సింగపూర్, మలేసియాల్లో కన్నా తెలంగాణలో మెరుగైన ఫార్మాసిటీని నిర్మించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని...
సాక్షి, హైదరాబాద్: సింగపూర్, మలేసియాల్లో కన్నా తెలంగాణలో మెరుగైన ఫార్మాసిటీని నిర్మించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని, మౌలిక సదుపాయాలతో ఫార్మాసిటీ త్వరలోనే అందుబాటులోకి రానుందని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి చెప్పారు.
బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్మాసిటీ వస్తే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.