సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా | Palla Rajeshwar Reddy is in charge of the government whip | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా

Published Sat, Oct 29 2016 4:46 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా - Sakshi

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా

మండలి ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేట్టిన పల్లా
సాక్షి, హైదరాబాద్: తనను గుర్తించి ప్రభుత్వ విప్ పదవి అప్పగించిన సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ పార్టీకి రుణపడి ఉంటానని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీక రించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, పల్లాను ఆయన సీట్లో స్వయంగా కూర్చోబెట్టారు. కాగా, పల్లాకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, తుమ్మల, పోచారం, నాయిని, హరీశ్‌రావు, ఈటల, లక్ష్మారెడ్డి, తలసాని, మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి ఎంపీలు కవిత తదితరులు అభినందనలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement