ఫార్మాసిటీ ఏర్పాటుకు మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ శాయిరెడ్డిగూడ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్
కందుకూరు: ఫార్మాసిటీ ఏర్పాటుకు మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ శాయిరెడ్డిగూడ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 288లో సీఎం కేసీఆర్ బృందం పరిశీలన చేపట్టనుండటంతో ఈ ప్రాంతంకు మహర్ధశ పట్టనుంది. ఇప్పటివరకు మారుమూలన అంతగా గుర్తింపు లేని ఆ గ్రామాలు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కడంతో ఆ ప్రాంత ప్రజలు సంబురపడుతున్నారు. రాజధానికి అతి సమీపంలో ఉన్నా ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోలేదు.
ఆ ప్రాంతంలో 2,747 ఎకరాల భూములు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపే ఉంది. పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటైతే ముచ్చర్ల, శాయిరెడ్డిగూడ, మీర్కాన్‌పేట, యాచారం మండలం కుర్మిద్ధ, తాడిపత్రి, మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్, హన్మాస్‌పల్లి తదితర గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని, తమ దశ తిరుగనుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఫార్మాసిటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.