'టి.సర్కార్ అధికారాలను కాలరాయడం లేదు'
శాంతి భద్రతల అంశంలో తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కాలరాయడం లేదని కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
న్యూఢిల్లీ: శాంతి భద్రతల అంశంలో తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కాలరాయడం లేదని కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుందనే వార్తలను రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని మాత్రమే కేంద్రం అమలు చేస్తోందని రాజ్ నాథ్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
రాజ్ నాథ్ ను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో గురువారం భేటి అయ్యారు. అనంతరం రాజ్ నాథ్ మాట్లాడుతూ.. దేశంలోని ఫెడరల్ నిబంధలకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోదు అని స్పష్టం చేశారు. దేశంలోని ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా కేంద్ర చర్యలు తీసుకోబోదని రాజ్ నాథ్ చెప్పినట్టు ఎంపీ కవిత కూడా మీడియాకు తెలిపారు.