Pharma City
-
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ.. ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీక్
సాక్షి,అనకాపల్లి : జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషవాయువులు లీకయ్యాయి. ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీకవ్వడంతో ఎనిమిది మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. -
‘అది ఫార్మా సిటీ కాదు..ఇండస్ట్రియల్ కారిడార్’: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్ : కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో వామపక్ష పార్టీ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని,ఇండస్ట్రీయల్ కారిడార్. నియోజకవర్గంలో యువత,మహిళలకు ఉపాధి కల్పించడమే నా ఉద్దేశ్యం. కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి నా భాధ్యత. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతాను. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తాం.భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తాం’అని తనని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. -
లగచర్ల ఘటన: NHRCలో బాధితుల ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఘటన వ్యవహారం ఢిల్లీని తాకింది. లగచర్ల ఘటనకు బాధ్యులను చేస్తూ పోలీసులు కొందరిని అరెస్ట్ చేయడంతో బాధితులు.. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. లగచర్ల బాధితులు సోమవారం ఉదయం ఢిల్లీలో మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా లగచర్లలో అక్రమ అరెస్ట్‌లు, అక్కడ హింసపై బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. లగచర్లలో నేడు జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ సందర్బంగా అక్కడున్న సమస్యలపై వివరాలు సేకరించనున్నారు ఎస్టీ కమిషన్ సభ్యులు. -
మా ప్రాణాలు తీసి.. భూములు లాక్కోండి
దుద్యాల్/ వికారాబాద్: ‘‘భూములే కావాలంటే.. ముందు మా ప్రాణాలు తీసి, లాక్కొండి. కొన్నాళ్లుగా మా ఆందోళనలను పట్టించుకోకపోవడాన్ని తట్టుకోలేక నిరసన తెలిపాం. ఇప్పుడు మా వాళ్లు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. కంటి మీద కునుకులేకుండా గడుపుతున్నాం..’’ అని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజీ బాధిత గిరిజనులు వాపోయారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘లగచర్ల’ ఘటన, గిరిజనుల అరెస్టు నేపథ్యంలో శనివారం ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరిపింది. ఈ కేసులో ఇప్పటికే 21 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు తాజాగా మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ చూసినా టెన్షన్ టెన్షన్.. ఫార్మా విలేజీ ప్రతిపాదిత గ్రామాలైన లగచర్ల, పులిచర్లకుంటతండా, రోటిబండతండాలలో ఎక్కడ చూసినా ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామాలకు వెళ్లే మార్గాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గిరిజనులను పరామర్శించేందుకు వెళ్తున్న వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలను అడ్డుకుంటున్నారు. గ్రామాల్లో పోలీసులు మోహరించడంతో మహిళలు, వృద్ధులు భయపడుతున్నారు. వ్యవసాయ పనులకూ వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నలుగురు రిమాండ్‌కు.. లగచర్ల ఘటనలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. శనివారం పులిచర్లకుంటతండాకు చెందిన రూప్లా నాయక్, లగచర్లకు చెందిన మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కానీ పోలీసులు నలుగురిని శనివారం రాత్రి కొడంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి.. రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురి విషయంలో స్పష్టత రాలేదు. కలెక్టర్‌తో ఏడీజీ భేటీ లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ (ఏడీజీ) మహేశ్ భగవత్ శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో సమావేశమయ్యారు. ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వారు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు పోలీసులు కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు భద్రత పెంచారు. ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా మరో ఇద్దరు ఏఆర్ గన్మన్లను అదనంగా కేటాయించారు. పోలీసుల భయంతో వృద్ధురాలికి గుండెపోటు! ‘లగచర్ల’ ఘటనకు సంబంధించి పోలీసుల భయంతో డాకిడిబాయి అనే వృద్ధురాలు గుండెపోటుకు గురైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పులిచర్లకుంటతండాకు చెందిన డాకిడిబాయికి గ్రామ పరిధిలో ఆరు ఎకరాల భూమి ఉంది. ఫార్మా విలేజీ భూసేకరణలో ఆ భూమి కూడా పోతోంది. ఆమె కుటుంబం ఈ ఆందోళనతోనే ఉంది. ఈ నెల 11న లగచర్లలో అధికారులపై దాడి ఘటన అనంతరం.. ఆమె కుమారులు ఇద్దరు పోలీసుల భయంతో ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు తరచూ ఆమె ఇంటికి వెళ్లి.. కుమారుల జాడ చెప్పాలంటూ ఒత్తిడి చేశారని, శుక్రవారం కూడా వచ్చి గట్టిగా బెదిరించారని స్థానికులు చెప్తున్నారు. ఈ భయాందోళనతో డాకిడిబాయి గుండెపోటుకు గురైందని పేర్కొంటున్నారు. తిండికి తిప్పలు వచ్చాయి ఇంట్లో బియ్యం, కారంపొడి తప్ప ఏమీ లేవు. కూరగాయలు అమ్మేందుకు సైతం తండాల్లోకి ఎవరూ రావడం లేదు. తిండికి తిప్పలొచ్చాయి. మాకున్న ఐదెకరాల భూమి ఫార్మా విలేజీలో పోతోంది. భూమి లేకపోతే ఏం చేసి బతకాలి. – సోనిబాయి, రోటిబండతండాపోలీసులమని బెదిరించి మేకలు ఎత్తుకెళ్లారుఅధికారులపై దాడి చేసిన వారి కోసం తండాలకు పోలీసులు తరచూ వస్తున్నారు. వారిలో కొందరు యూనిఫామ్‌లో ఉంటే.. మరికొందరు మామూలు డ్రెస్‌లలో ఉంటున్నారు. వచ్చినవారు ఎవరో తెలియడం లేదు. కొందరు దొంగలు పోలీసులమని బెదిరించి రెండు మేకలు ఎత్తుకెళ్లారు. తండాల్లో మగవాళ్లు ఎవరూ ఉండటం లేదని ఇలా చేస్తున్నారు. మాకు రక్షణ ఏది? – అంబిక, రోటిబండతండా -
లగచర్ల దాడి కేసు.. మరో ఎనిమిది మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లగచర్ల ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది. కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.లగచర్ల దాడి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పలువురు లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్‌కు తరలించారు. ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.ఇక, లగచర్ల ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటకే 17 మందిని అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. మరోవైపు.. డీజీ మహేస్ భగవత్ కూడా లగచర్ల ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు సమాచారం. -
ఫార్మాకు ‘భూ’ గ్రహణం!
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సమీకృత గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల (ఫార్మా విలేజ్‌లు) ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సవాలుగా మారుతోంది. భూ సేకరణకు జారీ చేస్తున్న నోటిఫికేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం అవు తున్నాయి. తమ గ్రామాల్లో ఫార్మా చిచ్చు పెట్టొద్దంటూ రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా రు. వ్యవసాయమే జీవనోపాధిగా బతుకుతున్న తాము భూములు అప్పగించేది లేదని తేల్చి చెబుతున్నారు.ఫార్మా కంపెనీల ఏర్పాటుతో గాలి, భూ గర్భ జలాలు విషతుల్యమవుతాయని, తాము కాలుష్యం కోరల్లో చిక్కుకుంటామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ విలువైన భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకూ సరిపోదని కూడా అంటున్నారు. బహిరంగ మార్కెట్లో భూమి ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇవ్వజూపుతున్న మొత్తం చాలా తక్కువగా ఉందని పేర్కొంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తును ఫణంగా పెట్టే ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.భూముల పరిశీలనకు, అభిప్రాయ సేకరణకు వస్తున్న అధికారులను అడ్డుకుంటుండటంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అయితే దీనికంతటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీయే కారణమని, రైతులను రెచ్చగొడుతూ అభివృద్ధిని, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఫార్మాసిటీకి బదులుగా ఫార్మా విలేజ్‌లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో 19 వేల ఎకరాల్లో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎనిమిదేళ్ల క్రితం భూ సేకరణ ప్రారంభించి సుమారు 14 వేల ఎకరాలు సేకరించింది. మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా.. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో సకల వసతులతో కూడిన ఫోర్త్ సిటీని నిర్మిస్తామని, ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పది ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి వికేంద్రీకరణ ఫార్మా రంగాన్ని రాష్ట్రమంతటా విస్తరించడం ద్వారా ఎక్కడికక్కడే విద్యావంతులకు, పరోక్షంగా అంతగా చదువుకోని వారికి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చెబుతోంది. చిన్నచిన్న క్లస్టర్ల ద్వారా కాలుష్య రహితంగా వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. తొలిదశలో నాలుగు ఫార్మా విలేజ్‌లు తొలిదశలో నాలుగు ప్రాంతాల్లో ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహలు ప్రారంభించింది. ‘ఫార్మా సిటీ’ఏర్పాటుకు ఇప్పటికే సేకరించిన భూముల్లో రెండు ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటితో పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఒకటి, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాలకల్ మండలంలో మరో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.కొడంగల్ ఫార్మా విలేజ్ ఏర్పాటుకు 1,358.38 ఎకరాలు, జహీరాబాద్‌లో ఫార్మా విలేజ్‌కు 2,003 ఎకరాలు అవసరమని లెక్కలు వేశారు. భూ సేకరణ కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. పట్టా, అసైన్డ్ భూములు అనే తేడా లేకుండా ఒక్కో ఎకరానికి రూ.15 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. కలెక్టర్లు భూముల పరిశీలనకు, ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే బహిరంగ మార్కెట్లో తమ భూముల ఎకరం ధర రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతోందని రైతులు చెబుతున్నారు. దీనితో పాటు కాలుష్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫార్మా విలేజ్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.తమకు జీవనాధారమైన భూముల్ని ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ కలెక్టర్ తదితర ఉన్నతాధికారులపై లగచర్లలో దాడికి దిగారు. దాడి చేసిన వారితో పాటు దాడికి కుట్ర పన్నినట్లుగా అనుమానిస్తున్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోనూ రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఫార్మా విలేజ్‌లకు భూ సేకరణ కష్టంగా మారుతుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. నోటికాడి కూడు తీసుకుంటారా?తరాలుగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నమాకు భూములే జీవనాధారం. వ్యవసాయం తప్ప మరో పని చేయడం మాకు తెలియదు. ఇప్పుడు ఫార్మా విలేజ్ పేరిట మానోటి కాడ కూడును తీసుకుంటామంటున్నారు. అదే జరిగితే మా కుటుంబాలు రోడ్డు మీద పడి ఆగమవుతాయి. మూడు పంటలు పండే బంగారం లాంటి భూములను ప్రభుత్వానికి ఇచ్చేదిలేదు. ఇక్కడ ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారం ఏ మూలకూ సరిపోదు. – బేగరి విఠల్, రైతు, డప్పూర్, సంగారెడ్డి జిల్లాఎన్ని పైసలు ఇచ్చినా భూమి ఇవ్వం మా కుటుంబానికి ఉన్న రెండున్నర ఎకరాలే జీవనాధారం. ఈ భూమిలో 15 ఏళ్లుగా పుదీనా పండిస్తూ నారాయణఖేడ్ మార్కెట్లో అమ్ముకుంటున్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం మా భూములను లాక్కుంటే మేం ఎక్కడికి పోవాలి? ఎన్ని డబ్బులు ఇచ్చినా మా భూములు అప్పగించం. పచ్చటి భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి. – అజీమొద్దీన్, రైతు, మల్గి, సంగారెడ్డి జిల్లా -
ఊరంతా ఖాళీ
కొడంగల్/దుద్యాల్/పరిగి/పూడూరు: కలెక్టర్‌పై జరిగిన దాడితో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లో సోమవారం రాత్రి భయానక వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయానికల్లా మూడు గ్రామాలూ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇక్కడ ఫార్మా సిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానికులు భూ సేకరణ సమావేశానికి హాజరైన కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాత్రి ఒంటిగంట సమయంలో లగచర్లకు చేరుకున్న సుమారు 300 మంది సాయుధ పోలీసులు 2 గంటల ప్రాంతంలో లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాలను అష్ట దిగ్బంధనం చేశారు. ఇళ్లలో నిద్రిస్తున్న రైతులు, యువకులను అదుపులోకి తీసుకున్నారు. పిలిచినా స్పందించని వారి తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లారు. మూడు గ్రామాల్లో సుమారు 50 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అనుమానితులను గుర్తించిన పోలీసులు వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఏ ఇంటిని చూసినా తాళాలే.. అర్ధరాత్రి వేళ పోలీసులు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లడంతో మహిళలు భయాందోళనకు గుర య్యారు. అయితే ఎప్పుడైనా పోలీసులు దాడి చేసే అవకాశం ఉందని ఊహించిన పలువురు సాయంత్రంలోపే బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రి వేళ పోలీసులు రావడంతో భయకంపితులైన మిగిలిన వారు ఉదయాన్నే ఇతర గ్రామాలకు తరలివెళ్లారు. దీంతో ఉదయం 8 గంటల లోపే గ్రామాలు ఖాళీ అయిపోయాయి. గ్రామాల్లో ఏ ఇంటిని చూసి నా తాళాలే దర్శనమిచ్చాయి. పశువులు, గొర్రెలు, మేకలు మాత్రం దొడ్లలోనే ఉన్నాయి. పోలీసుల అదుపులోనే 16 మంది అనుమానంతో అదుపులోకి తీసుకున్న సుమారు 50 మందిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూపిస్తూ విచారణ నిర్వహించారు. దాడికి పాల్పడిన వారి, ఇందుకు ప్రేరేపించిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనతో సంబంధం ఉన్న 16 మందిని పీఎస్‌లోనే ఉంచుకుని మిగిలిన వారిని వదిలేశారు. 16 మందికి పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వీరిని కొడంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రైతుల దాడిలో గాయపడిన కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి సోమవారం సాయంత్రం నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు.బీఆర్ఎస్ నేతల అరెస్టు లగచర్లలో ఫార్మా బాధిత రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు.. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, కార్తీక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి లగచర్లకు వెళ్తుండగా చన్గోముల్ పోలీస్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. సుమారు 40 నిమిషాల తర్వాత హైదరాబాద్ పంపించేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ తెలంగాణ ప్రజల బతుకులను బజారుకీడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని అన్నారు. ఫార్మా కంపెనీ కోసం తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కుని, వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారన్నారు.రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోని పక్షంలో బీఆర్ఎస్ తరఫున ఆందోళన తప్పదని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, ప్రతీకారేచ్ఛతోనే ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ ఏనాడూ అధికారులపై దాడులను ప్రోత్సహించలేదన్నారు. ఫోన్ లాక్కెళ్లారు.. పరీక్షలు ఉన్నాయన్నా వినలేదు అర్ధరాత్రి వేళ పోలీసులు వచ్చారు. అప్పుడు మా అత్త దేవీబాయి, నేను మాత్రమే ఇంట్లో ఉన్నాం. ఇల్లంతా వెతికిన పోలీసులు మగవారు ఎవరూ లేరని గమనించి నా ఫోన్ లాక్కెళ్లారు. నేను పరిగిలోని పల్లవి కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. మంగళవారం ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని, ఫోన్ ద్వారా ప్రిపేర్ కావాలి సార్ అని బతిమాలినా వినలేదు. – అనూష, పులిచెర్లకుంట తండా -
ఫోర్ బ్రదర్స్ కోసమే ఫ్యూచర్‌సిటీ
ఇబ్రహీంపట్నం రూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన నలుగురు సోదరుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫ్యూచర్ సిటీ నాటకం ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రీన్ ఫార్మా ఏర్పాటు కోసం 14 వేల ఎకరాలు సేకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోర్త్‌సిటీ, ఫ్యూచర్ సిటీ అని చెప్పుకొని రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బొంగ్లూర్ సమీపంలో ఆదివారం నిర్వహించిన అలయ్‌బలయ్ (దసరా సమ్మేళనం) కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్మా సిటీని రద్దు చేస్తే రైతుల నుంచి తీసుకున్న భూములు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఫార్మాలో భూములు కోల్పోయిన 9 గ్రామాల్లో పర్యటించి రేవంత్‌రెడ్డి చేస్తున్న మోసాలను ప్రజలకు విడమరిచి చెబుతామన్నారు. పండుగలన్నీ కల తప్పాయి: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బతుకమ్మ పండుగకు చీరలు లేవని, దసరా పండుగ కళ తప్పిందని, వినాయక చవితి కూడా పండుగలా లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రభుత్వంలోకి రాక ముందు రేవంత్‌రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఇస్తానని చెప్పాడని, అయితే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాత్రం ఖరీఫ్‌కు పైసలు లేవని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని అభివర్ణించారు. చిట్టినాయుడు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంతోనే సరిపోయిందని ఎద్దేవా చేశారు.కార్యక్రమంలో మాజీ మంత్రి సబితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఎనుముల ఇంటెలిజెన్స్’టెక్నిక్! తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ చేసినట్టు ఇచ్చిన ప్రకటనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన చిత్రాన్ని వాడిన రీతిలోనే రుణమాఫీ జరిగిన రైతుల లెక్క విషయంలోనూ ముఖ్యమంత్రి ఏఐ టెక్నిక్ వాడారంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న 40 లక్షల మంది రైతులు అనే సంఖ్య ఏఐ (ఎనుముల ఇంటెలిజెన్స్)తో రేవంత్‌రెడ్డి రూపొందించిందేనని ఎద్దేవా చేశారు. మలేíÙయా తెలంగాణ ఉత్సవాలకు ఆహ్వానం మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ అసోసియేషన్ ఆహ్వానించింది. నవంబర్ 9వ తేదీన మలేíÙయాలోని కౌలాలంపూర్‌లో జరిగే ఈ ఉత్సవాలకు అక్కడి తెలంగాణవాసులు పెద్దఎత్తున హాజరవుతారని తెలిపింది. కేటీఆర్‌ను ఆయన నివాసంలో మలేíÙయా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి, మాజీఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కలిసింది. -
ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూస్కాం
సిరిసిల్ల/సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ రద్దు వెనుక రూ.వేల కోట్ల భూకుంభకోణం ఉందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫార్మాసిటీ పేరిట సేకరించిన భూములను ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వినియోగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 14 వేల ఎకరాలను తాము సేకరిస్తే ఒక్క ఎక రం కూడా సేకరించకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ.. ఫోర్బ్రదర్స్కు రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.రాజన్నసిరిసిల్ల జిల్లాలో గురువారం పలు కార్యక్రమా ల్లో పాల్గొన్న కేటీఆర్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ పిచ్చోడు.. ఆయనకేం తెల్వదు.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 35 వేల ఉద్యోగాలు ఇచ్చినం అంటాడు.. 22 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోడు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించడు. సిరిసిల్ల నేతన్నల ఉపాధి కోసం బతుకమ్మ చీర ల పథకాన్ని తెస్తే దాన్ని బంద్ చేసిండ్రు.. కేసీఆర్ కిట్లు లేవు.. రంజాన్ తోఫా లేదు.. క్రిస్మస్ కానుక లేదు. సిరిసిల్లకు ఏడేళ్లలో రూ.3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చి రూ.200 కోట్ల బకాయిలుంటే.. మేమే ఇస్తున్నామని పోజు లు కొడుతున్నారు. మళ్లీ మా ప్రభుత్వమే వస్తుందనే అంచనాతో డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టి లబి్ధదారులకు అందించలేకపోయాం. 1.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయాం’ అని పేర్కొన్నారు. తనపై కోపం, పగ ఉంటే.. తనతోనే చూసుకోవాలి.. కానీ సిరిసిల్ల నేతన్నలను గోస పెట్టవద్దని కోరారు. రికవరీ చేస్తాం... రైతుల రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా సీజన్ అయిపోయినా.. అందలేదు.. కాంగ్రెసోళ్లు ఊళ్లలోకి వెళ్తే రైతులు తన్నేటట్లు ఉన్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కొందరు అధికారులు ఆలిండియా సరీ్వస్ స్థాయిలో ఉన్న వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని.. ఇష్టారాజ్యంగా పనిచేస్తే.. ఆర్డీ వో అయినా.. కలెక్టర్ అయినా.. వడ్డీతో స హా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించా రు. రిటైరై వెళ్లిపోయినా జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారి నుంచి రికవరీ చేస్తామని హె చ్చరించారు.హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నారని, తన అన్న తిరుపతిరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేశారని, అదే పేదోళ్ల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటున్న సీఎం ఒక్క ఇల్లు అయినా కట్టించాడా? అని ప్రశ్నించారు. సిరిసిల్లలో తనపై నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి ప దవి లేకపోయినా రేషన్ షాపులను అక్రమంగా అనుచరులకు కట్టబెట్టారన్నారు. హైకోర్టునూ మోసం చేస్తున్నారు... ఫార్మాసిటీ వ్యవహారంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూమిని తిరిగి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఫార్మా సిటీని రద్దు చేసింది. ఫార్మాసిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఏఐ సిటీ అని రకరకాల కొత్త పేర్లను తెరపైకి తెచ్చి అతి పెద్ద కుంభకోణానికి స్కెచ్ వేసింది. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టును, న్యా యమూర్తులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా కోర్టులో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క ఎకరం భూమి కూడా సేకరించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలను ఎక్కడ కడతారో చెప్పాలి’అని కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫార్మాసిటీపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు హైకోర్టుకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని డిమాండ్‌చేశారు. -
రైతుబంధు దరఖాస్తులు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ భూములకు సంబంధించి పిటి షన్లు దాఖలు చేసిన రైతుల నుంచి రైతుబంధు దరఖాస్తులు స్వీక రించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. వారంలో గా ఈ దరఖాస్తులను స్వీకరించాల ని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రతిపాదిత ఫార్మా సిటీలో భూములున్న రైతులు, భూ యజమాను లకు రెవెన్యూ అధికారులు అడ్డంకులు సృష్టిస్తు న్నారని కుర్మిద్దకు చెందిన పి.నరసింహతోపాటు మరో 37 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలాగే మరికొందరు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. మేడిపల్లి, కుర్మిడ గ్రామాలకు చెందిన పిటిషనర్లు భూసేకరణ ప్రక్రియను సవాల్ చేసి విజయం సాధించామన్నారు. నానక్ నగర్‌కు చెందిన పిటిషనర్లు దాఖలు చేసిన కేసు లకు సంబంధించి కోర్టు స్వాధీన ప్రక్రియపై స్టే విధించిందని.. అయినా అధికారులు తమ భూ ములను నిషిద్ధ జాబితాలోనే కొనసాగించడంతో రైతుబంధు పథకం, పంట రుణాలు, భూముల లావాదేవీలు వంటి ప్రయోజనాలు లేకుండా పోయాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిష నర్ తరఫు న్యాయవాది రవికుమార్ వాదనలు వినిపిస్తూ.. ఫార్మా సిటీకోసం వారి భూములను సేకరించేందుకు జారీచేసిన నోటిఫికేషన్‌ను పరి హారం ప్రకటించినప్పటి నుంచి రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నా రు. రైతుల భూమి వివరాలను రెవె న్యూ రికార్డుల్లో నమోదు చేయడా నికి అధికారులు అనుమతించడం లేదని, వ్యవసాయ భూములకు పూర్తి యాజమాన్య హక్కులను పొందకుండా నిరోధిస్తున్నారని చె ప్పారు. ఫార్మాసిటీని ఏర్పాటు చేయ బోమని సీఎం రేవంత్ పత్రికా ప్రకటన లు చేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొందని వెల్లడించారు.ఫార్మా సిటీపై అప్పీల్ పెండింగ్‌లో ఉంది..ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎ.సు దర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ’ఏర్పాటు ప్రతిపాదనను రద్దు చేసినట్టు వస్తున్న వార్తలు నిరాధారమైనవన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు 2016, జూన్ 10న ప్రభుత్వం జారీ చేసిన జీవో 31కి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంది. రైతులతో చర్చలు జరిపి న్యాయమైన, సహేతుకమైన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటుంది.పరిహారంతోపాటు రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. సింగిల్ జడ్జి భూసేకరణ పరిహార ఉత్తర్వులను గత ఆగస్టులో రద్దు చేశారు. దీనిపై ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. అప్పీల్ పెండింగ్‌లో ఉంది’అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ల నుంచి రైతుబంధుకు దరఖాస్తులు స్వీకరించాలని ఆర్డీవోను ఆదేశించారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
అనకాపల్లిలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం
అనకాపల్లి జిల్లా,సాక్షి : అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి అనుమాస్పద స్థితిలో శవమై తేలాడు. దీంతో ఉద్యోగి అదృశ్యం కాస్త విషాదంగా మారింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్‌లో రండి సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల విధులు నిర్వహించేందుకు వెళ్లిన సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంపై ఆతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్టోరేజీ ట్యాంక్ సూర్యనారాయణ డెడ్‌బాడీ బయటపడడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఉత్తరాంధ్రాలో ఫార్మా కంపెనీ పేరు చెబితేనే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత ఆగస్ట్ నెలలో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్‌లో ప్రమాదంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
ఫ్యూచర్ సిటీపై ఆచితూచి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారులో నాలుగో నగరంగా ఏర్పాటు చేసే ‘ఫ్యూచర్ సిటీ’పై ఆచితూచి అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ సమస్యలు, ఇప్పటికే జరిగిన భూసేకరణపై స్థానిక రైతులు కోర్టును ఆశ్రయించడం తదితరాలు ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకులపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు గతంలో ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా కాలుష్యరహిత ‘గ్రీన్ ఫార్మాసిటీ’ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భూములు కోల్పోయిన వారిని భాగస్వాములను చేస్తూ పరిసర గ్రామాలకు ఇబ్బంది లేకుండా ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన ప్రదేశాల్లో గ్రీన్ ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలని సీఎం రెండు రోజుల క్రితం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ‘ప్యూచర్ సిటీ’మాస్టర్ ప్లాన్‌లో భారీ మార్పులు చోటుచేసుకొనే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఫార్మాసిటీ ప్రతిపాదన కొనసాగుతున్నదీ లేనిదీ ఈ నెల 20లోగా చెప్పాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటుకు సంబంధించి స్పీడ్ తగ్గించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. హైకోర్టు నిర్ణయాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మాస్టర్ ప్లాన్ మరింత ఆలస్యం న్యూయార్క్ కంటే ఆధునికంగా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ‘ఫ్యూచర్ సిటీ’ని నాలుగో నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలుష్యంలేని ‘నెట్ జీరో కార్బన్ సిటీ’గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ముచ్చర్లలో గత ప్రభుత్వం ప్రతిపాదించిన ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’స్థానంలో ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటు చేస్తామని వివిధ సందర్భాల్లో సీఎం రేవంత్ ప్రకటనలు చేశారు. ఫ్యూచర్ సిటీని 8 జోన్లుగా విభజించి కృత్రిమ మేథస్సు, లైఫ్‌సైన్సెస్, ఆరోగ్యం, క్రీడలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, విద్యాసంస్థలు, వినోద కేంద్రాలు, జనావాసాలు ఏర్పాటు చేసేలా మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ సుర్బానా జురోంగ్కు ఫ్యూచర్ సిటీ మాస్టర్‌ప్లాన్ తయారు చేసే బాధ్యత అప్పగించింది. అయితే ఫ్యూచర్ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా క్లస్టర్లు ఔషధ ఉత్పత్తి రంగంలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో 19,333 ఎకరాల్లో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 13 వేల ఎకరాలకుపైగా భూమిని కూడా సేకరించింది. 2019లో హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం ‘నిమ్జ్’హోదాను ప్రకటించింది. ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ కూడా గత ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే నిధుల లేమితో ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ మార్పుతో.. గతేడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాల పర్యావరణ సమస్యలు, రైతుల అభ్యంతరాలు, భూసేకరణ వివాదాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫార్మాసిటీకి బదులుగా వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రవ్యాప్తంగా పది చోట్ల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ‘ఫ్యూచర్ సిటీ’నిర్మిస్తామని ప్రకటించింది. ఫ్యూచర్ సిటీలో భాగంగా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు ఏఐ సిటీ, బీసీసీఐ సహకారంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వంటి వాటిపై ఇప్పటికే ప్రకటనలు కూడా చేశారు. ప్రస్తుతం ముచ్చర్ల గ్రీన్ ఫార్మాసిటీ పనులు వేగవంతం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ విషయంలో ప్రభుత్వం అనుసరించబోయే వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
గ్రీన్ ఫార్మా సిటీపై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ సమీక్ష
-
అనకాపల్లి: సినర్జిన్ ప్రమాదంపై తలోమాట!
విశాఖపట్నం, సాక్షి: అచ్యుతాపురం సెజ్ ఘోర ప్రమాదం జరిగి 48 గంటలు గడవకముందే.. అనకాపల్లిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అచ్యుతాపురం ఘటన తర్వాత.. పరిహార ప్రకటన, బాధిత కుటుంబాలతో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. ఇప్పుడు ఫార్మా సిటీ ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వ నేతలు తలోమాట చెబుతూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఎంపీ సీఎం రమేష్ ఏమన్నారంటే.. సీనియర్ కెమిస్ట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగింది. సీనియర్ కెమిస్ట్ డ్రగ్ పౌడర్ మిక్స్ చేస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. హోం మంత్రి అనిత ఏమన్నారంటే.. ఇది మరో దురదృష్టకరమైన ఘటన. జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో ఉద్యోగికి.. మొత్తం నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. యాజమాన్యాలు నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులకు సేఫ్టీ సూట్లు ఇవ్వాలి. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తాం. ఒక కమీటి వేసి,పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.అధికారులు ఏమన్నారంటే.. మానవ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు ఆధారంగా గుర్తించాం. వేపర్ క్లైండ్ బరస్ట్ కారణంగానే ప్రమాదం జరిగింది. కెమికల్ మిక్సింగ్టైంలో బయటకు ఆవిరి వచ్చి పేలింది. అసలేం జరిగింది?పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రేడియంట్స్ సంస్ధలో గత అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు, విజయనగరానికి చెందిన మరో ఉద్యోగి(సీనియర్ కెమిస్ట్) తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. హుటాహుటిన నలుగురు కార్మికులను ఆస్పత్రికి తరలించింది. ఘటనపై ఈ ఉదయం జిల్లా కలెక్టర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. హోంమంత్రి, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. దీంతో హోం మంత్రి అనిత క్షతగాత్రుల్ని పరామర్శించారు. సినర్జిన్ ప్రమాదంలో ఒకరికి 90 శాతం గాయాలు కాగా, మరో ముగ్గురికి 60 శాతం పైగా గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో 17 మంది మృత్యువాత పడగా.. మరో ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇంకో నలుగురు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. -
ఫార్మాసిటీ భూములు వెనక్కివ్వండి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫార్మా సిటీ రద్దు చేసింనందున దాని కోసం సేకరించిన భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బడ్జెట్లో మంగళవారం(జులై 30) చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘రూ. 16 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ కు అంతా సిద్ధం చేశాం. లక్షా 50 వేల కోట్లు మీ ప్రభుత్వానికి ఎందుకు అవసమరమవుతున్నాయి. హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపీ రోడ్ల నిర్మాణ పనులను కొనసాగించాలి’అని కేటీఆర్ కోరారు. -
కొన్నారు.. తిన్నారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/యాచారం: ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక వాడలు, ప్రాజెక్టుల ఏర్పాటు సమాచారం ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులకు ముందే తెలియడం సహజం. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడైనా, ఏదైనా భారీ ప్రాజెక్టు/ సంస్థ రాబోతుందంటే చాలు చకాచకా పావులు కదపడం, ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న భూముల్ని గుట్టుచప్పుడు కాకుండా తక్కువ ధరకు కుటుంబసభ్యులు, బినామీల పేరిట కొనేయడం, సదరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చగానే ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అప్పగించేసి కోట్లకు పడగలెత్తడం.. విషయం తెలిసిన రైతులు లబోదిబోమనడం.. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ విషయంలోనూ ఇదే జరిగింది. ఫార్మాసిటీ వాసన పసిగట్టిన ‘పెద్ద గద్దలు’ చురుగ్గా కదిలాయి. దాని చుట్టూ వాలిపోయాయి. స్థానిక రైతుల్ని కాలుష్యం పేరిట, ప్రభుత్వం భూమి సేకరించబోతుందంటూ మభ్యపెట్టాయి. ప్రభుత్వంలోని పలువురు ఉన్న తాధికారులతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు. ఆ తర్వా త ఈ భూములనే ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వానికి అధిక ధరకు అప్పగించి పెద్దెతున లబ్ధి పొందారు. అప్పటివరకు తమ చేతు ల్లో ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నా రు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఇప్పటి ఓ మంత్రి సైతం ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం గమనార్హం. భూదాన్ భూములకూ కొందరు ఎసరు పెట్టడం కొసమెరుపు. కుటుంబసభ్యులు, బినామీల పేరిట దందా 2017లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. భూముల ధరలు తక్కువగా ఉండటం, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించడంతో దేశవిదేశాలకు చెందిన 500కు పైగా ఫార్మా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఏ ఏ సర్వే నంబర్లలో ఎంత భూమిని ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్నారనే విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు ముందే తెలియడంతో బినామీలను, కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. ఓ మాజీ ఐపీఎస్ రైతుల్ని బెదిరించి..! ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో దాదాపు 400 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను బినామీల పేర్లపై కొనుగోలు చేశారు. 2012 నుంచి 2016 మధ్యకాలంలో జరిగిన లావాదేవీల్లో భాగంగా ఎకరా రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల లోపే కొనుగోలు చేశారు. ఆయా గ్రామాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూములను విక్రయించడానికి స్థానిక రైతులు కొందరు నిరాకరించినా, బినామీల ద్వారా రైతులను బెదిరింపులకు గురి చేసి భూములు అమ్మేలా ఒత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి ఫార్మాసిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బినామీల పేరిట ఉన్న 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని ఎకరం రూ.12.50 లక్షల చొప్పున ఫార్మాసిటీకి ఇచ్చేయడం గమనార్హం. కురి్మద్ద, తాడిపర్తి, నానక్‌నగర్ గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని ఫార్మాసిటీకి ఇచ్చేసి నష్ట పరిహారం కింద రూ.కోట్లు సంపాదించారు. కేసీఆర్ సర్కార్‌లో చక్రం తిప్పిన కీలక అధికారులు కొందరు కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. అప్పట్లో కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని దాదాపు 300 ఎకరాలకు పైగా పట్టాభూమిని ఫార్మాసిటీకి తీసుకోవాలని రియల్ వ్యాపారులే స్వయంగా ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు ఇవ్వడం గమనార్హం. కాగా తక్కువ ధరలకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, అధిక ధరలకు ఫార్మాసిటీకి అప్పగించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లపై మీర్ఖాన్పేటలోని హెచ్ఎండీఏ వెంచర్లో అదనంగా ఎకరాల కొద్దీ ప్లాట్లు మంజూరు అయ్యాయి. భూదాన్ భూమిని కొల్లగొట్టిన నేతలు తాడిపర్తి రెవెన్యూ సర్వే నంబర్ 104లో 468.34 ఎకరాల భూమి ఉంది. దాని యజమానులు అప్పట్లో 250 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారు. సదరు భూమిని తమ పేరున రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా 16/11/2005 లోనే భూదాన్‌బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకు పహణీల్లోనూ నమోదు చేశారు. అయితే ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎంపీ ఈ భూములను తమ బినామీ పేరున కొట్టేశారు. అంతేకాదు కొండలు, గుట్టలతో కూడిన ఈ భూమి సాగులో ఉన్నట్లు చూపించారు. భూ సేకరణలో భాగంగా ఈ భూములను ఫార్మాసిటీకి అప్పగించి ఎకరానికి రూ.16 లక్షల చొప్పున నష్టపరిహారం పొందారు. ఇలా ప్రభుత్వం నుంచి రూ.40 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. అంతేకాదు మీర్ఖాన్పేటలో ఎకరానికి 121 గజాల ఇంటి స్థలాన్ని కూడా పొందారు. ఈ భూములకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన వారిలో స్థానికులు కాకుండా అంతా ఇతర ప్రాంతాలకు చెందిన నేతల బినామీలే ఉండటం గమనార్హం. ఈ అంశంపై తాడిపర్తి గ్రామస్తులు అప్పటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పట్లో ఇక్కడ ఆర్డీఓగా పని చేసిన ఓ అధికారి భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఖజానాను భారీగా కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తపల్లి పరిధిలో మాజీ సీఎస్ కొనుగోళ్లు మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ తన భార్య పేరున యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249, 260లలో 25.19 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ పక్కనే సర్వే నంబర్ 244 నుంచి 269 వరకు ఉన్న 125 ఎకరాలు తన కుటుంబ సన్నిహితులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట కొనుగోలు చేయించారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వంలో కీలకంగా (2016 నుంచి 2018 వరకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా, 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు సీఎస్‌గా పని చేశారు) ఉన్నారు. సాగుకు యోగ్యం లేని ఈ భూములకు రైతుబంధు పథకం కింద రూ.14 లక్షల వరకు లబ్ధి పొందినట్లు మాజీ సీఎస్‌పై ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ భూముల కొనుగోలుపై కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ బుధవారం యాచారం తహశీల్దార్ కార్యా లయానికి చేరుకుని పలు రికార్డులను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా తాను నిబంధనల ప్రకారమే భూములు కొన్నానని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ లేదని సోమేష్ చెబుతున్నారు. మాజీ ఐపీఎస్ భూములు ఇచ్చింది వాస్తవమే ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్తి గ్రామాల్లో దాదాపు 300 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించాడు. ఫార్మాసిటీ ఏర్పాటు కావడంతో నక్కర్తమేడిపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన 200 ఎకరాలకు పైగా భూమిని ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ఇచ్చేశాడు. ఆ అధికారి కొత్తపల్లి గ్రామంలో కూడా వందలాది ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. – పాశ్ఛ భాషా, మాజీ సర్పంచ్ నక్కర్తమేడిపల్లి -
మెట్రో, ఫార్మా సిటీ రద్దు చెయ్యం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: గత ప్రభుత్వ హయాంలో తీసుసుకున్న మెట్రో, ఫార్మా సిటీ నిర్ణయాలను తమ ప్రభుత్వం రద్దు చేయబోవట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన పలు వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న మెట్రో, పార్మా సిటీ నిర్ణయాలను రద్దు చేయడం లేదు. ప్రజా ప్రయోజనాన్ని దృషష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎయిర్‌పోర్టుకు దూరం తగ్గిస్తాం. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్ లలో మెట్రో విస్తరణ చేస్తున్నాం. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. నాగోలు నుంచి ఎల్బీ నగర్, ఒవైసీ ఆస్పత్రి వద్ద ఛాంద్రాయణ గుట్ట వద్ద మెట్రో లైన్‌కు లింక్ చేస్తాం. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రబాపురం వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. అవసరమైతే హైటెక్ సిటీ దాకా ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తాం అని అన్నారాయన. గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే తమ ప్రతిపాదనే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారయన. ఇక గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉన్న భవనాన్ని.. స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా.. 15 స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. సంక్రాంతి లోపు అన్ని కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తాం. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వంలో.. ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండవు. అన్ని నిర్ణయాల అమలుకు టార్గెట్ 100రోజులు పెట్టుకుని.. కచ్చితంగా అమలు చేస్తాం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశలో భాగంగా రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు పనులకు.. సీఎంగా కేసీఆర్ శంకుస్థాపన సైతం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్‌రెడ్డి.. మెట్రో విస్తరణ ప్రతిపాదనతో పాటు ఫార్మా సిటీపైనా పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ఆయన రద్దు చేయవచ్చని అంతా భావించారు. అయితే.. రద్దు చేయకుండా వాటిలో సమూల మార్పులు చేయడం గమనార్హం. -
ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని కందుకూరు వద్ద ఫార్మా సిటీ నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో పర్యావరణహితమైన మెగా టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఫార్మాసిటీ ఉండకూడదని.. దాన్ని నగరానికి దూరంగా తరలించడం మంచిదని అభిప్రాయపడ్డారు. మరోవైపు గత ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రోరైల్ విస్తరణ అలైన్‌మెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి బదులు ఎంజీబీఎస్, ఎల్బీనగర్ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ పొడిగింపుపై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పలు అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి, సీఎంఓ అధికారులు వి.శేషాద్రి, బి.శివధర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీం తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే ఔటర్‌రింగ్‌రోడ్డు, జీవో 111 ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ నగరం నలువైపులా సమంగా అభివృద్ధి చెందాల్సి ఉందని, ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్మెంట్ మార్చాలని పేర్కొన్నారు. ఆ రెండు రూట్ల మీదుగా.. ‘‘హైదరాబాద్ జనాభా ఎక్కువగా సిటీ మధ్యలో, తూర్పు ప్రాంతంలో, పాతబస్తీలో ఉంది. ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు మెట్రో అలైన్మెంట్ మార్చాలి. ఈ మేరకు ఎంజీబీఎస్, ఓల్డ్‌సిటీ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు.. అలాగే ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట రూట్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టాలి. అలాగే మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి, పీ–7 రోడ్, లేదా బార్కాస్, పహడీషరీఫ్, శ్రీశైలం రోడ్డు రూట్లను కూడా పరిశీలించాలి..’’ అని రేవంత్ సూచించారు. ఈ రూట్లలో మెట్రో నిర్మాణానికి అయ్యే ఖర్చును అంచనా వేయాలని మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి మలుపులు లేకుండా నేరుగా ఉండే మార్గాల్లో మెట్రో నిర్మించడం వల్ల వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టు మెట్రోను శ్రీశైలం రోడ్డులోని తుక్కుగూడ వరకు పొడిగించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఓల్డ్ సిటీ మెట్రో ఎందుకు చేపట్టలేదు? పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్‌ను ఎల్అండ్టీ ఇప్పటివరకు నిర్మించకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందినా ఓల్డ్‌సిటీ మెట్రోను పూర్తి చేయకపోవడం సరికాదన్నారు. ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎయిర్‌పోర్టు మెట్రో ప్రస్తుత అలైన్మెంట్ నిలిపివేత నేపథ్యంలో.. జీఎంఆర్‌తో కుదుర్చకున్న ఒప్పందంపై కూడా నివేదిక కోరారు. నగర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని రేవంత్ ఆదేశించారు. మూసీ సుందరీకరణ చేపట్టాలన్నారు. తూర్పు నుంచి పడమర వరకు మూసీ మార్గంలో నాగోల్ నుంచి గండిపేట్ దాకా ఎంజీబీఎస్‌ను కలుపుతూ రోడ్, మెట్రో కనెక్టివిటీ ఉండాలని సూచించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రస్తుతం నగర జనాభా 2 కోట్లకు చేరువలో ఉందని చెప్పారు. భవిష్యత్తులో 3 కోట్ల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. నేడు కేబినెట్ భేటీ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయి, సభ వాయిదా పడ్డాక ఈ భేటీని నిర్వహించనున్నారు. -
ఫార్మాసిటీతో రియల్ బూమ్: వాటికి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ, ఫ్యాబ్ సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లతో శ్రీశైలం జాతీయ రహదారి రూపురేఖలే మారిపోయాయి. ఫార్మా సిటీ నుంచి కూతవేటు దూరంలో ఉన్న కడ్తాల్, కందుకూరు, ఆమన్‌గల్, తలకొండపల్లి వంటి ప్రాంతాలు రెసిడెన్షియల్ హబ్‌గా మారిపోయాయి. విజయవాడ, బెంగళూరు, వరంగల్ జాతీయ రహదారులతో పోలిస్తే శ్రీశైలం హైవేలోని గృహ అద్దెలకు, స్థలాలకు రెట్టింపు విలువ చేకూరుతుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న జాతీయ రహదార్లలో ఒక్క శ్రీశైలం రహదారి మినహా అన్ని దార్లలోనూ స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరంగల్ హైవేలో చూస్తే.. నగరం నుంచి 50 కి.మీ. వరకూ ఎకరం ధర రూ.కోటి పైనే. ముంబై, బెంగళూరు హైవేల్లోనూ కోటిన్నర పైమాటే. ఇక, షామీర్పేట్, శంకర్పల్లి రహదారిలో అయితే రూ.2 కోట్లకెక్కువే. మరి, నేటికీ సామాన్య, మధ్యతరగతి అందుబాటులో ఉన్న ప్రాంతం ఏమైనా ఉందంటే అది ఒక్క శ్రీశైలం రహదారి మాత్రమే. హాట్‌స్పాట్స్ ప్రాంతాలివే.. శ్రీశైలం రహదారిలో కందుకూరు, కడ్తాల్, ఆమన్‌గల్, తలకొండపల్లి, కల్వకుర్తి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతంలో ధర గజానికి రోడ్ ఫేసింగ్‌ను బట్టి రూ.8 వేల నుంచి 30 వేల వరకున్నాయి. ప్రధా న నగరంలో లేదా ఐటీ కేంద్రాలకు చేరువలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు వెచ్చించే వ్యయంతో శ్రీశైలం రహదారిలో ఏకంగా విల్లానే సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లే అవుట్లు, విల్లాలకు డిమాండ్.. శ్రీశైలం రహదారిలో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లతో పాటూ లే అవుట్ల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. హాల్‌మార్క్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై, విశాల్ ప్రాజెక్ట్స్, రాంకీ, హస్తినా రియల్టీ, మ్యాక్ ప్రాజెక్ట్స్, వెర్టెక్స్, జేఎస్ఆర్ గ్రూప్ వంటి పేరున్న నిర్మాణ సంస్థలతో పాటు చిన్న సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నాయి. కందుకూరు నుంచి ఆదిభట్లకు 15 కి.మీ. దూరం. దీంతో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ ఉద్యోగులు శ్రీశైలం రహదారిలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. 30 కి.మీ. దూరంలో ఎల్బీనగర్, ఆదిభట్ల ప్రాంతాలుండడంతో విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకూ కొదవేలేదు. కృష్ణా జలాల సరఫరా, విద్యుత్ ఉపకేంద్రంతో మౌలిక వసతులూ మెరుగ్గానే ఉన్నాయి. ఫార్మా సిటీ చుట్టూ అభివృద్ధి.. ఐటీ తర్వాత అధిక శాతం మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించేది ఫార్మా రంగమే. తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫార్మా సిటీ రాకతో శ్రీశైలం రహదారి అభివృద్ధి దశే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐడీఏ బొల్లారం, పాశమైలారం తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమల వల్ల మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల వరకూ అభివృద్ధి విస్తరించింది. అలాగే గతంలో బేగంపేట్‌లో విమానాశ్రయం ఉన్నప్పుడు సనత్‌నగర్, బోయిన్పల్లి వంటి ప్రాంతాలకు ఎలాగైతే అభివృద్ధి చెందాయో.. శంషాబాద్ విమానాశ్రయం శ్రీశైలం రహదారికి చేరువలో ఉండటంతో సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశముంది. ఫార్మాసిటీని అనుసంధానిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు కూడా రానుంది. ఇది షాద్‌నగర్ నుంచి తలకొండపల్లి మీదుగా ఫార్మాసిటీకి అనుసంధానమై ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం రహదారిలో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లున్నాయి. -
ఫార్మా కారిడార్‌లో.. రియల్ పెట్టుబడులు
ఐడీఏ బొల్లారం, పాశమైలారంలోని ఫార్మా కంపెనీలతో మియాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్ వంటి ప్రాంతాల అభివృద్ధి రూపురేఖలు మారిపోయాయి. జీనోమ్‌వ్యాలీ ఏర్పాటుతో షామీర్పేట, తుర్కపల్లి, మేడ్చల్, పఠాన్‌చెరు, కీసర వంటి ప్రాంతాలలో నివాస, రిటైల్ అభివృద్ధి జరిగింది. తాజాగా ముచ్చెర్లలో 19 వేల ఎకరాల్లో రానున్న ఫార్మా సిటీ.. దాని చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి ఊహించలేనిదే. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ రంగం తర్వాత అత్యధిక మందికి ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తుంది ఫార్మా రంగమే. ఏ ప్రాంతంలోనైనా సరే పారిశ్రామిక అభివృద్ధి జరిగితే దాని చుట్టూ 30 కి.మీ. వరకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫార్మాసిటీ.. రీజినల్ రింగ్ రోడ్‌కు సమీప దూరంలోనే ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు అదనపు అంశం. ఇప్పటికే మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్లతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు ఆర్ఆర్ఆర్, ఫార్మా సిటీలు మణిహారంగా మారనున్నాయి. కలిసొచ్చిన కరోనా.. కోవిడ్–19 తర్వాతి నుంచి కొనుగోలుదారుల ఆలోచనలలో మార్పులొచ్చాయి. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం తప్పనిసరైన నేపథ్యంలో ఇరుకు ఇళ్లకు బదులుగా విశాలమైన గృహాలను ఎంచుకుంటున్నారు. ఓఆర్ఆర్, మెట్రో రైల్లతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి ప్రయాణం చాలా సులువైంది. దీంతో సిటీకి దూరమైన సరే ప్రశాంతమైన వాతావరణం ఉండే ప్రాజెక్ట్‌లలో కొంటున్నారు. బెంగళూరు, ముంబై, పుణే వంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌కు కలిసొచ్చే ప్రధానమైన అంశం.. భూముల ధరలు తక్కువగా ఉండటమే. అందుకే స్థానిక కొనుగోలుదారులతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు, ప్రవాసులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ సీఎండీ బీ శేషగిరి రావు తెలిపారు. నౌ ఆర్ నెవర్ ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారంలో కంటే రియల్టీ పెట్టుబడులే రెట్టింపు ఆదాయాన్ని అందిస్తాయి. చేతిలోని నగదుతో ప్రతీ ఒక్కరూ స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారు. సిటీకి దూరంగా ఉన్న వంద ఎకరాల భూమిని విక్రయించేసి.. అదే డబ్బుతో అందుబాటు ధరల్లో అభివృద్ధికి ఆస్కారం ఉండే రియల్టీ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. ‘‘కరోనా టైంలో కస్టమర్లు ముందుకురారు అనుకున్నాం. కానీ, కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ప్రతికూల సమయంలో ధరలు తగ్గే అవకాశం ఉంటుందని, డెవలపర్లు ఆఫర్లూ అందిస్తారని పెట్టుబడులు పెట్టేందుకు కస్టమర్లే ముందుకొచ్చారని పేర్కొన్నారు. నౌ ఆర్ నెవర్ అనే భావన కస్టమర్లలో పెరిగిపోయింది. చదవండి: 3,600 ఎకరాల్లో బటర్‌ఫ్లై సిటీ 2020లో అతిపెద్ద డీల్ హైదరాబాద్‌లోనే.. -
ఫార్మానే వద్దంటే.. రోడ్డెందుకు?
సాక్షి, యాచారం: ఫార్మా ఏర్పాటే వద్దంటే.. రోడ్డు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని రైతులు మండిపడ్డారు. ఫార్మాసిటీ రోడ్డు విస్తరణకు సంబంధించి నందివనపర్తి గ్రామంలో అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్యభాషా, వైస్ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, నందివనపర్తి సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ, తహసీల్దార్ నాగయ్యలు పాల్గొన్నారు. ఫార్మాసిటీకి వంద అడుగుల రోడ్డు కోసం ఇరువైపులా 60 ఎకరాల వ్యవసాయ భూమి కావాల్సి ఉంది. భూమిని సేకరించడానికి నింబంధనల ప్రకారం నోటిఫికేషన్లు ప్రకటించిన అధికారులు బుధవారం నందివనపర్తిలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేశారు. సభ ప్రారంభంలో భూసేకరణ నింబంధనలను ఆర్డీఓ వెంకటాచారి రైతులకు వివరించారు. ఫార్మాసిటీ వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఫార్మాను అడ్డుకోవద్దని సూచించారు. సభలో గందరగోళం ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతుండగానే రైతులు లేచి.. సార్ అసలు ఫార్మాసిటీ ఏర్పాటే వద్దని అంటుంటే.. రోడ్డు విస్తరణ ఎందుకు అని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా వేదికపై కూర్చున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీలు లేచి ఫార్మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండగానే రైతులంతా ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. కొంతమంది రైతులు అధికారులపై కుర్చీలు వేశారు. టెంటును కూల్చేశారు. సభలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రైతులను, ఆందోళనకారులను పక్కకు తోసేశారు. కొంతమంది ఆందోళనకారులను, రైతులను అరెస్టు చేసి వాహనంలో యాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సభ వద్ద ఉన్న మరికొందరు రైతులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో అధికారులపై దాడులు చేయడానికి యత్నించగా అధికారులు అర్ధంతరంగా ప్రజాభిప్రాయ సేకరణ సభను నిలిపేసి వెళ్లిపోయారు. కాగా, నింబంధనల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ సభను పూర్తి చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఇదేక్కడి దారుణం.. ఫార్మానే వద్దంటే.. అధికారులు బలవంతంగా ప్రజాభిప్రాయ సేకరణ, పట్టా భూముల సేకరణకు జనరల్ అవార్డు పాస్‌చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. నందివనపర్తిలో రైతులకు మద్దతుగా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫార్మాకు వ్యతిరేకంగా రైతుల్లో ఆందోళన తీవ్రమవుతున్న నేపథ్యంలో సర్కారు బలవంతంగా భూసేకరణకు దిగడం అన్యాయమని మండిపడ్డారు. రైతులకు మద్దతుగా న్యాయస్థానాలను ఆశ్రయించి బలవంత భూసేకరణను అడ్డుకుంటామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాను రద్దు చేసి రైతుల భూములను తిరిగి ఇస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరిపల్లి అంజయ్యయాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్, బీజేపీ నాయకులు కొండూరి రామనాథం, గోగికార్ రమేష్, విజయకుమార్, నాగరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, నానక్‌నగర్ మాజీ సర్పంచ్ ముత్యాల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మాసిటీని రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ వ్యవస్థలా మార్చిందని, తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా ఒక దళారీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమిని పంచుతామని చెప్పిన కేసీఆర్, ఫార్మాసిటీ పేరుతో దళిత, గిరిజన, పేదల భూములను ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వరంగ సంస్థల కోసం భూసేకరణను తాము తప్పుబట్టబోమని, కానీ ఫార్మాసిటీ పేరుతో అమెరికా సంస్థలకు, ఎంఎన్సీలకు భూములను కట్టబెట్టడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. బహుళజాతి సంస్థలకు భూములు ధారాదత్తం చేయడం ప్రజాప్రయోజనం ఎలా అవుతుం దో అర్థం కావడం లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2 ల క్షల 60 వేల ఇండ్లు నిర్మిస్తామని కేసీఆర్, లక్ష ఇళ్లు నిర్మి స్తాం అంటూ కేటీఆర్ అసెంబ్లీలో చెప్పిన వీడియో క్లిప్‌ల ను భట్టి మీడియాకు చూపించారు. కానీ మంత్రి తలసాని తమకు 3,428 ఇండ్లు మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. గత గ్రేటర్ ఎన్నికలకు సంబంధిం చిన టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ వెబ్సైట్ నుంచి తీసేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ మాటలకు మరోసారి మోసపోవద్దని భట్టి విజ్ఞప్తి చేశారు. -
ఫార్మా పేరుతో రియల్ వ్యాపారం
యాచారం: ‘కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారు.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ఫార్మాసిటీ పేరుతో బలవంతంగా లాక్కుంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. మూడేళ్ల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీని రద్దు చేస్తాం’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫార్మా భూనిర్వాసితులకు భరోసా ఇచ్చారు. ఫార్మాసిటీకి భూములు సేకరించనున్న రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మిద్దలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ నేతలు పర్యటించారు. ఐదు కిలోమీటర్లు కాలినడకన తిరిగి అక్కడి రైతుల పట్టా భూములను పరిశీలించారు. ‘ప్రపంచమే వెలివేసిన ఫార్మాను సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో 20 వేల ఎకరాల్లో వందలాది కంపెనీలతో ఏర్పాటు చేస్తున్నారు. ఫార్మాసిటీతో భూగర్భంలో వందలాది కిలోమీటర్ల మేర కాలుష్యం ఏర్పడి సమీపంలోని కృష్ణానదికి ప్రమాదం పొంచి ఉంది. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. ఎకరానికి వారికి రూ.లక్షల్లో ఇచ్చి రూ.కోటిన్నర చొప్పున విక్రయిస్తూ కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తారు. భూపంపిణీ ఏమైంది..? వైఎస్సార్ ఇచ్చిన భూములను లాక్కోవడం న్యాయమేనా..? రైతులు భయపడొద్దు.. ఐక్యంగా ఉద్యమాలు చేయండి. మూడేళ్ల పాటు ఫార్మాసిటీని అడ్డుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేసి రైతులకు న్యాయం చేస్తాం. ఫార్మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతాం. అక్టోబర్ 11న ఇదే స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. అప్పటివరకు రైతులు, నాయకులు, యువత ఉద్యమించాలి. పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప’అని భట్టి రైతులనుద్దేశించి అన్నారు. ‘జైలుకైనా పోతాం.. ప్రాణాలైనా ఇస్తాం.. కానీ మా పట్టా భూములు మాత్రం ఫార్మాకు ఇవ్వం’అని కుర్మిద్ద రైతులు కాంగ్రెస్ నేతల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు భూముల కోసం తమను బెదిరిస్తున్నారన్నారు. కేసీఆర్ భూదోపిడీని తిప్పికొట్టాల్సిందే: సీతక్క తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న భూ దోపిడీని తిప్పికొట్టాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రైతులకు పిలుపునిచ్చారు. ‘ఫార్మాసిటీ పేరుతో సీఎం 19,333 ఎకరాలను సేకరిస్తూ రూ.20 వేల కోట్లను దోచుకుంటున్నారు. అధికారంలోకి రాకముందు దున్నేవాడికే భూమి అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాత్రం వందలాది ఎకరాల్లో ఫాంహౌస్ ఏర్పాటు చేసుకుని పేదలకు భూమి లేకుండా చేస్తున్నారు’అని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కె.లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్), కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 11న సామూహిక నిరాహార దీక్షలు.. ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అక్టోబర్ 11వ తేదీకి మూ డేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అదేరోజున ఫార్మాసిటీకి భూములు తీసుకుంటున్న కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. -
ప్రజలు తిరస్కరించిన ఫార్మాసిటీ
వందల ఎకరాలలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను నియంత్రించలేని ప్రభుత్వం మరియు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఒకే చోట 1000 కంటే ఎక్కువ కాలుష్యం చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఆత్మహత్యా సదృశం. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకంగా పటాన్ చెరు, జీడిమెట్ల, చౌటుప్పల్, కొత్తూర్ వంటి ప్రాంతాలలో, ఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్న విషయం మనకు అనుభవమే. అనేక గ్రామాల ప్రజలు మందుల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ నీరు, గాలి మరియు అత్యంత ప్రమాదకర ఘన పదార్థాల కాలుష్యంతో సతమతమవుతున్నారు. ఆయా ప్రాంతాలలో స్థానికులు ప్రమాదకర రసాయన చర్యల బారిన పడి అనారోగ్యం పాలు అవుతూనే ఉన్నారు. పరిశ్రమ వేసే పవర్ బోర్ల తోటి స్థానిక భూగర్భ జలాలు అడుగంటిపోతు న్నాయి. బర్రెలు, ఎడ్లు, గొర్రెలు, మేకలు వంటివి కూడా కాలుష్యం బారిన పడి చనిపోవడంతో, వాటి మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడిన ఉదంతాలు అనేకం. నష్ట పరిహారం ఇచ్చే ఆలోచన అటు పరిశ్రమలు కాని, ఇటు ప్రభుత్వం కాని చేయలేదు. ఉపరితల నీటి వనరుల కాలుష్యం ఒక బాధ కాగా, కొన్ని పరిశ్రమలు ఇంజక్షన్ బోర్లు వేసి ప్రమాదకర వ్యర్థ జలాలను భూగర్భంలోకి వదులుతున్నాయి. జీరో డిశ్చార్జి అంటూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమలను నియంత్రించకుండా, వాటిని మూసివేయకుండా, ప్రజల నిరసనలు తెలియ జేస్తే వారి మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టిన వైనాలు కూడా ఉన్నాయి. పోలేపల్లిలో కాలుష్యం గురించి ప్రజలు ఆందోళన చేస్తే, 22 జూలై 2017 నాడు జరిగిన సమీక్ష సమావేశంలో, పరిశ్రమల మంత్రితో సహా అధికారులు కాలుష్య నియంత్రణ మీద ఆలోచనలు పెట్టకుండా, కేవలం కంటితుడుపు మాటలతో తమ నిస్సహాయతను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఉన్నా, రాజ్యాంగం ప్రజల ప్రాథమిక హక్కుల గురించి స్పష్టం చేసినా కూడా, ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఇంకా ఇతర ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కాలుష్యం చేసే పరిశ్రమల మీద ఈగ వాలనీయకుండా కాపాడుతున్నారు. పరిశ్రమల నేరపూరిత వ్యవహారాన్ని ఎండగట్టకుండా కాలుష్య నియంత్రణ అధికా రులు గ్రామీణులను మోసం చేస్తున్నారు. కాలుష్యం తగ్గించి, వనరులను పునర్వినియోగించి, పర్యావరణాన్ని కాపాడవలసిన తరుణంలో, పరిశ్ర మలు కేవలం తమకు వచ్చే లాభాల మీదనే దృష్టి పెడుతున్నాయి. ఔషధ పరిశ్రమలు ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా సబ్సిడీలు పొందుతూ, ప్రజల మీద పడుతున్న దుష్ప్రభావం గురించి పట్టించుకోవడం లేదు. అక్కడ ఒక్కటి, ఇక్కడ ఒకటి పరిశ్రమలు ఉన్నప్పుడే ఇంత దారుణ పరిస్థితి ఉండగా, హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఒకే చోట కొన్ని వందల ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే రాబోయే దుర్భర పరిస్థితులు ఊహకు కూడా అందవు. వందల ఎకరాలలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను నియం త్రించలేని ప్రభుత్వం మరియు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఒకే చోట 1000 కంటే ఎక్కువ కాలుష్యం చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఆత్మహత్యా సదృశం. ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ఫార్మా సిటీ బారిన పడే అన్ని గ్రామాల ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. 20,000 ఎకరాలలో ఫార్మా సిటీ ఏర్పాటు వలన కనీసం 100 కి.మీ. పరిధిలో పర్యావరణం, చెట్లు, చెరువులు, కుంటలు, చెలమలు, మట్టి, నేల, గాలి వంటి అన్ని రకాల సహజ వనరులు కలుషితం అయ్యి, స్థానిక ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ కాలుష్య ప్రభావం కొన్ని దశాబ్దాల వరకు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్ తరాల ఉనికికే ఇది ప్రమా దం. తెలంగాణ రాష్ట్రం మీద ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 14న జారీ చేసిన జీవో 63 గమనించాలి. గ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం తమ వనరులను అంచనా వేసుకుని, తమ స్థాయికి అనుగుణంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఈ ఉత్తర్వులు చెబుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం కూడా ప్రతి గ్రామం కూడా తమ అభివృద్ధిని నిర్దేశించుకునే అవకాశం ఉంది. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలలో ఉన్న అనేక గ్రామాలు, ముచ్చెర్ల, మేడిపల్లి, కురుమిద్ద తదితర గ్రామాలతో సహా, ఎవరూ ఫార్మా సిటీ కోరుకోలేదు. స్థానిక యువతకు వారి చదువుకు, నైపుణ్యానికి తగ్గ ఉపాధి అవకాశాలు ఈ గ్రామాలు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యవసాయం, వృత్తులు ఇంకా అనేక ఇతర జీవనోపాధుల పునాదుల మీద అభివృద్ధి జరగాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ఫార్మా పరిశ్రమల ఏర్పాటు వల్ల స్థానికులకు ఉపాధి దొరకకపోగా, స్థానిక గ్రామాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలే పరమావధిగా అసమగ్ర సమాచారం, అబద్ధాలతో కూడిన నివేదికలు ఇచ్చి, హైదరాబాద్ ఫార్మా సిటీకి అనుమతులు తీసుకుంది. ఫార్మా సిటీ లోపల ఉండే గ్రామాలు, నివాస ప్రాంతాల గురించి ప్రభుత్వం చేసిన ప్రణాళిక శూన్యం. అసైన్డ్ భూములకు, ఇతర భూములకు మధ్య నష్ట పరిహార పరిమాణంలో సరి సమానత లేదు. పేద, దళిత, బలహీన వర్గాల భూమి తన సొంత భూమిగా ప్రభుత్వం భావిస్తున్నది. భూమి లేని కుటుంబాలు, ఇతర వృత్తిదారుల పట్ల పునరావాస ప్రణాళికలు అసలే లేవు. వారికి భారత రాజ్యాంగం హక్కులు కల్పిస్తున్నది అనే వాస్తవం విస్మరించారు. ఇప్పటికే కొంత అవకతవకల నడుమ, చిన్న రైతులను బెదిరించి తీసుకున్న భూముల వ్యవహారంలో స్పష్టమైన అవినీతి మీద విచారణ చేపట్టలేదు. సింగపూర్ కంపెనీకి ఫార్మా సిటీ మాస్టర్ ప్రణాళిక తయారు చేయమని కాంట్రాక్ట్ ఇచ్చినా, వారి నివేదిక ప్రజలకు అందుబాటులో లేదు. మాస్టర్ ప్లాన్ తయారు కాకముందే, అసైన్డ్ భూములు, అటవీ, పట్టా భూముల సేకరణ చేపట్టడం సుపరిపాలన పద్ధతులకు వ్యతిరేకం. హైదరాబాద్ ఫార్మా సిటీ పేరిట రంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్ట్ ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త, పర్యావరణ విధాన విశ్లేషకులు -
కాలుష్య రహితంగా ఫార్మాసిటీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ‘టీ ఫైబర్’కార్యాలయంలో హైదరాబాద్ ఫార్మాసిటీపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు, ఆర్థిక, పురపాలక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఫార్మాసిటీలో తమ యూ నిట్ల ఏర్పాటుకు వందలాది ఫ్యాక్టరీలు ఎదు రు చూస్తున్నాయని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా కాలుష్య రహితంగా ఫార్మాసిటీని తీర్చిదిద్దాలని కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్లను సందర్శించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. విండ్ ఫ్లో వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించారు. ఫార్మాసిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జి యూనిట్లు ఎక్కువగా ఏర్పాటవుతాయని తెలిపారు. రసాయన వ్యర్థాలను కేంద్రీకృతంగా శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఫార్మాసిటీలో పనిచేసే వారికి అక్కడే నివాస సౌకర్యం ఉంటుందన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా అత్యుత్తమ విద్యా సంస్థలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అలాగే స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
ఫార్మాసిటీలో స్థానికులకే ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూమిని ఇస్తున్న వారిలో కనీసం కుటుంబంలో ఒకరికైనా ఉద్యోగం ఇచ్చే దిశగా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల ప్రభావితమవుతున్న కుటుంబాల జాబితా తయారు చేయాలన్నారు. కుటుంబ సభ్యులు, వారి విద్యా, సాంకేతిక అర్హతలను మ్యాపింగ్ చేయాలని చెప్పారు. ఫార్మాసిటీలో మౌలిక వసతుల ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. (బస్సుకు రూట్ క్లియర్..!) అవసరాల మేరకు శిక్షణ ప్రభావిత కుటుంబాల్లో ఆర్హులైన వారికి ఫార్మా రంగానికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ‘తెలం గాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్’(టాస్క్), ఇతర శిక్షణ సంస్థల సహకారం తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. స్థానికులకు నైపుణ్య శిక్షణ కోసం ఫార్మాసిటీ పరిసర మండలాల్లో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మా సిటీలో పెట్టుబడు లతో ముందుకు వచ్చే కంపెనీలతో కలిసి ఈ శిక్షణ కేంద్రాల ద్వారా అర్హులైన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్కరాజ్ కణ్ణన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. -
పరిహాసం చేసేలా మాట్లాడతారా?
సాక్షి, అమరావతి : విశాఖ పరవాడ ఫార్మాసిటీ కంపెనీలో జరిగిన ప్రమాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. గ్యాస్‌లీక్ లాంటి అత్యంత అరుదైన ఘటనల్లో ప్రభుత్వం బాధ్యత తీసుకుని పెద్ద మొత్తంలో పరిహారం ఇస్తే, దాన్ని పరిహాసం చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 'విశాఖలో రెండు రోజుల కిందటి ఫ్యాక్టరీ ప్రమాదంలో బాధితులకు కోటి రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. 13 నెలల కిందటి వరకూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. నగరంలో గ్యాస్‌పేలుడు సహా అనేక పారిశ్రామిక ప్రమాదాలు ఆయన హయాంలో జరిగాయి. అప్పుడు బాధితులకు ఇచ్చింది ఎంత? పైగా ప్రమాదాలు సహజమేనంటూ చంద్రబాబు కామెంట్ చేయలేదా? అలాంటి ఆయన ఇలాంటి డిమాండ్లు చేయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు' అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. (చంద్రబాబు దళిత ద్రోహి: మేరుగ ) విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్ ఫాక్టరీ నిర్వహణ లోపంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని నిపుణుల కమిటీ ప్రాథమికంగా నిర్థారించింది. రియాక్టర్లో పరిమితికి మించి వాక్యూమ్ పెరగడం, రసాయన మిశ్రమాల్లో ఉష్ణోగ్రత పెరగడంతో ప్రమాదానికి దారితీసింది. ఈ దుర్ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందడంతో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతిచెందిన శ్రీనివాస్‌రావు కుటుంబానికి కంపెనీ యజమాన్యం తరఫున రూ. 35 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 15 లక్షలు.. గాయపడిన వ్యక్తికి రూ. 20 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. (విశాఖ ప్రమాదంపై నివేదిక అందజేత) -
నిర్వహణ లోపంతోనే అగ్ని ప్రమాదం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/విశాఖ సిటీ: నిర్వహణ లోపంతోనే విశాఖ జిల్లా పరవాడ మండలంలోని విశాఖ సాల్వెంట్స్ లిమిటెడ్‌లో అగ్ని ప్రమాదం సంభవించిందని నిపుణుల కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్లాంట్ రియాక్టర్లో ‘డై మిథైయిల్ సల్ఫాక్సైడ్’ డిస్టిలేషన్ ప్రక్రియ కొసాగుతుండగా ప్రమాదం సంభవించిందని తెలిపింది. ► ఈ దుర్ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందడంతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడిన ఈ ప్రమాదంపై విచారణకు విశాఖ జిల్లా కలెక్టర్ ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ► ఈ కమిటీ రియాక్టర్‌ను పరిశీలించి మంగళవారం కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. ► రియాక్టర్లో పరిమితికి మించి వాక్యూమ్ పెరగడం.. రసాయన మిశ్రమాల్లో ఉష్ణోగ్రత పెరగడంతో ప్రమాదానికి దారితీసింది. మంటలు పూర్తిగా అదుపులోకి.. కాగా, సోమవారం రాత్రి ఉవ్వెత్తున లేచిన మంటలను మంగళవారం ఉ.6గంటలకల్లా పూర్తిస్థాయిలో అదుపుచేశారు. ► ప్రమాద సమయంలో రియాక్టరు వద్దనున్న కాండ్రేగుల శ్రీనివాస్ అనే కార్మికుడు అగ్నికి ఆహుతైనట్లు మంగళవారం గుర్తించారు. ► అతని కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.15 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మరో రూ.35 లక్షలు ఇచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యం అంగీకరించింది. ► అలాగే, ప్రమాదంలో మల్లేశ్ అనే మరో కార్మికుడికి గాయాలయ్యాయి. అతనికి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. వైద్యానికయ్యే ఖర్చుతో పాటు రూ.20 లక్షల పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. ► ప్రమాదం విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి సుచరిత, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆరా తీశారు. ► విచారణ కమిటీ తుది నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. ► ప్రమాదంపై పరవాడ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. పేలుడు సంభవించిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం గంటల వ్యవధిలో పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడంతో మంగళవారం ఫార్మాసిటీలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. -
విశాఖ ప్రమాదంపై నివేదిక అందజేత
సాక్షి, విశాఖపట్నం : విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నియమించిన విచారణ కమిటీ నివేదిక అందజేసింది. ఐదుగురు సభ్యులతో కూడా కూడిన ఈ కమిటీ.. ప్రమాదంపై పూర్తి స్థాయిలో నివేదికను రూపొందించింది. ప్రమాదం జరిగిన తీరు ఆ తర్వాత నెలకొన్న పరిణామాలపై రెండు పేజీల నివేదికను కలెక్టర్‌కు అందజేసింది. సాల్వెంట్ రికవరీ రియాక్టర్ వద్ద డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్దిచేసే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా కమిటీ నివేదికలో పేర్కొంది. సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేయడంలో విఫలం కావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు కమిటీ సభ్యులు ప్రాథమికంగా అంచనా వేశారు.(విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం) ‘రాత్రి 9 గంటలకు షిఫ్ట్ మారే సమయంలో డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్ధి కోసం వేర్వేరు రసాయనాలు పంపించే క్రమంలో కొంత అధికపీడనం నెలకొనడంతో అదుపుచేయడానికి కెమిస్ట్ మల్లేష్ ముందుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో కింది అంతస్తులో వచ్చిన స్పార్క్ తో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందారు’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు సాల్వెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై పరవాడ పోలీస్ స్టేషన్లో 304/ఏ, 328 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.(విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించం) శ్రీనివాసరావు కుటుంబానికి పరిహారం విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్ ఫాక్టరీ జరిగిన ప్రమాదంలో మృతిచెందిన శ్రీనివాస్‌రావు కుటుంబానికి యజమాన్యం తరఫున రూ. 35 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 15 లక్షల పరిహారం అందజేయనున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మల్లేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
విశాఖ ప్రమాదం: మెరుగైన వైద్యం అందించండి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో జరిగిన పేలుడుపై జిల్లా ఇంచార్జ్ మంత్రి కురసాల కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ పేలుడుకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరా తీశారు. అదే విధంగా జిల్లా కలెక్టర్‌తో ఫొన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. (విశాఖ ప్రమాదం.. అనాథలైన పిల్లలు) విశాఖపట్నం ఫార్మ సిటిలో పేలుడు ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై జిల్లా యంత్రాంగం ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఎవరికి ప్రాణ నష్టం లేకుండా వైద్యం అందించడానికి ప్రత్యేకంగా వైద్య బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించారు. (విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం) సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. (విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి) -
విశాఖ ప్రమాదం: నలుగురు సభ్యులతో కమిటీ
సాక్షి, విశాఖపట్నం: పరవాడ ఫార్మాసిటీలో రోజుల వ్యవధిలోనే మరో ప్రమాదం జరగడాన్ని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై కలెక్టర్ వినయ్ చంద్ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీ సభ్యులని ఆదేశించారు. డై మిథైల్ సల్ఫాక్సైడ్ వల్ల భారీ మంటలు ఏర్పడ్డాయని, ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతున్నామని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. వరుస ప్రమాదాల నేపధ్యంలో మరోసారి జిల్లా స్ధాయిలో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరవాడ ఘటనపై విశాఖ ఆర్డీఓ, విచారణ కమిటీ సభ్యుడు కిషోర్ మాట్లాడుతూ.. పరవాడ సాల్వేషన్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై విచారణ చేస్తున్నాం. వాల్వ్ దగ్గర శాంపిల్ కలెక్షన్ చేస్తున్న సమయంలో ఏర్పడిన విద్యుత్ స్పార్క్ వల్ల ప్రమాదం జరిగిందని ప్రాధమిక అంచనా. ఈ ఫార్మా కంపెనీలో కనీస విద్యార్హత, అనుభవం లేకుండా కేవలం పదవ తరగతి చదివిన వారిని కెమిస్ట్ గా పనిచేయడాన్ని గుర్తించాం. ప్రమాదం తర్వాత ఉండాల్సిన రక్షణ పరికరాలు కూడా లేకుండా ఉన్నాయి. తమ ఉద్యోగులకి కంపెనీలు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. డై మిధైల్ సల్ఫ్ఆక్సైడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలను వాడే చోట కనీస అవగాహన లేని వారిని నియమించుకున్నారు. ప్రమాదంపై ఎలా స్పందించాలో ప్రజలని రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రమాద ఘటనలో ఒకరు మరణించారు. మంటలను పూర్తిగా అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద స్థలంలో రక్షణ పరికరాలు అందుబాటులో లేకపోవడం, రక్షణ పరికరాలు ఉపయోగించడంలో కూడా అవగాహన లేకపోవడాన్ని గుర్తించాం. ఈ తరహా ప్రమాదాలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విచారణ కమిటీ సభ్యుడు కిషోర్ తెలిపారు. కాగా.. ఫార్మా సిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. మిగతా కార్మికులు సురక్షితంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయానికల్లా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని వెల్లడించారు. చదవండి: విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి -
విశాఖ ప్రమాదం.. అనాథలైన పిల్లలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. శ్రీనివాసరావు మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఇటీవల ఆయన భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో శ్రీనివాసరావు తన సోదరి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అనకాపల్లి సమీపంలోని రేబాక వద్ద నివాసముంటున్న శ్రీనివాసరావు రాత్రి షిఫ్ట్‌లో డ్యూటీకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. (విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి) ప్రమాదం జరిగిన సమయంలో అతని కోసం తోటి ఉద్యోగులు గాలించగా కనిపించలేదని చెప్పారు. మంగళవారం ఉదయం శిథిలాల మధ్య కనిపించిన మృతదేహాన్ని పరిశీలించగా అది శ్రీనివాసరావుదిగా ఉద్యోగులు గుర్తించారని భోరుమన్నారు. తండ్రి మృతితో అతని ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. శ్రీనివాసరావు తల్లి (80) కూడా ఆధారాన్ని కోల్పోయినట్టయింది. కంపెనీలో ఉద్యోగానికి వెళ్లిన తన సోదరుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని శ్రీనివాసరావు సోదరి కన్నీరు మున్నీరైంది. (విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం) -
విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. మిగతా కార్మికులు సురక్షితంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయంవరకల్లా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని వెల్లడించారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రమాదం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు తగిన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. పరవాడ ఫార్మా కంపెనీ లో ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రాథమిక విచారణ నివేదిక అనంతరం ప్రమాద కారణాలు తెలుస్తాయని చెప్పారు. ప్రమాద ఘటనపై హోంమంత్రి ఆరా సాక్షి, గుంటూరు: విశాఖపట్నం ఫార్మాసిటీలో జరిగిన పేలుడు ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సంబంధిత అధికారులు, పోలీసుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హోంమంత్రి సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, విశాఖ ఆర్డీవో కిషోర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. (విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం) -
విశాఖ ప్రమాదం: నలుగురు సభ్యులతో కమిటీ
-
విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం
-
విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు (సీఈటీపీ) సాల్వెంట్ పరిశ్రమలో సోమవారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయని, మిగతా వారంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖ సాల్వెంట్ కంపెనీ ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసి తిరిగి ఫార్మా కంపెనీలకు విక్రయిస్తుంటుంది. వ్యర్థాలను శుద్ధి చేసే క్రమంలో కంపెనీలో ఉన్న ఐదు కాలమ్‌లలో ఒక కాలమ్‌లో పేలుడు జరిగి, మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో కెమిస్టులు మల్లేష్ (42), మనోజ్, శ్రీనివాస్, సెక్యూరిటీ గార్డు చిన్నారావు మాత్రమే లోపల ఉన్నారు. పేలుడుకు మల్లేష్‌కు గాయాలయ్యాయి. మిగతా వారంతా సురక్షితంగా బయటకు వచ్చేశారు. మల్లేష్‌ను గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకుంది. అదే సమయంలో కుండపోత వర్షం కురవడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందలేదు. అగ్నిమాపక శాఖకు చెందిన 5 ఫైర్ ఇంజన్లు, రాంకీ కంపెనీకి చెందిన మూడు ఫైరింజన్లు రెండున్నర గంటల్లో మంటలను అదుపు చేశాయి. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, విశాఖ ఆర్డీవో కిషోర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. -
ఫార్మాసిటీ ఆవశ్యకత మరింత పెరిగింది
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాధాన్యం, అవసరం మరింతగా పెరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగ పరిశ్రమలకు ఇప్పటికే దేశ రాజధానిగా హైదరాబాద్ ఖ్యాతి గడించిందని, ఫార్మాసిటీ ద్వారా ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కరోనాకి అవసరమైన మందుతో పాటు వ్యాక్సిన్ తయారీకి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు, వ్యాధులకు ఫార్మాసిటీ పరిష్కారం చూపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ.. యూఎస్ఎఫ్డీఏ నుంచి వరుసగా అత్యధిక అనుమతులు పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా ఏర్పడబోతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ఉంటుందన్నారు. ఫార్మాసిటీ ప్రాజెక్టు పురోగతిపై గురువారం మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫార్మాసిటీకి రూపకల్పన చేస్తున్నామన్నారు. కొన్ని నెలల్లో ఫార్మాసిటీ తొలి దశ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మంత్రికి వివరించారు. రోడ్లు, ఇతర మౌలికవసతుల పనులు జరుగుతున్న తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఏడాదికాలం నుంచి ఐదేళ్ల పాటు ఎప్పుడెప్పుడు ఏయే పనులు చేపడతారు, ఎలాంటి పురోగతి ఫార్మాసిటీ సాధించబోతున్నదో తెలిపేలా నిర్దిష్ట కాలావధితో నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఔషధ ఉత్పత్తుల కంపెనీలు మొదలుకొని అందులో పనిచేసే కార్మికులకు అవసరమైన నివాస సౌకర్యాల వరకు అన్ని ఒకేచోట ఉండే విధంగా స్వయంసమృద్ధి కలిగిన టౌన్‌షిప్‌గా ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో ముందుకు పోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో కేవలం ఉత్పత్తుల తయారీ మాత్రమే కాకుండా... ఫార్మా పరిశోధన, లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రత్యేకించి ఒక యూనివర్సిటీ, సాధ్యమైనంత ఎక్కువగా గ్రీన్ కవర్ వంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయన్నారు. -
ప్రధానిని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని మంగళవారం ఇక్కడ కలిశారు. నాలుగు అంశాలపై ఆయన ప్రధానికి విజ్ఞాపన పత్రాలు అందజేయడంతో పాటు, తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లో వందల కోట్ల మేర అవినీతి జరుగుతోందని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 64 వేల కోట్ల రుణం తీసుకుని, ఆ నిధులను యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజె క్టు నిర్మాణంలో నామినేషన్ల ద్వారా కొన్ని కంపెనీలకు కట్టబెట్టారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని కోరినట్టు సమాచారం. ఫార్మాసిటీకి అనుమతులు నిరాకరించండి హైదరాబాద్‌లో ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతులను నిలిపివేయాలని కోమటిరెడ్డి మోదీని కోరారు. హైదరాబాద్ సమీపంలో కాకుండా మరోచోట ఫార్మాసిటీ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్తగూడెం వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై మోదీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. మూసీ నది అనేక రసాయనాలతో కలుషితమైం దని, నమామీ గంగే తరహాలో మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రూ.3 వేల కోట్లతో మూసీ నదిని సమూలంగా శుభ్రం చేయా లని కోరారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీరు ఇంకా అందడం లేదని, జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు కేటాయించాలని విన్నవించారు. -
ప్రకాశ్ జవదేకర్‌తో కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. బుధవారం కేంద్ర మంత్రిని కలసిన సీఎం రాష్ట్రంలోని పలు సాగునీరు, ఇతర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పలు ప్రతిపాదనలను పరిష్కరించాల్సిందిగా కోరారు. ఫార్మాసిటీకి సంబంధించిన అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ వెంట టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం సంభవించింది. స్మైలెక్స్ ఫార్మా సంస్థలో విషవాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదకరమైన ట్రైఫోజెన్ గ్యాస్ లీకవ్వడంతో వాటిని ఇద్దరు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో వరుసగా ఇది రెండో ప్రమాద ఘటన. జేఎన్ ఫార్మాసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరి పరి స్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. విజయ్శ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలోనూ విషవాయువుల కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఫార్మా కంపెనీలు నాసిరకం మాస్కులు ఇస్తుండటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, విషవాయువుల వల్ల ప్రాణాలు పోతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై పరవాడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్ బెస్ట్
ఢిల్లీ.. ఊపిరి కూడా పీల్చుకోలేని అత్యంత కాలుష్య నగరం. ముంబై, చెన్నైలలో వరదలు, సునామీ.. బెంగళూరులో రాజకీయ అస్థిరత. కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్‌లో కొరవడిన స్థలాల లభ్యత, అధిక ధరలు. ఇక, మిగిలింది హైదరాబాదే! మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో కనెక్టివిటీ, మెరుగైన మౌలిక వసతులు, అందుబాటు ధరలు, కట్టుదిట్టమైన భద్రత, కాస్మోపాలిటన్ కల్చర్.. అన్నింటికీ మించి స్థిరమైన ప్రభుత్వం.. ఇదీ సింపుల్‌గా హైదరాబాద్ అడ్వాంటేజెస్! సాక్షి, హైదరాబాద్: 2019 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నగరంలో 40 లక్షల గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్ అద్దెలు 9 శాతం మేర పెరిగాయి. సుమారు 13,361 గృహాలు విక్రయమయ్యాయి. 190 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులొచ్చాయి. ఏ నగరం అభివృద్ధికైనా సరే కావాల్సింది ఉద్యోగ అవకాశాలే. ఇప్పటివరకు కంపెనీలు, ఉద్యోగాలు, పెట్టుబడులు అన్నీ గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అందుకే గత కొంత కాలంగా ప్రభుత్వం నగరం నలువైపులా సమాంతర అభివృద్ధి చర్యలు చేపడుతుంది. శ్రీశైలం, వరంగల్, విజయవాడ జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టిసారించింది. ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమోబైల్ రంగాల్లో ప్రత్యేక పార్క్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తుంది. ఆదిభట్లలో ఎయిరోస్పేస్, ముచ్చర్లలో ఫార్మా సిటీ, చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్‌లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లను ప్రారంభించింది కూడా. ఈస్ట్ జోన్ అభివృద్ధికి త్వరలోనే లుక్ ఈస్ట్ పాలసీని తీసుకురానుంది. వినూత్న నిర్మాణాలతో స్వాగతం.. కాస్మోపాలిటన్ సిటీకి తగ్గట్టుగానే ఇక్కడి డెవలపర్లు కూడా వినూత్న ఆర్కిటెక్చర్లతో భవనాలను నిర్మిస్తున్నారు. బిల్డింగ్ సైజ్, స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారని సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ కిరణ్ చెప్పారు. సరికొత్త టెక్నాలజీ వినియోగంతో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌లతో సిటీకి అదనపు అందాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా తమ వంతుగా మెట్రో కనెక్టివిటీని పెంచడంతో పాటూ ట్రామ్స్, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు, హ్యాంగింగ్ బ్రిడ్జ్‌లతో మరింత ఆకట్టుకోవాలని సూచించారు. ఫార్మా సిటీ, ఐటీ హబ్‌లను సరిగ్గా వినియోగించుకుంటే 10–15 లక్షల అదనపు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. రెండేళ్లలో బెంగళూరు బీట్.. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్, ఆటో రంగాల్లో సంక్షోభం, ఐటీ ఉద్యోగుల తొలగింపులతో రియల్టీ మందగమనంలో ఉంది. అయితే ఇది తాత్కాలికమేనని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుంది. కొత్త జిల్లాల్లో పరిపాలన భవనాల ఏర్పాటు, మిషన్ భగీరథ వంటి వాటితో జిల్లాల్లో పొలాలకు, స్థలాలకు డిమాండ్ పెరిగిందని, గతేడాదితో పోలిస్తే 10–15 శాతం ధరలు పెరిగాయని ఏషియా పసిఫిక్ ఎండీ ఎస్ రాధాకృష్ణ తెలిపారు. మెట్రో విస్తరణతో పాటూ త్రిబుల్ ఆర్, ఫార్మా సిటీ, ఐటీఐఆర్‌లను పట్టాలెక్కించగలిగితే.. వచ్చే రెండేళ్లలో బెంగళూరును బీట్ చేయడం ఖాయమని పేర్కొన్నారు. -
ఫార్మాసిటీకి సాయమందించాలి
సాక్షి, హైదరాబాద్: సమీకృత ఫార్మాపార్క్‌కు అన్ని విధాలా సాయమందిచాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆదివారం కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్రప్రధాన్‌లకు ఆయన లేఖలు రాశారు.‘హైదరాబాద్ ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది. దీంతోపాటు నిమ్జ్ హోదాకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.ఫార్మాసిటీ మౌలిక వసతులకు రూ.1,318 కోట్లు, సాంకేతిక సదుపాయాల కల్పనకు రూ.2,100 కోట్ల కోసం కేంద్ర ఆర్థిక సాయం అందించాలి’అని కేంద్ర మంత్రి గోయల్‌ను లేఖలో కోరారు. ఫార్మా సిటీకి అవసరమైన సహజ వాయువు సరఫరా కేటాయింపుల కోసం కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మరో లేఖ రాశారు. -
బలవంతంగా భూమిని తీసుకుంటే ఊరుకోం
సాక్షి, యాచారం: ఇక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయొద్దు.. ఇప్పటికే సేకరించిన అసైన్డ్ భూములకు సంబంధించి రైతులకు సరైన పరిహారం ఇవ్వలేదు. పర్యావరణానికి హాని చేసే ఫార్మాసిటీ తమకు వద్దని బుధవారం యాచారం మండలం తాడిపర్తి గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను రైతులు బహిష్కరించారు. ఫార్మాసిటీ ఏర్పాటును తాము ఇప్పటికే నిరాకరించామని, తిరిగి ఎందుకు వచ్చారని అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామస్తులకు మద్దతుగా సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ బాబురావు ఫార్మాసిటీ అభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చకచకా చేస్తోంది. తాడిపర్తి రెవెన్యూ పరిధిలోని 104తోపాటు మరికొన్ని సర్వే నంబర్లలో ఉన్న దాదాపు 900 ఎకరాలకు పైగా భూమిని సేకరించే క్రమంలో బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అమరేందర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. ఎంపీపీ జాపాల సుకన్యభాషా, సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ బాబురావు, తహసీల్దార్ పుష్పలత తదితరులు హాజరయ్యారు. మొదట ఆర్డీఓ అమరేందర్ గ్రామంలోని 104 సర్వే నంబరులోని పట్టా భూమి 820 ఫార్మాసిటీ ఏర్పాటుకు ఎకరాలను తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అభ్యంతరాలుంటే చెప్పాలని రైతులు, గ్రామస్తులకు సూచించారు. దీంతో పలువురు రైతులు ఫార్మాసిటీ మాకు వద్దని ఇప్పటికే చెప్పాం. మళ్లీ భూసేకరణ ఏంటీ.. ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకంటూ నిలదీశారు. 104 సర్వే నంబరులో అందరూ భూస్వాములు ఉన్నారు. పట్టాలున్న వారెవరూ స్థానికులు కాదన్నారు. ఏళ్ల క్రితం ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో కొన్ని నకిలీ పట్టాలు కూడా ఉన్నాయన్నారు. కలెక్టర్ స్వయంగా ప్రజాభిప్రాయ సేకరణకు రావాలని రైతులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్ఐ వెంకటయ్య పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈక్రమంలో అధికారులు, పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. న్యాయమైన పరిహారమేదీ? రెండేళ్ల క్రితం తాడిపర్తి గ్రామంలోని 155, 66 తదితర అసైన్డ్ సర్వే నంబర్లల్లోని వందల ఎకరాల భూములను ఫార్మాసిటీ కోసం బలవంతంగా సేకరించారని రైతులు తెలిపారు. భూములు ఇవ్వకపోతే పీఓటీ కింద స్వాధీనం చేసుకుంటామని బెదిరించడంతో భూములు ఇచ్చామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పలు సర్వేనంబర్లలో అసైన్డ్ పట్టాలిచ్చారని తెలిపారు. తాము కబ్జాలో ఉన్నా 37 మంది రైతులకు ఏళ్లు గడుస్తున్నా పరిహారమే అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ రజత్‌కుమార్ సైనీ, రాళ్లు, గుట్టల భూములకు, పాసుపుస్తకంలో ఉన్న విస్తీర్ణం మొత్తానికి న్యాయమైన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. న్యాయమైన పరిహారం ఇచ్చిన తర్వాతే పట్టా భూముల జోలికి రావాలని స్పష్టం చేశారు. ఫార్మాసిటీకి భూసేకరణ చేసేందుకు తహసీల్దార్ పుష్పలత తమ భూములకు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్తా: ఆర్డీఓ తాడిపర్తి గ్రామంలో పట్టా భూములను సేకరించే విషయంలో గ్రామస్తులు, రైతుల అభిప్రాయాలను కలెక్టర్‌కు హరీష్ దృష్టికి తీసుకెళ్తానని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అమరేందర్ పేర్కొన్నారు. దయచేసి ప్రజాభిప్రాయ సేకరణకు సహకరించాలని రైతులను కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు అసలు ఫార్మాసిటీ వద్దంటే.. వద్దు అని అంటుంటే సహకరించాలని చెప్పడం ఏంటన్నారు. ఆర్డీఓ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రశాంతంగా కూర్చీల్లో కూర్చున్న రైతులు వేదికపైకి దూసుకెళ్లి ఆర్డీఓతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తాడిపర్తి సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ సభ్యుడు బాబురావు ఫార్మాసిటీకి మేం పూర్తిగా వ్యతిరేకం, 104 సర్వేనంబర్‌లోని పట్టాదారులు గ్రామంలో ఉండడం లేని చెప్పారు. ఫార్మాసిటీ వద్దు, ఏదైనా కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే భూ సేకరణకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నాం, అధికారులు వెళ్లిపోవాలని కోరారు. దీంతో చేసేదేమి లేక ఆర్డీఓ, తహసీల్దార్ తదితరులు అక్కడి నుంచి నిష్కమించారు. విషమిచ్చి చంపేయండి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రకృతికి హాని తలపెట్టే ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుంది. కాలుష్యం వల్ల రోగాలబారిన పడి చచ్చే బదులు, ఒకేసారి అందరికీ విషం ఇచ్చి చంపేయండి. అందరం ఏకమై ఫార్మాసిటీ ఏర్పాటును అడ్డుకుంటాం. రైతులకు న్యాయం చేయాలి. – కె. నారాయణ, రైతు తాడిపర్తి ఫార్మాసిటీకి వ్యతిరేకం... ఫార్మాసిటీకి మేము పూర్తి వ్యతిరేకం. ఫార్మాకు బదులు కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేయండి. నేనే ముందుండి భూములు ఇప్పిస్తా. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నాం. అధికారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. – డి. రమేష్, సర్పంచ్ తాడిపర్తి -
నదీజల మార్గాలపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం నదీజల మార్గాలపై దృష్టి సారించాలని టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సూచించారు. రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పోలిస్తే నదీ జలమార్గాల ద్వారా తక్కువ ఖర్చుతో సరుకుల రవాణా చేయవచ్చన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు నదీజల రవాణా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో ఒడిస్సీ లాజిస్టిక్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతి థిగా కేటీఆర్ పాల్గొన్నారు. 1952–2014 మధ్యకాలంలో తెలంగాణలో 2,600 కి.మీ పొడవైన రహదారులు ఉండగా, గత ఐదేళ్లలో మరో 2,800 కి.మీ మేర జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి రంగంలో క్రమంగా వ్యయం పెరుగుతోందని, రాబోయే రోజుల్లో ఉత్పత్తి రంగంలో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న మానవ వ్యాక్సి న్లలో మూడోవంతు హైదరాబాద్‌లోనే తయారు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఫార్మా, వ్యాక్సిన్, వైద్య ఉపకరణాలు తదితర రంగాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి ఎగుమతులు పెరగనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఫార్మాసిటీ పనులు వేగవంతం చేస్తాం.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 19వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ ఫార్మాసిటీ పనులు వేగవంతం చేస్తామని కేటీఆర్ తెలిపా రు. ఫార్మాసిటీకి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో లాజిస్టిక్స్ రంగానికి మరింత ఊపు వస్తుందన్నారు. తద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పటికే హెచ్ఎండీఏ 2 లాజిస్టిక్స్ పార్కులను నిర్మిస్తోందని, మరో 6 లాజిస్టిక్స్ పార్కులను ఔటర్‌రింగు సమీపంలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, శ్రీనివాస్ గుప్తా, అభిషేక్ ఠాకూర్, విఘ్నేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మా సిటీ.. వెరీ పిటీ
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు హైదరాబాద్ సమీపంలోని 18,304 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే తొలి సమీకృత ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రకటించింది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) పరిధిలో ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ‘హైదరాబాద్ ఫార్మా సిటీ లిమిటెడ్’పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కూడా ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత ఫార్మా సిటీలో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాలు పూర్తి చేసి.. 2019 నాటికి ఔత్సాహిక ఫార్మా సంస్థలకు భూ కేటాయింపులు, అనుమతులు ఇచ్చేలా టీఎస్ఐఐసీ షెడ్యూలు రూపొందించింది. తొలి విడతలో 9,212 ఎకరాలకు గాను 6,719 ఎకరాలను సేకరించగా, మిగతా భూమిని సేకరించడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టింది. తొలి విడత భూ సేకరణకు హడ్కో ద్వారా టీఎస్ఐఐసీ రూ.725 కోట్లు రుణం తీసుకోవడంతో పాటు, ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల కోసం ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)కు ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఫార్మాసిటీ ప్రాజెక్టుకు నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి) హోదా ఇచ్చేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం (డిప్) 2017 ఏప్రిల్‌లో సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. నయా పైసా విదల్చని ‘డిప్’ హైదరాబాద్ ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా దక్కడంతో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.6 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం ‘డిప్’కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు నాటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ వినతిపత్రం కూడా ఇచ్చారు. తొలి విడతలో రూ.1,500 కోట్లు విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినా, రెండేళ్లుగా ఫార్మా సిటీకి కేంద్రం నుంచి నయాపైసా విదల్చలేదు. ఫార్మా సిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,395 కోట్లు కాగా, నిమ్జ్ హోదా ద్వారా కనీసం రూ.6 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చుకుని మౌలిక సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో 2019 మే నాటికి ఔత్సాహికులకు ఫార్మాసిటీలో భూ కేటాయింపులు చేస్తామనే ప్రకటన ఇప్పట్లో ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వడివడిగా టీఎస్ఐఐసీ అడుగులు... ఫార్మాసిటీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీ మొదట్లో వడివడిగా అడుగులు వేసింది. ఫార్మాసిటీని ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సుమారు రూ.400 కోట్లతో రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టింది. మరోవైపు పర్యావరణ అనుమతులు సాధించడంతో పాటు, సింగపూర్‌కు చెందిన సుర్బాన జురోంగ్ కన్సల్టెంట్స్ ద్వారా సమీకృత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రణాళిక తుది దశలో ఉంది. సమీకృత కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు (సీఈటీపీ), జీరో లిక్విడ్ డిశ్చార్జి (జడ్ఎల్డీ) ప్లాంట్లను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ను 2017లో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించి, 8 కంపెనీలను వడపోతలో ఎంపిక చేశారు. జహీరాబాద్ నిమ్జ్‌పైనా ప్రభావం... దేశ వ్యాప్తంగా మొత్తం 22 భారీ పారిశ్రామిక వాడలకు నిమ్జ్ హోదా దక్కగా, ఇందులో రాష్ట్రంలో రెండు ఉన్నాయి. ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా సూత్రప్రాయంగా దక్కగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్‌కు తుది ఆమోదం లభించింది. అయితే జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.3 వేల కోట్లివ్వాలని టీఎస్ఐఐసీ ప్రతిపాదించినా కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదు. దీంతో ఫార్మాసిటీ తరహాలో జహీరాబాద్ నిమ్జ్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. కేంద్రం నుంచి స్పందన కరువు... ఫార్మా సిటీకి నిమ్జ్ హోదా నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులివ్వాల్సిందిగా టీఎస్ఐఐసీ కేంద్రాన్ని కోరింది. జీరో లిక్విడ్ డిశ్చార్జి గ్రాంటు కోసం కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్ విభాగానికి ప్రతిపాదనలు సమర్పించింది. సీఈటీపీ నిధుల కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. గ్రీన్‌క్లైమేట్ ఎన్విరాన్మెంట్ ఫండ్ ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖకూ లేఖ రాసింది. అయితే ప్రతిపాదనలు పంపించి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి నిధుల విడుదల విషయంలో కనీస స్పందన కానరావడం లేదు. కేంద్రం నుంచి గ్రాంటు విషయంలో స్పష్టత లేకపోవడంతో సీఈటీపీ, జడ్ఎల్డీ ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఎంపిక చేసిన 8 కంపెనీల వడపోత ప్రక్రియను టీఎస్ఐఐసీ నిలిపివేసింది. ఫార్మాసిటీ ప్రత్యేకతలు.. పెట్టుబడుల అంచనా: రూ.64 వేల కోట్లు ఫార్మా ఎగుమతులు (ఏటా): రూ.58 వేల కోట్లు ప్రత్యక్ష ఉపాధి: 1.70 లక్షల మందికి పరోక్ష ఉపాధి: 3.90 లక్షల మందికి కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు, మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్, క్వాలిటీ సర్టిఫికేషన్ ల్యాబ్, లాజిస్టిక్ హబ్, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఎన్విరాన్ మేనేజ్మెంట్ సెల్, సమీకృత నివాస గృహాల సముదాయం, ఫార్మా ఉత్పత్తి యూనిట్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితో పాటు ఫార్మా సిటీ ప్రాంగణంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. -
‘ఫార్మా’ భూసేకరణకు ఓకే
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ప్రాజెక్టు భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. యజమానుల అంగీకారంతోనే ఫార్మాసిటీ ప్రాజెక్టు కోసం మిగులు భూసేకరణ ప్రక్రియ జరపాలని గతంలో విధించిన నిబంధనను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సవరించింది. కేంద్ర భూసేకరణ చట్టానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ రాష్ట్ర భూసేకరణ, పునరావాస చట్టం–2016 ప్రకారం ‘యజమానుల అంగీకారం’తో మిగిలిన భూసేకరణ జరిపేందుకు అనుమతిచ్చింది. యజమానుల అంగీకారంతోనే మిగులు భూసేకరణ జరపాలనే షరతుపై ఫార్మాసిటీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నిపుణుల మదింపు కమిటీ గతంలో సిఫారసు చేసింది. భూసేకరణతోపాటు మరో ఐదు అంశాలపై విధించిన నిబంధనలను సవరించాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) విజ్ఞప్తి చేయగా, గత నెల 25న కమిటీ మళ్లీ సమావేశమై సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర భూసేకరణ, పునరావాస చట్టం–2016 కింద ఫార్మాసిటీ ప్రాజెక్టు అవసరాల కోసం భూములు సేకరించేందుకు ప్రధాన అడ్డంకి తొలగింది. ఈ చట్టంలోని ‘తప్పనిసరి భూసేకరణ’నిబంధన ప్రకారం యజమానులు అంగీకారం లేకపోయినా నిర్బంధంగా భూములు సేకరించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. యజమానులు అంగీకరించనిపక్షంలో వారికి చెల్లించాల్సిన పునరావాస ప్యాకేజీ నిధులను భూసేకరణ అథారిటీ వద్ద జమ చేసి భూములను సేకరించవచ్చని ఈ నిబంధన పేర్కొంటోంది. పట్టా భూములిచ్చేందుకు ససేమిరా ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ రంగ పారిశ్రామికవాడగా ఫార్మాసిటీని నిర్మించేందుకు రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం 19,333 ఎకరాలను సేకరిస్తోంది. అందులో 10,200 ఎకరాలు ప్రైవేటు పట్టా భూములు, 6199 ఎకరాలు అసైన్డ్ భూములుండగా, మిగిలినవి ప్రభుత్వ భూములు, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములున్నాయి. రైతులతో అంగీకార ఒప్పందం పేరుతో రాష్ట్ర భూసేకరణ చట్టం నిబంధనల ప్రకారం గంపగుత్తగా పరిహారం, పునరావాస ప్యాకేజీని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికంగా ఎకరాకు మార్కెట్ విలువ రూ.2.5 లక్షలుండగా, భూసేకరణ చట్టం ప్రకారం మూడింతలు పరిహారంతోపాటు పునరావాసానికి ప్రత్యేక నిధులు కలిపి పట్టా, అసైన్డ్, కబ్జా భూములకు పరిహారపు ప్యాకేజీలను ఖరారు చేసింది. ఎకరా పట్టా భూములకు రూ.12.5 లక్షలు, అసైన్డ్ భూములకు రూ.8 లక్షలు, కబ్జా భూములకు రూ.7.5 లక్షల ప్యాకేజీలను చెల్లిస్తోంది. ఇప్పటి వరకు 7,414 ఎకరాలను సేకరించగా, అందులో దాదాపు 7 వేల ఎకరాలు అసైన్డ్, ప్రభుత్వ భూములే ఉన్నాయి. పట్టా భూములు ఇచ్చేందుకు భూయజమానులు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తోందని కొందరు స్థానిక రైతులు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రైతుల అంగీకారంతోనే భూములు సేకరించాలని గతంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలను విధించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో రాష్ట్ర భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించేందుకు అనుమతిస్తూ తాజాగా నిబంధనలను సడలించింది. -
ఫార్మాసిటీపై అనుమానాలొద్దు
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ప్రాంత ప్రజల అనుమానాలు నివృత్తి చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో పరిసర ప్రాంతాల్లో జల, వాయు, భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వ్యర్థాల శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా, పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. పరిశ్రమల శాఖ 2017–18లో సాధించిన పురోగతిపై వార్షిక నివేదికను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి కాలుష్యకారక పరిశ్రమలను ఫార్మాసిటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలి 19 ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. ఇప్పటికే మూడు ప్రాంతాలను సిద్ధం చేశామని, మొత్తం పరిశ్రమలు తరలింపును ఐదేళ్లలో పూర్తి చేస్తామన్నారు. పురోగతిలో పారిశ్రామిక రంగం రాష్ట్రం పారిశ్రామిక రంగంలో శరవేగంగా పురోగమిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. 2017–18లో తెలంగాణ 10.1 శాతం వృద్ధిరేటు సాధించగా, జాతీయ వృద్ధి రేటు 6.6% మాత్రమే అని చెప్పారు. తలసరి ఆదాయం జాతీయ సగటు రూ.1,12,764 కోట్లు ఉండగా, రాష్ట్ర సగటు రూ.1,75,534 అని చెప్పారు. టీఎస్ఐపాస్ పారిశ్రామిక విధానం విజయం సాధించిందన్నారు. గనుల శాఖకు గతేడాది రూ.3,500 కోట్ల వార్షిక ఆదాయ లక్ష్యం కేటాయించగా, రూ.3,700 కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖనిజాల అభివృద్ధి సంస్థ (టీఎస్ ఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలతో నాలుగేళ్లలో రూ.1,600 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పెద్ద ఎత్తున పారిశ్రామిక మౌలిక వసతులు రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి గతేడాది పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా బుగ్గపాడులో మెగా ఫుడ్‌పార్క్, సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కు, మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ–హబ్‌ను ప్రారంభించామన్నారు. త్వరలో దండుమల్కాపురం లోని 377 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభిస్తామని, దీనిద్వారా రూ.750 కోట్ల పెట్టుబడులు, 12,250 మందికి ఉద్యోగాలొస్తాయన్నారు. ఫార్మాసిటీకి సూత్రప్రాయంగా పర్యావరణ అనుమతులు వచ్చాయని, దీనిలో రూ.64 వేల కోట్ల పెట్టుబడులు, 4.20లక్షల మందికి ఉద్యోగాలొస్తాయన్నారు. వరంగల్‌లోని 1,200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా రూ.1,1586 కోట్లు పెట్టుబడులు, 1.13 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయన్నారు. త్వరలో సుల్తాన్‌పూర్‌లో మహిళా పారిశ్రామికవేత్తల పార్కు, బండమైలారంలో సీడ్ పార్కు, సంగారెడ్డి జిల్లాలో ఎల్ఈడీ పార్కు, సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, నిజామాబాద్‌లో స్పైస్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వివిధ రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ పురస్కారాలను అందజేశారు. సీఎస్ఆర్ పోర్టల్‌ను ప్రారంభించడంతో పాటు నేషనల్ ప్రొడక్టవిటీ కౌన్సిల్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్‌తో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. -
ఫార్మాసిటీకి ‘నిమ్జ్’ హోదా!
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ప్రాజెక్టుకు త్వరలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) హోదా లభించనుంది. దేశంలో ఉత్పాదక రంగ పరిశ్రమల క్లస్టర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్రం 2013లో నేషనల్ మాన్యుఫాక్చరింగ్ పాలసీని తీసుకొచ్చింది. దీని కింద నిమ్జ్‌లు ఏర్పాటు చేసే రాష్ట్రాలకు ఆర్థిక సహకారం అందిస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలా ల్లోని 19,333.20 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ రంగ పారిశ్రామికవాడగా రూపుదిద్దుకోనున్న ఫార్మాసిటీకి త్వరలో నిమ్జ్హోదా జారీ విషయంలో కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించనుంది. సానుకూలంగా నివేదికలు.. నేషనల్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ ప్రకారం కనీసం 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఉత్పాదక రంగ పరిశ్రమల క్లస్టర్లు.. రోడ్డు, రైల్వే రవాణా సదు పాయం కలిగి ఉంటే కేంద్రం నిమ్జ్ హోదా జారీ చేస్తుంది. నిమ్జ్ హోదా కల్పించేందుకు ఫార్మాసిటీ అన్ని అర్హతలు కలిగి ఉందని కేంద్ర ఔషధ, జాతీయ రహదారులు, రైల్వే మంత్రిత్వ శాఖలు సానుకూ లంగా నివేదికలు అందించాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు నిమ్జ్ హోదా జారీ చేస్తూ కేంద్ర వాణిజ్య శాఖ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) ఉత్తర్వులు జారీ చేయడమే మిగిలిందని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) అధికార వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ పరికరాలు, మెటల్స్, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్స్ తదితర ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు కోసం రాష్ట్రానికి కేంద్రం జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టును ఇప్పటికే మంజూరు చేసింది. ఫార్మాసిటీ ప్రాజెక్టుకు నిమ్జ్ హోదా కల్పిస్తే దేశంలో రెండు నిమ్జ్ ప్రాజెక్టులు కలిగిన తొలిరాష్ట్రంగా తెలంగాణ అవత రించనుంది. ఫార్మాసిటీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5.56 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రాజెక్టు కోసం 19,333 ఎకరాలను సేకరించాల్సి ఉం డగా 8 వేల ఎకరాలను సేకరించింది. పర్యావరణ అనుమతుల జారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కేంద్ర నిధులు, రుణ సహాయం బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ల పరిశ్రమల స్థాపన కోసం రూ.16,784 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా లభిస్తే కేంద్రం నుంచి భారీ మొత్తం లో నిధులు, ఇతర రాయితీ, ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో రూ.4 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులవాటా పోగా మిగిలిన పెట్టుబడి వ్యయాన్ని రుణాల రూపంలో సమీకరించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ సహకారం అందించనుంది. -
నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను మంత్రి కె.తారకరామారావు కోరారు. జాతీయ ఆరోగ్య భద్రతకు దోహదపడే ఈ ప్రాజెక్టు తెలంగాణతోపాటు యావత్ దేశానికి ఉపయోగపడుతుందని వివరించారు. గురువారం కేంద్ర మంత్రిని పార్లమెంటులో కలుసుకున్న కేటీఆర్.. నిమ్జ్ లక్ష్యాలను వివరించారు. ప్రాణాంతక వ్యాధుల నివారణకు అవసరమైన యాంటిబయోటిక్స్‌ను 84 శాతం వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, వ్యాధి నిరోధక మందుల కోసం భారీ స్థాయిలో ఇతర దేశాలపై ఆధారపడటం దేశానికి తీవ్రమైన సమస్య అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశ ఫార్మా రంగానికి ఉత్తమిచ్చేలా నిమ్జ్‌ను ఏర్పాటు చేయనున్నామని, దీని ఏర్పాటుకు అవసరమైన ఈఐఏ నివేదికను ఇటీవల కేంద్రానికి పంపామని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్‌లో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్, ఎఫ్ఐసీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరగనున్న మైనింగ్ టుడే–2018 సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయాలని హర్షవర్ధన్, మరో మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌లను కేటీఆర్ ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ‘డీఐపీ’ఏర్పాటు చేయండి కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (డీఐపీ) కారిడార్లలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. రక్షణ రంగంతో హైదరాబాద్‌కు అనుబంధం ఉందని.. రక్షణ రంగ సంస్థలు, పరికరాల తయారీలో ముందు వరుసలో ఉందని వివరించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ రాత్రి సమావేశమైన కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. - ఢిల్లీలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన కేటీఆర్ -
ఫార్మాసిటీకి లభించని అనుమతి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల జారీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వాయిదా వేసింది. గత నెల 24న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావ రణ మార్పుల మంత్రిత్వశాఖ (ఎంఓఈఎఫ్) నేతృత్వంలోని ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఫార్మాసిటీ ద్వారా పర్యావరణం, పరిసరాలు కలుషితం కాకుండా తీసుకునే చర్యలపై సమగ్ర ప్రణాళికలతో మరింత సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని కేంద్రానికి సమర్పిస్తే ఆ తదనంతరం జరిగే సమావేశంలో ప్రాజెక్టుకు అనుమతుల జారీపై ఈఏసీ నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే రూ. 64 వేల కోట్ల పెట్టుబ డులు వస్తాయని, ఏటా రూ. 1.4 లక్షల కోట్ల టర్నో వర్ నమోదవుతుందని, విదేశాలకు రూ. 58 వేల కోట్ల విలువగల ఔషధాలు ఎగుమతి అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధి లోని 19,333.20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 16,784 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఫార్మాసిటీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5.56 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెబుతోంది. కమిటీ కోరిన వివరాలు ఏమిటంటే... - బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రిడియెంట్స్ ఉత్పత్తి పరిశ్రమలు విడుదల చేసే రసాయన వ్యర్థాల శుద్ధి, నిర్వహణ కోసం తీసుకోబోయే చర్యలు - రసాయన వ్యర్థాలతో భూగర్భ జలాలు, భూ ఉపరితల జలాలు కలుషితం కాకుండా కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు - ఫార్మాసిటీ పరిసరాల్లో ఇప్పటికే ఉన్న కుంటలు, చెరువులు, వాగులు కలుషితం కాకుండా తీసుకునే చర్యలు - ప్రమాదకర వ్యర్థాలన్నింటినీ ఫార్మాసిటీలోనే డిస్పోజ్ చేసేందుకు తీసుకోబోయే చర్యలు - ప్రాజెక్టు పరిసరాల్లోని గొనుగుమర్ల తండా, మర్రిపల్లి గ్రామాల ప్రజలు కాలుష్యం బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తలు - రసాయన ప్లాంట్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఉన్న సన్నద్ధత వివరాలు. -
గ్రామాలకు కాలుష్య కారక ఔషధ పరిశ్రమలా..?
సాక్షి, హైదరాబాద్: నగర వాసులకు ఇబ్బందిగా మారిన కాలుష్య కారక ఔషధ పరిశ్రమలను గ్రామాలకు తరలించడం ఎలాంటి పర్యావరణ న్యాయమో చెప్పాలని కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్ కోదండరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ నగర శివారు ముచ్చెర్లలో నిర్మించ తలపెట్టిన ఫార్మా సిటీలోకి కాలుష్య కారక పరిశ్రమలు తరలించడం ద్వారా పరిసర గ్రామాలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. ఫార్మా సిటీ నిర్మాణంతో లభించే ఉద్యోగాల సంఖ్యపై ప్రభుత్వం గందరగోళంగా మాట్లాడుతోందని విమర్శించారు. 15.95లక్షలు, 8.79లక్షలు, 4.60లక్షల ఉద్యోగాలు వస్తాయంటూ వేర్వేరు సందర్భాల్లో ప్రకటించిన ప్రభుత్వం తాజాగా 5.56లక్షల ఉద్యోగాలే వస్తాయని చెబుతుందన్నారు. ఫార్మా సిటీలో 140 భారీ పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశముంటే, ఒక్కో పరిశ్రమ ద్వారా కేవలం 1,000 మందికి మించి ఉద్యోగావకాశాలు లభించవన్నారు. ఈ లెక్కన కేవలం 1.40లక్షల ఉద్యోగాలు మాత్రమే వస్తాయన్నారు. మిగిలిన 4.16లక్షల ఉద్యోగాలను అక్కడ ఏర్పాటు చేసే 616 చిన్న తరహా పరిశ్రమల్లో కల్పిస్తారా? అని ప్రశ్నించారు. -
‘నోవార్టిస్’ను విస్తరిస్తాం
సాక్షి, హైదరాబాద్: నోవార్టిస్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ), డేటా సపోర్ట్, అనలిటిక్స్ కార్యకలాపాలు కొనసాగిస్తోందని, హైదరాబాద్‌లో తమ సంస్థ సాధిస్తున్న పురోగతిపై సంతృప్తిగా ఉన్నట్లు ఆ సంస్థ పబ్లిక్ పాలసీ విభాగాధిపతి పెట్రా లక్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సంస్థ నిర్వహిస్తున్న ఔషధ ప్రయోగశాల సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు వెల్లడించారు. పరిశోధన విభాగంలో మరో 150 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపారు. నోవార్టిస్ కార్యకలాపాల విస్తరణతో జీనోమ్ వ్యాలీ అభివృద్ధికి దోహదపడనుందని, పూర్తి వివరాలను కంపెనీ త్వరలో వెల్లడిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలో నిర్మిస్తున్న ఫార్మా సిటీలో పెట్టుబడులు పెట్టాలని నోవార్టిస్‌ను ఆహ్వానించారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో కేటీఆర్ రెండో రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశమై ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించారు. మిత్సుబిషీతో.. రాష్ట్రంలో జపనీస్ చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కును ఏర్పాటు చేయాలని ఆ దేశ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మిత్సుబిషీని కేటీఆర్ కోరారు. మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కెన్ కవాయి బృందంతో ఆయన సమావేశమయ్యారు. భారీ ప్రాజెక్టుల అవకాశాలకు తమ కంపెనీ చూస్తోందని మిత్సుబిషీ ప్రతినిధులుమంత్రికి తెలిపారు. పారిశ్రామికవాడలు, వేస్ట్ మేనేజ్మెంట్ తదితర ప్రాజెక్టులపై మిత్సుబిషీకి ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులకు రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని, కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటించాలని మంత్రి ఆహ్వానించారు. జపాన్ పర్యటనలో ఇలాంటి పార్కు ఏర్పాటుకు జైకా వంటి ఆర్థిక సంస్థలు రుణాలందించేందుకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని వారికి వివరించారు. సౌర విద్యుదుత్పత్తిలో రాష్ట్రం ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కువైట్‌కు చెందిన ఫవద్ అల్గానిమ్ కంపెనీ సీఈవో మహ్మద్ అల్గానిమ్తో సమావేశమై రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు అందుతున్న సహకారాన్ని వివరించారు. రాష్ట్రంలో టెక్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ సంస్థను కేటీఆర్ కోరారు. ఎయిర్ ఏషియాతో.. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో ఆంథోనీ ఫెర్నాండేజ్, ఉప కార్యనిర్వహణాధికారి ఎయిరీన్ ఒమర్‌తో కేటీఆర్ సమావేశమై హైదరాబాద్‌లో ఎయిరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరించారు. రానున్న రోజుల్లో దేశంలో విమానయాన రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఎయిర్ ఏషియాను ఆహ్వానించారు. హెచ్‌పీ కంపెనీతో.. ప్రముఖ హార్డ్‌వేర్ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్‌పీ), టీ–హబ్‌ల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని పరిశీలించాలని కేటీఆర్ కోరారు. హెచ్‌పీ కంపెనీ కార్యకలాపాలను విస్తరించాలని ఆ కంపెనీ ఉపాధ్యక్షుడు అనా పిన్కుజుక్కు విజ్ఞప్తి చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సర్క్యులర్ అవార్డు గెలుచుకున్న టీ–హబ్‌లోని బనయన్ నేషన్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు మనీ వాజపేయ్ దావోస్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వాజ్‌పేయ్ బృందానికి అభినందనలు తెలిపారు. -
ఔషధ నగరికి మరొక్క అడుగే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఔషధ పరిశ్ర మల స్థాపన కోసం ప్రభుత్వం చేపట్టిన ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతుల జారీపై బుధవారం నిర్ణయం వెలువడే అవకాశముంది. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ (ఎంఓఈఎఫ్)ల నేతృత్వంలో ని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఢిల్లీలో సమావేశమవుతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇన్చార్జి ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం ఈ సమావే శానికి హాజరై.. ఫార్మాసిటీ ప్రాజెక్టుపై ప్రజెం టేషన్ ఇవ్వనుంది. ఈ భేటీలోనే పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్ వస్తే.. త్వరలోనే ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఒకవేళ ఈఏసీ అదనపు సమాచారం కోరితే.. తదుపరి నిర్వహించే ఒకటి, రెండు సమా వేశాల్లో పర్యావరణ అనుమతులు లభించే అవకాశాలున్నాయి. ఫార్మాసిటీ ప్రాజెక్టుకు గతేడాది డిసెంబర్ 9న తొలిదశ పర్యావరణ అనుమతులుగా భావించే ‘టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)’ జారీ అయ్యాయి. 19,333.2 ఎకరాల్లో.. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని 19,333.2 ఎకరాల విస్తీర్ణంలో, రూ.16,784 కోట్ల అం చనా వ్యయంతో ఫార్మాసిటీని చేపట్టారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో... ‘నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)’గా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఔషధ ఆవిష్కరణలు, అభివృద్ధి, తయారీ, సరఫరా, మార్కెటింగ్‌కు అవసర మైన అన్ని సదుపాయాలను కల్పించనున్నారు. ప్రాజెక్టుకు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. 5.56 లక్షల మందికి ఉద్యోగావ కాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఏటా రూ.1.4 లక్షల కోట్ల విలువైన ఔషధాల ఉత్పత్తి, అందులో రూ.58 వేల కోట్ల విలువైన ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మాసిటీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభు త్వం ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో ప్రచారం నిర్వహిస్తోంది. ప్రాజెక్టుకు 985 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా. వేగంగా భూసేకరణ ఫార్మా సిటీ ప్రాజెక్టుతో యాచారం మండలం మేడిపల్లి, కుర్మిడ్డ, నానక్‌నగర్, తాడిపర్టి, కందుకూరు మండలం మీర్ఖాన్పేట్, ముచ్చర్ల, పంజగూడ, కడ్తాల్ మండలం ముద్విన్, కార్కడల్ పహాడ్, కడ్తాల్ గ్రామాల్లో 3,747 కుటుంబాలు భూములు కోల్పోతు న్నాయి. గతేడాది అక్టోబర్ 11న రాష్ట్ర ప్రభు త్వం ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఇప్పటివరకు 2,020 నిర్వాసిత కుటుంబాలకు రూ.273.36 కోట్ల పరిహా రాన్ని అందజేసింది. దీంతో 6,812 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మిగతా 1,727 కుటుంబాలకు పరిహారం చెల్లిం చి.. 12,233 ఎకరా లను సేకరించాల్సి ఉంది. కేంద్ర భూసేకరణ చట్టం–2013కి ప్రత్యామ్నాయం గా.. రాష్ట్ర ప్రభు త్వం తెచ్చిన భూసేకరణ, పునరా వాస చట్టం–2017 కింద ఫార్మా సిటీ ప్రాజె క్టుకు భూసేకరణ జరుగుతోంది. ఔషధ ఎగుమతులకు ఊతం దేశంలో ఉత్పత్తవుతున్న ఔషధాలు ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలకు ఎగుమతి అవుతు న్నాయి. మన ఔషధ ఉత్పత్తులకు అమెరికా అతి పెద్ద మార్కెట్. ప్రపంచవ్యాప్తంగా జరుగు తున్న జనరిక్ ఔషధాల ఎగుమతుల్లో 20 శాతం వాటా మన దేశానిదే. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీతో ఔషధ ఎగుమతులు మరింతగా వృద్ధి చెందనున్నాయి. ఏటా ఫార్మాసిటీ నుంచి రూ.58 వేల కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి అవుతాయని అంచనా వేస్తున్నారు. ఔషధ మిశ్రమాలు ఉత్పత్తి ఔషధ ఉత్పత్తి పరిశ్రమలకు హైదరాబాద్ ఖ్యాతి గడించినా.. ఔషధాల తయారీలో వినియోగించే రసాయన మిశ్రమాల (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడి యంట్స్– ఏపీఐ)ను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటు న్నారు. ముఖ్యంగా 60–70 శాతం ఏపీఐలు చైనా నుంచే వస్తున్నాయి. ఒకవేళ ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నా, ఇతర కారణాలతో సరఫరా ఆగినా.. ఫార్మా పరిశ్రమలకు ఇబ్బందులు తప్పవు. బీజింగ్ ఒలింపిక్స్‌కు ముందు పర్యావరణ కారణాలతో చైనా ప్రభుత్వం పెన్సిలిన్ ఉత్పత్తి ప్లాంట్లను మూసివేసింది. దాంతో ‘పెన్–జీ’ఔషధ మిశ్ర మం సరఫరా నిలిచిపోయి హైదరాబాద్‌లోని ఫార్మా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే ఫార్మాసిటీ ఏర్పాటుతో ఇలాంటి సమస్యలకు చెక్ పడనుంది. స్థానిక పరిశ్రమలకు అవసరమైన ఏపీఐలను ఫార్మాసిటీలోనే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ప్రాజెక్టు ప్రణాళికల్లో చేర్చింది. ఈ రంగంలో సైతం భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఫార్మా సిటీలో ఉత్పత్తయ్యే ఔషధాలివీ ఫార్మా సిటీలో పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్స్ వంటి యాంటీ బయాటిక్ ఔషధాలు ఉత్పత్తికానున్నాయి. వివిధ రకాల సింథటిక్ డ్రగ్స్, సల్ఫర్ డ్రగ్స్, యాంటీ ట్యూబర్క్యులోసిస్, యాంటీ లెప్రోటిక్ డ్రగ్స్, అనాలజిస్టిక్స్, అనెస్థిటిక్స్, యాంటీ మలేరియా ఔషధాలు, పారాసెటమాల్, మెటాఫార్మిన్, ఇబుప్రోఫిన్, విటమిన్స్, వెజిటబుల్ ఆరిజిన్ డ్రగ్స్, వ్యాక్సిన్లతోపాటు ఆయుర్వేద ఔషధాలు కూడా ఉత్పత్తి కానున్నాయి. ఫార్మా విశ్వవిద్యాలయం కూడా.. ఫార్మాసిటీని మొత్తంగా 19,333 ఎకరాల్లో ఏర్పాటు చేస్తుండగా.. అందులో 9,535 ఎకరాల్లో పరిశ్రమల కోసం కేటాయించారు. ఇందులో 4,517 ఎకరాల్లో తీవ్ర కాలుష్య కారక (రెడ్), 2,480 ఎకరాల్లో కాలుష్య కారక (హైబ్రిడ్), 1,933 ఎకరాల్లో స్వల్ప కాలుష్య కారక (ఆరెంజ్), 605 ఎకరాల్లో కాలుష్య రహిత (గ్రీన్) పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఇక ఫార్మా సిటీ ఉద్యోగుల కోసం 1,507 ఎకరాల్లో రెసిడెన్షియల్ టౌన్షిప్, 322 ఎకరాల్లో ఫార్మా విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తారు. అదే విధంగా పబ్లిక్, సెమీ పబ్లిక్ అవసరాలకు 1,111 ఎకరాలు, కార్యాలయాలకు 544 ఎకరాలు, పరిశోధనలకు 827 ఎకరాలు, గ్రీన్ బెల్ట్‌కు 3,205 ఎకరాలు, రోడ్ల నిర్మాణానికి 1,779 ఎకరాలు, లాజిస్టిక్ (రవాణా) హబ్‌కు 203 ఎకరాలు, ఆస్పత్రికి 104 ఎకరాలు, హోటల్‌కు 141 ఎకరాలను కేటాయించారు. కాలుష్య పరిశ్రమలు నగరం బయటికి.. పలు ఔషధ పరిశ్రమల నుంచి హానికర రసాయన వ్యర్థాలు విడుదలవుతుంటాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల జనావాసాలకు సమీపంలో అలాంటి పరిశ్రమలు ఉన్నాయి. ఇలాంటి సుమారు 81 ఔషధ పరిశ్రమలను నగరం అవతలకు తరలించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇప్పుడా పరిశ్రమలన్నీ ఫార్మాసిటీకి తరలనున్నాయి. ఇక కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనల మేరకు.. జల, వాయు, శబ్ద, భూ కాలుష్యాలను నివారించేందుకు ఫార్మాసిటీ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. రసాయన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు అత్యాధునిక ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. -
ఫార్మాకు ప్రత్యేక రైల్వే లైన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫార్మాసిటీకి ప్రత్యేక రైల్వేలైన్ వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ఔషధరంగ దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో సరుకు రవాణాకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ప్రాజెక్టు సమగ్ర నివేదికలో పొందుపరిచింది. వారం రోజుల క్రితం యాచారం మండ లం మేడిపల్లిలో ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ’పై ప్రజాభిప్రాయసేకరణ జరిపిన సర్కారు.. ఇందులో ఈపీటీఆర్ఐ రూపొందించిన పర్యావరణ ప్రభావం, అంచనా(ఈఐఏ) నివేదికను బహిర్గతం చేసింది. ఈ క్రమంలోనే షాద్‌నగర్ నుంచి ప్రత్యేక రైల్వేలైన్‌ను ప్రస్తావించింది. సికింద్రాబాద్ నుంచి కర్నూలు మీదుగా డోన్ వెళ్లే బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్‌ను అనుసంధానం చేస్తూ ఫార్మాసిటీకి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఔషధనగరికి దక్షిణం వైపు ఉత్తర–దక్షిణ దిశలో 33కి.మీ. (షాద్‌నగర్ చేరువలో)దూరంలో ఈ లైన్‌ను కలిపితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ రైలు మార్గాన్ని ప్రయాణికుల అవసరాలకు కాకుండా సరుకు రవాణాకే వినియోగించుకోవాలని ప్రతిపాదించింది. తద్వారా వివిధ పరిశ్రమలు తయారుచేసే ఉత్పత్తులను సులువుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చని అంచనా వేసింది. మరోవైపు ప్రాజెక్టుకు నలు దిశలా రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రీజినల్ రింగ్‌రోడ్డు సహా ప్రస్తుత ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ఫార్మాసిటీని కలుపుతూ ప్రత్యేక మార్గాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కందుకూరు– యాచారం మీదుగా నాగార్జునసాగర్ హైవేను లింకు చేస్తూ రోడ్డు విస్తరణ పనులను ఆర్అండ్బీ చేపట్టింది. మరోవైపు రావిర్యాల దగ్గర ఔటర్ ఎగ్జిట్ 13 నుంచి కూడా ఒక రహదారిని ప్రతిపాదించింది. శ్రీశైలం జాతీయ రహదారి–సాగర్ హైవేను అనుసంధానిస్తూ మరికొన్ని రోడ్లను నిర్మించనున్నట్టు ఈఐఏ నివేదికలో స్పష్టం చేసింది. జిల్లాను రెండో జోన్లో కొనసాగించాలి దోమ(పరిగి): వెనుకబడిన వికారాబాద్ జిల్లాను (పాత జోనల్) రెండో జోన్లోనే కొనసాగించాలని పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతయ్యగౌడ్, దోమ మండల అధ్యక్షుడు గిరమోని గోపాల్ అన్నారు. జిల్లాను పూర్వ రంగారెడ్డి జిల్లాలో కలపి రెండో జోన్లో కొనసాగించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునర్విభజనలో భాగంగా జిల్లాను 1వ జోన్లో కలపడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అంగీకరించేది లేదని ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని రెండో జోన్లోనే కలపాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ముందు ముందు ఉపాధ్యయ సంఘాల తరుపున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పురందాస్, రాష్ట్ర కార్యదర్శి హరిలాల్, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా సిటీ
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాస్యూటికల్ సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఫార్మాసిటీపై సమగ్ర అధ్యయనం చేశామన్న కేటీఆర్.. దానికోసం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తెలిపారు. హెచ్ఐసీసీలో ఫార్మా సిటీపై మంత్రి కేటీఆర్ మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో పూర్తి స్థాయిలో మెడిసిన్స్ ఉత్పత్తిలో మనం వెనుకబడి ఉన్నామని తెలిపారు. చైనా, యూరప్, అమెరికా నుంచి మందులు దిగుమతి అవుతున్నాయన్నారు. 84 శాతం మందుల ముడి సరుకు దిగుమతులపైనే మనం ఆధారపడి ఉన్నామని పేర్కొన్నారు. చైనా నుంచి 66 శాతం ముడి సరుకు దిగుమతి చేసుకుంటున్నాం. మెడిసిన్ దిగుమతులను తగ్గించాలన్నారు. డొమెస్టిక్ మెడిసిన్ తయారు అయినప్పుడే ధరలు తగ్గుతాయన్నారు. దేశీయంగా ఔషధాల తయారీని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి లభిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాలుష్యం ముప్పు ఉండదు ఆరు, ఏడు ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు ఉండటం వల్ల డబ్బు అదనంగా ఖర్చు అవడంతో పాటు కాలుష్యం కూడా పెరిగిందన్నారు. ఫార్మా కంపెనీలన్నీ ఒకే చోట ఉంటే ఈ సమస్య ఉండదన్నారు. ఫార్మా సిటీ ఏర్పాటుతో కాలుష్యం ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. ఫార్మా సిటీ పరిసరాల్లో ఉండే ప్రజలకు కాలుష్యం ముప్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. అత్యాధునిక వసతులతో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దశల వారీగా ఫార్మా సిటీ ప్రాజెక్టు గతంలో వివిధ ప్రాంతాల్లో ఫార్మా సిటీలు ఉండటం వల్ల ఔషధాల ఉత్పత్తి వ్యయం పెరిగిందని తెలిపారు కేటీఆర్. ఫలితంగా తక్కువ మోతాదులోనే ఔషధాల ఉత్పత్తి జరిగిందని చెప్పారు. అన్ని ఒకే చోట ఉండేలా ఫార్మా ఇండస్ట్రీయల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఏక కాలంలో 19333 ఎకరాల ఫార్మాసిటీ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యం కాదన్నారు మంత్రి. దశలవారీగా ఈ ఫార్మా సిటీ ప్రాజెక్టును చేపడుతామని ప్రకటించారు. ప్రపంచంలోనే ఫార్మాస్యూటికల్ లార్జెస్ట్ ఇండస్ట్రీయల్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అతి తక్కువ వ్యయంతోనే హైదరాబాద్ ఫార్మాసిటీలో అన్ని మెడిసిన్స్ లభించేలా ప్రణాళిక చేశామని పేర్కొన్నారు. ఫార్మా సిటీ ఏర్పాటుతో 4 లక్షల మందికి ఉపాధి ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. వారికి ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తుందని చెప్పారు. ఫార్మాసిటీలో పని చేసే వాళ్లంతా అక్కడే నివాసం ఉండబోతున్నారని మంత్రి పేర్కొన్నారు. -
ఆ పనుల వేగం పెంచండి
ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్కు నిర్మాణ పనులను వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ ఆదేశించారు. ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్కు నిర్మాణాలపై గురువారం సచివాలయంలో రాజీవ్ శర్మ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. టెక్స్టైల్ పార్కుకు సంబంధించి రోడ్డు నిర్మాణంతో పాటు మాస్టర్ ప్లాన్, ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిధుల సమీకరణ, వివిధ కంపెనీలతో ఎంవోయూ, యాంకర్ యూనిట్, డీపీఆర్, సీఈటీపీ నిర్మాణం తదితర అంశాలను ప్రస్తావించారు. ఫార్మాసిటీకి సంబంధించి, రోడ్డు నిర్మాణ పనులు, భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. -
మెడికల్ డివైజెస్, ఫార్మాసిటీలపై ఫోకస్ పెట్టండి
-
మెడికల్ డివైజెస్, ఫార్మాసిటీలపై ఫోకస్ పెట్టండి
నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం 8,500 ఎకరాలు అవసరమని ప్రాథమిక అంచనా ఈ పార్కుల ద్వారా కలిగే లాభాలను ప్రజలకు తెలపండి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం మళ్లీ నంబర్ వన్‌గా నిలవాలి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడికల్ డివైజెస్ పార్కుల పురోగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నిర్ణీత గడువులోగా వీటిని పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఏరోస్పేస్ రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. భాగ్యనగరంలో ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక కంపెనీలు ఉన్నాయని, మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను నగరానికి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు పలు కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆసక్తిని బట్టి ఈ రెండు పార్కులకు ప్రాథమికంగా దాదాపు 8,500 ఎకరాల డిమాండ్ ఉందని తెలిపారు. పర్యావరణ అనుమతులకు సంబంధించి త్వరలోనే బహిరంగ విచారణ ఉన్నందున ఫార్మా సిటీ ద్వారా కలిగే లాభాలు, ఉద్యోగావకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, జీరో లిక్విడ్ డిశ్చార్జి సదుపాయాలు కల్పిస్తున్నందున కాలుష్య ప్రమాదం కూడా ఉండదన్న విషయాన్ని వివరించాలని అధికారులను ఆదేశించారు. గురువారమిక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేటీఆర్.. పరిశ్రమల శాఖ, ఐటీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు శాఖల్లో అమల్లో ఉన్న కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. టాస్క్‌ను జిల్లాలకు విస్తరించండి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును మిషన్ భగీరథ ప్రాజెక్టుతో సమన్వయం చేసుకుంటున్నామని అధికారులు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు వివరించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుతోపాటే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కూడా పూర్తవుతుందని చెప్పారు. టాస్క్ ద్వారా ఇప్పటిదాకా ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, త్వరలో ఈ శిక్షణ కార్యక్రమాలను హెల్త్, ఫార్మా, అటోమోటివ్స్ రంగాలకు విస్తరిస్తామని తెలిపారు. టాస్క్ కేంద్రాలను జిల్లాలకు విస్తరించేందుకు దశల వారీగా ప్రయత్నాలు ప్రారంభించాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రతి మూడు నెలలకోసారి శాఖాపరమైన మైలురాళ్లను ముందే తెలియజేయాలన్నారు. ఈ లక్ష్యం అందుకోలేని అధికారులపై కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. గతేడాది ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈసారి అదే స్థానాన్ని కొనసాగించేలా పనిచేయాలని అధికారులను కోరారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల కమిషనర్ నదీమ్ అహ్మద్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
‘ఫార్మా’లో ప్రపంచంతో పోటీ
బయో ఏసియా సదస్సులో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ఏర్పాటుతో దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్ స్థానం సుస్థిరమవుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తయారీలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్.. జినోమ్ వ్యాలీ రూపంలో ఆసియాలోనే అతిపెద్ద, వ్యవస్థీకృత పరిశోధనాభివృద్ధి సమూహంగా అవతరిస్తోందన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైన 14వ బయో ఏసియా సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.. తాజాగా రూ.3,000 కోట్ల పెట్టుబడుల రాకతో జినోమ్ వ్యాలీలో రెండో తరం విప్లవం మొదలైనట్లేనని చెప్పారు. ఫార్మాసిటీతోపాటు వైద్య పరికరాల తయారీ పార్క్‌ల ఏర్పాటుతో జినోమ్ వ్యాలీ వైద్య రంగానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ తనదైన పాత్ర పోషించే అవకాశం ఏర్పడుతుందన్నారు. స్వయంగా బయోటెక్నాలజిస్ట్నైన తాను లైఫ్‌సైన్సెస్ రంగంలో కీలకంగా ఎదుగుతున్న జినోమ్ వ్యాలీ క్లస్టర్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలు, అతి తక్కువ ధరలతో మందులు లభించేందుకు జినోమ్ వ్యాలీలో జరిగే పరిశోధనలు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. వ్యాలీలోని కంపెనీలన్నింటికీ నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నగర శివార్లలో దాదాపు 14 వేల ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఫార్మా సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతుం దని.. ఇందులో బల్క్‌డ్రగ్స్, ఫార్ములేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని వివరిం చారు. జినోమ్ వ్యాలీలో మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ‘ఇండస్ట్రి యల్ ఏరియా లోకల్ అథారిటీ’సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఎన్నో సవాళ్లు: నరసింహన్ మధుమేహం, రక్తపోటు, కంటి జబ్బులను నివారించేందుకు, ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని, కార్పొరేట్ ఆస్పత్రులు ఇందులో చురుకైన పాత్ర పోషించాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ కోరారు. ఆరోగ్య రంగం ప్రస్తుతం ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటోందని.. పరిశోధనల ద్వారా చౌకైన, మెరుగైన పరిష్కారాలను శాస్త్రవేత్తలు కనుక్కోవాలని సూచించారు. మాతా శిశు సంక్షేమం మొదలుకొని మధ్య వయస్సు వారిలో ఒత్తిడి వరకూ అనేక సమస్యలు ఉన్నాయని బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ గవర్నర్ గుర్తు చేశారు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలతో మనిషి ఆయుః ప్రమాణాలు పెరిగినా వయోవృద్ధులు సౌకర్యంగా జీవించేందుకు ఇవి చాలవన్నారు. వైద్య సదుపాయాలు ఎక్కువగా పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితం కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్.. వాటిని గ్రామీణ ప్రాంతాలకు చేర్చడంపై దృష్టిపెట్టాలన్నారు. మందుల ప్యాకెట్లపై ఉండే లేబుల్స్‌ను వయో వృద్ధులు కూడా సులువుగా చదివేలా పెద్ద అక్షరాలతో ముద్రించాలని సూచించారు. కార్యక్రమంలో నోబెల్ అవార్డు గ్రహీత, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త కర్ట్ వుట్రిచ్, (2002, రసాయన శాస్త్రం), జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పాల్ స్టౌఫెల్స్‌లను జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులతో గవర్నర్ నరసింహన్ సత్కరించారు. ఫార్మా రంగంలో విశేష కృషి చేసిన వారికి బయో ఆసియా ఎక్సలెన్సీ అవార్డులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో మలేసియా ప్రతినిధి చెంగ్ ఛాన్ ఖిమ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ సౌమ్యా స్వామినాథన్, ప్రొఫెసర్ విజయరాఘవన్, బాలసుబ్రమణ్యన్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు జయేశ్ రంజన్, తివారీ తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా ఫార్మాసిటీ పనులు
అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో తలపెట్టిన ఫార్మాసిటీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. ఫార్మాసిటీ ప్రాజెక్టు పురోగతిపై గురువారం ఆయన టీఎస్ఐఐసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఫార్మాసిటీ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్‌పై మంత్రి అధికారులతో చర్చించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్న కన్సల్టెన్సీ ప్రతినిధులు ప్రణాళికలో ఉండే విశేషాలను మంత్రికి వివరించారు. పూర్తిగా కాలుష్య రహిత ప్రాజెక్టుగా ఫార్మాసిటీ నిర్మాణం జరిగే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఫార్మాసిటీ ప్రాజెక్టుకు రోడ్డు సదుపాయంపై మంత్రి ఆరా తీశారు. మౌలిక సదుపాయాల కల్పన, ఫార్మాసిటీలో నిర్మించనున్న ఫెసిలిటీ భవనం గురించి మంత్రి తెలుసుకున్నారు. భూసేకరణపై రెవెన్యూ శాఖ అధికారులతో మంత్రి చర్చించారు. ఫార్మాసిటీ తొలి దశ కోసం ఇప్పటిదాకా సుమారు 5,500 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు తెలియజేశారు. టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు సంస్థ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు. -
పాలకుల వాగాడంబరం
సందర్భం ప్రమాదకరమైన ఔషధ పరిశ్రమలను పచ్చటి పైరులతో ఉండే ముచ్చర్ల వద్దకు తెస్తున్నందుకు కేటీఆర్, కేసీఆర్‌లు గర్వపడుతున్నారు. ఫార్మారంగంలో గుత్తాధి పత్యం సాధించిన వారికి మరింత మేలు చేసేందుకే ఫార్మాసిటీ తెస్తున్నారా? తెలంగాణ ప్రభుత్వం రూపొం దించిన టీఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శమంటూ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రకటించారు. ఆయన భక్తులైన మంత్రులు, ఎమ్మె ల్యేలు ఓ అడుగు ముందుకేసి ఎక్కడా ఇటువంటి విధానం లేదు, ఇది ప్రపంచా నికేSఆదర్శం అని ప్రకటించేశారు. కొత్త పరిశ్రమలు పెట్టే వారికి, పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే వారికి తగిన రీతిలో ప్రోత్సాహం ఇస్తామని మంత్రి కేటీఆర్ పదే పదే ప్రకటనలు ఇస్తున్నారు. అందుకోసం ఆయనగారు విదే శాలకు వెళ్లి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. పెట్టుబ డులు రావడం, కొత్త పరిశ్రమలు రావడం మన రాష్ట్ర అభివృద్ధికీ, ఉద్యోగాల కల్పనకీ ఉపయోగపడితే తప్ప కుండా ఆహ్వానించాల్సిందే. కానీ కొత్త ఉద్యోగాలు రాక పోగా ఆ పేరుతో వనరుల సంతర్పణ జరిగితే మాత్రం ఎవరైనా వ్యతిరేకించాల్సి ఉంటుంది. ‘‘తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను తెరిపి స్తాం, సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని’’ టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్త యింది. ఈ కాలంలోనే నిజాం షుగర్స్ పరిశ్రమ, సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమలాపూర్ బిల్టు పరిశ్రమ మూతపడింది. మిల్లును తెరిపిస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. ‘‘నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామ’’ని ఎన్నికల ప్రణా ళికలో చెప్పారు. అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్ పరిధిలోని మూడు ప్లాంట్లలో ఉత్పత్తి ఆగిపోయింది. కంపెనీ మూత పడింది. కేసీఆర్, ఆయన కూతురు స్థానిక ఎంపీ కవిత, ఫ్యాక్టరీ పరిధిలోని మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే ఇదే అంశంపై ఇదిగో అదిగో తెరుస్తున్నాం అంటూ ప్రకటనలు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో ఉన్న నిజాం షుగర్స్‌కు మెదక్ మంబోజిపల్లిలో, జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోనూ యూనిట్లు ఉన్నాయి. ఈ మూడు యూనిట్ల పరిధిలో ప్రత్యక్షంగా దాదాపు రెండువేల రెండువందల మంది, పరోక్షంగా దాదాపు 30 వేల మంది ఉపాధి పొందేవారు. వీరు గాక రైతులు, చెరకుతోటల్లో పనిచేసే కార్మికులు మరో యాభైవేల మంది ఉండేవారు. ఇంత ఉపాధికి, ఈ జిల్లాల ఆర్థికాభివృద్ధికి మూలాధారం అయిన షుగర్ ఫ్యాక్టరీ మూత పడి వీరంతా రోడ్డున పడ్డారు. ఈ బాధి తులందరినీ మహాజన పాదయాత్ర సందర్బంగా మేము ప్రత్యక్షంగా కలుసుకున్నాం. మెదక్ మంబోజిపల్లిలోని యూనిట్‌ను కూడా సందర్శించాము. ఈ కీలకమైన పరిశ్రమను తెరిపించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఘనత వహించిన కేసీఆర్ చేసిన కృషి ఏంటో చెప్పాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిజాం షుగర్స్ ప్రస్తావన వచ్చినప్పుడు ‘‘నిజాం షుగర్స్ అనేది ముగిసి పోయిన అధ్యాయం’’ అంటూ కేసీఆర్ మాట్లాడారు. విపక్ష సభ్యులు ప్రశ్నిస్తే మీరు నడుపుతారా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. సీఎంగారి అబద్ధాలకు, మాట మార్చడానికి ఇంతకంటే రుజువు ఏముంటుంది? సిర్పూర్ పేపర్ మిల్లుది కూడా అదే పరిస్థితి. ఐదు వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా ముప్పయివేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్న పరిశ్రమ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మూతపడింది. ఈ మిల్లు కార్మిక సంఘం నేతగా సాక్షాత్తు రాష్ట్ర, మరియు కార్మిక శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నారు. కాగజ్ నగర్ ప్రాంతం దాదాపుగా ఈ మిల్లుపై ఆధారపడి బతుకు తోంది. మిల్లు మూతపడ్డ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో నలుగురు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మెుత్తం 17 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో నిజాం కాలంలో స్థాపించిన ఫ్యాక్టరీ అంటూ గొప్పగా రాశారు. ఫ్యాక్టరీ మూత పడు తుంటే కళ్లప్పగించి చూశారు తప్ప కనీస చర్యల్లేవు. రెండువేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ పరోక్షంగా 30వేల మందికి ఉపాధి కల్పించే బిల్టు పరిశ్రమ విషయంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి అదే విధంగా ఉంది. పరిశ్రమలోని ఉత్పత్తికి మార్కెట్ సౌక ర్యం లేదంటూ యాజమాన్యం కంపెనీని హఠాత్తుగా మూసివేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. ఎన్నికలు ముగిసాయి. టీఆర్ఎస్ రెండున్న రేళ్లుగా అధికారంలో ఉంది. కానీ కమలాపూర్ బిల్టు కార్మి కుల బతుకులు ఇంకా రోడ్డుపైనే ఉన్నాయి. 250 కోట్ల రూపాయలు ఇస్తామని మంత్రులు ప్రకటించారు. కానీ నేటికీ ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. బిల్టు యాజ మాన్యాన్ని చర్చలకు పిలిచిన ప్రభుత్వం రెండోసారి ప్రయత్నించలేదు. 21 నెలలుగా వేతనాలు లేక కుటుం బాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ముడిసరుకులు లభించే పరిశ్రమలన్నింటినీ తిరిగి పునరుద్ధరించాలి. తెలంగాణలో పత్తి ఉత్పత్తి గణనీ యంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో సాగవుతున్న మెుత్తం పంటల్లో పత్తిపంట సాగు 60 శాతానికి చేరుకుంది. ఈ ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్క్‌లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేసి రైతుల నుండి నేరుగా పత్తిని కొనవచ్చు. కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు. చెరకు విరివిగా పండే మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో చక్కెర పరిశ్రమల అభివృద్ధికి పెట్టుబడులు తెచ్చేందుకు సర్కార్ ప్రయత్నం చేయాలి. వరి ఎక్కువగా పండే ప్రాంతాల్లో రైసు మిల్లు పరిశ్రమ ఒక్కటే కాకుండా దాని ఉప ఉత్పత్తుల పరిశ్రమలను స్థాపించే విధంగా ప్రోత్సహించాలి. వ్యవసాయంతో ముడిపడి ఉన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున వందలాది కోట్ల రూపాయల పెట్టుబడి అవసర ముండదు. కాబట్టి చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్స హించేందుకు కృషి చేస్తే వ్యవసాయ రంగమూ, పారిశ్రా మిక రంగమూ అభివృద్ధి అవుతుంది. వందలాది ఎక రాల భూములు పందేరం చేసినా పెద్ద పరిశ్రమలు పూర్తి యాంత్రీకరణ చేసినా కనీసం వెయ్యిమందికి కూడా ఉపాధినివ్వడం లేదు. కాబట్టి చిన్న తరహాæ, మధ్య తరహా పరిశ్రమలు, పర్యావరణానికి ఇబ్బంది లేని పరి శ్రమలు వచ్చేలా కృషి చేయాలి. భారీ పరిశ్రమలకు ఇస్తున్న రాయితీల్లో సగం ఇచ్చినా ఈ పరిశ్రమలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి. ఖనిజ వనరులు అధికంగా ఉన్నచోట పరిశ్రమలు స్థాపించాలి. వికారా బాద్ లాంటి చోట్ల నాపరాయి పరిశ్రమలు, ఇనుప ఖనిజం లభించే మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాంతంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. ఇందుకు అనుగుణంగా పారిశ్రామిక విధానం రూపొం దించాలి. అప్పుడే తెలంగాణ ప్రజలకు నిజమైన అభి వృద్ధి ఫలాలు అందుతాయి. (‘మహాజన పాదయాత్ర’లో భద్రాచలం నుంచి) వ్యాసకర్త సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం -
పుట్టకొకరు గుట్టకొకరు వెళ్లాల్సిందేనా?
కడ్తాల్: కాలుష్యకారక ఫార్మాసిటీ ఏర్పాటుకు వేలకొద్దీ ఎకరాల భూములు అవసరమా అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని ఎస్ఎల్ఆర్ గార్డెన్లో గురువారం నిర్వహించిన ‘ఫార్మాసిటీ భూనిర్వాసితుల ఘోస’లో ఆయన పాల్గొని మాట్లాడారు. నిబంధనల ప్రకారం భూసేకరణ జరగడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో కంటే పార్లమెంటు చట్టం ఉన్నతమైనదని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల అంగీకారంతోనే భూములు సేకరించాలని సూచించారు. ప్రస్తుత మార్కెట్ ధరకు మూడు రెట్లు నష్టపరిహారం చెల్లించాలని, చట్టాన్ని అతిక్రమించి ఇష్టానుసారంగా భూ సేకరణ చేపట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే ఫార్మాకు బదులు వేరే ఇతర కంపెనీలను నెలకొల్పి అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఫార్మాసిటీలాంటి విషం వెదజల్లె కంపెనీలతో ఇక్కడి ప్రజల బతుకులు ఏం కావాలని ప్రశ్నించారు. పుట్టకొకరు గుట్టకొకరు వెళ్లాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. రైతులారా నిర్ణయం మీది, భవిష్యత్తు మీది, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. మీ హక్కులను కాపాడుకోండి అని రైతులకు పిలుపునిచ్చారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో భవిష్యత్తు తరాలకు మిగిలేది విషమేనని, పచ్చని పంట పొలాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి అన్నారు. కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జేఏసీ ఛైర్మన్ చల్మారెడ్డి, హైకోర్టు న్యాయవాది అర్జున్, టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, కల్వకుర్తి జేఏసీ చైర్మన్ సదానందంగౌడ్ పాల్గొన్నారు. -
మారిన రీజినల్ రింగ్ రోడ్డు
ఫార్మాకు దక్షిణం వైపు రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చేందుకు సర్కారు కసరత్తు భవిష్యత్తు అవసరాల కోసం తప్పదన్న కన్సల్టెన్సీ నేడు జరిగే సమావేశంలో తుది నిర్ణయం రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) దిశ మార్చుకుంటోంది. ఔషధనగరి (ఫార్మాసిటీ) సమీపంలో ఈ రోడ్డు అలైన్మెంట్ మారుతోంది. ప్రతిష్టాత్మక ఫార్మాసిటీకి దక్షిణం వైపు నుంచి ఈ మార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆవల నుంచి ప్రాంతీయ బాహ్య వలయ దారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిపై వాహనాల భారం తగ్గించే లా 338 కిలోమీటర్ల మేర ఈ రహదారిని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా నిర్మాణ వ్యయాన్ని భరించేం దుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కింద ఈ రోడ్డును చేపట్టేలా ఖరారు చేయాలని, సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావించింది. అయితే, ఆదిలోనే హంసపాదులా ఫార్మాసిటీ రూపంలో ఈ రోడ్డుకు అడ్డంకి వచ్చింది. కందుకూరు, యాచారం, కడ్తాల మండలాల పరిధిలో దాదాపు 19వేల ఎకరాల విస్తీర్ణంలో ఔషధన గరిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగా ఇప్పటికే దాదాపు ఏడు వేల ఎకరాల భూమిని కూడా సేకరించింది. ఈ ఏడాది చివరినాటికి ప్రాజెక్టుకు భూమి పూజ కూడా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం–సాగర్ హైవేల మధ్య 11 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తోంది. రింగ్‌రోడ్డుతో భారీ నష్టం! అత్యున్నతస్థాయి ప్రమాణాలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్దదిగా ఆభివర్ణిస్తున్న ఫార్మాసిటీకి రీజిన ల్ రింగ్‌రోడ్డుతో నష్టం వాటిల్లనుందని ఈ ప్రాజెక్టుకు మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్న ‘సురబాన జ్యూరంగ్’ కన్సల్టెన్సీ తేల్చిచెప్పింది. ఔషధనగరికి ఉత్తరం వైపు నుంచి రింగ్‌రోడ్డును ప్రతిపాదిస్తూ హెచ్ఎం డీఏ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచింది. ఈ ప్రతిపాదిత రహదారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, వీటిని అధిగమించేందుకు దక్షిణ దిశలో రీజినల్ రింగ్‌రోడ్డును నిర్మించ డం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తద్వారా ఔషధనగరికి ఇబ్బంది కలుగకుండా.. సాధారణ ప్రయాణికులు ఆవస్థల పాలుగాకుండా నివారించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వాని కి ఇటీవల నివేదిక ఇచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం షాద్‌నగర్ మీదుగా కందుకూరు మండలం కొత్తూ రు నుంచి మంచాల మండలం ఆగాపల్లి మీదుగా సాగుతుంది. ప్రతిపాదనలు పరిశీలిస్తే.. కడ్తాల సమీపం గుండా ఈ రహదారిని నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నేడు కీలక సమావేశం రీజినల్ రింగ్‌రోడ్డు రీఅలైన్మెంట్పై బుధవారం సచివాలయంలో అత్యున్నతస్థాయి సమావేశంలో జరుగుతోంది. ఈ సమావేశంలో ఫార్మాసిటీ సమీపంలో ఈ రహదారి అలైన్మెంట్ మార్పుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆర్అండ్బీ, పరిశ్రమలు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శులు, హెచ్ఎండీఏ కమిషనర్, ఎన్హెచ్ఐఏ ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాల్గొనున్నారు. -
రూ.8 వేల కోట్లతో ఫార్మాసిటీ
-
రూ.8 వేల కోట్లతో ఫార్మాసిటీ
• రంగారెడ్డిలో 12,500 ఎకరాలు సేకరించాలని పరిశ్రమల శాఖ ఆదేశం • తొలి దశలో 5 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయం • అంతర్గత మౌలిక సదుపాయాలకు రూ.1,600 కోట్ల ఖర్చు సాక్షి, హైదరాబాద్: దేశంలో మరెక్కడా లేనివిధంగా పెద్ద ఎత్తున ఫార్మా సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దాదాపు రూ.8 వేల కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థారుులో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ లిమిటెడ్’ పేరిట జాతీయ పెట్టుబడుల ఉత్పత్తుల కేంద్రం(నిమ్జ్)ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 12,500 ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో టీఎస్ఐఐసీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఫార్మా సిటీ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించే బాధ్యతను సింగపూర్ సంస్థకు అప్పగించారు. ఇటీవల పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరా మారావుకు సింగపూర్ సంస్థ ప్రెజెంటేషన్ రూపంలో ప్రాథమిక నివేదిక కూడా అందజేసింది. ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం రూ.1,600 కోట్లు(20 శాతం) ఖర్చు చేయాలని తన నివేదికలో ప్రతిపాదించింది. ఫార్మా సిటీ ఏర్పాటు ద్వారా దాదాపు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అట్లాగే ప్రత్యక్షంగా 1.3 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 3.25 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తోంది. మరోవైపు ఫార్మాసిటీ మాస్టర్ ప్లానింగ్ డిజైన్ కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. తొలి దశలో 5 వేల ఎకరాల సేకరణ తొలి దశలో 5 వేల ఎకరాలను సేకరించాలని, 2017 మార్చి నాటికి ఫార్మా కంపెనీలకు భూమిని కేటారుుంచాలని పరిశ్రమల శాఖ ప్రణాళిక రూపొందించింది. మొదటి దశలో హడ్కోనుంచి రూ.550 కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణరుుంచింది. ఫార్మాసిటీలో ఫార్మా యూనివర్సిటీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ, ఇంక్యూబేషన్ సెంటర్‌ను నెలకొల్పాలని ఆ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఫార్మా సిటీలో కంపెనీలు నెలకొల్పేందుకు 200 సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఫార్మాసిటీకి సంబంధించి పూర్తి వివరాలను నాలుగైదు రోజుల్లో పరిశ్రమల మంత్రి కేటీఆర్ వెల్లడించనున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొన్నారుు. -
‘ఫార్మాసిటీ భూసేకరణను అడ్డుకోవద్దు’
కడ్తాల్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం జరుగుతున్న భూసేకరణ సర్వేకు రైతులు సహకరించాలని, మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ సూచించారు. కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి, గానుగుమార్ల తండా, పోచమ్మగడ్డ తండా, పుల్లేరుబోడ్, జమ్ములాబావి తండా రైతులు భూసేకరణ సర్వేను అడ్డుకోవడంతో గురువారం వారితో జేసీ మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసైన్డ్, ప్రభుత్వ భూములను అమ్ముకునే హక్కు రైతులకు లేదని, అయితే రైతుల అంగీకారం లేకుండా ఆ భూములను తీసుకోబోమని స్పష్టం చేశారు. పట్టా భూముల జోలికి తాము వెళ్లడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం భూముల ధర నిర్ణయించిన తర్వాత మాత్రమే భూసేకరణ సర్వే జరుపాలని డిమాండ్ చేశారు. -
నేటి నుంచి కేటీఆర్ అమెరికా పర్యటన
హైదరాబాద్ : ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారక రామారావు నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. వారం రోజుల పాటు వాషింగ్టన్, న్యూజెర్సీ, న్యూయార్క్, సిలికాన్ వ్యాలీ, మిన్నెసోట, చికాగోలో పర్యటిస్తారు. సిలికాన్ వ్యాలీలో టి.బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీకి సంబంధించి అమెరికా ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. -
అవకతవకలు నిజమే!
ఫార్మాసిటీ భూసేకరణలో పొరపాట్లు అర్హులుగా మారిన అనర్హులు నిర్ధారించిన విచారణ అధికారి కలెక్టర్‌కు నివేదిక అందజేత..! ముచ్చర్ల సర్వే నంబర్ 288 (1ఎం)లో వాస్తవ ప్రకారం ఉండాల్సిన 5.33 ఎకరాల భూమికి 1982-83లో అదనంగా రెండు ఎకరాలు పెంచి సదరు పట్టాదారు విక్రరుుంచి నట్లు నిర్ధారించారు. దీంతో కబ్జాలోలేని అనర్హులకు పరిహారం అందిందని, అర్హుడైన రైతు నాగయ్యకు పరిహారం ఇవ్వాలని విచారణాధికారి నివేదిక ఇచ్చారు. సర్వే నంబర్ 288(16)లో తమ్ముడు వద్ద సాదా కాగితంపై కొనుగోలు చేసిన వారికి అన్న భూమిలోని సర్వే నంబర్ 288(11)లో నుంచి 5 ఎకరాలకు పరిహారం అందినట్లు నిర్ధారించారు. సదరు రూ.62.50 లక్షలు పరిహారం పొందిన వారి రికార్డులపై విచారణాధికారి అనుమానాలు వ్యక్తం చేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా/ కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ భూసేకరణలో అవకతవకలు చోటుచేసుకున్నారుు. క్షేత్రస్థారుులో భూమి లేనప్పటికీ.. పరిహార జాబితాలో పెద్ద సంఖ్యలో అనర్హుల పేర్లు వచ్చారుు. ఈ అంశంపై వాస్తవ పట్టాదారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో కలెక్టర్ రఘునందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన ఆయన.. ఫిర్యాదుపై నిజనిర్ధారణకు ప్రత్యేకంగా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్‌ను విచారణాధికారిగా నియమించారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన పీఓ ఆర్వీఎం.. ఫార్మాసిటీ కోసం జరిగిన భూసేకరణకు సంబంధించి పట్టాదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా పొజిషన్లో ఉన్న పట్టాదారులు, రికార్డుల్లో ఉన్న వారి పేర్లను పరిశీలించి అర్హుల జాబితాపై స్పష్టత ఇచ్చారు. ఈమేరకు నివేదిక రూపొందించి కలెక్టర్‌కు అందజేశారు. భూసేకరణకు సంబంధించిన జాబితాలో పేర్లు తారుమారైనట్లు విచారణాధికారి నిర్ధారించినట్లు తెలిసింది. కలెక్టర్‌కు సమర్పించిన నివేదికలో పూర్తిస్థారుు వివరాల్ని పేర్కొన్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నివేదిక సారాంశమిది.. సర్వే నంబర్ 288(1టీ)లో వాస్తవంగా 5 ఎకరాలు ఉండాల్సి ఉండగా 2004-05లో 4.20 ఎకరాలను పహణీల్లో పెంచి చూపారు. అధికారులు అవార్డు జారీచేయగా రైతుల ఫిర్యాదు మేరకు వారికి పరిహారం నిలిపివేశారు. వాస్తవంగా పొజిషన్లో భూమి లేనట్లు తేలింది. సర్వే నంబర్ 288(1జే)లో అసలు రైతుకు రూ.4.20 ఎకరాలు ఉంది. కాగా 288(1పీ)లో రికార్డులో లేని భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులకు 1జేలోని భూమిపై పరిహారం ఇచ్చేలా ప్రొసీడింగ్ ఇచ్చారు. దీంతో తనకు పరిహారం అందకుండా వేరే వారికి అందనుండటంతో సదరు రైతు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం పరిహారం నిలిచిపోరుుంది. సర్వే నంబర్ 288(4)లో 5 ఎకరాల అసైన్డ భూమి కొన్న వారు కబ్జాలో ఉండగా వారికి కబ్జాదారుల కింద కాకుండా అసైన్డ కిందనే పరిహారం అందినట్లు అదనంగా చెల్లించిన మొత్తం రికవరీ చేయాలంటూ నిర్ధారించారు. సర్వే నంబర్ 288లో ఎకరం 14 గుంటలపై కబ్జాలో ఉన్నా తనకు పరిహారం అందలేదని సదరు రైతు రాములమ్మ చేసిన పిర్యాదుపై విచారణ జరిపిన అనంతరం ఆమె 30 గుంటల్లో సాగు చేసుకుంటుందని, అంత మేర పరిహారం ఇవ్వొచ్చని తేల్చారు. -
ఫార్మాసిటీలో ప్రపంచ స్థాయి సీఈటీపీలు
వాటి నిర్మాణ కంపెనీలతో భేటీలో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీలో ఏర్పాటు చేయనున్న కాలుష్య శుద్ధీకరణ ప్లాంట్లను (సీ ఈటీపీ) అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఫార్మాసిటీతోపాటు రాష్ట్రంలోని ఇతర పారి శ్రామికవాడల్లో సీఈటీపీల నిర్మాణాలకు ఉన్న అవకాశాలపై ఈ రంగంలో అనుభవంగల కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఫార్మాసిటీలో నిర్మించే సీఈటీపీల ద్వారా కాలుష్య వ్యర్థాలను జీరో డిశ్చార్జి స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. చైనా, సింగపూర్, మలేసియాలోని పలు ఫార్మా కంపెనీల్లో ఏర్పాటు చేసిన కాలుష్య శుద్ధీకరణ ప్లాంట్లను ప్రభుత్వం పరిశీలించిందని.. అదే తరహాలో రాష్ట్రంలో ఫార్మాసిటీతోపాటు వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న టెక్స్టైల్ పార్కులో అత్యాధునిక సీఈ టీపీలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుత పారిశ్రామిక పార్కులు కొత్తగా ఏర్పాటయ్యే పారిశ్రామికవాడల్లోనూ జీరో డిశ్చార్జి లక్ష్యంగా కాలుష్య శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేస్తా మన్నారు. ప్రభుత్వంపై తక్కువ ఆర్థిక భారం పడే నమూనాలకు ప్రాధాన్యం ఇస్తామని కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్ స్పష్టం చేశారు. ఔటర్ రింగురోడ్డు వెలుపలకు తరలించే పారిశ్రామికవాడల్లోనూ సీఈటీపీల నిర్మాణాలకు అవకాశం ఉందన్నారు. సమావేశానికి జీఈ, సెంబ్ కార్ప్, తాహాల్ వంటి పలు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఎపిట్రీ డైరక్టర్ జనరల్ కల్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
'ఫార్మాసిటీకి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు'
హైదరాబాద్: నగర శివార్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ...జీరో డిశ్చార్జ్ కాలుష్యంతో ఫార్మాసిటీ నిర్మిస్తున్నామన్నారు. త్వరలో పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. -
ఔషధనగరికి రాచమార్గం
ఫార్మాసిటీ కోసం నాలుగులేన్ల రోడ్డు నిర్మాణం ఔషధనగరికి కార్యరూపం ఇచ్చేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఔషధ దిగ్గజ కంపెనీలకు ఎర్రతివాచీ పరిచేందుకు నాలుగు వరుసల రహదారులను అభివృద్ధి చేస్తోంది. ఫార్మా సంస్థలన్నింటినీ ఇక్కడకు తరలించాలనే కృతనిశ్చయంతో ఉన్న సర్కారు.. కందుకూరు మండలం ముచ్చర్ల ఫార్మాసిటీని కలుపుతూ రహదారులను అనుసంధానం చేస్తోంది. ఒకవైపు శ్రీశైలం జాతీయ రహదారి నుంచి నాగార్జున సాగర్ హైవే, ఔటర్‌రింగ్‌రోడ్డును కలుపుతూ మరో మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ఏడాది ఆఖరులోగా మోడల్ఫార్మాసిటీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో రోడ్లు భవనాలశాఖ రోడ్డు సర్వే పనులను యుద్ధప్రాతిపదికన చేస్తోంది. మొదటి విడతలో శ్రీశైలం రహదారి నుంచి మీర్కాన్‌పేట పరిధిలోని పెద్దమ్మ దేవాలయం వరకు నాలుగు వరుసల రహదారికి మార్గం సుగమం చేస్తోంది. - కందుకూరు 8.32 కి.మీలు ⇒ తొలిదశలో 150 అడుగుల వెడల్పుతో 8.32 కిలోమీటర్ల మేర కందుకూరు నుంచి మీర్ఖాన్పేట వరకు నాలుగులేన్ల రోడ్డు నిర్మిస్తారు. 15 వేల ఎకరాలు ⇒ మొత్తం ఫార్మాసిటీకి సేకరించాల్సిన భూమి ఇది. అయితే తొలి దశలో మాత్రం ఆరు వేల ఎకరాల్లో ఔషధనగరిని నిర్మించాలని సర్కారు భావిస్తోంది. 65 ఎకరాలు ⇒ మోడల్ ఫార్మాసిటీ నిర్మించే ప్రాంతం. ఫార్మాసిటీ అంటే ఇలా ఉంటుందని, మరిన్ని కంపెనీలను ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేస్తోంది. రూ.75 కోట్లు ⇒ భూసేకరణ, రహదారి నిర్మాణానికి టీఎస్ఐఐసీ రూ.75 కోట్లను కేటాయించింది. -
కాలుష్యం లేకుండా ఫార్మాసిటీ నిర్మిస్తాం
-
ముచ్చర్లలో ‘మోడల్ ఫార్మాసిటీ’
ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రత్యేకతలను చాటేలా సకల హంగులతో ‘మోడల్ ఫార్మాసిటీ’ని నిర్మించి.. పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 65 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ మోడల్ ఫార్మాసిటీలో ఫార్మా పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఆధునిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. రోడ్లు, విద్యుత్ తదితర మౌళిక సౌకర్యాలతో పాటు.. కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక ‘జీరో డిశ్చార్జి కాలుష్య శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా ఏర్పాటవుతున్న ఫార్మాసిటీకి.. జాతీయ పెట్టుబడులు, ప్రోత్సాహక మండలి (నిమ్జ్) హోదా దక్కేందుకు కనీసం 12,500 పైగా ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 3వేల ఎకరాల మేర భూ సేకరణ పూర్తయింది. కనీసం 6వేల ఎకరాల్లో 2018 మధ్యకాలానికి ‘ఫార్మాసిటీ’ మొదటి దశ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పనుల కోసం ప్రత్యేక సంస్థ.. ఫార్మాసిటీ పనులను శరవేగంగా జరిగేలా ప్రత్యేక అధికారి నేతృత్వంలో ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరంతో ఫార్మాసిటీని అనుసంధానం చేసేందుకు ఆరు వరుసల రహదారి నిర్మించాలని ప్రతిపాదించారు. కాగా, ప్రాజెక్టు అభివృద్ధి పనుల నమూనాలకు బిడ్ల ఖరారు, ఒప్పందాలు తదితర ప్రక్రియలు పురోగతిలో ఉన్నాయి. -
యాచారంలో ఫార్మాసిటీ భూములపై అఖిలపక్ష భేటీ
యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ భూముల విషయంపై అఖిలపక్షసమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామమల్లేష్, జిల్లా సీపీఎం కార్యవర్గ సభ్యుడు జంగారెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఫార్మా సిటీ నిర్మాణంలో భూమి కోల్పోయే బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందించాలని, అస్సైన్డ్ భూముల్లో బోర్లు వేసిన వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఫార్మాసిటీలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. -
ఫార్మాసిటీకి రూ.1,500 కోట్లు ఇవ్వండి
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ విజ్ఞప్తి - వివిధ అంశాలపై వినతి - మరో ఇద్దరు కేంద్ర మంత్రులనూ కలసిన కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ నిర్మాణానికి రూ. 1,500 కోట్లు ఇవ్వాలని ఐటీ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసిన కేటీఆర్... ఈ మేరకు పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్మా సిటీ నిర్మాణంపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని...తొలి విడతగా రూ. 200 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారన్నారు. ఎస్ఈజడ్లకు సంబంధించి వైజాగ్ కేంద్రంగా ఏపీ, తెలంగాణకు ఒక్క కమిషనర్ మాత్రమే ఉన్నారని, తెలంగాణ కు హైదరాబాద్ కే ంద్రంగా ప్రత్యేక కమిషనర్ ఉండేలా చూడాలని కోరినట్టు తెలిపారు. ‘‘హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ట్రేడ్ సెంటర్‌కు కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరాం. విభజన అనంతరం ఏపీ, తెలంగాణకు ఇవ్వాల్సిన పన్ను రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాల విషయంలో పురోగతి లేదనే అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. తెలంగాణలో ఏర్పాటు చేయ తలపెట్టిన రెండు పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. దీనిపైనా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో లెదర్ పార్క్ ఏర్పాటు చేయాలని కూడా నిర్మలా సీతారామన్‌ను కోరాం. ఈ అంశాలపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు త్వరలోనే కేంద్రానికి పంపుతాం. తెలంగాణలో బయో ఫార్మాపై దృష్టిపెట్టాలని సూచించారు. కేం ద్రం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యటించే ట్రేడ్ ప్రమోషన్ ప్రతినిధి బృందంలో తెలంగాణ ప్రతినిధికి అవకాశం ఇవ్వాలని కోరాం’’ అని కేటీఆర్ వివరించారు. ‘హరితహారా’నికి విచ్చేయండి... కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సమావేశమైన మంత్రి కేటీఆర్...ఫార్మా సిటీకి అనుమతులివ్వాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే ఆదిలాబాద్‌లోని జిన్నారం, నిర్మల్ ప్రాంతాల్లో ఇనుప ఖనిజాలున్నాయని జాతీయ భూగర్భశాఖ చెబుతున్న నేపథ్యంలో వాటి తవ్వకాలకు పర్యావరణ అనుమతులివ్వాలని కేటీఆర్ కోరారు. దేశంలో 9 నగరాల్లో గాలి నాణ్యతను పరీక్షించే విధానాన్ని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కేటీఆర్‌కు వివరించగా హైదరాబాద్‌లోనూ వాయు నాణ్యతను తెలిపే డిజిటల్ బోర్డుల ఏర్పాటుకు అవసరమైన సాంకేతికతను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతేడాదిలాగానే హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలని జవదేకర్‌ను కోరగా అందుకు ఆయన సమ్మతించారు. జూలై 11న 25 లక్షల మొక్కలు నాటుతున్నట్లు కేటీఆర్ కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున చేపడుతున్న హరితహారాన్ని జవదేకర్ ప్రశంసించారు. జాతీయ డ్రగ్ కంట్రోల్ అకాడమీ కోసం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఫార్మా కంపెనీలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో నేషనల్ డ్రగ్ కంట్రోల్ అకాడమీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ లో కేటీఆర్ కోరారు. ఈ అకాడమీ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నడ్డా త్వరలో అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపుతానని హామీ ఇచ్చారని కేటీఆర్ మీడియాకు తెలి పారు. కేంద్ర మంత్రులను కలసిన ప్రతినిధి బృందం లో కేటీఆర్ వెంట ఎంపీ లు సీతారాంనాయక్, బీబీపాటిల్ ఉన్నారు. పరిశ్రమలు ‘ఔటర్’ వెలుపలికి.. కేంద్ర మంత్రులను కలవడానికి ముందు మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను రింగ్‌రోడ్డు బయటకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వాటిని ఒకేచోట కేంద్రీకరించకుండా వివిధ ప్రాంతాలకు తరలించాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతమున్న ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపల మరో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మించే ప్రతిపాదన ఉందని, ఇందుకు అవసరమైన స్థల సేకరణను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో చేపట్టనున్నట్టు వివరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ప్రతిపక్షాలు చెబుతున్న 2013 చట్టం ఆధారంగా పరిహారం చెల్లిస్తే రైతులు నష్టపోతారని పేర్కొన్నారు. -
లైన్ క్లియర్
ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా టీఎస్ఐఐసీ కన్సల్టెన్సీ సహకారంతో డీపీఆర్‌కు తుదిరూపు రాష్ట్రానికే తలమానికంగా ఫార్మాసిటీ రూపకల్పన ఫార్మాసిటీ కోసం ఇప్పటివరకు ప్రభుత్వం 4వేల ఎకరాల భూమిని సేకరించింది. ముచ్చర్ల, పంజాగూడ, మీర్ఖాన్పేట, కుర్మిద్దలో భూములకు పరిహారం కూడా చెల్లించింది. నానక్‌నగర్, తిప్పాయిగూడ తదితర గ్రామాల్లోనూ భూములను సమీకరించే పనిలో నిమగ్నమైంది. ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేసినందున.. ఇక ఫార్మా పనులు వేగం పుంజుకోనున్నాయి. ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనల మండలి (నిమ్జ్) హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర సర్కారు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఔషధనగరికి మార్గం సుగమమైంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో 12,500 ఎకరాల్లో ప్రతిపాదించిన ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ అంకురార్పణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా బల్క్‌డ్రగ్ ఉత్పత్తుల్లో మూడో వంతు మనరాష్ట్రంలో తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఔషధ రంగానికి చిరునామాగా మార్చాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ సర్కారు ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే కందుకూరు మండలం ముచ్చర్ల కేంద్రంగా ఔషధనగరి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఔషధ దిగ్గజ కంపెనీల అధినేతలను వెంటబెట్టుకొని తొలి పర్యటనను ఇక్కడే చేశారు. అదేరోజు ఫార్మాసిటీ స్థాపనపైనా ప్రకటన చేశారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదిం చిన ఫార్మాసిటీ ప్రాజెక్టుకు జిల్లాలో 10,628.36 ఎకరాలను సమీకరించడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనలమండలి (నిమ్జ్) హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర సర్కారు సూత్రప్రాయంగా అంగీకరించడం.. కనిష్టంగా 12,500 ఎకరాలుంటే గానీ ఈ హోదా వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టు విస్తీర్ణాన్ని పెంచింది. ఈ హోదాతో రాయితీలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం గ్రాంటు రూపేణా విరివిగా నిధులు విడుదలచేసే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఇరుజిల్లాల్లో కలిపి 15 వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. దీంట్లో ఇప్పటివరకు ప్రభుత్వం 4వేల ఎకరాల భూమిని సేకరించింది. ముచ్చర్ల, పంజాగూడ, మీర్ఖాన్పేట, కుర్మిద్దలో భూముల కు పరిహారం కూడా చెల్లించింది. అలాగే నానక్‌నగర్, తిప్పాయిగూడ తదితర గ్రామాల్లో కూడా భూములను సమీకరించే ప్రక్రియలో వేగం పెంచింది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా అమన్‌గల్ మండలంలోని భూ ములను ఆ జిల్లా యంత్రాంగం సమకూర్చుతోంది. కాగా, ప్రభుత్వం సమీకరిస్తున్న భూమిలో అత్యధికంగా అసైన్డ్, ప్రభుత్వ భూములే ఉన్నాయి. రాష్ట్రానికి సిరి.. ఔషధనగరి ఔషధ ఉత్పత్తుల్లో రాష్ట్రం ముందంజ లో ఉంది. బల్క్‌డ్రగ్ ఉత్పత్తులో మూడోవంతు తెలంగాణ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు జీవం పోసిన ప్రభుత్వం.. ఇక్కడ జీవశాస్త్ర, జీవ సాంకేతిక పరిజ్ఞానం, ఔషధ పరిశోధన, నూతన ఔషధాల ఆవిష్కరణలకు ఫార్మాసిటీని కేంద్రంగా మలచాలని యోచిస్తోంది. దీనికి ‘నిమ్జ్’ హోదాను ఇచ్చేందుకు అనుమతించడంతో పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరవాలని నిర్ణయించింది. ఔషధనగరి ఏర్పాటులో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీ ఇప్పటికే పలు ఔషధ తయారీ ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరిపింది. పలు కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నెలకొల్పే విధంగా ఒప్పించగలిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్న ప్రభుత్వం.. కాలుష్య ఉద్గారాలు రాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో శుద్ధియంత్రాలను ఏర్పాటు చేస్తోంది. దీనికి అనుగుణంగా నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు నేతృత్వంలోని అధికారుల బృందం ఐర్లాండ్, ఇంగ్లాండ్, జర్మనీ తదితర దేశాల్లో పర్యటించింది. ఈ మేరకు ఎస్టీపీల స్థాపనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ఫార్మాసిటీ ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించడానికి అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించింది. తాజాగా ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేసినందున.. ఫార్మా పనులు మరింత వేగంగా ముందుకు సాగేందుకు దోహదం చేయనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం
విశాఖపట్నం: విశాఖ జిల్లా కేంద్రంలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని శ్రీకర్ కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమ్మోనియం నైట్రేట్ ట్యాంక్ పేలి రామకృష్ణ(29) అనే వ్యక్తి మృతి చెందగా.. సుమారు 15 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. -
‘భూ’గ్రహణం!
♦ ఫార్మాసిటీ భూసమీకరణలో ఎడతెగని జాప్యం ♦ 10,628 ఎకరాలు సేకరించాలని నిర్ణయం ♦ ఇప్పటికి ఖరారు చేసిన భూమి 13 శాతమే ♦ {పతిష్టాత్మక ప్రాజెక్టుకు భూగండం ♦ దూకుడు తగ్గించిన జిల్లా యంత్రాంగం ఔషధన గరికి ‘భూ’గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు 10,628 ఎకరాలను సమీకరించాలని సర్కారు నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు 13శాతం భూములను మాత్రమే జిల్లా యంత్రాంగం సేకరించగలిగింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ♦ ఔషధనగరికి నిర్దేశించింది: 10,628.36 ఎకరాలు ♦ గుర్తించిన ప్రభుత్వ భూమి : 7,050 ♦ టీఎస్ఐఐసీకి బ దలాయింపు: 1349.30 ♦ అప్పగింతకు సిద్ధంగా ఉన్నది : 1488.16 ♦ ఇప్పటికి సర్వే పూర్తయినది : 740.30 ♦ ముచ్చర్లలో 855, మీర్ఖాన్ పేటలో 494 ఎకరాలను టీఎస్ఐఐసీకి అప్పగించారు. ♦ పంజాగూడ, మీర్ ఖాన్పేటలో దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించి భూ నిర్వాసితులతో సంప్రదింపులయ్యాయి. ♦ యాచారం మండలం కుర్మిద్ద రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునేందుకు అసైన్డ్‌దారులు, ఆక్రమణదారులతో చర్చల ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. నష్టపరిహారాన్నీ ఖరారు చేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో దాదాపు 15వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనల మండలి (నిమ్జ్)హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ హోదాతో రాయితీలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం గ్రాంటు రూపేణా విరివిగా నిధులు విడుదల చేసే అవకాశం ఉండడంతో భూసమీకరణను వేగిరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ప్రతిపాదిత విస్తీర్ణంలో కేవలం 13శాతం భూములను మాత్రమే జిల్లా యంత్రాంగం సేకరించింది. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఔషధ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. అనేక ఫార్మా కంపెనీలు బారులు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఫార్మాసిటీని అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఐఐసీ కృతనిశ్చయంతో ఉంది. కాగా రెవెన్యూ యంత్రాంగం భూసేకరణపై మునుపటి కంటే స్పీడు తగ్గించింది. ఏడాది క్రితం దూకుడు ప్రదర్శించిన అధికారులు.. ఇప్పుడు షరా మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు కేవలం 1,349.30 ఎకరాలను మాత్రమే సేకరించి.. టీఎస్ఐఐసీకి అప్పగించారు. కందుకూరు మండలం ముచ్చర్లలో 855 ఎకరాలు, మీర్ఖాన్ పేటలో 494.24 ఎకరాలను టీఎస్ఐఐసీకి బదలాయించారు. ఇక ఇదే మండలం పంజాగూడ, మీర్ ఖాన్పేటలో దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించి భూ నిర్వాసితులతో సంప్రదింపులు పూర్తి చేశారు. యాచారం మండలం కుర్మిద్ద రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునేందుకు అసైన్డ్‌దారులు, ఆక్రమణదారులతో చర్చల ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. నష్టపరిహారాన్ని కూడా ఖరారు చేశారు. తద్వారా 1,073 ఎకరాలను సేకరించేందుకు లైన్‌క్లియర్ చేశారు. అయితే, భూములు కోల్పోయేవారి జాబితా తయారీలో స్థానిక రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భూముల స్వాధీనం ఆలస్యమవుతోంది. ఇదే పరిస్థితి పంజాగూడ, మీర్‌ఖాన్‌పేటలోనూ ఎదురవుతోంది. ఇక తాడిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లిలో ప్రభుత్వ భూములను జిల్లా యంత్రాంగం గుర్తించింది. కాగా, భూ సమీకరణ ఆలస్యం కావడానికి టీఎస్ఐఐసీ వ్యవ హరిస్తున్న తీరే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫార్మాసిటీ స్థాపన, పరిహారం ఇచ్చేది టీఎస్ఐఐసీ కావడంతో ఆ సంస్థ ఇచ్చే ప్రతిపాదనలకు అనుగుణంగా మందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, తద్వారా భూ సమీకరణలో జాప్యం జరుగుతుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. -
పరిశ్రమల హబ్ గా ‘పట్నం’
⇔ దేశం చూపంతా జిల్లా వైపే ⇔ రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ⇔ ఫార్మాసిటీ బాధితులకు పరిహారం పంపిణీ ⇔ డబ్బు వృథా చేసుకోవద్దు : ఎమ్మెల్యే మంచిరెడ్డి యాచారం : దేశం గర్వించ తగిన పరిశ్రమల ఏర్పాటుతో జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిశ్రమల హబ్‌గా మారనుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ముచ్చర్ల ఫార్మాసిటీ భూ బాధితులకు శనివారం కుర్మిద్ద గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సర్పంచ్ విజయనాయక్‌తో కలిసి పరిహార చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటికే టీసీఎస్‌తో పాటు పలు పరిశ్రమల ఏర్పాటయ్యాయని, తాజాగా ఫార్మాసిటీతో నియోజకవర్గం జిల్లాలకే తలమానికం కానుందన్నారు. ప్రతి పల్లెకూ ఆర్టీసీ బస్సు, బీటీ రోడ్డే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మిషన్ భగీరథ కింద వచ్చే నెలలో మేడ్చల్ నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన పేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికీ 1000 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రూ. 368 కోట్ల నిధులతో రెండో విడత మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటలను మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. డబ్బులను వృథా చేసుకోవద్దు.. ఎమ్మెల్యే ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని వృథా చేసుకోవద్దని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి మహేందర్‌రెడ్డి చూపుతున్న అభిమానం మరువలేనిదని అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే, మంత్రితో కలిసి నస్దిక్‌సింగారం, కుర్మిద్ద గ్రామాల్లో రెండు చెరువుల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. రూ. కోటిన్నర నిధులతో కుర్మిద్ద- కుర్మిద్ద తండా వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ. 50 లక్షలకు పైగా నిధులతో నంది వనపర్తి - యాచారం బీటీ రోడ్డును ప్రారంభించారు. నస్దిక్‌సింగారంలో ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రారంభించారు. గాండ్లగూడెంలో నూతనంగా నిర్మించిన మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్విహ ంచారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్, ఎంపీపీ జ్యోతి, వైస్ ఎంపీపీ రామకృష్ణ, ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ పద్మనాభరావు, ఎంపీడీఓ ఉష, ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు నేనవత్ విజయనాయక్, అచ్చెన మల్లికార్జున్, మారోజ్ కళమ్మ, వన్నెవాడ అరుణమ్మ, రాజునాయక్, సత్య పాల్, ఎంపీటీసీ సభ్యులు గుర్రాల భాగ్యమ్మ, గడల మాధవి, టీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్‌రెడ్డి, సత్తు వెంకటరమణరెడ్డి, ముత్యాల మధుసూదన్‌రెడ్డి, కిషన్‌నాయక్, పాండురంగారెడ్డి తది తరులు పాల్గొన్నారు. -
18 నుంచి 30 వరకు విదేశాలకు కలెక్టర్
♦ జర్మనీ, ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ల లో పర్యటన ♦ ఆయా దేశాల్లో ఫార్మాసిటీల సందర్శన ♦ కాలుష్య శుద్ధి పద్ధతులపై అవగాహన సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు విదేశాలకు వెళ్తున్నారు. అమెరికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, జర్మనీ దేశాల్లోని ఔషధనగరాల్లో అమలు చేస్తున్న కాలుష్య శుద్ధి యంత్రాల తీరును అధ్యయనం చేసేందుకు ఈ నెల 18 నుంచి 30వ తేదీవరకు ఆయా దేశాల్లో పర్యటించనున్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ నేతృత్వం వహించే ప్రతినిధి బృందంలో మన జిల్లా కలెక్టర్ సహా.. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి శాంతికుమారి కూడా ఉన్నారు. కందుకూరు మండలం ముచ్చర్లలో దాదాపు 13వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఔషధనగరిలో కాలుష్య ఉద్గారాలను నియంత్రించేందుకు ప్రపంచస్థాయిలో మెరుగైన పద్ధతులను ప్రవేశపెట్టాలని సంకల్పించింది. ఈ క్రమంలో విదేశాల్లో కాలుష్య కారకాలను శుద్ధికి అవలంభిస్తున్న విధానాల పరిశీలనకు అధికారుల బృందాన్ని పంపిస్తోంది. కాగా, రఘునందన్‌రావు విదేశీ పర్యటనకు వెలుతున్నందున... ఆయన స్థానే జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్‌షైనీ ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఇదిలా ఉండగా, 18వ తేదీ అమెరికాతో జరిగే పర్యటనకు వెళ్లకుండా నేరుగా ఇంగ్లాండ్, జర్మనీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. -
దునియా మొత్తం ఇటే చూస్తోంది
► పరిశ్రమలకు అనువైన వాతావరణముందని ప్రధానే అన్నారు: సీఎం కేసీఆర్ ► సాధారణమైన గుర్తింపు కాదు... దీన్ని నిలబెట్టుకుందాం ► హైదరాబాద్‌లో పెట్టుబడులకు పలు దేశాల ఆసక్తి ► మౌలిక వసతులు, ఐటీ విస్తరణపై ప్రత్యేక దృష్టి ► విధానాలు, ప్రణాళికలు పక్కాగా ఉండాలన్న సీఎం ► ఏప్రిల్ 4న ఐసీటీ పాలసీ ఆవిష్కరణ: కేటీఆర్ ట్వీట్ సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ వైపు, ముఖ్యంగా హైదరాబాద్ వైపు చూస్తున్నాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం సృష్టించిందని ప్రధానిస్థాయివారు కూడా పేర్కొనడం సాధారణ విషయం కాదన్నారు. ‘‘ఇలాంటి గుర్తింపు సాధారణ విషయం కాదు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, పెట్టుబడులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, కార్యాచరణ ఉండాలి’’ అని అధికారులను ఆదేశించారు. ఫార్మా సిటీ, ఐటీ, టెక్స్టైల్స్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తదితరాలపై గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష జరిపారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సహకారాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో ఫార్మా సిటీ ఏర్పాటుపై ప్రపంచమంతటా ఆసక్తి ఉందన్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు హైదరాబాదే అనువైన ప్రాంతమని అందరూ గుర్తించారన్నారు. మానవాళికి ఔషధాల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా పరిశ్రమ మరింతగా విస్తరిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘‘దేశ విదేశాలకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు కూడా హైదరాబాద్‌లో ఫార్మా పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకొస్తున్నాయి. ఫార్మా సిటీలో భాగంగానే నివాస ప్రాంతాలు, కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్లుండాలి. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ప్లాంట్లు ఎలా పని చేస్తున్నాయో అధ్యయనం చేయండి. ఘన వ్యర్థాల నిర్వహణలో కొత్త ధోరణులనూ నిశితంగా పరిశీలించండి’’ అని అధికారులను ఆదేశించారు. ఐటీ విస్తరణపై ప్రత్యేక దృష్టి ఐటీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని అధికారులను సీఎం కోరారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాదే అనువైనవని అంతా గుర్తిస్తున్నారన్నారు. ‘‘ఇటీవలి పెను తుపాను కారణంగా చెన్నై నుంచి కొన్ని కంపెనీలు వెనుదిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌పై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేలా ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకోవాలి. పెట్టుబడుదారులను ప్రోత్సహించేందుకు అవసరమైన పూర్వ రంగాన్ని సిద్ధం చేయాలి’’ అని సూచించారు. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీకి వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, టీ-హబ్ కూడా మంచి ఫలితాలనిస్తున్నదని ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ బ్యాక్ ఆఫీసులను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. వరంగల్‌లో అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ రాబోతున్నది. దానితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. పరిశ్రమలు భారీగా బారులు తీరుతున్న నేపథ్యంలో తెలంగాణలోని ముఖ్య ప్రాంతాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ ఉండేలా ఏర్పాటు చేయండి. ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్లు రావాలో ప్రణాళికలు సిద్ధం చేయండి’’ అని అధికారులను ఆదేశించారు. మైక్రోమ్యాక్స్ కంపెనీ యాజమాన్యం పంపిన సందేశాన్ని ఐటీ మంత్రి కె.తారకరామారావు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ‘‘ఉత్తరాఖండ్‌లో ప్లాంట్ ప్రారంభించడానికి మాకు రెండున్నరేళ్లు పట్టింది. అలాంటిది, తెలంగాణలో కేవలం ఆరు నెలల్లోనే పరిశ్రమ స్థాపించి ఉత్పత్తి ప్రారంభించగలిగాం. తెలంగాణ ప్రభుత్వ సహకారం వల్లనే ఈ ఘనత సాధ్యమైంది’’ అని ఆ సందేశంలో కంపెనీ పేర్కొందన్నారు. ప్రభుత్వం తెచ్చిన సరళమైన పారదర్శక పారిశ్రామిక విధానం వల్ల తాము ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే పనులు చేసుకోగలిగామన్నారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఏప్రిల్ 4న ఐసీటీ పాలసీ: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఏప్రిల్ 4న ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుందని ఐటీ మంత్రి కె.తారకరామారావు గురువారం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తదితర ఐటీ రంగ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కొత్త విధానంలో ప్రధానంగా మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఎలక్ట్రానిక్ రంగ ఉత్పత్తుల్లో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో విధాన రూపకల్పన జరిగినట్టుసమాచారం. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ అత్యధికంగా ఉండటంతో విదేశాల నుంచి దిగుమతుల అవసరం పెరిగింది. అందుకే కేంద్రం కూడా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలకు రాయితీలు ప్రకటించింది. దాంతో ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. రెండో ప్రాధాన్యంగా యానిమేషన్, గేమింగ్‌లకు పెద్ద పీట వేయనుంది. ఈ సంస్థలకు, కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ కంపెనీలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు రాయితీలివ్వాలని నిర్ణయించింది. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి లభించటంతో పాటు ఐటీ పరిశ్రమను మరింత విస్తరించే లక్ష్యమూ నెరవేరుతుందని భావిస్తోంది. -
భూమాయ!
♦ ఫార్మా భూసేకరణలో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ♦ మీర్ఖాన్పేటలో రికార్డులు తారుమారు పహణీల్లో తప్పుడు నమోదులు.. ♦ అక్రమాలకు పాల్పడిన వీఆర్ఓలు సస్పెండ్ చేస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం ఔషధనగరి భూసేకరణలో రెవెన్యూ యంత్రాంగం హస్తలాఘవం ప్రదర్శించింది. తప్పుడు రికార్డులు సృష్టించడం ద్వారా పరిహారం కైంకర్యం చేసేందుకు ప్రయత్నించింది. కందుకూరు మండలం మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నం.112లో జరిగిన భూమాయపై విచారణ జరిపిన జిల్లా యంత్రాంగం.. ఇద్దరు ఇంటి దొంగలపై వేటు వేసింది. ఇదే అంశంపై గత నెల 26న ‘లెక్కతప్పింది’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన యంత్రాంగం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీకి వేలాది ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులోభాగంగా మీర్ఖాన్పేట సర్వే నం. 112లోని 613 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు భూముల సర్వే చేసిన అధికారులు లెక్క తేలిన విస్తీర్ణం చూసి బిత్తెరపోయారు. తొలుత 2008-09, 2012-15 పహణీల ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ లెక్క కాస్తా 691 ఎకరాలు తేలింది. వెలుగు చేసిన అక్రమాలపై మరింత లో తుగా దర్యాప్తు జరిపిన రెవెన్యూ యం త్రాంగం మొత్తం విస్తీర్ణం కంటే అదనంగా 343 ఎకరాలు ఉన్నట్లు గుర్తిం చింది. ఈ భూ బాగోతం వెనుక గ్రామ రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషిం చినట్లు నిర్ధారణ అయ్యింది. పహణీల్లో తప్పుడు నమోదు ద్వారా కొందరు నకిలీలు భూసేకరణ పరిహారాన్ని కాజేయాలని ఎత్తుగడ వేసినట్లు స్పష్టమైంది. వాస్తవ విస్తీర్ణకంటే ఎక్కువగా ఉన్నట్లు కొందరు తమ పేర్లను రికార్డుల్లో నమోదు చేయించుకున్నట్లు తేటతెల్లమైంది. అక్రమార్కులతో వీఆర్ఓల మిలాఖత్! ఇటీవల ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా గ్రామానికి వెళ్లిన రెవెన్యూ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికిగాకుండా... పహణీల్లో ఉన్న విస్తీర్ణానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ రావడంతో యం త్రాంగం విస్తుపోయింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ రికార్డులపై అనుమానం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ షైనీ 112 సర్వే నంబర్లోని మొత్తం పహణీలను నిశితంగా పరిశీలించాలని స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ మేరకు సర్వే ల్యాండ్ రికార్డ్స్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్‌ఓతో కలిసి మీర్ఖాన్పేట భూముల వ్యవహారంపై లోతుగా విచారించారు. దీంతో అక్రమాల డొంక బయటపడింది. 1989-90 నుంచి ఇప్పటివరకు ప్రతి రికార్డును పరిశీలించిన అధికారులు.. ఈ భూ బాగోతం వెనుక గతంలో పనిచేసినవీఆర్ఓల పాత్ర ఉన్నట్లు నిగ్గు తేల్చారు. ఎలాంటి రుజువులు, సాక్ష్యాలు లేకుండానే పహ ణీ పట్టాకాలమ్లలో పేర్లను నమోదుచేసినట్లు గుర్తించారు. గతంలో ఇక్కడ వీఆర్ఓలుగా పనిచేసిన డి.లక్ష్మీ నర్సిములు, డి.రవీందర్, ఏ.రాములు (చనిపోయారు), పి.రాములు (రిటైర్డ్), జే.శ్రీనివాసులు, కె.నర్సింహ రెవెన్యూ రికార్డులను తారుమారు చే శారని, వీరిరువురిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌కు సిఫారసు చేశారు. ఈ మేరకు జేసీ-1 రజత్‌కుమార్ వీఆర్ఓలు శ్రీనివాసులు, నర్సింహ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. కుర్మిద్ద ‘ఫార్మా’ భూమి రీసర్వేకు ఆదేశం యాచారం : ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్న కుర్మిద్దలో గల సర్వే నంబరు 311లోని భూమిని రీ సర్వే చేయాలని జేసీ రజత్‌కుమార్ సైనీ ఆదేశించారు. ఈ సర్వే నంబరులో సాగుకు యోగ్యమైన భూమి తక్కువగా ఉండడం, పరిహారం కోసం పలువురు రైతులు నకిలీ పట్టాదారు, పాసు పుస్తకాలు సృష్టించి, అధిక విస్తీర్ణంలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి 311 సర్వే నం బరులో మొత్తం భూమి 375 ఎకరాలు ఉండగా ఇందులో 213 ఎకరాలు అసైన్డ్ చేయడం జరిగింది. ఈ భూమిలో దాదాపు 30 నుంచి 40 ఎకరాల వరకు సాగుకు యోగ్యంగా లేకపోవడంతో పలువురు దీనిని వదిలేసి వెళ్లారు. మిగతా 13 ఎకరాల్లో తండా, రెండెకరాల్లో రోడ్డు నిర్మాణం ఉంది. కందుకూరు, యాచా రం మండలాల సరిహద్దులో 124 ఎకరాల్లో గుట్ట ఉంది. అసైన్డ్ చేసిన భూమి కంటే ఎక్కువ భూమిలో పట్టాదారు, పాసుపుస్తకాలు, కబ్జాలో ఉన్నట్లు ఫిర్యాదు నేపథ్యంలో రీ సర్వేకు జేసీ ఆదేశించినట్లు తెలిసింది. ఈ సర్వే నంబరులోనే 2005-06లో, 2009-10లో 54 మంది నకిలీ సర్టిఫికెట్లు, పట్టాదారు, పా సుపుస్తకాల సృష్టించి, బ్యాంకుల్లో పంట రుణాలు పొందినట్లు వెలుగులోకి రావడంతో సంబంధిత వ్యక్తులపై కేసులు కూ డా నమోదు చేశారు. దీంతో సోమ, మం గళవారాల్లో డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో రీసర్వే చేయనున్నట్లు సమాచారం. -
ఫార్మాసిటీలో 1,700 కోట్ల పెట్టుబడి
యూనిట్ స్థాపనకు ముందుకొచ్చిన ఫెర్రింగ్ ఫార్మా ♦ సీఎం కేసీఆర్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ ♦ కాలుష్య రహిత ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్ హెడ్క్వార్టర్స్గాగల ప్రముఖ బహుళజాతి సంస్థ ఫెర్రింగ్ ఫార్మా తెలంగాణలో నూతన యూనిట్ స్థాపనకు ముందుకొచ్చింది. ప్రతిపాదిత ఫార్మాసిటీలో 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 670 కోట్లు) నుంచి 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,700 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధులు సోమవారం సీఎం కేసీఆర్‌ను కలసి తమ ప్రతిపాదనలను వివరించారు. 1.5 బిలియన్ యూరోల (సుమారు రూ. 11 వేల కోట్లు) వార్షిక టర్నోవర్‌గల తమకు అర్జెంటీనా, చైనా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, జర్మనీ, ఇజ్రాయెల్, మెక్సికో, స్కాట్లాండ్, స్విట్జర్లాండ్లలో తొమ్మిది ప్లాంట్లతోపాటు ఇతర దేశాల్లో మరో తొమ్మిది చోట్ల పరిశోధన, అభివృద్ధి యూనిట్లు ఉన్నట్లు వెల్లడించారు. భారత్‌లో ఇప్పటికే మహారాష్ట్రలో 2 ప్లాంట్లు ఏర్పాటు చేశామని...తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నామని కంపెనీ చైర్మన్ ఫ్రెడరిక్ పాల్సన్, సంస్థ భారత్ విభాగం చీఫ్ అశోక్ అలాటే సీఎంకు వివరించారు. తమ యూని ట్ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతామని, విషపూరిత రసాయనాలు వాడకుండా సురక్షిత ఔషధాలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ లో మూడింట ఒక వంతు హైదరాబాద్ పరిసరాల్లోని ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నవేనన్నారు. దీనివల్ల ప్రబలుతున్న కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసమే ఫార్మా పరిశ్రమల యూనిట్లను ఒకే చోటకు తెచ్చి హైదరాబాద్ శివారులోని ముచ్చర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఔషధాల ఉత్పత్తిలో అమెరికాతోపాటు స్కాండినేవియా (డెన్మార్క్, నార్వే, స్వీడెన్) తదితర దేశాలు పాటిస్తున్న జాగ్రత్తల్ని అధ్యయనం చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఫార్మాసిటీకి అనుబంధం గా ప్రత్యేక టౌన్షిప్, కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా ఫార్మా వర్సిటీని కూడా స్థాపిస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటివరకు 82 కంపెనీలకు అనుమతి ఇచ్చినట్లు చెబుతూ టీఎస్ ఐపాస్ విధాన ప్రతిని సంస్థ ప్రతినిధులకు అందజేశారు. ఈ భేటీలో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
ఫార్మా సిటీపై అధ్యయనం
సమగ్ర నివేదిక తయారీకి సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫార్మా సిటీ ఏర్పాటుకు సమగ్ర నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దాదాపు 12 వేల ఎకరాల్లో ఫార్మా పరిశ్రమలతో పాటు ఫార్మా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పరిశ్రమల వల్ల కాలుష్య సమస్యలు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యర్థాల ట్రీట్మెంట్ సరిగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉండే అమెరికా, జపాన్, యూరప్ దేశాలలో పర్యటించి అక్కడ వ్యర్థాల సమగ్ర నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలన్న సీఎం, సీఎంవో అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఆయా దేశాలకు పంపాలని శుక్రవారం నిర్ణయించారు. ‘‘హైదరాబాద్‌లో నెలకొల్పే ఫార్మా సిటీపై జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. కాబట్టి ఫార్మా సిటీ నూటికి నూరు శాతం ప్రమాదరహితంగా, వ్యర్థాలు బయటికి వచ్చే వీలు లేకుండా ఉండాల్సిన అవసరముంది. గతంలో నగరంలో నెలకొల్పిన ఫార్మా కంపెనీలతో కొన్ని ప్రాంతాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ఆ పరిస్థితి పునరావృతం కావద్దు’’ అని అధికారులకు ఆయన సూచించారు. ఏప్రిల్‌లో తొలి దశ! అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మా సిటీ తొలి దశ పనులను ఏప్రిల్‌లో ప్రారంభించాలని అధికారులకు సీఎం సంకేతాలిచ్చారు. ఆ దిశగా మాస్టర్ ప్లాన్‌తో పాటు పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ తయారీకి అంతర్జాతీయ కంపెనీల నుంచి టీఎస్ఐఐసీ ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. మొదటి దశలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ముచ్చర్లలో మొత్తం 12 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలోని 5,000 ఎకరాలకు గాను 3,000 ఎకరాలను ఇప్పటికే సేకరించారు. మార్చి నెలాఖరుకల్లా మిగతా రెండు వేల ఎకరాలు సేకరించాలని భావిస్తున్నారు. ఒక్కో పారిశ్రామికవేత్త కనీసం ఎకరం నుంచి గరిష్టంగా 150 ఎకరాలు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. తొలి దశ పనుల మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఫార్మా కంపెనీల యాజమాన్యాలు, అసోసియేషన్లు, ఆర్ అండ్ బీ, కాలుష్య నియంత్రణ బోర్డుతో పాటు మరికొన్ని విభాగాలు ఇందులో ఉన్నాయి. ప్రాజెక్టు రిపోర్టుతో పాటు స్థలాల కేటాయింపులు, పర్యావరణ అనుమతులు, లే అవుట్ల తయారీ తదితర అంశాలన్నీ టాస్క్‌ఫోర్స్ అధ్వర్యంలో జరుగుతాయి. -
నత్తనడకన ఫార్మా సిటీ భూ సేకరణ
మంత్రి జూపల్లి అసంతృప్తి టీఎస్ఐఐసీ ప్రాజెక్టులపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్థాపించ తలపెట్టిన ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుండటంపై వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ సేకరణ సహా ఇతర అన్ని అంశాలకూ ఎక్కువ కాలం పడుతోందని, దీనిని గాడిలో పెట్టాలని ఆదేశించారు. పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ద్వారా రాష్ట్రంలో చేపట్టిన వివిధ పారిశ్రామిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి పనులను జూపల్లి సోమవారం సమీక్షించారు. టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫార్మాసిటీకి తక్షణమే మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలన్నారు. ఫార్మాసిటీ కోసం రెవెన్యూ విభాగం ఇప్పటి వరకు టీఎస్ఐఐసీకి 800 ఎకరాలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. భూ సేకరణ సహా అన్ని అంశాలపై ఈ నెల 31న సమావేశం నిర్వహించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌ను మంత్రి ఫోన్లో ఆదేశించారు. ఫార్మాసిటీ స్థాపనకు సంబంధించిన అన్ని అంశాలపై వచ్చే మార్చిలోగా స్పష్టతకు రావాలని నిర్దేశించారు. నిమ్జ్ భూ సేకరణకు ప్రత్యేక యూనిట్ మెదక్ జిల్లాలో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపినందున భూ సేకరణ వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఇప్పటి వరకు 12,500 ఎకరాలు గుర్తించగా, వచ్చే జనవరిలోగా 3,500 ఎకరాలు సేకరిస్తామని టీఎస్ఐఐసీ అధికారులు చెప్పారు. భూ సేకరణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టీఎస్ఐఐసీకి ప్రభుత్వం అప్పగించిన భూముల స్థితిగతులపై ఒక అవగాహనకు వచ్చేందుకు ఎక్కువ మంది సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రస్తుత వీసీ, ఎండీ నర్సింహారెడ్డిపై పనిభారం ఎక్కువగా ఉన్నందున మరో రెండు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని మంత్రి సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, చైనా తరహాలో పారిశ్రామిక పార్కుల్లో సౌకర్యాలు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. బుగ్గపాడు ఫుడ్ పార్కు పనులను వేగవంతం చేయాలని.. భూ సేకరణ వ్యయాన్ని తగ్గించేందుకు అవసరమైతే ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో భూములు గుర్తించాలని సూచించారు. జనవరిలో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలోని పారిశ్రామిక పార్కులు, ఎస్‌ఈజడ్‌లను సందర్శించడంతో పాటు.. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దశల వారీగా పర్యటిస్తానని జూపల్లి వెల్లడించారు. -
ఫార్మా సిటీకి తక్షణమే మాస్టర్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుండటంపై రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ సేకరణ సహా ఇతర అంశాల పరిష్కారానికి ఎక్కువ కాలం పడుతోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ద్వారా రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సమీక్షించారు. టీఎస్ఐఐసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫార్మాసిటీకి తక్షణమే మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయడంతోపాటు ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బిడ్‌లో ఉండాల్సిన అంశాలపై ముందస్తుగా కసరత్తు చేసి భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫార్మాసిటీ కోసం రెవెన్యూ విభాగం ఇప్పటివరకు టీఎస్ఐఐసీకి 800 ఎకరాలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఫార్మాసిటీ పనులు ఆరు నెలలు ఆలస్యంగా సాగుతున్నందున భూ సేకరణ సహా అన్ని అంశాలపై ఈ నెల 31న సమావేశం నిర్వహించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌ను మంత్రి జూపల్లి ఫోన్లో ఆదేశించారు. భూ సేకరణ సమస్యలను అధిగమించేందుకు తహశీల్దార్లు, ఆర్డీవోలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. -
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫార్మా సిటీ
► ఈ నెలాఖరులోగా టీఎస్ఐఐసీకి 3,500 ఎకరాల అప్పగింత ► శ్రీశైలం రహదారి, ఔటర్ రోడ్డుతో అనుసంధానం ► చైనా ఫార్మాసిటీ తరహాలో రూపురేఖలు, ప్రణాళిక ► ముచ్చర్ల ఫార్మాసిటీపై అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ గమ్యస్థానంగా మార్చేలా ఫార్మాసిటీకి రూపకల్పన చేయాలని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. నిర్దేశిత వ్యవధిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫార్మాసిటీ స్థాపనకు అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిందిగా ఆదేశించారు. చైనా ఫార్మాసిటీ తరహాలో ముచ్చర్ల ఫార్మాసిటీ రూపురేఖలు, ప్రణాళిక రూపొందించాల్సిందిగా సూచించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఏర్పాటుచేయ తలపెట్టిన ఫార్మాసిటీపై మంత్రి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డితో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఫార్మాసిటీకి 11 వేల ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ తీరుపై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వ అసైన్డ్ భూములతో పాటు గతంలో దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్(దిల్)కు కేటాయించిన 3,500 ఎకరాల భూమిని ఈ నెలాఖరులోగా టీఎస్ఐఐసీకి అప్పగిస్తామని, ఆ తర్వాత పట్టా, అటవీ భూముల సేకరణపై దృష్టి సారిస్తామని రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ చెప్పారు. భూసేకరణ పూర్తయితేనే ఫార్మాసిటీ ప్రతిపాదన వేగంగా పట్టాలెక్కుతుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. శ్రీశైలం జాతీయ రహదారితో ఫార్మాసిటీని అనుసంధానిస్తూ 200 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రోడ్లు, భవనాలు, టీఎస్ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డుతో ఫార్మాసిటీని అనుసంధానించేలా ప్రత్యామ్నాయ మార్గాల నిర్మాణంపైనా దృష్టి సారించాలన్నారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక(డీపీఆర్) అందజేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటర్ గ్రిడ్ ద్వారా ఫార్మాసిటీ నీటి అవసరాలు తీర్చేందుకు డీపీఆర్ రూపొందించాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులకు సూచించారు. -
ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరి మృతి
విశాఖపట్నం (పరవాడ) : పరవాడలోని ఫార్మాసిటీలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని సాయినాథ్ లైఫ్ సెన్సైస్‌లో రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో విశాఖపట్నం జిల్లా కసింకోటకు చెందిన శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన హేమంత్ అనే ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారికి దగ్గర్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫార్మాసిటీకి మాస్టర్ ప్లాన్ రూపొందించండి
* కన్సల్టెన్సీలకు ఆహ్వానం పలుకుతూ సర్కారు నోటిఫికేషన్ * ప్రాజెక్టు అమలు పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫార్మాసిటీకి సమీకృత అభివృద్ధి ప్రణాళిక (ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్) రూపొందించేందుకు కన్సల్టెన్సీలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన కన్సల్టెన్సీలు జూలై 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ ఐఐసీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతిపాదిత ఫార్మాసిటీలో జనావాసాలు, వర్క్స్టేషన్లు, కాలుష్య వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, ఇతర మౌలిక సౌకర్యాలు ఎలా ఉండాలనే అంశంపై అనుభవమున్న క న్సల్టెన్సీలతో మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’కి అవసరమైన 11వేల ఎకరాల భూమిని గుర్తించింది. మరోవైపు ఫార్మాసిటీలో అనుమతులు కోరుతూ ఇప్పటికే 350కుపైగా ఫార్మా పరిశ్రమల నుంచి దరఖాస్తులు అందినట్లు టీఎస్ ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. వీరికి అనుమతులు లభిస్తే సుమారు ఆరు వేల ఎకరాల మేర భూమిని కేటాయించాలి. ఆసక్తి వ్యక్తీకరణతో (ఈఓఐ) ముందుకు వచ్చే కన్సల్టెన్సీని వీలైనంత త్వరగా ఎంపిక చేసి మాస్టర్‌ప్లాన్‌ను కొలిక్కి తీసుకురావాలని టీఎస్ఐఐసీ భావిస్తోంది. ప్రణాళిక సిద్ధమైన వెంటనే ఫార్మాసిటీలో తొలిదశ పనులు చేపట్టాలని టీఎస్ఐఐసీ నిర్ణయించింది. పర్యవేక్షణకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్: ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మాసిటీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా, టీఎస్ ఐఐసీ వైస్ చైర్మన్ సభ్య కార్యదర్శిగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారు. -
ఫార్మాసిటీ అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్ కమిటీ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ ప్రాజెక్టును త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల కలెక్టర్లు లేదా జాయింట్ కలెక్టర్లు, ట్రాన్స్‌కో, సదరన్ డిస్కం ప్రతినిధులు, బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నుంచి ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారు. టీఎస్ఐఐసీ వైస్‌ఛైర్మన్ కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఫార్మాసిటీ ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు ప్రతీ నెలా లేదా అవసరమైన సందర్భాల్లో ఈ కమిటీ సమావేశం అవుతుంది. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఫార్మాసిటీ ప్రాజెక్టును చేపట్టింది. -
ముచ్చెర్ల ఫార్మా సిటీని త్వరితగతిన అభివృద్ధిచేయాలి
టీఎస్ఐఐసీ, రంగారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి భేటీ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల కోసం కేటాయించిన భూముల అభివృద్ధిని వేగవంతం చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల ఫార్మాసిటీ, ఇతర పరిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికసదుపాయాల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ), రంగారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముచ్చెర్ల ఫార్మాసిటీలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫార్మాసిటీకి అప్రోచ్ రోడ్డును వెంటనే నిర్మించాలని ఆదేశించారు. అలాగే పరిశ్రమల కోసం ఎంపిక చేసిన స్థలాల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు జిల్లాలో జరుగుతున్న పనులను వివరించారు. 6000 ఎకరాల అటవీ భూమిని సేకరించి దానికి బదులుగా వేరే చోట భూములు ఇచ్చే ప్రక్రియ సాగుతుందని చెప్పారు. నెలరోజుల్లో ప్రక్రియను పూర్తిచేసి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న భూములను వెంటనే గుర్తించి సత్వర అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేయాలని జూపల్లి ఆదేశించారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ ఎండీ జయేష్ రంజన్, ఈడీ నర్సింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా జేసీ రజత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పరవాడ ఫార్మా సిటీలో ప్రమాదం
పరవాడ (విశాఖపట్నం): విశాఖ నగర సమీపంలోని పరవాడ ఫార్మా సిటీలో మంగళవారం రాత్రి ఓ కంపెనీ యూనిట్లో ప్రమాదం జరిగింది. గ్రాన్యూల్స్ ఆస్టాస్ కంపెనీ తయారీ యూనిట్లో బాయిలర్ పేలిపోవడంతో ఇద్దరు కార్మికులకు గాయాలైనట్టు సమాచారం. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
ఐటీ పార్కులు.. పారిశ్రామిక వాడలు!
⇒ జిల్లాలో 38 ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు ⇒ టీఐఐసీ బృహత్తర ప్రణాళిక ⇒ గుర్తించిన 9,166 ఎకరాలు బదలాయించాలి ⇒ పెండింగ్ ప్రతిపాదనలు తక్షణమే పరిష్కరించాలి ⇒ భూ నిధిని అప్పగించాలని జిల్లా యంత్రాంగానికి టీఐఐసీ లేఖ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఐటీ కారిడార్లు, పారిశ్రామిక పార్కులు, ఫార్మాసిటీలు.. ఇవన్నీ మన జిల్లాలో కొలువుదీరనున్నాయి. తెలంగాణకు తలమానికంగా జిల్లా నిలిచేలా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఐఐసీ) బృహత్తర ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో 38 పారిశ్రామిక పార్కులు (ఐపీ) ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన టీఐఐసీ.. భూముల అప్పగించాలని రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి పెంచింది. ఇప్పటికే గుర్తించిన 9,166 ఎకరాలను తక్షణమే బదలాయించాలని ఆ సంస్థ కోరుతోంది. దీంట్లో కూడా చాలావరకు సర్కారు భూములనే టీఐసీసీకి కేటాయించినప్పటికీ, కొన్నిచోట్ల అసైన్డ్‌దారులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, పరిహారం ఎక్కువగా ఇవ్వాలనే డిమాండ్‌తో భూ బదలాయింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మరికొన్ని చోట్ల పట్టా భూములను సేకరించడం రెవెన్యూ యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలోనే నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి వెల్లువలా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్న కేసీఆర్ సర్కారు.. సాధ్యమైనంత త్వరగా ల్యాండ్ బ్యాంక్(భూనిధి)లను అందుబాటులో ఉంచుకోవాలని టీఐఐసీని ఆదేశించింది. దీంతో భూముల వేటను కొనసాగిస్తున్న ఆ సంస్థ.. బదలాయించకుండా పెండింగ్‌లో పెట్టిన భూములనూ తమకు అప్పగించాలంటూ జిల్లా యంత్రాంగానికి లేఖలు రాస్తోంది. గతంలో ప్రతిపాదించిన హార్డ్‌వేర్, రైస్హాబ్, బీడీఎల్ సంస్థ, ఏరో స్పేస్ జోన్ సహా తాజాగా ఫార్మాసిటీ, ఏరో పార్కు, హార్డ్‌వేర్ విస్తరణకు అదనంగా భూములు కావాలని నివేదించింది. దీంతో నిర్దేశిత భూములను అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిర్వాసితుల నుంచి రైస్‌హబ్‌కు వ్యతిరేకత ⇒ మహేశ్వరం మండలం కొంగర కలాన్‌లో ప్రకటించిన రైస్‌హబ్‌కు నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నిర్ధారించిన పరిహారంచాలదని, ఎకరాకు రూ.6.50 లక్షలు ఇస్తేనే భూములిస్తామని ఆక్రమణదారులు భీష్మించడంతో రైస్‌హబ్ పనులు నిలిచి పోయాయి. 146 మంది మిల్లర్లు ఇక్కడ రైస్‌మిల్లులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినా అప్రోచ్ రోడ్డు లేకపోవడం ప్రాజెక్టు ఆగేందుకు కారణమైంది. ఇటువంటి బాలారిష్టాలను అధిగమిస్తేగానీ పెట్టుబడులకు మార్గం సుగమంకాదని టీఐసీసీ వాదిస్తోంది. ⇒ తెలంగాణ సర్కారు కొలువుదీరిన తర్వాత తొలిసారి ప్రకటించిన ‘ఫార్మాసిటీ’కి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔషధనగరిని నిర్మిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినా.. ఇప్పటికే టీఐఐసీకి భూ బదలాయింపు జరగకపోవడం గమనార్హం. ము చ్చర్ల, తాడిపర్తి, కుర్మిద్ద, ముద్విన్, కడ్తాల్ గ్రామాల్లోని 11,000 ఎకరాలను తక్షణమే ఫీల్డ్ సర్వే చేయాలని, అటవీశాఖ భూమిని డీనోటి ఫై చేయాలని కోరినా స్పందన రావడంలేదని టీఐఐసీ వాపోతుంది. ⇒ సరూర్‌నగర్ మండలం నాదర్గుల్ సర్వే నం.519,523లలో ఏరోస్పేస్ జోన్‌ను విస్తరించాలనుకున్నారు. ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నం.520,521లలో హార్డ్‌వేర్ పార్కు విస్తరణకు అడ్డంకిగా మారిన పట్టాభూముల వివాదాన్ని త్వరగా తేల్చాలి. పారిశ్రామిక ‘పట్నం’ టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర సంస్థలతో ఐటీ హబ్‌గా రూపాంతరం చెందుతున్న ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతానికి మరిన్ని పార్కులు తరలిరానున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు అదనంగా ఏరోస్పేస్ జోన్, హార్డ్‌వేర్ పార్కుల విస్తరణ, ఏరో పార్కులు ఈ ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయి. వాటిలో కొన్ని... ⇒ మంచాల మండలం ఖానాపూర్ సర్వేనం.79లో 421 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క రానుంది. ⇒ ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ సర్వే నం.45లో 176.28 ఎకరాలు పోచారంలోని సర్వేనం.255లో 92.28 ఎకరాల్లో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ⇒ ఎలిమినేడు, కప్పపహాడ్లోని సర్వే నం.512,166,492,421లోని 572.15 ఎకరాలను పారిశ్రామిక వాడగా ప్రతిపాదించారు. ⇒ కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 1083.26 ఎకరాలను ప్లాస్టిక్సిటీగా అభివృద్ధి చేయనున్నారు. దీంట్లో 52.30 ఎకరాల మేర పట్టాభూములను రైతుల నుంచి సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
ఫార్మాసిటీ భూములను పరిశీలించిన కలెక్టర్
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చెర్ల రెవిన్యూ పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పరిశీలించిన భూములను జిల్లా కలెక్టర్ రఘనందన్ రావు టీఎస్ఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎంతమేర భూములు అందుబాటులో ఉన్నాయి, తదితర అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ని ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి? ప్రైవేటు భూములను ఏమైనా ప్రభుత్వపరంగా కొనుగోలు చేయాల్సి ఉందా? అనే విషయాల గురించి చర్చించినట్లు తెలిసింది. -
ఫిలింసిటీ, ఫార్మాసిటీలు వద్దు
హైదరాబాద్: ఫిలిం సిటీ, ఫార్మాసిటీలు నిర్మించే ప్రతిపాదనను విరమించుకోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక తీర్మానించింది. ఆదివారం తెలంగాణ విద్యావంతుల వేదిక 5 వ రాష్ట్రమహా సభలు ముగిశాయి. ఈ సభలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా గురజాల రవీందర్‌ని ఎన్నుకున్నారు. మిషన్ కాకతీయను అభినందిస్తూ, కల్యాణలక్ష్మీ పథకాన్ని అన్ని వర్గాల పేదలకు వర్తింపజేయాలని పలు తీర్మానాలు చేశారు. -
లెక్క తప్పింది!
* వికటించిన ‘ఔషధ’నగరి * తగ్గిన ఫార్మాసిటీ విస్తీర్ణం * భూ సర్వే ముచ్చర్లకే పరిమితం * అందులోనూ ప్రైవే టు, అసైన్డ్ భూములు * సర్కారుకు నికరంగా 1,623 ఎకరాలు మాత్రమే సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఔషధ నగరిపై ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. 13వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీకి భూ లభ్యత ప్రతిబంధకంగా మారింది. కేవలం 1,623 ఎకరాలు మాత్రమే ఔషధనగరికి అనుకూలంగా ఉందని జిల్లా యంత్రాంగం తేల్చింది. కందుకూరు మండ లం ముచ్చర్ల ప్రాంతంలో రసాయన, ఔషధనగరి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫార్మా దిగ్గజాలతో కలిసి విహంగ వీక్షణం చేశారు. ఔషధ సంస్థల అధినేతలు అడిగిందే తడ వు.. 13వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని నిర్మిస్తామని ప్రకటించారు. తక్షణమే గుర్తించిన భూములను టీఐఐసీకి బదలాయించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద భూముల సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులకు చావు కబురు చల్లగా తెలిసింది. ముందు అనుకున్నట్లు గుర్తించిన భూములుకాకుండా.. సర్వేను ముచ్చర్లలోని సర్వే నంబర్ 288కే పరిమితం చేయాలని సూచింది. దీంతో ఈ సర్వేనంబర్ పరిధిలోని భూములను సర్వే చేసిన యంత్రాం గం తేలిన లెక్కతో బిత్తరపోయింది. ఈ సర్వే నంబర్ పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 2,746 ఎకరాలు ఉండాల్సివుండగా, అందులో 460 ఎకరాలు గల్లంతైంది. (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) ఈటీఎస్ సర్వేలో కేవలం 2,286 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. సంప్రదాయ సర్వేకు ఈటీఎస్ సర్వేకు కొంతమేర వ్యత్యా సం రావడం సహజమేనని అధికారయంత్రాంగం సమర్థించుకుం టోంది. అసలే భూ లభ్యత లెక్క తప్పిందని జుట్టుపీక్కుంటున్న రెవెన్యూ గణానికి అందులోనూ పట్టా భూములు ఉండడం మరిం త చికాకు తెప్పిస్తోంది. 381 ఎకరాల మేర ప్రైవేటు వ్యక్తుల సాగుబడిలో ఉండగా, 282 ఎకరాలను ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసింది. ఇవన్నీ పోగా ప్రభుత్వానికి నికరంగా మిగిలేది 1,623 ఎకరాలు మాత్రమే. పట్టా, ప్రభుత్వ అసైన్డ్ భూములు కూడా గుర్తించిన సర్వే నంబర్ అంతర్భాగంలో ఉండడంతో భూ సేకరణ తప్పనిసరి. ఈ క్రమంలో అసైన్డ్ భూములను సేకరించాలంటే 1307 కింద ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సివుంటుంది. ప్రైవేటు పట్టాదారులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సివుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో యంత్రాంగం భూ లభ్యతపై తర్జనభర్జనలు పడుతోంది. పక్కనే ఉన్న సాయిరెడ్డినగర్లోని సర్వే నం.155లోని భూమినీ పరిశీలించినప్పటికీ, అందులోనూ ఇవే సమస్యలు ఇమిడి ఉండడంతో పక్కనపెట్టింది. ఊపు తగ్గించిన సర్కారు.. ఫార్మాసిటీపై దూకుడుగా వెళ్లిన సర్కారు.. ప్రస్తుతం ఊపు తగ్గించినట్లు కనిపిస్తోంది. ప్రతిపాదిత విస్తీర్ణాన్ని కుదించడం, నెలరోజులైనా భూముల సర్వేపై లెక్క తేల్చకపోవడం పరిశీలిస్తే.. ఔషధనగరిపై ప్రభుత్వం వైపు నుంచి మునుపటి స్పందన రావడంలేదని జిల్లా యంత్రాంగం అంటోంది. ఫార్మారంగ అధినేతల తో ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత వరుసగా మూడు రోజులు ఈ ప్రాజెక్టు పురోగతిపై సీఎం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అంతర్జాతీయ కన్సల్టెన్సీకి ఈ సిటీ డిజైన్‌చేసే బాధ్యత అప్పగించనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఫార్మాసిటీ నిర్మాణం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. -
ఆరు సిటీల అద్భుతం!
2015లో హైదరాబాద్‌లో మళ్లీ రియల్ బూమ్ ఫార్మా, ఫిల్మ్, హెల్త్, స్పోర్ట్స్, గేమ్, ఎడ్యుకేషన్ సిటీల ఏర్పాటుతో పట్టాలపైకి హైదరాబాద్: ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశాలతో కొన్నేళ్లుగా కుదేలైన భాగ్యనగర స్థిరాస్తి రంగం 2015 సంవత్సరంలో మళ్లీ పుంజుకోనుంది. ఇప్పటికే మెట్రో రైల్, ఓఆర్ఆర్, ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లతో ఆకాశంలో ఉన్న రియల్ ధరలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పలు ప్రాజెక్ట్‌లతో మరింత ఊపురానుంది.హైదరాబాద్ చుట్టూ ఫార్మా, ఫిల్మ్, హెల్త్, స్పోర్ట్స్, గేమ్, ఎడ్యుకేషన్ సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆయా సిటీల ఏర్పాటుతో భాగ్యనగరానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. దీంతో అపార్ట్మెంట్ల అమ్మకాలు పెరిగి, విల్లాల జోరు అధికమై, వాణిజ్య సముదాయాలకూ గిరాకీ రెట్టింపవుతుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఫార్మా సిటీ: ►పర్యావరణానికి హాని కలగకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’. ► రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 11 వేల ఎకరాల్లో ఏర్పాటు. ► ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి. ► తక్షణమే రూ.10 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నట్లు బల్క్‌డ్రగ్స్ ఉత్పత్తిదారుల సంఘం ప్రకటన. మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరిస్తే కొన్నేళ్లలో రూ.30 వేల కోట్ల పెట్టుబడికి సంసిద్ధత. ► ఫార్మా పరిశ్రమలతో పాటు, ఫార్మా విశ్వవిద్యాలయం, ఫార్మా పరిశోధన సంస్థల ఏర్పాటు కూడా. ► ఫార్మా పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కోసం ఇక్కడే టౌన్‌షిప్‌ల నిర్మాణం. హెల్త్ సిటీ: శేరిలింగంపల్లి మండలంలోని గచ్చిబౌలి గ్రామంలో 7 ఎకరాల్లో హెల్త్ సిటీ ఏర్పాటు కోసం హెచ్ఎండీఏకు లేఖ రాసిన రెవెన్యూ విభాగం. ఇప్పటికే మూడు వైద్య సంస్థలకు నాలుగు ఎకరాల భూమిని కేటాయింపు కూడా. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి రెండెకరాలు, రెయిన్ బో పిల్లల ఆసుపత్రి, మ్యాక్స్ విజన్ ఐ కేర్ ఆసుపత్రికి చేరో ఎకరం చొప్పున స్థలం కేటాయించింది. గేమ్ సిటీ: ► యానిమేషన్, మీడియా, గేమింగ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు గాను డిజిటల్ ఎంటర్టైన్మెంట్ నగరం (డీఈసీ)ని సిద్ధం చేస్తోన్న ప్రభుత్వం. ► రాయదుర్గంలో గేమింగ్ టవర్ ఏర్పాటు యోచన. ► సంస్థల ఏర్పాటుకు 30 కంపెనీలు సిద్ధం.. దీంతో 50 వేల మందికి ఉపాధి. చిత్ర, క్రీడా నగరాలు: ► నల్లగొండ జిల్లాలోని రాచకొండలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా, క్రీడా నగరాల ఏర్పాటు. ► దాదాపు 31 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతం... పరిశ్రమలు, సంస్థలు, విద్యాలయాల ఏర్పాటుకు అనుకూలం. ► 2 వేల ఎకరాల్లో విస్తరించనున్న సినిమా సిటీ. ► లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు. ►హైదరాబాద్ నుంచి రాచకొండకు వెళ్లే మార్గంలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కూడా. ఎడ్యుకేషన్ సిటీ: ► అమెరికా, దుబాయ్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాదిరిగానే హైదరాబాద్‌లోనూ ‘స్పెషల్ ఎడ్యుకేషన్ సిటీ’ (ప్రత్యేక విద్యా మండళ్లు) ఏర్పాటు. ► జవహర్‌నగర్‌లో వెయ్యి ఎకరాల స్థలాన్ని కేటాయించిన హెచ్ఎండీఏ. ఇప్పటికే ఇక్కడ 200 ఎకరాలతో బిట్స్ ఏర్పాటైంది. ► ఎడ్యుకేషన్ సిటీలకు కావాల్సిన మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. వీటి నిర్వహణ బాధ్యతను ప్రైవేటు విద్యా సంస్థలకు అప్పగించి ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. అక్కడికి వెళ్లడానికి రోడ్ల నిర్మాణం, రవాణా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. నిరంతరం విద్యుత్ సరఫరా ఉంటుంది. ఐటీఐఆర్: ►సమాచార సాంకేతిక పరిజ్ఞాన పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్ల ఏర్పాటు. ► ఐటీఐఆర్ కోసం హైదరాబాద్ చుట్టూ 49,913 ఎకరాల భూమి కేటాయింపు. ► వీటిలో మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, రాయదుర్గం, కొండాపూర్, తెల్లాపూర్, బహదూర్‌పల్లి, జవహర్‌నగర్, ఉప్పల్, పోచారం, హార్డ్‌వేర్ పార్క్, ఏపీఐఐసీ వర్క్ సెంటర్, ఫ్యాబ్‌సిటీ, మహేశ్వరం ప్రాంతాలున్నాయి. ► ప్రత్యక్షంగా 15.4 లక్షలు.. పరోక్షంగా 50.4 లక్షల ఉద్యోగావకాశాలు. ఏరోస్పేస్ సిటీ.. ► వైమానిక రంగంలోనూ హైదరాబాద్‌ను విశ్వ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న ప్రభుత్వం. ► రెండు అంతర్జాతీయ పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం ఆదిభట్ల, ఎలిమినేడులో వెయ్యేసి ఎకరాల స్థలం కేటాయింపు. ► ఇప్పటికే ఆదిభట్లలో 337.80 ఎకరాల్లో వైమానిక ప్రత్యేక ఆర్థిక మండలి (ఏరోస్పేస్ హబ్) ఉంది. ఇందులో టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, తారా ఏరోస్పేస్ సిస్టమ్స్, టాలా లకీడ్ మార్టిన్ ఏరోస్పేస్ లిమిటెడ్ పరిశ్రమలున్నాయి. ► కొత్తగా ఏర్పాటు కానున్న పారిశ్రామిక పార్కుల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సుల వారికి ఉద్యోగాలు లభిస్తాయి. -
చైనా తరహాలో ఫార్మాసిటీ!
అక్కడి చెంగ్డూ సిటీ తరహాలో చేపట్టాలని నిర్ణయించిన తెలంగాణ సర్కారు అధునాతనంగా నిర్మించే దిశగా కసరత్తు ఫార్మాసిటీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన అధికారులు భూముల సేకరణ టీఎస్ఐఐసీకి.. ప్రాజెక్టు రిపోర్టుల రూపకల్పన కన్సల్టెన్సీలకు అప్పగింత సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో నిర్మించతలపెట్టిన ఫార్మా సిటీని చైనాలోని చెంగ్డూ నగరం తరహాలో చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు నాలుగు వేలకు పైగా ఔషధాల తయారీ పరిశ్రమలు ఉన్న చైనాలోని ‘చెంగ్డూ బయో ఫార్మాస్యూటికల్ సిటీ’కి ఆసియా ప్రాంతంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆ నగరంలో వేలాది ఫార్మసీ కంపెనీల స్థాపనకు తోడ్పడిన మౌలిక వసతులు, సదుపాయాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే అక్కడికి రాష్ట్ర అధికారుల బృందాన్ని పంపించి, పరిశీలన చేయాలని భావిస్తోంది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలోని ముచ్చెర్ల ప్రాంతంలో 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫార్మా కంపెనీల దిగ్గజాలతో కలిసి ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆ ప్రాంతంలో ఏరియల్ సర్వే కూడా చేశారు. అనువైన ప్రాంతాలను గుర్తించి అక్కడే అధికారులు, ఫార్మసీ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష జరిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా సిటీకి అవసరమైన భూములను గుర్తించాలంటూ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్ఐఐసీ), పరిశ్రమల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మౌలిక సదుపాయాలకు సంబంధించి అంచనా వ్యయంతో సహా అవసరమైన అన్ని అంశాలతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించింది కూడా. ఈ మేరకు భూముల సర్వే, ప్రాజెక్టు రిపోర్టు , పర్యావరణ సంబంధిత అంశాలను పరిశ్రమల విభాగం ప్రైవేటు కన్సల్టెన్సీలకు అప్పగించింది. జురాంగ్, ఐఎల్ఎఫ్ఎస్, ఎల్అండ్టీ రాంబోల్ కంపెనీలకు ఈ పనులు అప్పగించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ నివేదికలు అందిన అనంతరం ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి ఫార్మా సిటీకి అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
ఫార్మసిటీ ఏర్పాటుకు సంబంధించి సర్వే పనులు..
కందుకూరు: ఫార్మసిటీ ఏర్పాటుకు సంబంధించి సర్వే పనులు శనివారం ప్రారంభమయ్యాయి. ఇటీవల సీఎం కేసీఆర్ పలువురు ఫార్మా సంస్థల అధినేతలతో కలిసి కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో భూములను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా సర్వే ఇన్ ల్యాండ్ రికార్డ్సు ఏడీ దేవరాజ్ ఆధ్వర్యంలో ఏడుగురు సర్వేయర్లు గల బృందం సర్వే నంబర్ 288లోని భూముల్లో సర్వే పనులు చేపట్టింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ సర్వే నంబర్లో 2,747.6 ఎకరాలకు గాను అసైన్డ్, పట్టా భూములుపోగా 2,139.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఆ సర్వే నంబర్లోని భూముల సరిహద్దులను నిర్ణయించే పనిలో సర్వే బృందం నిమగ్నమైంది. -
అధికారుల వేధింపుల నుంచి రక్షించండి
సాక్షి, హైదరాబాద్: సింగపూర్, మలేసియాల్లో కన్నా తెలంగాణలో మెరుగైన ఫార్మాసిటీని నిర్మించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని, మౌలిక సదుపాయాలతో ఫార్మాసిటీ త్వరలోనే అందుబాటులోకి రానుందని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్మాసిటీ వస్తే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. -
సీఎం పర్యటన సాగిందిలా..
* రెవెన్యూ భూములను హెలీకాప్టర్లలో ఏరియల్ సర్వే చేసిన సీఎం * కట్టుదిట్టమైన భద్రత కందుకూరు: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ఫార్మారంగ సంస్థల అధినేతలతో కలిసి నాలుగు హెలీకాప్టర్లలో బుధవారం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని భూములను సందర్శించారు. దీంతో నాలుగు రోజులుగా ఆ ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన అధికారులు ఏర్పాట్లను చేశారు. కాగా ఉదయం 11.30 గంటలకు మొదటి హెలీకాప్టర్ రాగా, 11.58 గంటలకు రెండో హెలీకాప్టర్ దిగింది. 12.20 గంటలకు మూడో హెలీకాప్టర్, 12.23 గంటలకు సీఎం కేసీఆర్ ఉన్న హెలీకాప్టర్ ల్యాండయింది. వారంతా క్షేత్రస్థాయిలో అక్కడి భూములతోపాటు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన అనంతరం తిరిగి మధ్యాహ్నం 1.10 గంటల ప్రాంతంలో మూడు హెలీకాప్టర్లలో సీఎం బృందం ఏరియల్ సర్వే నిర్వహించి 1.30 గంటలకు తిరిగి ల్యాండయ్యాయి. అనంతరం 2.25 గంటల ప్రాంతంలో హెలీకాప్టర్లలో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. కేసీఆర్‌తోపాటు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత.. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ నుంచి హన్మాస్‌పల్లి, జమ్ములబావి తండా మీదుగా మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 288లో ఏర్పాటు చేసిన ప్రాంతం వరకు ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ఎక్కడి వారిని అక్కడే నిలువరించారు. పాస్‌లు ఉన్నవారినే అనుమతించడంతో ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులు, వివిధ పార్టీల నేతలు నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది. మీడియా నిరసన.. కాగా ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి మీడియాను అనుమతించకపోవడం, ఇతర నేతల్ని అనుమతించడంతో మీడియా ప్రతినిధులు కొద్దిసేపు ఆందోళన చేశారు. స్థానిక సీఐ సంతకంతో జారీచేసిన పాస్‌లతో వచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు, నేతలను అనుమతించారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సందర్భంలో పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉత్సాహంతో వచ్చి నిరుత్సాహంగా.. ఎంతో ఉత్సాహంతో సీఎంను చూద్దామని వచ్చిన సమీప గ్రామాల ప్రజలకు నిరుత్సాహమే మిగిలింది. జమ్ములబావి తండా వరకు చేరుకున్న వారికి అక్కడి నుంచి ముందుకు అనుమతించకపోవడంతో చాలాసేపు నిరీక్షించి నిరుత్సాహంతో వెనుదిరిగారు. కొందరు కొండలు, గుట్టలపై కూర్చొని మరీ చూసే ప్రయత్నం చేశారు. స్థానికులకు అవస్థలు.. సీఎం పర్యటన కారణంగా ఆ ప్రాంతంలోని భూములతోపాటు సమీప భూముల్లో పశువులను మేపుకోవడానికి వె ళ్లే వారు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలకు అవస్థలు తప్పలేదు. పోలీసులు అటువైపు ఎవరినీ వెళ్లనీయకపోవడంతో రోజు వారీ పనులు చేసుకునే వారికి ఇబ్బంది తప్పలేదు. -
సాగర్- కర్నూలు రహదారులకు మహర్దశ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫార్మాసిటీ స్థాపనతో నాగార్జునసాగర్-కర్నూలు రహదారులకు మహర్దశ పట్టనుంది. ఈ రెండు రోడ్లను అనుసంధానం చేస్తూ నాలుగు లేన్ల మార్గాన్ని నిర్మించడానికి ప్రభుత్వం సముఖత చూపుతోంది. ముచ్చర్లలో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జరిపిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ రెండు రహదారులను కలుపుతూ కొత్త మార్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుందని ఫార్మా కంపెనీల అధినేతలు అభిప్రాయపడ్డారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రోడ్డు నిర్మాణం అవసరమని, ఇందుకోసం ప్రతిపాదనలు సమర్పించాలని టీఐఐసీ, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఫార్మాతోపాటు ఫ్యాబ్‌సిటీ, ప్లాస్టిక్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, రైస్హాబ్లు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించారు. కరెంట్ అవసరాలు తీర్చేందుకు భారీ సామర్థ్యంగల సబ్స్టేషన్లను ఇక్కడ ఏర్పాటు చేస్తామని, నీటికొరత రాకుండా కృష్ణాజలాలను కూడా విరివిగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. శభాష్ శ్రీధర్..! కలెక్టర్ శ్రీధర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఫార్మా రంగ దిగ్గజాలను ఆకట్టుకునేలా ఘనమైన ఆతిథ్యం ఇచ్చారని అభినందించారు. తన పర్యటన ఖరారైన రెండు రోజుల్లోనే ప్రతిపాదిత ఫార్మాసిటీ ప్రాంతం రూపురేఖలు మార్చేలా ఏర్పాట్లు చేశారని కితాబునిచ్చారు. -
అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటీ!
-
ఫార్మాసిటీకి 7వేల ఎకరాలు సిద్ధం: తీగల
ఫార్మాసిటీ కోసం రంగారెడ్డి జిల్లా పరిధిలో 7వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నట్లు టీఆర్ఎస్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరో ఏడు వేల ఎకరాలకు భూసేకరణ జరుగుతుందని తీగల చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఫార్మా కంపెనీల ప్రతినిధులు కలిసి 4 హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే చేశారన్నారు. మొత్తం పది ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొన్నట్లు తీగల కృష్ణారెడ్డి చెప్పారు. -
‘ఫార్మా సిటీ’ కోసం నేడు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
సాక్షి, హైదరాబాద్: ఫార్మా సిటీ ఏర్పాటుకు అవసరమైన స్థలాల అన్వేషణ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఫార్మా సంస్థల ప్రతినిధులతో కలసి బుధవారం ముచ్చెర్ల ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. వీరంతా మొత్తం నాలుగు హెలికాప్టర్లలో ఉదయం 11.45 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరి 12.15 గంటలకు ముచ్చెర్లకు చేరుకుంటారు. అక్కడ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం నేతృత్వంలో ఇష్టాగోష్టి నిర్వహిస్తారు. తొలుత రాచకొండ ప్రాంతాన్ని కూడా ఏరియల్ సర్వే చేయాలని అధికారులు భావించినా.. ఏదో కారణంతో దానిని విరమించుకున్నారు. -
ఫార్మాసిటీతో మహర్దశ
కందుకూరు: ఫార్మాసిటీ ఏర్పాటుకు మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ శాయిరెడ్డిగూడ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 288లో సీఎం కేసీఆర్ బృందం పరిశీలన చేపట్టనుండటంతో ఈ ప్రాంతంకు మహర్ధశ పట్టనుంది. ఇప్పటివరకు మారుమూలన అంతగా గుర్తింపు లేని ఆ గ్రామాలు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కడంతో ఆ ప్రాంత ప్రజలు సంబురపడుతున్నారు. రాజధానికి అతి సమీపంలో ఉన్నా ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఆ ప్రాంతంలో 2,747 ఎకరాల భూములు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపే ఉంది. పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటైతే ముచ్చర్ల, శాయిరెడ్డిగూడ, మీర్కాన్‌పేట, యాచారం మండలం కుర్మిద్ధ, తాడిపత్రి, మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్, హన్మాస్‌పల్లి తదితర గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని, తమ దశ తిరుగనుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఫార్మాసిటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. -
ఫిలింసిటీ కోసం.. రేపు కేసీఆర్ ఏరియల్ సర్వే
తెలంగాణలో కొత్తగా ఫిలిం సిటీ, ఫార్మా సిటీల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం నాడు ఏరియల్ సర్వే చేయనున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జల్లాల్లో ఆయన ఈ సర్వే చేస్తారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సీఎం ఏరియల్ సర్వే కొనసాగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడినుంచి ఆంధ్రా ప్రాంతానికి తరలిపోకుండా ఉండేందుకు ఇక్కడే సమస్త సదుపాయాలతో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఫిలింసిటీ నిర్మించాలని కేసీఆర్ పలు సందర్భాలలో తెలిపారు. అలాగే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు కూడా తరలిపోయే అవకాశం ఉన్నందున.. వాటికోసం కూడా సదుపాయాలు కల్పించాలని ఆయన భావిస్తున్నారు. ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో భూములను పరిశీలించి, ఫొటో ఎగ్జిబిషన్ చూస్తారు. అలాగే పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశం నిర్వహిస్తారు. -
‘ముచ్చర్ల’లో హడావుడి
ముచ్చర్ల ప్రాంతంలో ఆదివారం ఉన్నతాధికారులు హడావుడి చేశారు. ఫార్మాసిటీకి అనువైన భూములను పరిశీలించారు. 3న సీఎం కేసీఆర్‌తోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కందుకూరు మండలం ముచ్చర సమీపంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యదర్శి బీఆర్ మీనా, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, టీఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, కలెక్టర్ ఎన్.శ్రీధర్, మహబూబ్‌నగర్ కలెక్టర్ ప్రియదర్శిని, జేసీ చంపాలాల్ ముచ్చర్ల పరిసరాల్లో పర్యటించారు. సర్వే నంబర్లు, మ్యాప్‌లతో ప్రభుత్వ భూముల పరిధిపై ఆరా తీశారు. అదే రోజు సీఎం పర్యటించనున్న మంచాల సమీపంలోని రాచకొండ గుట్టల్లో ఓఎస్డీ అడిషనల్ ఎస్పీ రాధాకిషన్‌రావుతోపాటు పోలీస్ ఉన్నతాధికారులు మోహన్‌రెడ్డి, శివరాంరెడ్డి పర్యటించారు. సమీప తండాలను పోలీసు బృందాలు జల్లెడ పట్టాయి. కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఫార్మాసిటీ ఏర్పాటుకు అవసరమైన భూముల పరిశీలనకు ఉన్నతాధికారుల బృందం ఆదివారం కందుకూరు మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని భూములను పరిశీలించింది. ఈ నెల 3న మండల పరిధిలోని ముచ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్లు మండలం పరిధిలోని భూములను పరిశీలించడానికి సీఎం కేసీఆర్ తో పాటు ఫార్మారంగ సంస్థల అధినేత లు తరలిరానుండటంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదిలివచ్చింది. పరిశ్రమల ప్రత్యేక ప్రధానకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, టీఎస్ ఐఐసీ ఎండీ జయేష్రంజన్తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు ఎన్.శ్రీధర్, ప్రియదర్శినిలతోపాటు ఆయా జిల్లాల ఉన్నతాధికారులు తరలివచ్చారు. ఉన్నతాధికారులు ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 288లోని ప్రభుత్వ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మ్యాప్‌ల ద్వారా ఎక్కడ ఎంత భూమి లభ్యమవుతుందో తెలుసుకున్నారు. సర్వే నంబర్ 288లోని 2747 ఎకరాలతో పాటు మహబూబ్‌నగర్‌జిల్లా పరిధిలోని సర్వేనంబర్ 260లో ఉన్న 1800 ఎకరాల భూములు ఫార్మాసిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయా లేదా అనే విషయాన్ని సర్వే మ్యాప్‌ల ద్వారా పరిశీలించారు. సీఏం ఏరియల్ వీక్షణానికి వచ్చేటప్పటికీ సరిహద్దులు కన్పించేలా పెద్ద పెద్ద జెండాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండు జిల్లాల డీఎఫ్ఓలు, ఏడీఏలు, జేసీలు కూర్చొని రికార్డులను సిద్ధం చేయాలన్నారు. కాగా ఆ భూములకు దగ్గర్లో ఉన్న మీర్కాన్పేటలోని సర్వేనంబర్ 112, 120ల్లోని 1200 ఎకరాల భూమి విషయమై ఆరా తీశారు. అనంతరం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసి వెనుదిరిగారు. నాలుగు హెలిప్యాడ్లు.. కాగా ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని భూముల పరిశీలనకు సీఎం బృందాన్ని తీసుకొచ్చే నాలుగు హెలికాప్టర్ల కోసం ఆ భూముల్లో అనువైన స్థలాలను ఎంపిక చేసి హెలిప్యాడ్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సిబ్బందిని ఆదేశించారు. భోజన వసతి, లోనికి వెళ్లడానికి మార్గాన్ని సిద్ధం చేయాలని సూచించారు. వారి వెంట రెండు జిల్లాల జేసీలు చంపాలాల్, శర్మ, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ టీవీ శశిధర్‌రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ, ఆర్డీఓ యాదగిరిరెడ్డి, తహసీల్దార్ సుశీల, జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సింహ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆశ్చర్యంగా చూసిన స్థానికులు.. కాగా సీఎం కేసీఆర్ ఫార్మాసిటీ నెలకొల్పనున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఉన్నతాధికారుల బృందం ఆఘమేఘాల మీద హెలికాప్టర్లో రావడంతో స్థానికులు ఆశ్చర్యంతోపాటు సంబరపడుతున్నారు. మహబూబ్‌నగర్‌జిల్లా పరిధిలోని పిరమిడ్ ప్రాంగణంలో హెలికాప్టర్లో ఉన్నతాధికారులు, వాహనాల్లో స్థానిక అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫార్మసిటీ ఏర్పాటుకు ఇంత వేగంగా పనులు జరుగుతుండటంపై స్థానికులు తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
3న ఫార్మా దిగ్గజాలతో కలసి భూముల పరిశీలన సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా సరిహద్దులోని కందుకూరు మండలం ముచ్చర్లలో 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. డిసెంబర్ 3న బల్క్ డ్రగ్, ఫార్మారంగంలో దిగ్గజాలైన కంపెనీల అధినేతలను వెంటబెట్టుకొని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ ప్రాంతంలోని భూములను హెలికాప్టర్లలో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. మరోవైపు రాచకొండ గుట్టల్లోని 25 వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీ, ఐటీ తదితర పారిశ్రామిక హబ్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పారిశ్రామిక విధానంతో పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరిచేందుకు బడా ప్రణాళికలు రూపొందించిన సర్కారు... బహుళ జాతి సంస్థలను ఆకట్టుకునేందుకు రాజధాని శివార్లపై కన్నేసింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌రింగ్‌రోడ్డుకు చేరువలోని రాచకొండ, ముచ్చర్లలో సమృద్ధిగా భూ లభ్యత ఉండడంతో ఈ ప్రాంతాలను వివిధ రంగాల హబ్‌లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఏరియల్ సర్వేకు ముందుగా ఆదివారం పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, టీఎస్ ఐఐసీ ఎండీ జయేష్రంజన్లతోపాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. రాచకొండలో ఫిల్మ్‌సిటీ: నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్‌సిటీని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముచ్చర్లలో ఫార్మాసిటీ: రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులోని కందుకూరు, ఆమన్‌గల్ మండలాల శివార్లలో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ముచ్చర్ల మండలం సర్వే నంబర్ 288లోని 2500 ఎకరాలు, పక్కన ఉన్న మరో వేయి ఎకరాల(ఆమన్‌గల్ మండల పరిధి)ను ఫార్మాసిటీ కోసం సేకరించనున్నారు. డిసెంబర్ 3న రెడ్డీస్, అరవిందో, హెటెరో సంస్థల అధినేతలతో కలసి సీఎం విహంగ వీక్షణం చేయనున్నారు. -
శివారుల్లోకి ఫార్మా సిటీ..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను ‘వరల్డ్ క్లాస్ సిటీ’గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా కాలుష్య భూతాన్ని పారదోలేందుకు పకడ్బందీగా చర్యలకు దిగుతోంది. మౌలికావసరాలైన తాగునీరు, మురుగునీటి పారుదల, రోడ్డు, రవాణా, గ్రీనరీ వంటివాటి అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే గ్రేటర్‌ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా నగరం దాని చుట్టుపక్కల ఉన్న బల్క్‌డ్రగ్, ఫార్మా సంస్థలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించాలని నిర్ణయించింది. వీటికోసం ప్రత్యేకంగా ఏడు వేల ఎకరాల్లో ‘ఫార్మా సిటీ’ని నిర్మించేందుకు అనువైన స్థలాల కోసం అన్వేషణ ప్రారంభించింది. బల్క్‌డ్రగ్ రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో ఆ రంగాన్ని సమున్నతంగా తీర్చిదిద్దాలన్న యోచిస్తోంది. బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియట్, ఫార్మా నిల్వ గోదాముల కారణంగా నగరంలో తీవ్ర కాలుష్యం వెలువడుతోన్న కారణంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 30 కిలోమీటర్ల వెలుపల గల ప్రాంతాల్లో ఏడు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మించాలని తలపెట్టింది. ప్రస్తుతం జీడిమెట్ల, బాలానగర్, కాటేదాన్, ఐడీఏ బొల్లారం తదితర ప్రాంతాల్లో ఉన్న ఫార్మా కంపెనీలను ప్రతిపాదిత ఫార్మాసిటీకి తరలించేందుకుసర్కార్ సన్నాహాలు చేస్తోంది. విజయవాడ రూట్లో.. ఫార్మా సిటీని విజయవాడ రూట్లో నల్గొండ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంతంగి టోల్‌గేట్‌కు అవతల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65)కు ఆనుకొని నల్లగొండ జిల్లా పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇరవైకిపైగా బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలున్నాయి. మరోవైపు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపైనున్న గుండ్రాంపల్లి గ్రామ శివార్లలో రె ండేళ్ల క్రితం ఓ ప్రైవేటు సంస్థ పరిశ్రమల సెజ్ ఏర్పాటు కోసం సుమారు రెండు వేల ఎకరాల భూములను రైతుల నుంచి కొనుగోలు చేసింది. దీనికి అనుబంధంగా మరో ఐదు వేల ఎకరాలను సేకరిస్తే ఫార్మాసిటీ ఏర్పాటుకుఅనువుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాయితీలు ప్రకటించాలి.. కొత్తగా అమల్లోకి వచ్చిన భూసేకరణ, పునరావాస బిల్లు వల్ల ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి భూమి సేకరించడం కష్టసాధ్యం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని ప్రకటించడంతోపాటు పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించడమే గాక అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ సూచిస్తోంది. ముఖ్యంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో జాతీయ రహదారి-65కి సమీపంలో ఉన్న ఎనిమిది గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు, విస్తరణకు అనుకూలంగా ఉంటుందని అధికార వర్గాలు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ప్రతి జిల్లాకు ఓ పారిశ్రామిక కారిడార్‌ను ప్రకటిస్తున్న సర్కార్ నల్లగొండ జిల్లాకు ఫార్మా సిటీని కేటాయించే విషయమై ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంలోనే ఫార్మాసిటీ ఏర్పాటు, మార్గదర్శకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భూసేకరణ, నూతనంగా ఫార్మా కంపెనీల ఏర్పాటు, విస్తరణకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం కల్పించే రాయితీలు, మౌలిక వసతులు, ఇతర ప్రోత్సాహకాలు తదితర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి. -
భాగ్యనగరం.. విశ్వనగరం!
సాక్షి, హైదరాబాద్: నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరం విశ్వనగరంగా మారనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వైఫై సిటీ, ఫార్మా సిటీ, సినిమా సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో నగరంలోని నిర్మాణ రంగంలో ఒక్కసారిగా ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న స్థిరాస్తి రంగానికి మళ్లీ మంచి రోజులొస్తాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. రానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ‘ప్రపంచస్థాయి ఉత్తమ స్థిరాస్తి బిల్లు’ను తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. దేశ, విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి త్వరలోనే ఏకగవాక్ష విధానాన్ని కూడా తీసుకురానున్నారు. ఈ సింగిల్ విండో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ప్రభుత్వ వెబ్సైట్లో ఫార్మా, రియల్టీ, కెమికల్స్.. ఇలా ప్రతి రంగానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలంటాయి. వీటిని పూర్తి చేసి సబ్మిట్ చేస్తే చాలు. అన్ని రకాలుగా తనిఖీ చేసిన తర్వాత పది రోజుల్లో నేరుగా సీఎస్ కార్యాలయం నుంచి సంబంధిత పారిశ్రామికవేత్తలకు ఫోన్ వస్తుంది. ఆపై నేరుగా చర్చించిన తర్వాత.. 15 రోజుల్లో ఓ ఎన్వలెప్లో ప్రాజెక్ట్ అనుమతులు మంజూరవుతాయన్నమాట. వచ్చే యాభై ఏళ్ల నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్లు, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు.. ఇలా అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికలతో కూడిన సరికొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించనున్నారు. అలాగే స్థిరాస్తి అభివృద్ధికి అడ్డంకిగా మారుతోన్న నాలా పన్ను, మైనింగ్ సెస్, ఏవియేషన్ అనుమతులనూ ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సరికొత్త పారిశ్రామిక విధానంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోవైపు ఒక్కో సిటీ.. నగరం చుట్టూ ఒక్కో వైపు ఒక్కో సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే శామీర్‌పేటలో ఫార్మా సిటీని నిర్మిస్తోంది. విదేశీ సంస్థల రాకపోకల నిమిత్తం ఇక్కడే విమానాశ్రయాన్ని కూడా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులతో కలసి ఐటీఐఆర్ విధివిధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు సార్లు సమీక్ష జరిపారు. ఇన్క్యుబేషన్ సెంటర్ ఏర్పాటు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీలతో ఐటీ కంపెనీల కన్సార్టియం ప్రతిపాదన వంటి చర్యల వల్ల హైదరాబాద్ అభివృద్ధిపై సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. విమానాల అడ్డా.. ప్రస్తుత సమయంలో టాటా, రుయాగ్ కంపెనీలు కలసి ఆదిభట్లలో విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి సానుకూల పరిణామంగా బిల్డర్లు అభివర్ణిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇదే బాటలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పయనించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పటిష్టమైన పోలీసింగ్.. పోలీసింగ్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న ప్రకటన దేశ, విదేశీ సంస్థలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఉద్యమ సమయంలో శాంతిభద్రతల సమస్య కారణంగా నగరాన్ని విడిచిన సంస్థలు మళ్లీ నగరానికి రావొచ్చు. స్పోర్ట్స్ సిటీ.. భాగ్యనగరాన్ని అమ్యూజ్మెంట్, స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు దేశ, విదేశీ సంస్థల నుంచి ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే భాగ్యనగరంలో ఆధునిక పరిజ్ఞానం గల ఆసుపత్రుల సంఖ్య ఎక్కువే. అందుకే రకరకాల చికిత్సల కోసం వివిధ దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడికొస్తారు. వీరి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది కార్యరూపం దాల్చితే మెడికల్ టూరిజంగా నగరం అభివృద్ధి చెందుతుంది. -
ఉక్కు ఆశలపై నీళ్లు
ఏలేరు నీటి సరఫరాలో కోత గోదావరి జిల్లాలో సాగునీటికి కేటాయింపు గోదావరి పంపింగుకూ ఆటంకాలు రెండు పైపులుమొరాయింపు కర్మాగారానికి మరిన్ని నీటి కష్టాలు ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నీటి కష్టాలు తీరేలా లేవు. మొన్నటివరకు ఇచ్చే నీటి కేటాయింపు కూడా తగ్గిపోయింది. స్టీల్‌ప్లాంట్, ఫార్మాసిటీ, జీవీఎంసీ తా గునీటి అవసరాల కోసం ఏలేరు కాలువ నీటిని సరఫరా చేస్తున్నారు. నగరానికి నీటి ఎద్దడి పెరగడంతో రెండు నెలలుగాస్టీల్ప్లాంట్కు నీటి సరఫరాను 300 నుంచి 200 క్యూసెక్లకు తగ్గించేశారు. దీంతో ఉక్కు యాజమాన్యం గతనెలలో రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శి కృష్ణారావుకు పరిస్థితి నివేదించింది. దీంతో ఆయన విస్కోతో సమావేశమై స్టీల్‌ప్లాంట్‌కు నీటిసరఫరా పెంచాలని ఆదేశించారు. నీటి సరఫరా పరుగుతాదని ఆశించిన ఉక్కు యాజమాన్యానికి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చుక్కెదురయింది. ఈనెల మొదటివారంలో తూర్పుగోదావరి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఏలేశ్వరం నీటిని మళ్లిస్తే 25వేల ఎకరాలకు పంట లభిస్తుందని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌కు అత్యవసర నీటిసరఫరా కింద ఉన్న గోదావరి పంపింగ్ పనులు ద్వారా నీటిసరఫరా చేస్తే వారి అవసరాలు తీరుతాయని ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడికి లొంగిన ప్రభుత్వం వెంటనే ధవళేశ్వరం ఏస్ఈకు ఏలేశ్వరం నుంచి నీటిసరఫరా తగ్గించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈనెల 4వరకు 200 క్యూసెక్కులు సరఫరా జరగగా ఈ ఆదేశాలతో 5 నుంచి 100క్యూసెక్కులకు, 8 నుంచి 50 క్యూసెక్లకు సరఫరా తగ్గించేశారు. గతంలో విస్కో ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయంగా గోదావరి పంపింగ్ నిమిత్తం ఏర్పాటుచేసిన మొత్తం ఐదు పంపుల్లో రెండు పంపులు మరమ్మతులకు గురయ్యాయి. ఏకకాలంలో మూడు పంపులు ఉపయోగించి గరిష్టంగా రోజుకు 150 క్యూసెక్కులు మాత్రమే పం పింగ్ చేయగలుతున్నారు. ఈనెల 8నుంచి ఏలేశ్వరం, గోదావరి పంపింగ్ ద్వారా 200క్యూసెక్ల నీరు సరఫరా జరగడం గగనంగా మారింది. ఈ పరిస్థితిలో ఏ ఒక్క పంపు రిపేర్‌కు వచ్చినా నీటిసరఫరా మరింత తగ్గే ప్రమాదం ఉందని ఉక్కు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఈ అంశంపై ఉక్కు డెరైక్టర్ (ఆపరేషన్స్) డి.ఎన్.రావు సోమవారం జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ ద్వారా నీటిసరఫరా పెంచాలని కోరారు. -
అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటీ
ఏడువేల ఎకరాల్లో ఏర్పాటు ఫార్మా కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో ఏడు వేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్మాసిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం ఆయన సచివాలయంలో ఫార్మాకంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పరిశ్రమ పరిస్థితి, భవిష్యత్తు, ఈ రంగంలో ఉన్న అవకాశాల మీద చర్చించారు. ఈ రంగంలో చైనా, భారతదేశాలే అభివృద్ధి చెందాయని, దేశంలో ఇప్పటికే తెలంగాణ అగ్రగామిగా ఉందని, మరింత అభివృద్ధి సాధించేం దుకు తెలంగాణలోనే ఎక్కువ అవకాశాలున్నాయని వివరిం చారు. రైలుమార్గం, జాతీయ రహదారి, నీటివసతి అందుబాటులో ఉన్న చోట ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి తోడు నిరంతరాయంగా 500 మెగావాట్ల విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఫార్మాసిటీకి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాలుష్యరహిత పారిశ్రామిక విధానానికి అనుగుణంగానే ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఐదు వేల ఎకరాల్లో పరిశ్రమలను, రెండు వేల ఎకరాల్లో ఆయా పరిశ్రమల్లో పనిచేసే వారికి కాలనీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫార్మా అనుబంధ కంపెనీలు కూడా ఇక్కడే ఉంటాయని, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను కూడా ఫార్మాసిటీకే తరలించాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటైతే ఐదు లక్షల మందికి ఉపాధి లభించనుందని, వారందరూ నివసించేందుకు వీలుగా టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ఫార్మా వ్యవహారాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఫార్మా విధానం అత్యుత్తమంగా ఉందో పరిశీలించాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ కన్సల్టెంట్లతో ఫార్మాసిటీ డిజైన్‌ను తయారు చేయించాలని నిర్ణయించారు. సమావేశంలో డ్రగ్ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు జయంత్ ఠాగూర్, ప్రధానకార్యదర్శి ఆర్.కె.అగర్వాల్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు. -
'ఫార్మాసిటీకి 5 వేల ఎకరాల స్థలం కావాలి'
హైదరాబాద్: తెలంగాణలో ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీయిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఫార్మా సిటీలో కంపెనీలకు ప్రత్యేక పవర్‌ప్లాంట్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆయన సంసిద్దత వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ మేనిఫాక్చర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో బుధవారం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రత్యేక ఫార్మా సిటీని నెలకొల్పేందుకు 5 వేల ఎకరాల స్థలం అవసరమని సీఎంకు ఫార్మా ప్రతినిధులు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం ప్రత్యేక సెక్రటరీని నియమించాలని కోరగా, దీనికి సీఎం కేసీఆర్ అంగీకరించారు. -
‘ఖర్మా'గారాలపై కొరడా!
విశాఖ రూరల్ : జిల్లాలో పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఉద్యోగుల ఉసురు తీస్తున్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం.. ఆధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చే సుకోకపోవడం.. ప్రమాదాలు సంభవించినా కఠినంగా శిక్షించే స్థాయిలో పరిశ్రమ చట్టాలు లేకపోవడంతో ప్రమాదాల నియంత్రణకు అవకాశం లేకుండా పోతోంది. కనీసం పరిశ్రమల్లో ప్రమాణాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ కూడా లేకపోవడం గమనార్హం. ఈ మధ్య కాలంలో జిల్లాలో 10 పారిశ్రామిక ప్రమాదాలు సంభవించాయి. దీంతో కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ సీరియస్‌గా తీసుకున్నారు. ప్రమాదాల నియంత్రణకు కమిటీల ఏర్పాటు, పరిశ్రమల చట్టాల సవరణకు ప్రతిపాదనలు, సిఫార్సులు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నారు. ఈ ప్రమాదాలపై త్వరలోనే జిల్లాలో సంబంధిత మంత్రులు, రాష్ర్ట స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాలు, ఇక్కడ పరిశ్రమల్లో ఉన్న సెఫ్టీ ఆడిట్ సిస్టమ్, ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలు, వాటిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులకు వివరించనున్నారు. జిల్లా స్థాయి కమిటీకి ప్రతిపాదనలు జిల్లాలో ఉన్న పరిశ్రమల తీరుతెన్నుల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ లేదు. పరిశ్రమల చట్టం ప్రకారం ఇటువంటి కమిటీ ఏర్పాటుకు వెసులుబాటు లేదు. పరిశ్రమల చట్టంలో కొన్ని సవరణలు చేయడం ద్వారా జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకు కూడా మార్గం సుగమం అవుతుందని కలెక్టర్ భావిస్తున్నారు. దీనిపై తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆల్టర్నేటివ్ సేఫ్టీ ఆడిట్ సిస్టమ్‌ను తయారు చేసేందుకు పరిశ్రమల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. గుజరాత్లో పరిశ్రమల పాలసీలను అధ్యయనం చేసి తదనుగుణంగా ఇక్కడ మార్పులు చేయాలన్న నిర్ణయంతో ఉన్నారు. 36 సంస్థలకు ఎన్ఓసీ లేదు పరవాడలోని ఫార్మాసిటీలో 65 పరిశ్రమలు ఉండగా అందులో 36 కంపెనీలకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీలు లేనట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 25 కంపెనీల వారు ఎన్ఓసీ కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల వారికి ఎన్ఓసీలు జారీ చేయలేదు. మరో 11 కంపెనీలు ఎన్ఓసీ కోసం కనీసం దరఖాస్తు కూడా చే యలేదు. దీంతో ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాంకీ ఫార్మాలో హైడ్రాలిక్ ప్లాట్ఫారం, డ్రై కెమికల్ పౌడర్, ఫోమ్ టెండర్లు ఏర్పాటు చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ సేఫ్టీ ఇన్స్టిట్యూషన్ కోసం ప్రతిపాదనలు కొన్ని పరిశ్రమల్లో నిపుణులైన ఉద్యోగులు లేని కారణంగా కూడా ప్రమాదాలు సంభవిస్తున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో జిల్లాలో పరిశ్రమల అవసరాలకు తగిన నిపుణులను తయారు చేసేందుకు వీలుగా నేషనల్ సేఫ్టీ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఉద్యోగుల్లో నైపుణ్యం పెంచేందుకు వారికి శిక్షణతో పాటు ప్రమాదాల నివారణకు, పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టి భద్రతా ప్రమాణాలు చేపట్టేలా యాజామాన్యాలకు సూచనలు ఇవ్వడానికి అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. -
స్మైల్ ఎక్స్ ల్యాబ్‌లో పేలుడు: కార్మికులు గాయాలు
పరవాడ పార్మసిటీలోని స్మైల్ ఎక్స్ ల్యాబ్ లోని రియాక్టర్లో గత అర్థరాత్రి పేలుడు సంభవించింది. ఆ ఘటనలోనలుగురు కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. కంపెనీ భద్రత సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కంపెనీలో పేలుడుపై పోలీసులుకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రియాక్టర్ ప్రమాదవశాత్తు పేలిందా లేక మరి ఇతర ఏదైన కారణం వల్ల పేలిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.