
మాకు కేసీఆరే బాహుబలి..!
ఎంపీ కల్వకుంట్ల కవిత
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ గెలిపించేందుకు ఎప్పుడో వచ్చే బాహుబలి, కట్ట ప్పల గురించి ఎదురు చూస్తోందని, తమకు మాత్రం సీఎం కేసీఆరే బాహుబలి అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌లో శనివారం జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సుకు హాజరైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఎన్నికల కోసం, ఓట్ల కోసం పనిచేసే పార్టీ కాదని, ప్రజల కోసం పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు భరోసా అని అన్నారు.