
తారా చౌదరి(ఫైల్)
విజయవాడ: వివాదస్పద సినీ నటి తారా చౌదరి మరోసారి తెరపైకి వచ్చింది. బడాబాబులతో తన లీలలతో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తారా చౌదరి తాజాగా తన ఆడపడచు కవితపై దాడి చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు తారా చౌదరిపై కేసు నమోదు చేశారు.
శుక్రవారం తన ఆడపడచు కవిత ఇంటికి వెళ్లిన తారా చౌదరి ఆమెపై దాడికి పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకొని అక్కడకు చేరుకున్న పోలీసులపై సైతం తార చిందులేసింది. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. దీంతో పోలీసులు ఆమె వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు.