
గూగుల్ ఎప్పటికప్పుడు యూజర్లకు అవసరమైన ఫీచర్స్ అందించడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే రైతులకు వ్యవసాయ సమాచారాన్ని అందించడానికి మరియు పంట దిగుబడిని పెంచడానికి గూగుల్ అగ్రికల్చరల్ ల్యాండ్‌స్కేప్ అండర్‌స్టాండింగ్ (ALU) టూల్ పరిచయం చేయనుంది.
అగ్రికల్చరల్ ల్యాండ్‌స్కేప్ అండర్‌స్టాండింగ్ టూల్ అనేది.. పంట రకం, పొలం పరిమాణం (ఫీల్డ్ సైజ్), నీటి లభ్యత, మార్కెట్‌లకు సంబంధించిన అనేక వివరాలను అందిస్తుంది. ఇప్పటికే అమెరికా, జర్మనీ వంటి దేశాలు వ్యవసాయంలో ఏఐను ఉపయోగిస్తున్నారు. భారత్ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి సిద్దమవుతోంది.
రైతులు సకాలంలో పంటలు పండించడానికి, మంచి దిగుబడిని పొందడానికి నేల నాణ్యతను, వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల గురించి రైతుల కోసం ఆరా తీసేందుకు ప్రభుత్వం కిసాన్-ఈ-మిత్ర, ఏఐ పవర్డ్ చాట్‌బాట్‌ని వివిధ భాషల్లో ప్రవేశపెట్టింది.
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, అయితే టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో కూడా పంట దిగుబడి తగ్గుతోంది. ఎక్కువ దిగుబడి పొందటానికి రాతులకు టెక్నాలజీ కూడా ఉపయోగపడాలి. అప్పుడే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి ఏఐ చాలా ఉపయోగపడుతుంది.