Top Stories
ప్రధాన వార్తలు

నేషనల్ హెరాల్డ్ కేసు.. చార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్ పేర్లు
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ భారీ షాకిచ్చింది. వీరిద్దరి పేర్లను ఈడీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు నోటీసులిచ్చిన ఈడీ.. తాజాగా సోనియా, రాహుల్ పేర్లను చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఈనెల 25వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది.కాగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఏజెఎల్, యంగ్ ఇండియన్పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏజెఎల్.. నేషనల్ హెరాల్డ్ న్యూస్ ప్లాట్ఫారం (వార్తాపత్రిక, వెబ్ పోర్టల్)నకు ప్రచురణకర్తగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్‌లో 38 శాతం వాటాలతో అధిక వాటాదారులుగా ఉన్నారు. ఈడీ తన దర్యాప్తులో.. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఉద్దేశపూర్వకంగా ప్రయోజనం చేకూర్చేదిగా పనిచేసిందని ఆరోపించింది. సంస్థ విలువను గణనీయంగా తక్కువగా అంచనా వేసి , రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఏజెఎల్ సేకరించిందని ఈడీ గుర్తించింది. రూ. 18 కోట్ల వరకు బోగస్ దానాలు, రూ. 38 కోట్ల వరకు బోగస్ అడ్వాన్స్ అద్దె, రూ. 29 కోట్ల వరకు బోగస్ ప్రకటనల రూపంలో అక్రమంగా రాబడిని సంపాదించుకునేందుకు యంగ్ ఇండియన్ ప్రయత్నించిందని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే రూ. 661 కోట్ల ఏజెఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులిచ్చింది.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం.. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.సీఎల్పీ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ కేటగిరైజేషన్‌పై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా కొట్టారు. వివేక్, ప్రేమ్‌సాగర్‌రావు, రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని పిలుపునిచ్చారు.‘‘ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం.. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం. భూ భారతిని రైతులకు చేరవేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం..ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం. జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా. హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు...బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి బిక్కిరి అవుతున్నాడు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది...కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. సన్న బియ్యం మన పథకం.. మన పేటెంట్, మన బ్రాండ్’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన.. ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యాలకు చేరుస్తుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే ప్రతిరోజూ 13,000 ప్యాసింజర్ రైళ్లను నడుపుతోంది. ట్రైన్ల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ.. పండుగల సీజన్లో టికెట్ బుక్ చేసుకోవడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ సాహసించి టికెట్ బుక్ చేసుకుంటే.. టికెట్‌పై WL, PQWL, GNWL, RSWL వంటి పదాలు కనిపించే ఉంటాయి. ఇవి మీ బుకింగ్ స్థితిని సూచిస్తాయి. అంతే కాకుండా రైలులో మీకు సీటు లభిస్తుందో లేదో నిర్ణయిస్తాయి. ఈ పదాల అర్థం ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం.డబ్ల్యుఎల్ (WL): డబ్ల్యుఎల్ అంటే వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. అంటే మీరు వెయిటింగ్ టిస్టులో ఉన్నారని ఈ పదం సూచిస్తుంది. టికెట్స్ కన్ఫర్మ్ అయిన వారు ఎవరైనా వారి టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. మీకు సీటు లభించే అవకాశం ఉంటుంది.జీఎన్‌డబ్ల్యూఎల్ (GNWL): GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న సమయంలో ఇలా ఉంటే.. మీకు బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. జనరల్ వెయిటింగ్ లిస్ట్.. అనేది ప్రారంభ స్టేషన్ లేదా సమీపంలోని ఏదైనా ఇతర ప్రధాన స్టేషన్ నుండి బుక్ చేసుకున్న టిక్కెట్లకు వర్తిస్తుంది. ఇతర వెయిటింగ్ లిస్ట్ బుకింగ్‌లతో పోలిస్తే GNWL టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!పీక్యూడబ్ల్యుఎల్ (PQWL): PQWL అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. అంటే ఇలాంటి టికెట్లకు సీటు కన్ఫర్మ్ అవకాశం చాలా తక్కువ. రైలు నిలిచిపోయే స్టేషన్‌కు ఒకటి రెండు స్టేషన్ల ముందు వరకు కూడా వీటిని ఇస్తారు. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యలో ఉన్న రెండు స్టేషన్లకు ఈ లిస్టును చూపిస్తారు.ఆర్ఎస్డబ్ల్యుఎల్ (RSWL): RSWL అంటే రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. ఇందులో కూడా సీటు కన్ఫర్మ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ‘‘రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34 వేల ఎకరాలు తీసుకున్నారు. అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పుచేశారు.. ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టేసింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదు. ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత.. తొందరపాటు చర్య. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.‘‘గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారు. మీ నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు. పొలం ఉన్న రైతు అమ్ముకోలేడా... రైతు తరపున మీరు అమ్ముతారా?. ప్రభుత్వం ఉన్నది.. రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికా?. 40 అంతస్తుల బిల్డింగ్లు ప్రజలకు ఒరిగేదేంటి. ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు.. మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు?’’ అంటూ శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.‘‘ఏపీలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులు సరిపోవా.. మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి?. అమరావతిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఎవరడిగారు.. ఎవడికి కావాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలని ఎవరడిగారు. శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్ పోర్టు కాదు.. పంటలకు సాగునీరు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే నీకు కనిపించడం లేదా?. చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని నేను కోరుతున్నా. పి4 గురించి తర్వాత ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి చంద్రబాబు. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14 వేలు ఇస్తామన్నారు.. ఏమైపోయింది ఆ హామీ?. మెట్రోరైళ్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు చంద్రబాబూ’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.చంద్రబాబు పి4 స్కీంపై సెటైర్లు చంద్రబాబు పి4 స్కీంపై వడ్డే శోభనాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు. పి4 విధానం అంటున్నారు మంచిదే. డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేయడం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన మూడు విద్యాసంస్థలు మీ నాయకులవే. మీకు చేతనైతే నారాయణ, భాష్యం విద్యాసంస్థల్లో పది శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించండి. పేదల కోసం హెరిటేజ్ నుంచి మీరేమీ ఇవ్వరా? మీ హెరిటేజ్ నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లైనా ఇవ్వొచ్చు కదా?పేదల కోసం హెరిటేజ్ కూడా మేలు చేస్తుందని ప్రజలకు తెలియజేయండి. మీరు చేస్తే మిమ్మల్ని చూసి మరికొంతమంది సాయం చేసేందుకు ముందుకు వస్తారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు.

Tirumala: తిరుమలలో మరో అపచారం
తిరుమల,సాక్షి: తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్‌తో భక్తులు షూట్ చేశారు. భక్తుల సమాచారంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్‌తో చిత్రీకరించిన మహారాష్ట్ర భక్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పోలీసులకు అప్పగించారు.శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగుర వేయడంపై విచారణ చేపట్టారు. విచారణలో మహారాష్ట్ర భక్తుడు సుమారు 15 నిమిషాల పాటు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్లు తేలుస్తోంది.

టాలీవుడ్ నటి అభినయ పెళ్లి.. సంబురాల్లో ఇరు కుటుంబాలు
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటి అభినయ. శంభో శివ శంబో చిత్రంలో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళంలోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఇటీవలే అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)తో మార్చి 9, 2025న నిశ్చితార్థం చేసుకుంది. తాజాగా బుధవారం వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది ముద్దుగుమ్మ.అభినయ-సన్నీ వర్మల పెళ్లి వేడుక ఈ నెల 16న అంటే బుధవారం గ్రాండ్‌గా జరగనుంది. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి సంబురాల్లో మునిగిపోయారు. ఇటీవలే తన ఫ్రెండ్స్‌కు బ్యాచ్‌లరేట్ పార్టీ ఇచ్చిన అభినయ మరి కొన్నిగంటల్లోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు. తాజాగా తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభియన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. 'నేనింతే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అభినయ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official)

అత్యాచార కేసులో అభ్యంతరకర వ్యాఖ్యలు.. అలహాబాద్ హైకోర్టుపై ‘సుప్రీం’ ఆగ్రహం
ఢిల్లీ: పలు సంచలన తీర్పులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న అలహాబాద్ (ఉత్తర ప్రదేశ్)హైకోర్టుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా తీర్పులతో సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.మార్చి 17వ తేదీన ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రాదని పేర్కొంటూనే.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది.మైనర్ బాలిక కేసు విచారణపై తీర్పు ఇచ్చిన తర్వాత.. ఇదే తరహా మరో కేసులో.. మరో కీలక తీర్పును వెలువరించింది. అత్యాచార ఘటనలో యువతిది స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలపై మంగళవారం సుప్రీం కోర్టు స్పందించింది.అలహాబాద్ హైకోర్టు తీర్పుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. తీర్పులో భాగంగా బెయిల్ ఇవ్వొచ్చు. కానీ కోర్టు ఇలా వ్యాఖ్యానించవచ్చా?.అని ప్రశ్నించింది. తీర్పులు ఇచ్చే సమయంలో జడ్జీలు చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ కేసును పరిష్కరించేటప్పుడు మేము మరిన్ని కేసులను కూడా పరిశీలిస్తాం’ అని జస్టిస్ గవాయి అన్నారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..‘న్యాయం చేయడమే కాదు, దాని గురించి అందరూ మాట్లాడకునేలా ఉండాలి’ అని అన్నారు. అలహాబాద్ కోర్టు చేసిన ఇలాంటి వ్యాఖ్యలు సామాన్యుడి దృష్టిలో ఎలా అనిపించవచ్చు అన్న విషయాన్ని జడ్జీలకు గుర్తు చేయాలని ఆయన సూచించారు. తీర్పును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. అసలేం జరిగిందంటే?గతేడాది ఢిల్లీలో పీజీ విద్యార్థినిపై ఆమె క్లాస్‌మెట్ అత్యాచారం చేసినట్లు ఓ యువతి కేసు పెట్టింది. మద్యం మత్తులో ఉన్న తనని నిందితుడు రెండు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. అయితే, బాధితురాలిపై జరిగింది అత్యాచారం కాదని, పరస్పర అంగీకారంతో ఇద్దరు కలిసినట్లు నిందితుడి తరుఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితుడికి జైలు శిక్షను విధించింది. నిందితుడు నాటి నుంచి జైల్లో జీవితం అనుభవిస్తున్నారు. ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!తాజాగా, ఈ కేసు నిందితుడు అలహాబాద్‌లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.స్పందించిన సుప్రీం కోర్టు పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించింది.

రైతులకు భారత వాతావరణ కేంద్రం శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: అన్నదాతకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి రూతుపవనాలు రానున్నాయని.. దేశమంతా విస్తారంగా వానలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని రీజన్లలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది 105 శాతం వర్ష శాతానికి ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది.జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లుగా ఉండగా.. ఈసారి 105 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈ సారి ఎల్‌నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు తెలిపింది.కాగా, రానున్న మూడు గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్కే ప్లేయర్‌గా
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల తర్వాత తిరిగి పుంజుకుంది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపొందింది. ఈ విజయంలో కెప్టెన్ ధోని(26), దూబే(43), రచిన్ రవీంద్ర(37)లది కీలక పాత్ర.సీఎస్కే గెలుపులో వీరు ముగ్గురుతో పాటు మరో యువ ఆటగాడు కూడా తన వంతు పాత్ర పోషించాడు. అతడే భారత అండర్-19 టీమ్ మాజీ వైస్ కెప్టెన్, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్. షేక్ రషీద్ సీఎస్కే తరపున తన ఐపీఎల్ అరంగేట్రంలోనే అందరిని ఆకట్టుకున్నాడు.167 పరుగుల లక్ష్య చేధనలో దూకుడుగా ఆడుతూ చెన్నైకి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న రషీద్.. 6 ఫోర్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ రచిన్ రవీంద్రతో కలిసి తొలి వికెట్‌కు 52 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.సామ్ కుర్రాన్ రికార్డు బద్దలు..ఈ మ్యాచ్‌లో షేక్ రషీద్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో సీఎస్కే తరపున ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అతి పిన్న వయస్కుడిగా రషీద్ నిలిచాడు. ఈ ఆంధ్రా ఆటగాడు కేవలం 20 ఏళ్ల 202 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ పేరిట ఉండేది.కుర్రాన్ ఐపీఎల్-2020లో సీఎస్కే తరపున 22 ఏళ్ల 132 రోజుల వయస్సులో ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశాడు. తాజా మ్యాచ్‌తో కుర్రాన్ ఆల్‌టైమ్ రికార్డును రషీద్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రషీద్‌ను రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు సీఎస్కే కొనుగోలు చేసింది. రషీద్ తన కెరీర్లో ఇప్పటివరకు 19 ఫస్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడి 37. 62 సగటుతో 1204 పరుగులు చేశాడు. అంతేకాకుండా 12 లిస్ట్-ఎ, 17 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని

‘కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం’
తాడేపల్లి : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరద్ధమన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడిన పేర్నినాని.. ‘ టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా?, మరి వారిద్దరూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటోంది.లింకు డాక్యుమెంట్లు బయటపెడితే నోరుమూశారు..వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. హిందూ మత సంస్థలు, ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నాం. చివరికి షాపులు ఉన్నా ఖాలీ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖలో హిందూయేతరులను అధికారులను పెట్టటం లేదు. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారు?, అలా చేయటం కరెక్టేనా?, ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలన పాలనాకు ముస్లిమేతరులను పెట్టటం సబబేనా? , ముస్లింల హక్కులను కాలరాయటం కరెక్టుకాదు.మా పార్టీలాగే మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగలరా?చంద్రబాబు, లోకేష్ లకు ఖలేజా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా?, మా పార్టీలాగే మీరు కూడా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయలగరా?, దిక్కుమాలిన, దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలి. పన్నుల వసూళ్లలో రెండు శాతం మాత్రమే వృద్ది ఉన్నప్పుడు జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్‌కి ఎలా వచ్చింది?, అంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయటానికి రెడీ అయ్యారని అర్థం అవుతోంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించటం దుర్మార్గం. 2018 కు ముందు మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరుగుతోందని మేము గతంలోనే చెప్పాం. అధికారం ఉంటే చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తారో లెక్కలేదు. రాజధానిలో ఇంకా 44 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తేలుతుంది. తన స్వార్ధం కోసం తప్ప చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడు’ అని ధ్వజమెత్తారు.
'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్‌బాస్ ఆదిరెడ్డి ఆవేదన!
‘మాటలతో ఆటలాడవద్దు.. మీ గేమ్స్ చెల్లవు’
ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ ఆఫర్స్: వాటిపై భారీ డిస్కౌంట్స్!
బన్నీ కోసం ముగ్గురు బ్యూటీస్.. కాకపోతే!
Tirumala: తిరుమలలో మరో అపచారం
పంజాబ్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
టాలీవుడ్ నటి అభినయ పెళ్లి.. సంబురాల్లో ఇరు కుటుంబాలు
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారవృద్ధి
కొత్తగా వచ్చేదేముంది సార్! గత పదేళ్లుగా పోలీసు యూనిఫాం వేసుకుని మరీ ‘పచ్చపార్టీ’కి పని చేస్తున్నారు కదా!
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
సొరంగం జిందాబాద్..!
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
ఇంతకాలం రాజకీయాల్లో ఉంటున్నారంటే ఇదేకదా సార్!
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్
ఎండలో నిలబెడతానంటే వెంటనే తప్పు ఒప్పుకున్నాడ్సార్..!
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
నీట్ రూల్స్ వెరీ టఫ్
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
CSK Vs LSG: చెన్నై గెలిచిందోచ్...
పెద్ది ఫైట్
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలు
బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఎమర్జెన్సీ.. ప్రాణం కాపాడిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త: తగ్గనున్న హోమ్ లోన్ వడ్డీ రేటు
ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
పళ్ల సెట్‌కి గుడ్‌బై చెప్పేయండి..! హాయిగా యథావిధిగా వచ్చేస్తాయట..!
ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
సన్నీ డియోల్ జాట్ మూవీ.. నాలుగు రోజులైనా ఆ మార్క్ దాటలేదు!
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
మూడు రోజుల క్రితమే వివాహం.. ఫలక్నామా రౌడీషీటర్ దారుణ హత్య
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
వాస్తవానికి అతకని పచ్చరాతలు!
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
PBKS vs KKR: బౌలర్‌గా తీసుకోలేదు కదా.. అతడిపై వేటు వేయండి!
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
సుందర్ సీ సినిమాలో గ్లామర్‌తో దుమ్మురేపిన 'కేథరిన్ థ్రెసా'
డబ్బులెక్కడ సార్?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్ ప్లాన్‌తో టెన్షన్లో ట్రంప్!
ఎన్డీఏకు షాక్.. కూటమి నుంచి ఆర్ఎల్జేపీ తెగదెంపులు
చక్రి 'ఏఐ' వాయిస్ తో కొత్త పాట.. వింటేజ్ స్టెప్పులు
LSG VS CSK: చరిత్ర సృష్టించిన ధోని
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
రఫ్పాడించిన ధోని.. చెన్నై గ్రాండ్ విక్టరీ
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన పాక్ వికెట్ కీపర్
ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్
లేఆఫ్స్‌పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
అంతరిక్షం నుంచి అందాల భారతం
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
బంగారం తగ్గిందోచ్... గోల్డ్ స్పీడ్‌కు బ్రేక్!
‘అమెరికా విమానాల్ని కొనుగోలు చేయొద్దు’.. జిన్‌పింగ్ ఆదేశాలు
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్
రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?
వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?
HYD: అర్ధరాత్రి పబ్‌లో అసభ్యకర డ్యాన్స్.. 17 మంది యువతులతో కస్టమర్స్..
రోడ్డుపై 'వడాపావ్' అమ్మే వ్యక్తి ఏకంగా రూ. 800 కోట్ల సినిమాతో రికార్డ్
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
రష్యా గ్యాస్ పైప్‌లైన్ మాకిచ్చేయండి
టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు
9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
తిరుమలలో మరో అపచారం
తమిళ పొన్నులా జాన్వీ కపూర్.. వజ్రాల హారంతో అనసూయ
‘తల్లి కావాల్సిన క్షణంలో’.. విశాఖలో నిండు గర్భిణి దారుణ హత్య
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
కల్లు తయారీలో యాంటీ సైకోటిక్ డ్రగ్?
పాతబస్తీలో శరవేగంగా మెట్రో విస్తరణ పనులు
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్‌బాస్ ఆదిరెడ్డి ఆవేదన!
‘మాటలతో ఆటలాడవద్దు.. మీ గేమ్స్ చెల్లవు’
ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ ఆఫర్స్: వాటిపై భారీ డిస్కౌంట్స్!
బన్నీ కోసం ముగ్గురు బ్యూటీస్.. కాకపోతే!
Tirumala: తిరుమలలో మరో అపచారం
పంజాబ్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
టాలీవుడ్ నటి అభినయ పెళ్లి.. సంబురాల్లో ఇరు కుటుంబాలు
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారవృద్ధి
కొత్తగా వచ్చేదేముంది సార్! గత పదేళ్లుగా పోలీసు యూనిఫాం వేసుకుని మరీ ‘పచ్చపార్టీ’కి పని చేస్తున్నారు కదా!
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
సొరంగం జిందాబాద్..!
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
ఇంతకాలం రాజకీయాల్లో ఉంటున్నారంటే ఇదేకదా సార్!
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్
ఎండలో నిలబెడతానంటే వెంటనే తప్పు ఒప్పుకున్నాడ్సార్..!
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
నీట్ రూల్స్ వెరీ టఫ్
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
CSK Vs LSG: చెన్నై గెలిచిందోచ్...
పెద్ది ఫైట్
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలు
బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఎమర్జెన్సీ.. ప్రాణం కాపాడిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త: తగ్గనున్న హోమ్ లోన్ వడ్డీ రేటు
ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
పళ్ల సెట్‌కి గుడ్‌బై చెప్పేయండి..! హాయిగా యథావిధిగా వచ్చేస్తాయట..!
ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
సన్నీ డియోల్ జాట్ మూవీ.. నాలుగు రోజులైనా ఆ మార్క్ దాటలేదు!
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
మూడు రోజుల క్రితమే వివాహం.. ఫలక్నామా రౌడీషీటర్ దారుణ హత్య
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
వాస్తవానికి అతకని పచ్చరాతలు!
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
PBKS vs KKR: బౌలర్‌గా తీసుకోలేదు కదా.. అతడిపై వేటు వేయండి!
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
సుందర్ సీ సినిమాలో గ్లామర్‌తో దుమ్మురేపిన 'కేథరిన్ థ్రెసా'
డబ్బులెక్కడ సార్?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్ ప్లాన్‌తో టెన్షన్లో ట్రంప్!
ఎన్డీఏకు షాక్.. కూటమి నుంచి ఆర్ఎల్జేపీ తెగదెంపులు
చక్రి 'ఏఐ' వాయిస్ తో కొత్త పాట.. వింటేజ్ స్టెప్పులు
LSG VS CSK: చరిత్ర సృష్టించిన ధోని
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
రఫ్పాడించిన ధోని.. చెన్నై గ్రాండ్ విక్టరీ
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన పాక్ వికెట్ కీపర్
ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్
లేఆఫ్స్‌పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
అంతరిక్షం నుంచి అందాల భారతం
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
బంగారం తగ్గిందోచ్... గోల్డ్ స్పీడ్‌కు బ్రేక్!
‘అమెరికా విమానాల్ని కొనుగోలు చేయొద్దు’.. జిన్‌పింగ్ ఆదేశాలు
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్
రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?
వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?
HYD: అర్ధరాత్రి పబ్‌లో అసభ్యకర డ్యాన్స్.. 17 మంది యువతులతో కస్టమర్స్..
రోడ్డుపై 'వడాపావ్' అమ్మే వ్యక్తి ఏకంగా రూ. 800 కోట్ల సినిమాతో రికార్డ్
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
రష్యా గ్యాస్ పైప్‌లైన్ మాకిచ్చేయండి
టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు
9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
తిరుమలలో మరో అపచారం
తమిళ పొన్నులా జాన్వీ కపూర్.. వజ్రాల హారంతో అనసూయ
‘తల్లి కావాల్సిన క్షణంలో’.. విశాఖలో నిండు గర్భిణి దారుణ హత్య
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
కల్లు తయారీలో యాంటీ సైకోటిక్ డ్రగ్?
పాతబస్తీలో శరవేగంగా మెట్రో విస్తరణ పనులు
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
సినిమా

'నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి'.. మ్యాడ్ స్క్వేర్ ఫుల్ సాంగ్ చూశారా?
ఇటీవల యూత్‌ను ఫుల్‌గా అలరించిన కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ కీలక పాత్రల్లో మెప్పించారు. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను అలరించింది.తాజాగా ఈ సినిమాలో క్రేజీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్వాతిరెడ్డి అంటూ సాగే పాట ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో హీరోయిన్ రెబా మోనికా జాన్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ పాటలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ తమ స్టెప్పులతో అలరించారు. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. రిలీజ్‌కు ముందే క్రేజ్ దక్కించుకున్న ఈ సూపర్ హిట్ సాంగ్‌ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. నిన్న(ఏప్రిల్ 14) ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. కానీ 24 గంటలు గడిచేసరికి మాత్రం రాజమౌళి మూవీస్ రికార్డ్స్ దాటిపోయింది. ఇది మాత్రం ఓ రకంగా షాకింగ్ అని చెప్పొచ్చు.హిట్ సిరీస్ లో తొలి రెండు సినిమాల్ని థ్రిల్లర్స్ గా మలిచారు. కానీ మూడో భాగాన్ని మాత్రం నరుక్కోవడం, రక్తం ఏరులై పారడం అనేలా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమైంది. చిన్నపిల్లలు, సున్నిత మనస్కులు తమ సినిమాని చూడొద్దని నాని చెప్పడం కూడా సినిమాపై ఓ రకంగా బజ్ పెంచింది.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!)అలా రిలీజైన 24 గంటల్లో హిట్ 3 ట్రైలర్ కి 23.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తద్వారా బాహుబలి 2 (21.81 మిలియన్), ఆర్ఆర్ఆర్ (20.45 మిలియన్), కేజీఎఫ్ 2 (19.38 మిలియన్) రికార్డ్స్ దాటేసినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా తెలుగు వెర్షన్ వరకు మాత్రమే.మే 1న థియేటర్లలోకి రాబోతున్న హిట్ 3 సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. మరి బ్లడ్ బాత్ అనేలా ఉన్న ఈ మూవీ ఫలితం ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)

అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. రెండొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రదీప్ రంగనాథన్ తమిళ సూపర్ హిట్ మూవీ డ్రాగన్ సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ఆ సినిమాను అధిగమించింది. డ్రాగన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలవనుంది. కాగా.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వీకెండ్ తర్వాత సోమవారం రూ. 15 కోట్ల నెట్ వసూలు చేసి.. ఐదు రోజుల్లోనే రూ. 101.3 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్ )కాగా.. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో అలరించదగా.. అర్జున్ దాస్ ప్రతినాయకుడిగా మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.

ఖరీదైన సినిమా.. సూపర్ స్టార్-ఐకాన్ స్టార్ వార్!
ఈ ఏడాది అత్యంత ఖరీదైన చిత్రాల రూపకల్పనలో భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త శిఖరాలను అధిరోహించనుంది. ఈ నేపధ్యంలోనే ఆల్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ దర్శకుడు అట్లీ కలయికలో తమ కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఇద్దరు టాలీవుడ్ అగ్రగామి నటుల మధ్య సరికొత్త వార్ మొదలైందనొచ్చు. దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమా నాదే అనే కిరీటాన్ని అందుకోవడానికి ఈ ఇద్దరు స్టార్స్ పోటీపడుతున్నారు. వీరిద్దరూ మాత్రమే కాదు నేను కూడా ఉన్నానంటూ బాలీవుడ్ టాప్ స్టార్ కూడా అదే వరుసలో నిలవడంతో.. పోటీ రసకందాయకంగా మారింది.రూ.2 వేల కోట్ల కలెక్షన్స్ నిన్న.. రూ1,000 కోట్ల పెట్టుబడి నేడు.. అన్నట్టుగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో ఆయన తీస్తున్న చిత్రం ఎస్‌ఎస్‌ఎస్‌బి29 బడ్జెట్ రూ.1000 కోట్ల వరకూ ఉండొచ్చునంటున్నారు. మరోవైపు బాలీవుడ్ అగ్ర కధానాయకుల్లో ఒకరైన రణబీర్ కపూర్‌తో రామాయణం తెరకెక్కుతోంది. ఈ చిత్రం బడ్జెట్ కూడా రూ.900 కోట్లకు దగ్గరగా ఉండొచ్చునని చెబతున్నారు. ఈ రెండు సినిమాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నప్పటికీ... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమ తమ చిత్రాలతో భారీ బ్లాక్బస్టర్లు సాధించిన అల్లు అర్జున్, అట్లీలు సన్ పిక్చర్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నట్టు వచ్చిన ప్రకటన పలు ఆశ్చర్యకరమైన అంకెల్ని సినీ అభిమానుల కళ్ల ముందుకు తెచ్చింది. ప్రస్తుతం ఏఏ22xఏ6 అని పేర్కొంటున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన భారతీయ చలనచిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమా బడ్జెట్ రూ. 800 కోట్లు కాగా ఇందులో నిర్మాణ వ్యయంగా రూ. 200 కోట్లు, విఎఫ్ఎక్స్ (స్పెషల్ ఎఫెక్ట్స్) కోసం రూ.250 కోట్లు, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ. 175 కోట్లు, దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్ రూ. 100 కోట్లుగా లెక్కిస్తున్నారు.ఇదే కాకుండా అల్లు అర్జున్‌కూ సినిమా లాభంలో 15 శాతం ఉంటుందని, అలాగే అట్లీకి కూడా బ్యాకెండ్ డీల్ ఉంటుందని సమాచారం. అవతార్, ఐరన్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన నిపుణులు ఇందులో భాగం పంచుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా ఇండియన్ స్క్రీన్‌పై విజువల్ ట్రీట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఒక ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లవచ్చునని.. అట్లీ తరచుగా ఆలోచించినట్టే ఆలోచిస్తే అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం కానుంది.ప్రస్తుత బడ్జెట్ల ప్రకారం రాజమౌళి, మహేష్ బాబుల సినిమాయే అత్యంత ఖరీదైన చిత్రం కావడం ఖాయంగా తెలుస్తున్నప్పటికీ..మరెన్నో నెలల పాటు.షూటింగ్ సాగే క్రమంలో బడ్జెట్లో కూడికలు, తీసివేతలు.. మార్పు చేర్పులు అంతిమంగా ఈ విషయాన్ని ఖరారు చేస్తాయని అనుకోవచ్చు.
న్యూస్ పాడ్‌కాస్ట్

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.
క్రీడలు

IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
ఐపీఎల్-2025 (IPL 2025) రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) ఊహించని రీతిలో ముందుకు సాగుతుంటే.. ఐదేసి సార్లు ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మాత్రం రాజస్తాన్ రాయల్స్ (RR)తో కలిసి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నాయి.ఇక డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా సవాళ్లకు ఎదురీతుండగా.. గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేకేఆర్ ఇప్పటికి ఆరింట మూడు గెలిస్తే.. రైజర్స్ ఆరింట రెండే గెలిచి చివరన ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ కొనసాగుతోంది.గతేడాది బెంగళూరు జట్టుపై 287/3 స్కోరు నమోదు చేసింది. ఈ ఏడాది తమ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ సన్‌రైజర్స్.. ఈ రికార్డు స్కోరు కంటే ఒక్క పరుగు తక్కువ చేసి.. తమ రికార్డును తామే బద్దలుకొడుతుందా అనిపించింది. అయితే, ఇప్పటికి ఆ రికార్డు మాత్రం పదిలంగానే ఉండిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి చెక్కు చెదరని రికార్డులు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఓసారి గమనిద్దామా?!రికార్డుల రారాజుకే సాధ్యమైందిరన్మెషీన్ పేరొందిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న ఈ రికార్డుల రారాజు 2016 సీజన్లో నాలుగు శతకాల సాయంతో ఏకంగా 973 పరుగులు సాధించాడు. గత ఎనిమిదేళ్లుగా ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు2013లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పుణె వారియర్స్‌పై 66 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఫాస్టెస్ట్ సెంచరీతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు.అత్యధిక వరుస విజయాలుఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికి మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. 2014, 2015 సీజన్లలో అరుదైన ఘనత సాధించింది.గౌతం గంభీర్ సారథ్యంలో 2014లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది కేకేఆర్. ఆ మరుసటి ఏడాది వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. ఇంత వరకు ఏ జట్టుకు ఇలాంటి వరుస విజయాల ఘనత సాధ్యం కాలేదు.పార్ట్నర్స్ఐపీఎల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా విరాట్ కోహ్లి- ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నారు. 2016లో ఆర్సీబీ తరఫున ఈ దిగ్గజ బ్యాటర్లు గుజరాత్ లయన్స్‌పై 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. గతంలో ముంబై ఇండియన్స్‌పై తాము సాధించిన 215 (నాటౌట్) పరుగుల భాగస్వామ్య రికార్డును వారే బ్రేక్ చేశారు.హ్యాట్రిక్ వీరుడుఐపీఎల్లో అత్యధిక హ్యాట్రిక్‌లు నమోదు చేసిన బౌలర్‌గా రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కొనసాగుతున్నాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున దక్కన్ చార్జర్స్‌పై, 2011లో దక్కన్ చార్జర్స్ తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2011లో పుణె వారియర్స్‌పై అమిత్ మిశ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు.అరంగేట్రంలోనే అదరగొట్టివెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ఏప్రిల్ 6, 2019లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా 6/12 గణాంకాలు నమోదు చేశాడు. తద్వారా డెబ్యూలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.డివిలియర్స్ పేరిటే..ఒక సీజన్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నాడు. 2016 సీజన్లో అతడు మొత్తంగా 19 క్యాచ్‌లు అందుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (17), రియాన్ పరాగ్ (17) అతడికి చేరువగా వచ్చినా ఈ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయారు.చదవండి: మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..

వెస్టిండీస్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. హ్యాట్రిక్ విజయాలు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోటీల్లో పాకిస్తాన్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. నిన్న (ఏప్రిల్ 14) వెస్టిండీస్‌పై పాక్ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, హేలీ మాథ్యూస్, కరిష్క రామ్హరాక్ తలో రెండు వికెట్లు తీయగా.. అష్మిని మునిసర్, ఆలియా అలెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్ (54) హాఫ్ సెంచరీతో రాణించగా.. మునీబా అలీ (33), సిద్రా నవాజ్ (23), అలియా రియాజ్ (20), ఒమైమా సోహైల్ (16), ఫాతిమా సనా (15) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. ఫాతిమా సనా (7-0-16-3), రమీన్ షమీమ్ (8.2-1-26-2), నష్రా సంధు (10-0-31-2), సదియా ఇక్బాల్ (8-1-31-1) రెచ్చిపోవడంతో 39.2 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఆలియా అలెన్ (22) టాప్ స్కోరర్‌గా నిలిచింది.కాగా, పాక్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు జట్లు (మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్‌లాండ్ పోటీపడుతున్నాయి. ఈ టోర్నీలో పాక్ 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉంది. పాక్ తర్వాత బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. ఐర్లాండ్, థాయ్‌లాండ్ ఇంకా ఖాతా తెరవలేదు.ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.

IPL 2025: పంజాబ్, కేకేఆర్ చివరి సారి తలపడినప్పుడు ఏం జరిగిందో తెలుసా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 15) బిగ్ ఫైట్ జరుగనుంది. చండీఘడ్ వేదికగా పంజాబ్, కేకేఆర్ కత్తులు దూసుకోనున్నాయి. ఈ రెండు జట్లు చివరి సారి తలపడినప్పుడు పరుగుల వరద పారింది. 2024 సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ నిర్దేశించిన 262 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ఛేదన.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (10 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్సర్లు), రసెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది.అనంతరం దాదాపుగా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. జానీ బెయిర్‌స్టో విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పంజాబ్ ఆటగాళ్లలో బెయిర్‌స్టోతో పాటు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రిలీ రొస్సో (16 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), శశాంక్ సింగ్ (28 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించారు.నేటి మ్యాచ్‌లో అదే తరహాలో పరుగుల వరద పారాలని అభిమానులు ఆశిస్తున్నారు. పంజాబ్‌కు గత మ్యాచ్ తరహాలోనే బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నా, కేకేఆర్ కాస్త మెత్తబడినట్లనిపిస్తుంది. ఈ సీజన్లోనూ కేకేఆర్‌లో అదే ఆటగాళ్లు (శ్రేయస్ మినహా) కనిపిస్తున్నా, ఎందుకో పంజాబ్ కంటే కాస్త బలహీనంగా కనిపిస్తుంది. పంజాబ్, కేకేఆర్ ఐపీఎల్లో ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఇటీవలకాలంలో ఈ ఇరు జట్లు తలపడినప్పుడు చెరో సారి విజయం పలకరించింది. చివరిసారి పంజాబ్ గెలవగా, అంతకుముందు కేకేఆర్, దానికి ముందు పంజాబ్ గెలిచాయి. నేటి మ్యాచ్‌లో పంజాబ్ తమ స్టార్ బౌలర్ ఫెర్గూసన్ సేవలు కోల్పోయింది. గత మ్యాచ్‌లో గాయం కారణంగా ఫెర్గూసన్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఫెర్గూసన్ లేని కారణంగా పంజాబ్ గత మ్యాచ్‌లో (సన్‌రైజర్స్) 246 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోయింది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. విధ్వంసకర బ్యాటర్లు సునీల్ నరైన్, రసెల్, రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్ పెద్దగా ఫామ్‌లో లేరు. ఈ సీజన్లో కేకేఆర్ బౌలర్ల ప్రదర్శనతో నెట్టుకొస్తుంది. పంజాబ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో అతి భయానకంగా కనిపిస్తుంది. ఇప్పటికే అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర సెంచరీ బాదగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వైషాక్ విజయ్కుమార్కేకేఆర్: సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్), అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్/మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా

బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 15) ప్రకటించింది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రెండు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆగస్ట్ 17న వన్డే సిరీస్.. 26న టీ20 సిరీస్ మొదలవుతాయి.వన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే – ఆదివారం, ఆగస్టు 17, మిర్పూర్రెండో వన్డే – బుధవారం, ఆగస్టు 20, మిర్పూర్మూడో వన్డే – శనివారం, ఆగస్టు 23, చట్టోగ్రామ్టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి T20I – మంగళవారం, ఆగస్టు 26, చట్టోగ్రామ్లరెండో T20I – శుక్రవారం, ఆగస్టు 29, మిర్పూర్లమూడు T20I – ఆదివారం, ఆగస్టు 31, మిర్పూర్కాగా, భారత క్రికెటర్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ మే 25న ముగుస్తుంది. అనంతరం భారత్ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.ఇంగ్లండ్‌లో భారత పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- జూన్ 20-24రెండో టెస్ట్- జులై 2-6మూడో టెస్ట్- జులై 10-14నాలుగో టెస్ట్- జులై 23-27ఐదో టెస్ట్- జులై 31-ఆగస్ట్ 3ఈ సిరీస్ తర్వాతే భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరుతుంది.అనంతరం భారత జట్టు సెప్టెంబర్ నెలంతా ఖాళీగా ఉండి అక్టోబర్ 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది.వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్..తొలి టెస్ట్- అక్టోబర్ 2-6 (అహ్మదాబాద్)రెండో టెస్ట్- అక్టోబర్ 10-14 (కోల్‌కతా)ఈ సిరీస్ తర్వాత భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి.ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్‌అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్‌అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్‌నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్ స్వదేశంలో సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. భారత్‌లో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- నవంబర్ 14-18 (న్యూఢిల్లీ) రెండో టెస్ట్- నవంబర్ 22-26 (గౌహతి)తొలి వన్డే- నవంబర్ 30 (రాంచీ)రెండో వన్డే- డిసెంబర్ 3 (రాయ్‌పూర్)మూడో వన్డే- డిసెంబర్ 6 (వైజాగ్)తొలి టీ20- డిసెంబర్ 9 (కటక్)రెండో టీ20- డిసెంబర్ 11 (ఛండీఘడ్)మూడో టీ20- డిసెంబర్ 14 (ధర్మశాల)నాలుగో టీ20- డిసెంబర్ 17 (లక్నో)ఐదో టీ20- డిసెంబర్ 19 (అహ్మదాబాద్)
బిజినెస్

‘బ్యాడ్ బ్యాంక్’ గుడ్..!?
సాధారణంగా వాణిజ్య బ్యాంకులు వాటి రుణాలపై సమకూరే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా అంటే.. వసూలుకాని మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్‌ల పేరిట ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్పీఏలను దీనికి బదిలీ చేస్తారు.ఆర్బీఐ ఇటీవల రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు క్రమంగా వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. దాంతో చాలామంది అప్పు తీసుకోవాలని చూస్తున్నారు. తిరిగి చెల్లించే ఆర్థిక స్థోమత ఉంటేనే అప్పు తీసుకోవాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. లేదంటే అప్పులు ఎన్పీఏలు మారితే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో బ్యాడ్ బ్యాంకుల ప్రస్తావన మళ్లీ తెరపైకి వస్తుంది.ఏమిటి లాభం..బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు వల్ల ఎన్పీఏ ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మొండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి సారిస్తుంది. ఎన్పీఏ ఖాతాలు బ్యాడ్ బ్యాంక్‌కు వెళ్లడంతో వాణిజ్య బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లో వాటి ప్రస్తావన ఉండదు. ఫలితంగా బ్యాంకు పనితీరు మెరుగుపడుతుంది. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెరిగి బ్యాంకు అభివృద్ధికి బాటలు పడతాయి.ఏఆర్సీ ఉండగా బ్యాడ్ బ్యాంక్ ఎందుకు?బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్పీఏలను క్లియర్ చేసుకునేందుకు ‘అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)’లను ఆశ్రయిస్తుంటాయి. ఏఆర్‌సీలు బ్యాంకుల వద్ద చౌకగా ఎన్పీఏలను కొని వాటి రికవరీ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అలా బ్యాంకులు ఏఆర్సీలకు ఎంతో కొంతకు ఎన్పీఏలను అమ్మడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటాయి. బ్యాడ్ బ్యాంకు కూడా దాదాపు ఏఆర్సీ లాంటిదే. కానీ, బ్యాడ్ బ్యాంక్‌లకు వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏలను విక్రయించవు. కేవలం బదిలీ మాత్రమే చేస్తాయి. తద్వారా సాధారణ బ్యాంకులు వాటి ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. ఇక బ్యాడ్ బ్యాంకు ఎన్పీఏలపై పనిచేసి తిరిగి వాటిని ఎలా రాబట్టాలి... అందుకు ఉన్న వెసులుబాట్లపై దృష్టి సారిస్తుంది. రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసి వీలైనంత మొత్తాన్ని రాబట్టేందుకు కృషి చేస్తాయి.ఇదీ చదవండి: ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..దీని ఏర్పాటుపై ప్రతిపాదనలుఎన్పీఏల సమస్యను పరిష్కరించేందుకు 2017 ఆర్థిక సర్వే ‘పబ్లిక్ సెక్టార్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(పారా)’ను ఏర్పాటు చేయాలని అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రతిపాదించింది. దీనికి ప్రతిరూపమే బ్యాడ్ బ్యాంక్. అప్పటి నుంచి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) ప్రభావం బ్యాంకులపై పడకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా బ్యాడ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది.

వాట్సాప్‌లో కొత్త తరహా సైబర్ మోసం
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దాదాపు అందరూ వాడే మేసేజింగ్ యాప్ వాట్సాప్ వేదికగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా వాట్సాప్‌లో వచ్చిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇమేజ్‌పై క్లిక్ చేసిన ఓ వ్యక్తి ఏకంగా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. స్కామర్లు అనుసరిస్తున్న కొత్త మోసపూరిత పంథా ఏమిటో.. దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.కొత్త మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు తెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు ఒక చిత్రాన్ని పంపుతారు. ఇది స్కామ్ చేయడానికి కీలకంగా మారుతుంది. వారు పంపిన మెసేజ్ ఫొటో ఫార్మాట్లో ఉంటుంది. తెలియని నంబర్ నుంచి ఫొటో ఏంటా అని క్లిక్ చేయడం చాలా మందికి అలవాటు. సరిగ్గా దీన్నే నేరాలకు ఉపయోగిస్తున్నారు. ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు, యూపీఐ సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు నేరగాళ్లకు పూర్తి అనుమతులు ఇచ్చినట్లు అవుతుంది. అందుకు అనుగుణంగా ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే మీకు తెలియకుండానే మీ ఫోన్‌ను కంట్రోల్ చేసేలా రూపొందించిన మాల్వేర్ అందులో ప్రవేశిస్తుంది.ఇమేజ్ స్టెగానోగ్రఫీఇమేజ్ స్టెగానోగ్రఫీ అని పిలువబడే ఈ సాంకేతికతను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో నేరాలకు అవసరమయ్యే డేటాను రహస్యంగా ఇమేజ్ లోపల ఉంచుతారు. మీరు ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే మీకు తెలియకుండానే ఓటీపీ, పాస్వర్డ్లు.. వంటి సున్నితమైన సమాచారం అంతా స్కామర్ల చేతుల్లోకి వెళుతుంది. మాల్వేర్ పనిచేయడానికి ఇమేజ్ ఓపెన్ చేస్తే చాలు మీ యాప్స్, ప్రైవేట్ డేటాను యాక్సెస్ చేస్తుంది. దాంతో మోసాలకు పాల్పడుతున్నారు.వ్యక్తిని గుర్తించేందుకు సాయం చేయాలంటూమధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ వ్యక్తి ఇలా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. వాట్సాప్‌లో ఇమేజ్ షేర్ చేసి ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు సాయం చేయాలంటూ కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఒకే నంబర్ నుంచి పలుమార్లు కాల్స్, మెసేజ్‌లు రావడంతో చివరకు ఆ ఫొటోపై ఆ వ్యక్తి క్లిక్ చేశాడు. ఆ సమయంలో ఫోన్‌ను హ్యాక్ చేసి స్కామర్లు బ్యాంక్ వివరాలు తెలుసుకొని ఖాతా నుంచి డబ్బులు డ్రా చేశారు.ఇదీ చదవండి: ‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..సురక్షితంగా ఉండడం ఎలా..తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఇమేజ్‌లు, వీడియోలు డౌన్లోడ్ చేయవద్దు. లింక్‌లపై కూడా అసలు క్లిక్ చేయవద్దు.మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీడియా ఆప్షన్స్‌లో ఆటో డౌన్‌లోడ్‌ను ఆఫ్ చేసుకోండి. దాంతో మీకు తెలిసిన వారు పంపించిన ఫొటోలు, లింకులు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు.మీ ఫోన్ సాఫ్ట్వేర్, యాంటీవైరస్‌ను నిత్యం అప్డేట్ చేసుకోవాలి. ఏదైనా ఓఎస్, యాప్ వర్షన్ మార్పులుంటే వెంటనే అప్డేట్ అవుతాయి.అనుమానాస్పద నంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి.ఈ విషయం తెలుసుకున్న వెంటనే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని హెచ్చరించడం మరిచిపోకండి.మీరు మోసపోయారని అనుమానించినట్లయితే వెంటనే cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.

‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..
భారత సీబీఐ అధికారుల కోరిక మేరకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలున్నాయి. దాంతో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు గతంలో విశ్వప్రయత్నాలు చేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈమేరకు భారత్‌లోని ఉన్నతాధికారులకు లంచాలు కూడా ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి.ఛోక్సీ లంచాల భాగోతంపై ప్రముఖ రిపోర్టర్ కెన్నెత్ రిజోక్ తన బ్లాగ్ (rijock.blogspot)లో గతంలో ఓ ఆర్టికల్‌ను పోస్ట్ చేశారు. ఆ న్యూస్ ఆర్టికల్‌లో అప్పట్లో కరేబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్న ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేలా ఉన్నతాధికారులకు లంచాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఇక్కడ (ఆంటిగ్వాలో) అతనిని అదుపులోకి తీసుకొని భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న ఇంటర్‌పోల్ ప్రయత్నాలకు స్థానిక అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పారు. అంతేకాదు న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా ఆంటిగ్వా ప్రభుత్వ పెద్దలతో పాటు సీనియర్ పోలీస్ అధికారి ఆడోనిస్ హెన్రీ వంటి అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా తన అప్పగింతను ఆలస్యం చేస్తున్నట్లు తేల్చారు. ఆంటిగ్వాలో వ్యాపారంభారత్లో బ్యాంకుల్ని కొల్లగొట్టిన ఛోక్సీ ఆంటిగ్వాలో పెద్ద ఎత్తున రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ఆయనకు సొంతమైన జోలీ హార్బర్ రెస్టారెంట్లో పోలీసు ఉన్నతాధికారి హెన్రీని పలు మార్లు కలిసినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఛీక్సీ హెన్రీని కలవడం మాత్రమే కాదని, లంచం ఇచ్చి న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా మేజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్‌ని సైతం ప్రభావితం చేశారని హైలెట్ చేశారు. క్లార్క్,హెన్రీలు కుట్రపన్ని ఇంటర్ పోల్ అధికారులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారని, అందుకు తగిన సాక్ష్యాదారాలు తన వద్ద ఉన్నాయని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఏఐ థెరపిస్టు!కిడ్నాప్ డ్రామా.. విఫలంఅంటిగ్వా నుంచి క్యూబాకు పారిపోవడానికి ఛోక్సీ కిడ్నాప్ డ్రామా ఆడి అందులో విఫలమైనట్లు రిజోక్ ఆ కథనంలో వివరించారు. 2021లో క్యూబా - భారత్‌ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేనందున విచారణ నుంచి తప్పించుకునేందుకు క్యూబా పారిపోవాలని ఛోక్సీ భావించాడని నివేదికలో పేర్కొన్నాడు. మే 2021లో స్మగ్లర్ల సాయంతో పారిపోయే ప్రయత్నంలో ఛోక్సీ వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదని, అందుకే వాళ్లు డొమినికాలో వదిలేశారని చెప్పారు.

ఏఐ థెరపిస్టు!
లవ్ బ్రేకప్.. ఒంటరితనం.. ఆఫీసులో కోపిష్టి బాస్ వేధింపులు.. సహోద్యోగులతో ఇబ్బందులు.. జీవితంలో ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి, ఓపిగ్గా వినేవారొకరు ఉండాలి. తీరా చెప్పాక జడ్జ్ చేయకుండా ఉంటారా? నిష్పాక్షికంగా పరిష్కార మార్గం సూచిస్తారా? అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మానసిక వైద్యులను సంప్రదిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండు మారుతోంది. ఈ విషయంలో చాట్‌జీపీటీకే జనం ఓటేస్తున్నారు. సమస్యలను వినే మంచి ఫ్రెండ్‌గానే గాక వాటికి పరిష్కారం చూపే కౌన్సిలర్‌గా కూడా భావిస్తున్నారు.లైఫ్ కౌన్సిలర్‌గా..27 ఏళ్ల మనీశ్ ఇంజినీర్. ప్రియురాలితో గొడవైంది. అపార్థాలతో బంధానికి బ్రేక్ పడింది. మానసికంగా అలసిపోయి ఓ సాయం వేళ చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. సమస్యంతా చెప్పాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు. చాట్‌జీపీటీ సమాధానం మనోన్ని ఆశ్చర్యపరిచింది. ‘మీరు చెప్పింది ఆమె వినకపోవడం మిమ్మల్ని బాధిస్తోంది. అదే విషయం ఆమెకు నేరుగా చెప్పారా?’అని అడిగింది. అంతటితో ఆగకుండా ప్రేయసికి సందేశం పంపడంలో మనీశ్‌కు సాయపడింది. ఆమెను నిందించకుండా కేవలం అతని ఫీలింగ్స్ మాత్రమే వ్యక్తపరిచే ప్రశాంతమైన, నిజాయితీతో కూడిన నోట్ అది. అందుకున్న ఆ అమ్మాయి మనీష్‌తో మాట్లాడింది. ఇంకేముంది వారి మధ్య దూరం తగ్గిపోయింది. వృత్తి సమస్యల్లో సాయం26 ఏళ్ల అక్షయ్ శ్రీవాస్తవ కంటెంట్ రైటర్, మీడియా ప్రొఫెషనల్. ఆఫీసుకు వెళ్లిరావడానికే నాలుగ్గంటలు పోతోంది. నిద్ర లేదు. కుటుంబంతో గడపడానికి లేదు. ఫిర్యాదులా కాకుండా ఈ విషయాన్ని బాస్‌తో ఎలా చెప్పాలో తేలక చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. వాడాల్సిన పదాలతో సహా చక్కని నిర్మాణాత్మక సలహాలిచ్చింది. అప్పటినుంచి అక్షయ్ క్రమం తప్పకుండా చాట్‌బాట్‌ను ఆశ్రయిస్తున్నాడు. ఆయేషాది మరో సమస్య. ఇన్నాళ్లు సహోద్యోగిగా ఉన్న స్నేహితులకే బాస్ అయింది. సాన్నిహిత్యం కోల్పోకుండా వాళ్లతో ఎలా డీల్ చేయాలని చాట్‌జీపీటీనే అడిగింది. అదిచ్చిన సమాధానం ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో క్రాష్ కోర్సులా సాయపడింది.బెటర్ కౌన్సిలర్?ఒక్కోసారి కౌన్సిలర్ కంటే మెరుగ్గా చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. జీవితంలో చాలా కోల్పోయాననే భావన కలుగుతుందనే ప్రశ్నకు.. ‘మార్పు జరిగినప్పుడు అది మామూలే. అభిరుచులను పెంచుకోండి’అని కౌన్సిలర్ చెప్పారు. చాట్‌జీపీటీ మాత్రం, ‘సంతోషపరిచే పనులు చేయండి. చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకునే ప్రయత్నం చేయండి’అని సూచించింది. స్నేహితులు అర్థం చేసుకోవడం లేదంటే వారితో ఓపెన్‌గా మాట్లాడమని థెరపిస్టు చెబితే, ‘స్నేహితుల్లో అపార్థాలు మామూలే. వారితో నిజాయితీగా మాట్లాడండి’అని చాట్‌జీపీటీ సూచించింది. పని నచ్చడం లేదంటే ఒత్తిళ్లను గుర్తించి పరిష్కారానికి కొత్తగా ప్రయత్నించమని కౌన్సిలర్ చెప్పాడు. చాట్‌జీపీటీ మాత్రం ‘పనిలో పరిమితులను పెట్టుకోండి. హెచ్ఆర్ లేదా మెంటార్‌తో మాట్లాడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’అని సలహా ఇచ్చింది. భాగస్వామితో విభేదాలపై ఓపెన్‌గా మాట్లాడుకుని, సమస్యకు కారణాలేంటో కనిపెట్టి పరిష్కారానికి కలిసి ప్రయత్నించడన్న చాట్‌జీపీటీ సూచనే మెరుగ్గా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ఇదీ చదవండి: హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలుప్రత్యామ్నాయం కాబోదు: మానసిక వైద్యులుమానసిక వైద్యం మనదేశంలో కాస్త ఖరీదైన విషయం. జనంలో అవగాహన లేమి కూడా ఉంది. ఆ సమస్యలకు చాలామంది క్రమంగా ఏఐపై ఆధారపడుతున్నారు. అది జడ్జ్ చేయదు. చెబుతుంటే మధ్యలో అడ్డుకోదు. ఏం చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎప్పుడు చెప్పినా శ్రద్ధగా వింటుంది. అంతే ఓపిగ్గా సమాధానమూ ఇస్తుంది. దాంతో వ్యక్తిగతం నుంచి వృత్తిపరమైన సలహాల దాకా యూత్ చాట్‌జీపీటీపై ఆధారపడుతోంది. కానీ ఈ చాట్‌బాట్ మానసిక ఇబ్బందులకు మొత్తంగా పరిష్కారం చూపలేదంటున్నారు వైద్యులు. ‘అది తాత్కాలిక ఉపశమనమిచ్చే ఔట్‌లెట్‌లా పనిచేస్తుందంతే. పూర్తిస్థాయి మానసిక చికిత్స ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాబోదు. సానుభూతి, అంతర్దష్టి, అవగాహన వాటికుండవు’ అంటున్నారు. అంతేగాక ఏఐ థెరపీ బాట్లతో ముప్పు కూడా ఉంటుందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రత్యేకించి వాటిని పిల్లలు వాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మనుషులను అవి మరింత ఒంటరిగా చేస్తాయనీ హెచ్చరించింది.
ఫ్యామిలీ

నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
అసలు కంటే నకిలీ ముద్దు ఇదీ ఇవాల్టీ ట్రెండ్. మార్కెట్లో ‘రెప్లికా’ ట్రెండ్ సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. ఆభరణాలకు, వస్త్రాలకు ఇబ్బడిముబ్బడిగా నకిలీలు మార్కెట్లో సంచలనం రేపుతున్నాయి. డిజైనర్ సారీ అయినా, కోట్ల విలువ చేసే డిజైనర్ డైమండ్ నెక్లెస్ అయినా ఒరిజినల్ని మరిపించేలా రెప్లికాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కథనం చదివితే.. ఔరా రెప్లికా అనిపించక మానదు. ఇక కోట్ల విలువ చేసే డైమండ్ నగలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అంబానీ కుటుంబానికి చెందిన ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ పేరే. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ సందర్బంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ పచ్చలు పొదిగిన ఓ డైమండ్ నక్లెస్ ధరించారు. దాని ఖరీదు రూ.500 కోట్లు . దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట మళ్లీ సందడి చేస్తోంది.విశేషమేమిటంటే ఈ నెక్లెస్ కి రెప్లికా మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.500కోట్ల విలువచేసే నెక్లెస్, రెప్లికా అంటే కనీసం ఏ లక్షల్లోనో, వేలల్లోనే ఉంటుంది అనుకుంటున్నారా? కానే కాదు, కేవలం రూ.178 కి జైపూర్‌లో అన్లైన్ అమ్ముతుండటం విశేషం. దీనిని సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.జైపూర్‌కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారి 'నీతా అంబానీజీ నెక్లెస్ కేవలం రూ. 178కి అందుబాటులో ఉంది’’ అంటూ మార్కెటింగ్ చేయడం విశేషంగా నిలిచింది. ఈ వీడియోను ముఖ వ్యాపారవేత్త, RPG ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ హర్ష్ వర్ధన్ గోయెంకా (2024లో) ట్వీట్ చేశారు. "అబ్ క్యా బోలూం! #మార్కెటింగ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో నెటిజన్లను ఇది బాగా ఆకట్టుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేశారు. తక్కువ ధరలకు లగ్జరీ వస్తువులను రూపొందించడంలో భారతీయుల నైపుణ్యాన్ని హైలైట్ చేస్తూ 'కాపీ చేయడంలో ఇండియా అత్యుత్తమం' అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించగా, 'ఇందులో తప్పేముంది భయ్యా.. అందరై తమకిష్టమైన ఫ్యాషన్‌ను ధరించడానికి అర్హులు. అందుకు డబ్బు అడ్డు రాకూడదు కదా ' అని, కమెంట్ చేశారు. 'ధన్యవాదాలు, నేను నా భార్య పుట్టినరోజుకు తక్కువ ఖర్చుతో ఖరీదైన బహుమతిని ఇస్తాను' అని కామెంట్ చేయడం విశేషం. అంతేకాదు నీతా అంబానీ లాగా ఆభరణాలు ధరించాలనే చాలా మంది మహిళల కలలను నెరవేర్చినందుకు ఆ ఆభరణాల వ్యాపారిని ప్రశంసించారు.

పిల్లల ఇష్టాలను గుర్తించకపోతే నష్టమే..!
గూడూరుకు చెందిన రాజేష్‌కు ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషియల్పై మంచి పట్టుసాధించాడు. గ్రూప్సు రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. అయితే ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. ఇష్టం లేని గ్రూపును సరిగా చదవలేక ఫెయిలయ్యాడు. తిరుపతికి చెందిన విద్యాసాగర్‌కు చిన్నతనం నుంచే చార్టెడ్ అకౌంటెంట్ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో తమ కొడుకును ఇంజినీరుగా చూడాలనుకున్నారు. తమ అభిప్రాయాన్ని పిల్లాడిపై రుద్ది బలవంతంగా ఎంపీసీలో చేరి్పంచారు. అయిష్టంతోనే ఎంపీసీ పాస్ మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్‌లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ గ్రూపును తీసుకున్నాడు. పుత్తూరుకు చెందిన దీపికకు చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ అంటే ఇష్టం. ఇంజినీరింగ్ చేయాలన్నది ఆమె కోరిక. తల్లిదండ్రులకేమో తన కుమార్తెను డాక్టరుగా చూడాలనుకున్నారు. డాక్టరును చేయాలనే తపనతో బైపీసీలో బలవంతంగా చేరి్పంచారు. పాస్‌మార్కులతో గట్టెక్కెడంతో మెడిసిన్‌లో సీటు రాలేదు. అప్పటికిగాని తల్లిదండ్రులు తమ తప్పును తెలుసుకోలేకపోయారు.సూళ్లూరుపేటకు చెందిన మనోజ్‌కుమార్ సాధారణ విద్యార్థి. పదోతరగతి పాస్ మార్కులతో గట్టెక్కాడు. గణితం, సైన్సు సబ్జెక్టులపై పట్టు లేదు. అయితే స్నేహితులు ఎంపీసీ, బైపీసీ తీసుకోవడంతో తాను గొప్పగా చెప్పుకోవడానికి ఎంపీసీని ఎంచుకున్నాడు. సబ్జెక్టులు కష్టం కావడంతో ఇంటర్ తప్పాడు. ఏం చేయాలో తెలియక చదువును పక్కనబెట్టాడు. వీరే కాదు.. ఇలా తిరుపతి జిల్లాలో చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆ ఒక్క జిల్లాలోనే కాదు చాలాచోట్ల ఇదే పెను సమస్య. ఇష్టమైన సబ్జెక్టుపై మక్కువ పెంచుకుని అందులో రాణించాలనుకున్న చాలా మంది విద్యార్థులకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆలోచనలు, అభిప్రాయాలతో రాణించలేకపోతున్నారు. ఇంటర్ ప్రవేశం సమయంలో తల్లిదండ్రుల బలవంతంతో కొందరు, గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచనతో మరికొందరు ఇష్టం లేని గ్రూపుల వైపు అడుగులేసి చతికిలపడుతున్నారు. తిరిగి సాధారణ చదువులను కొనసాగిస్తున్నారు. విద్యార్థి దశలో ఇంటర్ కీలకం. ఈ దశలో పడిన అడుగు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పది పరీక్షలు రాసి ఇంటర్ ప్రవేశాల కోసం వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పిల్లల ఆసక్తిని తెలుసుకుని ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లలు వారు కలలుగన్న రంగంలో రాణించగలుగుతారు. ఇష్టాన్ని గుర్తించాలి పిల్లల ఇష్టాలను పక్కనబెట్టి డాక్టర్, ఇంజినీర్ చేయాలని తల్లిదండ్రులు కలలుకంటున్నారు. తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నారు. మేము చెప్పే కోర్సులను తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తమ కోర్కెలను పక్కనబెట్టి తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి రాణించలేకపోతున్నారు. పిల్లల ఇష్టాన్ని గుర్తించినప్పుడే రాణిస్తారన్న సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని మానసిక శాస్త్రవేత్తలు హితవు పలుకుతున్నారు. స్వేచ్ఛనివ్వాలి జిల్లాలో పదోతరగతి పరీక్షలను ఈ ఏడాది 52,065మంది విద్యార్థులు రాశారు. వీరిలో కొందరు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంకొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరనున్నారు. మరికొందరు పాలిటెక్నిక్, ఏపీఆర్జేసి వంటి పోటీ పరీక్షల ద్వారా ఆయా కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పాస్ మార్కులతో గట్టెక్కిన విద్యార్థులు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్ కోర్సులను ఎంచుకుంటున్నారు. సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ఇప్పటికే విద్యార్థులు ప్రణాళిక రచించుకున్నారు. ఇలాంటి సమయంలో ఏది ఉత్తమం, ఏ కోర్సులు తీసుకోవాలి వంటి సలహాలు ఇవ్వడం వరకే తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావించాలి. అంతేతప్ప ఇష్టాలను రుద్దడం చేయకూడదని, గ్రూపుల ఎంపికలో పిల్లలకే స్వేచ్ఛనివ్వాలని నిపుణులు చెబుతున్నారు. నచ్చిన గ్రూపులోనే చేర్పించాలి పది తరువాత ఇంటర్ ప్రవేశంలో పిల్లలకే స్వేచ్ఛనివ్వాలి. వారికి నచ్చిన గ్రూపులో చేరేందుకు సహకరించాలి. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను చెప్పడం వరకే సరిపెట్టుకోవాలి. అంతేతప్ప ఇరుగుపొరుగు పిల్లలతో పోల్చుతూ బలవంతం చేయకూడదు. –డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి, విద్యావేత్త, తిరుపతి బలవంతం వద్దు పిల్లల చదువు విషయంలో పెద్దలు బలవంతం చేయకూడదు. మన ఆలోచనలను వాళ్లపై రుద్దకూడదు. సమాజంలో ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాలే కాదు... ఇంకా న్యాయ, విద్య, మేనేజ్మెంట్ వంటి చాలా రంగాలున్నాయి. తగిన కోర్సులకు ప్రాధాన్యత ఇస్తేనే వారు రాణించగలుగుతారు. – శ్రీధర్, కెరీర్ గైడెన్స్ నిపుణులు, తిరుపతి (చదవండి: ఖండాంతరాలు దాటిన నృత్యం)

యముడికి కాళ్ళు విరగాలని శపించిన తల్లి!
విశ్వకర్మ కూతురైన సంజ్ఞను సూర్యుడు పెండ్లాడాడు. వైవస్వత మనువు, యముడు, యమున వారి సంతానం. సూర్యుడి ప్రచండ కిరణాల ఉష్ణాన్ని భరించలేని సంజ్ఞ, కొంత కాలం సూర్యుడికి దూరంగా ఉండాలనుకుంది. అది సూర్యుడికి తెలియకుండా జరగాలని, తన ఛాయకు రూపాన్ని కల్పించి, తాను అశ్వరూపం ధరించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఛాయ సూర్యుడిని ఆరాధించింది. వారికి సూర్యసావర్ణి మనువు, శని, తపతి సంతాన మయ్యారు. ఛాయకు సొంత సంతానం కలిగిన తరువాత, తమ పట్ల ఆమెచూపించే అనురాగంలో క్షీణతను గమనించిన యముడు ‘తల్లివైయుండి అందరి పట్ల సమానమైన ప్రేమను చూపక పోవడం ఏమిటి? ఇలాంటి బుద్ధి నీకు ఎందుకు కలిగింది?’ అని ప్రశ్నించాడు. అది సహించని ఛాయ, యముడిని దుర్భాష లాడింది. తల్లి నుండి దుర్భాషను ఊహించని యముడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంలో ఏమి చేస్తున్నాడో గ్రహించకుండా, ఛాయను కాలితో తన్నాడు. ఆ విపరీత ప్రవర్తనను భరించలేని ఛాయ, యముడికి కాళ్ళు విరగాలని శపించిది. కాళ్ళు పోగొట్టుకున్న యముడిని చూసి సూర్యుడు ‘ఎందుకిలా జరిగింది?’ అని అడిగాడు. శాపం గురించి చెప్పి ‘ఆమె నిజంగా నా తల్లి అయుంటే ఆమెను నేను ఎలా తన్నగలిగేవాడను? ఆమెకు నేను కొడుకునైతే ఆమె నన్ను ఎలా శపించగలిగేది? ఆమె మాకు తల్లి కాదు, నేను ఆమెకు కొడుకునూ కాదు!’ అన్నాడు. యముడి మాటలు విన్న సూర్యుడు, ఛాయను నిజం చెప్పమని, లేకుంటే శపిస్తానని గద్దించి అడిగాడు. భయపడిన ఛాయ జరిగినదంతా చెప్పింది. విన్న సూర్యుడు యముడి కాళ్ళు పూర్వంలా అయేట్లుగా అనుగ్రహించి, వెంటనే వెళ్ళి అడవిలో అశ్వరూపంలో సంచరిస్తున్న సంజ్ఞను కలుసుకున్నాడు. వారికి రేవంతుడు, అశ్వినీదేవతలు సంతానంగా కలిగారు. త్వష్ట వచ్చి, సంజ్ఞ పడుతున్న బాధను గురించి సూర్యుడికి చెప్పి, సూర్యుడి కిరణాలలో ఎనిమిదవ పాలు సానపట్టి తగ్గించాడు. అలా తగ్గించేక్రమంలో రాలిన సూర్యుడి రణ రజం నుండి శంకరుడి త్రిశూలము, విష్ణుమూర్తి చక్రము, కుబేరుడి ఖడ్గము, కమారస్వామి శక్తి ... ఇలా నానాదేవతల ఆయుధాలు తయారుచేయబడ్డాయని వెన్నెలకంటి సూరన రచించిన శ్రీవిష్ణుపురాణం, చతుర్థాశ్వాసంలో చెప్పబడింది.– భట్టు వెంకటరావు

ఖండాంతరాలు దాటిన నృత్యం
దేశంలోనే కాదు పాశ్చాత్య దేశాల్లోనూ ప్రదర్శనలు చేస్తూ భారతదేశ ప్రాచీన నాట్య కళలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని భరత, కూచిపూడి డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు. ప్రముఖ నాట్యాచారిణి నల్లా రమాదేవి శిక్షణలో తర్ఫీదు పొందుతున్న శ్రీవారి పాదాలు భరత నాట్య, కూచిపూడి అకాడమీ విద్యార్థినులు దేశవ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలే వేదికగా పలు ప్రదర్శనలు చేసి గుర్తింపు పొందారు. రెండేళ్లుగా వివిధ దేశాల్లోనూ నృత్య ప్రదర్శనలు చేసి భారతీయ కళలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతున్నారు. కొద్ది నెలల్లో అమెరికాలోని చికాగో, డల్లాస్ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం 2015లో వెస్ట్ మారేడుపల్లిలో నల్లా రమాదేవి ప్రారంభించిన శ్రీవారి పాదాలు భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఎందరో ప్రతిభావంతులైన నృత్య కళాకారులను అందించింది. ఇక్కడ శిక్షణ పొందిన వందలాది మందిలో 120 మంది సుశిక్షితులైన నృత్య కళాకారులుగా రాణిస్తున్నారు. ఇందులో 25 మంది కళాకారులు దేశ విదేశాల్లో నృత్య కళాశాలలు ఏర్పాటు చేసుకుని శిక్షణ ఇస్తుండడం ఈ డ్యాన్స్ అకాడమీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. నాలుగేళ్ల కోర్సు అనంతరం, డిప్లొమా, పీజీ వరకూ సరి్టఫికెట్ కోర్సులు పొందే విధంగా ఇక్కడ శిక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం 200 మంది బాలికలు కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ పొందుతున్నారు. నాలుగేళ్ల బాల్యం నుంచి పీజీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసేంత వరకూ ఈ అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు. జ్యోతిర్లింగాల నుంచి తొలి అడుగు.. ఇక్కడ శిæక్షణ పొందుతున్న విద్యార్థులు నృత్య గురువు నల్లా రమాదేవి నేతృత్వంలో నగరంలో పలు ప్రదర్శనలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సందర్భాల్లో నాట్య ప్రదర్శనలు చేయడం మామూలైన నేటి తరుణంలో ఏదైనా ప్రత్యేకతను సొంతం చేసుకోవాలన్న తపన మేరకు ప్రత్యేక ప్రదర్శనల కోసం జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలను వేదికలుగా శ్రీవారి పాదాలు నృత్య అకాడమీని ఎంచుకున్నారు. అంతర్జాతీయ ప్రదర్శనలు.. ఇస్కాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కృష్ణభగవాన్ దేవాలయాల్లో దేశవ్యాప్తంగా పలు ప్రదర్శనలు చేసిన అకాడమీకి చెందిన కళాకారులు అనేక పురస్కారాలు అందుకున్నారు. నృత్య కళకు సార్థకం చేకూర్చాలన్న తపనతో ఇప్పటి వరకూ 15 అష్టాదశ శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాల ముందు ప్రదర్శనలు చేశారు. మలేషియా, ఇండోనేషియా, నేపాల్, బ్యాంకాగ్, దుబాయ్, శ్రీలంక, వియత్నాం వంటి దేశాల్లో బతుకమ్మ, శివతాండవం వంటి నృత్య రూపకాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ ఏడాది మే నెల్లో అమెరికాలో నృత్యరూపకాల ప్రదర్శనలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. నాట్యం అంటే చిన్ననాటి నుంచే ప్రాణం. భద్రాచలంలో పెరిగిన నేను అక్కడే నాట్యగురువు గిరిజాదేవి వద్ద నాట్యం నేర్చుకుని, భద్రాద్రి రాముడి సన్నిధిలోనే అరంగేట్రం చేశాను. భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుని కళాశాల విద్య వరకూ భద్రాద్రి పరిసర ప్రాంతాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చా. అయితే పదిహేనేళ్ల క్రితం భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు మా కుటుంబంతో షిఫ్ట్ అయ్యాం. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరినా సంతృప్తి కలగలేదు. నాట్యంపై మమకారంతో ఉద్యోగం వదిలి పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో డ్యాన్స్ సర్టిఫికేషన్ కోర్సులో చేరి మరింత తర్ఫిదు పొందాను. డాక్టర్ ఇందిరాహేమ సహకారంతో శ్రీవారి పాదాలు పేరుతో డ్యాన్స్ అకాడమీని ప్రారంభించాను. నల్లా రమాదేవి, శ్రీవారి పాదాలు డ్యాన్స్ అకాడమీ నిర్వాహకురాలు (చదవండి:
ఫొటోలు


పెళ్లిలో సందడి చేసిన బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)


ఒకప్పటి తెలుగు హీరోయిన్.. 44వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


మంచు లక్ష్మీ ఫ్యాషన్ షో.. వజ్రంలా మెరిసిపోయిన అనసూయ (ఫొటోలు)


పెళ్లయి అప్పుడే మూడేళ్లు.. ఆలియా క్యూట్ వెడ్డింగ్ (ఫొటోలు)


‘కూర్గ్’ కాఫీ తోటలో భర్త వెంకట దత్తసాయితో పీవీ సింధు విహారం (ఫొటోలు)


‘ఓదెల 2’ ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్ తమన్నా (ఫొటోలు)


హైదరాబాద్ : జలవిహార్ లో జనం సందడి (ఫొటోలు)


గరుడ పక్షి రాకతో వైభవోపేతంగా రఘునాయకుని కల్యాణోత్సవం (ఫొటోలు)


నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)


తమన్నా ‘ఓదెల 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
అంతర్జాతీయం

ఖనిజాలు బంద్
బీజింగ్/బ్యాంకాక్: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదన్న చైనా, అనుకున్నట్టుగానే అమెరికాకు గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంలో ఈ మేరకు పేర్కొంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. అమెరికా ఈ ఖనిజాలను 72 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. రక్షణ రంగ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్‌తో పాటు కార్ల తయారీ కంపెనీ టెస్లా, టెక్ దిగ్గజం యాపిల్ వంటి ఎన్నో సంస్థలు చాలా రకాలైన కీలక ముడి పదార్థాల కోసం ప్రధానంగా చైనా ఎగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఆయా ఖనిజ నిల్వలు అమెరికాలోనూ ఉన్నా అక్కడి పరిశ్రమల అవసరాలను అవి ఏమాత్రమూ తీర్చలేవు. దాంతో వాటి లోటును భర్తీ చేసుకోవడం అగ్ర రాజ్యానికి చాలా కష్టతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం వాటా చైనాదే. చైనా నిర్ణయంతో అమెరికాతో పాటు చాలా దేశాలు ప్రభావితం కానున్నాయి.ఢీ అంటే ఢీ అమెరికా, చైనా మధ్య సుంకాల పోరు కొద్ది రోజులుగా తారస్థాయికి చేరుకోవడం తెలిసిందే. చైనాపై సుంకాలను ఏకంగా 145 శాతానికి పెంచుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతీకారంగా అమెరికాపై చైనా 125 శాతం సుంకాలు విధించింది. అంతేగాక ఖనిజ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తామని కూడా ఏప్రిల్ 2వ తేదీనే ప్రకటించింది. చైనా తమతో చర్చలకు వచ్చి సుంకాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించగా, ఆ ప్రసక్తే లేదని చైనా కుండబద్దలు కొట్టడం తెలిసిందే. అంతేగాక ఆయనవి మతిలేని చర్యలంటూ గట్టిగా నలుగు పెట్టింది. ‘‘ఈ ప్రతీకార సుంకాలతో ఎవరికీ మేలు జరగదు. వాణిజ్య యుద్ధంలో విజేతలంటూ ఉండరు. అమెరికా బెదిరింపులకు లొంగే సమస్యే లేదు’’ అని స్పష్టం చేసింది. అమెరికా ముందుకొస్తేనే చర్చలకు సిద్ధపడతామని కూడా తేల్చేసింది.చైనాయే దిక్కు అమెరికా కొన్నేళ్లుగా చైనా దిగుమతులపై విపరీతంగా ఆధారపడుతున్న కీలక విభాగాల సంఖ్య గత పాతికేళ్లలో అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం 532 రకాల కీలక ఉత్పత్తి విభాగాల విషయంలో అగ్ర రాజ్యానికి చైనా దిగుమతులే దిక్కు. ఇదే సమయంలో చైనా ప్రధానంగా అమెరికా ఉత్పత్తులపై ఆధారపడ్డ విభాగాల సంఖ్య మాత్రం సగానికి సగం తగ్గిపోయింది. అంతేగాక అమెరికా నుంచి పలు కీలక వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై చైనా ఆంక్షలు విధించనుంది. అగ్ర రాజ్యానికి ఇది కూడా కోలుకోలేని దెబ్బే. అమెరికా సోయాబీన్ ఎగుమతులు తదితరాల్లో 10 శాతానికి పైగా వాటా చైనాదే.

Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం
న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఘన చరిత్రను చెరిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల సాయంతో మాట్లాడిన ఆమె మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను మతోన్మాద దేశంగా మార్చిందని, దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్(Muhammad Yunus)ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్‌ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ, అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి, ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి.2024, ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా..మహ్మద్ యూనస్‌పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్(Awami League)ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ ఆధారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి, యూనస్‌ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్ మదిలో ‘హైదరాబాద్’.. కలకత్తా, ముంబైలను కాదంటూ..

వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు
బ్రస్సెల్స్: ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, అతడిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు అతడిని బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు. ఇక, ఛోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతకుముందు.. పీఎన్బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.కాగా, 2018 జనవరిలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. Fugitive diamond trader Mehul Choksi, who is wanted in connection with the Rs 13,500-crore Punjab National Bank (PNB) loan fraud case, has been arrested by the police in Belgium, according to a report. The 65-year-old was taken into custody on Saturday (April 12) at the request… pic.twitter.com/xQlq2T3E0C— News9 (@News9Tweets) April 14, 2025

చిందేసిన ట్రంప్..!
మియామి: వలసదారుల బహిష్కరణలు, సుంకాలతో హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కాస్త రిలాక్సయ్యారు. తన బృందంలో కీలక సభ్యులైన ఎలాన్ మస్క్, తులసీ గబార్డ్ తదితరులతో కలిసి ఫ్లోరిడాలోని మియామిలో అలి్టమేట్ ఫైటింగ్ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని తిలకించారు. అభిమానులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేసి, పిడికిలి బిగించి ఉత్సాహపరిచారు. పూర్తిగా ఫిట్ 78 ఏళ్ల ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. అమెరికా సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసే సామర్ధ్యం ఆయనకుందని పేర్కొన్నారు. శుక్రవారం ట్రంప్‌కు జరిపిన సాధారణ వైద్య పరీక్షల ఫలితాలను వైట్‌హౌస్ విడుదల చేసింది. ‘2020లో అధ్యక్షుడిగా ఉండగా చివరిసారిగా జరిపిన పరీక్షల్లో ట్రంప్ 110.677 కిలోలుండగా ఇప్పుడు 9 కిలోలు తగ్గారు. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు తగ్గాయి. అధ్యక్షుడిగా రోజూ సమావేశాలు, సభల్లో భేటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల ఓ గోల్ఫ్ పోటీలో విజేతగా నిలిచారు కూడా. ఆరోగ్యవంతుల్లో కొలెస్టరాల్ స్థాయి 200కు మించరాదు. బీపీ మాత్రం కాస్త ఎక్కువ (128/74)గా ఉంది. హృదయ స్పందన రేటు గతంలో మాదిరిగా 62గానే ఉంది. గుండెపోటు రిస్‌్కను నివారించేందుకు ట్రంప్ నిత్యం ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నారు’’ అని పేర్కొంది. Trump Dance at UFC 314 🇺🇸 pic.twitter.com/Ud01BkHp8M— Margo Martin (@MargoMartin47) April 13, 2025
జాతీయం

అభిమానికి పాదరక్షలు
ఈ ఫొటోలో కన్పిస్తున్న వ్యక్తి పేరు రాంగోపాల్ కశ్యప్. హరియాణాలోని యమునానగర్ వాసి. మోదీకి వీరాభిమాని. ఆయన ప్రధాని అయ్యేదాకా చెప్పులు వేసుకోబోనని 14 ఏళ్ల క్రితం భీషణ ప్రతిజ్ఞ చేశారు. సోమవారం యమునానగర్‌లో బహిరంగ సభ సందర్భంగా మోదీ ఆయన్ను కలిశారు. బూట్లు కానుకగా ఇవ్వడమే గాక వాటిని ధరించడంలో సాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందులో కశ్యప్ చెప్పుల్లేకుండా మోదీ వద్దకు వెళ్లి కరచాలనం చేయడం కన్పిస్తోంది. తర్వాత ఆయన్ను మోదీ తనతో పాటు కూచుండబెట్టుకున్నారు. ‘‘ఇలాంటి ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది? నీకు పాదరక్షలు తొడుగుతున్నా. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు సుమా!’’అంటూ ప్రేమగా మందలించారు. కొత్త బూట్లు సౌకర్యంగా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ‘‘నాపై కశ్యప్ అభిమానానికి చలించిపోయాను. ఆయనకు బూట్లు ధరింపజేసే అవకాశం లభించినందుకు నిజంగా ఆనందంగా ఉంది’’అంటూ ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు. ‘‘ఇలాంటి కోట్లాదిమంది అభిమానులే నా బలం. వారి ఆదరణను వినమ్రంగా స్వీకరిస్తున్నా. వారంతా సంఘసేవ ద్వారా జాతి నిర్మాణానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నా’’అన్నారు.

వేలానికి గోల్కొండ బ్లూ వజ్రం
న్యూఢిల్లీ: ఇండోర్, బరోడా మహారాజులు గతంలో ఎంతో మక్కువతో సొంతం చేసుకున్న అత్యంత అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం వేలానికి రాబోతోంది. క్రిస్టీస్ వేలం సంస్థ స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో మే 14వ తేదీన ఈ నీలిరంగు వజ్రాన్ని వేలం వేయనుంది. ఈ వజ్రం బరువు 23.24 క్యారెట్లు. వేలంలో 35 మిలియన్ డాలర్ల నుంచి 50 మిలియన్ డాలర్లు (రూ.300 కోట్ల నుంచి రూ.430 కోట్లు పలకవచ్చని అంచనా వేస్తున్నారు. అరుదైన గోల్కొండ వజ్రాన్ని తాము వేలం వేస్తుండడం క్రిస్టీస్ సంస్థ గొప్ప గౌరవంగా భావిస్తోంది. ఇలాంటి అవకాశం జీవితకాలంలో ఒక్కసారే లభిస్తుంది ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. రంగు, పరిమాణంలో గోల్కొండ నీలి వజ్రాన్ని మించింది మరొకటి లేదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జువెల్లరీ రాహుల్ కడాకియా వెల్లడించారు. ఈ వజ్రం మూలాలు హైదరాబాద్ శివార్లలోని గోల్కొండ ప్రాంతంలో ఉన్నట్లు చెబుతున్నారు.

రూ.1,800 కోట్ల డ్రగ్స్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో మాదకద్రవ్యాలను అక్రమంగా తీసుకువచ్చే పాకిస్తాన్ స్మగ్లర్ల ఆటకట్టింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ బృందం(ఏటీఎస్), తీర రక్షక దళం(ఐసీజీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.1,800 కోట్ల విలువైన 300 కిలోల మెథాంఫెటమైన్ అనే సింథటిక్ డ్రగ్ పట్టుబడింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి దాటాక అరేబియా సముద్రంలో ఘటన చోటుచేసుకుంది. ఫిదా అనే పేరున్న మాఫియా ముఠా చేపల పడవలో భారత జలాల్లోకి ప్రవేశించనుందంటూ ఏటీఎస్ అందించిన నిఘా సమాచారం మేరకు ఐసీజీ గస్తీని ముమ్మరం చేసింది. అంతర్జాతీయ సముద్ర జలాలకు అత్యంత సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఐసీజీ గస్తీ ఓడను దూరం నుంచే గమనించిన స్మగ్లర్లు తమ బోటులో ఉన్న డ్రగ్స్ డ్రమ్ములను సముద్రంలో విసిరేశారు. వేగంగా అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దుల వైపు వెళ్లిపోయారు. ఇదంతా వెంటవెంటనే జరిగిపోయింది. వారిని పట్టుకునేందుకు ఐసీజీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కటిక చీకటిలోనే వారు విసిరేసిన డ్రగ్ పార్శిళ్లను ఐసీజీ, ఏటీఎస్ సిబ్బంది గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 311 ప్యాకెట్లలో 311 కిలోల మెథాంఫెటమైన్‌ను పోర్బందర్ తీరానికి తరలించి, దర్యాప్తు చేపట్టామని ఐసీజీ తెలిపింది. ఈ ప్యాకెట్లను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సీల్ వేసి ఉంచారని, సముద్ర జలాల్లో వేసినా అందులోని సరుకు పాడవదని ఏటీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి చెప్పారు. ఈ డ్రగ్స్ గమ్యస్థానం తమిళనాడని ఆయన వివరించారు. పాక్‌లోని పస్ని పోర్టు నుంచి బయలుదేరిన మాఫియా సభ్యులు సముద్ర జలాల్లోనే డ్రగ్స్‌ను మరో బోటులోకి మార్చి, ఆపైన తమిళనాడుకు చేరవేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇటువంటి 13 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి, అక్రమార్కుల ఆటకట్టించామని వివరించారు. కాగా, ఐస్, క్రిస్టల్ మెథ్ అని కూడా పిలిచే మెథాంఫెటమైన్ చాలా శక్తివంతమైన డ్రగ్. పొట్టలో రూ.7.85 కోట్ల కొకైన్ ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఉగాండా దేశస్తుడి పొట్టలో రూ.7.85 కోట్ల విలువుండే 785 గ్రాముల కొకైన్‌ను గుర్తించారు. ఈ నెల 9వ తేదీన రాత్రి ఓ విమానంలో వచ్చిన అతడిని అధికారులు అడ్డుకున్నారు. విచారణ సమయంలో అతడు ఆందోళనతో కనిపించడంతో కనిపించాడు. దీంతో, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేయించగా పొట్టలో టాబ్లెట్లు ఉన్నట్లు తేలింది.

రాజ్యాంగ విధ్వంసకారి కాంగ్రెస్: ప్రధాని మోదీ
హిసార్: కాంగ్రెస్ పార్టిపై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. రాజ్యాంగ విధ్వంసకారిగా కాంగ్రెస్ మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను రెండో తరగతి పౌరులుగా మార్చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్ల సాధారణ ముస్లింలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని మండిపడ్డారు. సోమవారం హరియాణా రాష్ట్రం హిసార్‌లోని మహారాజా అగ్రసేన్ ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం హిసార్–అయోధ్య మధ్య తొలి కమర్షియల్ విమానాన్ని ప్రారంభించారు. అలాగే యమునానగర్ జిల్లాలోని దీనబందు చోటూ రామ్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల అల్ట్రా–క్రిటికల్ మోడ్రన్ థర్మన్ పవర్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. రెండుచోట్లా సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రమాదంలో పడ్డప్పుడల్లా రాజ్యాంగాన్ని అణచివేశారని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విస్మరించిన కాంగ్రెస్ ‘‘దేశంలో నేడు దురదృష్టం ఏమిటో చూడండి. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వ్యక్తులే నేడు అదే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని రాజ్యాంగం చెబుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయి. సమాజంలో సమానత్వం రావాలని అంబేడ్కర్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అనే వైరస్‌ను వ్యాప్తి చేసింది. పవిత్రమైన రాజ్యాంగాన్ని కేవలం అధికారం కోసం ఆయుధంగా వాడుకుంది. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మంచినీరు ఆ పార్టీ నాయకుల స్విమ్మింగ్ పూల్స్‌కు చేరింది కానీ గ్రామాలకు చేరుకోలేదు. స్వాతంత్య్రం వచ్చి70 ఏళ్లు గడిచినా గ్రామాల్లో 16% ఇళ్లకు కూడా కుళాయి నీరు రాలేదు. కాంగ్రెస్ విధానాల వల్ల నష్టపోయింది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కాదా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు తాగునీరు అందించడంపై దృష్టి పెట్టాం. గత ఏడేళ్లలో 12 కోట్ల కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. దేశంలో ప్రస్తుతం 80% ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. మిగతా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం తథ్యం. కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహరి్నశలూ శ్రమిస్తున్నాం. హవాయి చెప్పులు ధరించేవారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేయాలన్నదే మా లక్ష్యం. అది ఇప్పుడిప్పుడే సాకారం అవుతోంది. గత పదేళ్లలో కోట్లాది మంది ప్రజలు తొలిసారిగా విమాన ప్రయాణం చేశారు. గతంలో సరైన రైల్వేస్టేషన్లు లేనిచోట కూడా ఇప్పుడు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 150కు చేరింది. మన ఎయిర్‌లైన్ సంస్థలు 2,000 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చాయి. కొత్త విమానాలతో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. పరుగు ఆపని అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి.. ఇదే బీజేపీ ప్రభుత్వాల మంత్రం. పేదలు, గిరిజనులు, మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్నదే మా ధ్యేయం. మా ప్రతి నిర్ణయం, ప్రతి విధానం అంబేడ్కర్‌కే అంకితం. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పెద్దపెద్ద మాటలు చెబుతోంది. కానీ, అంబేడ్కర్‌కు, చౌదరి చరణ్‌సింగ్‌కు కాంగ్రెస్ భారతరత్న పురస్కారాలు ఇవ్వలేదన్న సంగతి మనం మర్చిపోవద్దు. అంబేడ్కర్‌కు మరణానంతరం భారతరత్న దక్కిందంటే అందుకు కారణం బీజేపీ. చౌదరి చరణ్‌సింగ్‌కు బీజేపీ ప్రభుత్వమే భారతరత్న ఇచ్చింది. అంబేడ్కర్ జయంతి చాలా ముఖ్యమైన రోజు. ఇది మనందరికీ రెండో దీపావళి. మతం ఆధారంగా రిజర్వేషన్లా? 2013 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి హడావుడిగా సవరణలు తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఓట్ల కోసమే కుతంత్రాలకు పాల్పడింది. రాజ్యాంగాన్ని ధిక్కరించి మరీ వక్ఫ్ చట్టంలో సవరణలు చేశారు. ఇది అంబేడ్కర్‌ను అవమానించడం కాదా? ఓటు బ్యాంకు కోసం ఆరాటపడింది ఎవరు? ముస్లింలపై కాంగ్రెస్‌కు నిజంగా అభిమానం ఉంటే ఆ పార్టీ అధినేతగా ముస్లింను నియమించాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 50 శాతం టికెట్లు ముస్లింలకే ఇవ్వాలి. కానీ, కాంగ్రెస్ ఆ పని చేయదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేడ్కర్ చెప్పారు. రాజ్యాంగం సైతం ఇలాంటి రిజర్వేషన్లపై నిషేధం విధించింది. కానీ, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ టెండర్లలో మతం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కొల్లగొడుతున్నారు. లూటీని ఆపడానికే వక్ఫ్చట్టం దేశంలో వక్ఫ్ బోర్డులకు లక్షల ఎకరాల భూములున్నాయి. అవి పేద ముస్లింలకు, మహిళలకు, చిన్నారుల అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. ఆ భూములను సక్రమంగా ఉపయోగించుకొని ఉంటే నేడు ముస్లిం యువత టైర్ల పంక్చర్ దుకాణాల్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. వక్ఫ్ భూములు కేవలం భూమాఫియాకే ఉపయోగపడుతున్నాయి. పేద ముస్లింలకు ఒరిగిందేమీ లేదు. దళితులు, వెనుకబడివర్గాలు, ఆదివాసీలు, వితంతువులను భూ మాఫియా లూటీ చేసింది. ఈ లూటీని ఆపడానికే వక్ఫ్(సవరణ) చట్టం తీసుకొచ్చాం. ఆదివాసీల భూములు, ఆస్తులను ఇకపై వక్ఫ్ బోర్డు తాకను కూడా తాకలేదు. వక్ఫ్ స్ఫూర్తిని మేము గౌరవిస్తున్నాం. ముస్లిం మహిళలు, పేదలు, చిన్నారుల హక్కులకు ఎప్ప టికీ రక్షణ లభించే ఏర్పాటు చేశాం. ఇదే అసలైన సామాజిక న్యాయం’’’ అని మోదీ ఉద్ఘాటించారు.
ఎన్ఆర్ఐ

నాట్స్ సంబరాల్లో సరికొత్త సాహిత్య కార్యక్రమాలు
అమెరికాలోని టంపాలో జూలై 4.5,6 తేదీల్లో జరిగే 8 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ తెలిపారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో తెలుగు భాష కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమెరికా తెలుగు సంబరాల్లో తనతో పాటు వచ్చే తెలుగు రచయితలతో కలిసి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో నాట్స్ సంబరాలకు విచ్చేసే అతిధుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబోస్ మాట్లాడారు. సంబరాల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాట్స్‌తో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని.. గతంలో కూడా నాట్స్ సంబరాలకు వెళ్లానని ప్రముఖ సినీ సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అన్నారు. సంబరాల సాహితీ కార్యక్రమాల్లో కచ్చితంగా పాలుపంచుకుంటానని తెలిపారు.. నాట్స్ సంబరాలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ప్రముఖ గేయ రచయిత త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సంబరాల్లో తెలుగు సాహిత్య సదస్సుల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ 8 వ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ కుటుంబసమేతంగా రావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి పిలుపునిచ్చారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు 300 మంది సంబరాల కార్యవర్గ కమిటీ సభ్యులు ఇప్పటినుంచే ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సంబరాల్లో తెలుగు భాష ప్రేమికులను ఆకట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు.

గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ క్రమంగా తెలుగు వారికి చేరవయ్యేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రేట్ ఓర్లాండో లోని తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శక్తి పౌండేషన్ మధురిమ, మా దుర్గ సాయి టెంపుల్ చెందిన అనితా దుగ్గల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్కి చెందిన పార్వతీ శ్రీరామ, సృజని గోలి, శుభ, విమెన్ ఫర్ ఛారిటీకి చెందిన రత్న సుజ, నిషితలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.కాలిఫోర్నియా నుంచి శిరిష ఎల్లా ఈ మహిళ దినోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చి అందరిలో స్ఫూర్తిని నింపారు. సంతోష్, వేణు మల్ల, రాజశేఖర్ అంగ, లక్ష్మీ, ఎంటర్ ప్రెన్యూర్ వర్ణ, ఫోటోగ్రాఫర్ కార్తీక్‌లు వాలంటీర్లుగా తమ విలువైన సేవలకు అందించారు. మా ఫుడ్స్, నాటు నాటు సంస్థలు ఈ మహిళా దినోత్సవానికి ఫుడ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అబుదాబిలో ఘనంగా ఉగాది వేడుకలు..
సనాతనం, సత్సంబంధం, సంఘటితం, సహకారం, సత్సంగం వంటి పంచ ప్రామాణికాలతో ప్రారంభించబడిన యు.ఏ.ఈ లోని అతిపెద్ద బ్రాహ్మణ సమూహం గాయత్రీ కుటుంబం ఆధ్వ్యర్యంలో శ్రీ విశ్వావసు ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుమారు 300 కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నారుప్రారంభం నుంచి చివరి వరకు ఆర్ష సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ఆద్యంతం చక్కటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాజధాని అబుదాబిలో కన్నుల పండుగగా జరిగింది. దీపారాధన, విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య విశారద బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ గారిచే పంచాంగ పఠనం, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి ప్రీతి తాతంభొట్ల, సంగీత గురువులు రాగ మయూరి, ఇందిరా కొప్పర్తి గార్లు తమ శిష్య బృందంతో సంగీత, నృత్య ప్రదర్శనలు, శ్రీనివాస మూర్తి గారు లాస్య వల్లరి, శివ తాండవ స్తోత్రం, ప్రముఖ తెలుగు కవులు ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి ఆర్ధ్వర్యంలో, శ్రీలక్ష్మి చావలి, వెంపటి సతీష్‌ల కవి సమ్మేళనం, భగవద్గీత, అన్నమాచర్య, రామదాసు కీర్తనలు, సుభాషితాలు, సాహిత్య కార్యక్రమాలతో గాయత్రీ కుటుంబానికి సంబంధించిన చిన్నారులు, పెద్దలు తమ అద్భుతమైన ప్రతిభతో పూర్తి తెలుగింటి సంప్రదాయాన్ని కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ రసజ్ఞులను సమ్మోహితులను చేశారు .ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీమతి ఉషా బాల కౌతా గారు అందర్నీ ఆకట్టుకున్నారు. ఓరుగంటి సుబ్రహ్మణ్య శర్మ గాయత్రీ కుటుంబం ప్రధాన ఉద్దేశ్యాల గురించి వివరిస్తూ.. స్వదేశంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు గాయత్రి కుటుంబం అండదండగా నిలుస్తోంది. వారికి విద్య, వైద్య , వివాహం వంటి కార్యక్రమాలకు ఇప్పటి వరకూ గాయత్రి కుటుంబ సభ్యులు సుమారు కోటిన్నర రూపాయల వరకు సహాయం అందించారని, భవిష్యత్తులో బ్రాహ్మణ సంక్షేమానికి మరింత సహకారం అందిస్తామని వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు గాయత్రీ కుటుంబం సమైక్యతను అభినందిస్తూ..ఈ సమూహం చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే "ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ దేశ సంస్కృతిని గౌరవిస్తూనే బ్రాహ్మణులు స్వధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు. బ్రాహ్మణులు ధర్మ జీవనం, ధర్మ పరిరక్షణ వదిలిపెట్టవద్దని, ఎల్లప్పుడూ జ్ఞానార్జన చేస్తూ.. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నారు. పట్టుదల, దీక్ష, తపస్సు, సహనం, నియమ నిష్ఠలతో నిత్యం గాయత్రీదేవిని ఆరాధించి, బ్రాహ్మణత్వాన్ని పొందాలి అని పిలుపునిచ్చారుఈ మొత్తం కార్యక్రమానికి సంపంగి గ్రూపు పూర్తి సహకారాన్ని అందించినందుకు నిర్వాహకులు ఆ గ్రూపు పెద్దలను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమంలో సభ్యులకు ఉగాది పచ్చడి, తిరుమల శ్రీవారి తీర్ధ ప్రసాదాలతో పాటు, అచ్చమైన బ్రాహ్మణ భోజనాన్ని అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని గాయత్రీ కార్యకారిణీ బృందం రాయసం శ్రీనివాసరావు, మోహన్ ముసునూరి, గడియారం శ్రీనివాస్, సుబ్రహ్మణ్య శర్మ, వంశీ చాళ్లురి, రమేష్ సమర్ధవంతంగా నిర్వహించింది. (చదవండి: Ugadi 2025: సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు..)

Ugadi 2025 సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్‌సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్‌లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది.

Ranga Reddy: కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్
రంగారెడ్డి జిల్లా: మేనమామ పెళ్లి వేడుకలకోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ మృత్యువాతపడ్డారు. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్దలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దామరగిద్దకు చెందిన తెలుగు జంగయ్య, అనసూయల కుమారుడు రాంబాబు వివాహం ఈనెల 30న జరగనుంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా రాంబాబు అక్కాచెల్లెళ్లైన సీతారాంపూర్‌కు చెందిన ఉమారాణి, పామెన గ్రామానికి చెందిన జ్యోతి తమ పిల్లలను తీసుకుని రెండు రోజుల క్రితం దామరగిద్దకు వచ్చారు. ఇంటికి రంగులు వేసే పనులు కొనసాగుతుండటంతో పిల్లలంతా కలసి బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఉమారాణి చిన్న కూతురు అభినయశ్రీ (4), జ్యోతి చిన్న కూతురు తన్మయశ్రీ(5) ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత పిల్లలు డోర్లు వేసుకోవడంతో అవి లాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పిల్లలందరూ ఒకే చోట ఆడుకుంటున్నారని భావించిన కుటుంబ సభ్యులు వారివారి పనుల్లో మునిగిపోయారు. సుమారు రెండు గంటలు గడిచిన తర్వాత అభినయశ్రీ, తన్మయశ్రీ కనిపించకపోవడంతో అంతా వారికోసం వెతుకుతుండగా కారు డోర్లు తీసి చూశారు. ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు పిల్లలు మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతి ఘటన దామరగిద్దతోపాటు సీతారాంపూర్, పామెన గ్రామాల్లో విషాదం నింపింది. పిల్లల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు అందరినీ కలచి వేశాయి.

స్నేహితుడుమోసం చేశాడని.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అమీర్‌పేట: స్నేహితుడు డబ్బులు తీసుకుని మోసం చేయడంతో మనస్తాపానికి లోనైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగపూర్‌కు చెందిన శివాని, రుడాల్ప్ ఆంటోని (30) దంపతులు అమీర్‌పేట ధరమ్‌కరం రోడ్డులో నివాసముంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో భార్య కూడా ఉద్యోగం చేయాలని ఆంటోని భావించాడు. ఈ నేపథ్యంలో అతడి స్నేహితుడు విశాల్ శివానికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతడికి రూ.4.50 లక్షలు ఇచ్చాడు. అయితే అతను ఉద్యోగంఇప్పించకపోవడంతో ఆదివారం రాత్రి అల్వాల్‌లోని విశాల్ ఇంటికరి వెళ్లి గొడవ పడ్డాడు. రాత్రి ఇంటికి తిరిగి వచి్చన ఆంటోని కష్టపడి కూడబెట్టిన డబ్బు స్నేహితుడే కాజేశాడని భార్యకు చెప్పి బాధపడ్డాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతను గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శివాని స్నేహితుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆంటోనీ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
విశాఖపట్నం: బెట్టింగులకు అలవాటు పడి అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉద్యోగిని పోలీసులు కాపాడిన సంఘటన భీమిలి బీచ్‌రోడ్డులో చోటు చేసుకుంది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక ప్రాంతానికి చెందిన కొండా సుందర్ (30), భార్య, కుమార్తెతో కలిసి పీఎంపాలెంలో నివాసం ఉంటున్నారు. రెండున్నరేళ్లుగా రుషికొండ ఐటీ సెజ్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో బెట్టింగులకు పాల్పడుతూ, అది కాస్తా వ్యసనంగా మారింది. బెట్టింగ్‌ల కారణంగా సుమారు రూ. 21 లక్షల అప్పు చేశాడు. స్నేహితుల ఖాతాలో బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చాల్సిందిగా.. ఒత్తిడి పెరిగింది. దీంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం విధులకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరాదు. కాసేపటి తర్వాత ‘నాన్నా నన్ను క్షమించు, నీకు ముఖం చూపించలేకపోతున్నా రూ. 21 లక్షలు అప్పు చేశాను. నేను ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేని పరిస్థితి. నాభార్య, కుమార్తెను బాగా చూసుకోండి.. నేను చచ్చిపోతానంటూ..’ఓ సెల్ఫీ వీడియో తీసి తన తండ్రికి పంపించాడు. అది చూసిన తండ్రి వెంటనే 112కు కాల్ చేసి విషయం చెప్పి, ఆ వీడియోను పోలీసులకు పంపించారు. అతను పంపిన వీడియోలో.. తన కోసం వెతికితే బీచ్ రోడ్డులో ఫోన్ దొరుకుతుందని చెప్పడంతో.. ఆయన పంపిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి భీమిలి బీచ్ రోడ్డు రామానాయుడు ఫిల్మ్సూ్టడియో సమీపంలో ఉన్న బీచ్‌కు చేరుకున్నారు. సుందర్ ఓ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. పీఎంపాలెం బీచ్ మొబైల్ పోలీసులు ఆయనను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పోలీసులు తెలుసుకుని సుందర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అతి తక్కువ సమయంలో సుందర్‌ను గుర్తించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని సీఐ బాలకృష్ణ అభినందించారు.
వీడియోలు


Perni Nani: వక్ఫ్ సవరణ బిల్లు సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా జరుగుతోంది


మంత్రి పదవి కావాలంటే.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్


Nandigam Suresh: నా తల్లి,భార్యను కాలితో తన్ని.. త్వరలోనే ఆ వీడియోలు బయటపెడతా..


సీమ రాజాకు YSRCP యువత హెచ్చరిక


Bakkamantulapad: మల్లేశ్వరి మృతదేహాన్ని ప్రియుడు జానారెడ్డి ఇంటికి తీసుకెళ్లిన బంధువులు


కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీకి తగ్గ గుర్తింపు లేదు: జీవన్ రెడ్డి


అదే బ్లడ్.. అదే బ్రీడ్.. పాత కుట్రకు మళ్లీ పదును!


ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకి లాభం ఎంటి?: కిషన్ రెడ్డి


చంద్రబాబు దళిత వ్యతిరేకి: సుధాకర్ బాబు


Waqf Bill: నీకు బుద్ధి చెప్పి తీరుతాం... బాబును ఏకిపారేసిన ముస్లింలు