'ఫార్మాసిటీకి 5 వేల ఎకరాల స్థలం కావాలి'
హైదరాబాద్: తెలంగాణలో ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీయిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఫార్మా సిటీలో కంపెనీలకు ప్రత్యేక పవర్‌ప్లాంట్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆయన సంసిద్దత వ్యక్తం చేశారు.
బల్క్ డ్రగ్ మేనిఫాక్చర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో బుధవారం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రత్యేక ఫార్మా సిటీని నెలకొల్పేందుకు 5 వేల ఎకరాల స్థలం అవసరమని సీఎంకు ఫార్మా ప్రతినిధులు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం ప్రత్యేక సెక్రటరీని నియమించాలని కోరగా, దీనికి సీఎం కేసీఆర్ అంగీకరించారు.