
వరుస తగ్గుదల తరువాత.. కొంచెం పెరిగిన బంగారం ధర ఈ రోజు (ఏప్రిల్ 10) ఊహకందని రీతిలో పెరిగింది. ధరల పెరుగుదలలో బహుశా ఇదే అల్‌టైమ్ రికార్డ్ అనే తెలుస్తోంది. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2940 పెరిగి.. పసిడి ప్రియులకు షాకిచ్చింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 93,380 వద్ద నిలిచాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఈ రోజు రూ. 2700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 2940 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.
చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 2700, రూ. 2940 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,380 వద్ద ఉంది.
ఇదీ చదవండి: రూ.4 కోట్ల కారు.. ₹46 లక్షల నెంబర్ ప్లేట్
దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 85,750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 93,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 2700, రూ. 2940 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.
వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 10) కేజీ సిల్వర్ రేటు రూ. 1,04,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 95,000 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).