Kodangal Assembly Constituency
-
‘అది ఫార్మా సిటీ కాదు..ఇండస్ట్రియల్ కారిడార్’: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్ : కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో వామపక్ష పార్టీ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని,ఇండస్ట్రీయల్ కారిడార్. నియోజకవర్గంలో యువత,మహిళలకు ఉపాధి కల్పించడమే నా ఉద్దేశ్యం. కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి నా భాధ్యత. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతాను. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తాం.భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తాం’అని తనని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. -
కొండగల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, వనపర్తి: తెలంగాణ రాజకీయాల్లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కొత్తకోట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రను అడ్డుకునే క్రమంలో పోలీసులు నరేందర్ రెడ్డి, నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోలెపల్లి ఎల్లమ్మ దేవస్థానం నుంచి దుద్వాల్ ఎమ్మార్వో ఆఫీసు వరకు పాదయాత్ర చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పాదయాత్రకు అనుమతి లేదని చెబుతూ తుంకిమెట్ల వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘రైతుల కోసం పాదయాత్ర చేస్తామని మేము ముందే పోలీసులకు చెప్పాము. ప్రశాంతమైన వాతావరణంలో పాదయాత్ర చేసుకోమని వాళ్లు పర్మిషన్ ఇచ్చారు. కొడంగల్‌లో పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు రైతులు తరలి రావడం చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డాడు. దీంతో, మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రిని ఒకటే నేను ప్రశ్నిస్తున్నా.. మీ సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.హైదరాబాద్‌లో ఫార్మా సిటీ కోసం మహేశ్వరంలో 14వేల ఎకరాలు సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌ను వదిలేసి కొడంగల్‌లో పచ్చని పంటలు పండే మూడు వేల ఎకరాలను ఫార్మా సిటీ కోసం ఎందుకు ఎంపిక చేశారు. మహేశ్వరంలో ఉన్న వేల ఎకరాలలో రియల్ ఎస్టేట్ కోసం ప్లాన్ చేశారా?. ఫార్మా కంపెనీలు కాకుండా కొడంగల్‌కు మంచి కంపెనీలు తీసుకురావాలి. ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టొద్దు. యువతకు ఉపాధినిచ్చే ఐటీ కంపెనీలను తీసుకొస్తే దానికి మేము వ్యతిరేకం కాదు. కాబట్టి వెంటనే ఫార్మా కంపెనీల భూముల విషయంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. చివరి వరకు కొడంగల్ రైతుల పక్షాన నిలబడి పోరాడుతాము’ అని చెప్పారు.ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ..‘రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వం ఓర్చుకోవడం లేదు. తన సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీలు కాకుండా ఏ కంపెనీలు నెలకొల్పినా మాకు అభ్యంతరం లేదు. భూములను తీసుకునేటప్పుడు ఆ గ్రామాల ప్రజలను కూర్చోబెట్టి ఒప్పించి భూములు తీసుకోవాలి. వారికి ఇష్టం లేనిదే వారి భూములు తీసుకోవడం ఎంత వరకు సమంజసం?. యువతకు ఉపయోగపడే కంపెనీలను తీసుకురావాలి. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చుతోంది. రైతులకు ఇబ్బంది కలిగిస్తే సీఎం ఇంటిని ముట్టడిస్తాం’ అంటా హెచ్చరించారు.ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలనకొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులుఫార్మా కంపెనీ పేరుతో చేసే రియల్ ఎస్టేట్ దందాను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ఎన్ని… pic.twitter.com/cI4mGemzp2— BRS Party (@BRSparty) October 9, 2024 -
రేవంత్‌కు కేటీఆర్ సవాల్.. కొడంగల్‌లో కొత్త పంచాయతీ..
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, కొండగల్‌లో ఒక్క రైతుకు అయినా రుణమాఫీ జరిగినట్టు చెబితే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్.. సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.కాగా, కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘భారతదేశంలో అతిపెద్ద మోసం గురించి చెప్తున్నాం. తెలంగాణలో రుణమాఫీ పేరుతో దారుణమైన దగా చేశారు. రుణమాఫీ బోగస్, మిలీనియం ఆఫ్ ది జోక్. అన్నదాతలను నిండా ముంచారు. రైతులను మోసం చేసిన రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలి. రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. కానీ, అనేక కొర్రీలు పెట్టి రుణమాఫీ చేయలేదు. రైతులకు ద్రోహం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అర్హులైన రైతుల్లో చాలా మందికి రుణమాఫీ కాలేదు. అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగున్నారు. ఆగస్టు 15 కల్లా రెండు లక్షల రుణమాఫీ కాలేదు. మోసం కాంగ్రెస్‌లో రక్తంలోనే ఉంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసారు. రైతులను తడి గుడ్డతో గొంతు కోశాడు రేవంత్ రెడ్డి. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ తెలంగాణ లో ఉందని మాకు తెలియక ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. మీరు నిజంగా రుణమాఫీ నిజంగా చేసి ఉంటే మీ నియోజకవర్గం కొడంగల్‌కు వెళ్లాం. అక్కడ ఏ ఒక్క రైతుకు అయినా రుణమాఫీ చేసినట్టు చెబితే నేను నా పదవికి రాజీనామా చేస్తాను. రుణమాఫీ సక్సెస్ అయినట్టు నిరూపిస్తే రాజీనామాకు రెడీ. రాజకీయ సన్యానం తీసుకుంటాను. ఈ సవాల్‌కు రేవంత్ సిద్దమేనా? అని ప్రశ్నించారు.అలాగే, నేను మహిళపై యథాలాపంగా మాట్లాడాను. చెల్లెల్ని అక్కల్ని క్షమించాలి అని అడిగాను. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలను రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై క్షమాపణ చెప్తారా?. సెప్టెంబర్‌లో ప్రాంతీయ పార్టీల బలోపేతంపై కొన్ని రాష్ట్రాల్లో పర్యటన చేయబోతున్నాం. డీఎంకే లాంటి పార్టీల పని తీరుపై పరిశీలిస్తాం. నాతో పాటు మా పార్టీ నేతలందరూ వస్తారు. ఏపీలోని వైఎస్సార్సీపీ పార్టీలను కూడా పరిశీలిస్తాం అంటూ కామెంట్స్ చేశారు. -
రేవంత్ రెడ్డి పెద్ద దొంగ.. నీతి నియమం లేని వ్యక్తి: కేసీఆర్
సాక్షి, మహబూబ్‌నగర్: ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు సీఎం కేసీఆర్. పోటీలో ఉన్న అభ్యర్దుల గుణగనాలతోపాటు వారి పార్టీల విధానాన్ని చూసి ప్రజలు ఓట్లు వేయాలని సూచించారు. గతంలో కొడంగల్ వాసులు ఎక్కడికెక్కడికో వలసలుపోయేవారని.. ఆ పరిస్థితి నేడు మారిందని తెలిపారు. కొడంగల్‌లో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ మూడు గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నారని.. అలాంటి తప్పుడు మాటలు నమ్మి మోసపోవద్దని కేసీఆర్ హితవు పలికారు. 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవడం రైతులకు సాధ్యం కాదని తెలిపారు. ఆ మోటర్లు పెట్టాలంటే 50 నుంచి 60 వేల కోట్లు కావాలని అన్నారు. రేవంత్ పెద్ద భూకబ్జాదారుడని, ఎన్నో భూములు కబ్జా చేశాడని విమర్శించారు. కాంగ్రేస్ ది భూమాత కాదు భూమేత పథకమని మండిపడ్డారు. ధరణి తీసేస్తే పెద్ద ప్రమాదమే అవుతుందన్నారు. చిప్పకూడు తిన్నా సిగ్గురాలే ‘రేవంత్ రెడ్డి అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఆయనవి ఆల్త్ పాల్త్ మాటలు ఇక్కడ పని చేయలేదు. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్ తుపాకీ పట్టుకొని వెళ్లారు. నీతి నియమం లేని వ్యక్తి రేవంత్. ఓటుకు నోటు 50లక్షలతో పట్టుబడిన కేసులో చిప్పకూడు తిన్నా ఆయనకు సిగ్గురాలేదు. రేవంత్ నోరు తెరిస్తే గబ్బు. డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చాడని కాంగ్రెస్ వాళ్లే ఆరోపిస్తూ గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తున్నారు. వీళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన వారు కాదు కాంగ్రెస్‌లో 25 మంది సీఎంలు ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. సీఎం అవుతాడని మీరు నమ్మి ఓటు వేస్తే నష్టపోతారు. నామీద పోటీకి కామారెడ్డికి వచ్చాడు. అక్కడ ఓడిస్తున్నారు ఇక్కడ కూడా ఓడించాలి. రేవంత్ రెడ్డి పెద్ద దొంగ ఇలాంటి దరిద్రుల పీడ పోవాలి. వీళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన వారు కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అక్కడివాళ్లే వచ్చి చెబుతున్నారు. ’ అని కేసీఆర్ మండిపడ్డారు. చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ కవిత రియాక్షన్! పరిగిలో బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ‘బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించింది. ఉన్న తెలంగాణను ఉడగొట్టిందే కాంగ్రెస్. గతంలో వలసలు, కరువు, కరెంట్ కష్టాలు, నీటి కష్టాలు. తెలంగాణ వచ్చాక కరెంట్, నీటి కష్టాలు తీర్చుకున్నాం. విధి వంచితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది.. పెన్షన్ వెయ్యి నుంచి పెంచుకుంటూ వచ్చాం. మూడోసారి అధికారంలో ఇచ్చాక పెన్షన్ రూ. 5 వేలుచేస్తాం. కంటి వెలుగు కార్యక్రమం వస్తుందని ఎవరైనా ఊహించారా?.ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే’ నని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. -
వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గంలో తదుపరి గెలుపు ఎవరిది..?
కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పట్నం నరేంద్రరెడ్డి, కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డిపై 9319 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఎమ్మెల్సీగా ఉన్న నరేంద్ర రెడ్డిని టిఆర్ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొడంగల్‌లో పోటీకి దించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే రేవంత్ రెడ్డినియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన టిడిపి పక్షాన రెండుసార్లు ఎన్నికయ్యారు. తదుపరి ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఇబ్బంది పడ్డారు. టిడిపి వర్కింగ్ అద్యక్షుడుగా ఉంటూ, ఆ పార్టీని వదలి కాంగ్రెస్ ఐలో చేరి వర్కింగ్ అద్యక్షుడు అయ్యారు. నరేంద్ర రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి సోదరుడు అవుతారు. నరేంద్ర రెడ్డికి 80754 ఓట్లు రాగా, రేవంత్ రెడ్డికి 71435 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీచేసిన బాలకిషోర్కు నాలుగువేల ఓట్లు వచ్చాయి. కాగా రేవంత్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికలలో మల్కాజిగిరి నుంచి పోటీచేసి గెలుపొందడం విశేషం. తదుపరి రేవంత్ పిసిసి అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2014లో ఐదుసార్లు గెలిచిన సీనియర్ నేత గురునాధరెడ్డిని 14614 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన గురునాధ రెడ్డి 2014లో టిఆర్ఎస్లో చేరి పోటీచేశారు. అయినా ఫలితం దక్కలేదు. 2014లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్.పి విఠల్‌రావు 36304ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికే పరిమితం అయ్యారు. రేవంత్‌రెడ్డి ఒకసారి శాసనస మండలికి కూడా ఎన్నికయ్యారు. ఈయన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తమ్ముడికి అల్లుడు. కొడంగల్‌లో గురునాధ రెడ్డి ఐదుసార్లు 1978, 1983, 1989, 1999, 2004లలో గెలుపొందారు. కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి ఐదుసార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. కొడంగల్‌లో నందారం వెంకటయ్య ఒకసారి ఇండిపెండెంటుగా, రెండుసార్లు టిడిపి తరుపున గెలవగా ఆయన మరణం తర్వాత 1996లో జరిగిన ఉపఎన్నికలో వెంకటయ్య కుమారుడు సూర్య నారాయణ గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.అచ్యుతరెడ్డి కొడంగల్‌లో రెండుసార్లు గెలిచారు. కొడంగల్‌లో ఇంతవరకు పన్నెండుసార్లు రెడ్లు గెలుపొందితే, నాలుగుసార్లు వైశ్య సామాజికవర్గం గెలవడం విశేషం. అచ్యుత్ రెడ్డి కొంతకాలం పి.వి.నరసింహారావు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1952లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి వీరాస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..