
బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకం
సాక్షి,పాడేరు: స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, దివగంత మాజీ ఉప ప్రధానికి బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో బాబూ జగజ్జీవన్‌రామ్ 118వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాబూ జగజ్జీవన్‌రామ్ సమాజానికి, దళితుల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆయన జీవితాన్ని యువతీయువకులు ఆదర్శంగా తీసుకుని సమాజ హితానికి పనిచేయాలన్నారు. ఈకార్యక్రమంలో డీఆర్‌వో కె.పద్మలత, సాంఘిక సంక్షేమ అధికారి జనార్దనరావు, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు మురళీ, విద్యాసాఽగర్, డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాష, ఉద్యానవన శాఖ అధికారి రమేష్‌కుమార్‌రావు, సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీపీఆర్‌వో గోవిందరాజులు, డివిజనల్ పీఆర్‌వో పండు రాములు, జిల్లా క్రీడాశాఖాధికారి జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్