‘పెద్దపల్లి’ రైల్వేలైన్ పూర్తి చేయండి
రైల్వే మంత్రి సదానంద్‌గౌడకు ఎంపీ కవిత వినతి
ఖలీల్‌వాడి : నిజామాబాద్ జిల్లాకు అధిక మేలు చేసే రైల్వేలైన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వేమంత్రి సదానంద్‌గౌడను ఎంపీ కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఢిల్లీలో సోమవారం మంత్రికి వినతిపత్రం అందించారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వేలైన్‌కు 1993 -94లోనే బడ్జెట్‌లో మంజూరైందని, కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదని పేర్కొన్నారు.
ఈ బడ్జెట్‌లో మంజూరు చేయబడిన 177.46 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్లో కేవలం 28 కిలోమీటర్లు పెండింగ్ ఉండడం వల్ల జిల్లా ప్రజలకు సేవలందించకుండా నిరూపయోగంగా ఉందన్నారు. ప్రతిపాదిత కొత్త లైన్లలో మొదటి ప్రా దాన్యతగా ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ రై ల్వేలైన్లను చేపట్టాలని కోరారు. 2011లోనే సర్వే పనులు పూర్తిచేసి *700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినప్పటికీ రైల్వేబడ్జెట్‌లో కేటాయించకపోవడం బాధాకరమన్నా రు.
తెలంగాణ జిల్లాలను మధ్య భారతదేశం తో అనుసంధానించే ఈ రైల్వేలైన్‌కు తగు కేటాయింపులు జరిపి పనులు ప్రారంభించాలని కో రారు. పెద్దపల్లి-ఆర్మూర్, నిజామాబాద్ రైల్వేలైన్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ లైను పూర్తయితే ఆర్మూర్ రైల్వే జంక్షన్ కావడంతో పాటు ఇక్కడి పంటలకు దేశ వ్యాప్త మార్కెట్‌తో అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు. సికింద్రాబాద్-నిజామాబాద్-ముథ్కేడ్ రూట్లలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. గ త ప్రభుత్వాల ఆలసత్వం వల్ల ఒక్క చెప్పుకోదగ్గ పని కూడా జిల్లాలో పూర్తి కాలేదన్నారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.
జిల్లాలో హెవీ వెహికిల్ నిర్మాణ యూనిట్ ఏర్పాటు చేయండి
జిల్లాలో హెవీ వెహికిల్ నిర్మాణ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీని ఎంపీ కోరారు. దీంతో నిజామాబాద్, ఆ దిలాబాద్, కరీంనగర్ జిల్లాతో పాటు జిల్లాకు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న యువకులు ఉపాధి అవకాశాలు మెరుగుపడాతాయన్నారు. మెదక్‌జిల్లా ఎద్దుమైలారంలోని ఓడిఎఫ్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ఆపాలని మంత్రిని కోరారు. త్వరలోనే అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.