21 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు | Kavitha Judicial Remand Extended Till June 21 | Sakshi
Sakshi News home page

21 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Published Sat, Jun 8 2024 5:24 AM | Last Updated on Sat, Jun 8 2024 5:24 AM

Kavitha Judicial Remand Extended Till June 21

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఈనెల 21 వరకు ప్రత్యేక కోర్టు పొడిగించింది. కస్టడీ ముగియడంతో కవితను వర్చువల్‌గా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

కవిత కస్టడీ పొడిగించాలన్న సీబీఐ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేశారు. మరోవైపు, ఈ కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషిటును పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోరింది. దీనిపై జులై 6న విచారణ చేపడతామని న్యాయమూర్తి పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement