విశాఖపట్నం: విశాఖ జిల్లా కేంద్రంలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని శ్రీకర్ కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమ్మోనియం నైట్రేట్ ట్యాంక్ పేలి రామకృష్ణ(29) అనే వ్యక్తి మృతి చెందగా.. సుమారు 15 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.