
ఒక్క మహిళనైనా ఎమ్మెల్సీ చేయండి: షబ్బీర్
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీగా ఒక్క మహిళకైనా అవకాశం ఇవ్వాలని మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు.
జనాభాలో సగం ఉన్న మహిళలను కేసీఆర్ అవమాన పరిచారని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళ అంటే కేసీఆర్ కుమార్తె కవిత ఒక్కరేనా అని ప్రశ్నించారు. తన కుమార్తెకు ప్రాధాన్యం తగ్గుతుందననే మహిళలకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడం లేదన్నారు.