
డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు
● టోకూరులో సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ స్థల పరిశీలన
అనంతగిరి (అరకులోయ టౌన్): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు ఈనెల 7వ తేదీ సోమవారం అనంతగిరి మండలం టోకూరు పంచాయతీలో పర్యటించనున్న నేపథ్యంలో పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ గురువారం ఏర్పాట్లు సమీక్షించారు. బహిరంగ సభ ప్రాంగణం, పార్కింగ్ స్థలాల గురించి చర్చించారు. టోకూరు గ్రామ సచివాలయం ఎదురుగా గల ఖాళీ స్థలంతోపాటు బాగ్మర్‌వలస గ్రామం, బొర్రా గ్రామ పంచాయతీ పరిధిలో గల బొర్రా, పూలుగుడ గ్రామాలను పరిశీలించారు. అనంతరం మండల స్ధాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్ల గురించి చర్చించారు. తహసీల్దార్ మాణిక్యం, అరకులోయ పీఐయూడీఈఈ రవికుమార్, టోకురు పంచాయతీ సర్పంచ్ మొస్య పాల్గొన్నారు.