
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) ప్రత్యేకంగా రూపొందించిన బ్రూక్ బాండ్ తాజ్ మహల్ ‘చాయ్-బన్సురి’ని ఆవిష్కరించింది. విజయవాడలోని భవానీ ద్వీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈమేరకు చాయ్-బన్సురిని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌ను మైండ్‌షేర్, ఒగిల్వీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్లు హెచ్‌యూఎల్ పేర్కొంది.
ఇదీ చదవండి: యాపిల్‌కు టారిఫ్‌ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశం
ఇందుకోసం ప్రత్యేకంగా టీ కెటిల్‌ను సిద్ధం చేశారు. వేడిగా ఉన్న టీ ఆవిరి ఆ కెటిల్ నుంచి బయటకు వచ్చేప్పుడు బన్సురి (వేణువు)గా శబ్దం చేస్తుంది. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని టీ తయారీతో ముడిపెట్టి హంసధ్వని రాగం క్రియేట్ అయ్యేలా ఈవెంట్‌లో ఏర్పాట్లు చేశారు. హెచ్‌యూఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫుడ్స్ అండ్ రిఫ్రెఫ్‌మెంట్) శివ కృష్ణమూర్తి మాట్లాడుతూ..‘తాజ్ మహల్ టీ ఉత్తమ భారతీయ టీ. గొప్ప భారతీయ శాస్త్రీయ సంగీతానికి పర్యాయపదం. 2023 సెప్టెంబర్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన తాజ్ మేఘ్ సంతూర్‌కు సీక్వెల్‌గా ఈ చాయ్-బన్సురి ఈవెంట్‌ను తీసుకొచ్చాం. దీన్ని కూడా ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.