
తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును పరామర్శించేందుకు ఏపీ సీఎం జగన్..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సీఎం జగన్ పరామర్శిస్తారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్ బాత్రూమ్‌లో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగింది. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. కొలుకున్న అనంతరం విశ్రాంతి కోసం కేసీఆర్ బంజారాహిల్స్ నందినగర్‌లోని తన పాత నివాసానికి చేరుకున్నారు.