
సాక్షి,హైదరాబాద్ : కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో వామపక్ష పార్టీ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని,ఇండస్ట్రీయల్ కారిడార్. నియోజకవర్గంలో యువత,మహిళలకు ఉపాధి కల్పించడమే నా ఉద్దేశ్యం. కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి నా భాధ్యత. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతాను. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తాం.భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తాం’అని తనని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.