Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

boAT Founder Aman Gupta Supports Piyush Goyal1
‘మీ లక్ష్యం ఏమిటో ప్రతీరోజూ ప్రభుత్వం చెబుతుందా?’

న్యూఢిల్లీ: భారత్ కు చెందిన స్టార్టప్ కంపెనీలను ఉద్దేశించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా మద్దతు పలికారు. పీయూష్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తును దుమారం చెలరేగగా, అమన్ గుప్తా మాత్రం ఆయన వ్యాఖ్యలను సమర్ధించారు. పీయూష్ చేసిన వ్యాఖ్యల్లో తనకు తప్పు ఏమీ కనిపించలేదంటూ ట్వీట్ చేశారు అమన్ గుప్తా. పీయూష్ చెప్పిన దానికి వక్రార్థాలు సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ఆయన మాట్లాడిన మొత్తం స్పీచ్ తాను విన్నానని, అందులో తప్పులు వెతకాల్సిన పని లేదన్నారు అమన్ గుప్తా.‘స్టార్టప్ ఫౌండర్లకు మీ లక్ష్యం పెద్దదిగా ఉండాలని ప్రతీరోజూ గవర్నమెంట్ చెప్పలేదు. నేను అక్కడ ఉన్నాను. నేను ఆయన ప్రసంగం మొత్తం విన్నాను. ఆయనేమీ కంపెనీల వ్యవస్థాపలకు వ్యతిరేకం కాదు. మనపై నమ్మకం ఉంది కాబట్టే కొన్ని మంచి విషయాలు చెప్పారు. భారత్ ఇంకా మరింత వేగంగా ముందుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం. మన లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పుడే వాటిని సాధించడానికి కృషి చేస్తామనేది ఆయన చెప్పిందాంట్లో నాకు అర్థమైంది’ అంటూ అమన్ గుప్తా పేర్కొన్నారు.ఇటీవల జరిగిన స్టార్టప్ మహాకుంబ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గోయల్‌ మాట్లాడుతూ.. దేశంలోని పలు స్టార్టప్‌ కంపెనీలు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్‌లపై ఎక్కువగా దృష్టి సారించాయి. కానీ చైనాలోని స్టార్టప్‌లు మాత్రం ఇందుకు భిన్నమైన రంగాలను ఎంచుకుంటున్నాయని చెప్పారు. కానీ, మనం ఐస్‌క్రీం, చిప్స్‌ అమ్మడం దగ్గరే ఉన్నాం. ఇక్కడే మనం ఆగిపోకూడదు. డెలివరీ బాయ్స్‌/గర్ల్స్‌గానే మిగిలిపోదామా? అదే భారత్‌ లక్ష్యమా..? అది స్టార్టప్‌ల ఉద్దేశం కాదు కదా’’ అని అన్నారు.అయితే.. భారత్‌లో స్టార్టప్‌లను తక్కువ చేయొద్దంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్‌ పార్టీ ఓ పోస్ట్‌ చేసింది. ఈ క్రమంలోనే భారత్ లోని పలు స్టార్టప్ కంపెనీలు కూడా పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో బోట్ సహ వ్యవస్థాపకుడు పీయూష్ కు మద్దతుగా నిలవడం విశేషం.It’s not every day that the government asks founders to dream bigger.But at Startup Mahakumbh, that’s exactly what happened. I was there. I heard the full speech. Hon. Minister @PiyushGoyal Ji isn’t against founders. He believes in us.His point was simple: India has come far,… pic.twitter.com/bA4ontAz1M— Aman Gupta (@amangupta0303) April 6, 2025

Pm Modi Inaugurates India First Vertical Lift Sea Bridge In Tamil Nadu2
దేశంలో తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సముద్ర వంతెన.. ప్రారంభించిన మోదీ

సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యటనలో భాగంగా రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్‌ రైల్వేసీ బ్రిడ్జిని ప్రారంభించారు. సముద్రంలో బ్రిడ్జి కింద నౌకలు రాకపోకలు సాగేలా ఈ వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే బ్రిడ్జీ నిర్మాణం జరిగింది. సముద్రమట్టానికి 22 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జీ పొడవు 2.2 కిలోమీటర్లు. దీని వ్యయం రూ. 535 కోట్లు. 2020లో రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది.‌Rameswaram, Tamil Nadu: PM Narendra Modi inaugurates New Pamban Bridge - India’s first vertical lift sea bridge and flags off Rameswaram-Tambaram (Chennai) new train service, on the occasion of #RamNavami2025 pic.twitter.com/6ts8HNdwqy— ANI (@ANI) April 6, 2025దేశంలో మరో ఇంజనీరింగ్‌ అద్భుతం ప్రారంభమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వ ర్టీకల్‌ లిఫ్ట్‌(Vertical Lift) (నిలువునా పైకి లేచే) వంతెనను అందుబాటులోకి వచ్చింది.శ్రీరామనవమి పర్వదినాన ప్రధాని మోదీ తొలి వర్టీకల్‌ లిఫ్ట్‌ను ప్రారంభించారు.భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవటంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీనిని జాతికి అంకితం చేశారు. దూర ప్రయాణాన్ని తగ్గించేందుకు.. 1914లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం తమిళనాడులోని మండపం (సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం) నుంచి పంబన్‌ (రామేశ్వరం దీవి ప్రారంభ చోటు) వరకు రైలు వంతెనను నిర్మించింది. ఆ సమయంలోనే వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్‌ లిఫ్ట్‌ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్‌లు విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవల్‌ క్రాసింగ్‌ రైలు గేటు తరహాలు పైకి లేస్తాయి.దీంతో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు. సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పుపట్టి బలహీనపడింది. దీంతో రోలింగ్‌ లిఫ్ట్‌కు బదులుగా వ ర్టీకల్‌ లిఫ్ట్‌తో కొత్త వంతెనను నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్‌ లేకపోతే నౌకలు రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మనదేశ చిట్టచివరి భూభాగం ధనుషో్కడి ఆవలి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల 150 కి.మీ. అదనపు దూరాభారం అవుతుంది. వంతెన ప్రత్యేకతలు..వంతెన నిర్మాణ వ్యయం రూ.540 కోట్లు. పొడవు 2.10 కి.మీ.పిల్లర్లతో కూడిన పైల్స్‌ సంఖ్య 333సముద్రగర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లర్లు. వీటికోసం వాడిన స్టెయిన్‌లెస్‌ స్టీలు 5,772 మెట్రిక్‌ టన్నులు (రీయిన్‌ఫోర్స్‌మెంట్‌), స్ట్రక్చరల్‌ స్టీల్‌ 4,500 మెట్రిక్‌ టన్నులు.సిమెంటు వినియోగం 3.38 లక్షల బస్తాలు. 25,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పైకి లేచే భాగం బరువు 660 మెట్రిక్‌ టన్నులు. స్పెయిన్‌ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. ఆ దేశానికి చెందిన టిప్స సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని వంతెనను డిజైన్‌ చేయించారు. రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ దీనిని నిర్మించింది. ప్రపంచంలో సముద్రపు నీరు, ఉప్పు గాలి ప్రభావంతో ఇనుము అతి వేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామీ. ఆ తర్వాత పంబన్‌ ప్రాంతమే. దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్‌తో కూడిన రంగు డబుల్‌ కోట్‌ వేశారు. కనీసం 35 సంవత్సరాల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూస్తే మరికొంతకాలం తప్పు పట్టదు.పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే రెండు భాగాలు రెక్కాల్లా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5.20 నిమిషాల్లో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. ఈ వంతెనపై రైళ్లను గంటకు 80 కి.మీ. వేగంతో నడిపే వీలుంది. కానీ, రైల్వే సేఫ్టీ కమిషనర్‌ 74 కి.మీ. వేగానికి అనుమతించారు. పాత వంతెనపై గరిష్ట వేగం గంటకు 10 కి.మీ. మాత్రమే. నిర్మాణ పనులు 2019లో మొదలయ్యా­యి. కొవిడ్‌ వల్ల కొంతకాలం ఆలస్యమైనా, మొత్తంగా 2 సంవత్సరాల్లోనే పూర్తిచేశారు. 2022 డిసెంబర్‌లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లిఫ్టు టవర్లకు 310 టన్నుల బరువు తూగే భారీ స్టీల్‌ దిమ్మెలు రెండు వైపులా కౌంటర్‌ వెయిట్స్‌గా ఏర్పాటు చేశారు. కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవటం మొదలుకాగానే కౌంటర్‌ వెయిట్స్‌ మరోవైపు దిగువకు జారటం ద్వారా వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి. దీంతో 5 శాతం కరెంటు మాత్రమే ఖర్చవుతుంది. లిఫ్ట్‌ టవర్‌ పైభాగంలో ప్రత్యేకంగా స్కాడా (సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌) సెంటర్‌ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్‌లో లోపాలను చూపుతుంది. రైల్వేలో సీనియర్‌ ఇంజనీర్, విజయనగరం జిల్లాకు చెందిన నడుకూరు వెంకట చక్రధర్‌ ఈ వంతెన నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దాని ఇన్‌చార్జిగా ఉన్నారు. 1964 డిసెంబర్‌ 22న పెను తుఫాను కారణంగా 25 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డ అలలు, బలమైన గాలులతో పంబన్‌ వంతెన ధ్వంస­మైంది. రాత్రి 11.50 సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న 653 నంబర్‌ రైలు కొట్టుకుపోయి అందులోని 190 మంది ప్రయాణికులు మృతి చెందారు. కానీ, వంతెనలోని షెర్జర్‌ రోలింగ్‌ లిఫ్ట్‌ భాగం మాత్రం కొట్టుకుపోకుండా నిలిచింది. మెట్రో మ్యాన్‌గా పిలుచుకుంటున్న ఈ. శ్రీధరన్‌ ఆధ్వర్యంలో 46 రోజుల్లోనే వంతెనను పునరుద్ధరించారు.Delighted to be in Rameswaram on the very special day of Ram Navami. Speaking at the launch of development works aimed at strengthening connectivity and improving 'Ease of Living' for the people of Tamil Nadu. https://t.co/pWgStNEhYD— Narendra Modi (@narendramodi) April 6, 2025

Ex DYCM Amjad Basha Brother Ahmed Basha Arrest3
కూటమి కుట్ర.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్‌

సాక్షి, వైఎస్సార్‌: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌ చేరుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసిన చంద్రబాబు సర్కార్‌.. అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా సోదరుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో అరెస్ట్‌కు ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగానే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్ట్‌ చేసింది. అహ్మద్‌ బాషా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. అయితే, అహ్మద్‌ బాషా గతంలో రాజీ పడిన ఓ కేసును కూటమి ప్రభుత్వం తిరగదోడింది. ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇక, సదరు కేసులో ఇరు వర్గాలు ఇప్పటికే రాజీపడటం గమనార్హం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా అహ్మద్‌ను ఇప్పుడు అరెస్ట్‌ చేసింది.

IPL 2025 CSK VS DC: After Sehwag, Axar Patel Is The Only Delhi Franchise Captain To Win First 3 IPL Matches4
IPL 2025: అప్పుడు సెహ్వాగ్‌.. ఇప్పుడు అక్షర్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఏకైక అజేయ జట్టుగా నిలిచింది. గడిచిన 16 సీజన్లలో ఢిల్లీ ఆడిన తొలి మూడు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. 2009 సీజన్‌లో ఆ జట్టు వీరేంద్ర సెహ్వాగ్‌ నేతృత్వంలో వరుసగా తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. తాజాగా సెహ్వాగ్‌ రికార్డును అక్షర్‌ సమం చేశాడు. ఈ సీజన్‌తోనే ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అక్షర్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తన జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను వారి అడ్డాలో (చెపాక్‌ స్టేడియం) ఓడించింది. ఢిల్లీ ఫ్రాంచైజీ చరిత్రలో అక్షర్‌కు ముందు సెహ్వాగ్‌ (2008), గంభీర్‌ (2010) మాత్రమే సీఎస్‌కేను వారి సొంత మైదానంలో ఓడించారు. నిన్న (ఏప్రిల్‌ 5) మధ్యాహ్నం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సీఎస్‌కేను 25 పరుగుల తేడాతో ఓడించింది.కేఎల్‌ రాహుల్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనలో సీఎస్‌కే తడబడింది. ఢిల్లీ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. ధోని జిడ్డు బ్యాటింగ్‌తో (26 బంతుల్లో 30; ఫోర్‌, సిక్స్‌) సీఎస్‌కే విజయావకాశలను దెబ్బ తీశాడు. మరో ఎండ్‌లో త్రీడి ప్లేయర్‌ విజయ్‌ శంకర్‌ (54 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) కూడా నిదానంగా ఆడి సీఎస్‌కే పరాజయానికి కారకుడయ్యాడు. ఢిల్లీ బ్యాటర్లలో జేక్‌ ఫ్రేజర్‌ డకౌట్‌ కాగా.. అభిషేక్‌ పోరెల్‌ 33, అక్షర్‌ పటేల్‌ 21, సమీర్‌ రిజ్వి 20, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 24 (నాటౌట్‌), అశోతోష్‌ శర్మ 1, విప్రాజ్‌ నిగమ్‌ 1 (నాటౌట్‌) పరుగులు చేశారు.సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్‌ అహ్మద్‌, మతీశ పతిరణ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 74 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో నడిచింది. ఈ దశలో విజయ్‌ శంకర్‌, ధోని గెలుపు ప్రయత్నాలు ఏమాత్రం చేయకుండా వికెట్‌ కాపాడుకునే పని పడ్డారు. ధోని ఏకంగా 18 బంతుల తర్వాత తన తొలి సిక్సర్‌ను కొట్టాడు. విజయ్‌ శంకర్‌ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనే అతి నిదానమైన హాఫ్‌ సెంచరీ (43 బంతుల్లో) చేశాడు. చివర్లో విజయ్‌ శంకర్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో చెత్తగా ఆడిన ధోనిని సొంత అభిమానులు సైతం విసుక్కున్నారు. ధోని ఇక తప్పుకోవడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ (4-0-27-1), విప్రాజ్‌ నిగమ్‌ (4-0-27-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ముకేశ్‌ కుమార్‌, కుల్దీప్‌ తలో వికెట్‌ తీసి పర్వాలేదనిపించారు. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర 3, డెవాన్‌ కాన్వే 13, రుతురాజ్‌ 5, శివమ్‌ దూబే 18, రవీంద్ర జడేజా 2 పరుగులు చేశారు. ఈ ఓటమితో సీఎస్‌కే ఖాతాలో హ్యాట్రిక్‌ పరాజయాలు చేరాయి. తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందిన ఈ జట్టు ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ చేతుల్లో ఓడింది. మరోవైపు అక్షర్‌ నేతృత్వంలోని ఢిల్లీ వరుసగా లక్నో, సన్‌రైజర్స్‌, సీఎస్‌కేపై విజయాలు సాధించింది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (ఏప్రిల్‌ 10) తలపడనుండగా.. సీఎస్‌కే పంజాబ్‌ కింగ్స్‌ను (ఏప్రిల్‌ 8) ఢీకొట్టనుంది.

Brondby Garden City In Denmark Most Beautiful Village5
భలే బతుకు చక్రాలు..! చూస్తే మతిపోవాల్సిందే..

సాధారణంగా ఇల్లస్థలాలు చతురస్రంగానో దీర్ఘచతురస్రంగానో చూస్తుంటాం. కానీ డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌ నగర శివారు ప్రాంతానికి వెళ్తే, పచ్చదనంతో నిండిన పెద్దపెద్ద చక్రాలు కనువిందు చేస్తాయి. ఒక్కో చక్రంలో 16 ఇళ్లు సకల సౌకర్యాలతో, ఆవాసయోగ్యంగా అగుపిస్తాయి. ‘బ్రాండ్‌బై గార్డెన్‌ సిటీ’ అనే ఈ ప్రత్యేకమైన కమ్యూనిటీ.. ప్రకృతి జీవనానికీ దగ్గరగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు అందరి మనసుల్ని దోచేస్తుంటాయి. 1964లో ఎరిక్‌ మైగిండ్‌ అనే భవన నిర్మాణకర్త ఆలోచనల్లోంచి ఈ లేఔట్‌ పుట్టిందట. ఇలాంటి పచ్చని చక్రాలు ఈ ప్రదేశంలో చాలానే ఉంటాయి. ప్రతి సర్కిల్‌ మధ్యలో పార్కింగ్‌ స్థలం ఉంటుంది. సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి నిర్మాణాలు మరింత మేలు చేస్తాయని స్థానికుల నమ్ముతారు. చక్రంలోనే ప్లాట్‌ చూడటానికి కట్‌ చేసిన కేకుముక్కలా ఉంటుంది. అయితే ఈ అందమైన ఇళ్ల నిర్మాణాలను డ్రోన్‌ వ్యూలో చూసిన వారు ఎవరైనా ‘అబ్బా భలే ఉంది, ఇలాంటి చోట ప్రశాంతంగా బతకొచ్చు’అంటుంటారు. అయితే కొందరు ‘చూడటానికి బాగున్నా, నివాసానికి అసౌకర్యంగా ఉంటుంది, అగ్ని ప్రమాదాలు లాంటివి జరిగినప్పుడు తప్పించుకోవడం కష్టమవుతుంది’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అతిచిన్న అంతర్జాతీయ వారధి..!)

You Can Save Rs 5000 Per Month And Get Rs 8 Lakh Check The Post Office Scheme6
నెలకు ₹5000 అదాతో రూ.8 లక్షలు చేతికి

ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత ఆదా చేయాలని చూస్తారు. అయితే డబ్బు సురక్షితంగా ఉంటాలంటే?, మంచి రాబడి పొందాలంటే?.. తప్పకుండా పోస్టాఫీస్ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇందులో ఒకటి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్'. ఈ స్కీమ్ ద్వారా ఎంత వడ్డీ వస్తుంది. ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు నెలకు 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 8 లక్షల రిటర్న్స్ పొందవచ్చు. ఎలా అంటే.. మీరు నెలకు రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే.. ఏడాదికి రూ. 60వేలు అవుతుంది. మీకు ఈ స్కీములో 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఇలా ఐదేళ్లు ఇన్వెస్ట్ చేస్తుంటే.. మీ మొత్తం రూ. 3లక్షలు అవుతుంది. దీనికి వడ్డీ కింద రూ. 56,830 లభిస్తాయి.మీరు ఈ స్కీమ్ కింద రూ. 5000.. పదేళ్లు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి రూ.6 లక్షలు అవుతుంది. ఈ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ మొత్తం రూ. 2,54,272 అవుతుంది. దీని ప్రకారం 10 సంవత్సరాల కాలంలో మీ మొత్తం డిపాజిట్ చేసిన మొత్తం రూ. 8,54,272 అవుతుంది. ఇలా పదేళ్లలో రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తూ రూ. 8లక్షల కంటే ఎక్కువ పొందువచ్చు.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్గత సంవత్సరం 2023లో.. ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ పెరగడం వల్ల పెట్టుబడిదారులకు లభించే రిటర్న్స్ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ వడ్డీ చివరి సవరణ 29 సెప్టెంబర్ 2023న జరిగింది.50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చుమీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడిని రూ.100 నుంచి ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు, కానీ మీరు ఈ వ్యవధి పూర్తయ్యేలోపు ఖాతాను మూసివేయాలనుకుంటే.. క్లోజ్ చేసుకోవచ్చు. ఇందులో లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ అకౌంట్ ఒక ఏడాది పాటు యాక్టివ్‌గా ఉన్న తరువాత.. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. దీనిపై వడ్డీ రేటు 2 శాతం కంటే ఎక్కువ.

TPCC President Mahesh Kumar Strong Counter To Bandi Sanjay7
బండి సంజయ్‌కు టీపీసీసీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

హైదరాబాద్: కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ కు టీపీసీసీ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది. నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, బండి సంజయ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.‘ దమ్ముంటే బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్లో చేర్చేలా చట్టబద్ధత కోసం ప్రధానిని ఒప్పించే దమ్ముందా?,* ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బిజెపి నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ పెద్దలకు గులాం గిరి చేసిన పనులు మర్చిపోయావా బండి సంజయ్. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర నీది నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. ఏదైనా సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల వలె స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ బిఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే రహస్య మిత్రులు బిఆర్ఎస్ తో చీకటి ఒప్పందం. బండి సంజయ్ లో రోజురోజుకు అభద్రత భావం పెరిగిపోతుంది. మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా కనీసం టిఫిన్ కూడా చెయ్యడు. సొంత పార్టీ కార్యకర్తలే బండి సంజయ్ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. అధ్యక్ష పదవి రాదని తెలిసి బండి సంజయ్ ఆగమాగం అయితుండు. గుర్తింపు కోసమే తాను కేంద్రమంత్రిని అని మర్చిపోయి దిగజారి బండి సంజయ్ మాట్లాడుతుండు. బీజేపీలో ఉనికి కోసం బండి సంజయ్ ఆరాటం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి బండి సంజయ్ కి కనిపించకపోవడం విడ్డూరం. సుదీర్ఘ కాలం అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం చేసుకోలేని బీజేపీకి కాంగ్రెస్ హై కమాండ్ గురించి మాట్లాడే హక్కే లేదు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించి బట్టే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం లభించిందని అవగాహన లేకుండా బండి మాట్లాడుతున్నారు. హెచ్ సీయూ అంశం ఉన్నత న్యాయ స్థాన పరిదిలో ఉంది. ప్రభుత్వం కమిట్ వేసింది. రాజకీయ అవసరాల కోసం బండి సంజయ్ మాట్లాడడం సమంజసం కాదు. మైనార్టీ హక్కుల కోసం నిలబడి కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు బిల్లు పై నిర్ణయం తీసుకుంది.కార్పొరేట్ సంస్థలను నయన భయానా బెదిరించి నిధులు రాబట్టుకున్న బీజేపీ నంబర్ వన్ గా నిలిచింది.సన్న బియ్యం బీజేపీ ఇస్తుంటే దేశం మొత్తం ఇవ్వచ్చు కదా?, సన్న బియ్యంతో తెలంగాణలో నిరుపేదలకు అసలైన పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశ చరిత్రలో నిలిచిపోయే కుల గణన, బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ సన్న బియ్యంను కాంగ్రెస్ హయంలో అమలు అయ్యాయి’ అని స్పష్టం చేశారు.

Kuno Park Cheetah Responds Drinks Water Offered8
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్‌!

గాంధీనగర్‌: ఎండా కాలంలో దాహంతో ఉన్న చీతాలకు నీరు అందించిన కారణంగా ఓ డ్రైవర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌లో చోటుచేసుకుంది. అదేంటీ.. నీరు పోసినందుకు ఎందుకు ఉద్యోగం పోయిందనుకుంటున్నారా? అసలు ట్విస్ట్‌ అక్కడే ఉంది.వివరాల ప్రకారం.. కూనో పార్కులో చీతా జ్వాల దాని పిల్లలు ఇటీవల ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయి. పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులు చీతాలపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ క్రమంలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న జ్వాల (చిరుత) దాని నాలుగు పిల్లలను గమనించిన అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్.. వాటికి నీరు అందించాడు. ఓ క్యానులో నీటిని తీసుకొచ్చి.. పాత్రలో నీటిని నింపి వాటిని తాగమంటు పిలిచాడు. దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.A heartwarming video from Madhya Pradesh's Kuno National Park shows a female cheetah and her four cubs being offered water by a member of the monitoring team. pic.twitter.com/SN9Q4e8vxq— NDTV (@ndtv) April 6, 2025ఈ వీడియో అటవీ శాఖ అధికారులు దృష్టికి చేరింది. ఆ డ్రైవర్‌పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో..‘చీతాలకు నీరు అందించాలని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ జీవాలు సహజంగానే ముప్పు కలిగించేవి కావని తెలుసుకుంటున్నారు. కానీ, ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని వారంతా గ్రహించారు. అందుకే, వన్యప్రాణులతో (చీతాలతో) స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, ఇది ఏ మాత్రం పద్ధతి కాదు. ఇలాంటి చర్యలు వాటి మనుగడకే ప్రమాదం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.Historic moment in Kuno National Park! ✨ Cheetah Jwala and her 4 cubs spotted thriving in the wild for the first time! A true milestone for India’s cheetah conservation efforts. Witness the legacy of speed and survival unfold in Kuno!#Cheetah #KunoCheetahSafari #FlyingCatSafari pic.twitter.com/Bs5ThPnqhI— Flying Cat Safari (@KunoSafari) February 28, 2025మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు డ్రైవర్‌ చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు. ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని.. మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి అంటూ కామెంట్స్‌ చేశారు. @KunoNationalPrk female #cheetah #Jwala along with her cubs hunted 6 goats in Umrikalan village in Agra area of Vijaypur - villagers made a video, tracking team of Kuno National Park was also on the spot.. @Ajaydubey9#cheetah #kuno #wildlifephotography #viralvideo pic.twitter.com/RgJHqJFXgS— UTTAM SINGH (@R_UTTAMSINGH) April 4, 2025

Hcu Land Row: Ktr Open Letter To The People Of Telangana9
హెచ్‌సీయూ వివాదం.. కేటీఆర్‌ బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలి, హెచ్‌సీయూ రక్షణకు చేతులు కలపాలంటూ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. హెచ్‌సీయూ భూముల వివాదం నేపథ్యంలో రేవంత్‌ సర్కార్‌ తీరును లేఖలో ఎండగట్టారు. 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడింది. 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదాం అంటూ కేటీఆర్‌ పిలుపునిచ్చారు.‘‘ప్రభుత్వం ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం పర్యావరణం నాశనం చేసే ప్రణాళికలు కొనసాగిస్తోంది. విద్యార్థుల నిరసనకు సలాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా అడవి రక్షణకు పోరాడుతున్నారు. విద్యార్థులపై అపవాదులు, యూనివర్సిటీని తరలించే బెదిరింపులు ప్రభుత్వ రియల్ ఎస్టేట్ మనస్తత్వానికి నిదర్శనం’’ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.ఎకో పార్క్ పేరుతో సరికొత్త మోసం. అడవిని కాపాడే బదులు భూమి ఆక్రమణకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నిరసనలు కొనసాగితే హెచ్‌సీయూని "ఫోర్త్ సిటీ"కి తరలిస్తామని హెచ్చరిక తప్పు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులకు మద్దతుగా నిలవాలి. కంచ గచ్చిబౌలి, యూనివర్సిటీని కాపాడుతామని పార్టీ నుంచి హామీ హామీ ఇస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి, భూమి విక్రయాన్ని రద్దు చేయాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Jr Ntr Lean Look Latest And Reason Behind This10
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా

చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ (Ntr) ఓ సినిమా ఈవెంట్ లో కనిపించాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన మ్యాడ్ స్క‍్వేర్ (Mad Square) సక్సెస్ మీట్ కి హాజరయ్యాడు. చాలా హుషారుగా కనిపించాడు. తన కొత్త సినిమా సంగతుల్ని కూడా బయటపెట్టాడు. అంతా బాగానే ఉంది కానీ బక్కగా మారిపోవడం మాత్రం అభిమానులకు షాకిచ్చింది. ఇంతకీ ఏంటీ కారణం?'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఫేమ్ సొంతం చేసుకున్న తారక్.. 'దేవర'తో (Devara Movie) బ్లాక్ బస్టర్ కొట్టాలనుకున్నాడు. కానీ ఓ మాదిరి వసూళ్లే వచ్చాయి. మొన్నీమధ్య జపాన్ లోనూ ఈ మూవీ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీస్తున్న ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్)ఈ మూవీ షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది. కాకపోతే ఎన్టీఆర్ ఇంకా జాయిన్ కాలేదు. త్వరలో సెట్ లోకి వెళ్లబోతున్నాడు. ఈ సినిమాలో పావుగంట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందని, దీనికోసమే సన్నగా మారిపోయాడని తెలుస్తోంది. దాని షూటింగ్ పూర్తయిన తర్వాత యధావిధిగా తన పాత లుక్ లోకి వచ్చేస్తాడని అంటున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్.. తారక్ సినిమాతో ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అనుకుంటున్నారు. మరి చెప్పిన టైంకి రిలీజ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇది పూర్తయిన తర్వాత తారక్.. దేవర 2 చేస్తాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' గ్లింప్స్‌ వచ్చేసింది.. సిక్సర్‌ కొట్టిన రామ్‌ చరణ్‌)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement