సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిదన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, కొండగల్‌లో ఒక్క రైతుకు అయినా రుణమాఫీ జరిగినట్టు చెబితే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్.. సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.
కాగా, కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘భారతదేశంలో అతిపెద్ద మోసం గురించి చెప్తున్నాం. తెలంగాణలో రుణమాఫీ పేరుతో దారుణమైన దగా చేశారు. రుణమాఫీ బోగస్, మిలీనియం ఆఫ్ ది జోక్. అన్నదాతలను నిండా ముంచారు. రైతులను మోసం చేసిన రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలి. రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. కానీ, అనేక కొర్రీలు పెట్టి రుణమాఫీ చేయలేదు. రైతులకు ద్రోహం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అర్హులైన రైతుల్లో చాలా మందికి రుణమాఫీ కాలేదు.
అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగున్నారు. ఆగస్టు 15 కల్లా రెండు లక్షల రుణమాఫీ కాలేదు. మోసం కాంగ్రెస్‌లో రక్తంలోనే ఉంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసారు. రైతులను తడి గుడ్డతో గొంతు కోశాడు రేవంత్ రెడ్డి. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ తెలంగాణ లో ఉందని మాకు తెలియక ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. మీరు నిజంగా రుణమాఫీ నిజంగా చేసి ఉంటే మీ నియోజకవర్గం కొడంగల్‌కు వెళ్లాం. అక్కడ ఏ ఒక్క రైతుకు అయినా రుణమాఫీ చేసినట్టు చెబితే నేను నా పదవికి రాజీనామా చేస్తాను. రుణమాఫీ సక్సెస్ అయినట్టు నిరూపిస్తే రాజీనామాకు రెడీ. రాజకీయ సన్యానం తీసుకుంటాను. ఈ సవాల్‌కు రేవంత్ సిద్దమేనా? అని ప్రశ్నించారు.
అలాగే, నేను మహిళపై యథాలాపంగా మాట్లాడాను. చెల్లెల్ని అక్కల్ని క్షమించాలి అని అడిగాను. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలను రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై క్షమాపణ చెప్తారా?. సెప్టెంబర్‌లో ప్రాంతీయ పార్టీల బలోపేతంపై కొన్ని రాష్ట్రాల్లో పర్యటన చేయబోతున్నాం. డీఎంకే లాంటి పార్టీల పని తీరుపై పరిశీలిస్తాం. నాతో పాటు మా పార్టీ నేతలందరూ వస్తారు. ఏపీలోని వైఎస్సార్‌సీపీ పార్టీలను కూడా పరిశీలిస్తాం అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment