Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Sri Rama Navami Wishes To Telugu People1
తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు.ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కల్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీసీతారాముల అనుగ్రహం లభించాలని వైఎస్‌ జగన్‌ అభిలషించారు. సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. రామ‌చంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆద‌ర్శ‌నీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. రామ‌చంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆద‌ర్శ‌నీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.#SriRamaNavami— YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2025

Police Case File Against Tdp Followers In Pithapuram Constituency2
కూటమిలో కుంపట్లు రాజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు.. టీడీపీ శ్రేణులపై కేసులు

కాకినాడ జిల్లా,సాక్షి: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమెల్సీ నాగబాబు పర్యటన కూటమిలో కుంపట్లు రాజేస్తోంది. పిఠాపురంలో వరుస పర్యటనలు చేస్తున్న నాగబాబును టీడీపీ శ్రేణులు అడుగడునా అడ్డుకుంటున్నారు. ఈ తరుణంలో పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.శనివారం ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో భాగంగా గొల్లప్రోలు మండలం, చిన్న జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలు జనసేనకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆహ్వానించడం లేదంటూ ఆయన అభిమానులు,టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఈ తరుణంలో తనను అడ్డుకుని మోటార్ సైకిల్ అద్దాలు పగలగొట్టారని టీడీపీ కార్యకర్తలపై జనసేన నేత మొయిళ్ళ నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సంఘటనలో తమ విధులకు ఆటంకం కల్పించారని టీడీపీ కార్యకర్తలపై పిఠాపురం అడిషనల్ ఎస్సై జానీ భాష మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై గొల్లప్రోలు పోలీసులు వేరు వేరుగా కేసులు నమోదు చేశారు.అంతకుముందు పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీ నాగబాబు రాగా.. టీడీపీ, జనసేన కార్యకర్తలు బలాబలాలు ప్రదర్శించుకున్నారు. జై వర్మ, జై టీడీపీ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేయగా.. ప్రతిగా జై జనసేన, జై పవన్ అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ తరుణంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పిఠాపురం కూటమిలో నాగబాబు పర్యటన కుంపట్లు రాజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Ex DYCM Amjad Basha Brother Ahmed Basha Arrest3
కూటమి కుట్ర.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్‌

సాక్షి, వైఎస్సార్‌: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌ చేరుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసిన చంద్రబాబు సర్కార్‌.. అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా సోదరుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో అరెస్ట్‌కు ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగానే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్ట్‌ చేసింది. అహ్మద్‌ బాషా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. అయితే, అహ్మద్‌ బాషా గతంలో రాజీ పడిన ఓ కేసును కూటమి ప్రభుత్వం తిరగదోడింది. ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇక, సదరు కేసులో ఇరు వర్గాలు ఇప్పటికే రాజీపడటం గమనార్హం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా అహ్మద్‌ను ఇప్పుడు అరెస్ట్‌ చేసింది.

IPL 2025: Punjab Captain Shreyas Iyer Comments After Losing To RR4
IPL 2025: ఈ నష్టం మంచిదే: శ్రేయస్‌ అయ్యర్‌

ఐపీఎల్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ జోరుకు అడ్డుకట్ట పడింది. వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించిన అతను.. తొమ్మిదో మ్యాచ్‌లో ఓటమి చవి చూశాడు. ఈ క్రమంలో అత్యంత అరుదైన ట్రిపుల్‌ హ్యాట్రిక్‌ను (వరుసగా 9 మ్యాచ్‌ల్లో విజయం) మిస్‌ అయ్యాడు. 2024 సీజన్‌లో మొదలైన శ్రేయస్‌ జైత్రయాత్ర (కేకేఆర్‌ కెప్టెన్‌గా).. ఈ సీజన్‌లో నిన్నటి మ్యాచ్‌తో ముగిసింది. ఈ సీజన్‌లో పంజాబ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో జట్టును విజయవంతంగా నడిపించాడు. నిన్న (ఏప్రిల్‌ 5) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను సీజన్‌ తొలి ఓటమి పలకరించింది.ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ తొలుత బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని.. ఆతర్వాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ​్‌ చేసిన పంజాబ్‌.. రాయల్స్‌ను 205 పరుగుల భారీ స్కోర్‌ చేయనిచ్చింది. అనంతరం​ భారీ లక్ష్య ఛేదనలో తడబడి 155 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా రాయల్స్‌ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో రాయల్స్‌కు రెండు వరుస పరాజయాల తర్వాత ఇది వరుసగా రెండో విజయం.రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు), రియాన్‌ పరాగ్‌ (25 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. నేహల్‌ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్‌) పంజాబ్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఛేదనలో రాయల్స్‌ బౌలర్లు జోఫ్రా ఆర్చర్‌ (4-0-25-3), సందీప్‌ శర్మ (4-0-21-2), మహీశ్‌ తీక్షణ (4-0-26-2) చెలరేగిపోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.మ్యాచ్‌ అనంతరం శ్రేయస్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నప్పుడు 180-185 పరుగులు వస్తాయని అనుకున్నాను. ఇక్కడ ఛేజింగ్‌కు ఆ స్కోర్‌ అయితే ఓకే. కానీ మా ప్లాన్స్‌ వర్కౌట్‌ కాలేదు. టోర్నీ ప్రారంభంలోనే ఈ తప్పిదం జరిగినందుకు సంతోషంగా ఉన్నాను. ఇది మంచి పిచ్. బంతి నెమ్మదిగా కదులుతుండింది. మా బౌలర్లు కూడా ఎక్కువ వేగంతో బంతులు వేయలేదు.ఛేదన ఆరంభంలో నిదానంగా ఆడైనా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. వరుసగా వికెట్లు కోల్పోయాము. ఒత్తిడిలో నేహల్ అద్భుతంగా ఆడాడు. అతను కొంత సమయం తీసుకున్నా ఆతర్వాత బౌలర్లపై ఎదురుదాడి చేయగలిగాడు. ఈ ఆట నుండి చాలా నేర్చుకోవచ్చు. ఈ నష్టం మంచిదేనని భావిస్తున్నాను. ముందుగా ఊహించినట్లుగా ఇవాళ మంచు కూడా పడలేదు. బౌలింగ్, బ్యాటింగ్‌లో మేము అమలు చేయలేకపోయిన విషయాలను పరిశీలించుకోవాలి.

Pamban Bridge will BJPs Fortunes Change in Tamil Nadu5
Tamil Nadu: బీజేపీ బలోపేతానికి ‘పంబన్‌’ వారధి?

న్యూఢిల్లీ: ‍ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తమిళనాడు ‍ప్రజలకు పంబన్‌ బ్రిడ్జి(Pamban Bridge) రూపంలో భారీ కానుకను అందించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ ఈ అద్భుత వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ దక్షిణ భారతదేశంలో తన పట్టును బలోపేతం చేసుకునేందుకే ఈ వంతెనను వ్యూహాత్మకంగా ప్రారంభిస్తున్నదనే వాదన వినిపిస్తోంది. 2.08 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన పంబన్ వంతెన రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది.పంబన్ బ్రిడ్జి భారతదేశంలోని మొట్టమొదటి సముద్రపు వంతెన. ఓడల రాకపోకలకు అనుగుణంగా ఈ బ్రిడ్జి గేట్లు తెరుచుకుంటాయి. నూతనంగా నిర్మించిన ఈ వంతెన మరింత ధృడంగా ఉండనుంది. ఇది తమిళనాడు(Tamil Nadu) ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేయనుంది. అలాగే పర్యాటకరంగానికి ప్రోత్సాహాన్ని అందించనుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామేశ్వరంనకు రాకపోకలు సాగించేందుకు ఈ వంతన ఉపయోగపడనుంది. శ్రీరాముని జన్మదినోత్సవమైన రామ నవమిని దక్షిణ భారతదేశంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రామేశ్వరంనకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు.రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు లంకను చేరుకునేందుకు ఇక్కడ స్వయంగా వారధి నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాగా తమిళనాడు ప్రజలలో తన హిందూత్వ ఎజెండాను బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు బీజేపీ పంబన్‌ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించి, జాతికి అంకితం చేస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. 2026లో తమిళనాడులో ఎన్నికల జరగనున్న దృష్ట్యా బీజేపీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. 234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు శాసనసభకు జరిగే ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ ‍ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.తమిళనాడు రాజకీయాలలో(Tamil Nadu politics) డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యం కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంలో బలమైన పట్టు ఉన్న బీజేపీ, దక్షిణాదిలో ఇంకా గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయితే పంబన్ బ్రిడ్జి వంటి పెద్ద ప్రాజెక్టులను చేపట్టి, తద్వారా తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బీజేపీ తమిళనాడు ప్రజలకు తెలియజెప్పాలనుకుంటోంది. తమిళనాడులో రెండవ అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఆ కూటమి ఎన్నికల్లో విఫలం కావడంతో, బీజేపీకి ఏఐడిఎంకే దూరమయ్యింది. ఇప్పుడు 2026 ఎన్నికలకు ముందు బీజేపీ మరోసారి అన్నాడీఎంకేతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తోందని భోగట్టా. అయితే బీజేపీ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో కాలమే చెబుతుంది. ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్‌

Minister Band Sanjay Serious Comments On Congress Govt6
HCU విషయంలో కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ సూచనలేంటి?: బండి సంజయ్‌

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో రబ్బర్‌ స్టాంప్‌ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పాలన మీద పట్టులేకుండా పోయింది. రాష్ట్ర మంత్రులను ఏఐసీసీ నిర్ణయించడం ఏంటి? అని ప్రశ్నించారు. అలాగే, ఎంఐఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్‌ తాజాగా కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీలో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటు వేసింది. తెలంగాణాను మజ్లీస్‌కు అంటగట్టడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ యత్నిస్తున్నాయి. మజ్లీస్ కబంధ హస్తాల నుండి తెలంగాణాను కాపాడమే మా లక్ష్యం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం బీజేపీదే. రేషన్ బియ్యానికి కేంద్రం 37 రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్రం 10 రూపాయలు ఖర్చు చేస్తోంది. తెలంగాణాలో ఇచ్చే రేషన్ బియ్యం మోదీ ఇస్తున్నవే.మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మేము బియ్యానికి పది రూపాయలు ఖర్చు బెడుతున్నామని చెబుతున్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది. ముఖ్యమంత్రికి పాలన మీద పట్టు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంపుగా మారాడు. రబ్బర్ స్టాంపు పాలన తెలంగాణాలో కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులను ఏఐసీసీ నిర్ణయించడం ఏంటి?. హెచ్‌సీయూ విషయంలో మంత్రులు ఏం చేయాలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ సూచనలు ఇవ్వడం ఏంటి?. తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అవినీతి రహిత రాష్ట్రంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Jio extends special offer plans to watch free IPL on JioHotstar7
ఫ్రీగా జియో హాట్‌స్టార్‌.. ఆఫర్‌ ప్లాన్ల పొడిగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. ఈ ఐపీఎల్-2025 18వ సీజన్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ సీజన్‌ ఈసారి కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను జియో లాంచ్ చేసింది.జియో ప్రకటించిన ఆఫర్ల ప్రకారం.. జియో హాట్‌స్టార్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ప్రత్యేక ప్లాన్లను రీఛార్జ్ చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉండేది. అయితే ఈ టోర్నమెంట్ కు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ జియో నిర్ణయం తీసుకుంది. జియో హాట్‌స్టార్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ కోసం కొత్త జియో సిమ్ కొనడం లేదా ప్రత్యేక ప్లాన్లతో ఇప్పటికే ఉన్న ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.జియో హాట్‌స్టార్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్లు 4కే రిజల్యూషన్ లో టీవీ, మొబైల్ రెండింటిలోనూ ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అభిమానులు ఈ సీజన్లోని ప్రతి మ్యాచ్‌ను ఇంట్లో లేదా ప్రయాణంలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై క్వాలిటీ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు.ఫ్రీ జియో హాట్‌స్టార్‌ ప్లాన్లు ఇవే..రూ.100 ప్లాన్‌: ఇది డేటా యాడ్‌ఆన్‌ ప్లాన్‌. దీంతో 5జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్‌ యాక్సెస్‌ లభిస్తుంది.రూ.195 ప్లాన్‌: ఇది జియో క్రికెట్‌ డేటా ప్యాక్‌. దీంతో 15జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్‌ యాక్సెస్‌ లభిస్తుంది.రూ.949 ప్లాన్‌: ఇది 84 రోజుల కాంప్రహెన్సివ్‌ ప్లాన్‌. దీంతో ప్రతిరోజూ 2జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 5జీ ప్రయోజనాలు ఉంటాయి. 84 రోజులపాటు జియో హాట్‌స్టార్‌ యాక్సెస్‌ లభిస్తుంది. అదనంగా జియోక్లౌడ్‌, ఓటీటీ, ఇతర టెలికమ్‌ బెనిఫిట్లు ఆనందించవచ్చు.

Do You know First Hero In Tollywood Who Played Lord Rama, Not NTR And Akkineni8
రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?

ఆలసించిన ఆశాభంగమే! పురజనుల వేడుకోలు వలన కొద్ది రోజులు మాత్రమే హెచ్చింపబడినది. తెనుగు టాకీల కనులారా వీక్షించి జన్మము సార్థకము చేసికొనుడు. అనేకులకు టిక్కెట్లు దొరకక వెనుకకు మరలిపోవలసి వచ్చుచున్నది. – దుర్గా కళా మందిరం, బెజవాడ. (93 ఏళ్ల క్రితం, ఆనాటి పత్రికల్లో వచ్చిన ఒక సినిమా ప్రకటన ఇది).∙∙ ఈ మాటాడు చిత్రమును చూడని వారి జన్మ నిరర్థకము. ఒకవేళ మీకు తెలుగు భాషయందు ప్రవేశము లేకున్నను, ఒక దఫా వచ్చి కనులార గాంచవలసిందే. – సెలక్టు పిక్చర్సు సర్‌క్యూట్స్, బెంగుళూరు. (ఇది కూడా అదే సినిమాకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ ప్రకటన). ఆ సినిమా : శ్రీరామ పాదుకా పట్టాభిషేకము! శ్రీరాముడి పాత్ర ఉన్న తొలి తెలుగు టాకీ చిత్రం. సినిమాల్లో ఇప్పటికీ శ్రీరాముడంటే శ్రీ నందమూరి తారక రామారావు అన్నట్లుగానే ఉంటుంది. ఎన్టీఆర్‌ శ్రీరాముడి పాత్రను పోషిస్తే– ఆయన ఆ పాత్రలో కాక, ఏకంగా శ్రీరాముడిలోనే ఒదిగిపోయారా అన్నట్లుగా ఉంటుందని ఆయన అభిమానులు అంటారు. శ్రీ రాముడిగా ఎన్టీఆర్‌ తొలి సినిమా ‘సంపూర్ణ రామాయణం’ (1958). రెండోది లవకుశ (1963), మూడు రామదాసు (1964), నాలుగు శ్రీరామాంజనేయ యుద్ధం (1975), ఐదు శ్రీరామ పట్టాభిషేకం (1978). ఎన్టీఆర్‌ కంటే ముందు అక్కినేని నాగేశ్వరరావు; ఎన్టీఆర్‌ తర్వాత హరనాథ్, శోభన్‌బాబు, కాంతారావు, రవికుమార్, శ్రీకాంత్, సుమన్, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్, ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రల్లో కనిపించారు. అయితే ఎన్టీఆర్‌ కంటే ముందు, ఏఎన్నార్‌ కంటే కూడా ముందు... తొలిసారి తెలుగు తెర మీద ప్రత్యక్షమైన రాముడొకరు ఉన్నారు. ఆయనే యడవల్లి సూర్యనారాయణ!∙∙ ‘జననానికి’ ముందే ‘పట్టాభిషేకం’తెలుగులో తొలి మాటల చిత్రం (టాకీ) ‘భక్త ప్రహ్లాద’ అయితే రెండో టాకీ చిత్రం ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. రెండూ ఒకే ఏడాది పూర్తయ్యాయి. భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరిలో, శ్రీరామ పాదుకా పట్టాభిషేకం 1932 డిసెంబరులో విడుదలయ్యాయి. ఈ రెండో చిత్రంలోనే రాముడిగా నటించారు యడవల్లి సూర్యానారాయణ. అంటే, ఏఎన్నార్‌ రాముడిగా నటించిన ‘సీతారామ జననం’ (1944) చిత్రానికి పన్నెండేళ్లకు ముందు, ఎన్టీయార్‌ తొలిసారి రాముడిగా నటించిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి 26 ఏళ్లకు ముందే ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’లో రాముడి పాత్రను పోషించి, తెలుగు టాకీ తొలి రాముడిగా ప్రఖ్యాతిగాంచారు యడవల్లి. ∙∙ యువ దర్శకుడి చేతిలో తొలి రాముడు‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రాన్ని బాదామి సర్వోత్తమ్‌ దర్శకత్వంలో సాగర్‌ స్టూడియోస్‌ వారు నిర్మించారు. సీతగా సురభి కమలాబాయి నటించారు. రాముడు అరణ్యవాసం నుండి తిరిగి వచ్చేవరకు, సింహాసనంపై రాముడి పాదుకలను (పాదరక్షలను) ఉంచి భరతుడు రాజ్యపాలన చేయటమే ఈ చిత్ర కథాంశం. బాదామి సర్వోత్తమ్‌ (1910–2005) ఇరవై ఏళ్ల వయసులో ముంబైలోని ‘సాగర్‌ మూవీ టోన్‌’ కంపెనీలో పని చేస్తూ ఆ స్టూడియో వాళ్లు నిర్మించిన అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ సినిమాలలో తొలి టాకీ చిత్రాలకు హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వం వహిస్తే, రెండు భాషల్లోనూ తర్వాతి చిత్రాలకు బాదామి సర్వోత్తమ్‌ దర్శకత్వం వహించారు. ఇరవై రెండేళ్ల వయసుకే ఆయనకు ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. సీతమ్మగా ‘కమలమ్మ’‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రంలో సీతగా నటించే నాటికి సురభి కమలాబాయి వయసు 25 ఏళ్లు. తొలి తెలుగు సినిమా నటి. గాయని. 1931లో హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన ‘భక్త ప్రహ్లాద’లో లీలావతి పాత్రను ధరించారు. రంగస్థల కుటుంబంలో జన్మించిన కమలాబాయి బాల్యంలో కృష్ణుడిగా, ప్రహ్లాదుడిగా నటించారు. కౌమార దశ దాటాక మగ పాత్రలు వేయటం మాని, మహిళల పాత్రలలోకి వచ్చేశారు. కమలాబాయి నటనా ప్రతిభ గురించి విని సాగర్‌ స్టూడియోస్‌ వాళ్లే ఆమెను సగౌరవంగా బొంబాయి ఆహ్వానించారు. ఆ స్టూడియో ఆర్టిస్ట్‌గా కమలాబాయి పదేళ్ల పాటు అక్కడే ఉండి, వారు నిర్మించిన అనేక సినిమాలలో నటించారు. ∙∙ రాముడి పాత్ర ‘సాగర్‌’ ఇచ్చిందేతొలి తెలుగు సినీ రాముడు యడవల్లి సూర్యనారాయణ (1888–1939) కూడా రంగస్థలం నుంచి వచ్చినవారే. సినిమాల్లోకి రాకముందు రంగస్థలంలో ఆయన సూపర్‌ స్టార్‌. వివిధ నాటక సమాజాలతో ఉన్న సత్సంబంధాలున్న వారి ప్రోత్సాహంతో ఆయన కూడా సాగర్‌ మూవీటోన్‌ గ్రూప్‌ వారి ప్రతిష్ఠాత్మక యాక్టర్‌ అయిపోయారు. ‘పాదుకా పట్టాభిషేకంలో’ శ్రీరాముడి పాత్రకు ఎంపికయ్యారు. సినిమాల్లోకి వచ్చేసరికి యడవల్లి వయసు 46 ఏళ్లు. అప్పట్నుంచి మూడేళ్లు సినిమాల్లో ఉండి, తిరిగి నాటక రంగంవైపు వచ్చారు.

Air Cooler And Air Conditioner: Which Is  More Harmful Our Health9
సమ్మర్‌లో ఎయిర్‌ కూలర్స్‌, ఏసీలు వాడేస్తున్నారా..?

ఎండలు బాగా ముదిరాయి. స్థోమత ఉన్నవారు ఎయిర్‌ కండిషనర్స్‌నూ, అంతగా స్థోమత లేనివారు ఎయిర్‌ కూలర్స్‌నూ వాడుతుంటారు. ఏసీల కారణంగా గదిలో ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణంలో మెయింటెయిన్‌ అవుతుండటంతో టు అందులోని కొన్ని ఫిల్టర్లు చాలా చాలా చిన్నగా, అత్యంత సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్‌ పొల్యుటెంట్స్‌) బారి నుంచీ కాపాడతాయి. శబ్దకాలుష్యాన్నీ నివారించి... చెవి, ఇతరత్రా సమస్యలు రాకుండా చూస్తాయి. కానీ వాటివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలూ ఉత్పన్నమవుతాయి. అలాగే ఎయిర్‌ కూలర్స్‌లో, లీజియొన్నెల్లా అనే బ్యాక్టీరియా పెరిగి ‘లీజియొన్నేరిస్‌ డిసీజ్‌’కు గురయ్యే ముప్పు ఉంటుంది. ఏసీలూ, కూలర్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలూ, అవి రాకుండా నివారించే జాగ్రత్తలను తెలుసుకుందాం. ఎయిర్‌ కండిషన్డ్‌ రూమ్‌లో ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి... తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ చాలాసేపు ఏసీలో గడపడం వల్ల ఆ చల్లదనం మూలాన కొందరిలో ఒళ్లునొప్పులు, తలనొప్పితోపాటు తీవ్రమైన నీరసం, నిస్సత్తువగా అనిపించవచ్చు. శ్వాస సమస్యలు : గదిలోని ఏసీగానీ లేదా కారులోని ఏసీగానీ చాలాసేపు ఆన్‌లో ఉండటం, దాంతో గది లేదా కార్‌ డోర్స్‌ / గ్లాసెస్‌ ఎప్పుడూ మూసేసే ఉండటంతో అక్కడి సూక్ష్మజీవులతో పక్కనే ఉన్న ఇతరులకు ఆ సమస్యలు వ్యాపించవచ్చు. కొందరిలో ఆస్తమానూ, పిల్లికూతలనూ ప్రేరేపించవచ్చు. అందువల్ల... ఏసీ గదిలోగానీ లేదా ఏసీ ఆన్‌ చేసి ఉన్న కారులోగానీ అదేపనిగా చాలాసేపు ఉండటం అంత మంచిది కాదు. తేలిగ్గా వడదెబ్బకు గురికావడం : ఎప్పుడూ ఏసీలో ఉండేవారు దానికి అలవాటైపోయి తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. చర్మం పొడిబారడం : చాలాసేపు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గి, చర్మం పొడిబారుతుంది. ఫలితంగా దురదలు వచ్చే అవకాశాలెక్కువ. వీళ్లు చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్లు : ఎక్కువ సేపు ఏసీలో ఉండేవారికి అంతగా దాహంగా అనిపించకపోవడంతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దాంతో ఇలాంటివాళ్లలో కిడ్నీ స్టోన్స్‌ వచ్చే అవకాశాలెక్కువ. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం : కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బ్లడ్‌ ప్రెషర్‌), ఆర్థరైటిస్, న్యురైటిస్‌ (నరాల చివరలు మొద్దుబారినట్లుగా అయిపోయి స్పర్శ అంతగా తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవాళ్లలో ఆ సమస్యలు కాస్త తీవ్రమవుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఏసీలోని ఫిల్టర్స్‌ తరచూ శుభ్రపరుస్తూ ఉండటం ఏసీలోని ఫిల్టర్స్‌ను సబ్బుతో కడిగినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే బిగించడం ఎప్పుడూ ఏసీలో ఉండేవారు సాయంత్రాలూ లేదా రాత్రిపూట స్వాభావికమైన చల్లగాలికి ఎక్స్‌పోజ్‌ అవుతూ ఉండటం. ఏసీ సరిపడక ఏవైనా ఆరోగ్యసమస్యలు వస్తే ఏసీని వాడకపోవడం లేదా గది చల్లబడే వరకు ఉంచి ఆ తర్వాత ఆఫ్‌ చేసుకుని ఫ్యాన్‌ వేసుకోవడం. వాటర్‌ కూలర్‌తో వచ్చే నిమోనియా నివారణ ఇలా... కిందటేడాది వాటర్‌ కూలర్‌ వాడాక దాన్ని మూల పెట్టేసి ఉంచి, ఇప్పుడు ఎండలు ముదరగానే వాడటానికి తీసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గతంలో మిగిలి ఉన్న నీళ్లలో లీజియోనెల్లా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరగవచ్చు.దాంతో ‘లీజియోన్నేరిస్‌ డిసీజ్‌’ అనే ఒక రకం నిమోనియా వచ్చే అవకాశముంది. దీన్నే ‘వాటర్‌కూలర్‌ నిమోనియా’ అని కూడా అంటారు. చాలాకాలం వాడని కూలర్స్‌ తాలూకు పాత తడికల్లోనూ డస్ట్‌మైట్స్‌ ఉండి, నేరుగా ఆన్‌ చేస్తే అది ఆస్తమా బాధితుల్లో సమస్యను ట్రిగర్‌ చేయవచ్చు. మామూలు వ్యక్తులకు సైతం దగ్గు, ఆయాసం వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే బయటకు తీయగానే వాటర్‌కూలర్‌ అడుగున ఏమాత్రం చెమ్మలేకుండా చేసేందుకు ఆరుబయట ఆన్‌ చేసి పెట్టి దాదాపు గంటసేపు అలాగే ఉంచాలి. అడుగున ఒక్క చుక్క నీళ్లు లేకుండా డ్రైగా అయిపోయాకే వాటర్‌ కూలర్‌ వాడటం మొదలుపెట్టాలి.(చదవండి: ఎండకు చర్మం కమిలిపోకూడదంటే..)

Delhi Priyanka Roller Coaster Accident Full Details10
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మరికొన్ని నెలల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్న జంటకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏదో సరదాగా అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లడమే వారి జీవితాన్ని మలుపు తిప్పింది. పార్క్‌లో జరిగిన ప్రమాదంలో తనకు కాబోయే భార్య చనిపోయింది.వివరాల ప్రకారం.. నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంక(24)తో కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో వారిద్దరికీ ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. మరికొన్ని నెలల్లో వారికి పెళ్లి జరిగాల్సి ఉంది. అయితే, ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో ఉన్న ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. కాసేపు అక్కడ తిరిగిన తర్వాత అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. హ్యాపీ మూమెంట్స్‌ ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయింది. దీంతో, ప్రియాంక ఎత్తులో నుంచి కింద పడిపోయింది.దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో, ఒక్కసారిగా నిఖిల్‌ కుప్పకూలిపోయి కన్నీటిపర్యంతమయ్యాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మృతిచెందిన ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ఈఎన్‌టీ రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. Delhi | A 24-year-old woman, Priyanka lost her life after falling from a roller coaster ride at Fun and Food Village in the Kapashera area of Delhi yesterday. She reportedly lost her balance and fell from the ride, sustaining severe injuries. Despite being rushed to a nearby…— ANI (@ANI) April 5, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement