
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయణం, వసంత ఋతువు,చైత్ర మాసం, తిథి: బ.పాడ్యమి పూర్తి(24గంటలు), నక్షత్రం: చిత్త రా.7.40 వరకు తదుపరి స్వాతి, వర్జ్యం: రా.1.55 నుండి 3.41 వరకు,దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.20 వరకు, అమృత ఘడియలు: ప.12.36 నుండి 2.22 వరకు.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం.... ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు.
వృషభం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళాకారులు, విద్యార్థులకు శుభవార్తలు.
మిథునం... రాబడి కంటే ఖర్చులు అధికం. కార్యక్రమాలలో తొందరపాటు. బంధువిరోధాలు. . చోరభయం. వ్యాపారులకు నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కర్కాటకం.... కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. కళాకారులకు చిక్కులు పెరుగుతాయి.
సింహం... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. ధనలబ్ధి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
కన్య... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఖర్చులు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగాలలో చిక్కులు.
తుల... నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతాయి.
వృశ్చికం..... ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. దుబారా ఖర్చులు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో సమస్యలు.
ధనుస్సు... కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దేవాలయ దర్శనాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొంత అనుకూలత..
మకరం... ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. కళాకారులకు పర్యటనలు వాయిదా.
కుంభం... ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో అవరోధాలు. స్నేహితులతో విభేదాలు.ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. మానసిక అశాంతి. కుటుంబంలో చిక్కులు.
మీనం.. అనుకోని ఖర్చులు. అదనపు బాధ్యతలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దేవాలయ దర్శనాలు. ఆరోగ్యసమస్యలు. రాజకీయవేత్తల యత్నాలు ముందుకు సాగవు.