ఫార్మాసిటీ భూములను కలెక్టర్ రఘనందన్ రావు టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చెర్ల రెవిన్యూ పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పరిశీలించిన భూములను జిల్లా కలెక్టర్ రఘనందన్ రావు టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఎంతమేర భూములు అందుబాటులో ఉన్నాయి, తదితర అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ని ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి? ప్రైవేటు భూములను ఏమైనా ప్రభుత్వపరంగా కొనుగోలు చేయాల్సి ఉందా? అనే విషయాల గురించి చర్చించినట్లు తెలిసింది.