నివాళులరి్పంచారు. 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి సూపర్ పవర్‌గా ఎదగాలన్న భారతదేశం లక్ష్యానికి శివాజీ మహారాజే స్ఫూర్తి అని అమిత్ షా పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను మహారాష్ట్రకు మాత్రమే పరిమితం చేయవద్దని ప్రజలకు ఆయన విజŠక్షప్తి చేశారు. శివాజీ దీక్ష, పట్టుదల, సాహసం దేశానికే ఆదర్శమని, సమాజంలోని అన్ని వర్గాలను వ్యూహాత్మకంగా ఆయన ఏకం చేశారని చెప్పారు. మారాఠా సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న రాయ్‌గఢ్ కోటలోని శివాజీ సమాధి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. సంభాజీనగర్ జిల్లా ఖుల్టాబాద్‌లో ఉన్న 17వ శతాబ్దం నాటి మొఘల్ చక్రవర్తి సమాధిని మరో చోటుకు తరలించాలన్న డిమాండ్లు ఇటీవల ఎక్కువైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సూట్‌కేస్‌లో గర్ల్‌ఫ్రెండ్
సోనిపట్: గర్ల్ ఫ్రెండ్‌ను సూట్‌కేస్‌లో దాచి తనుండే బాయ్స్ హాస్టల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఇటీవల చోటుచేసుకుంది. భారీ సూట్‌కేస్‌తో హాస్టల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థిని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సూట్‌కేస్ తెరిచేందుకు తీసేందుకు యత్నించారు. విద్యార్థులు చుట్టూ గుమికూడారు. సూట్‌కేస్ తెరిచి చూడగా ఓ యువతి బయటకు రావడంతో అంతా షాకయ్యారు. ఓ విద్యార్థి ఇదంతా వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరలయ్యింది. వర్సిటీ పీఆర్వో మాత్రం, ‘మా విద్యార్థులు అల్లరి చేశారంతే, ఇదేమంత పెద్ద విషయం కాదు’ అంటూ తేలిగ్గా కొట్టిపారేయడం విశేషం.
ఎన్ఆర్ఐ

Ugadi 2025 సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్‌సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్‌లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్‌కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్‌లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్‌లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్‌లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్‌కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్‌గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్‌లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో రామగిరి సెంటర్లోని గీతాంజలి అపార్ట్మెంట్లో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ వద్దకు శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి తమకు ఫొటోలు ప్రింట్ తీసి ఇవ్వాలని కోరారు. దీంతో సురేష్ ప్రింట్ మిషన్ ఆన్ చేసి కంప్యూటర్‌పై కూర్చున్న సమయంలో నిందితులు మొదట అతడి గొంతు కోసి ఆ తర్వాత గుండెలపై విచక్షణారహితంగా పొడవడంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు జాగిలాలు, ఫింగర్ ప్రింట్స్ టీంలను పిలిపించి వివరాలు సేకరించారు. ఇద్దరు వ్యక్తులు హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. సీసీ కెమెరాల సీడీఆర్‌ను సేకరించడంతో పాటు మృతుడి కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్య అనంతరం నిందితులు ఏ దారి గుండా బయటకు వెళ్లారు. హత్యకు ముందు ఎక్కడి నుంచి వచ్చారనే కోణంలో నల్లగొండ పట్టణంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. పాత కక్షలతోనే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫొటో స్టూడియోలు బంద్ చేసి ర్యాలీ..మృతుడు సురేష్ నల్లగొండతో పాటు నకిరేకల్, చిట్యాల, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో ఫొటో కలర్ ల్యాబ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సురేష్ హత్యకు గురికావడంతో నల్లగొండలో శనివారం ఫొటో, వీడియో గ్రాఫర్లు, కలర్ ల్యాబ్ యజమానులు ఫొటో స్టూడియోలు బంద్ చేసి నల్లబ్యాడీ్జలు ధరించి ర్యాలీ నిర్వహించారు. సురేష్ చిత్రపటానికి నివాళులరి్పంచారు. నిందితులను అరెస్ట్ చేసి సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.నకిరేకల్‌లో అంత్యక్రియలు నకిరేకల్: సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శుక్రవారం రాత్రే ఘటనా స్థలం నుంచి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సురేష్ సొంతూరు నకిరేకల్‌కు అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. నల్లగొండ ఆస్పత్రి మార్చురీ వద్ద సురేష్ కుటుంబ సభ్యులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. సురేష్ సొంతూరు కట్టంగూర్ మండలం పందెనపల్లి కాగా.. కొన్నేళ్ల క్రితమే కుటుంబం అంతా నకిరేకల్‌లోని చీమలగడ్డ ఫ్లైఓవర్ సమీపంలో స్థిర నివాసం ఏర్పరుచుకుని గూనల వ్యాపారం చేసుకుంటున్నారు. సురేష్ తల్లి, భార్య నాగమణి కలిసి గూనల వ్యాపారం నిర్వహిస్తుండగా.. సురేష్ ఏడేళ్ల క్రితమే నల్లగొండలో ఫొటో కలర్ ల్యాబ్ పెట్టుకుని ప్రతిరోజు నకిరేకల్ నుంచి వెళ్లి వస్తున్నాడు. సురేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేష్ తండ్రి 30ఏళ్ల క్రితమే చనిపోగా.. తల్లి రెండు నెలల క్రితమే మృతిచెందింది. సురేష్ మృతదేహానికి నివాళులర్పించిన వారిలో టీపీసీసీ నేత దైద రవీందర్ తదితరులు ఉన్నారు.

అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి
మిర్యాలగూడ అర్బన్: అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన శనివారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో చోటు చేసుకుంది. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ కంపెనీకి నల్లగొండ జిల్లా సెల్స్ మేనేజర్‌గా పనిచేస్తూ మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డులో అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. ఈ నెల 10వ తేదీన కంపెనీ పని మీద సీతారాంరెడ్డి హైదరాబాద్‌కు వెళ్లగా.. ఆయన భార్య రాజేశ్వరి(34), చిన్న కుమార్తె వేదసాయిశ్రీ(13)తో పాటు పెద్ద కుమార్తె వేదశ్రీ ఇంటి వద్దనే ఉన్నారు. హైదరాబాద్‌లో పని ముగించుకొని శనివారం తిరిగి మిర్యాలగూడకు వస్తుండగా.. సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె “ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్ చేసింది. దీంతో “ఇంటికి వస్తున్నాను’ అంటూ సీతారాంరెడ్డి రిప్లై ఇచ్చాడు. అనంతరం కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం 5గంటలకు సీతారాంరెడ్డి ఇంటికి వచ్చేసరికి పెద్ద కుమార్తె వేదశ్రీ తలుపు తీసుకొని తండ్రి వద్దకు పరుగెత్తుకు వచ్చింది. లోపలికి వెళ్లి చూడగా చిన్న కుమార్తె వేదసాయిశ్రీ మెడపై గాయంతో రక్తపుమడుగులో పడి ఉంది. బెడ్రూం వైపు వెళ్లి చూడగా రూం లోపల నుంచి గడియపెట్టి ఉంది. స్థానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి చూడగా చీరతో రాజేశ్వరి ఉరేసుకుని కనిపించింది. వెంటనే డయల్ 100కు ఫోన్ చేయగా.. మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యా..? ఆత్మహత్యా..?సీతారాంరెడ్డి పెద్ద కుమార్తెను పోలీసులు ప్రశ్నించగా.. తాను నిద్రపోయామని చెబుతుండడంతో తల్లి, కుమార్తెది హత్యా..? లేక ఆత్మహత్యా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సీఐ మోతీరాం, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు మృతదేహాలను పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. తల్లి, కుమార్తె మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య
చిట్యాల: కూతురు ఇంటి నుంచి వెళ్లిపో యి ప్రేమ వివాహం చేసుకోవటంతో మనస్తాపానికి గురైన తండ్రి గడ్డి నిర్మూలన మందు తాగి ఆత్మహ త్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఈ ఘటన జరిగింది. చిట్యాలకు చెందిన రెముడాల గట్టయ్య (46) కూతురు (18) మార్చి 8వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో గట్టయ్య ఫి ర్యాదుతో చిట్యాల పోలీసులు మిస్సింగ్ కేసు నమో దుచేశారు. అయితే, ఇంటినుంచి వెళ్లిపోయిన 3 రోజుల తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన గట్టయ్య కూతురు.. తాను ఊదరి యాదగిరి అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నానని, తన కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరింది. ఈ విషయాన్ని పోలీసులు గట్టయ్యకు చెప్పారు. దీంతో తన కూతురితో ఒక్కసారి మాట్లాడించాలని గట్టయ్య చిట్యాల పోలీసులను వేడుకున్నాడు. అందుకు పోలీసులు నిస్సహాయత వ్యక్తంచేయటంతో నెల రోజుల నుంచి గట్టయ్య పలువురు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి మొరపెట్టుకున్నాడు. అయినా తనకు న్యాయం జరగటం లేదన్న మనోవేదనతో శుక్రవారం మధ్యాహ్నం చిట్యాల పట్టణ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద గడ్డి నివారణ మందు తాగాడు. గట్టయ్యను కుటుంబ సభ్యులు హైదరాబా ద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. గట్టయ్య మృతి విషయం తెలియగానే శనివారం ఉదయం చిట్యాల పోలీస్‌స్టేషన్ వద్దకు మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున చేరుకొని నిరసనకు దిగారు. దీంతో నార్కట్‌పల్లి సీఐ కె.నాగరాజు అక్కడికి చేరుకుని గట్టయ్య కూతురుతో ఫోన్లో మాట్లాడారు. తండ్రి మృతి విషయం తనకు తెలిసిందని, అయినా ముంబైలో ఉన్న తాను తిరిగి రానని కరాఖండిగా చెప్పింది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు నిరసనను విరమించారు.

విదేశాల్లో ఉద్యోగాలని.. ‘సైబర్’ బానిసలుగా మార్చారు
ముంబై: మయన్మార్‌లో సైబర్ బానిసలుగా బతుకీడుస్తున్న 60 మందికి పైగా భారతీయులను మహారాష్ట్ర పోలీసుల సైబర్ విభాగం రక్షించింది. ఒక విదేశీ పౌరుడు సహా ఐదుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాల మేరకు... థాయ్‌లాండ్‌లో మంచి ఉద్యోగావకాశాలున్నాయంటూ మొదట సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల ద్వారా ఓ ముఠా ప్రకటనలిచ్చిందిది. ఈ ప్రకటనలకు ఆకర్షితులైన కొందరు అమాయకులను సదరు ముఠా ఏజెంట్లు పాస్‌పోర్టులు, విమాన టికెట్లు ఏర్పాటుచేసి పర్యాటక వీసాలపై థాయ్‌లాండ్‌కు, అక్కడినుంచి మయన్మార్ సరిహద్దుకు పంపారు. ఆ తరువాత చిన్న పడవల్లో వారిని నది దాటించి సాయుధ తిరుగుబాటు గ్రూపుల నియంత్రణలో ఉన్న ప్రదేశాల్లో దింపారు. అక్కడ వారితో బలవంతంగా చీడిజిటల్ అరెస్ట్’ స్కామ్‌ల నుంచి నకిలీ పెట్టుబడి పథకాల దాకా అనేక సైబర్ మోసాలు చేయించారు. దీనిపై సమాచారమందుకున్న మహారాష్ట్ర సైబర్ పోలీసు విభాగం , ఇతర ఏజెన్సీలతో కలిసి బాధితులను రక్షించింది. త్వరలోనే వీరిని స్వదేశానికి తీసుకురానున్నారు. చదవండి: సింగపూర్ ‘ట్రీ టాప్‌వాక్’ తరహాలో వాక్‌వే, క్యూ కడుతున్న పర్యాటకులుమనీష్ గ్రే సహా నలుగురి అరెస్టు రిక్రూట్మెంట్ ఏజెంట్లుగా వ్యవహరించారనే ఆరోపణలతో మనీష్ గ్రే అలియాస్ మాడీ, తైసన్ అలియాస్ ఆదిత్య రవి చంద్రన్, రూపనారాయణ్ రాంధర్ గుప్తా, జెన్సీ రాణి డి మరియు చైనీస్–కజకిస్తానీ జాతీయుడు తలానిటి నులాక్సీలను అరెస్టు చేసింది. వీరిలో మనీష్ గ్రే పలు వెబ్ సిరీస్‌లు టెలివిజన్ షోలలో నటించిన ప్రొఫెషనల్ నటుడు అని కొంతమంది వ్యక్తులను నియమించుకుని మయన్మార్‌కు మనుషులను అక్రమ రవాణా చేశాడని పోలీసులు తెలిపారు. తలానిటి నులాక్సీ భారతదేశంలో సైబర్ నేరాలకు పాల్పడేలా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, తదుపరి దర్యాప్తు కొనసా గుతోందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో?
వీడియోలు


కూటమి సర్కార్ పై YSRCP నేత వడ్డి రఘురాం మండిపాటు


జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


కోటవురట్ల బాణసంచా ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


అంతకంతకు పెరుగుతున్న పాన్ ఇండియా మూవీ బడ్జెట్స్


నడిరోడ్డుపై తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు


అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం


తిరుపతి TTD గోశాలలో గోవుల మృతిపై అఖిలపక్షం కమిటీ వెయ్యాలి: తిరుపతి MP


సైలెంట్‌గా ఉండకపోతే వెళ్లిపోతానంటూ..


కల్కి సీక్వెల్ పై కొనసాగుతున్న కన్ఫ్యూజన్


చంద్రబాబు ఇంద్రజాలం.. మెల్లగా ఏపీని ముంచేస్తున్నారు