
వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసులో వీడియోను వైఎస్సార్‌సీపీ బయట పెట్టింది. షాపింగ్ చేస్తున్న సత్యవర్థన్ వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేసింది.
సాక్షి, తాడేపల్లి: వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసులో వీడియోను వైఎస్సార్‌సీపీ బయట పెట్టింది. షాపింగ్ చేస్తున్న సత్యవర్థన్ వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేసింది. ‘‘తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని.. న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది’’ అని వైఎస్సార్‌సీపీ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది.
‘‘ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారంటూ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే. మరి ఈ వీడియోను చూస్తే సత్యవర్థన్ కిడ్నాప్‌నకు గురైనట్టుగా ఉందా?’’ అని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.
‘‘పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్‌లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్చగా షాపింగ్ చేసుకుంటున్న సత్యవర్థన్ వీడియో ఇది. కిడ్నాప్ చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు?. ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు?. దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడింది’’ అని వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది.
💣 Truth Bomb 💣
సత్యమేవ జయతే
తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న @ncbn సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది.
ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్… pic.twitter.com/pAa5VMknV9— YSR Congress Party (@YSRCParty) February 26, 2025
ఇదీ చదవండి: లోకేష్.. ఇవిగో ఆధారాలు..!