Almost 70 Startup Companies Laid Off More Than 17000 Jobs In First Half Of 2023, Know In Details - Sakshi
Sakshi News home page

Job Cuts In 2023 First Half: తప్పని కష్టాలు.. ఆరు నెలల్లో అంతమంది ఉద్యోగులా?

Published Mon, Jul 31 2023 5:44 PM | Last Updated on Mon, Jul 31 2023 6:06 PM

Startup companies cut over 17000 jobs first half 2023 - Sakshi

Job Cuts 2023 First Six Months: కరోనా మహమ్మారి భారతదేశంలో ప్రవేశించినప్పటి నుంచి ఐటీ కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఆ ప్రభావం ఇప్పటికి కూడా ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. 2023లో కూడా కొన్ని కంపెనీలు లేఆప్స్ ప్రకటిస్తున్నాయి.. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఈ ఏడాది అర్ధభాగంలో కొన్ని స్టార్టప్‌ కంపెనీలు లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, 2023 మొదటి ఆరు నెలల కాలంలో ఏకంగా 70 కంపెనీలు 17,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. పెట్టుబడిదారుల నిధుల క్షీణత కారణంగా సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి.. నగదును ఆదా చేయడానికి కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఉద్యోగులను తొలగించిన స్టార్టప్‌ల జాబితాలో.. ఈ-కామర్స్, ఫిన్-టెక్, ఎడ్‌టెక్, లాజిస్టిక్స్ టెక్ అండ్ హెల్త్-టెక్ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు మీషో, అనాకాడెమీ, స్విగ్గీ, షేర్‌చాట్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్‌కి ప్రధాన కారణం కంపెనీలు లాభాలను పొందకపోవడమే అని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ - షావోమి నుంచి రెడ్‌మీ వరకు..

పెరుగుతున్న మూలధన వ్యయం, వడ్డీ రేట్లు, టెక్నాలజీ స్టాక్‌ల విలువ క్షీణత కారణంగా స్థిరమైన స్టార్టప్ ఫండింగ్‌పై ప్రభావం కొనసాగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని కంపెనీలు మునుపటి వైభవం పొందలేకపోతున్నాయి. ఈ కారణంగానే 2023లో కూడా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగులు మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement