kavita
-
‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!
పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతోనే స్త్రీ జీవనం గడిచిపోతుంది. రొటీన్లో తన మనుగడ ప్రశ్నార్థకం అవుతుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంటుంది. జీవనశైలిని మార్పుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాస్టెస్ట్ ఔతాహ్సిక మారథానర్గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి.50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తిచేసి స్టార్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రపంచ మారథాన్ ల చరిత్రలో అత్యంత వేగవంతమైన భారతీయ మహిళా రన్నర్‌గా నిలిచారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్‌లో పాల్గొంటున్న కవితారెడ్డి ‘మన మైండ్, బాడీ చురుగ్గా ఉండాలంటే ముందు ఏదైనా క్రీడలలో పాల్గొనాలి’ అంటూ ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.‘‘మన దేశంలో మహిళలు బయటకు వచ్చి, రన్స్‌లో పాల్గొడం తక్కువే. వారిని ఎంకరేజ్ చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. పుట్టి పెరిగింది అనంతపూర్. డిగ్రీ పూర్తవుతూనే పెళ్లి, కుటుంబ బాధ్యతలు. ఎప్పుడూ క్రీడల్లో పాల్గొనలేదు. నలభైఏళ్ల వరకు గృహిణిగా, ఇద్దరు అబ్బాయిల పెంపకం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వచ్చాను. వయసు పెరుగుతున్నప్పుడు జీవనశైలి సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, కొన్ని మార్పులు చేసుకోవాలనుకుని, పదేళ్ళక్రితం జిమ్‌లో చేరాను. కొన్నిరోజులు ఇబ్బందే అనిపించింది. కానీ, అదే సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. స్నేహితుల ద్వారా మారథాన్ల గురించి తెలిసింది. అలా జిమ్‌తో పాటు పదేళ్ల క్రితమే మారథాన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. మా వారు దీపక్‌రెడ్డి ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరు, ముంబయ్, పుణెలలో నివసిస్తూ వచ్చాం. అలాగే, ఎక్కడ మారథాన్ జరిగినా పాల్గొంటూ వచ్చాను. మారథాన్లు నా జీవన విధానాన్నే మార్చాయి. వాటిల్లో ఎంజాయ్ చేయడమే పెరిగింది. దీంతో అదే ΄్యాషన్గా మారింది.సొంత గుర్తింపుకూతురు, భార్య, తల్లి.. సమాజం మనకో గుర్తింపునిస్తుంది. కానీ, మనకంటూ ఓ సొంత గుర్తింపును సాధించుకోవాలి. అందుకు ఏదో ఒక యాక్టివిటీని ఏర్పరుచుకోవాలి. గృహిణిగా, అమ్మగా గుర్తింపు ఉన్న నాకు ఇప్పుడు ‘మారథాన్ రన్నర్ కవితారెడ్డి’ అంటూ మరో గుర్తింపు వచ్చింది. ఈ ప్రయాణంలో ఎంతోమంది పరిచయం అయ్యారు. కాన్ఫిడెన్స్తోపాటు జీవనశైలిలోనూ మంచి మార్పులు వచ్చాయి. మద్దతు అవసరంమహిళలు మారథాన్‌లో పాల్గొనడానికి మన దగ్గర ఇంకా అంత ప్రోత్సాహం లేదనే చెప్పవచ్చు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ, ఇరుకు రోడ్లు, సౌకర్యాలు కూడా తక్కువే. విదేశాలలో మారథాన్ అంటే సిటీ మొత్తం ఒక పండగలా జరుగుతుంది. స్త్రీ–పురుష తేడా లేకుండా ఎంతోమంది వచ్చి హుషారుగా పాల్గొంటారు. సామాజికంగానూ ఇది ఐక్యతను సూచిస్తుంది. ఒక తెలియని ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. దీనివల్ల చేయాలనుకున్న పనుల్లో వేగం కూడా ఉంటుంది. శిక్షణ తప్పనిసరిముందు మనకోసం సొంతంగా ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు కుటుంబం నుంచి అంతగా సపోర్ట్ రాకపోవచ్చు. కానీ, పరిస్థితులలో మంచి మార్పులు వచ్చాయి. నేడు మన జీవన విధానంలో ఆహారం, చేస్తున్న పనులకు ఏ మాత్రం ΄÷ంతన లేదు. అందుకే, మహిళలు తప్పనిసరిగా వ్యాయామాలు ఒక అలవాటుగా చేసుకోవాలి. ఏడాదికి రెండు మూడు హాఫ్ మారథాన్లలో పాల్గొంటుంటాను. ఆ తర్వాత ఫుల్ మారథాన్ ఉంటుంది. సాధారణంగా ఫుల్ మారథాన్లనే కౌంట్ చేస్తుంటారు. అందరూ ఆ డిస్టెన్స్‌లో పాల్గొనలేరు. అందుకని హాఫ్ మారథాన్లు, 5కె, 10కె రన్లు జరుగుతుంటాయి. రాబోయే ఫిబ్రవరిలో చండీగఢ్లోహాఫ్ మారథాన్ ఉంది. దానికి శిక్షణ తీసుకుంటున్నాను’ అని వివరించారు ఈ మారథాన్ రన్నర్. అడ్డంకులను అధిగమిస్తూ..ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అంతకుముందు అంటార్కిటికా ఐస్ మారథాన్లు రెండు అత్యంత కష్టమైనవే. బోస్టన్‌లో పాల్గొన్న మారథాన్‌లో అయితే బలమైన ఈదురుగాలులు, వర్షం.. అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు. అయినా, 42.21 కి.మీ మారథాన్‌ని పూర్తి చేయాలి. లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆలోచన అడ్డంకులను అధిగమించేలా చేసింది. 3.05 గంటలలో లక్ష్యాన్ని చేరుకున్నా. ప్రకృతి విసిరే సవాళ్లను తట్టుకోవడానికి మహిళలే ముందుంటారు. పదేళ్లపాటు చేస్తున్న ఈ జర్నీలో ఇండియాతో పాటు న్యూయార్క్, లండన్, చికాగో, బెర్లిన్, బోస్టన్ – టోక్యోలలో జరిగిన ఆరు ఫుల్ మారథాన్లలో పాల్గొన్నాను. మెడల్స్ ΄÷ందాను. నన్ను చూసి మారథాన్లలో పాల్గొన్న మహిళలు చాలామంది ఉన్నారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఆగడాలు..సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగడాలతో తీవ్ర మనస్తాపం చెందిన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యకు యత్నించారు. ఎమ్మెల్యే అతనిని బహిరంగంగా దూషించడమే కాక బుధవారం చిట్టేల వెళ్లి దాడికి యత్నించడంతో ఆమె కలతచెంది నిద్రమాత్రలు మింగారు. ఆపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హుటాహుటిన విజయవాడ తరలించారు. కవిత కోకిలంపాడు వీఆర్వోగా పనిచేస్తున్నారు.ఎమ్మెల్యే వేధింపులతోనే ఆత్మహత్యాయత్నంఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను చంపడానికి యత్నిస్తుండడంతో భయపడి తన భార్య కవిత ఆత్మహత్యా యత్నం చేసుకున్నట్లు తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. తిరువూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేయించడమేకాక చిట్టేల వాగు నుంచి ఇసుక తోలకాలను తాను అడ్డుకుంటున్నానని ఆరోపిస్తూ అంతమొందిస్తానని బెదిరించారని చెప్పారు. తిరువూరు మెయిన్‌రోడ్డులో బహిరంగంగా తనను అసభ్య పదజాలంతో తిట్టడమే కాక ఆయన అనుచరులను రెచ్చగొట్టి తనపైకి ఉసిగొల్పుతున్నాడని సర్పంచ్ వివరించారు. చిట్టేలలో బుధవారం 20 మంది అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే పొలానికి వెళ్తున్న తనను అంతమొందించడానికి ప్రయత్నించారని, ఆయన దురుసు ప్రవర్తన, దౌర్జన్యంతో ఆందోళనకు గురైన తన భార్య కవిత నిద్రమాత్రలు మింగిందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తుల ఆందోళన..ఈ ఘటన నేపథ్యంలో చిట్టేల గ్రామస్తులు బుధవారం తిరువూరులో ఆందోళనకు దిగారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. కవితను మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుధారాణి çకూడా పరామర్శించిఅండగా ఉంటామని చెప్పారు. -
ఎంపీ మాగుంటను నిందితుడిగా ఎందుకు చేర్చలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత నిందితురాలు అయినప్పుడు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకే కేసులో ఉన్న ఇద్దరిలో ఆమె నిందితురాలు అయినప్పుడు ఆయన సాక్షి ఎలా అవుతారో తెలపాలంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదని, ఆ విషయంలో భిన్నంగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థల్ని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు బదులిస్తూ.. కవిత ఫోన్లు ధ్వంసం చేయడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో మాట్లాడటమే కారణం అని తెలిపారు. మేజి్రస్టేట్ ముందు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలంతోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు బయటకు వచ్చి0దన్నారు. పాలసీలో భాగస్వామ్యం కావడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎంపీ మాగుంట కలిశారని, అయితే కవితను కలవాలని కేజ్రీవాల్ సూచించారని తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో తన నివాసానికి కవిత రమ్మని ఫోను చేశారంటూ ఎంపీ మాగుంట వాంగ్మూలంలో పేర్కొన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కవిత ఫోను ధ్వంసం చేయాల్సి వ0చ్చిదని ఎస్వీ రాజు తెలిపారు. పాలసీ అనుకూలంగా ఉండడానికి ఆప్ నేతలకు రూ. 100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని రూ. 50 కోట్లు తనకు ఇవ్వాలని కవిత చెప్పారని మాగుంట వాంగ్మూలంలో పేర్కొన్నట్లు రాజు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే అభిõÙక్ బోయినపల్లి, బుచ్చిబాబులకు తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా రూ. 25 కోట్లు అందజేశారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మరి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదు అని ప్రశ్నించింది. కవిత నిందితురాలు అయినప్పుడు మాగుంట సాక్షి ఎలా అవుతారో చెప్పాలంది. ఈ సమయంలో కవిత తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కల్పించుకొని మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారడంతోనే బెయిలు వచ్చి0దన్నారు. ఇలాంటి ఆరోపణలే తప్ప ఎలాంటి ఆధారాలు లేవని రోహత్గి తెలిపారు. ఈ సమయంలో కేజ్రీవాల్‌కు ఏ కేసులో బెయిలు వచ్చి0దనే విషయాలు జస్టిస్ బీఆర్ గవాయి ఆరా తీశారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారని మాగుంట రాఘవ రూ. 25 కోట్లు బుచ్చిబాబు, అభిõÙక్కు ఇచ్చారని అంటున్నారు మరి మనీలాండరింగ్ కేసులో రాఘవ లేరని ఎలా అంటారని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. నేరారోపణ చేసిన వ్యక్తినే సాక్షిగా మార్చారు? రేపు ఇష్టానుసారం మరో వ్యక్తిని తీసుకొస్తారా? ఇదా దర్యాప్తు సంస్థల పారదర్శకత అని ప్రశి్నంచారు.కవితకు బెయిల్ మంజూరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక మహిళగా కవిత బెయిలుకు అర్హురాలని తేల్చి చెప్పింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45ను అర్థం చేసుకోవడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైందని పేర్కొంది. సహ నిందితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లు కాకుండా నేరంలో కవిత పాత్ర ఉందన్న ఆధారాలు ఇంకేమీ దర్యాప్తు సంస్థలు చూపకపోవడాన్ని గుర్తు చేస్తూ బెయిలు మంజూరు చేస్తున్నామని పేర్కొంది. ముఖ్యంగా.. దర్యాప్తు పూర్తి, చార్జిషీటు దాఖలు, మహిళ అనే మూడు అంశాల ఆధారంగా బెయిలు మంజూరు చేస్తున్నామని పేర్కొంది. ఈడీ, సీబీఐ కేసుల్లో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. సుమారు గంటన్నరకు పైగా సుదీర్ఘంగా ఇరుపక్షాలు వాదించాయి. ఇరుపక్షాల వాదనల అనంతరం షరతులతో కూడిన బెయిలును ధర్మాసనం మంజూరు చేసింది. ‘‘జులై 1న ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు క్వాష్ చేస్తున్నాం. రెండు కేసుల్లోనూ చెరో రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలి. సాక్షుల్ని బెదిరించడం, ఆధారాలు ట్యాంపర్ చేయడం చేయరాదు. ట్రయల్ కోర్టులో పాస్‌పోర్టు డిపాజిట్ చేయాలి. పిటిషనర్ ట్రయల్ కోర్టుకు రెగ్యులర్‌గా హాజరవుతూ.. దర్యాప్తు వేగవంతానికి సహకరించాలి’’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. -
బెయిల్ వస్తే ఓకే.. రాకుంటే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ దాదాపు 150 రోజులకు పైగా తీహార్ జైలులో ఉన్న ఆమె బెయి లు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ విషయంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు ఆలస్యమెందుకంటూ ఈనెల 12న సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. దీనితో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ అడగ్గా.. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.మంగళవారం కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్న నేప థ్యంలో.. కేటీఆర్, హరీశ్ తదితరులు సోమవారం ఢిల్లీ లో న్యాయవాదులతో భేటీ అయ్యా రు. 2 గంటల పాటు సుప్రీం కోర్టులో వాదించబోయే అంశాలపై చర్చించారు. కాగా, కోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మరోమారు న్యాయబృందంతో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బెయిల్‌పై ఆశాభావంతో..: కవిత 154 రోజుల నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. మంగళవారం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్‌పై వాదనల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్‌లు న్యాయవాది మోహిత్‌రావు బృందంతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ‘బెయిల్ వస్తే ఓకే.. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏమిటి? న్యాయ పోరాటం ఎలా చేయాలి’అనే అంశాలపై చర్చించారు. బెయిల్‌పై కౌంటర్ దాఖలు విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ సారి కవితకు బెయిల్ వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మహిళగా కవితకు మినహాయింపు ఇవ్వండిపీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి మహిళగా ఎమ్మెల్సీ కవితకు మినహాయింపు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ్గ సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే కవిత హైబీపీతో బాధ పడుతున్నారు. పదికేజీలకు పైగా బరువు తగ్గారు. మరోపక్క జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికంటే ఆమె దీర్ఘకాలికంగా ఉన్న గైనిక్ సమస్యల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని న్యాయబృందం సుప్రీంకోర్టుకు నివేదించనుంది.పీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి కవితకు మినహాయింపు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కవితకు ఉన్న అనారోగ్య సమస్యలపై ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టులను ఈడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం బెయిలు మంజూరు చేస్తుందా లేక వాయిదా వేస్తుందా అన్న అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. -
కవితకు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం విధానం కేసులో జైలులో ఉన్న ఎమ్మెల్సీ, తన సోదరి కవితకు కూడా కొద్ది వారాల్లో బెయిల్ వస్తుందని ఆశిస్తున్నట్లు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నా రు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ లభించిన నేప థ్యంలో ఈ కేసులో ఇతరులకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలున్నాయన్నా రు.తెలంగాణ భవన్లో శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధుల తో కేటీఆర్ మాట్లాడుతూ, ‘రాజకీయంగా కొట్లాడాల్సిన సందర్భంలో ఈ తరహా కేసులు తప్పవని అనుకుంటున్నాం. 11వేల మంది ఉండాల్సిన జైలు లో 30 వేల మంది ఉన్నారు. జైలులో కవిత ఇబ్బందులు పడుతున్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు ఖైదీలు కూడా ఉన్నారు. కవిత 11 కిలోల మేర బరువు కోల్పోయింది. బీపీ వచ్చి రోజుకు రెండు మాత్రలు వేసుకుంటోంది’అని అన్నారు.న్యాయవాదులతో సంప్రదింపుల కోసమే..: ‘న్యాయవాదులతో సంప్ర దింపుల కోసం ఢిల్లీ వెళితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ బురద చల్లు తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఢిల్లీలో మూడు కేసులపై సుప్రీంకోర్టులో కొట్లాడుతోంది.అందులో ఒకటి ఎమ్మెల్సీ కవితది కాగా మరొకటి పార్టీ మా రిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినది. గవ ర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్య నారాయణకు సంబంధించిన కేసు కూడా ఉంది’అని కేటీఆర్ అన్నారు. కాగా, 15 రోజులకు ముందు సోదరుడు ఏర్పాటు చేసిన కంపెనీతో ఒప్పందం చేసుకునేందుకు సీఎం రేవంత్ అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన విమర్శించారు.భూముల కోసం బెదిరిస్తున్నారుకేటీఆర్ను కలసిన కొడంగల్ రైతులుసాక్షి, హైదరాబాద్: ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి బెదిరింపులకు పాల్ప డుతున్నారని కొడంగల్ నియోజకవర్గ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితోపాటు నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావును కలసి తాము పడు తున్న ఇబ్బందులను వివరించి అండగా నిలవాలని కోరారు. హకీంపేట్, పోలెపల్లి, లకచర్ల గ్రామంలో మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు పేర్కొన్నారు.ఫార్మా కంపెనీలతో కాలుష్యం పెరుగుతుందని, తమకు ఈ ఫ్యాకర్టీలు వద్దని రైతులు చెబుతున్నా బెదిరింపులు ఆగడం లేదన్నారు. కోట్లాది రూపా యల విలువ చేసే తమ భూములను అప్పనంగా తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్రలు జరుగుతున్నా యని తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడిన తమకు జీవనాధారమైన భూమిని లాక్కుంటే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. -
ఫిరాయింపులపై వారంలో సుప్రీంకు..!
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై వారం రోజుల్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే లపై స్పీకర్ అనర్హత వేటు వేయడంలో జాప్యం చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను దేశవ్యాప్తంగా తెలియ చెబుతామని పేర్కొన్నా రు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న ఫిరాయింపులపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సోమవారం సోదరి, ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో కలిసేందుకు వచ్చిన కేటీఆర్.. సుప్రీంకోర్టుకు చెందిన న్యాయనిపు ణులతో భేటీ అయ్యి, ఫిరా యింపులపై సుదీర్ఘంగా చర్చించారు. దానం నాగేందర్ వ్యవహారంపై తాము ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామని, అక్కడ చాలారోజుల నుంచి జాప్యం జరుగుతోందని కేటీఆర్ చెప్పారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు అక్కడి స్పీకర్లు వారిపై అనర్హత వేటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీని వీడి మరొక పార్టీలోకి చేరిన వారిపై పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్.. తెలంగాణలో ఫిరాయింపులకు ఎందుకు పాల్పడుతోందని ప్రశ్నించారు. వాషింగ్ మెషీన్ పార్టీగా బీజేపీని విమర్శిస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో వ్యవహరిస్తున్న తీరును ఏవిధంగా సంబోధించాలో చెప్పాలన్నారు. ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టుకు చెందిన న్యాయ నిపుణులకు అన్ని ఆధారాలను ఇచ్చామని, సుప్రీంకోర్టులో ఫైట్ చేయనున్నట్లు కేటీఆర్ వివరించారు.రాజ్యసభలో గళం విప్పుతాంతమ పార్టీ గుర్తుపై గెలిచిన వారిని కాంగ్రెస్ చేర్చుకోవడంపై రాజ్యసభలో గళం విప్పుతామని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రతీ ఒక్కరిపై అనర్హత వేటు వేయాల్సిందేనని, ఆ దిశగా తాము న్యాయ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. రాజ్యసభ, లోక్‌సభలో అనుభవజ్ఞులైన సభ్యులున్నారని వారితో ఫిరాయింపులపై ఓ కమిటీని వేయాలంటూ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లుగా పేర్కొన్నారు. బరువు తగ్గిన కవిత సోదరి కవితను కలిశానని, అనారోగ్యం నుంచి ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని కేటీఆర్ చెప్పారు. ఆమె దాదాపు 7–10 కిలోల బరువు తగ్గిందని, బలహీనంగా కనిపించడం వల్ల బాధ కలిగిందన్నారు. 130 రోజులుగా న్యాయం కోసం తన సోదరి జైల్లో పోరాడుతోందని చెప్పారు. కవిత కొద్దిరోజుల్లో కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. మరో వైపు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని ఈ నెల 26 వరకూ ట్రయల్ కోర్టు పొడిగించింది. నూతన నేర చట్టాలపై మీ వైఖరేంటి?రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌కు కేటీఆర్ ప్రశ్నపలు నిబంధనలు, సెక్షన్లు వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉన్నాయిపశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో వీటి అమలుపై వ్యతిరేకతనియంతృత్వ సెక్షన్లపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పంపాలని డిమాండ్సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చిన నేర చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తమ వైఖరి వెల్లడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ)పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. నూతన న్యాయ చట్టాలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నియంతృత్వ సెక్షన్లపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పంపాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ చట్టాల్లోని పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ చట్టాలు పోలీసులు, ప్రభుత్వానికి మితిమీరిన అధికారాన్ని కట్టబెట్టేలా ఉన్నాయని, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని హక్కుల సంఘాలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామికవాదులు, న్యాయ నిపుణులతోపాటు పలు రాష్ట్రాలు కూడా నూతన చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారని పేర్కొన్నారు.తొందరపాటు చట్టాలుదేశవ్యాప్తంగా విస్తృత స్థాయి సంప్రదింపులు జరపకుండానే కేంద్రం తొందరపాటుతో ఈ చట్టాలను తెచ్చిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి ఆమోదించిన ఈ చట్టాలపై ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులతోపాటు పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరించేలా ఉన్న ఈ చట్టాలతో నిందితులకు బెయిల్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయన్నారు. ప్రభుత్వచర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలపై కేసుల నమోదు అధికారం వచ్చిందన్నారు. సైబర్ నేరాలు, హ్యాకింగ్, ఆర్థిక నేరాలు, గోప్యత, సాంకేతికత ద్వారా విధ్వంసం వంటి వాటి కోసం రూపొందించిన ప్రత్యేక అధ్యాయంలో అనేక అస్పష్టతలున్నాయని పేర్కొన్నారు. ఏడు నెలలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను, యువకులను, నిరుద్యోగులను, సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడ అణిచివేసేందుకు సర్కారు పోలీసులను విస్తృతంగా వినియోగిస్తోందన్నారు. నూతన చట్టాల నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత దుర్మార్గమైన వాతావరణానికి దారితీస్తాయని చెప్పారు. -
క్షీణించిన కవిత ఆరోగ్యం!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరో గ్యం క్షీణిస్తున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం తిహార్ జైలు అధికారులు కవితను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ వివిధ వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. కవిత ఆరోగ్యం క్షీణించడం పట్ల భర్త అనిల్ కంటతడి పెట్టారు. ఎయిమ్స్‌లో ఆమెను చూసి భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది.ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు న్యాయస్థానాన్ని కోరారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల అబ్లిగేషన్‌ను నిరాకరించిన న్యాయస్థానం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచి్చంది. పదికిలోల బరువు తగ్గిన కవిత భర్త అనిల్ సమక్షంలో కవితకు ఎయిమ్స్ వైద్య బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ వైద్య పరీక్షల సమయంలో కవిత పది కిలోల బరువు తగ్గినట్లు తెలిసింది. కవిత నీరసంగా ఉండటం, ఇంకా జ్వరంతో బాధపడటం, బరువు తగ్గడంపై అనిల్ చలించిపోయారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరి యా టెస్టులు చేశారు. నాలుగు నెలల వ్యవధిలో దాదాపు పది కిలోల బరువు తగ్గిన విషయాన్ని తండ్రి కేసీఆర్, తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్‌రావుకు తెలిసి ఆమె అనారోగ్యం పట్ల తీవ్ర ఆవేదన కనబరుస్తున్నట్లు సమాచారం. జైలులో దోమలు అధికంగా ఉండటం వల్ల కొందరు డెంగ్యూ జ్వర బాధితులు ఉన్నారని కవిత తరపు న్యాయవాదులు చెబుతున్నారు. సోమవారం ఢిల్లీకి కేటీఆర్, హరీశ్ అనారోగ్యానికి గురైన కవితను రెండు పర్యాయాలు దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి, ఒకసారి ఎయిమ్స్‌కు తరలించిన తిహార్ జైలు అధికారులు పరీక్షలు చేయించారు. తిహార్ జైల్లో ఉన్న కవితను కలిసేందుకు సోమవారం కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి రానున్నారు. -
కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంతోపాటు తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం రౌజ్‌ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ నెల 22కు విచారణను వాయిదా వేశారు. కేసును మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయడం సరికాదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, సీబీఐ చార్జిïÙట్లో తప్పులున్నాయని కవిత తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై సీబీఐ న్యాయవాది స్పందిస్తూ.. తప్పులు లేవన్నారు. డిఫాల్ట్ బెయిల్, చార్జిషీట్లో తప్పులపై విచారణ జరిగేవరకు చార్జిïÙట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయి దా వేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టు కు విజ్ఞప్తి చేశారు. అయితే.. చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశానికి, కవిత డిఫాల్ట్ బెయిల్‌కు సంబంధం లేదని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. కాగా, ‘60 రోజుల తర్వాత తప్పులతో కూడిన చార్జిïÙట్ను దాఖ లు చేయడం తన క్లయింట్ డిఫాల్ట్ బెయిల్ హక్కులను కాలరాయడమే’అని కవిత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనల అనంతరం 22న కేసు విచారణ చేపడతామని న్యాయమూర్తి తెలిపారు. -
21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 21 వరకు ప్రత్యేక కోర్టు పొడిగించింది. కస్టడీ ముగియడంతో కవితను వర్చువల్‌గా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.కవిత కస్టడీ పొడిగించాలన్న సీబీఐ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేశారు. మరోవైపు, ఈ కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషిటును పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోరింది. దీనిపై జులై 6న విచారణ చేపడతామని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌రావు గురువారం 1,149 పేజీలతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ స్యూర్యకాంత శర్మ శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం విదితమే. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు (రౌజ్ అవెన్యూ కోర్టు) కవిత బెయిల్ పిటిషన్‌ను నిరాకరిస్తూ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
కవిత అరెస్టు అక్రమం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అక్రమం కాదని ఈడీ పునరుద్ఘాటించింది. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారమే ఆమెను అరెస్టు చేశామంది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు, ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై బుధవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ తన వాదనలు కొనసాగించారు. ‘మద్యం విధానం మొత్తం తమకు అనుకూలంగా, లబ్ధి చేకూరేలా మార్చుకోవడంలో కవిత కీలక పాత్ర పోషించారు.ఈ వ్యవహారంలో క్విడ్‌ప్రో కో జరిగింది. కమీషన్ 12 శాతానికి పెంచడం వల్ల హోల్‌సేల్ వ్యాపారులు రూ.581 కోట్లు సంపాదించగా, ఇండో స్పిరిట్స్‌కు సుమారు రూ.180 కోట్లు వచ్చింది. ఇండో స్పిరిట్స్‌లో ప్రాక్సీ ద్వారా కవిత వాటాదారుగా ఉన్నారు. మద్యం విధానంలో మార్పుల వల్ల ప్రజలు, ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. పాత పాలసీని పక్కన పెట్టడంతోపాటు మహాదేవ్ డిస్ట్రిబ్యూటర్ను బలవంతంగా తప్పించారు. కొత్త పాలసీని ముందుకు తీసుకెళ్లడంలో కేజ్రీవాల్ అనుచరుడు విజయ్‌నాయర్, నాటి మంత్రి మనీశ్ సిసోడియా, కవిత బినామీ అరుణ్ పిళ్లై కీలకపాత్ర పోషించారు.పాలసీలో మార్పులు చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం అందింది. ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఎల్1 లైసెన్సు కోసం కవిత తీవ్రంగా యతి్నంచగా, చివరకు నిందితుడు సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, కవితలకు చెరో 33 శాతం వాటా దక్కింది. బుచ్చిబాబు, మాగుంట రాఘవల వాట్సాప్ చాట్లలో ఈ సమాచారం లభ్యమైంది’.. అని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. ‘కేజ్రీవాల్, సిసోడియా, కవిత మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు చెప్పారు. ఆప్‌తో కవిత సంబంధాలపై మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక వాంగ్మూలం ఇచ్చారు. కేవలం మద్యం వ్యాపారం గురించి మాట్లాడటానికే సచివాలయంలో కేజ్రీవాల్‌తో మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. దీనిపై కవితను కలవాలని, ఆమే మొత్తం చెప్తారని కేజ్రీవాల్ తనకు చెప్పినట్లు శ్రీనివాసులురెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. కవితతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయినపుడు పాలసీ తమకు అనుకూలంగా మారుతుందని, అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని కవిత చెప్పారు.ఈ క్రమంలో సొమ్ములు ఇవ్వడం ఆలస్యమైనపుడు మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ద్వారా బెదిరింపులకు దిగారు. దీంతో మాగుంట రాఘవ ద్వారా రూ.10 కోట్లు బుచ్చిబాబుకు, రూ.15 కోట్లు అభిషేక్ బోయినపల్లికి అందజేశారు’అని జొహెచ్ హొస్సేన్ చెప్పారు. కవిత ఒత్తిడితోనే ఆరు నెలల తర్వాత వాంగ్మూలం మార్చుకుంటానని పిళ్లై అన్నారన్నారు. కవిత చెప్పిన మార్పులు, చేర్పులతోనే నూతన మద్యం పాలసీ బయటకు వచ్చిందని జొహెబ్ తెలిపారు. ఉద్యోగానికి రాకుండానే రూ.లక్ష జీతం కవిత మేనల్లుడు మేకా శరణ్‌ను ఇండో స్పిరిట్స్‌లో ఉద్యోగిగా చూపారని జొహెబ్ హొస్సేన్ తెలిపారు. రూ.లక్ష జీతగాడు అయిన శరణ్ ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాలేదన్నారు. ఢిల్లీ విచారణకు రావాలని పలుసార్లు కోరినప్పటికీ శరణ్ రాలేదని తెలిపారు. విచారణ సమయంలో కవిత ఇచ్చిన ఫోన్ల డాటా డిలీట్ అయిందన్నారు. ఇంటో పనిచేసే వారికి ఫోన్లు ఇచ్చామని చెబుతున్నారని, అయితే తాము నోటీసులు ఇచ్చిన తర్వాత రోజుల్లో డాటా డిలీట్ అయినట్లు ఫోరెన్సిక్లో తేలిందన్నారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వు చేస్తున్నామని, మే 6న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి చెప్పారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
ఆమే సూత్రధారి.. పాత్రధారి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకానొక సమయంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డిలను కవిత భయపెట్టినట్లు కోర్టుకు తెలిపింది. కుంభకోణంలో కవితను సూత్రధారి, పాత్రధారిగా పేర్కొంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కవితను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మూడు రోజులపాటు కవితను సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. విజయ్నాయర్కు హవాలా రూపంలో డబ్బులు లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను శుక్రవారం అధికారులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఐదు రోజుల పాటు కవిత కస్టడీ కోరుతూ సీబీఐ, సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈడీ తరఫు న్యాయవాది పంకజ్ వాదనలు వినిపిస్తూ.. ‘లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ఒక నిందితుడైన విజయ్ నాయర్ (కేజ్రీవాల్ అనుచరుడు)కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు మరో నిందితుడైన దినేష్ అరోరా ద్వారా హవాలా రూపంలో చెల్లించారు. ఈ నేరపూరిత కుట్రకు అనుగుణంగా ఇండో స్పిరిట్స్‌లో 65 శాతం వాటా, రూ.29.29 కోట్లను సౌత్‌గ్రూపులోని నిందితులకు బదిలీ చేశారు. గోవా ఎన్నికల సమయంలో ఆప్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రూ.44.45 కోట్లు వినియోగించారు. కవిత మాజీ ఆడిటర్ బుచి్చబాబు ఫోన్ వాట్సాప్ చాట్లు, భూ కొనుగోలు ముసుగులో సొమ్ము లావాదేవీలు బహిర్గతం అయ్యాయి. ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వడానికి పన్నిన నేరపూరిత కుట్రలో కల్వకుంట్ల కవిత కీలక పాత్రధారిగా ఉన్నట్లు సదరు భూ కొనుగోలు డీల్ ద్వారా వెల్లడైంది..’అని చెప్పారు. కవితతో మద్యం వ్యాపారి భేటీ దక్షిణాదికి చెందిన ఓ మద్యం వ్యాపారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని వెల్లడైంది. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రిని వ్యాపారి కోరగా.. ఎమ్మెల్సీ కవిత సంప్రదిస్తారని కేజ్రీవాల్ చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. తర్వాత సదరు వ్యాపారి కవితతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు సమకూర్చాల్సి ఉందని, దాంట్లో రూ.50 కోట్లు సదరు వ్యాపారి అందజేయాల్సి ఉంటుందని, తద్వారా మీరు వ్యాపార భాగస్వామి అవుతారని కవిత ఆయనకు తెలిపారు. అనంతరం బుచి్చబాబు డిమాండ్ మేరకు తన కుమారుడి ద్వారా కవిత అనుచరులకు రూ.25 కోట్లు వ్యాపారి చెల్లించారు. ఈ చెల్లింపులకు గానూ వ్యాపారి కుమారుడికి ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం వాటా దక్కింది. విజయ్నాయర్కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్లు చెల్లించినట్లుగా మరో నిందితుడు అభిషేక్ బోయినపల్లి తనకు చెప్పాడని అప్రూవర్ దినేష్ అరోరా తన వాంగ్మూలంలో వెల్లడించాడు. అభిõÙక్ బోయినపల్లి ఆదేశాల మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా నగదు బదిలీ చేసినట్లు అప్పటి కవిత పీఏ అశోక్ కౌశిక్ చెప్పాడు. కౌశిక్ ద్వారా రూ.25 కోట్లు బదిలీ అయినట్లు రికార్డులు నిర్ధారించాయి. ఇండో స్పిరిట్స్‌లో తన ప్రాక్సీ అరుణ్ పిళై ద్వారా కవిత భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు బుచ్చిబాబు ఫోను ద్వారా వెల్లడైంది..’అని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. భూ కొనుగోలు డీల్ ముసుగులో రూ.14 కోట్లు! భూ కొనుగోలు డీల్ ముసుగులో శరత్‌చంద్రారెడ్డికి చెందిన సంస్థల ఖాతాల నుంచి కల్వకుంట్ల కవితకు రూ.14 కోట్లు చేరాయి. నగదు బదిలీ ఒప్పందం అయితే జరిగింది కానీ అసలు భూమి బదిలీ కాలేదు. డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించడానికి శరత్‌చంద్రారెడ్డి ఆసక్తి చూపకపోవడంతో ఢిల్లీ, తెలంగాణలో వ్యాపారాలు దెబ్బతీస్తానని కవిత బెదిరించినట్లు వెల్లడైంది. పలువురు స్టేట్మెంట్ల ఆధారంగా కేసులో ప్రధాన కుట్రదారుల్లో కవిత ఒకరిగా తేలింది. దీంతో ఆమెను నిందితురాలిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. తర్వాత కోర్టు అనుమతితో కవితను ఈ నెల 6న తీహార్ జైలులో విచారించాం. కుంభకోణంలో తన పాత్ర గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు. ఐదు రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి..’అని పంకజ్ చెప్పారు. న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారు: కవిత న్యాయవాది కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఇతరత్రా రూపంలో ఇప్పటికే తమ వద్ద ఉన్న అంశాలతో అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థ చూపిన కస్టడీ కారణాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయన్నారు. కవిత విషయంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘించిన నేపథ్యంలో సీబీఐ పిటిషన్ కొట్టివేయాలని కోరారు. కవిత పిటిషన్ కొట్టివేత ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి కావేరి బవేజా.. తొలుత సీబీఐ పిటిషన్లో తీర్పు రిజర్వు చేశారు. మధ్యాహ్నం కవిత దాఖలు చేసిన సవాల్ పిటిషన్‌ను విచారించారు. కవిత పిటిషన్‌ను కొట్టివేస్తూ 22 పేజీలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. ‘వాస్తవాలు, కేసు పరిస్థితులు, వాదనలు పరిశీలించాక కవితను ఈ నెల 15 వరకూ సీబీఐ కస్టడీకి అనుమతిస్తున్నా. సీబీఐ అరెస్టును రద్దు చేయాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నా. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీ టీవీ పర్యవేక్షణలో కవితను విచారించాలి. ప్రతిరోజూ సాయంత్రం 6– 7 గంటల మధ్య అరగంట సేపు తన న్యాయవాది మోహిత్‌రావుతో మాట్లాడే అవకాశం కవితకు ఇవ్వాలి. భర్త అనిల్‌కుమార్, సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు, పీఏ శరత్‌చంద్రలు ఆ సమయంలోనే 15 నిమిషాలు మాట్లాడొచ్చు. నిందితురాలికి ఇంటి భోజనం, జపమాల, దుస్తులు, మేట్రస్, బెడ్ షీట్లు, తువ్వాళ్లు, దిండులను సీబీఐ అధికారులు అనుమతించాలి. ఆమె కోరిన పుస్తకాలు అనుమతించాలి..’అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
జ్యుడీషియల్ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు లో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. దీంతో కవితను ఈడీ అధికా రులు తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9 వరకూ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. రెండోసారి ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హుస్సేన్ ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో కవిత కీలక కుట్రదారు, లబ్ధిదారు అని ఆరోపించారు. ఇప్పటివరకు ఈడీ జరిపిన విచారణ ఆధారంగా సౌత్ గ్రూప్ లాబీలో కీలకంగా వ్యవహరించిన ఆమె... ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లోని అగ్రనేతలతో కలసి మద్యం కుంభకోణానికి కుట్రపన్నారని తేలిందన్నారు. రూ. 100 కోట్ల లావాదేవీలు, మద్యం విధానంలో మార్పులు, అమల్లో కవిత కీలకపాత్ర పోషించారన్నారు. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని.. ఆమెను బెయి ల్‌పై విడుదల చేస్తే సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని తద్వారా విచారణకు ఆటంకం కల గొచ్చని వాదించారు. కవిత పాత్రపై ఇంకా పరిశోధించా ల్సిన అవసరం ఉందని... నేరంలో చేతులు మారిన మిగి లిన సొమ్ము గురించిన ఆధారాలు వెలికితీస్తున్నట్లు వివ రించారు. నేరం ద్వారా వచ్చిన రాబడితో ప్రమేయం ఉన్న లేదా సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించనున్నా మని, ఆర్థిక నేరాలపై దర్యాప్తు సాధారణ నేరాల దర్యాప్తు కంటే క్లిష్టంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే కవితకు 15 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరుతున్నామని చెప్పారు. కుమారుడికి పరీక్షలున్నాయి.. మధ్యంతర బెయిలివ్వండి: కవిత లాయర్ కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపిస్తూ బెయిల్ పిటిషన్ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. మంగళవారం నుంచి కవిత కుమారుడికి వార్షిక పరీక్షలు మొదలుకానున్నందున మధ్యంతర ఉపశమనం కల్పించాలని కోరారు. అలాగే ఈడీ కస్టడీలో నిర్వహించిన వైద్య పరీక్షల వివరా లను అందించాలన్నారు. దీనికి ఈడీ తరఫు న్యాయవాది అంగీకరించారు. అయితే బెయిల్ పిటిషన్‌కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి వారం సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనల అనంతరం కవితను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు న్యాయమూర్తి కావేరి బవేజా అదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ 9న ఉదయం 11 గంటలకు కవితను తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న విచారిస్తామని, ఈలోగా ఈడీ కౌంటర్ దాఖలు చేయాలన్నారు. కవితకు ఇంటి భోజనం, పరుపు, దుప్పటి, చెప్పులు, బట్టలు, పుస్తకాలు, కలం, కాగితాలు, అవసరమైన మందులను నిబంధనల మేరకు అనుమతించాలని తిహార్ జైలు సూపరింటెండెంట్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కవితకు మద్దతుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, భర్త అనిల్, కొందరు జాగృతి నేతలు కార్యకర్తలు రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు: కవిత కోర్టు హాల్లోకి వెళ్లే సమయంలో కవిత జై తెలంగాణ నినాదాలు చేశారు. ‘ఇది తప్పుడు కేసు. మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు. తాత్కాలికంగా నన్ను జైలులో పెట్టొచ్చు కానీ కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఈ కేసు నిందితుల్లో ఒకరు ఇప్పటికే బీజేపీలో చేరితే మరొకరికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మరొకరు బీజేపీకి రూ. 50 కోట్ల నిధులు ఇచ్చారు. జై తెలంగాణ’ అని కవిత వ్యాఖ్యానించారు. -
నచ్చినోళ్లు జేబులో... నచ్చనోళ్లు జైలులో
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/మెదక్: నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ ముఖ్య కార్య కర్తల సమావేశంలో హరీశ్‌రావు ప్రసంగించారు. దేశంలో ప్రతిపక్షపార్టీల మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుని ఉంటే ఈరోజు ఎమ్మెల్సీ కవిత అరెస్టయి ఉండేవారా అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును రాహుల్‌గాంధీ ఖండిస్తే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం సమర్థిస్తున్నా రని, రేవంత్‌రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రా..? లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రా అని నిలదీశారు. రాష్ట్రంలో పంటలు ఎండుతుంటే సీఎం రేవంత్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు, 38 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్కరినీ పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. చోటే భాయ్‌కి బడే భాయ్ ఆశీర్వాదం చోటే భాయ్ సీఎం రేవంత్‌రెడ్డి.. బడే భాయ్ మోదీ ఆశీర్వాదం తీసుకున్నా రని, బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటేనని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక్క ముస్లింను కూడా కేబినేట్లోకి తీసుకోలేదని విమర్శించారు. మైనార్టీల సంక్షేమ బడ్జెట్లోనూ కోత విధిస్తున్నారని, కనీసం రంజాన్ తోఫా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామ్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
MLC Kavitha: ముగిసిన వాదనలు తీహార్ జైలుకు కవిత?
-
కవితతో తల్లి శోభ ములాఖత్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో తల్లి శోభ ములాఖత్ అయ్యారు. శోభతోపాటు సోదరుడు కేటీఆర్, సోదరి సౌమ్య కూడా కలిశారు. వీరు గురువారం సాయంత్రం సుమారు గంట సేపు కవితతో మాట్లాడారు. కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న కవిత పిటిషన్‌పైనా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు, ఐదోరోజూ గురువారం కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షులైన తన పీఏలు చెప్పిన సమాచారం మేరకు కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. -
కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత పీఆర్వో రాజేష్,ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. సోమవారం హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఐదుగురు సెల్ఫోన్లు ఈడీ అధికారులు సీజ్ చేశారు. కాగా, లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్‌లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే ఆమ్ అద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు రూ. 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది. ఇదీ చదవండి: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు -
సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఈడీ ప్రకటన చేసింది. సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేశామని, మనీలాండరింగ్ యాక్ట్ కింద కవితను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. కవితను అరెస్ట్ చేసినట్లు ఆమె భర్తకు సమాచారం ఇచ్చామని ఈడీ అధికారులు తెలిపారు. రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ రోజు రాత్రంత ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు. కాగా, తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. మరోవైపు, కవిత భర్త అనిల్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనని అరెస్ట్ చేశారని కవిత ఆరోపించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. -
బాలరాముణ్ణి దర్శించుకున్న గాయని కవితా కృష్ణమూర్తి!
అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు ప్రతిష్ఠితుడయ్యాక రామభక్తులంతా రామ్‌లల్లాను దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ప్రతిరోజూ లక్షలాది మంది రామభక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయకురాలు, పద్మశ్రీ కవితా కృష్ణమూర్తి అయోధ్యకు వచ్చి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యకు వచ్చి, ఇక్కడ పాటలు పాడే అదృష్టం తనకు దక్కిందని, ఇందుకు దేవునికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. అయోధ్య అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె రానున్న ఐదేళ్లలో అయోధ్య ను కొత్త కోణంలో చూడనున్నామన్నారు. ఇక్కడికి కళాకారులు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. -
కడియంను బీఆర్ఎస్ పక్ష నేతగా ఎన్నుకోవాలి
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కి బడుగులు, దళితులు గుర్తుకు రాలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్.రఘునందన్‌రావు మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా సీనియర్ నాయకుడు, దళితనేత కడియం శ్రీహరిని ఎన్నుకోవాలని ఆయన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సూచించారు. ‘కేసీఆర్‌కు ఎలాగూ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్‌గా దళితుడిని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఒక బీసీని చేయాలని సూచించారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి పాపాలు కడుక్కోవాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితకు ఇప్పుడు జ్యోతిబా పూలే గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. కవిత ఉన్నా లేకపోయినా పూలే గుర్తుంటారని, ఇందుకోసం వారు కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. కవితకు, ఆమె ఫ్యామిలీకి పబ్లిసిటీ అంటే అంత పిచ్చి ఎందుకని అన్నారు. శాసనసభలో కేటీఆర్, హరీశ్ కనపడాలని, తెలంగాణ భవన్లో కేసీఆర్, మండలి లో కవిత కనపడాలంటే ఎలా అని ప్రశ్నించారు. -
దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో అంతర్భాగంగా ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని, కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ దతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన ‘పీడిత్ అధికార్ యాత్ర’ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓబీసీల అనైక్యతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వాలు వారికి దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఓబీసీలకు న్యాయం చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు న్యాయం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నిస్తోందని కవిత ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఓబీసీల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నించారు. దామోదర్ సింగ్ యాదవ్ ప్రారంభించిన పీడిత్ అధికార్ యాత్ర దేశవ్యాప్తంగా విస్తరిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమని, కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం ముందుకుసాగాలని కవిత పిలుపునిచ్చారు. కేసీఆర్ స్పూర్తితోనే ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు ఓబీసీ ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ యాదవ్ తెలిపారు. -
మనీమంత్ర కవితాగానం
‘కష్టపడగానే సరిపోదు... ఆ కష్టానికి తగిన ఫలితం ఉండాలి. ప్రతిభ ఉండగానే సరిపోదు... దానికి తగిన ప్రతిఫలం ఉండాలి’ అంటుంది కవితా షెనాయ్. అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన కవితకు వినియోగదారుల నాడి తెలుసు. తగిన ప్రతిభ, సామర్థ్యాలు ఉండి కూడా నష్టాలతో చతికిల పడుతున్న కంపెనీలను చూసిన తరువాత ‘వోయిరో’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సాస్(సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) స్టార్టప్ దక్షిణ ఆఫ్రికాలోని ‘డీఎస్టీవీ’ చానల్‌తో సహా మనదేశంలోని పెద్ద వోటీటీ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ పబ్లిషర్లతో కలిసి పనిచేస్తోంది.... మేకప్ ఆర్టిస్ట్, వీడియో ఎడిటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న కవిత షినాయ్ ఆ తరువాత ఎడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆనంద్ గోపాల్, అనీల్ కారట్, జితిన్ జార్జ్‌లతో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘వోయిరో’ సాస్ స్టార్టప్ మొదలుపెట్టింది. దీనికిముందు కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకోవడానికి తన బృందంతో కలిసి స్వయంగా కంటెంట్ క్రియేట్ చేసేది. ముంబై యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదువుకున్న కవిత మార్కెటింగ్ కమ్యూనికేషన్ కంపెనీ ‘లోవ్ లింటస్’ తో కలిసి పనిచేసింది. ఆ తరువాత యూ ట్యూబ్ టీమ్‌తో పనిచేసింది. చదివిన చదువు, పెద్ద సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం ‘వోయిరో’ ప్రయాణంలో తనకు ఉపకరించాయి. ఒక స్టార్టప్‌కు తొలి విజయ సంకేతం... నిధుల సమీకరణ. నిధుల సమీకరణకు సంబంధించి ‘వోయిరో’కు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. ఇక రెండో సవాలు ఇతరులు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఎంతోమందితో మాట్లాడి, ఎన్నో సలహాలు తీసుకోవడం ద్వారా రెండో సవాలును కూడా అధిగమించింది. డిజిటల్ పబ్లిషర్స్, వోటీటీ ప్లాట్‌ఫామ్‌ల ఆదాయ వృద్ధికి కంటెంట్‌ను మానిటైజేషన్ చేయడం అనేది కీలకం. మార్కెట్, సాంకేతికత, డేటా అనే మూడురకాల అంశాలలో పట్టు ఉండాలి. అది కవితా షెనాయ్ పనితీరులో కనిపిస్తుంది. డిజిటల్ పబ్లిషర్లు, వోటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో ‘వోయిరో’కు సంబంధించి సేల్స్ టీమ్, యాడ్ ఆపరేషన్ టీమ్, ఫైనాన్స్ టీమ్, స్ట్రాటజీ టీమ్ అనే నాలుగు బృందాలు కలిసి పనిచేస్తాయి. మీడియా కంపెనీలకు రెవెన్యూ అనలటిక్స్‌ను అందుబాటులో తీసుకురావడం నుంచి బలమైన ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) స్ట్రాటజీని అనుసరించడం వరకు తనదైన దారిలో ప్రయాణిస్తోంది వోయిరో. కోవిడ్ కల్లోల సమయంలో అన్ని కంపెనీల లాగే ‘వోయిరో’కు సమస్యలు ఎదురైనప్పటికి వోటీటీ పరిశ్రమ, కంటెంట్ స్పేస్ పుంజుకోవడంతో పెద్దగా ప్రభావం చూపలేదు. ‘మీడియాతో అంటే నాకు ఉన్న ఇష్టం, అభిమానం వోయిరో ఆవిర్భావానికి కారణం అయింది. డిజిటల్ పబ్లిషర్లు, కంటెంట్ క్రియేటర్లకు వివిధ విషయాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అవసరం అనే ఉద్దేశంతో ఈ వెంచర్ ప్రారంభించాం. లాభాల కంటే కూడా ఇతరులకు సహాయం చేయాలి, వారి విధానాలలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వోయిరో ప్రారంభించాం. అయితే అది అంత సులువైన విషయం కాదని అర్థమైంది. మా ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకొని ముందుకు వెళుతున్నాం. మీడియా, డిజిటల్ పబ్లిషర్లు నష్టపోకుండా మార్గనిర్దేశం చేయడం మా లక్ష్యం’ అంటుంది కవిత షెనాయ్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది వ్యాపార ప్రస్థానంలో ‘ఇక ముందుకు వెళ్లలేము’ అని నిరాశపడే పరిస్థితి రావచ్చు. దీనికి లొంగిపోకుండా పట్టుదలతో ముందుకు వెళితే విజయం మనల్ని వెదుక్కుంటూ వస్తుంది. ఎంత పెద్ద సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గాలను అన్వేషించడంలో మన ఓపిక, కష్టపడేతత్వం గెలుపును నిర్ణయిస్తాయి. ‘వోయిరో’ ప్రారంభానికి ముందు ఇండస్ట్రీ పెద్దల నుంచి కుటుంబసభ్యులు, స్నేహితుల వరకు ఎంతోమంది నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాం. అవగాహన చేసుకుంటూ, అధ్యయనం చేస్తూ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఓటీటీకి సంబంధించి మార్కెట్ తీరుతెన్నులను విశ్లేషిస్తూ మా పనితీరును మెరుగు పరుచుకుంటూ, పరిధిని విస్తరిస్తూ వెళ్లాం. – కవితా షెనాయ్, వోయిరో–ఫౌండర్, సీయివో -
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు
ధర్మపురి/పెగడపల్లి/కాటారం: కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలను కోరారు. ‘తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎట్లుండే.. ఇప్పుడెట్ల ఉన్నదో’గమనించాలని సూచించా రు. ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ఆదివారం ఆమె ధర్మపురి, పెగడపల్లి మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మూడు గంటల కరెంటు చాలని, ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, అదే జరిగితే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. తాము మరోసారి అధికారంలోకొస్తే అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం ఇస్తామన్నారు. ప్రస్తుత పథకాలు కొనసాగాలన్నా.. మరిన్ని పథకాలు రావాలన్నా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. అనంతరం ఆమె ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. తర్వాత స్థానిక బ్రాహ్మణ సంఘం భవనంలో మహిళలతో మాట్లాడారు. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కవిత మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో లేదని సాకులు చెబుతూ ఏ పనీ చేయ ని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు ఓటు వేయడం వృథా అన్నారు. మంథని అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని ఇటీవల సీఎం ప్రకటించారని, మంథనిని కేసీఆర్ దత్తత తీసుకుంటారేమో అనిపిస్తోందన్నారు. -
న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి న్యాయపోరాటం చేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, వారి సలహా మేరకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లో భారత్ జాగృతి తరఫున ఇంప్లీడ్ అవుతామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తాము పోరాడి సాధించిన మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలుకు పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని, ఈ మేరకు ఇప్పటికే పలు సంస్థలు కోర్టుకు వెళ్లాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
శివకామ సుందరీదేవిగా అమ్మవారు
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలో సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజు అత్యంత వైభవంగా కొనసాగింది. యాగంలో భాగంగా గురువారం రాజశ్యామల యంత్రపూజ కార్యక్రమాన్ని రుత్వికులు ఘనంగా నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములతో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌రావు, ఎమ్మెల్సీ కవిత యాగ క్రతువును పర్యవేక్షించారు. యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ యాగంలో మూడు లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేశారు. అలాగే 11సార్లు శాలిని దుర్గ కవచ పారాయణం నిర్వహించారు. సర్వలోక సంరక్షణార్థం ఇంద్రసుక్త హోమం, నవగ్రహ సుక్త హోమం నిర్వహించారు. షాడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం నిర్వహించారు. -
కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మొద్దు
కోరుట్ల/మెట్పల్లి(కోరుట్ల): నిజాం చక్కెర ఫ్యాక్టరీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలను రైతులు నమ్మవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. స్వాతంత్య్రం రాక ముందే నిజాం చక్కెర ఫ్యాక్టరీలను నిజాం ప్రభువులు ఏర్పాటు చేస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పిందని జీవన్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం వీటిని బీజేపీకి చెందిన మాజీ ఎంపీకి విక్రయించినప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు చోద్యం చూశా రా అని మండిపడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బతుక మ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టు కొని పండుగ చేసుకుంటామని జీవన్‌రెడ్డి వ్యాఖ్యా నించడం ఆయన వయసుకి, హోదాకి తగదని కవిత చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి దిగజారి పోయి బతుకమ్మను అవమానించిన ఆయనను జగిత్యాల ప్రజలు తిరస్కరించడం ఖాయమ న్నారు. నేడు మహారాష్ట్రకు కవిత సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఆదివారం జరిగే బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. అలాగే దత్తవాడ నుంచి సాయంత్రం ప్రారంభమయ్యే బతుకమ్మ శోభాయాత్రలో ఆమె పాల్గొంటారు. -
ఈ కొండ గట్టెక్కిస్తుందని..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముడుపు కట్టి మొక్కడం తెలుగు ప్రజల సంప్రదాయం. అందులోనూ ఏదైనా మంచిపని చేసేముందు.. కొత్త వాహనం కొన్న తర్వాత పూజలు చేయించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల) కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయానికి తెలుగువారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. ముఖ్యంగా తెలుగు రాజకీయ నేతలు ఇక్కడ పూజలు నిర్వహించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తే.. కొండగట్టుకు వచ్చి మొక్కు తీరుస్తానని ఆయన ఉద్యమ సమయంలో అంజన్నకు మొక్కుకున్నారు. ఇటీవల జగిత్యాల పర్యటన సందర్భంగా అంజన్నకు తన మొక్కు చెల్లించుకున్నారు. కొండగట్టు అంటే సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే ఇక్కడికి కుటుంబంతో వచ్చేవారు. ఎమ్మెల్సీ కవిత కూడా బాల్యం నుంచే కొండగట్టుకు వచ్చేవారు. ఎంపీ అయిన తర్వాత కూడా పలుమార్లు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. 2019లో ఎంపీగా గెలవకముందు సంజయ్ కూడా అంజన్నకు ముడుపు కట్టారు. ఆ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన సంజయ్, కొండగట్టులో మొక్కు చెల్లించుకున్నారు. ఈనెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కరీంనగర్ మీదుగా బోధన్ వెళ్లే దారిలో కొండగట్టును దర్శించుకోనున్నారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాయుపుత్రుని దీవెనలు ఉండాలని కాంగ్రెస నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి కొండగట్టు పూజలు షెడ్యూలులో లేనప్పటికీ, రాహుల్‌గాం«దీని కొండగట్టు వద్ద ఆపి, పూజలు చేయించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలకు పూజలు కూడా చేయించనున్నారు. -
2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి..!
-
‘ఆరు గ్యారంటీ’లతో మోసగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు 6 గ్యరంటీలు అంటూ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సభలో రాహుల్ గాంధీ సహా ఇతర నాయకులు అలవికాని హామీలతో మోసం చేసి అధికారం దక్కించుకోవాలనే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ ఆరు గ్యారంటీ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పార్టీనేతలు మాఘం రంగారెడ్డి, మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి, సీహెచ్ విఠల్, రాకేశ్‌రెడ్డి, జె.సంగప్పలతో కలిసి అరుణ మంగళవారం మీడియాతోమాట్లాడారు. ఒక సాధారణ వ్యక్తి దేశ ప్రధాని కావడం, మోదీ నాయకత్వంలో భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. గాంధీ పేరు పెట్టుకుని రాజకీయాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోవడంతో మతఘర్షణలతో లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. కవిత లేఖతో బిల్లు పెడుతున్నారనడం హాస్యాస్పదం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖతో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడుతున్నారనడం హాస్యాస్పదమని అరుణ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో మహిళలకు కనీసం 15% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. పేదలకు ఇళ్లు కట్టించేది కేంద్ర ప్రభుత్వ నిధులతోనా లేక రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నూతన పార్లమెంటు భవనంలో తొలిబిల్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును పెట్టినందుకు బీజేపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటానికి డీకే అరుణ ఆధ్వర్యంలో నేతలు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి, మహిళానేతలు ఆకుల విజయ, బండా కార్తీకారెడ్డి, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే మోదీతో కేసీఆర్‌కు లోపాయికారీ ఒప్పందం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధి, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీతో లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. జాగో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రకుమార్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ కుటుంబం రూ.60 వేల కోట్ల వరకు దోపిడీ చేసినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకే జాగో తెలంగాణ పేరుతో ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి చైతన్యం చేస్తున్నామని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేసి గల్లీకొక బెల్టు షాపు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో విధ్వంసకర పాలన సాగుతోందని, ఇసుక, మట్టి, ల్యాండ్, లిక్కర్ మాఫియాలు చెలరేగుతున్నాయని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భయంకరమైన అవినీతి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. పాలమూరు అధ్యయన వేదిక కన్వి నర్ రాఘవాచారి మాట్లాడుతూ పాలమూరు జిల్లా తెలంగాణ ఉద్యమకాలంలో ఎలా ఉందో ప్రస్తుతం అలాగే ఉందని, వలసలు ఏమాత్రం ఆగలేదన్నారు. పాలమూరు రాజకీయ నేతల బానిసత్వం కూడా పోలేదన్నారు. సమావేశంలో జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధులు ఖలీదా ఫరీ్వన్, ప్రొఫెసర్ వినాయకరెడ్డి, ప్రొఫెసర్ పద్మజాషా, జావిద్ ఖాద్రి పాల్గొన్నారు. -
కార్యాచరణపై రేపు మైనంపల్లి భేటీ
అల్వాల్: ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన కోసం పార్టీ శ్రేణులు, అనుచరులతో శనివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో ఆయన చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తనతోపాటు కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంత్రి హరీశ్ వైఖరి పట్ల ఘాటు విమర్శలు చేసిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యల పట్ల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తమదైన శైలిలో స్పందించారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం జరుగున్న ఈ సమావేశంలో తాను తీసుకునే నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు, అనుచరులకు మైనంపల్లి వెల్లడించే అవకాశం ఉంది. పార్టీ మారుతారనే ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో జరుగుతున్న సమావేశంపై అంతటా ఆసక్తి నెలకొంది. శనివారం 10 గంటలకు దూపల్లిలోని తన నివాసం వద్ద ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు అందరు హాజరు కావాలని పార్టీ శ్రేణులకు ఆయన సమాచారం అందించారు. దీంతోపాటు మైనంపల్లికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సొంత పార్టీ నేతలపై మైనంపల్లి అనుచరులు ఎదురు దాడికి దిగుతున్నారు. -
ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల సెటైర్
సాక్షి, హైదరాబాద్: ‘బీ ది ఛేంజ్ యు వాంట్ టూ సీ’అంటూ 33% మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సలహా ఇచ్చారు. నిజంగా కవితకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే..రానున్న ఎన్నికల్లో 33% అమలు చేయించాలని మంగళశారం ఆమె ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవిత తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. 33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలన్నారు. 115 సీట్లలో 7 స్థానాలు ఇస్తే చిత్తశుద్ధి ఉన్నట్టా అని నిలదీశారు. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా కేబినెట్లోనూ ప్రాధాన్యత దక్కలేదన్నారు. లిక్కర్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి.. కేబినెట్లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాలంటూ సెటైర్ వేశారు. లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి అని మండిపడ్డారు. -
మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ప్రమాదం
సాక్షి, యాదాద్రి: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్. వివరాల ప్రకారం.. మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ మాలోతు కవిత ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అయ్యింది. ఈ విషయం గుర్తించిన పైలట్ యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్‌ను అత్యవసరం ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో హెలికాప్టర్ పెద్దగుట్టపై దాదాపు 20 నిమిషాల పాటు ఆగింది. అనంతరం, అక్కడ ఉన్న సిబ్బంది వ్యాన్‌లో ఇంధనం తీసుకురావడంతో హెలికాప్టర్లో ఇంధనం నింపారు. దీంతో, తిరిగి హెలికాప్టర్ హైదరాబాద్‌కు పయనమైంది. ఇక, ఎర్రబెల్లి, కవితకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
శభాష్ కవిత!
కళ్యాణదుర్గం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. దాదాపు 35 శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం కానీ.. రెవెన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ, పౌల్ట్రీ రంగాల సేవలు కానీ.. తదితర సేవలకు సంబంధించి సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న గంటల వ్యవధిలోనే ఉద్యోగులు పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సకాలంలో సచివాలయ ఏఎన్ఎం కాన్పు చేసి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడారు. ఆపదలో మేమున్నమంటూ.. : కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న కవిత అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. మంగళవారం ఉదయం కంబదూరు మండలం తిప్పేపల్లికి చెందిన గర్భిణి వినీతకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబసభ్యుల నుంచి సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకుని గర్భిణిని కళ్యాణదుర్గం సీహెచ్‌సీకి తరలించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నూతిమడుగు వద్దకు చేరుకోగానే గర్భిణికి నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో వాహనాన్ని పైలెట్ జనార్ధన్ రోడ్డు పక్కన ఆపేశాడు. అదే సమయంలో తిమ్మసముద్రం సచివాలయానికి విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఏఎన్ఎం కవిత అక్కడకు చేరుకున్నారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణిని చూసి స్పందించిన ఆమె ఈఎంటీ బ్రహ్మయ్య సాయంతో వినీతకు ప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డకు వినీత జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను కళ్యాణదుర్గం సీహెచ్‌సీలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు సకాలంలో కాన్పు చేసి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన ఏఎన్ఎం కవితను అభినందించారు. ఏఎన్ఎం చూపిన చొరవపై కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, సత్వర సేవలు అందించేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. -
లిక్కర్ స్కాం లో మరో సంచలన లేఖ విడుదల చేసిన సుకేష్
-
కవిత,కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీఎం కేసీఆర్ కుటుంబంలోనే పరీక్ష పేపర్ల లీకు వీరులు, ప్రజలకు తాగించే లిక్కర్ వీరులు ఉన్నారని.. సీఎం కుమార్తె కవిత లిక్కర్ స్కాంలో, డ్రగ్స్ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే తనపై కక్షగట్టి, పథకం ప్రకారం పదో తరగతి పేపర్ లీకేజీలో అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తనపై పీడీ యాక్ట్ పెట్టాలంటున్న మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఎంతో మంది మరణాలకు కారణమని.. వాస్తవానికి వారిపైనే పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతిపేపర్ లీక్ కేసులో రిమాండ్ అయిన బండి సంజయ్.. శుక్రవారం ఉదయం 9 గంటలకు కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైతుంటే సీఎం కేసీఆర్ స్పందించడం లేదేమని నిలదీశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై త్వరలోనే వరంగల్‌లో భారీఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. వారిపైనే కేసులు పెట్టాలి.. తనపై పీడీ యాక్ట్ పెట్టాలంటున్న మంత్రి హరీశ్‌రావుపై హత్యానేరం కేసు పెట్టాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో ఆత్మాహుతి చేసుకునేందుకు అగ్గిపెట్టె దొరకని మంత్రి హరీశ్‌రావు అని ఎద్దేవాచేశారు. ఆయన ధోరణితోనే 1,400 మంది బలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే కేటీఆర్‌ను సీఎం చేస్తే ముందు పార్టీ మారే జంప్ జిలానీ హరీశ్‌రావేనని ఎగతాళి చేశారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కారణమైన కేటీఆర్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లడం ఖాయమని.. త్వరలో కేటీఆర్ కూడా డ్రగ్స్ కేసులో అరెస్టు అవుతారని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరు సరికాదు.. కొందరు పోలీసులు పోస్టింగులు, ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ‘‘అసలు పదో తరగతి పేపర్‌ను ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధం? ప్రభుత్వం, పోలీసుల చేతగానితనాన్ని మాపై నెడతారా? వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ రంగనాథ్ తన టోపీపై ఉన్న మూడు సింహాలపై ప్రమాణం చేసి నిజాయతీ నిరూపించుకోవాలి. కరీంనగర్, వరంగల్ పోలీసులపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా..’’ అని పేర్కొన్నారు. తన సెల్‌ఫోన్ ఎక్కడుందో తనకే తెలియదని, టెక్నాలజీలో ఘనులమని చెప్పుకునే పోలీసులు అందులో ఏముందో తెలుసుకోలేరా? అని ప్రశ్నించారు. ఇక కమలాపూర్ పేపర్ లీకేజీలో బాలుడిని ఐదేళ్లపాటు డీబార్ చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. పేపర్ లీకేజీకి బాధ్యులను గుర్తించకుండా అమాయక విద్యార్థి భవిష్యత్‌ను దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు. సంజయ్‌కు అమిత్‌షా ఫోన్ జైలు నుంచి విడుదలైన సంజయ్‌కు కేంద్రమంత్రులు అమిత్‌షా, స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు సీనియర్ నేతలు ఫోన్ చేసి పరామర్శించారు. పోరాటం ఆపవద్దని.. కేంద్రం, జాతీయ నాయకత్వమంతా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎంకు సభకు వస్తే గజమాల వేస్తాం రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని సభకు సీఎం కేసీఆర్ రావాలని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ వస్తే గజమాల వేసి, శాలువా కప్పి సన్మానం చేస్తామన్నారు. రాకుంటే మాత్రం కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. -
ఫోన్ల వాడకంపైనే ప్రశ్నలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వరసగా రెండోరోజు మంగళవారం కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు అంశాలపై సుమారు పది గంటల పాటు అధికారులు ఆమెను ప్రశ్నించారు. ప్రధానంగా పది ఫోన్లు వినియోగించారన్న ఆరోపణలపై కవితను ప్రశ్నించినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 11.30 గంటలకు తుగ్లక్ రోడ్‌లోని నివాసం నుంచి భర్త అనిల్ వెంట రాగా బయటకు వచ్చిన కవిత.. మీడియాకు విజయ సంకేతం చూపుతూ ఈడీ కార్యాలయానికి బయలు దేరారు. ఈడీ తన చార్జిషీటులో కవిత 6209999999 నంబరును ఆరు వేర్వేరు ఐఎంఈఐ నంబర్లున్న ఆరు ఫోన్లలో, 8985699999 నంబరును నాలుగు వేర్వేరు ఐఎంఈఐ నంబర్లున్న నాలుగు ఫోన్లలో వినియోగించారని ఆరోపించింది. దీంతో ఆ పది ఫోన్లను కవిత మంగళవారం ఈడీకి అందజేశారు. మనీలాండరింగ్ కేసులో ఆప్ అగ్రశ్రేణి నేతలతో కవిత సంభాషించారని, పాలసీ విధానం ముందుగానే వాట్సాప్‌లో లీకయిందన్న ఆరోపణల నేపథ్యంలో కవిత ఫోన్లు పరిశీలించే నిమిత్తం వాటిని తీసుకురావాలని కోరినట్లు తెలిసింది. కాగా కవిత నుంచి తీసుకున్న ఫోన్లను క్లోనింగ్ నిమిత్తం పంపినట్లు సమాచారం. మూడు వాంగ్మూలాలపై సంతకాలు దర్యాప్తు అధికారి జోగిందర్, ఓ మహిళా అధికారి సహా మరో ముగ్గురు అధికారులు కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. ఏ ఫోనును ఎప్పుడు వినియోగించారు? ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వినియోగించారు? తక్కువ కాలంలో ఎక్కువ ఫోన్లు వినియోగించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అనే కోణంలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మొత్తం మూడుసార్లు విచారణ సందర్భంగా మూడు వాంగ్మూలాలు నమోదు చేసిన ఈడీ అధికారులు వాటిపై కవితతో పాటు ఆమె న్యాయవాది సంతకాలు కూడా తీసుకున్నట్టు సమా చారం. ఇలావుండగా ఇంతకుముందే ఒక ఫోన్‌ను ఈడీకి ఇచ్చిన కవిత.. ఈరోజు 10 ఫోన్లు ఇవ్వడంతో మొత్తం 11 ఫోన్లు ఇచ్చినట్టయ్యింది. నేడు విచారణ లేనట్టేనా? విచారణ అనంతరం రాత్రి 9.40 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. పిడికిలి ఎత్తి, విజయ సంకేతం చూపుతూ, చిరునవ్వుతో శ్రేణులకు అభివాదం చేస్తూ నివాసానికి చేరుకున్నారు. తదుపరి విచారణ తేదీని ఈడీ ఇంకా ప్రకటించలేదు. అయితే బుధవారం విచారణకు రమ్మనలేదని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. ఈడీ కార్యాలయానికి భరత్ కవితను విచారిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కవిత విజ్ఞప్తి మేరకే ఈడీ అధికారులు భరత్‌ను పిలిచినట్లు తెలిసింది. అయితే కవిత తరఫున తదుపరి విచారణలో పాల్గొనడానికి సంబంధించిన ప్రక్రియ నిమిత్తం పిలిచారా? లేక కవిత న్యాయవాది సమక్షంలో సమాధానాలు చెబుతానంటే పిలిచారా? అనేది తెలియలేదు. -
అరెస్టులు జరగొచ్చు!
సాక్షి, హైదరాబాద్: సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల విచారణలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి అరెస్టులు వంటివి అనివార్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయని.. అప్పుడు బీజేపీకి ప్రతికూలంగా జరిగే ప్రచారాన్ని ఎండగట్టేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా సూచించినట్టు తెలిసింది. జాతీయ దర్యాప్తు సంస్థల విచారణ, బయటపడుతున్న వాస్తవాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్టు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించడం, ఢిల్లీలో, హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నిరసనలు, కేంద్రాన్ని, ప్రధాని మోదీని తప్పుబడుతూ జరుగుతున్న ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టాలని అమిత్‌షా ఆదేశించినట్టు తెలిసింది. ఈ నెల 16న కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్నందున.. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలపై అవినీతి, అక్రమ ఆరోపణలను విస్తృతంగా ప్రచారం చేసి, బీజేపీకి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలని సూచించినట్టు సమాచారం. విమానంలో సమస్యతో.. ఆదివారం హైదరాబాద్‌లో సీఐఎస్ఎఫ్ రైజింగ్‌డే కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన 11.40 గంటలకు బీఎస్ఎఫ్ ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చికి వెళ్లాలి. కానీ విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో దాదాపు నాలుగున్నర గంటల పాటు హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లోనే ఉండిపోయారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కూడా అక్కడే ఆగారు. ఈ సందర్భంగా వారు పలు విడతలుగా రాష్ట్ర అంశాలపై అమిత్‌షాతో చర్చలు జరిపినట్టు తెలిసింది. బీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు, ఢిల్లీ లిక్కర్ స్కాంపై అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. దర్యాప్తులపై స్పష్టత ఇవ్వండి ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదన్న విషయాన్ని.. ఈ కేసులో వాస్తవాలు, ఆధారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు అమిత్‌షా సూచించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో బీజేపీకి, ప్రధాని మోదీకి ఎలాంటి సంబంధం లేదని వివరించాలని ఆదేశించినట్టు సమాచారం. నేతలంతా సమష్టిగా ముందుకు సాగాలని, మెరుగైన సమన్వయం అవసరమని నొక్కి చెప్పారని తెలిసింది. కొన్నిరోజుల కింద ఢిల్లీలో అమిత్‌షాతో జరిగిన రాష్ట్ర కోర్‌కమిటీ భేటీ అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై బండి సంజయ్ ఓ నివేదికను అందజేసినట్టు సమాచారం. బీఎస్ఎఫ్ విమానానికి మరమ్మతులు పూర్తయ్యాక అమిత్‌షా ఢిల్లీకి బయలుదేరారు. ఇక సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు పునః ప్రారంభం అవుతుండటంతో కిషన్‌రెడ్డి, సంజయ్, లక్ష్మణ్ కూడా ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. -
కవితకు దీక్ష చేసే అర్హత లేదు
సాక్షి, హైదరాబాద్: ‘‘సీఎం కేసీఆర్ బిడ్డ కవితకు మహిళా బిల్లుపై ఢిల్లీలో దీక్ష చేసే అర్హత, మాట్లాడే నైతికహక్కు లేవు. రాష్ట్రంలో మహిళల సమస్యలు, వారిపై సాగుతున్న అఘాయిత్యాలు, అన్యాయంపై కవిత ఏనాడూ నోరు మెదపలేదు. రాష్ట్రంలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా, నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొదట కవిత తన తండ్రి ఇంటి ఎదుట ధర్నా చేసి మహిళలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించడం లేదేమని నిలదీస్తే బాగుండేది’’అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘మహిళా గోస– బీజేపీ భరోసా’పేరిట పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పలువురు మహిళా నేతలు నిరసన దీక్ష నిర్వహించారు. బండి సంజయ్ ఈ దీక్షలో పాల్గొని మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా, దీనిపై ఎందుకు స్పందించడం లేదని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంటే ప్రజాసమస్యలపై పోరాడుతున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎంల జెండాలను చూస్తేనే మహిళలు భయపడే పరిస్థితి నెలకొందని బండి సంజయ్ విమర్శించారు. గతంలో మహిళా బిల్లు ప్రతులను పార్లమెంటులోనే చించి పడేసిన ఎస్పీ, ఆర్జేడీ, ఎంఐఎంలతో బీఆర్ఎస్ అంటకాగుతూ దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మరి ఈ కేసులు బీఆర్ఎస్ పెట్టించినవా?: కె.లక్ష్మణ్ సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని కేటీఆర్ అంటున్నారని.. మరి రాష్ట్ర పోలీస్, ఏసీబీ పెట్టిన కేసులన్నీ బీఆర్ఎస్ పెట్టించినవేనా? అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణలో మద్యం ఆదాయ మార్గంగా మారి ఢిల్లీ నుంచి పంజాబ్ దాకా పాకిందని విమర్శించారు. లిక్కర్ స్కామ్‌పై కాంగ్రెస్ మాట్లాడదేం?: డీకే అరుణ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై కాంగ్రెస్ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఈడీ కేసులకు, కవిత ధర్నాకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానిస్తుంటే.. మహిళా ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ దీక్షలో పార్టీ నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఆకుల విజయ, డాక్టర్ పద్మ, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, సులోచన, గీతారాణి తదితరులు పాల్గొన్నారు. కాగా మహిళా దీక్ష సందర్భంగా బండి సంజయ్, డీకే అరుణలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి అభినందించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ దీక్ష చేయడం అభినందనీయమన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘సీఎం నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశం సంతాప సభను తలపించింది. ఆయన ముఖంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్‌బౌల్డ్ అయింది. తప్పు చేసినోళ్ల సంగతి తేలుస్తాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది మరో మూడు, నాలుగు నెలలేనని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని పేర్కొన్నారు. టీఎన్జీవో నాయకుల చిట్టా తీస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. -
కవిత దీక్ష విజయవంతం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష విజయవంతం అయింది. శుక్రవారం జంతర్‌మంతర్‌లో చేపట్టిన ఈ దీక్ష కు తెలంగాణతోపాటు ఢిల్లీ, దాని పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. భారత్ జాగృతి చెప్పినట్లుగానే సుమారు 5 వేల మంది ఈ దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కవిత అనుచరు లు కలిపి ఐదారువందల మంది రాష్ట్రనేతలు హాజరుకాగా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు దీక్షకు తరలివచ్చారు. ఢిల్లీలోని జేఎన్‌యూ, జామి యా యూనివర్సిటీలతో పాటు చుట్టుపక్కల వర్సిటీల నుంచి వచ్చిన యువతులు ఆరంభం నుంచి ముగింపు వరకు దీక్షలో పాల్గొన్నారు. 18 పార్టీల నేతలు, ప్రతినిధులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ఆరంభించగా, సీపీఐ నేత నారాయణ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. సంజయ్ సింగ్, చిత్ర సర్వార (ఆప్), నరేష్ గుజ్రాల్ (అకాలీదళ్), అంజుమ్ జావెద్ మిర్జా (పీడీపీ), షమీ ఫిర్దౌజ్ (నేషనల్ కాన్ఫరెన్స్), సుస్మితా దేవ్ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్ (ఎన్సీపీ), పూజ శుక్లా (ఎస్పీ), శ్యామ్ రజక్ (ఆర్జేడీ)తోపాటు శివసేన నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ కిసాన్ యూనియన్, నేషనల్ క్రిస్టియన్ బోర్డు, తమిళనాడు, కేరళ రైతు సంఘాల ప్రతినిధులు, సింగరేణి కోల్ మైన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాలుపంచుకున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా కవిత చేపట్టిన దీక్షపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. దీక్షకు హాజరైన రాష్ట్ర నేతలతో పాటు, వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత వివరాలన్నింటినీ సేకరించాయి. సివిల్ దుస్తుల్లో ఉన్న సుమారు 20 మందికి పైగా ఇంటెలిజెన్స్ అధికారులు దీక్ష జరిగినంత సేపూ అక్కడే ఉండి ప్రతి విషయాన్ని నోట్ చేసుకున్నారు. వేర్వేరు భాషల్లో మాట్లాడిన నేతల ప్రసంగాలను అక్కడే మీడియా ప్రతినిధులు, ఇతరులతో తర్జుమా చేయించుకోవడం కనిపించింది. కవిత శనివారం ఈడీ ముందు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల వైఫల్యం చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే ఇంటెలిజెన్స్ కన్నేసినట్లు చెబుతున్నారు. -
ఈడీ సమన్లు కావు.. మోదీ సమన్లు
సాక్షి, హైదరాబాద్: దేశంలో విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలన సాగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ‘అయితే జుమ్లా... లేదంటే హమ్లా’అనే రీతిలో మోదీ ప్రభుత్వం ఉందని, అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. అవి ‘ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు’అని పేర్కొన్నారు. మోదీ సర్కార్ చేతిలో ‘ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలు»ొమ్మ’గా మారాయని విమర్శించారు. రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామని, కవిత ఈడీ ముందు హాజరై పూర్తిస్థాయిలో సహకరిస్తారని తెలిపారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.... ఒక్క బీజేపీ నేతపై అయినా దాడులు జరిగాయా? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీలపైకి ఉసిగొల్పుతోంది. కవితే మొదటి వ్యక్తి కాదు. చివరి వ్యక్తీ కాదు. ఇంకా చాలామంది ఉంటారు. మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పీఏ, జగదీశ్‌రెడ్డి పీఏల మీద ఐటీ, ఈడీ అధికారులతో దాడులు చేయించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మీద ఐటీ దాడులు జరిగాయి. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర,, పార్థసారథి రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి మొదలైన 12 మంది మీద ఈడీ, సీబీఐ, ఐటీలతో కేంద్ర ప్రభుత్వం దాడులు చేయించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు పంపింది. మోదీ పాలనలో ఈడీ దాడులు 95 శాతం విపక్షాల మీదనే జరుగుతున్నాయి. ఒక్క బీజేపీ నేత మీద అయినా ఈ తరహా దర్యాప్తు సంస్థల దాడులు జరిగిన చరిత్ర లేదు. ఈ తొమ్మిదేళ్లలో ప్రతిపక్షాల మీద ఈడీ నమోదు చేసిన కేసుల సంఖ్య 5,422. అందులో కేవలం 23 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చింది. అదానీ కంపెనీ మోదీ సొంత కంపెనీ... ప్రతిపక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి.. ఇవి తప్ప ఈ తొమ్మిదేళ్లలో మోదీ సర్కార్ సాధించిందేమీ లేదు. గౌతమ్ అదానీ అనే వ్యక్తి మోదీ బినామీ అని చిన్న పిల్లగాడిని అడిగినా చెబుతాడు. ఒక సంస్థకు రెండు ఎయిర్‌పోర్టులకంటే ఎక్కువ కాంట్రాక్టులు కట్టబెట్టొద్దని ఇప్పటిదాకా ఉన్న నిబంధనలను తుంగలో తొక్కి.. గౌతమ్ అదానికి ఆరు ఎయిర్‌పోర్టులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం? సాక్షాత్తూ నీతి ఆయోగ్ దీన్ని తప్పుబట్టింది. దేశాన్ని కుదుపు కుదిపేసిన హిండెన్‌బర్గ్ నివేదిక మీద మోదీకి మాట రాదు. రూ.13 లక్షల కోట్ల ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి ప్రజా సంస్థల డబ్బులు ఆవిరైనా.. ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు. గౌతం అదానీకి చెందిన ముంద్రా పోర్టులో దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్ పట్టుబడితే ఒక్క కేసు నమోదు కాదు. ఇటీవల జరిగిన జీ20 సదస్సులో పాల్గొనడానికి వచ్చి న శ్రీలంక ఆర్థిక మంత్రి.. అదానీకి, శ్రీలంకకు మధ్య జరిగిన ఆరువేల కోట్ల ఒప్పందాన్ని జీ టు జీ ఒప్పందంగా పేర్కొన్నాడు. జీ టూ జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు గౌతమ్ అదాని టు గొటబయ అని అర్థం. అదాని కంపెనీ మోదీ సొంత కంపెనీ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అదానీ కోసం ప్రధాని హోదాలో మార్కెటింగ్ చేస్తున్నారు. బీజేపీ వ్యవహారం ‘వాషింగ్ పౌడర్ నిర్మాయే..’ సీఎం కేసీఆర్ చెప్పినట్లు వాషింగ్ పౌడర్ నిర్మా.. అన్నట్లుగా ఉంది బీజేపీ వ్యవహారం. అంటే బీజేపీలో చేరగానే వారి పాపాలు, వారి మీద ఉన్న కేసులు వెంటనే పోతాయి. సుజనాచౌదరికి చెందిన షెల్ కంపెనీల ద్వారా లగ్జరీ కార్లు కొనుగోలు చేశారని, వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్ జరిగిందని ఈడీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. కానీ సుజనాచౌదరి బీజేపీలో చేరడంతో ఆ కేసులు నీరుగారాయి. ఏపీలో బ్యాంకులకు వందల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు మీ పార్టీలో చేరగానే పునీతులు అయ్యారా ? ఇటీవల కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కొడుకు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయినా ఎలాంటి దాడులు ఉండవు. మహారాష్ట్రకు చెందిన ఎంపీ పాటిల్ అనే వ్యక్తి.. ‘బీజేపీలో చేరినందున నా మీదకు ఈడీ రాదు’అని చెప్పారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఈడీ నుంచి ఉపశమనం పొందానని హర్షవర్ధన్ అనే ఎంపీ చెప్పాడు. పశ్చిమబెంగాల్లో వేల కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న తృణమూల్ నేత సువేందు అధికారిని విచారణల పేరుతో భయపెట్టి బీజేపీలో చేర్చుకున్న తర్వాత ఆ కేసు ముందుకు సాగకపోవడం నిజం కాదా? శారదా కుంభకోణం ప్రధాన నిందితుడు హిమంత బిస్వాశర్మ బీజేపీలో చేరిన తరువాత ఈడీ, సీబీఐ అతనిపై దర్యాప్తును ఎందుకు నిలిపివేశాయి? బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల మీద దాడులు చేయడం ద్వారా తమకు అనుకూలంగా లేకపోతే మీడియా సంస్థలపై సైతం ఎలాంటి చర్యలకైనా సిద్ధం అని ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ అంటే..ఒకటి మోదీ, మరొకటి అదాని డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అంటున్న బీజేపీ ప్రభుత్వం అసలు రూపం దేశ ప్రజలకు ఇప్పుడు అర్థం అయింది. ఒక ఇంజిన్ మోదీ అయితే మరో ఇంజిన్ అదానీ. ఆ డబుల్ ఇంజన్ పేరు ‘మాదాని.. అంటే మోదీ, అదానీ అన్నమాట. మోదీ– అదానీ చీకటి స్నేహం వెనుక దాగి ఉన్న ఆంతర్యం ప్రజలందరికీ తెలుసు. తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా? మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో దొడ్డిదారిన తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా? ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కాంట్రాక్టులు, పదవుల పేరుతో లొంగదీసుకున్నది అబద్ధమని చెప్పగలరా? మన తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని బీజేపీలోకి లాక్కున్నది వాస్తవం కాదా? మద్యమే లేని గుజరాత్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 42 మంది చనిపోతే ఏ విచారణ చేశారు? అది స్కాం కాదా? ఢిల్లీ లిక్కర్ పాలసీని తప్పుబడుతున్న వారు.. గుజరాత్లో జరిగిన ఘటనపై ఏ చర్యలు తీసుకున్నారు? ఈడీ, బోడీలకు భయపడేదే లేదు.. టార్గెట్ కేసీఆర్‌లో భాగంగానే.. ఉద్యమనేత బిడ్డగా పుట్టుకనుండే చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న ఉద్యమకారిణి ఎమ్మెల్సీ కవితను ఈడీ పేరుతో వేధిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీకి కంట్లో నలుసులా తయారైన ఆప్ సర్కార్ మీద కుట్రలో భాగంగానే మనీశ్ సిసోడియాను కూడా అరెస్టు చేశారన్నది దేశ ప్రజలకు తెలుసు. బ్యాంకుల్ని ముంచినవారిని, కమీషన్లు దండుకుంటున్న వారిని పట్టించుకోకుండా కవిత మీద , ఇతర నేతల మీద ఈడీలను, బోడీలను ప్రయోగిస్తే భయపడే ప్రసక్తే లేదు. -
ఈడీ విచారణకు కవిత.. అరెస్ట్ తప్పదా?.. ఒకవేళ అదే జరిగితే!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత మానసికంగా ఏ పరిస్థితిని అయినా ఎదుర్కునేందుకు సిద్దమవుతున్నట్లుగా ఉన్నారు. డిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెకు తొమ్మిదో తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం, తదుపరి ఆమె పదకుండో తేదీన హాజరు కాగలనని చెప్పగా, ఈడీ అందుకు అంగీకరించడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సహజంగానే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. జైలులో పెట్టినంత మాత్రాన కృష్ణుడు జన్మించడం ఆగలేదు.. అజ్ఞాత వాసం తర్వాత అర్జునుడు విజయం సాధించాడు.. అని కవిత సెంటిమెంటును ప్రయోగించారు. అంటే దీని అర్ధం ఒకవేళ తాను జైలుకు వెళ్లవలసి వచ్చినా, అంతిమంగా తానే గెలుపు సాధిస్తానని చెప్పడమే. పురాణాలలో ఏమి జరిగిందన్నది పక్కనబెడితే, కవిత ఎదుర్కుంటున్న కేసు విభిన్నమైనదని చెప్పాలి. ఢిల్లీలో మద్యం షాపుల కేటాయింపు వ్యవహారంలో ముడుపుల చెల్లింపు జరిగిందన్నది ఆరోపణ. వంద కోట్ల మేర ఈ ముడుపులు ఉన్నాయని, తద్వారా వ్యాపార లావాదేవీలలో నిందితులు లాభపడ్డారని ఈడీ అభియోగం మోపుతోంది. నిజానికి ఇలాంటి కేసులలో ఒక మహిళా నేతగా ఉన్న కవిత చిక్కుకోవడం దురదృష్టకరం. ఇప్పుడు ఆమె తాను మహిళను కనుక ఇంటివద్దే విచారించాలని కోరుకోవడం తప్పుకాదు. కాని ఇప్పటికే ఒకసారి ఆమె విచారణ జరిగింది. మరోసారి జరగబోతోంది. ఈ స్కామ్‌లో అరెస్టు అయిన రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆమెను విచారిస్తున్నారు. ఆ సాక్ష్యం ప్రకారం పిళ్లై ఎమ్మెల్సీ కవితకు బినామీ అని ఈడీ చెబుతోంది. అది నిజమా? కాదా అన్నది తేలవలసి ఉంది. కవిత కాని, ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్ కాని, ఇప్పటివరకు ఈడీని ప్రతిపక్షాలపై మోదీ ప్రయోగిస్తున్నారని, ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రతిపక్షాలపై కేంద్రం ఇలాంటి దాడులు చేయిస్తోందని వారు అంటున్నారు. ఇందులో నిజం ఉండవచ్చు. కేంద్రం అలా చేస్తే తప్పే అవుతుంది. కాని అదే సమయంలో ఈడీ వేస్తున్న ప్రశ్నలకు కవిత కాని, కేటిఆర్ కాని సమాధానాలు ఇవ్వగలిగితే బాగుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం జోలికి వస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇలాంటి ప్రకటనల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేశారు. అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో ఉంది. తాము ఏలుతున్న చోట అరాచకం వస్తుందని ఒక మంత్రి ఎలా చెబుతారో తెలియదు. బీఆర్ఎస్ నేతలు ఈ స్కామ్ కు సంబంధించి కవితకు అండగా ఉంటామని అంటున్నారు. అసలు వీరెవ్వరూ కవితకు రక్షణగా నిలవవలసిన అవసరం లేదు. తెలంగాణ జాగృతి పేరుతో ఒక సాంస్కృతిక ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆమెకు ధైర్యం ఎక్కువే. ఇక్కడ సమస్య వారి అండ, వీరి అండ కాదు. ఈడీ అధికారులు అడిగే నిర్దిష్ట ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగలిగితే ఈ కేసు నుంచి బయటపడడం సులువే అవుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు కవితపైన, బీఆర్ఎస్ పైన కొన్ని విమర్శలు చేస్తూ కవిత వల్ల తెలంగాణ సమాజానికి అప్రతిష్ట వచ్చిందని అన్నారు. కవిత తప్పు చేయకపోతే సెల్ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే కవిత కూడా డిల్లీ హోటల్లో జరిగిన లిక్కర్ వ్యాపారుల సమావేశంలో పాల్గొన్నారా? లేదా? గోవా ఎన్నికలకు గాను ఆమ్ఆద్మీ పార్టీకి నిధులు వెళ్లాయా?లేదా? రామచంద్రపిళ్లై వాస్తవానికి కవిత బినామీనా?కాదా? వారితో ఈమెకు వ్యాపార సంబంధాలు ఉన్నాయా? లేవా? హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబు కాని, వ్యాపారి అభిషేక్ వంటివారు కీలకపాత్ర పోషించడం నిజమా? కాదా? ఇలాంటివాటికి జవాబులు ఇవ్వడం ద్వారా కవిత తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని రుజువు చేసుకోగలుగుతారు తప్ప, కేవలం రాజకీయ విమర్శలు చేయడం వల్ల ఎంత ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే అదే సమయంలో బీజేపీ కూడా రాజకీయంగానే కొన్ని కేసులను చూస్తోందన్న విమర్శ ఉంది. సెలెక్టివ్‌గా కొందరిపైకే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉసి కొల్పుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవలే శివసేన నేద సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేసి పదిహేను రోజులకు పైగా నిర్భంధించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చినప్పుడు కూడా వారు ఇవే కక్ష ఆరోపణలు చేశారు. చిత్రం ఏమిటంటే సోనియాగాందీ దేశంలో తనకు ఎదురులేని విధంగా చక్రం తిప్పినప్పుడు ప్రత్యర్ధులపై ఇలాంటి అస్త్రాలనే వాడారన్న విమర్శలను ఎదుర్కున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడిపై కేసులు వచ్చిన తీరును ప్రజలంతా కక్షపూరిత కేసులుగానే భావించారు. దానికి కారణం ఒకటే.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పడు ఎలాంటి కేసులు లేకపోవడం, ఆ తర్వాత కేసులు పెట్టడం. 2019 ఎన్నికలకు ముందు ఆనాటి విభజిత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రం తనపై సీబీఐని ఉసికొల్పుతోందని, ప్రజలంతా తనకు రక్షణగోడగా నిలవాలని కోరేవారు. రాష్ట్రంలోకి సీబిఐ అడుగుపెట్టడానికి వీలులేదని ఆయన ఆంక్షలు పెట్టారు. ఇక్కడ విశేషం ఏమిటంటే సీబీఐ వేధింపులకు గురైన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో సీబీఐపై ఆంక్షలు తొలగించడం. మరో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఓటమి చెందిన తర్వాత ఆయన పీఏపై ఐటి అధికారులు దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల అక్రమాలకు ఆధారాలు ఉన్నాయని తేల్చినట్లు సీబీటీడీ ప్రకటించింది. నాలుగేళ్లు అవుతున్నా ఆ కేసు ఏమి అయిందో తెలియదు. చంద్రబాబు తన మేనేజ్ మెంట్ స్కిల్ తో ఆ కేసు పైకి రాకుండా చేసుకోగలిగారని చాలామంది భావిస్తుంటారు. అదే కాదు. ఓటుకు నోటు కేసులో మనవాళ్లు బ్రీప్ డ్ మీ అంటూ వాయిస్‌తో పట్టుబడ్డప్పుడు బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును రక్షించలేరని కేసీఆర్ అనేవారు. కాని చిత్రంగా ఆయనే రక్షణ బాధ్యత తీసుకునేలా చంద్రబాబు చేయగలిగారని ఎక్కువమంది నమ్ముతుంటారు. బహుశా దేశంలోనే ఇలా ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయగల నైపుణ్యం చంద్రబాబుకే ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. కాని ఇప్పుడు కేసీఆర్ తన కుమార్తె కవిత విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆమెను ఈడీ నిజంగా అరెస్టు చేస్తుందా? లేదా? అన్నది తేలడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. కాని ఇలాంటి స్కామ్ లో ఇరుకున్నారన్న అపవాదు రావడం జనంలో కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. ఒకవేళ అరెస్టు అయితే ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఆయన తర్జనభర్జన పడుతున్నారు. డిల్లీ ఉపముఖ్యమంత్రిగా ఉంటూ అరెస్టు అయిన మనీష్ సిసోడియాకు మద్దతుగా కేసీఆర్‌తో సహా పలువురు ప్రతిపక్ష నేతలు ప్రధానికి లేఖ రాశారు. తన కుమార్తెకు ఎదురయ్యే ఈ సమస్యను దృష్టిలో ఉంచుకునే లేఖ రాసి ఉండవచ్చు. ఈ ఏడాది ఆఖరుకు తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోగా ఈ పరిణామం ఇంకా ఎలా రూపాంతరం చెందుతుంది? రాజకీయంగా బిఆర్ఎస్ కు ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అన్న చర్చ సహజంగానే జరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు దీని ఆధారంగా రాజకీయంగా ముందుకు వెళ్లి కేసీఆర్‌ను ఇరుకున పెట్టడానికి యత్నిస్తాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత మల్లు భట్టి ఈ కేసులో ఆప్‌తో పాటు, బిఆర్ఎస్ ను కూడా విమర్శించారు. చదవండి: కవిత తెలంగాణ పరువు తీశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో డిల్లీలో మహిళా రిజర్వేషన్ లపై జరుపుతున్న ధర్నాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గేని కవిత ఆహ్వానించడం ఆసక్తికర పరిణామం. తనకు ఎదురైన సమస్యను రాజకీయంగా ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ను కలుపుకునే యత్నం చేస్తున్నట్లు అనుకోవచ్చు. కాని కాంగ్రెస్ ఇందుకు సిద్దపడితే ఆశ్చర్యపోవాల్సిందే. ఏది ఏమైనా కవిత ఇలాంటి కేసును ఎదుర్కోవలసి రావడం బాధాకరమే. దీని వల్ల పార్టీకి,ముఖ్యమంత్రికి ఎంతో కొంత అప్రతిష్టే అని చెప్పక తప్పదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ -
నాడు సీబీఐ.. నేడు ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి గతేడాది డిసెంబర్ 11న హైదరాబాద్‌లో కవితను సీబీఐ విచారించిన విషయం విదితమే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుంభకోణంలో సౌత్ గ్రూపునకు చెందిన పలువురు కీలకపాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. గతేడాది ప్రధాన నిందితుడు సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీ టులో పలుసార్లు కవిత పేరు ప్రస్తావించిన విషయం విదితమే. సాక్ష్యాలు ధ్వంసం చేసే క్రమంలో కవిత కూడా తన ఫోన్లు ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈడీ విచారణలో నిందితులు సమీర్ మహేంద్రు, దినేష్ అరోరా, అరుణ్ పిళ్లై, వి.శ్రీనివాసరావులు కవిత పేరు ప్రస్తావించారు. సోమవారం రాత్రి అరుణ్పిళ్లైను అరెస్టు చేసిన ఈడీ మంగళవారం ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండు రిపోర్టులో అరుణ్పిళ్లై .. కవిత బినామీ అని పేర్కొంది. తాజాగా ఆమెకు కూడా నోటీసులు జారీ చేయడంతో వీరిద్దరినీ కలిపి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈడీ రికార్డు చేసిన స్టేట్మెంట్లు ఇలా ఉన్నాయి. సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్స్ వెనక ఉన్నవారెవరని అరుణ్ పిళ్లైను సమీర్ మహేంద్రు అడగగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారని సమీర్‌కుపిళ్లై చెప్పారని ఈడీ పేర్కొంది. ‘ఇండో స్పిరిట్స్ దరఖాస్తుపై సమస్యలు వస్తే తన స్థాయిలో పరిష్కరిస్తానని, అరుణ్పిళ్లై ద్వారా తనకు తెలియజేయాలని సమీర్ మహేంద్రుకు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్ వెళ్లినపుడు కవిత ఇంట్లో ఆమె భర్త అనిల్‌తో కలిసి సమీర్ భేటీ అయ్యారు. అరుణ్ తమ కుటుంబానికి సన్నిహితుడని, ఇప్పటికే కలిసి వ్యాపారం చేస్తున్నామని సమీర్‌కు కవిత తెలిపారు.’ అని ఈడీ తెలిపింది. అరుణ్పిళ్లై స్టేట్మెంట్ ఎమ్మెల్సీ కవిత, సమీర్ మహేంద్రులు ఫేస్ టైంలో మాట్లాడుకొనే ఏర్పాటు చేశాననిపిళ్లై తన స్టేట్మెంట్లో పేర్కొన్నట్లు ఈడీ తెలిపింది. హైదరాబాద్‌లో వారిద్దరూ సమావేశం అయ్యేలా ఏర్పాటు చేశానని, ఇండో స్పిరిట్స్‌లో అసలు పెట్టుబడిదారు కవిత అని సమీర్‌కు వివరించారని పేర్కొంది. దినేష్ అరోరా ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో తాను ఎమ్మెల్సీ కవిత, అరుణ్ పిళ్లై, విజయ్‌నాయర్‌లు సమావేశమైనట్టుగా దినేష్ తెలిపారని ఈడీ పేర్కొంది. ‘మద్యం వ్యాపారంపై చర్చించడంతో పాటు ఆప్ నేతలకు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.100 కోట్లు రికవరీ పైనా చర్చించారు’ అని ఈడీ తెలిపింది. -
ముందు మీ నాన్నను నిలదీయండి
జగిత్యాల: ‘మహిళలపై అత్యాచారం జరిగితే ఎందుకు నోరు విప్పడం లేదు? అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు ఏవీ? మీ ప్రభుత్వంలో మహిళలు ఎందరున్నారు? మీ పారీ్టలో ఎంతమంది మహిళలకు చోటిచ్చారు? మహిళా గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారు? వీటిపై ముందు మీ నాన్నను నిలదీయండి.. జంతర్‌మంతర్ వద్ద నువ్వు ధర్నా చేస్తానంటే మహిళలు నవ్వుకుంటున్నారు..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. శుక్రవారం జగిత్యాలలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భోగ శ్రావణితో ఆయన భేటీ అయ్యారు. ఆమె నివాసంలో కాసేపు వివిధ అంశాలపై చర్చించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఎంఐఎం పరాన్నజీవుల పార్టీ మహిళా బిల్లు విషయంలో కవిత ఢిల్లీలో ధర్నా చేస్తామనడం విడ్డూరంగా ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును ప్రవేశపెడితే పార్లమెంటులో ఆ కాపీలను చింపిపడేసిన పారీ్టలతో ఎందుకు దోస్తానా చేస్తున్నావని నిలదీశారు. మెడికో ప్రీతి నాయక్ ఆత్మహత్య చేసుకున్నా, నిర్మల్‌లో బాలికపై అధికార పార్టీ నేతే అత్యాచారానికి పాల్పడినా ముఖ్యమంత్రి కనీసం స్పందించ లేదని విమర్శించారు. గంటకో లైంగిక వేధింపు, పూటకో అత్యాచారం జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసేవారి, హత్యలకు పాల్పడేవారి అంతు చూస్తామని హెచ్చరించారు. బీజేపీ అంతు చూస్తామని మజ్లిస్ నేత ఒవైసీ చెప్పడం హాస్యాస్పదమని సంజయ్ పేర్కొన్నారు. ఎంఐఎం పరాన్నజీవుల పార్టీ అని, సీఎం విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడే పార్టీ అని ధ్వజమెత్తారు. దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. -
వైరల్: చదరంగ స్థలం
చదరంగం చదరపు బల్ల రంగస్థలం అయితే... రాజు, రాణి, సిపాయిలకు ప్రాణం వస్తే... ‘అహో!’ అనిపించే దృశ్యం కనువిందు చేస్తే... ‘అద్భుతం’ అనిపిస్తుంది. ‘చతురంగం’ వీడియో ద్వారా ఆ అద్భుతాన్ని ప్రపంచానికి చేరువ చేశారు కలెక్టర్ కవితారాము... ప్రపంచంలోని చదరంగ ప్రేమికుల దృష్టి ఇప్పుడు చెన్నైపై ఉంది. అక్కడ జరుగుతున్న ఆటల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సాంస్కృతిక కళారూపాలు మరో ఎత్తు. ‘చెస్ ఒలింపియాడ్–2022’ ప్రమోషన్లో భాగంగా వచ్చిన ‘చతురంగం’ అనే వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘దృష్టి మరల్చనివ్వని అద్భుతదృశ్యాలు’ అని వేనోళ్లా పొగుడుతున్నారు నెటిజనులు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వీడియో గురించి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. పుదుకొటై్ట కలెక్టర్ కవితారాము ఈ ‘చతురంగం’ నృత్యరూప కాన్సెప్ట్‌ను డిజైన్ చేయడంతో పాటు కొరియోగ్రఫీ చేయడం విశేషం. కవితారాము స్వయంగా శాస్త్రీయ నృత్యకారిణి. ఎన్నో నృత్యప్రదర్శనలు ఇచ్చారు. ‘నృత్యంతో పాతికసంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. చెస్ ఒలింపియాడ్‌ను ప్రమోట్ చేయడానికి ఒక వీడియో రూపొందించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి, దృశ్యపరంగా అద్భుతం అనిపించాలి అనుకున్నాను. అందులో భాగంగానే ఆటకు, నృత్యాన్ని జత చేసి చతురంగంకు రూపకల్పన చేశాము’ అంటుంది కలెక్టర్ కవితారాము. ఈ వీడియోలో క్లాసిక్, ఫోక్, మార్షల్ ఆర్ట్స్ ఫామ్స్‌ను ఉపయోగించారు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సందర్భాన్ని బట్టి పసుపు, నీలిరంగు లైటింగ్‌ను వాడుకోవడం బాగుంది. పుదుకొటై్ట సంగీత కళాశాలకు చెందిన ప్రియదర్శిని నలుపువర్ణ రాణి, చెన్నై అడయార్ మ్యూజిక్ కాలేజికి చెందిన సహన శ్వేతవర్ణ రాణి వేషాలలో వెలిగిపోయారు. ‘మహిళాదినోత్సవం సందర్భంగా ప్రియదర్శిని నృత్యాన్ని చూశాను. చతురంగం వీడియో గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె గుర్తుకువచ్చింది. ఇక సహన నృత్యం గురించి నాకు తెలుసు. ఎప్పటి నుంచో ఆమెతో పరిచయం ఉంది. ఇద్దరూ తమదైన నృత్యప్రతిభతో చతురంగంకు వన్నె తెచ్చారు’ అంటోంది కవితారాము. చదరంగంపై పావుల సహజ కదలికలను దృష్టిలో పెట్టుకొని మొదట్లో నృత్యాన్ని రూపొందించాలనుకున్నారు. అయితే దీని గురించి చర్చ జరిగింది. క్రియేటివ్ లిబర్టీ తీసుకుంటూనే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఎక్కువమంది కళాకారులు. దీంతో నృత్యరీతులకు సృజనాత్మకతను జోడించారు. నలుపువర్ణ రాణి, శ్వేతవర్ణ రాజును ఓడించడంతో వీడియో ముగుస్తుంది. ఇది యాదృచ్ఛిక దృశ్యమా? ప్రతీకాత్మక దృశ్యమా? అనే సందేహానికి కలెక్టర్ కవితారాము జవాబు... ‘కావాలనే అలా డిజైన్ చేశాం. అంతర్లీనంగా ఈ దృశ్యంలో ఒక సందేశం వినిపిస్తుంది. తెలుపు మాత్రమే ఆకర్షణీయం, అందం అనే భావనను ఖండించడానికి ఉపకరించే ప్రతీకాత్మక దృశ్యం ఇది. దీనిలో జెండర్ కోణం కూడా దాగి ఉంది.’ -
కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నాం
-
గెలిస్తే బీజేపీ ఏం చేస్తుందో చూపిస్తాం: కవిత
సాక్షి, హైదరాబాద్: శంకర్ మాటలు సినిమా స్క్రిప్ట్‌కే పనికి వస్తాయి. అభివృద్ధి అంటే మోఖిలాలో 50 ఎకరాలు తీసుకోవడమేనా అని సినీ నటుడు సీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ.. ‘హిందూవులకు అండగా ఉంటామన్నందుకు ఇంత రచ్చ చేస్తారా?. అరాచకాలు.. అల్లకల్లోలం చేస్తున్నారు అంటారా?. హిందువులను చంపేస్తా... ఆవులను చంపేస్తా అంటే అప్పుడు మాట్లాడలనిపించలేదా?. భాగ్యలక్ష్మి ఆలయానికి ఎవరూ వెళ్ళొదనుకుంటున్నారా?. సినిమా అభివృద్ధికి ఫిలిం డెవలప్మెంట్ అభివృద్ధి లేదు. ప్రభుత్వం తరఫున తెలంగాణ డైరెక్టర్లకు సాయం లేదు. చిత్రపురిలో అర్హులకు ఎందుకు ఇల్లు ఇప్పించడం లేదు?. సినిమా వాళ్లు కాని వాళ్ళను ఎందుకు పంపించడం లేదు?. సినీ అవార్డులు ఇస్తున్నారా.. పక్క రాష్ట్రం వారు ఇస్తే పోయి తెచ్చుకుంటున్నారు. సినిమా రంగంలో తెలంగాణ నుంచి ప్రతినిధులు ఉన్నారా?.చిత్తశుద్ధి ఉండాలి.తెలంగాణ సినిమాను చంపేశారు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. (చదవండి: మరింత హీటెక్కనున్న విశ్వనగర పోరు ) గ్రేటర్లో గెలిస్తే బీజేపీ ఏం చేస్తుందో చూపిస్తాం: కవిత అనంతరం సినీ నటి కవిత మాట్లాడుతూ.. ‘నగరం అస్తవ్యస్తంగా తయారైంది. గతుకుల రోడ్లతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. నాలాల్లో చిన్న పిల్లలు పడి చనిపోతున్నారు. వరదల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పట్టింకోలేదు. ప్రభుత్వం వివరాలు సేకరించి సాయం చేయాల్సింది పోయి... మీసేవలో అప్లై చేసుకోమంటూ చేతులు దులుపుకొన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలను మీసేవ ముందు నిలబెట్టి ఓ మహిళ చావుకు కారణం అయ్యారు. కేటీఆర్ ప్రజలకు కావల్సింది మాటలు కాదు చేతలు. అన్ని రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది.అవకాశవాదులుగా టీఆర్ఎస్ నేతలు వ్యహరిస్తున్నారు. ప్రజలను ఫూల్స్ అనుకోవద్దు. ఆరేళ్లలో ఏం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలి. గ్రేటర్లో గెలిస్తే బీజేపీ ఏం చేస్తుందో చూపిస్తాం. జీహెచ్ఎంసీ విజయం బీజేపీ కోసం కాదు.. ప్రజల కోసం కావాలి అన్నారు. -
ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆటలు సాగవు
-
కవిత స్వగ్రామంలో మరో చేదు ఫలితం!
సాక్షి, నిజామాబాద్ : తాజాగా వెలువడుతున్న పరిషత్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన ఎంపీటీసీ ఫలితాలను చూసుకుంటే దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎక్కువసంఖ్యలో ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక, పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత స్వగ్రామం పోతంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. పోతంగల్ ఎంపీటీసీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి రాజు 95 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ కవితకు చేదు ఫలితాలు ఎదురైన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో రైతులు పోటీచేయడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్కు కంచుకోటగా భావించిన నిజామాబాద్ లోక్‌సభ స్థానంతోపాటు కరీంనగర్ స్థానంలోనూ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలుపొంది.. బీజేపీ రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది. -
టెన్త్ ఫెయిలైనా... డాక్టర్‌నయ్యా!: ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాలలో ఆయనో ప్రముఖ వైద్యుడు. కంటి డాక్టర్‌గా మారుమూల గ్రామాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించారు. వైద్య శిబిరంలో మందులు ఇచ్చి పంపించడమే గాక.. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసిన సేవా గుణం ఆయనది. 2014లో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. వెనుదిరిగి చూడలేదు. వైద్యుడిగా సేవలు అందిస్తూనే... ప్రజల్లో గుర్తింపు పొందారు. 6వేల ఓట్లతో ఓడిపోయిన చోటే 60వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనే జగిత్యాల ఎమ్మెల్యే ముకునూరు సంజయ్‌కుమార్. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రోత్సాహం, తాత చొక్కారావు ఆదర్శాలు తనను రాజకీయంగా నిలబెట్టాయని చెబుతున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో ‘సాక్షి’ పర్సనల్ టైం ఇది. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయం అంటే ఇష్టం జగిత్యాల మండలం అంతర్గాం సొంతూరు. నాన్న హన్మంతరావు, అమ్మ వత్సల. నాన్న వ్యవసాయం పైనే ఆధారపడ్డారు. కుటుంబంలోని ఇతరులు రాజకీయంగా ఉన్నతస్థాయిలో ఉన్నా, నాన్న మాత్రం వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. 90 ఎకరాల భూమిని కౌలుకు ఇవ్వకుండా సాగు చేసేవారు. నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టమే. చిన్నప్పుడు, డాక్టర్ వృత్తిలోకి రాకముందు నాన్నకు వ్యవసాయంలో సాయపడేవాడిని. పట్టుబట్టి చదివా! నాకు చదువు అంటే ఇష్టమే. అయినా 1977లో పదో తరగతిలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యా. అప్పట్లో 10వ తరగతి పాస్ పర్సంటేజీ 10 శాతం ఉండేది. అయినప్పటికీ పట్టుబట్టి సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అయి, ఇంటర్లో బైపీసీలో జాయిన్ అయ్యా. ఇంటర్మీడియట్లో 80 శాతం మార్కులతో పాస్ అయ్యా. ఇంటర్ పూర్తి కాగానే మా నాన్న హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీలో చేర్చారు. 1980–81లో ఏడాది మాత్రమే డిగ్రీ చేశా. అప్పుడే విజయవాడలో ప్రైవేటు రంగంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల వచ్చింది. నాకున్న మార్కులతో నేరుగా ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందాను. నాకు లా చేయాలని ఉన్నా, మా నాన్న కోరిక మేరకే ఎంబీబీఎస్ చదివి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పేరున్న నేత్ర వైద్య నిపుణుడిగా కొనసాగాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవి ఫెయిలైన విద్యార్థుల మానసిక స్థితిని చూస్తే బాధేస్తుంది. ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. అది గెలుపునకు మరో మెట్టుగా మార్చుకోవాలి. టెన్త్‌లో ఫెయిల్ అయినా బాధ పడలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఓడిపోయినా నేను బాధ పడలేదు. రెండోసారి విజయం సాధించానుగా. ఎదుగుదలలో సహధర్మచారిణి రాధిక 1989లో వివాహం జరిగింది. బంధువుల అమ్మాయి అయిన రాధికను పెళ్లి చేసుకున్నాను. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మా ఆవిడ రాధిక సైతం రాజకీయ కుటుంబం నుంచే వచ్చింది. రాధిక తండ్రి కమలాకర్‌రావు బోయినిపల్లి సర్పంచ్‌గా సేవలు అందించారు. రాధిక అమ్మ వాళ్ల నాన్న దివంగత మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్ధండుడు. అయినా రాధిక నా భార్యగా నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. గృహిణిగా సేవలందించింది. నా వృత్తి విజయంలో, రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ఆమె ప్రధానం. సేవ చేసేందుకే వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి.. నాకు చిన్నప్పటి నుంచే సామాజిక సేవలో పాల్గొనడం ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన. డాక్టర్‌గా ఉంటూనే ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టడం, గ్రామాల్లో వైద్య సేవలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేసేవాడిని. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు అందించాను. వేలాది మెడికల్ క్యాంపులు పెట్టడమే కాక, 10వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగాను. ఎమ్మెల్యేగా పూర్తి సమయం ప్రజాసేవకే నాకు ఒక్కతే కూతురు హార్తిక, అల్లుడు రాజీవ్. హైదరాబాద్‌లో బిజినెస్ చేస్తుంటారు. నేను, నా భార్య ఇక్కడ ఉంటాం. వాళ్లు తరచూ వస్తూ వెళ్తుంటారు. ఎన్నికల సమయంలో నాకే సమయం కేటాయించారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రజా జీవితంలో మమేకం కావలసిందే. గ్రామాల్లో పేరుకుపోయిన అనేక సమస్యలు, ప్రజల బాధలను తెలుసుకుంటున్నా. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నా. జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. మా కుటుంబానిది రాజకీయ నేపథ్యమే మా సొంత చిన్నాన్న శ్రీరంగారావు కరీంనగర్ ఎంపీగా సేవలందించారు. నా భార్య తాత చొక్కారావు రాజకీయ దిగ్గజం. కరీంనగర్ చరిత్రలో వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి వంటి నేతనే ఓడించిన రాజకీయ దిగ్గజం ఆయన. నా జీన్స్‌లోనే రాజకీయ నేపథ్యం ఉంది. అదే నా రాజకీయ ప్రవేశానికి ప్రధాన కారణమై ఉంటుంది. గతంలో టికెట్ ఆఫర్ వచ్చినా... పోటీ చేయలేదు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, ప్రజారాజ్యం తరఫున జగిత్యాల నుం చి పోటీచేసే అవకాశం వచ్చింది. ప్రత్యేక కారణమేమీ లేకపోయినా... ఎందుకో పోటీ చేయలేదు. తెలంగాణ వచ్చాక ముఖ్య మంత్రి కేసీఆర్, ఎంపీ కవిత సహకారంతో టీఆర్ఎస్లో చేరాను. తొలిసారి 2014లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను. రెండోసారి మొన్నటి ఎన్నికల్లో ప్రజా ఆశీస్సులు, కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో ఏకంగా 60వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. డాక్టర్‌గా, ఎమ్మెల్యేగా ప్రజాసేవలో సంతృప్తి పొందుతున్నా! డాక్టర్‌గా ఉన్నప్పుడు వైద్య పరంగా ప్రజలకు సేవ చేసేవాడిని. ఫ్రీ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసేవాడిని. ఎందరికో కంటి వెలుగునయ్యా. కానీ పూర్తిస్థాయిలో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పటికీ సంతృప్తిగా ఉంది. జగిత్యాల ఎమ్మెల్యేగా ఏం చేయాలనుకుంటున్నారు? జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి చెరువులో నీరు నింపే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నీరందేలా చూ స్తున్నాం. ముఖ్యంగా జగిత్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందింది. పట్టణ ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉం ది. ముఖ్యంగా యావర్‌రోడ్డును వెడల్పు చేసేలా చర్యలు తీసుకుంటా. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి నన్ను అత్యధిక మెజారిటితో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను. -
మానుకోట టికెట్ కవితకే..
సాక్షి, కొత్తగూడెం: మానుకోట లోక్‌సభ బరిలో ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేది తేలిపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవితను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున పోరిక బలరాంనాయక్‌ను పేరు ఖరారైన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ ఉండడంతోపాటు తేజావత్ రామచంద్రు, రెడ్యానాయక్ కుమార్తె కవిత పోటీపడ్డారు. దీంతో ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికనే విషయమై కార్యకర్తల్లో ఎడతెరిపి లేని చర్చ సాగింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి సిట్టింగ్ ఎంపీ సీతారాంనాయక్‌కు టికెట్ రాదని తేలిపోయింది. ఈ క్రమంలో కవిత, రామచంద్రు మధ్య నువ్వా.. నేనా.. అనే స్థాయిలో రేసు సాగింది. చివరకు రెడ్యానాయక్ కుమార్తె, మాజీ ఎమ్మెల్యే కవితకే టికెట్ దక్కింది. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్, టీఆర్ఎస్ అభ్యర్థి కవిత శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరి అంచనాలు వారివే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో భద్రాచలం, ములుగు, పినపాక, ఇల్లెందు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. డోర్నకల్, మహబూబాబద్, నర్సంపేట సెగ్మెంట్లలో టీఆర్ఎస్ గెలిచింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో పినపాక, ఇల్లెందులో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బాణోత్ హరిప్రియ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పడిపోయింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే గత ఎన్నికల్లో మానుకోట పరిధిలో ఎక్కువ చోట్ల కాంగ్రెస్‌ను ఆదరించిన ప్రజలు ఈసారి కూడా తమనే ఆదరిస్తారని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరింత కష్టపడితే ఈ సీటును దక్కించుకోవచ్చని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ పోటీ హోరాహోరీగానే ఉండనుంది. ప్రధాన ప్రత్యర్థులెవరో తేలిపోవడంతో ఇక ప్రచార పర్వం ఊపందుకోనుంది. కాంగ్రెస్ పార్టీ మానుకోట లోక్‌సభ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నియమించగా, టీఆర్ఎస్ ఇన్‌చార్జ్‌లుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ వ్యవహరిస్తున్నారు. మరో జాతీయ పార్టీ బీజేపీ సైతం జాటోత్ హుస్సేన్ నాయక్‌ను తన అభ్యర్థిగా ప్రకటించింది. హుస్సేన్‌నాయక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి 12 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇక్కడ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక సీపీఐ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. శనివారం హైదరాబాద్‌లో సీపీఐ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం అనంతరం ఆదివారం అభ్యర్థిని ప్రకటించనుంది. మాలోత్ కవిత బయోడేటా... పేరు : మాలోత్ కవిత భర్త : భద్రునాయక్ జననం : 31–12–1979 విద్యార్హతలు : బీఎస్సీ కంప్యూటర్స్ జన్మస్థలం : ఉగ్గంపల్లి ప్రత్యేకతలు : హిందీ, ఇంగ్లిష్, తెలుగు, లంబాడా భాషల్లో అనర్ఘళంగా మాట్లాడతారు. తండ్రి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ రాజకీయ గురువు. నేరుగా రాజకీయాల్లోకి వచ్చి 2009లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీఆర్ఎస్లో చేరిక. కొద్ది రోజుల్లోనే పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం నిజాయితీగా పనిచేసి సీఎం కేసీఆర్ దృష్టిని ఆకర్షించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. తండ్రి రెడ్యానాయక్ది డోర్నకల్, తనది మహబూబాబాద్, తన భర్తది ఇల్లెందు నియోజకవర్గం కావడంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు కవితకు లోకల్‌గానే కలిసి వచ్చే అవకాశం. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిని కలుపుకపోయే మనస్తత్వం. -
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని నిజామాబాద్ ఎంపీ కవిత ప్రకటించారు. సోమవారం నిజామాబాద్‌లో నగర మున్నూరుకాపు సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. సంఘం నేత కొండ దేవన్న కోరుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని, అవసరమైతే తన వెంట తీసుకువెళ్లి కార్పొరేషన్ సాధనకు ప్రయత్నిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరిస్తారో అదే వారి నిజమైన వైఖరి అని అన్నారు. కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ ?
-
థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు దిశగా ముందడుగు పడింది
-
ట్రూ ఇండియన్
సంప్రదాయం గాలిలో ఉన్న ఈ మల్లయోధురాలి పేరు డకోటా కాయ్. దేశం.. న్యూజిలాండ్. ఇక ఆమెను గాలిలోకి ఎత్తిపట్టుకున్న ‘మల్లమ్మ’.. మన అమ్మాయి కవిత! ‘ది గ్రేట్ కాళి’ దిలీప్ సింగ్ (పంజాబ్) శిష్యురాలు. యు.ఎస్.లో జూలైలో మొదలై నిన్నటితో ముగిసిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్ మెంట్ పోటీలలోని ‘మే యంగ్ క్లాసిక్’ స్మారక ఈవెంట్లో గత నెల కవిత, కాయ్తో తలపడింది. ఆ పోటీలో ఓడిపోయినప్పటికీ.. చుడీదార్ వేసుకుని, నడుముకు దుపట్టా చుట్టుకుని, బూట్లు ధరించి బరిలోకి దిగిన కవిత తన ప్రత్యర్థిని ఎత్తిపట్టుకుని పై చెయ్యి సాధించిన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్లో భారతీయ ఆత్మను రెపరెపలాడిస్తోంది. అఫిషియల్ యూట్యూబ్ చానల్లో ఈ ఫైటింగ్ వీడియోను ఆగస్టు 31న అప్లోడ్ అయినప్పటి నుంచీ ఇప్పటి వరకు 48 లక్షల మంది వీక్షించారు! ఈ తరహా వరల్డ్ రెజ్లింగ్ లో పాల్లొన్న తొలి భారతీయ యువతిగా కన్నా కూడా, భారతీయ వస్త్రధారణతో పోటీలో పాల్గొన్న అచ్చమైన ఇండియన్‌గా కవిత ప్రశంసలు పొందుతున్నారు. కవిత రెజ్లర్ మాత్రమే కాదు. వెయిట్ లిఫ్టర్ కూడా. 2016లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో 75 కిలోల విభాగంలో స్వర్ణపతకాన్ని గెలుచుకున్నారు. ఈ నెల 20న కవిత పుట్టినరోజు. రెజ్లింగ్‌లో గెలిచి ఉంటే అదొక మంచి సందర్భం అయిఉండేది. అయితే అంతకంటే మంచి కానుకను ఆమె ఫైటింగ్ కాస్ట్యూమ్స్ ఆమెకు తెచ్చిపెట్టాయి. -
'ఆ మధ్య ఓ వ్యక్తి ఇంటిచుట్టూ తచ్చాడాడు'
సాక్షి, బెంగళూరు : తన సోదరికి వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరని ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ సోదరి సోదరులు చెప్పారు. ఆమె నమ్మిన ఐడియాలజీకి కట్టుబడి ఉండటం వల్లే హత్యకు దారి తీసిందని భావిస్తున్నామన్నారు. లంకేష్ భావజాలం, సిద్ధాంతం నచ్చని వారే ఈ పనిచేసి ఉంటారని తాము భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేస్తారని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియన వ్యక్తుల చేతుల్లో గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హత్య కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె సోదరి, సోదరుడైన కవిత, ఇంద్రజిత్ లంకేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ సోదరిపై జరిగిన దాడిని భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. కవిత, ఇంద్రజిత్లు మాట్లాడుతూ 'ఆమె ఎప్పుడు భయపడలేదు. ఇటీవల ఆమె ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో కూడా భద్రత తీసుకొమ్మంటే అందుకు నిరాకరించారు. ఆ మధ్య ఓ వ్యక్తి ఓ వారంపాటు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించాడు. వాస్తవానికి ఇంకొకరైతే ఫిర్యాదు చేసే వారు. అయితే, లంకేష్ మాత్రం ఆ వ్యక్తితో ఏం కాదులే అనుకొని ధైర్యంగా ఉన్నారు. ఆమెపై వ్యక్తిగత కారణాలతో ఈ దాడి జరగలేదు. మాతండ్రిలాగే మీడియా రచనలో చాలా దూకుడుగా వ్యవహరించేవారు. కానీ, వ్యక్తిగా మాత్రం చాలా సున్నితమైన వారు' అని చెప్పారు. -
కవిత.. భాభారత మహిళా క్రికెట్‌కు భవిత
క్రికెట్లో జాతీయ స్థాయిలో రాణిస్తున్న కవిత జాతీయ పోటీల్లో బంగారు పతకం కైవసం ఇండియా టీమ్‌లో ఆడడమే లక్ష్యం బెస్ట్ రన్స్ 176 దేవరపల్లి: మహిళా క్రికెట్‌ళక్ష దుమ్ము రేపుతోంది చింతపల్లి కవిత. దేవరపల్లి బీసీ కాలనీలో ఓ సామాన్య, మధ్యతరగతి కుటుంబానికి చెందిన క్రీడాకారణి చింతపల్లి కవిత. మహిళా క్రికెట్లో అనేక విజయాలు సాధిస్తూ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నుంచి ఏడాదికి రూ.48,000 ఉపకార వేతనం అందుకుంటోంది. జోనల్ టోర్నమెంట్లో 176 పరుగులు తీసి క్రికెట్ ప్రేమికుల మన్ననలు పొందింది. ఇంత వరకు 10 రాష్ట్రస్థాయి పోటీల్లోనూ, 4 జాతీయ స్థాయి టోర్నమెంట్స్‌లోనూ ఆడి విజయాలు సొంతం చేసుకుంది కవిత. 201314లో మహరాష్ట్రలో జరిగిన టోర్నమెంట్లో రాష్ట్రం తరఫున అండర్19 విభాగంలో కవిత జాతీయస్థాయిలో జరిగిన పోటీలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. 201415లో జార్కండ్లో జరిగిన జాతీయ టోర్నమెంట్లో ఆడి తృతీయస్థానంలో కవిత నిలిచింది. వీటిలో పాటు రాష్ట్రస్థాయిలో అనేక టోర్నమెంట్లలో విజయాలు సాధించింది. కవిత మాట్లాడుతూ రాష్ట్ర జట్టులో గల క్రీడాకారులందరూ దేవరపల్లి, దుద్దుకూరు గ్రామాలకు చెందిన వారేనని తెలిపారు. తామంతా కష్టపడి విజయాలు సాధిస్తున్నామన్నారు. స్థానిక అంబటి సత్యనారాయణరావు జెడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో కోచ్ రమాదేవి శిక్షణ ఇస్తూ ఆటలో మెలకువలను వివరిస్తున్నారని కవిత పేర్కొంది. పీడీ కేవీడీవీ ప్రసాద్ తమ ఆటను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. అలాగే భూపతిరాజు విద్యా సంస్థ చైర్మన్ డి.సువర్ణరాజు తమకు సహకరిస్తున్నారన్నారు. మరింత కష్టపడి ఇండియా తరఫున మహిళా క్రికెట్లో ఆడాలనేదే తన లక్ష్యమని కవిత తెలిపింది. -
కళతప్పిన టీడీపీ మహానాడు
-
అధికార గర్వంతో మాట్లాడతారా?
కేటీఆర్, కవితపై కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ధ్వజం ► కాంగ్రెస్‌ను పాతరపెట్టాలంటూ వారు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం ► కేసీఆర్‌కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చుంటే టీఆర్ఎస్ పుట్టేదా? ► తెలంగాణ కోసం కేటీఆర్, కవిత ఏనాడైనా జైలుకెళ్లారా? సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పాతరపెట్టాలంటూ మంత్రి కె.తారక రామారావు, ఎంపీ కవిత జగిత్యాల సభలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుప డ్డారు. సీఎం కేసీఆర్ కంటే ముందుగానే మంత్రిగా పనిచేసిన తనపై ఆయన పిల్లలైన కేటీఆర్, కవిత అహంకారపూరితంగా, అధి కార గర్వంతో మాట్లాడుతున్నారన్నారు. మంగళవారం ఇక్కడ జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్‌ను ప్రమోట్ చేసుకోవ డానికే జగిత్యాల సభ పెట్టారన్నారు. ‘‘తెలం గాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను పాతరపెడా ్తరా? మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన టీఆర్ఎస్ విధానా లను విమర్శిస్తే కాంగ్రెస్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడ్తారా? మూడేళ్ల పసిగుడ్డు పాలనతోనే రాష్ట్ర బడ్జెట్ రూ.లక్షన్నర కోట్లకు వచ్చిందా? కాంగ్రెస్ అభివృద్ధే చేయలేదా? టీఆర్ఎస్ ఇంకా ఉద్యమంలో ఉందా లేక ప్రభుత్వంలో ఉందా అనేది మాట్లాడే ముందు ఆలోచించు కోవాలి’’ అని జీవన్‌రెడ్డి చెప్పారు. నా చరిత్ర మీ నాయినను అడగండి... ‘‘నేను మంత్రి పదవి కోసమే కరీంనగర్ ఉప ఎన్నికలో పోటీ చేసినట్లు కేటీఆర్, కవిత మాట్లాడటం వారి అవివేకం. నా రాజకీయ చరిత్ర ఏమిటో వాళ్ల నాయిన కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలి. కేసీఆర్ కంటే ముందుగానే ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన. 1999 ఎన్ని కల తర్వాత కేసీఆర్‌కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చుంటే టీఆర్ఎస్ పుట్టేదా? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే సమయంలో చంద్ర బాబుకు కేసీఆర్ తాబేదారుగా పనిచేశాడు. చంద్రబాబు మోచేతి నీళ్లుతాగుతూ మంత్రి పదవిని అనుభవించినంతకాలం గుర్తుకురాని తెలంగాణ... పదవి రాకపోయేసరికి కేసీఆర్ కు గుర్తుకొచ్చింది. టీఆర్ఎస్ పెట్టిన తర్వాత 2004లో కాంగ్రెస్ కండువా వేసుకుని కరీంన గర్ ఎంపీగా కేసీఆర్ గెలవలేదా? అధికార పార్టీలో ఉంటూనే తెలంగాణ కోసం పోరాడి, జైలుకు పోయిన చరిత్రనాది. తెలంగాణ కోసం ఏనాడైనా, ఒక్కరోజైనా కేటీఆర్, కవిత జైలుకు పోయారా? వాస్తవాలను దాచిపె ట్టాలనుకుంటే చరిత్ర మారదు’’ అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పూర్తి చేయాలనే సంకల్పమేదీ? టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంలేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహా రం ఇవ్వకుండా, పునరావాసం కల్పించ కుండా ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. శాసనసభలో తాను మాట్లాడని మాటలను ప్రస్తావించిన కేటీఆర్‌పై ప్రివిలేజ్ నోటీసు ఇస్తానని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లు నిద్రపోయి, సింగరేణిలో ఎన్నికలు రాగానే హడావిడిగా వారసత్వ ఉద్యోగాల కల్పన పేరుతో టీఆర్ఎస్ డ్రామాలకు తెరలేపిందని విమర్శించారు. కోర్టులతో ఇన్నిసార్లు మొట్టికాయలు తిన్న ప్రభుత్వం ఏదీ లేదని, అధికారంలో కొనసాగే అర్హత కూడా టీఆర్ఎస్కు లేదన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఒకటి, రెండు తప్ప ఏవీ అమలు చేయలేదన్నారు. హరీశ్‌పై కేటీఆర్ వ్యాఖ్యల్లో మర్మం ఏమిటో? కాంగ్రెస్‌లోకి హరీశ్‌రావు వెళ్లడు అని స్వయంగా మంత్రి కేటీఆర్ అన్నాడంటే అందులో ఏదో మర్మం ఉందని... బయట కు కనిపించని రాజకీయ పరిణామాలేవో టీఆర్ఎస్లో అంతర్గతంగా జరుగుతుండొ చ్చని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హరీశ్ రావు, కాంగ్రెస్ అంటూ కేటీఆర్‌కు అనుమా నం ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీయే బాహుబలి అని, కాంగ్రెస్ లో నాయకులు లేరని హరీశ్‌రావును పిలుస్తామా అని ప్రశ్నించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అహంకార ధోర ణి చూస్తుంటే వాళ్లకు ఘడియలు దగ్గర పడుతున్నట్టున్నాయని జీవన్‌రెడ్డి హెచ్చరిం చారు. అంబేడ్కర్ జయంతినాడు నివాళులు అర్పించడానికి రాని దౌర్భాగ్యుడు కేసీఆరే నన్నారు. లైసెన్సు లేకుండా మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుర్చీని కాపాడుకోవడానికి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. -
అధికార గర్వంతో మాట్లాడతారా?
-
కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్
-
మాకు కేసీఆరే బాహుబలి..!
ఎంపీ కల్వకుంట్ల కవిత సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ గెలిపించేందుకు ఎప్పుడో వచ్చే బాహుబలి, కట్ట ప్పల గురించి ఎదురు చూస్తోందని, తమకు మాత్రం సీఎం కేసీఆరే బాహుబలి అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌లో శనివారం జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సుకు హాజరైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎన్నికల కోసం, ఓట్ల కోసం పనిచేసే పార్టీ కాదని, ప్రజల కోసం పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు భరోసా అని అన్నారు. -
ఒక్క మహిళనైనా ఎమ్మెల్సీ చేయండి: షబ్బీర్
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీగా ఒక్క మహిళకైనా అవకాశం ఇవ్వాలని మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేబినెట్లో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. జనాభాలో సగం ఉన్న మహిళలను కేసీఆర్ అవమాన పరిచారని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళ అంటే కేసీఆర్ కుమార్తె కవిత ఒక్కరేనా అని ప్రశ్నించారు. తన కుమార్తెకు ప్రాధాన్యం తగ్గుతుందననే మహిళలకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడం లేదన్నారు. -
కేన్సర్ వస్తే భయపడొద్దు
- ధైర్యంగా ఎదుర్కోండి: సినీనటి మనీషా కొయిరాలా - వ్యాధి తీవ్రతను పార్లమెంటులో ప్రస్తావిస్తా: ఎంపీ కవిత - రోజూ కేన్సర్ బారిన 1700 మంది మృత్యువాత: సంగీతారెడ్డి - హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘అపోలో కేన్సర్ కాంక్లేవ్’ సాక్షి, హైదరాబాద్: కేన్సర్ వస్తే భయపడాల్సిన పనిలేదని.. దానికి సరైన చికిత్స ఉందని సినీనటి మనీషా కొయిరాలా చెప్పారు. ‘‘నాకు కేన్సర్ వచ్చినప్పుడు మొదట షాక్‌కు గురయ్యా. అనేక మంది భయపెట్టారు. అయితే నేను అనేక మంది వైద్యులను సంప్రదించా. ధైర్యంతో పోరాడి ఇప్పు డు క్యాన్సర్‌ను జయించా’’ అని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘అపోలో కేన్సర్ కాంక్లేవ్’ అంతర్జాతీయ సద స్సులో ఆమె మాట్లాడారు. కేన్సర్ వస్తే ఓపిగ్గా దానిపై అవగాహన పెంచుకోవాలని, ఆ తర్వాత సరైన చికిత్స చేయించుకోవాలన్నారు. 2 వేల రోగులకు ఒకరే : కవిత దేశంలో ప్రతీ 2 వేల మంది కేన్సర్ రోగులకు ఒక్క ఆంకాలజిస్టు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత అన్నారు. కేన్సర్‌తో ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరు చనిపోతున్నారని పేర్కొన్నారు. ‘‘కేన్సర్‌పై సమాచారాన్ని సేకరించి దాని తీవ్రతను పార్లమెంటులో ప్రస్తావిస్తా. కేన్సర్ చివరి దశలో ఉన్నప్పుడు రోగితో లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు వస్తున్నాయి. ఇది ఎంత వరకు సరైనదో ఆసుపత్రులే ఆలోచించాలి’’అని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతిరోజూ 1,700 మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారని అపోలో ఆసుపత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి చెప్పారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ మెడికల్ టూరిజం అభివృద్ధికి కృషిచేస్తు న్నామన్నారు. ఈ సదస్సులో డాక్టర్ అఖిల ఎన్.విశ్వనాథన్, డాక్టర్ పి.విజయ్ ఆనంద్‌రెడ్డి, డాక్టర్ ఎస్వీఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా
మండలి ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేట్టిన పల్లా సాక్షి, హైదరాబాద్: తనను గుర్తించి ప్రభుత్వ విప్ పదవి అప్పగించిన సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటానని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీక రించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, పల్లాను ఆయన సీట్లో స్వయంగా కూర్చోబెట్టారు. కాగా, పల్లాకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, తుమ్మల, పోచారం, నాయిని, హరీశ్‌రావు, ఈటల, లక్ష్మారెడ్డి, తలసాని, మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి ఎంపీలు కవిత తదితరులు అభినందనలు తెలిపారు. -
గడ్డం పెంచుకో.. అభివృద్ధికి అడ్డుపడకు
ఉత్తమ్‌ను ఉద్దేశించి ఎంపీ కవిత సూచన మెట్పల్లి: ‘నువ్వు పగటి కలలు కంటూ ఎంతకాలమైనా గడ్డం పెంచుకో...కానీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డంరాకు’ అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చే వరకు గడ్డం తీయనని ఆయన చెబుతున్నారంటూ ఆమె ఎద్దేవ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మంగళవారం వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా జరిగిన సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి నిలబడే పార్టీ ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని కవిత పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనకే ఇతర పార్టీల నుంచి వేలాది మంది నాయకులంతా గులాబీ కండువా వేసుకుంటున్నారని, వారి చేరికతో బలమైన రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఎదుగుతుందన్నారు ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, పుట్ట మధు, జెడ్పీ చైర్పర్సన్ ఉమ పాల్గొన్నారు. -
బతుకమ్మ కవిత సొత్తు కాదు: శారద
► సంబురాల ధనంతో ఆత్మహత్యలు నివారించవచ్చు ► మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద వనపర్తిటౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ సంబురాల నిర్వహణకు గ్రామ స్థాయిలోని సర్పంచ్‌లకు నిధులు కేటాయించి ఉత్సవాలు నిర్వహిస్తే బాగుటుందని, బతుకమ్మ కవిత సొత్తైనట్లు నిధులన్నీ ప్రభుత్వం తెలంగాణ జాగృతికి కేటాయించడం అనైతికమని మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద అసహనం వ్యక్తం చేశారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి వచ్చిన ఆమె ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ ఉత్సవాలు జాతి సంస్కృతికి నిదర్శనమని, కవితే ప్రామాణికంగా జరగడం బాధాకరమన్నారు. జిల్లాల ఏర్పాటు మంచిదైనప్పటికీ ప్రభుత్వం సంబురాలు చేయాల్సిన అవసరం లేదని, మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుంటే సంబురాలు జరుపుకునేందుకు ఖర్చుపెట్టిన ప్రజాధనం రైతుల సంక్షేమానికి వినియోగించి ఉంటే రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు. -
కవిత కోసమే రూ. 15 కోట్లు ఇస్తున్నారా?
కాంగ్రెస్ నాయకురాలు నేరెళ్ల శారద సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 15 కోట్లు కేవలం సీఎం కేసీఆర్ కూతురు కవిత కోసమే కేటాయించారా అని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ కేవలం కేసీఆర్ బిడ్డకోసం, రాజకీయ అవసరాల కోసం కాకుండా బతుకమ్మ పండుగ సంస్కృతిని కాపాడటానికి ప్రజల సొమ్మును ఖర్చు చేస్తే బాగుంటుందన్నారు. కేసీఆర్ కూతురు కవిత ఎక్కడ బతుకమ్మ ఆడితే అక్కడ నిధులు కేటాయించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 15 కోట్లు ఏయే గ్రామాలకు ఎంత కేటాయించారో, ఆ నిధులతో బతుకమ్మ పండుగ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ నిధులను అన్ని గ్రామ పంచాయతీలకు నేరుగా కేటాయించాలని కోరారు. -
నాకు నీళ్ల సమస్య రాలేదు: కవిత
రియో ఒలింపిక్స్ మారథాన్ సమయంలో తనకు కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని భారత అథ్లెట్ ఓపీ జైషా వాపోయిన సంగతి తెలిసిందే. అయితే అదే మారథాన్‌లో పాల్గొన్న మరో భారత క్రీడాకారిణి కవిత మాత్రం తనకు ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పింది. ‘జైషా ఏం చెప్పిందో, ఎందుకు చెప్పిందో నాకు తెలియదు. నాకు దాహం అయిన ప్రతిసారీ అందుబాటులో మంచినీళ్లు ఉన్నాయి. ముందు రోజు కూడా మన అధికారులు వచ్చి నాకు ప్రత్యేక డ్రింక్స్ ఏమైనా కావాలా అని అడిగారు. కానీ అవసరం లేదని చెప్పాను’ అని కవిత తెలిపింది. జైషా ఫిర్యాదుపై ఇప్పటికే విచారణ ప్రారంభం కాగా... కవిత చెప్పిన విషయాలు భిన్నంగా ఉండటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరగనుంది. -
ఆర్‌యూలో కవితోత్సావం
కర్నూలు(హాస్పిటల్): ఏపీ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు రక్షణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాయలసీమ యూనివర్సిటీలో కృష్ణాపుష్కర కవితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 50 మంది కవులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ వై. నరసింహులు మాట్లాడుతూ పర్యావరణంతోపాటు సంస్కృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. శతావధాని, బహుగ్రం«థకర్త గండ్లూరి దత్తాత్రేయశర్మ మాట్లాడుతూ పుష్కర సంస్కతి ప్రారంభమైన విధానాన్ని వివరించారు. పుష్కరాల్లోని ఆంతర్యాన్ని గమనించాలని చెప్పారు. విభిన్న సంస్కృతుల సమాహారమైన భారత దేశంలో ప్రతి సంçస్కృతికీ తనదైన విశిష్టత ఉందన్నారు. కార్యక్రమంలో గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కూర, తెలుగుభాషావికాస ఉద్యమ రాష్ట్ర కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆమె నా భార్య కాదంటున్న ఎమ్మెల్యే కుమారుడు
ఒడిషా : తనను పెళ్లి చేసుకుని, కుమార్తె పుట్టిన తర్వాత సంబంధం లేదంటున్నాడని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు భువనేశ్వర్ నుంచి మహిళా పోలీసులు మల్కన్‌గిరి వచ్చారు. ఫిర్యాదుదారు సఖిత మహకొడ తెలిపిన వివరాల ప్రకారం.. సబితను చెప్పువ ఎమ్మెల్యే సనాతన్ మహాకొడ కుమారుడు పంకజ్ మహాకొడ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లుగా మల్కన్‌గిరిలోని డీఎన్కేలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వారికి ఏడాది వయసున్న కుమార్తె కవిత మహాకొడ ఉంది. సబిత తన భార్య కాదని అంటున్నాడని ఆమె భువనేశ్వర్‌లో మహిళ కమిషన్‌కు, మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణకు భువనేశ్వర్ నుంచి మహిళ పోలీసుల బృందం బుధవారం మల్కన్‌గిరి వచ్చింది. మల్కన్‌గిరి ఆస్పత్రిలో విచారణ జరపగా మెడికల్ సర్టిఫికెట్లో భర్తగా పంకజ్ పేరు ఉంది. కుమార్తె కవిత జనన ధ్రువీకరణ పత్రంలో తండ్రిగా పంకజ్ పేరు నమోదై ఉన్నట్లు గుర్తించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తనకు న్యాయం చేయాలని సఖిత కోరుతోంది. -
కేబినెట్లో మంత్రులందరూ సమానమే
నిజామాబాద్ ఎంపీ కవిత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి మండలిలో మంత్రులందరూ సమానమేనని.. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావు నడుమ ఎలాంటి వివక్ష లేదని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. మంత్రుల శాఖల మార్పిడి కి చిలువలు, పలువలు చేర్చి విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం కవిత విలేకరులతో మాట్లాడారు. సుపరిపాలన అందించేందుకు శాఖల మార్పిడి చేశారు తప్పా.. ఎలాంటి ప్రత్యేకతా లేదన్నారు. ఓటమి భయంతోనే పాలేరు ఉప ఎన్నికలో విపక్షాలు ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. గతంలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. డిపాజిట్ గల్లంతవుతుందనే భయం తో విపక్షాలు పోటీ నుంచి తప్పుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తమను మద్దతు ఇవ్వాలని సంప్రదించడం సరికాదన్నారు. తమ పార్టీ విధానం మేరకే పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నామని.. పాలసీని పక్కన పెట్టి కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ కట్టిందన్నారు. ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణపై విపక్షాలు అభ్యంతరాలు తెలపడం హాస్యాస్పదమని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుంచి అనుమతి తీసుకున్నాకే సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని కవిత గుర్తు చేశారు. -
ఆయన విమర్శల్లో పసలేదు: కవిత
హైదరాబాద్ : అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాగునీటి ప్రాజెక్టులపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన విరమ్శల్లో పస లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బావుందని దేశమంతా కితాబు ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు వాస్తవాలు విస్మరించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆమె హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను విజన్ ఉన్న నాయకుడిగా అంతా కొనియాడుతుంటే, భట్టి చేసిన విమర్శలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భట్టి మాటల్లో నిజం ఉంటే అసెంబ్లీకి హాజరయ్యేవారని, ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాకే పలాయనం చిత్తగించారని పేర్కొన్నారు. గడిచిన అరవై ఏళ్ల అన్యాయాలను సీఎం కేసీఆర్ ఎండగడతారనే భయంతోనే అసెంబ్లీకి డుమ్మా కొట్టారని తెలిపారు. భట్టివిక్రమార్క చెప్పే మాట్లా వాస్తవం ఉంటే రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులతో అధ్యయనం చేసి సీఎం దృష్టికి తీసుకు వెళతామన్నారు. పాలక, ప్రతిపక్షాలు కలిసి చేసే నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తాయని కవిత వివరించారు. ఏ విషయాన్నైనా చర్చించడానికి అసెంబ్లీకి మించిన వేదిక ఏముంటుందన్నారు. తన ప్రజెంటేషన్‌కు ముందు అన్ని పార్టీల సభ్యులను మాట్లాడాలని , అన్ని విషయాలను చర్చించాలని కోరిన విషయాన్ని సీఎంను విమర్శించే ప్రతిక్షాలు గుర్తు చేసుకోవాలని ఎంపీ కవిత హితవు పలికారు. -
మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు
వరంగల్ క్రైం : ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ సభ్యురాలు కుంజమ్ ఇడుమన్ అలియాస్ కవిత శుక్రవారం వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా ఎదుట లొంగి పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం నీలంపల్లి గుంపు (బుట్టాయిగూడెం)కు చెందిన కుంజమ్ ఇడుమన్ అలియాస్ కవిత తల్లిదండ్రులకు పెద్దకుమార్తె. ఈమెకు ముగ్గురు తమ్ములు ఉన్నారు. కవితను పెళ్లిచేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడితేవడంతో ఇంటి నుంచి వెళ్లిపోరుుంది. 2011-12 మధ్య కాలం లో మేకల రాజు అలియాస్ మురళి ప్రోద్బలంతో వెంకటాపూర్ ఏరియా కమిటీలో దళసభ్యురాలిగా చేరింది. 2013 జూలై వరకు అదే కమిటీలో కొనసాగింది. ఆ తర్వాత కెకెడబ్ల్యు (కరీంనగర్, ఖమ్మం, వరంగల్) డివిజన్ కమిటీలోఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీకి బదిలీ అయింది. కవిత కెకెడబ్ల్యు కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌తో మావోయిస్టు పార్టీ కార్యాక్రమాలలో చురుకుగా పాల్గొన్నట్టు ఎస్పీ తెలిపారు. కవిత రెండు సార్లు పోలీసు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నదని, ఒక సారి పోలీసు ఔట్‌పోస్టుపై దాడి చేసిందని ఎస్పీ తెలిపారు. ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించిన మినాపా సీఆర్పీఎఫ్ అంబుష్‌లో పాల్గొన్నదని, దీపల్లి గ్రామం భద్రకాళి తహసిల్, చత్తీస్గడ్ రాష్ట్రంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పులలో పాల్గొన్నదని, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కంబాలపేట అటవీ ప్రాం తంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె తప్పించుకున్నదని వివరించారు. అనారోగ్య కారణాలతో పాటు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక లొంగిపోయినట్లు కవిత తెలిపింది. -
కంగ్రాట్స్ అరుణ్ జైట్లీజీ: కవిత
హైదరాబాద్: పార్లమెంట్లో సోమవారం 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విత్తమంత్రి అరుణ్ జైట్లీకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. బడ్జెట్లో మౌళిక అంశాలకు, ఆరోగ్యం, వ్యవసాయానికి తగిన ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. అయితే ఈ బడ్జెట్ కెటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రం పొందే ప్రయోజనం గురించి ఆసక్తిగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. Cngrts to @arunjaitley Ji for a budget focused on infra,health& agriculture.anxious 2 C how much will Telangana get. #DevilisInTheDetail :) — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 29, 2016 -
గంగిరెద్దు అంటూ పవన్‌పై కవిత విసుర్లు
హైదరాబాద్: సినీ నటుడు పవన్‌కల్యాణ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత సెటైర్లు వేశారు. ఎన్నికలనగానే కొందరు గంగిరెద్దుల్లా వస్తారని, అయినా తాము ఎవరికీ భయపడబోమని ఆమె పవన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. తిక్కున్న పవర్ స్టార్లకు సీఎం కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారని కవిత కామెంట్ చేశారు. ఎన్నికలప్పుడు మేకప్ వేసుకొని వచ్చి ఆ తర్వాత ప్యాకప్ చెప్పే వాళ్లను ప్రజలను నమ్మరని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఎక్కువగా ఉన్నందున పవన్ కల్యాణ్‌తో ప్రచారం చేయించాలని టీ టీడీపీ నేతలు అనుకుంటున్నారని, వారి ఆశలు ఆడియాసలేనని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏదో చేస్తారని చెప్పే బీజేపీ నేతలను, ఆంధ్రా- తెలంగాణ మధ్య హైదరాబాద్ విచ్ఛిన్నం చేయాలని చూసే టీడీపీ నేతలను ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని కవిత అన్నారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
నల్గొండ జిల్లా చెన్నంపేట మండలం వెలిమలమంద గ్రామం మజరా ఉస్మాన్ కుంటలో బుధవారం జరిగిన బాల్య వివాహంపై చెన్నంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఉస్మాన్‌కుంట గ్రామానికి చెందిన కవిత(15)కు అదే గ్రామానికి చెందిన బాదు అనే యువకునితో బుధవారం మధ్యాహ్నం వివాహమైంది. ఈ విషయం తెలిసిన సీపీడీవో సక్కూబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవిత తల్లిదండ్రులు విజయ - రతన్‌నాయక్, బాదు తల్లిదండ్రులు సామ్రాట్ - హేమ, పూజారి చారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి అయినప్పటికీ కవితను పోలీసులు ఉమెన్స్ హాస్టల్లో ఉంచారు. బాదూను వాళ్ల ఇంటికి పంపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
షీవాక్ను ప్రారంభించిన కవిత
-
మరోసారి తెరపైకి తారా చౌదరి
విజయవాడ: వివాదస్పద సినీ నటి తారా చౌదరి మరోసారి తెరపైకి వచ్చింది. బడాబాబులతో తన లీలలతో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తారా చౌదరి తాజాగా తన ఆడపడచు కవితపై దాడి చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు తారా చౌదరిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం తన ఆడపడచు కవిత ఇంటికి వెళ్లిన తారా చౌదరి ఆమెపై దాడికి పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకొని అక్కడకు చేరుకున్న పోలీసులపై సైతం తార చిందులేసింది. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. దీంతో పోలీసులు ఆమె వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు. -
'అందుకే మోదీని విమర్శిస్తున్నారు'
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి అన్నారు. త్వరలో జరుగునున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై టీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్నికల వ్యయం లెక్కలు తప్పుగా చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితపై ఈసీ అనర్హత వేటు వేయాలని ఆయన కోరారు. -
'తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. తెలంగాణకు సంబంధించిన 12 అంశాలతో ఏడాది క్రితం కేంద్రానికి నివేదిక ఇచ్చినా.. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పందనా లేదన్న ఆమె రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సోమవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో సమావేశం కానున్నట్లు తెలిపారు. హై కోర్టు విభజన అంశాన్ని కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. తక్షణమే హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. -
ఊపిరి పోస్తారా...
జీవితం బుడగలాంటిది అంటారు ఆ బుడగ లేకపోతే ఈయనకు జీవితమే లేదు భార్య, నాయనమ్మలే ఉఛ్వాసనిశ్వాసాలు. ఇన్నాళ్లూ ఇద్దరిలో ఎవరో ఒకరు ఊపిరి పోస్తూ ఉండకపోతేఇవ్వాళ మనకు ఈ అవకాశం ఉండేది కాదు. మానవత్వానికి ఊపిరి పోసే అవకాశం ఉండేది కాదు. కొండ గాలికి రెపరెపలాడుతున్న దీపాన్ని అరచేతులు అడ్డం పెట్టి కాపాడుకున్నట్టు... తను కునుకు తీస్తే భర్త ఊపిరి ఆగిపోతుందేమో అని కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ కన్నార్పకుండా చూసుకుంటోంది. ఊపిరి సలపనివ్వని సమస్యలతో పోరాడుతూ కట్టుకున్నవాడి ప్రాణం నిలపడానికి ప్రతిక్షణం ఆరాటపడుతోంది. ఆదమరచినా, నిద్ర లేమితో కునుకు తీసినా భర్త ప్రాణాలు దక్కవన్న భయంతో క్షణమొక యుగంలా కాలం వెళ్లదీస్తోంది. జీవితంపై విరక్తిచెంది పసిబిడ్డలా కన్నీరుపెట్టే భర్తను ఓదారుస్తూ... బతుకు మీద ఆశలు కల్పిస్తోంది. భర్త ఆరోగ్యం కోసం ఉన్న ఆస్తులన్నీ ఒక్కొక్కటీ అమ్మేసి చేతిలో చిల్లి గవ్వలేక, కడుపున పుట్టిన బిడ్డను అర్ధాకలితో ఉంచలేక కుమిలిపోతూ బతుకుపోరాటం చేస్తున్న ఈవిడ చేజెర్ల కవిత. ఆనందం వెంటే విషాదం... గుంటూరు జిల్లా నర్సరావుపేట పట్టణానికి చెందిన చేజర్ల శంకర్ ఆర్ఎంపీ డాక్టర్. పదకొండేళ్లక్రితం కవితతో పెళైంది. తర్వాతి రెండేళ్లకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ ఇంట ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కుమారుడి బారసాలకు బంధువులు, స్నేహితులందర్నీ ఆహ్వానించాడు శంకర్. ఫంక్షన్ ఘనంగా జరిగింది. వేడుకకు వచ్చిన అతిథులంతా దంపతులను చిరకాలం ఆనందంగా జీవించమని దీవించారు. అయితే, ఆ తర్వాత రోజే శంకర్ మంచం పట్టాడు. బారసాల పనుల్లో తీవ్ర ఒత్తిడికి గురైన శంకర్ మరుసటి రోజున ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాళ్లూ చేతులు చచ్చుబడ్డాయి. ఊపిరి అందడం కష్టమైంది. వెంటనే అతన్ని గుంటూరులోని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... అరుదుగా కనిపించే ‘మైలైటిస్’ వ్యాధిగా తేల్చి చెప్పారు. వాయునాళాలు కుచించుకుపోయి, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోవడం ఈ వ్యాధి లక్షణం. దీని గురించి వైద్యులు చెప్పగానే నిర్ఘాంతపోయిన శంకర్ కుటుంబీకులు తమకున్న కొద్దిపాటి ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టారు. దాని ద్వారా వచ్చిన 15 లక్షల రూపాయలతో ఆపరేషన్ చేయించారు. అయినా జబ్బు నయం కాలేదు. మెరుగైన వైద్యం చేయించాలంటే ఇంకో పాతికలక్షలైనా ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పారు. ఆర్థిక స్తోమత లేక శంకర్‌ను ఇంటికి తీసుకొచ్చారు. ఇరవై నాలుగు గంటలూ... శంకర్‌కు 24 గంటలూ ఆక్సిజన్ అందిస్తూ ఉండాలి. ఇందుకోసం వెంటిలేటర్ సదుపాయం ఎప్పుడూ ఉండాలి. ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేసుకుని ఆదమరవకుండా ప్రాణవాయువు అందిస్తుండాలి. శంకర్ దుస్థితి చూసిన కొందరు దాతలు రూ.50 వేల వరకూ సాయం చేశారు. ఆ డబ్బుతో కృత్రిమ వెంటిలేటర్ పరికరాలను కొనుగోలు చేసిన కవిత భర్త పక్కనే కూర్చుని బెలూన్ను ఒత్తుతూ అతనికి శ్వాస నందిస్తోంది. అంతేకాదు అతనికి ఇవ్వాల్సిన ఆహారం, మలమూత్ర విసర్జన అన్నీ... మంచమ్మీదే. తొమ్మిదేళ్లుగా ఇదే పరిస్థితి. ఆమె కాసేపు ఆ మంచం దగ్గర నుంచి బయటకు వెళ్లాలన్నా కొడుకును కూర్చోబెట్టి వెళుతుంది. కుటుంబ పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవడంతో తొమ్మిదేళ్ల కుమారుడిని స్కూల్‌కి కూడా పంపించడం లేదు. భర్తకు ఆక్సిజన్‌ను అందించడం కోసం తను ఊపిరిని తీసుకోవడం మర్చిపోతూ అతని సేవలోనే మునిగిపోయింది కవిత. వెంటాడుతున్న ఆర్థిక భారం... శంకర్‌కు సొంతిల్లు గానీ, సొంత పొలం గానీ లేవు. కూడబెట్టుకున్న డబ్బంతా ఖర్చయిపోయింది. సంపాదించే వారు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఇల్లు గడవడమే కష్టమైంది. మూడేళ్ల కిందటి వరకూ ఆదుకున్న శంకర్ తండ్రి వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆర్థిక బాధలు ఇంకా ఎక్కువయ్యాయి. అవసరమైనప్పుడు ఐదు రూపాయలిచ్చే నాథుడు కరువై కవిత నానా కష్టాలు పడుతున్నారు. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులూ లేవు. శంకర్ నాయన మ్మ వరలక్ష్మమ్మకు వచ్చే వృద్ధాప్య పింఛను సొమ్ముతోనే ఇప్పుడు వీరిల్లు గడుస్తోంది. - గంగిశెట్టి వేణుగోపాల్, స్టేట్బ్యూరో, విజయవాడ ఫొటోలు: వి. రూబెన్ బెసాలియల్ నేను పోయాక ఏం చేస్తారో ..! ముసలోళ్లకిచ్చే ఫించను కింద నెలకు రూ.1000 లు వస్తాయి. ఆ డబ్బులతో ఇంట్లోకి కావల్సిన పప్పూ ఉప్పూ కొనుక్కుంటున్నాం. కొంత మంది దాతలు బియ్యం, కూరగాయలు ఇస్తుంటారు. నేను ఎన్నాళ్లు బతుకుతానో తెలియదు. నేను పోయాక ఆ కాస్త డబ్బులు కూడా రావు. ఆపైన ఇల్లు ఎలా నెట్టుకొస్తుందో... (కళ్లనీళ్లు పెట్టుకుటూ) - వరలక్ష్మమ్మ, శంకర్ నాయనమ్మ ఆయనతోనే జీవితం... పెళ్లై అత్తవారింటికి వచ్చాక, నాకు ఎలాంటి కష్టం తెలియకుండా ఇంట్లో కూర్చోబెట్టి అన్నీ సమకూర్చారు నా భర్త. ఈయనే నా ప్రాణమనుకున్నాను. అలాంటిది ఈయనకే ప్రాణం మీదకు వస్తే ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఏదైనా పని చూసుకుందామన్నా రాత్రింబవళ్లూ ఈయన పక్కనే కూర్చుని గాలినందిస్తుండాలి. ఒకవేళ నాకు ఆరోగ్యం బాగోకపోతే ఎవరో ఒకర్ని కూర్చోబెట్టాలి. స్నానానికి వెళ్లాలన్నా, వంట చేయాలన్నా ఎవరో ఒకరు ఈయన దగ్గరుండాల్సిందే. ఏ నాటికైనా ఈయన తిరిగి లేస్తాడన్న ఆశతోనే బతుకుతున్నా. - కవిత, చేజర్ల శంకర్ భార్య తొమ్మిదేళ్లుగా ఇదే పరిస్థితి. భర్తని క్షణంసేపైనా వదిలివెళ్లడానికి లేదు. వెంటిలేటర్ బుడగను ఒత్తీ ఒత్తీ అలసిపోతే, ఆ బాధ్యతను భర్త నాయనమ్మకు ఇచ్చి ఇలా సోలిపోతుంది కవిత. వెంటిలేటర్ ఆగిన క్షణమే భర్త ఊపిరి ఆగిపోతుందన్న భయంతో క్షణమొక యుగంలా ఈమె గడుపుతోంది. సాయం అందించేవారు ఫోన్ నెం: 9160033240లో సంప్రదించగలరు. -
ముంబైలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ముంబై: తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ వేడుకలు ముంబైలో ఆదివారం ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్, జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవిత, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సతీమణి లక్ష్మీథాక్రే, పలువురు ఎమ్మెల్యేలు పాల్లొన్నారు. మహిళలతో కలిసి ఎంపీ కవిత, లక్ష్మీ థాక్రే ఉల్లాసంగా బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలతో పేర్చిన అందమైన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. -
మనుగడ కోసమే కాంగ్రెస్ నేతల గగ్గోలు: కవిత
-
మనుగడ కోసమే కాంగ్రెస్ నేతల గగ్గోలు: కవిత
‘ప్రాణహిత’ రీడిజైన్‌పై రాద్ధాంతం తగదని వ్యాఖ్య ఇబ్రహీంపట్నం: రాజకీయ మనుగడ కోసమే కాంగ్రెస్ ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పుపై గగ్గోలు పెడుతోం దని, దీనిపై రాద్ధాంతం అనవసరమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఆమె రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పదేళ్లుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న జిల్లా నేతలెవ్వరూ ప్రాణహిత- చేవెళ్లపై నామమాత్రంగానైనా స్పందించలేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు డిజైన్‌ను ప్రభుత్వం మార్చబోతోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా వ్యవసాయాధారిత పంటలకు బదులు పాడి, చేపల పెంపకంపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. -
ప్రియుడు దక్కలేదని యువతి బలవన్మరణం
హసన్‌పర్తి: ప్రియుడు దక్కలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలో చోటుచేసుకుంది. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన బండారు సునీల్ (23) ఆత్మకూర్ మండలం ల్యాదేళ్లకు చెందిన ఆకునూరి కవిత(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో సునీల్ బావ ఆకారపు రాజమౌళి తన కూతురిని ఇచ్చి వివాహం చేయూలని నిర్ణరుుంచాడు. ముందు సునీల్ బావ కూతురును చేసుకోనని నిరాకరించిన ప్పటికీ పెద్ద మనుషుల మాటలతో వివాహానికి అంగీకరించాడు. ఈనెల 3వ తేదీన శ్రీఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పెళ్లికి ఏర్పాటు చేశారు. అప్పటికే విషయం తెలుసుకున్న ప్రియురాలు కవిత తనకు న్యాయం చేయాలని హసన్‌పర్తి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని చెప్పడంతో కవిత అక్కడ నుంచి నేరుగా పెళ్లి మంటపానికి వచ్చి.. వివాహాన్ని ఆపే ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్న వారి నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో ఏమీ చేయలేక తీసుకోచ్చి క్రిమి సంహారక మందుతాగింది. తీవ్రఅస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. -
పథకం పన్నారు.. ప్రాణాలు తీశారు..
దంపతుల హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ కొడుకు, కోడలే సూత్రధారులు వివరాలు వెల్లడించిన సీఐ కేసముద్రం : ఆస్తి కోసం ఆమె బంధుత్వాన్ని మ రిచింది.. తమకు అడ్డుగా ఉన్న అత్తమామలను హతమార్చేందుకు కోడలు పథకం రూపొందిం చగా.. వారి కన్నకొడుకు, కోడలికి పరిచయము న్న వ్యక్తి ఈ ఘాతుకంలో పాలుపంచుకున్నారు. అయితే హత్యచేసి గుట్టుచప్పుడు కాకుండా ఉన్న కొడుకు, కోడలిని తమదైన శైలిలో పోలీ సులు విచారించగా వారు హత్యానేరాన్ని ఒప్పుకున్నారు. ఈ మేరకు కేసముద్రం పోలీస్‌స్టేష న్ లో బుధవారం నిందితుల వివరాలను రూరల్ సీఐ కృష్ణారెడ్డి వెల్లడించారు. కేసముద్రం స్టేషన్ కు చెందిన రిైటె ర్డ్ టీచర్ గుడ్ల వెంకట్రామయ్య మొదటి భార్య ప్రమీలకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఆయన కొన్నేళ్ల క్రి తం ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్లు చేశారు. కాగా, పదేళ్ల క్రితం ప్రమీల తన తల్లిగారి ఊరైన పర్వతగిరి మండలంలోని కొంకపాకలో బావిలో పడి చని పోయింది. ఈ క్రమంలో ఏడాది తర్వాత కొడు కుకృష్ణకు నెక్కొండకు చెందిన కవితతో వివాహం జరిగింది. అయితే కొడుకు పెళ్లైన ఏడాది తర్వాత వెంకట్రామయ్య తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పగా.. కొడుకు, కోడలు, బంధువులు ఒప్పుకోలేదు. అయినా వెంకట్రామయ్య ఫర్‌గఢ్ మండలంలోని కూనూరుకు చెందిన సరస్వతిని చేసుకున్నాడు. అనంతరం వెంకట్రామ య్య తన ఇంటి పై పోర్షన్‌ను కొడుకుకు ఇచ్చి, కింది పోర్షన్ తాను ఉంచుకున్నాడు. అలాగే ఇదే గ్రామశివారు బ్రహ్మంగారి తండా, వరంగల్ తిమ్మాపూర్‌లోని స్థలాలను పంపకాలు చేశాడు. అయితే తాను తెచ్చిన కట్నం వాడుకుంటున్నామని, పింఛన్లో తమకు సగం ఇవ్వాలని కవిత డిమాండ్ చేయగా వెంకట్రామయ్య చివరకు కొడుకుకు రూ.2 లక్షలు ఇచ్చాడు. దీంతో ఆయన బట్టలషాపు పెట్టుకున్నాడు. ఆస్తి కోసం ఫిర్యాదు... భూములు, ఇళ్లలో సగం వాటా ఇచ్చినప్పటికీ కొడుకు, కోడలు, మామల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 2005లో తండ్రి, కొడుకులు ఆస్తికోసం కొట్టుకోగా కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గతంలో చేసిన పంపకాలు రద్దు చేయాలని కొన్నేళ్ల క్రితం వెంకట్రామయ్య సబ్ రిజిస్టార్కు దరఖాస్తు చేయడంతోపాటు తిమ్మాపూర్‌లో ఉ న్న స్థలాన్ని మొత్తం అమ్ముకోవడంతో.. కొడుకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో తాను ఇక్కడ ఉండకూడదని భావించిన వెంకట్రామయ్య తాను ఉంటున్న కింది పోర్షన్‌ను అమ్మేందుకు ఒకరి నుంచి రూ.లక్ష అడ్వాన్స్ తీసుకున్నాడు. దీంతో కొడుకు, కోడలు.. వెంకట్రామయ్య, అతడి భార్య సరస్వతితో గొడవపడ్డారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఇరువురు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో రెండోభార్య స్వగ్రామమైన కూనూరులో శాశ్వతంగా ఉండటానికి వెంకట్రామయ్య నిర్ణయించుకుని అక్కడ ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. ఇంత లో రెండో భార్యకు కొడుకు(విష్ణు) పుట్టాడు. ఇదంతా గమనించిన కోడలు కవిత తమకు ఆస్తిదక్కకుండా చేసేందుకు అత్తామామలు కుట్రపన్నుతున్నారని ఆలోచనలో పడింది. హత్యకు పన్నాగం.. ఆస్తి తమకు రాకుండా కుట్రపన్నుతున్న అత్తమామలను హతమార్చేందుకు కోడలు సిద్ధపడింది. ఇందులో భాగంగా కేసముద్రం స్టేషన్‌లోని తమ బట్టల దుకాణం పక్కనే టీస్టాల్ నడుపుకుంటు న్న మానుకోట మండలంలోని వేంనూర్కు చెం దిన మండల మోహన్‌తో పరిచయం పెంచుకుని అప్పుడప్పుడు డబ్బు ఇస్తూ వెళ్లింది. కాగా, మూ డు నెలల క్రితం అత్తామామలను హత్య చేయడంలో కలిసొస్తే రూ.2లక్షలు ఇస్తానని మోహన్‌కు చెప్పిన కవిత.. తన భర్తను దీనికి అంగీకరించేలా చేసింది. దీంతో మోహన్ మానుకోటలో రెండు కత్తులు చేయించి తన స్వగ్రామంలోని చెలకల వద్ద దాచాడు. అయితే కూనూరు లో ఉంటున్న వెంకట్రామయ్య, సరస్వతి సమ్మక్క పండుగ పెట్టుకుందామని ఈనెల 4న కొడుకుతో కలిసి కేసముద్రంలోని తన ఇంటికి వచ్చారు. అయితే అత్తామామలు వచ్చిన విషయాన్ని గమనించిన కవిత వెంటనే మోహన్‌కు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో చెలక లో దాచిపెట్టిన కత్తులను మోహన్ ఒక సంచిలో వేసుకుని ఈనెల 6న రాత్రి 11 గంటలకు బైక్‌పై కవిత, కృష్ణ ఇంటికి వచ్చాడు. అయితే రాత్రివేళ మూత్రవిసర్జనకు ఎలాగైన బయటకు వస్తారని, అప్పటివరకు మనం కాపలా కాయాలంటూ కవి త, మోహన్ కిందికి దిగి సందులో నక్కి ఉన్నా రు. ఈ సమయంలో కవిత భర్త కృష్ణ పైగదిలోనే ఉండి పరిస్థితిని గమనిస్తున్నాడు. కత్తితో మామపై దాడి.. కాగా, అర్థరాత్రి సమయంలో వెంకట్రామయ్య ఇంటి వెనక ఉన్న తలుపులు తీసి మూత్రవిసర్జన కు బయటకు వచ్చాడు. గమనించిన కోడలు కవి త మామను కత్తితో కడుపులో పొడిచింది. ఇదే సమయంలో మోహన్ ఇంట్లో ఉన్న సరస్వతి మెడపై, చాతిలో పొడిచి హతమార్చాడు. కాగా, మామను పొడిచిన తర్వాత కవిత లోపలికి వచ్చింది. అయితే అప్పటికీ ప్రాణాలను బిగపట్టుకున్న వెంకట్రామయ్య లోపలికి ప్రవేశించి కేకలు వేస్తుండగా వారిద్దరు మళ్లీ కత్తితో పొడవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అనంతరం వారు ఇంట్లో ఉన్న డ్యాక్యుమెంట్లను తీసుకుని అక్కడి నుండి పరారయ్యారు. కాగా, సాయంత్రం 3 గంటలకు విష్ణుతో ఆడుకోవడాని కి పక్కింటి పిల్లాడు రావడంతో విషయం బ యట పడగా... కోడలు, కొడుకు ఏమి తెలియనట్లు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అయితే ఆస్తి తగాదాలున్న విష యం తెలుసుకున్న పోలీసులు కొడుకును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోడలును అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయాన్ని ఒప్పుకుంది. ఈ మేరకు బుధవారం వేంనూర్‌లో మోహన్‌ను పోలీసులు పట్టుకుని రెండు కత్తులను, సెల్ఫోన్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సై ఫణిదర్, రూరల్ ఎస్సై పవన్, ఎఎస్సై రాంజీనాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి గారూ..కవితపై చర్యలు తీసుకుంటారా..?
కొత్తగూడెం రూరల్: ‘‘అవినీతిపరులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రయత్నిస్తున్నారు. చట్టరీత్యా ఇది కూడా నేరమే. అందుకే, ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం గారు ప్రకటించాలి’’ అని, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం కొత్తగూడెం లోని సింగరేణి ట్రాన్సిట్ అతిధి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘మీ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగిస్తామంటూ 40వేల మంది సింగరేణి కార్మికుల నుంచి చందాల రూపంలో దాదాపు 90లక్షల రూపాయలను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) అధ్యక్షుడు కనకరాజు, జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, నాయకుడు సారంగపాణి వసూలు చేసి, తమ వ్యకిగత ఖాతాలలో జమ చేసుకున్నారు. వీరు డబ్బులు తీసుకున్నట్టు రుజువవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు’’ అని అన్నారు. అరుునప్పటికీ ఆ ముగ్గురిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఎందుకు వెనకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘వారిని అరెస్టు చేయవద్దంటూ పోలీసులపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు కవిత ఒత్తిడి తెస్తున్నట్టుగా కార్మికులు మాకు సమాచారమిచ్చారు. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అవినీతిపరులను కాపాడుతున్న తన కూతురు కవితపై ఎటువంటి చర్యలు తీసుకునేదీ ఆయన శాసనసభలో వెల్లడించాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘అవినీతిపరులను అరెస్టు చేయవద్దంటూ పోలీసులపై ఆమె ఒత్తిడి తీసుకొస్తే.. ఆమె కూడా తప్పు చేసినట్టే అవుతుంది. చట్టరీత్యా అది నేరమవుతుంది’’ అని అన్నారు. కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇప్పించాలని; చందాలు వసూలు చేసిన కనకరాజు, రాజిరెడ్డి, సారంగపాణిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్టరుుతే.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్మికులు, ఎంఆర్పీఎస్ ఐక్యంగా పెద్దఎతున ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు నల్లమోతు విజయరాజు, ఇనిగాల మొగిలి, దాసరి శ్రీనివాస్, దాసరి సారధి, కొండకూరి అశోక్, కొప్పుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై తాడోపేడో తేల్చుకుందాం పాల్వంచ: ఎస్సీ వర్గీకరణపై తాడోపేడో తేల్చుకునేంత వరకు ఉద్యమించేందుకు మాదిగలు సిద్ధంగా ఉండాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ కొత్తగూడెం నియోజకవర్గ సదస్సు ఆదివారం రాత్రి స్థానిక బస్టాండ్ సెంటర్లోని మినీ గెస్ట్‌హౌజ్ ప్రాంగణంలో జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఒక్క మాల, మాదిగల కోసమే కాదని.. 54 ఉప కులాల అభివృద్ధి చెందాలన్నది కూడా దీని లక్ష్యమని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రధాని మోడి, పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు మాట ఇచ్చారని అన్నారు. అరుునప్పటికీ, చట్టబద్ధత కల్పించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో వారు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ విషయంలో మాలలు మరో రకంగా చూడొద్దు. అవకాశాలను అన్నదమ్ముల్లా పంచుకుందాం’’ అని అన్నారు. ఎంఆర్పీఎస్ను బలహీనపరచడమే లక్ష్యంగా కొందరు స్వార్ధపరులు, దళారుల ద్వారా వ్యతిరేక ఉద్యమాలకు కేసీఆర్ ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. -
అదీ...ఈటెల హుందాతనం
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవిత విషయంలో టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో ఎంత దుమారం రేపాయో తెలుసు. ఆ వ్యాఖ్యలు అసత్యాలతో కూడుకున్నవని పేర్కొంటూ పాలకపక్షం అధికారులిచ్చిన వివరాలతో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యల ను ఉపసంహరించుకోవాలంటూ ఇతర పక్షాలూ రేవంత్‌కు సూచించాయి. కానీ, ఆయన బెట్టు వీడకపోవటం, పాలకపక్షం పట్టుబట్టడం.. వారంపాటు టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. ధర్నాలు.. అరెస్టులు.. ఆందోళనలు.. గవర్నర్‌కు ఫిర్యాదు.. చకచకా జరిగిపోయాయి. కానీ, శుక్రవారం బడ్జెట్ చర్చకు వివరణ ఇచ్చే క్రమంలో ఆర్థికమంత్రి ఈటెల హుందాగా ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. బడ్జెట్ కేటాయింపులపై కాంగ్రెస్ సభ్యులు విమర్శలు చేస్తూ పదేపదే ఈటెల ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్పుడు పలుమార్లు ఆయన కాస్త ఆవేశంగానే మాట్లాడారు. చర్చ కొనసాగుతుండగా.. అంతకుకాస్త ముందే బయటకు వెళ్లిన కాంగ్రెస్ సభాపక్ష నేత జానారెడ్డి సభలోకి వచ్చారు. రావటంతో మైకు అడిగి తీసుకున్నారు. ‘సభ్యుల హుందాతనం గురించి మనం నిన్ననే మాట్లాడుకున్నాం. అయినా మంత్రి కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి దుర్మార్గులు అని సంబోధించినట్టు గుర్తించా.. దానికి వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి. లేదంటే మేం సభలో ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్నా’ అంటూ ఆగ్రహంగా మాట్లాడారు. దీంతో ఈటెల లేచి..‘అలాంటి మాటలు అనే అలవాటు నాకు లేదు. నేను అలా అన్నానని కూడా అనుకోవటం లేదు. అయితే ఆవేశంలో పారపాటున ఆ పదం దొర్లి ఉంటే వెంటనే ఉపసంహరించుకుం టూ రికార్డుల్లోంచి తొలగించాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. భవిష్యత్తులో మరింత సంస్కారంతో వ్యవహరించేప్రయత్నం చేస్తాను’ అని వినమ్రంగా అన్నారు. -
చలించి..స్పందించి
కవిత: నమస్తే అమ్మా. నాపేరు గడిపల్లి కవిత.. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను. మీ ఊళ్లో సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఏ సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు..? శౌరి: వర్షం వస్తే.. గ్రామంలో రోడ్లు అన్నీ బురదగా మారుతున్నాయి. మురుగు కాల్వలు పొంగి ఇళ్లలోకి నీరొస్తోంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ? ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. కవిత: ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు ఈ సమస్య చెప్పారా..? శౌరి: ఎన్నో సార్లు అధికారులకు చెప్పాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూలీ పనులకు వెళ్లే వాళ్లం. ఎవరి వద్దకూ వెళ్లలేం. ఈ పనులన్నీ అధికారులే చేయించాలి. కవిత: ఎందుకు ఏడుస్తున్నావమ్మా..? నీ సమస్య ఏంటీ..? మంగతాయారు: మాది పేద కుటుంబం. నాకు జబ్బు చేసి పశ్చవాతం వచ్చింది. మందుల్లేవు, పట్టించుకునే వారు లేరు. నేను ఎట్లా బతకాలి. కవిత: నేను లెటర్ రాసి ఇస్తా, గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్తావా? మంగతాయారు: మందుల కోసం వెళ్తా. కవిత: మీరేం చేస్తున్నారు..? నంద: అమ్మా.. నేను రోజూ కూలీకి వెళ్లేదాన్ని. పంటలు ఎండిపోవడంతో కూలీ పని దొరకడం లేదు. కవిత: నీకు ఎంతమంది పిల్లలు. ఆడపిల్లను చదివించాలి. డ్వాక్రాలో డబ్బులు పొదుపు చేయండి. దుర్గ: నేను కూలీకి వెళ్తా. ఒక్కతే ఆడపిల్ల. 6వ తరగతి వరకు చదివించాను. ఇంకా చదవమంటే చదవనంటోంది. మీరు చెప్పినట్లు కష్టం చేసైనా చదివిస్తా. కవిత: రాంబాయీ.. నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు. వార్డు సభ్యురాలివి. వారి సమస్యలపై అవగాహన ఉండాలి. పంచాయతీ సమావేశాల్లో సమస్యలు చర్చిస్తారా? రాంబాయి: నేను చదువుకోలేదమ్మ. మీరు చెప్పినట్లు చదువు నేర్చుకుంటా. గ్రామంలో రోడ్లు, మురుగు కాలువలు సరిగా లేవు. కవిత: ఏం తాత.. ఏ పంట వేశావు. ఎలా ఉంది? వీరు: రెండు ఎకరాల్లో పత్తి వేశానమ్మా. వర్షాలు లేక పంట ఎండి పోయింది. పండిన పంటకు రేటు కూడా రానట్లుంది. ఈసారి కాలంతో నష్టమే వచ్చింది. కవిత: అవ్వా నీకు పింఛన్ వస్తుందా..? పుల్లమ్మ: నా భర్త చనిపోయి 25 ఏళ్లు అయింది. నేను ఒక్కదాన్నే ఉంటున్నా. కూలీకి పోవడానికి కూడా చేత కావడం లేదు. పింఛన్ రావట్లే.. వస్తే ఆ డబ్బుతోనే బతుకుతా. కవిత: మీరు వ్యవసాయం చేస్తున్నారా..? వీరయ్య: చేస్తున్నానమ్మా. కరెంట్ ఉండడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. వ్యవసాయానికి కరెంట్ ఇస్తే పంటలు చేతికి అందేవి. కాలంకాక ఏంచేయాలో అర్థం కావడం లేదు. కవిత: చిన్నా చదువుకుంటున్నావా. అంగన్వాడీ కేంద్రంలో ఏం పెడతారు? లక్ష్మీప్రసన్న: అ..ఆలు చదువుకుంటున్నా. అంగన్వాడీ స్కూల్‌కు వెళ్తున్నా. గుడ్డు పెడుతున్నారు. మురుకులు ఇస్తున్నారు. కవిత: అంగన్వాడీ కేంద్రంలో అన్నీ ఇస్తున్నారా.. పిల్లలు ఎంతమంది వస్తున్నారు? కవిత(అంగన్వాడీ టీచర్): మేడమ్. మా కేంద్రంలో 25 మంది పిల్లలు ఉన్నారు. గర్భిణులకు మెనూ ప్రకారం పోషక పదార్థాలు అందిస్తున్నాం. కవిత: తాత మీ ఊళ్లో ఏ సమస్యలు ఉన్నాయి? గోపాల్: ఫ్లోరైడ్ నీళ్లతో ఊళ్లో అందరికి కాళ్ల నొప్పులు, నడుంనొప్పులు వస్తున్నాయి. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. కవిత: సర్పంచ్‌గారు.. మీ ఊరి గురించి చెప్పండి? నాగేశ్వరరావు: మేడమ్. ఊళ్లో ప్లోరైడ్ సమస్య తో ఇబ్బంది పడుతున్నాం. 50ఏళ్ల వయసున్న వారు 70ఏళ్ల మనుషుల్లా ఉంటున్నారు. గ్రామం లో ఉన్న మంచినీటి పైపులైన్లలో ఫ్లోరైడ్ పేరుకపోయింది. ఎక్కడ బోరు వేసినా ఫ్లోరైడే వస్తుం ది. ఈ నీటిని గ్రామస్తులు తాగలేకపోతున్నారు. కవిత: ఈ విషయం అధికారులకు చెప్పారా..? ఏం చర్యలు తీసుకున్నారు? నాగేశ్వరరావు: ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పాం. చాలా చోట్ల బోరు వేయడానికి పరిశీలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పాలేరు ద్వారా సాగర్ కాలువతో లకారం చెరువు నీటిని నింపి అక్కడి నుంచి పైపులైను ద్వారా గ్రామానికి మంచినీటిని అందించడానికి ప్రతిపాదన చేశారు. ఈ పనులు ముందుకు సాగడం లేదు. కవిత: ఈఓపీఆర్డీగారు.. ఈ పనులు ఎంతవరకు వచ్చాయి? ఈఓపీఆర్డీ: మేడమ్. లకారం చెరువు నుంచి మండలంలోని 15 గ్రామాలకు మంచినీటి అందించేందుకు పైపులైన్లు వేస్తున్నారు. త్వర లో ఈ గ్రామానికి కూడా మంచినీళ్లు వస్తాయి. కవిత: మీ సమస్య ఏంటీ? షేక్ జానీ: అధికారులు పాత పైపులైన్ల ద్వారానే లకారం చెరువు మంచినీటి అందించాలని చూస్తున్నారు. ఈ పైపులతో గ్రామంలోకి నీరు, మంచినీరు వస్తే మళ్లీ ఫ్లోరైడ్ వస్తుంది. జెడ్పీ చైర్పర్సన్ హామీలు.. నేను మీ గ్రామానికి విలేకరిగా వచ్చాను. ఇక్కడ అన్ని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి పాలేరు నుంచి లకారం చెరువుకు నీటిని మళ్లించి అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా అందించే పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటా. గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీలను నిర్మించేందుకు అంచనాలు రూపొందించడంతో పాటు, జెడ్పీ నిధుల నుంచి ఈ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తా. గ్రామంలో ఉన్న అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెపుతా. గ్రామంలో సాక్షర భారత్ కేంద్రాలను నిరంతరాయంగా కొనసాగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా. -
మాజీ ఎమ్మెల్యే పార్టీ మారడాన్నినిరసిస్తూ ఆత్మహత్యాయత్నం
కేసముద్రం: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత టీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వరంగల్ జిల్లా కేసముద్రం స్టేషన్ కు చెందిన ఖాసీం అనే కాంగ్రెస్ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బాధితుడి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇటీవల డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, పరిగి ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కవితలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. -
రెడ్యా, యాదయ్య, కవితలకు షోకాజ్ నోటీస్
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కవితలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని టీపీసీసీ కోరింది. గతంలో జారీ చేసిన షోకాజ్ నోటీసుపై మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు ఇచ్చిన వివరణపై టీపీసీసీ సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై శుక్రవారం గాంధీ భవన్ లో టీపీసీసీ సమావేశం కానుంది. -
ఎంపీ కవిత ఆశీస్సులు ఉన్నవారికే!
కేబినెట్లో బెర్త్ ఎవరికో? సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో కొలువు తీరే రెండో మంత్రి ఎవరనే చర్చకు మళ్లీ తెర లేచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికలలో విజయఢంకా మోగించిన టీఆర్ఎస్ జూన్ రెండున సర్కారును ఏర్పాటు చేసింది. అ ప్పుడు జిల్లా నుంచి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కేబినెట్లో చోటు లభించింది. నాలుగున్నర నెలల తరువాత, ఈ నెల 22న మంత్రివర్గ వి స్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ ముఖ్యులు, ఆశావహులకు అధిష్టానం నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో జిల్లాలో రెండో మంత్రిగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. మొదటి నుంచి ప్రధానంగా నలుగురు శాసనసభ్యులు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. రెండో విడత అదృష్టం వరించే ఆ ఎమ్మెల్యే ఎవరు? లేక ‘విప్’తో సరిపెడతారా? అన్నది తెలియ డం లేదు. ఆశావహులు మాత్రం ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సామాజిక కోణం, సీనియారిటీయే ప్రామాణికం! రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో విజ యం అందించిన జిల్లాకు రెండో మంత్రి పదవి ఖా యమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ దిగ్గజాలను మట్టి కరిపించిన నేపథ్యంలో రెండో మం త్రి ని ఇవ్వడం న్యాయమని కూడ వారు బలంగా వా ది స్తున్నారు. అయితే, రెండో దఫా విస్తరణలో నాయకు ల ప్రాధాన్యం, సామాజిక కోణం, సీనియారిటీ తది తర అంశాలను పరిశీలించాకే మంత్రివర్గంలో చోటి చ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే సీఎం సహా 11 మంది మంత్రివర్గంలో ఉండగా, ఇంకా ఎంతమందిని తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మా రింది. మొదటి విడతలో సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. రెండో విడతకు కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ దిగ్గజం డి.శ్రీనివాస్‌పై గెలుపొందిన బాజిరెడ్డి గోవర్ధన్ పేరు కూడ ప్రచారంలో ఉంది. గతంలో బాజిరెడ్డి వేర్వేరు ఎన్నికలలో రెండు చోట్ల నుంచి గెలుపొంది, మూడోసారి నిజామాబాద్ రూరల్ నుంచి విజయం సాధించి రికార్డు నెలకొల్పారు. సామాజికాంశాలు, అధినేతతో ఉన్న చొరవలను పరిగణనలోకి తీసుకుంటే నిజామాబాద్ అర్బన్, బోధన్ ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్తా, అహ్మద్ షకీల్ కూడా మంత్రిపదవి రేసులో ఉంటారని అంటున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ ఇచ్చి న హామీ మేరకు వీరందరూ ప్రయత్నం చేసినా, మొ దటి విడతలో చాన్స్ దక్కలేదు. ఎంపీ కవిత ఆశీస్సులు ఉన్నవారికే! కేసీఆర్ కొలువులో రెండో విడత విస్తరణలో అమాత్యులు ఎవరు? తెలంగా ణ రాష్ట్రం తొలి కేబినేట్లో రెండో మంత్రిగా జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? ఈ సారి విస్తరణలో ఇందూరు నుంచి కేసీఆర్ ఎవరికి ప్రాతినిధ్యం కల్పించనున్నారు? ఆయన అంతరంగంలో అసలేముంది? నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి? ఈసారి విస్తరణలో మనకు మంత్రా? విప్పా? ఇవన్నీ రాజకీయ విశ్లేషకులలో సాగుతున్న చర్చలు. వాస్తవానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి కేటాయించిన తర్వాత మరో మంత్రికి అవకాశం లేకపోవచ్చన్న చర్చ కూడ ఉంది. ఎందుకంటే మంత్రివర్గంలో సీఎం సహా 18 మందికే పరిమితం చేయాలనుకున్నా, అందులోను ఒకటి తగ్గుతుందంటున్నారు. మొదటి నుంచి ఉద్యమాలకు ఊతమిచ్చిన కరీంనగర్, వరంగల్ జిల్లాలలో ఇప్పటికే ఇద్దరిద్దరున్నా ఇంకా ఒక్కొక్కరికి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరికీ, నల్గొండ, ఖమ్మంలో సైతం ఒక్కరు, లేదా ఇద్దరికి ప్రాతినిధ్యం కల్పిస్తారని చెబుతున్నారు. గిరిజన, ఆదివాసీ జిల్లాగా పేరున్న ఆదిలాబాద్లోను ఇంకొకరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటున్నా. ఆరు మంత్రి, మూడు విప్ పదవులలో జిల్లాలో ఎవరైనా ఒకరికీ చాన్స్ దక్కవచ్చని, లేదంటే కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. -
బాలికలను కాపాడుకుందాం..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, తరుణి స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా బేగంపేట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘బాలికలను కాపాడుకుందాం’ అన్న సందేశంతో బైక్‌థాన్ పేరిట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వరకు దాదాపు 500 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు నిజామాబాద్ ఎంపీ కవితతోపాటు అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్, క్రైం ఎస్పీ పద్మజ, ఏపీ ఫారెస్ట్ అకాడమీ డెరైక్టర్ రఘువీర్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు తదితరులు ఆడ పిల్లలకు రక్షణగా ఉంటామని ప్రతినబూనారు. తోడు-నీడగా ఉండి వారి అభివృద్ధిని కాంక్షిస్తామని, ఆర్థికంగా, సామాజికంగా వారి ఎదుగుదలకు తోడ్పాటునందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ మగ పిల్లలతో పోలిస్తే ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉండడం బాధాకరమన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మమతారఘువీర్, అచ్యుతరావు, రహీముద్దీన్ మాట్లాడుతూ 2001-2011 జనాభా లెక్కల ప్రకారం అమ్మాయిల శాతం గణనీయంగా పడిపోయిందన్నారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా హక్కులు పొందే రోజులు రావాలన్నారు. హక్కుల కోసం పోరాడిన మలాల మాదిరిగా బాలికలు ముందుకు రావాలన్నారు. అంతర్జాతీయ బాలికల వారోత్సవాలను పురస్కరించుకుని బాలికల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈనెల 15న సైదాబాద్ కాలనీలోని గీతాంజలి విద్యాలయంలో చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు, తరుణి సంస్థ అధినేత్రి హేమలత పాల్గొన్నారు. -
తెలంగాణ చిత్రం
తెలంగాణ కుంచె అద్భుతాలకు తారామతి బారాదరి కాన్వాస్‌గా మారింది. తెలంగాణ గడ్డపై పుట్టిన చిత్రకారులు రంగుల లోకాన్ని సృష్టించారు. జీవం ఉట్టిపడే చిత్రరాజాలను ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబాలను కళ్లముందుంచారు. నూనూగు మీసాల యువకుల నుంచి ఎనిమిదిపదుల పెద్దల వరకూ తమ ప్రతిభను చాటారు. ఆర్ట్ ఎట్ తెలంగాణ పేరిట శనివారం జరిగిన తెలంగాణకు చెందిన 90 మంది చిత్రకారులు తరలివచ్చారు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ చిత్రాల పండుగ జరగనుంది. ఈ నెల 30 వరకు మొదటి బ్యాచ్‌కు చెందిన 50 మంది కళాకారులు, అక్టోబర్ 1 నుంచి 6 వరకు మిగతా 40 మంది కళాకారులు చిత్రాలు వేయనున్నారు. తర్వాత ఈ చిత్రాలను నగరంలో జరగనున్న మెట్రోపోలీస్ సదస్సులో ప్రదర్శించనున్నారు. లక్ష్మణ్ ఏలే, లకా్ష్మగౌడ్, వైకుంఠం, అంజనీరెడ్డి, కవిత, ఎమ్మెస్ దాతార్ల తదితర చిత్రకళాకారులు ఇందులో పాల్గొన్నారు. ఔత్సాహికులకు మంచి వేదిక ఇటువంటి కార్యక్రమాలు ఔత్సాహిక చిత్ర కళాకారులకు మంచి వేదిక అన్నారు ఏలె లక్ష్మణ్. సీనియర్ ఆర్టిస్టులతో ముఖాముఖితో పాటు వారి సలహాలు తీసుకోవచ్చు. అంతే కాకుండా చిత్రం గీసే సమయంలో వారిని గమనించే అవకాశం లభిస్తుందంటున్నారాయన. గోల్కొండ -
భువనగిరిని నాగుండెల్లో పెట్టుకుంటా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బంగారు బతుకమ్మ సంబరాలు విజయవంతం భువనగిరి ‘మొదటి రోజునే విజయవంతంగా నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబరాలను నా జీవితంలో మరచిపోలేను.. భువనగిరి నా గుండెల్లో నిలిచిపోతుంది’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బంగారు బతుకమ్మ సంబరాలతో భువనగిరి పట్టణం పూలవనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఈ పండగను తొలిసారిగా భువనగిరిలో ప్రారంభించారు. గ్రామాల నుంచి బతుకమ్మలతో భారీగా తరలి వచ్చిన మహిళలతో ఎక్కడ చూసినా బతుకమ్మ సందడి కనిపించింది. తొలిరోజు భువనగిరిలో నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబరాలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బతుకమ్మలతో బంగారు తెలంగాణను సాధించుకోవడానికి పెద్ద ఎత్తున హాజరైన మహిళా శక్తి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతి బింబంగా బతుకమ్మ పండగ ఎదిగిందన్నారు. 2008లో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి బతుకమ్మ పండగను ప్రారంభించామన్నారు. తెలంగాణ బతుకమ్మ పండగను హేళన చేసినవారికి భువనగిరి సభ సమాధానం చెబుతుందన్నారు. విద్యాశాఖమంత్రి జి.జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ అసమానతలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ క ంటున్న కలలకు భువనగిరి బంగారు బతుకమ్మ సభ నిద ర్శనమన్నారు. సుఖశాంతుల కోసం తెలంగాణను పోరాడి సాధించుకున్నామన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్లకు భువనగిరిలో జరిగిన బంగారు బతుకమ్మ సంబరాలకు హాజరైన మహిళలను చూస్తే తెలుస్తుందన్నారు. తరతరాలుగా బతుకమ్మ పండగను చేసుకుంటున్నా తెలంగాణ రాష్ర్టం రావడం వల్లే ఇంత పెద్ద ఎత్తున జరుపుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఇంతకాలం చంపుకున్న ఆత్మగౌరవం నిలబెట్టుకున్నామనడానికి, మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకున్నామనడానికి ఇది నిదర్శనమన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ బంగారు బతుకమ్మ సంబరాలను ప్రభుత్వం నిర్వహించడం పట్ల కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భువ నగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంస్కృతి, అస్తిత్వం ప్రమాదంలో పడినపుడు పుట్టిన ఉద్యమ కెరటం జాగృతి అన్నారు. కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఉద్యమానికి ఊపిరినిచ్చాయని చెప్పారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలను తొలిసారిగా భువనగిరిలో ప్రభుత్వం నిర్వహించిందన్నారు. తెలంగాణ ప్రజల సుఖ శాంతుల కోసం ప్రభుత్వం పండగను జరుపుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో సంబరాలను పెద్ద ఎత్తున జరుపుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు బతుకమ్మ సంబరాలకు వచ్చిన మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ జాగృతి ద్వారా తెలంగాణ మహిళలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరి ఆర్డీఓ నూతి మధుసూదన్ ఆధ్యక్షతన జరిగి ఈ సభలో ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు, జేసీ ప్రీతిమీనా, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు కె. ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిషోర్, వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొలుపుల అమరేందర్, నాగారం అంజయ్య, సిద్దుల పద్మ, బొట్ల పరమేశ్వర్, బిల్డర్ రవికుమార్, పారిశ్రామికవేత్త ఆంటోనిరెడ్డి, డీఎస్పీ ఎస్. శ్రీనివాస్, తహసీల్దార్లు కె. వెంక ట్‌రెడ్డి, వీరప్రతాప్, అరుణారెడ్డి పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా డాక్టర్ పోరెడ్డి రంగయ్య వ్యవహరించారు. బతుకమ్మ ఆడిన కవిత బంగారు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వం, తెలంగాణజాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బంగారు బతుకమ్మ ఉత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో ఆమె కలిసిపోయారు. వారిని పలకరిస్తూ సంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ సుమారు గంటసేపు ఆడారు. దీంతో మహిళలు ఆమెను అనుకరించారు. ఆమెతో కలిసి ఆడడానికి మహిళలు ఆసక్తి చూపారు. సభ అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి మహిళలతో కలిసి వెళ్లారు. ఆమె వెంట ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత, జేసీ ప్రీతిమీనా, పలువురు మహిళా నాయకులు ఉన్నారు. -
బతుకమ్మకు 10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. బతుకమ్మ పండగ నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నిజమాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్ 24నుంచి అక్టోబర్ 2వరకు బతుకమ్మ పండగ జరుగనుంది. బతుకమ్మ పండగ ఉత్సవాలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని ఆధికారులను ఆదేశించారు. -
వీరికేమైంది?
గుమ్మఘట్ట : మండలంలోని గోనబావి గ్రామంలో చిన్నారులు గొంతు వాపు వ్యాధితో పిట్టల్లా రాలిపోతున్నారు. గొంతు కింద వాపు వచ్చి.. తినడానికి, తాగడానికి ఇబ్బందికరంగా మారి, నీర సించిపోయే లక్షణాలతో ఈ నెల మూడో తేదీన ఆరో తరగతి విద్యార్థి గీత (11), పదో తేదీన నాలుగో తరగతి విద్యార్థి కవిత (9) చనిపోయారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు. తాజాగా గురువారం లక్ష్మి, వడ్డే ఆంజనేయులు దంపతుల కుమార్తె అక్షయ (4) ప్రాణాలు విడిచింది. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి జబ్బులబారినపడిన వారికి చికిత్సలు చేస్తున్నారు. అయితే మరో 20 మంది విద్యార్థుల్లో పై లక్షణాలు కనిపించడంతో వారిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతురాలు అక్షయ కుటుంబంలో ని శ్యామల, అశోక్ కూడా వెళ్లిన వారిలో ఉన్నారు. చిన్నారులు హరికృష్ణ, ఉపేంద్ర, మహేంద్రల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యాధికారి హిమ బిందు తెలిపారు. గ్రామంలో ఒకేసారి ఇంత మంది విద్యార్థులు చికిత్స కోసం వెళ్లడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదేం మాయరోగమో అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లల ఉసురు తీసి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్న ఈ వ్యాధిని వెంటనే అరికట్టి.. మరిన్ని ప్రాణాలు పోకుండా చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు. డిప్తీరియా వ్యాధేమోనని అనుమానం గ్రామస్తులు భావిస్తున్నట్టుగా గవద బిల్లలు (టాన్సిల్స్)తో అయితే చనిపోరని, ఈ వ్యాధి ఏమిటో అంతు చిక్కడం లేదని సీనియర్ ప్రజా ఆరోగ్యాధికారి వెంకటస్వామి చౌదరి పేర్కొన్నారు. గొంతువాపు లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులను పరిశీలించిన ఆయన వెంటనే జిల్లా వైద్యాధికారికి ఫోన్లో సమాచారమందించారు. ఆయన అదేశాల మేరకు సంబంధిత పిల్లలను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డిప్తీరియా వ్యాధి ఏమై నా సోకిందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎస్పీహెచ్ఓ ,ఆరోగ్య బోధకుడు లక్ష్మినారాయణ పర్యటించి వివరాలు సేకరించారు. ఇంటింట వైద్య పరీక్షలు.. గ్రామంలో వైద్యులు హిమబిందు, రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చికిత్సలు నిర్వహిస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, తాగునీరు కలుషితమవడం వల్ల ఇలాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు. వ్యాధులు అదుపులోకి వచ్చేవరకూ వైద్య శిబిరం కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. దోమల నిర్మూలనకు గంబూషియా చేపలు గోనబావి గ్రామంలో దోమల నిర్మూలనకు మురికి కాలువలు, నీటి కుంటల్లో గంబూషియా చేప పిల్లలను వదిలినట్లు ఎంపీడీఓ జీ మునయ్య చెప్పారు. గురువారం ఈఓఆర్డీ ప్రసాద్‌తో కలసి గ్రామాన్ని సందర్శించిన ఆయన వ్యాధుల పట్ల ప్రజలకు అ వగాహన కల్పించారు. నీటి శ్యాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి శివకుమార్, వైస్ ఎంపీపీ వడ్డే హనుమక్క, గోనబావి ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. మెదడువాపు వ్యాధితో చిన్నారి మృతి రాయదుర్గం టౌన్: పట్టణంలోని 23వ వార్డులో నివాసముంటున్న చాకలి వన్నూరుస్వామి కుమార్తె శ్రావణి (4) మెదడువాపు వ్యాధితో బుధవారం ఉదయం బళ్లారిలోని విమ్స్‌లో మృతి చెందింది. ఆలస్యంగా సమాచారం అందడంతో ప్రభుత్వాస్పత్రి వైద్యుడు మన్సూర్, ఆరోగ్య బోధకుడు లక్ష్మినారాయణ, మలేరియా యూనిట్ ఆఫీసర్ లక్ష్మానాయక్, ఇన్చార్జ మునిసిపల్ కమిషనర్ హనుమన్న, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్రయాదవ్ గురువారం మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించారు. 18 మంది పిల్లలకు ‘అనంత’లో చికిత్స అనంతపురం మెడికల్ : గొంతు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన గుమ్మఘట్ట మండలం గోనబావికి చెందిన 18 మంది పిల్లలకు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈఎన్టి వైద్యుడు అనిల్ కుమార్, చిన్న పిల్లల విభాగం వైద్యురాలు మల్లేశ్వరి పర్యవేక్షణలో వారికి చికిత్స కొనసాగుతోంది. 10 నెలల చిన్నారి గవద బిళ్లలతో, 17 మంది పిల్లలు టాన్సిల్స్‌తో బాధపడుతున్నారని వారు చెప్పారు. వీరిలో సగం మందికి జ్వరం, జలుబు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నామని, టాన్సిల్స్ వల్ల మృతి చెందే అవకాశం లేదని చెప్పారు. -
హైదరాబాద్‌పై సీమాంధ్రులకు ఎలాంటి అధికారాలూ ఉండవు: ఎంపీ కవిత
హైదరాబాద్ : ‘హైదరాబాద్ కామన్ క్యాపిటలే తప్ప జాయింట్ క్యాపిటల్ కాదు... దానిపై సీమాంధ్రులకు ఎలాంటి అధికారాలూ ఉండవు’ అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థల ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పులు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్ 2 తరువాత ఉద్యమాలకు రెస్ట్ ఉంటుందని అనుకున్నాం కాని అది జరగడం లేదని పోలవరం, ఉద్యోగుల విభజన, హైదరాబాద్ ఆస్తులు, గవర్నర్ అధికారాలపై ఇలా నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్, విఠల్, జేఏసీ ప్రతినిధులు రమణరెడ్డి, థామస్‌రెడ్డి, గోవర్ధన్, కనకరాజు, అంజయ్య, వెంకటేశ్వరరావు, కరీముల్లాతో పాటు వివిధ కార్పొరేషన్లకు చెందిన యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారు?: కవిత
పవన్‌కల్యాణ్‌ను ప్రజలు ఇప్పటికే బండకేసి కొట్టారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ‘మా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రభాకర్‌రెడ్డి 2009 నుంచి పార్టీలో ఉన్నారు. మరి జగ్గారెడ్డి ఎప్పటినుంచి బీజేపీలో ఉన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న జగ్గారెడ్డికి మీరు టికెట్ అమ్ముకున్నారని అనుకోవచ్చా?’ అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని అంటున్నారని ప్రశ్నించగా, పవన్‌ని ఇప్పటికే ప్రజలు బండకేసి కొట్టారన్నారు. -
'టి.సర్కార్ అధికారాలను కాలరాయడం లేదు'
న్యూఢిల్లీ: శాంతి భద్రతల అంశంలో తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కాలరాయడం లేదని కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుందనే వార్తలను రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని మాత్రమే కేంద్రం అమలు చేస్తోందని రాజ్ నాథ్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాజ్ నాథ్ ను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో గురువారం భేటి అయ్యారు. అనంతరం రాజ్ నాథ్ మాట్లాడుతూ.. దేశంలోని ఫెడరల్ నిబంధలకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోదు అని స్పష్టం చేశారు. దేశంలోని ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా కేంద్ర చర్యలు తీసుకోబోదని రాజ్ నాథ్ చెప్పినట్టు ఎంపీ కవిత కూడా మీడియాకు తెలిపారు. -
రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించారు
-
కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీ?
శాతవాహన యూనివర్సిటీ : రాష్ట్ర ప్రభుత్వం పీవీ నర్సింహారావు పేరిట ఏర్పా టు చేయనున్న వెటర్నరీ యూనివర్సిటీని కోరుట్లలోని వె టర్నరీ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేయించేందుకు నిజామాబాద్ ఎంపీ కవిత ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయమై ఇప్పటికే కళాశాల అధికారులతో చర్చించిన ఆమె ఆదివారం వారితో హైదరాబాద్‌లో మరోసారి స మావేశమయ్యారు. యూనివర్సిటీ ఏర్పాటు సంబంధిత విషయాలను వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ రమేశ్ గుప్తా ఎంపీకి వివరించినట్లు సమాచారం. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత మరిన్ని వసతులు సమకూర్చుకునే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం యూనివర్సిటీ ఏర్పాటుకు అనువుగా ఉన్న వసతులు, అనుకూల వాతావరణాన్ని ఆయన వివరించారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంపీ కవిత కలిసి వెటర్నరీ యూనివర్సిటీని కోరుట్లలో ఏర్పాటు చేయాలని కోరనున్నారు. జిల్లాలోని కథలాపూర్ ప్రాంతంలో ఉద్యానవన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారని భావించినా... సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో వెటర్నరీ యూనివర్సిటీని మన జిల్లాకు మంజూరు చేయించేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారు. అనుకూల అంశాలు.. * ఇప్పటికే ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయ వెటర్నరీ సైన్స్ కళాశాలకు 58 ఎకరాల స్థలం ఉంది. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన అదనపు స్థలాన్ని ప్రభుత్వం సేకరించడానికి వీలుంది. * హైదరాబాద్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కళాశాల కరీంనగర్ జిల్లా కేంద్రానికి 72 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచి రోడ్డు రవాణా సదుపాయాలు ఉన్నాయి. * అవసరమైన విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, నీటి సదుపాయాలు, అంతర్గత రోడ్లు, ప్రహారీ ఉన్నాయి. *అన్ని రకాల భవనాలున్నాయి. విద్యార్థులకు, విద్యార్థినులకు హాస్టళ్లున్నాయి. క్యాంటీన్, గెస్ట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ఇతర భవనాలు నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాయి. యూనివర్సిటీ నిర్వహణకు అవసరమయ్యే అదనపు ఏర్పాట్లు మాత్రం చేయవలసి ఉంటుంది. * విద్యార్థులకు ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడి యం, ఉద్యోగులకు క్వార్టర్స్, హెల్త్ సెంటర్లకు ప్రతి పాదనలు ఇప్పటికే పంపారు. అనుమతి రావాల్సి ఉంది. * పశు వైద్యశాలలు, దాణా కలిపే ప్లాంట్, పోస్ట్‌మార్టమ్ హాల్, పశువులకు షెడ్లు ఉన్నాయి. * తెలంగాణలో ప్రాంతీయ సమతుల్యతకు సహకరిస్తుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చేరువలో ఉంటుంది. -
ఖమ్మం జెడ్పీ పీఠం టీడీపీ వశం
ఖమ్మం: ఖమ్మం జిల్లా పరిషత్ పీఠాన్ని వామపక్షాల సాయంతో తె లుగుదేశం పార్టీ గెలుచుకుంది. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. మొత్తం 39 మంది సభ్యులున్న జెడ్పీలో టీడీపీకి 19 మంది సభ్యుల బలముంది. వీరికి సీపీఐ, సీపీఎంలకు చెందిన ముగ్గురు సభ్యులు మద్దతివ్వడంతో 22 ఓట్లతో టీడీపీ రెండు పదవులను కైవసం చేసుకుంది. ఆ పార్టీ తరఫున చైర్‌పర్సన్‌గా గడిపల్లి కవిత, వైస్‌చైర్మన్‌గా బరపాటి వాసుదేవరావు ఎన్నికయ్యారు. మద్దతిచ్చినందుకు గాను సీపీఐ, సీపీఎంలకు కో-ఆప్షన్ పదవులు దక్కాయి. నలుగురు వైఎస్సార్సీపీ సభ్యులు తటస్థంగా ఉండగా, ముగ్గురు న్యూడెమోక్రసీ సభ్యులు ఎన్నిక ప్రక్రియను బహిష్కరించారు. -
ఎంపీ కవితపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం!
హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, నిజమాబాద్ ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని మాదన్నపేట పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. స్వాతంత్య్రం వచ్చాక కాశ్మీర్, తెలంగాణను బలవంతంగా భారత్ లో విలీనం చేశారని, కాశ్మీర్‌లోని కొన్ని భాగాలు భారత భూభాగంలోనివి కావని టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ లీగల్ సెల్ అడ్వొకేట్ కన్వీనర్ కరుణాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. కరుణాసాగర్ ఫిర్యాదును పరిశీలించిన ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
కలుషిత ఆహారంతో బాలికలకు అస్వస్థత
కుల్కచర్ల: కలుషిత ఆహారం తినడంతో ‘కస్తూర్బా’ పాఠశాలలోని 30 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురికి ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన కుల్కచర్లలో బుధవారం చోటుచేసుకుంది. విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారి తల్లిదండ్రులు, వివిధ సంఘాల నాయకులు పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవడంతో మధ్యాహ్నం పరిగి-మహబూబ్‌నగర్ రహదారిపై బైఠాయించారు. వివరాలు.. కుల్కచర్లలోని ‘కస్తూర్బా’ పాఠశాలలో 198 మంది బాలికలు చదవుకుంటున్నారు. భోజనం సరిగా లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని కొంతకాలంగా బాలికలు ఆందోళన చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నాయకులు, మూడు రోజుల క్రితం తహసీల్దార్, ఎంఈఓ తదితరులు పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. వంటవారిని హెచ్చరించి వెళ్లారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి సిబ్బంది అన్నంతో పాటు తోటకూర చారు చేసి విద్యార్థులకు వడ్డించారు. అర్ధరాత్రి బాలికలు రాధిక(6వ తరగతి), భారతి (6వ), సురేఖ (9 వ), జయమ్మ (10 వ), లక్ష్మి (9వ), అనూష (9వ), మనూష (7 వ), రాధ, సుష్మ(8వ తరగతి)లకు కడుపునొప్పి, తీవ్ర జ్వరం వచ్చింది. పాఠశాలలోని ఏఎన్ఎం లక్ష్మి బాలికలకు మందులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం ఉదయం వరకు సదరు విద్యార్థులతో పాటు మొత్తం సుమారు 30 మంది విద్యార్థులు కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుల్కచర్ల పీహెచ్సీ నుంచి వైద్యులు వచ్చి చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం ఐదు మందిని కుల్కచర్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారికి స్కూల్లో సెలైన్లు పెట్టి చికిత్స చేశారు. కాగా అన్నంలో సొడా, సున్నం కలపడంతో తాము అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు తెలిపారు. కాగా మంగళవారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులే అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీటితోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థులకు మంచినీరు సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంక్‌లో పూర్తిగా నాచుపేరకుపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటామని గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బాధ్యులపై చర్యలు.. విద్యార్థులు అస్వస్థతకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి దశరథ్‌నాయక్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయనతో పాటు జిల్లా డీటీడబ్ల్యూఓ అధికారి శివప్రసాద్ తదితరులు కస్తూర్బా పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. నాలుగు రోజులుగా సరిగా తిండి లేదని విద్యార్థులు ఆయనతో చెప్పారు. కుక్‌లను తొలగించి కొత్తవారిని ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు. ప్రమాదం ఏమి లేదు.. కలుషితమైన ఆహారం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతానికి ఎవరికీ ఏ ప్రమాదం లేదు. బాలికలు పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉండి చికిత్స చేస్తాం. అందరికి మందులు ఇస్తున్నాం. సాయిలక్ష్మి, వైద్యురాలు కుల్కచర్ల పీహెచ్సీ అన్నం తిన్న గంట తర్వాతి నుంచి.. మంగళవారం రాత్రి అన్నం, చారు తిన్నాం. కొద్దిసేపు చదువుకున్నాం. గంట తర్వాత కడుపునొప్పి వచ్చింది. జ్వరం కూడా వచ్చింది. అసలేం జరిగిందో తెలియదు. కవిత, 10 తరగతి నాలుగు రోజులుగా సరిగా తిండిలేదు. నాలుగు రోజులుగా పాఠశాలలో సక్రమంగా తిండిలేదు. అ న్నం సరిగా వండడం లేదు. మంగళవారం రాత్రి అన్నంలో సొడా, సున్నం వేశారు. భోజనం చేసేట ప్పుడు వాసన వచ్చింది. అందుకే కొంచమే తిన్నాం. కోమలి, 9వ తరగతి -
ఎత్తులు పైఎత్తులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇందూరులోని పురాలను తమ పరం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. పీఠాలను దక్కించుకునేందుకు పక్కా వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో పుర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు హంగ్ ఏర్పడిన ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార పార్టీ టీఆర్ఎస్ సర్వశక్తులొడ్డుతోంది. నిజామాబాద్, బోధన్‌లలో ఎంఐఎం మద్దతు కూడగట్టుకున్న టీఆర్ఎస్, ఆర్మూర్‌లో బీజేపీ కౌన్సిలర్ మద్దతు, ఎక్స్ ఆఫీషియోల ఓట్లతో గట్టెక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో పాగా వేసేందుకు ఎంపీ కల్వకుంట్ల కవిత చక్రం తిప్పుతున్నారు. ఆర్మూర్, బోధన్‌లలో ఎంఐఎం, ఇతర పార్టీల మద్దతుతో గట్టెక్కేందుకు ఆమె సంబంధిత నేతలతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మున్సిపల్, పరిషత్ పరోక్ష ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత డి.శ్రీనివాస్ నిజామాబాద్ కార్పొరేషన్‌ను హస్తగతం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిలు బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల కోసం కసరత్తు చేస్తున్నారు. మామంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కేలా చూస్తున్నారు. అధిక స్థానాలపై అధికారపక్షం కన్ను నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్ బల్దియాలపై అధికార పార్టీ టీఆర్ఎస్ కన్నేసింది. పార్టీ ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతుతోనైనా ఈ మూడింటినీ దక్కించుకునే వ్యూహం సిద్ధం చేసుకుంది. నిజామాబాద్‌లో మొత్తం 50 డివిజన్లకు 10 స్థానాలను గెలిచిన టీఆర్ఎస్ ఇక్కడ ఎంఐఎం మద్దతుతో 26కు పెంచుకుంది. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ల మద్దతుతో ఈసంఖ్య 28కి చేరనుండగా.. మరో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ క్యాంపుతో హాజరవుతున్నట్లు సమాచారం. బోధన్‌లో మొత్తం 35 వార్డులకు టీఆర్ఎస్ 9 వార్డులు గెలుచుకోగా ఆరుగురు ఎంఐఎం కౌన్సిలర్లు, ముగ్గురు బీజేపీ, టీడీపీకి చెందిన ఒక్కరి మద్దతును కూడగట్టినట్లు సమాచారం. ఇక్కడ ఎమ్మెల్యే షకీల్ ఆహ్మద్ ఎక్స్అఫీషియోగా ఓటెయ్యనున్నారు. ఆర్మూర్‌లో 23 వార్డులకు 10 టీఆర్ఎస్కు, 11 కాంగ్రెస్ దక్కాయి. బీజేపీకి చెందిన కౌన్సిలర్ టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతుండటంతో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిల ఓట్లతో ఇక్కడ టీఆర్ఎస్ గట్టెక్కే అవకాశం ఉంది. కామారెడ్డిలో మొత్తం 33 వార్డుల్లో 17 కాంగ్రెస్‌కు దక్కాయి. ఎంఐఎంకు చెందిన ఒక్కరు, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో పాటు ఎక్స్అఫీషియో షబ్బీర్‌అలీ ఓటు కలిపితే కాంగ్రెస్ మెజార్టీ 20కి చేరనుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ప్రతిష్టాత్మకం మున్సిపాలిటీ పీఠాలు దక్కించుకోవడం మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పురపోరులో టీడీపీ నామరూపాలు లేకుండా పోగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఎంఐఎం, బీజేపీలు కీలకంగా మారాయి. నిజామాబాద్, బోధన్‌లతో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం మద్దతు కూడగడుతుండగా... కామారెడ్డిలో ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు తెలిసింది. ఆర్మూర్‌లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థికి బీజేపీ మద్దతు తెలిపేందుకు సిద్ధమైంది. పరోక్ష ఎన్నికలు ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. నిజామాబాద్ మేయర్ పీఠం వైశాలినిరెడ్డి(టీఆర్ఎస్)కి దక్కనుంది. ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల చైర్మన్లుగా టీఆర్ఎస్ అభ్యర్థులు స్వాతిసింగ్బబ్లూ, ఎ.ఎల్లయ్య ఎన్నిక కానున్నారు. కామారెడ్డి చైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన పిప్పిరి సుష్మ కానుంది. -
‘పెద్దపల్లి’ రైల్వేలైన్ పూర్తి చేయండి
రైల్వే మంత్రి సదానంద్గౌడకు ఎంపీ కవిత వినతి ఖలీల్‌వాడి : నిజామాబాద్ జిల్లాకు అధిక మేలు చేసే రైల్వేలైన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వేమంత్రి సదానంద్గౌడను ఎంపీ కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఢిల్లీలో సోమవారం మంత్రికి వినతిపత్రం అందించారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వేలైన్‌కు 1993 -94లోనే బడ్జెట్లో మంజూరైందని, కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో మంజూరు చేయబడిన 177.46 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్లో కేవలం 28 కిలోమీటర్లు పెండింగ్ ఉండడం వల్ల జిల్లా ప్రజలకు సేవలందించకుండా నిరూపయోగంగా ఉందన్నారు. ప్రతిపాదిత కొత్త లైన్లలో మొదటి ప్రా దాన్యతగా ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ రై ల్వేలైన్లను చేపట్టాలని కోరారు. 2011లోనే సర్వే పనులు పూర్తిచేసి *700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినప్పటికీ రైల్వేబడ్జెట్‌లో కేటాయించకపోవడం బాధాకరమన్నా రు. తెలంగాణ జిల్లాలను మధ్య భారతదేశం తో అనుసంధానించే ఈ రైల్వేలైన్‌కు తగు కేటాయింపులు జరిపి పనులు ప్రారంభించాలని కో రారు. పెద్దపల్లి-ఆర్మూర్, నిజామాబాద్ రైల్వేలైన్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ లైను పూర్తయితే ఆర్మూర్ రైల్వే జంక్షన్ కావడంతో పాటు ఇక్కడి పంటలకు దేశ వ్యాప్త మార్కెట్‌తో అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు. సికింద్రాబాద్-నిజామాబాద్-ముథ్కేడ్ రూట్లలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. గ త ప్రభుత్వాల ఆలసత్వం వల్ల ఒక్క చెప్పుకోదగ్గ పని కూడా జిల్లాలో పూర్తి కాలేదన్నారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. జిల్లాలో హెవీ వెహికిల్ నిర్మాణ యూనిట్ ఏర్పాటు చేయండి జిల్లాలో హెవీ వెహికిల్ నిర్మాణ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీని ఎంపీ కోరారు. దీంతో నిజామాబాద్, ఆ దిలాబాద్, కరీంనగర్ జిల్లాతో పాటు జిల్లాకు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న యువకులు ఉపాధి అవకాశాలు మెరుగుపడాతాయన్నారు. మెదక్‌జిల్లా ఎద్దుమైలారంలోని ఓడిఎఫ్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ఆపాలని మంత్రిని కోరారు. త్వరలోనే అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
పోలవరం ఆర్డినెన్స్ అక్రమం: కవిత
-
కవిత రాకతో కార్మికులకు న్యాయం
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)కు గౌరవాధ్యక్షురాలిగా నిజామాబాద్ ఎంపీ కవితను నియమించడంతో కార్మికులకు మేలు జరుగుతుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కవిత నియామకంతో కార్మికుల సుధీర్ఘకాలమైన డిపెండెంట్ ఉద్యోగాలు, ఇతర కీలక సమస్యలు కొలిక్కి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పదమూడేళ్లుగా కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేయగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణను ప్రకటించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంచిర్యాల జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ధూంధాం నిర ్వహించనున్నట్లు చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల దయానంద్, కౌన్సిలర్లు జగన్మోహన్రావు, షఫీ, శ్రీపతి శ్రీనివాస్, నాయకులు బోరిగాం రాజారాం, కొత్త జయప్రకాశ్ పాల్గొన్నారు. -
విజయం అమరులకు అంకితం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి టీఆర్ఎస్కు పట్టం కట్టిన ఇందూరు ప్రజలకు రుణపడి ఉంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో పూర్తి మెజార్టీ ఇచ్చి తమపై విశ్వాసం ఉంచిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతగా ఉంటామన్నారు. ఈ అఖండ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటిం చారు. శనివారం నిజామాబాద్‌లోని టీఆర్ఎస్ జిల్లా కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో కవిత మాట్లాడారు. 1984 తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారం చేపట్టేందుకు వీలుగా తెలంగాణ ప్రజలు మెజార్టీ ఇచ్చారన్నారు.ప్రజల దీవెనలు పార్టీ అధినేత కేసీఆర్‌కు ఉండటంతోనే ఇది సాధ్యమైందని, జిల్లా సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, గల్ఫ్ బాధితులు, బీడీకార్మికులు, తాగునీరు, సాగునీరు, ఇలా జిల్లాలో చాలా సమస్యలున్నాయని, ప్రజలు ఇచ్చిన స్వీప్ మెజార్టీని వివరించి అవసరమైతే కేసీఆర్‌ను 10 శాతం అదనపు నిధులు జిల్లాకు కేటాయించాలని కోరుతామన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ఐదేళ్లలో అమలు చేసి తీరు తామని స్పష్టం చేశారు.ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చుతారన్నారు. తెలంగాణ జిల్లాలలోనే ఇందూరును ఆదర్శంగా ఉండేలా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కేం ద్రంలో హైదరాబాద్‌కు పార్టీ కార్యాలయానికి తీసిపోకుండా ‘తెలంగాణ భవన్’ను నిర్మిస్తామని, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి నిరోధకుడు డీఎస్ నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధిని అడ్డుకున్న డీఎస్‌కు ప్రజలు మరోసారి తగిన గుణపాఠం చెప్పారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అ భివృద్ది నిరోధకుడైన ధర్మపురి శ్రీనివాస్‌ను ఓడించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేదని, అయితే టీఆర్ఎస్, కేసీఆర్ ద్వారా ఆ కోరిక నెరవేరిందన్నారు. నిజామాబాద్ రూరల్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. సమస్యలపై అవగాహన ఉన్న నాయకులను ప్రజలు ఎన్నుకున్నారని, జిల్లా అభివృద్ధికి ఇక ఢోకా ఉండదని అన్నారు. పట్టం కట్టిన ప్రజలను మరవలేం ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు జరిగినా, చివరకు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఉద్యమంపైనే ప్రజలు విశ్వాసం ఉంచారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. గాంధేయవాద ఉద్యమంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన కేసీఆర్‌తోనే ‘తెలంగాణ’ సాధ్యమైందని భావించిన ప్రజలు ఇతర పార్టీలను పట్టించుకోలేదన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో అసలు టీఆర్ఎస్కు పట్టు లేదని, గెలుపు కష్టమని కొందరు చేసిన వ్యాఖ్యలకు ప్రజలు తనను గెలిపించి దీటైన జవాబు చెప్పారన్నారు. ఇక్కడి ప్రజలకు సర్వత్రా రుణపడి ఉంటానని, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జిల్లా పరిశీలకులు బాపూరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి పాల్గొన్నారు. -
పవన్ కు తిక్కే ఉంది.. లెక్క లేదు: కవిత
నిజామాబాద్: పవన్ కళ్యాణ్ కు తిక్కే ఉందిగాని లెక్క లేదని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించింది. నిజమాబాద్ లోకసభ అభ్యర్ధిగా టీఆర్ఎస్ నుంచి పోటి చేస్తున్న కవిత... పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై మండిపడ్డారు. నరేంద్రమోడీ అధికారంలోకి వస్తుందనే భ్రమలో ఆయన పక్కన పవన్ చేరారని కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది సినిమా కాదు.. రీటేకులు ఉండటానికి అని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్ పిచ్చివాడిలా మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలను ప్రజలు నమ్మరని కవిత అన్నారు. కమెడియన్లు, విలన్లు చిరంజీవి, పవన్ లేనని కవిత ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం టికెట్లు అమ్ముకున్న సొమ్ములో పవన్ కు ఎంత వాటా దక్కిందో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. -
పవన్ కళ్యాణ్‌పై కవిత ఫైర్
-
టీఆర్ఎస్లో ఫ్యామిలీ వార్
-
'పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి'
-
పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి: కవిత
హైదరాబాద్: పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో సామాజిక తెలంగాణ అని తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సామాజిక తెలంగాణ అని తర్వాత జై సమైక్యాంధ్ర అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏముఖం పెట్టుకుని తమ్ముడు వస్తున్నాడని ప్రశ్నించారు. పీఆర్పీ తప్పిదాలకు ముందుగా క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ ప్రజాజీవితంలోకి రావాలన్నారు. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. -
జజ్జనకరి జనాలే..
తెలంగాణ రథసారధికి అపూర్వ స్వాగతం అడుగడుగునా గులాబీ దళం నీరాజనం బేగంపేట నుంచి గన్‌పార్క్ వరకు భారీర్యాలీ బతుకమ్మలు,బోనాలు,కేరింతలు, నృత్యాలతో జననేతకు వెల్కం ర్యాలీలో ఒంటెలు, ఏనుగులు,గుర్రాలు ప్రత్యేక ఆకర్షణ తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన నగరం ఎటు చూసినా జనం.. నగరం గులాబీ వనం.. జయజయధ్వానాల ఉత్సాహ గళం.. పూలవర్షమై కురిసిన హర్షం.. హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టిన కేసీఆర్‌కు కనీవినీ ఎరుగని రీతిలో జననీరాజనం.. దాదాపు ఏడు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ.. దారి పొడవునా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే కళారూపాలు.. ఒంటెలపై ఊరేగింపులు.. బోనాలు.. బతుకమ్మ ఆటపాటలు.. ఉత్సాహపరిచే డప్పుచప్పుళ్లు.. తెలంగాణ విజయోత్సవ ర్యాలీ సంబరం అంబరాన్నంటింది. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా..తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడుతా’ అని గతనెల 31న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అన్నట్లుగానే..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అడుగుపెట్టిండు. ఉభయసభల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లు ఆమోదం అనంతరం తొలిసారి బుధ వారం నగరానికి చేరుకున్న తెలంగాణ రథసారధికి అపూర్వస్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేయడం, తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిగా తరలిరావడంతో నగరం తెలంగాణ నినాదాలతో మార్మోగిపోయింది. ఉద్యమనేత శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గన్‌పార్కుకు చేరుకుందిలా.. బుధవారం సాయంత్రం 4గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్..అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చారు. హరీష్‌రావు,కవిత, పార్టీ అగ్రనేతలు, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద ఆయన్ను ఆశీర్వదిస్తూ వివిధ మతాల పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. పెద్దసంఖ్యలో మహిళలు మంగళహారతులు,బతుకమ్మలు,బోనాలతో జైకేసీఆర్ అంటూ స్వాగతం చెప్పారు. జయజయధ్వానాల మధ్య బే గంపేట ఎయిర్‌పోర్టు నుంచి అశేషజనవాహిని తోడురాగా కేసీఆర్ ర్యాలీ ప్రారంభమైంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రచార రథంపై ఎంపీలు కేశవరావు,వివేక్,మందా జగన్నాథం,పార్టీ నేతలు ఈటెల రాజేందర్,నాయినిలతో కలిసి ప్రయాణించారు. అడుగడుగునా విజయచిహ్నాన్ని చూపుతూ,కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు కదిలారు. ర్యాలీలో ఆయనకు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. పార్టీశ్రేణులు బేగంపేట నుంచి గన్‌పార్క్ మార్గంలో ఏర్పాటుచేసిన బ్యానర్లు,ఫ్లెక్సీలు,గులాబీ తోరణాలతో నగరం గులాబీవనంగా మారింది. పలు ప్రధానకూడళ్ల వద్ద ఏర్పాటుచేసిన స్వాగత వేదికల వద్ద తెలంగాణ కళాకారులు ప్రదర్శించిన ధూంధాం నృత్యరూపకాలు ఉత్సాహం నింపాయి. టీఆర్ఎస్ జెండాలు చేతబూని ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు, ద్విచక్రవాహనాలపై ముందుకు సాగుతూ పలువురు కార్యకర్తలు ర్యాలీలో ప్రధానాకర్షణగా నిలిచారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు హెలికాప్టర్ల నుంచి దారిపొడవునా పూలవర్షం కురిపించి కేసీఆర్‌కు హార్థిక స్వాగతం పలికారు. మధ్యమధ్యలో పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ,రంగులు చల్లుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బేగంపేట,సీఎం క్యాంపుకార్యాలయం,గ్రీన్‌ల్యాండ్స్,పంజగుట్ట,సోమాజిగూడా, ఖైరతాబాద్,లక్డీకాపూల్,రవీంద్రభారతి మీదుగా సాగిన ర్యాలీ గన్‌పార్కుకు చేరుకుంది. అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేకరాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరులకు కేసీఆర్, పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. దారిపొడువునా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలతో పహారాకాశారు. అడుగడుగునా నీరాజనమే 4:50 గంటలకు బేగంపేట విమానశ్రయం నుంచి బయటకొచ్చిన కేసీఆర్‌కు జై తెలంగాణ, జైకేసీఆర్ నినాదాలతో స్వాగతం పలికారు. దారిపొడువునా పార్టీ కార్యకర్తలు డప్పువాయిద్యాలు, లంబాడ నృత్యాలు, తెలంగాణపాటలతో హోరెత్తించారు. తెలంగాణతల్లి సహా పలురకాల వేషధారణలు, గుర్రాలు, ఒంటెలతో స్వాగత ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. కాగా మధ్యాహ్నం 12 గంటల నుంచే అభిమానులు, తెలంగాణవాదులరాకతో బేగంపేట విమాశ్రయ పరిసరాలు కిక్కిరిసాయి. జనపార్కు భారీర్యాలీ నడుమ రాత్రి 9.15 గంటల ప్రాంతంలో కేసీఆర్ గన్‌పార్క్‌కు చేరుకోగానే జెతైలంగాణ నినాదాలు హోరెత్తాయి. వేలాదిగా తరలివచ్చిన తెలంగాణావాదులతో అసెంబ్లీ,రవీంద్రభారతి పరిసరాలు ఇసుకవేస్తే రాలనంతగా మారాయి. భారీ జనసందోహం నడుమ కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని వారి త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. భారీ తెరల ఏర్పాటు ఆయా ప్రాంతాల నుంచి గన్‌పార్కుకు చేరుకున్న వారు కేసీఆర్ నివాళులర్పించే ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా పెద్దపెద్ద తెరలను ఏర్పాటు చేశారు. అనేకమంది వీటిద్వారానే విజయోత్సవ ర్యాలీ,అమరవీరులకు నివాళి దృశ్యాలను వీక్షించారు. నివాళులర్పించే సమయంలో ఆకాశం నుంచి హెలికాప్టర్లలో పూలవర్షం కురిపించారు. ఆసందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు,డప్పునృత్యాలు,ఆటలు,అమరులను కీర్తిస్తూ పాడిన పాటలు హోరెత్తించాయి. -
అమరవీరలకు కవిత నివాళులు
-
తెలంగాణే లక్ష్యం
ఆర్మూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తామన్నారు. రాష్ట్రం విడిపోయాక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఒక్క సింగరేణిలోనే 50 వేల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి పాలకులు తెలంగాణ ప్రాంత రైతుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. అర్ధశతాబ్దం దాటినా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడమే ఇందుకు నిదర్శ నం. సీమాంధ్రలో మాత్రం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేశారు. తెలంగాణ ప్రాంత రైతాంగం కొట్లాడితే గాని పాలకులు స్పందించడం లేదు. ఆర్మూర్ ప్రాంత రైతులు దశాబ్దం పాటు పోరాడితే గుత్ప ఎత్తిపోతల పథకం నిర్మించారు. సమైకాంధ్రలో తెలంగాణ ప్రాంతంలోనే పసుపు పంట ఎక్కువగా పండిస్తారు. అందుకే పసుపు రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సీమాంధ్రలో పండించే ప్రమాదకరమైన పొగాకు పంట కోసం మాత్రం ప్రభుత్వం 1975లో గుంటూరులో పొగాకు బోర్డు ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులున్నారు. వారి గోడును సీమాంధ్ర పాలకులు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ కార్మికులు ఇతర రాష్ట్రాల యాజమాన్యాలతో కొట్లాడి తమ హక్కులను సాధించుకుంటున్నారు. లక్కంపల్లి సెజ్ భూములను రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఆ భూములను తిరిగి ఇవ్వాలి. ఆర్మూర్ ప్రాంత రైతులకు ఎర్రజొన్నల బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రైతులకు రావాల్సిన రూ.10 కోట్ల 83 లక్షలు ఇప్పిం చేందుకోసం కార్యాచరణ రూపొందిస్తాం. -
కవిత హత్య కేసు నిందితుని అరెస్టు
కొండమల్లేపల్లి (నల్గొండ), న్యూస్‌లైన్ : నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన గోలి కవిత హత్యకేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం స్థానిక విలేకరుల ఎదుట నిందితుడిని ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచర్ల మండలం అనుములవీడు గ్రామానికి చెందిన బాలకృష్ణ దేవరకొండలోని ఖాదర్ కళాశాలలో గతేడాది ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే తన జూనియర్ అయిన పట్టణానికి చెందిన రాములు కూతురు గోలి కవితతో పరిచయం ఏర్పడింది. కొంతకాలం ఇరువురూ ప్రేమించుకున్నారు. ఇటీవల కవితకు పెళ్లి కుదరింది. నిశ్చితార్థం కూడా జరగడంతో వారిద్దరి మధ్య విభేదాలొచ్చాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఒప్పుకున్న కవిత.. బాలకృష్ణను దూరం పెట్టింది. దీంతో ఆమెపై బాలకృష్ణ కక్ష గట్టాడు. పథకం ప్రకారం హత్య చేయాలని భావించాడు. ఈ నెల 11న దేవరకొండకు వచ్చిన అతను కవితకు ఫోన్ చేసి నీతో ఒకసారి మాట్లాడాలని చెప్పి, పట్టణానికి సమీపంలో ఉన్న కాసారం గుట్టల్లోకి తీసుకెళ్లాడు. పెళ్లి విషయంలో వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని కవితను ప్రేరేపించాడు. ముందస్తుగా వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందును ఆమెతో బలవంతంగా తాగించాడు. కవిత అపస్మారకస్థితిలోకి వెళ్లిపోవడంతో చావలేదని నిర్ధారించుకున్న బాలకృష్ణ కత్తితో గొంతు కోశాడు. పోలీసులను నమ్మించడానికి తను కూడా తక్కువ మోతాదులో క్రిమిసంహారక మందు తాగాడు. మళ్లీ బైక్‌పై పట్టణానికి తిరిగి వచ్చాడు. ఖాదర్ కళాశాల అధ్యాపకుడైన శ్రవణ్ వద్దకు వెళ్లి తాను విషం తాగినట్టు చెప్పి సృ్పహ కోల్పోయాడు. దీంతో అతను బాలకృష్ణను ఆస్పత్రికి చేర్చాడు. కాసారం గుట్టలో యువతి హత్య విషయం వెలుగులోకి రావడం.. బాలకృష్ణ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో అతనిపై విచారణ జరిపారు. కవితను తానే హత్య చేసినట్లు బాలకృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రవణ్ మానవతా దక్పథంతోనే బాలకృష్ణను ఆస్పత్రిలో చేర్చాడని, హత్య తనకు విషయం తెలియదని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడిపై నిర్భయచట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు తెలిపా రు. సమావేశంలో డీఎస్పీ సోమశేఖర్, సీఐ భాస్కర్, ఎస్ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
'కెసిఆర్ కుమార్తె కవిత రూపంలో తెలంగాణ తల్లి'
ఖమ్మం: తెలంగాణ తల్లికి లేని ఆడంబరాలు కల్పిస్తున్నారని ఎఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కూతురు కవిత రూపంలో విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ ఆకారంలో ఉండాలని మందకృష్ణ అన్నారు. -
ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ భార్య ప్రియుడితో కలసి తన భర్తనే హత్య చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఈ సంఘటన జరిగింది. లాల్జీ యాదవ్ అనే వ్యక్తి భార్య కవితకు విశ్వనాథ్ అనే మరొకరితో అక్రమ సంబంధముంది. ఈ విషయం యాదవ్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. భర్త తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో కవిత ప్రియుడితో కలసి హత్యకు పథకం వేసింది. వీరిద్దరూ మరొకరి సాయం తీసుకుని యాదవ్‌ను హత్య చేశారు. పొదలచాటున పడిఉన్నయాదవ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేశారు. నేరం చేసినట్టు వారు అంగీకరించారని పోలీసులు తెలిపారు. మూడో వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయాల్సివుంది. -
యువతిని హత్య చేసి పరారయ్యాడు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని కోరగా, అందుకు ఇష్టం లేని ప్రియుడు ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ వెస్ట్ ఏసీపీ హరికృష్ణ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుంటుపల్లిలో పాడుబడిన క్రషర్ వద్ద యువతి మృతదేహం ఉందని గతనెల 30న పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. అక్కడ లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా మృతురాలు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన ఎద్దనపూడి కవిత(23)గా గుర్తిం చారు. దీనిపై దర్యాప్తు కొనసాగించగా, జిల్లాలోని చాట్రాయికి చెందిన శింగపాము జయరామ్(22)ను ఆమె ప్రేమించినట్లు తేలింది. జయరామ్ చిట్యాలలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో అతడికి కవితతో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. తరువాత జయరామ్ స్వగ్రామం తిరిగి వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా, అతడు కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతనెల 25న ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. మరుసటిరోజు విజయవాడలో కలుసుకున్నారు. నగరంలో పలు ప్రాం తాల్లో తిరిగి, చివరకు గుంటుపల్లి వద్ద జన సంచారం లేని పాడు బడిన క్రషర్ వద్దకు చేసుకున్నారు. ఆమె పెళ్లి చేసు కోవాలని కోరింది. దీంతో మాటా మాటా పెరిగి గొడవ పడ్డారు. అప్పటి కే ఆమెను చంపాలని నిర్ణయిం చు కున్నాడు. గొడవ ముదరడంతో కవిత మెడకు చున్నీని బిగించి ఊపిరాడకుండా చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక చెన్నైలో స్నేహితుడి వద్దకు పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు అనంతరం హత్య కేసుగా మార్చి జయరామ్‌ను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ కనకారావు, ఎస్సై వాసిరెడ్డి శ్రీను, సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో సీఐ, ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.