విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | Ysrcp Chief Ys Jagan Condemns Visakha Incident | Sakshi
Sakshi News home page

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Published Wed, Apr 2 2025 5:53 PM | Last Updated on Wed, Apr 2 2025 7:09 PM

Ysrcp Chief Ys Jagan Condemns Visakha Incident

సాక్షి, తాడేపల్లి: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కా దీపిక కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని ఘటన మరవకముందే.. విశాఖలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు.

విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement