ప్రియుడు దక్కలేదని యువతి బలవన్మరణం | Boyfriend dropped the woman suside | Sakshi

ప్రియుడు దక్కలేదని యువతి బలవన్మరణం

Sep 7 2015 2:01 AM | Updated on Sep 3 2017 8:52 AM

ప్రియుడు దక్కలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలో చోటుచేసుకుంది.

హసన్‌పర్తి: ప్రియుడు దక్కలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలో చోటుచేసుకుంది. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన బండారు సునీల్ (23) ఆత్మకూర్ మండలం ల్యాదేళ్లకు చెందిన ఆకునూరి కవిత(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో సునీల్ బావ ఆకారపు రాజమౌళి తన కూతురిని ఇచ్చి వివాహం చేయూలని నిర్ణరుుంచాడు. ముందు సునీల్ బావ కూతురును చేసుకోనని నిరాకరించిన ప్పటికీ పెద్ద మనుషుల మాటలతో వివాహానికి అంగీకరించాడు. ఈనెల 3వ తేదీన శ్రీఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పెళ్లికి ఏర్పాటు చేశారు.

అప్పటికే విషయం తెలుసుకున్న ప్రియురాలు కవిత తనకు న్యాయం చేయాలని హసన్‌పర్తి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఇస్తే  కేసు నమోదు చేస్తామని చెప్పడంతో కవిత అక్కడ నుంచి నేరుగా పెళ్లి మంటపానికి వచ్చి.. వివాహాన్ని ఆపే ప్రయత్నం చేసింది.  అక్కడ ఉన్న వారి నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో ఏమీ చేయలేక తీసుకోచ్చి క్రిమి సంహారక మందుతాగింది. తీవ్రఅస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement