కోవిడ్ తర్వాత సింగపూర్ తన పూర్వ వైభవాన్ని పొందింది. 2019 నుంచి కరోనాతో టూరిజం పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సందర్శకుల తాకిడి పెరగడంతో 2022లో తిరిగి పుంజుకుంది. దీంతో నవంబర్ వరకు 5.37 మిలియన్లు టూరిస్టులు సింగపూర్‌ను సందర్శించారు. నవంబర్ వరకు సింగపూర్ టూరిజం బోర్డు (STB) నుంచి వచ్చిన డేటా ఆధారంగా.. 48 శాతం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా, భారత్ నుంచే ఉన్నారు. డిసెంబర్ సాంప్రదాయకంగా సింగపూర్ సందర్శకులకు రద్దీగా ఉండే ప్రయాణ కాలం కావడంతో, ఈ సంఖ్యను కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిలో ఇండోనేషియా నుంచి 9.86 లక్షలు ఉండగా, భారత్ నుంచి 6.12 లక్షల మంది ఉన్నారు. సింగపూర్ టూరిజం అభివృద్ధిలో ఇండియా కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
మలేషియా 495,470తో మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (476,480), ఫిలిప్పీన్స్ (325,480) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చివరగా 2019 ప్రీ-కోవిడ్ సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా 19.1 మిలియన్ల మంది టూరిస్టులు సందర్శించారు. ఆ సంవత్సరంలో, సింగపూర్‌కు చైనా నుంచి 3.6 మిలియన్లకు పైగా సందర్శకులు వచ్చారు. చివరకు తమ పౌరులను మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని చైనా గత వారం ప్రకటించడంతో, 2023లో సింగపూర్ టూరిజం మహమ్మారి అనంతరం పున్వరైభవానికి చేరుకునే అవకాశం కల్పిస్తోంది.
చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది!
Comments
Please login to add a commentAdd a comment