ఆరు సిటీల అద్భుతం! | Six City is awesome! | Sakshi
Sakshi News home page

ఆరు సిటీల అద్భుతం!

Published Sat, Jan 3 2015 12:20 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

ఆరు సిటీల అద్భుతం! - Sakshi

ఆరు సిటీల అద్భుతం!

2015లో హైదరాబాద్‌లో మళ్లీ రియల్ బూమ్  ఫార్మా, ఫిల్మ్, హెల్త్, స్పోర్ట్స్, గేమ్, ఎడ్యుకేషన్ సిటీల ఏర్పాటుతో పట్టాలపైకి
 
హైదరాబాద్: ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశాలతో కొన్నేళ్లుగా కుదేలైన భాగ్యనగర స్థిరాస్తి రంగం 2015 సంవత్సరంలో మళ్లీ పుంజుకోనుంది. ఇప్పటికే మెట్రో రైల్, ఓఆర్‌ఆర్, ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లతో ఆకాశంలో ఉన్న రియల్ ధరలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పలు ప్రాజెక్ట్‌లతో మరింత ఊపురానుంది.హైదరాబాద్ చుట్టూ ఫార్మా, ఫిల్మ్, హెల్త్, స్పోర్ట్స్, గేమ్, ఎడ్యుకేషన్ సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆయా సిటీల ఏర్పాటుతో భాగ్యనగరానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. దీంతో అపార్ట్‌మెంట్ల అమ్మకాలు పెరిగి, విల్లాల జోరు అధికమై, వాణిజ్య సముదాయాలకూ గిరాకీ రెట్టింపవుతుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు.

ఫార్మా సిటీ:
 
పర్యావరణానికి హాని కలగకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’.
రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 11 వేల ఎకరాల్లో ఏర్పాటు.
  ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి.
  తక్షణమే రూ.10 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నట్లు బల్క్‌డ్రగ్స్ ఉత్పత్తిదారుల సంఘం ప్రకటన. మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరిస్తే కొన్నేళ్లలో రూ.30 వేల కోట్ల పెట్టుబడికి సంసిద్ధత.
  ఫార్మా పరిశ్రమలతో పాటు, ఫార్మా విశ్వవిద్యాలయం, ఫార్మా పరిశోధన సంస్థల ఏర్పాటు  కూడా.
ఫార్మా పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కోసం ఇక్కడే టౌన్‌షిప్‌ల నిర్మాణం.
 
హెల్త్ సిటీ:

 
శేరిలింగంపల్లి మండలంలోని గచ్చిబౌలి గ్రామంలో 7 ఎకరాల్లో హెల్త్ సిటీ ఏర్పాటు కోసం హెచ్‌ఎండీఏకు లేఖ రాసిన రెవెన్యూ విభాగం. ఇప్పటికే మూడు వైద్య సంస్థలకు నాలుగు ఎకరాల భూమిని కేటాయింపు కూడా. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి రెండెకరాలు, రెయిన్ బో పిల్లల ఆసుపత్రి, మ్యాక్స్ విజన్ ఐ కేర్ ఆసుపత్రికి చేరో ఎకరం చొప్పున స్థలం కేటాయించింది.
 
గేమ్ సిటీ:
 
యానిమేషన్, మీడియా, గేమింగ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు గాను డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ నగరం (డీఈసీ)ని సిద్ధం చేస్తోన్న ప్రభుత్వం.
రాయదుర్గంలో గేమింగ్ టవర్ ఏర్పాటు యోచన.
  సంస్థల ఏర్పాటుకు 30 కంపెనీలు సిద్ధం.. దీంతో 50 వేల మందికి ఉపాధి.
 
చిత్ర, క్రీడా నగరాలు:
 
నల్లగొండ జిల్లాలోని రాచకొండలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా, క్రీడా నగరాల ఏర్పాటు.
దాదాపు 31 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతం... పరిశ్రమలు, సంస్థలు, విద్యాలయాల ఏర్పాటుకు అనుకూలం.
2 వేల ఎకరాల్లో విస్తరించనున్న సినిమా సిటీ.
లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు.
హైదరాబాద్ నుంచి రాచకొండకు వెళ్లే మార్గంలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కూడా.
 
ఎడ్యుకేషన్ సిటీ:

 
అమెరికా, దుబాయ్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాదిరిగానే హైదరాబాద్‌లోనూ ‘స్పెషల్ ఎడ్యుకేషన్ సిటీ’ (ప్రత్యేక విద్యా మండళ్లు) ఏర్పాటు.
జవహర్‌నగర్‌లో వెయ్యి ఎకరాల స్థలాన్ని కేటాయించిన హెచ్‌ఎండీఏ. ఇప్పటికే ఇక్కడ 200 ఎకరాలతో బిట్స్ ఏర్పాటైంది.
  ఎడ్యుకేషన్ సిటీలకు కావాల్సిన మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. వీటి నిర్వహణ బాధ్యతను ప్రైవేటు విద్యా సంస్థలకు అప్పగించి ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. అక్కడికి వెళ్లడానికి రోడ్ల నిర్మాణం, రవాణా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. నిరంతరం విద్యుత్ సరఫరా ఉంటుంది.
 
 ఐటీఐఆర్:

సమాచార సాంకేతిక పరిజ్ఞాన పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్ల ఏర్పాటు.
  ఐటీఐఆర్ కోసం హైదరాబాద్ చుట్టూ 49,913 ఎకరాల భూమి కేటాయింపు.
  వీటిలో మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, రాయదుర్గం, కొండాపూర్, తెల్లాపూర్, బహదూర్‌పల్లి, జవహర్‌నగర్, ఉప్పల్, పోచారం, హార్డ్‌వేర్ పార్క్, ఏపీఐఐసీ వర్క్ సెంటర్, ఫ్యాబ్‌సిటీ, మహేశ్వరం ప్రాంతాలున్నాయి.
  ప్రత్యక్షంగా 15.4 లక్షలు.. పరోక్షంగా 50.4 లక్షల ఉద్యోగావకాశాలు.
 
 ఏరోస్పేస్ సిటీ..

వైమానిక రంగంలోనూ హైదరాబాద్‌ను విశ్వ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న ప్రభుత్వం.
  రెండు అంతర్జాతీయ పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం ఆదిభట్ల, ఎలిమినేడులో వెయ్యేసి ఎకరాల స్థలం కేటాయింపు.
  ఇప్పటికే ఆదిభట్లలో 337.80 ఎకరాల్లో వైమానిక ప్రత్యేక ఆర్థిక మండలి (ఏరోస్పేస్ హబ్) ఉంది. ఇందులో టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, తారా ఏరోస్పేస్ సిస్టమ్స్, టాలా లకీడ్ మార్టిన్ ఏరోస్పేస్ లిమిటెడ్ పరిశ్రమలున్నాయి.
కొత్తగా ఏర్పాటు కానున్న పారిశ్రామిక పార్కుల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సుల వారికి ఉద్యోగాలు లభిస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement