
చిత్తూరు, సాక్షి: సీఎం సొంత జిల్లాలో దళితులకు ఘోర అవమానం జరిగింది. జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా.. ప్రభుత్వ కార్యక్రమానికి దళితులకు ఆహ్వానం వెళ్లలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా సంఘాల నాయకులు నిరసనకు దిగగా.. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరారు.
బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకల్లో అధికారుల అలసత్వం బయటపడింది. అధికారిక కార్యక్రమాలకు దళితులకు ఆహ్వానం పంపించలేదు. కూటమి పాలనతో తాము నిర్లక్ష్యానికి గురౌతున్నామంటూ దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఈ విషయమై సదరు కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
వాళ్ల ఆవేదన విన్న కలెక్టర్ సుమిత్.. అది కింది స్థాయి ఉద్యోగులు చేసిన తప్పిదమని, తప్పకుండా చర్యలు తీసుకుంటానంటూ దళిత సంఘాల నేతల కాళ్ల మీద పడి క్షమాపణలు కోరడంతో చివరకు శాంతించారు.
