
'తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. తెలంగాణకు సంబంధించిన 12 అంశాలతో ఏడాది క్రితం కేంద్రానికి నివేదిక ఇచ్చినా.. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పందనా లేదన్న ఆమె రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.
పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సోమవారం పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశం కానున్నట్లు తెలిపారు. హై కోర్టు విభజన అంశాన్ని కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. తక్షణమే హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు.