
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించగా, దీన్ని తన కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రకటించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ అనుసంధానిత రిటైల్, ఎంఎస్‌ఎంఈ రుణ రేట్లను 0.25 శాతం తగ్గించినట్టు తెలిపింది.
అదే సమయంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను బీవోబీ ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. ఆటో, వ్యక్తిగత రుణాలు సహా అధిక శాతం రుణాలకు ప్రామాణికమైన ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్ రేటును మార్చకుండా 9 శాతం వద్దే కొనసాగించింది.