
సాక్షి,అనకాపల్లి : జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషవాయువులు లీకయ్యాయి. ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీకవ్వడంతో ఎనిమిది మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది.