కవిత కోసమే రూ. 15 కోట్లు ఇస్తున్నారా? | Congress Leader Nerella Sarada Comments on MP Kavita | Sakshi
Sakshi News home page

కవిత కోసమే రూ. 15 కోట్లు ఇస్తున్నారా?

Published Tue, Sep 27 2016 2:00 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

కవిత కోసమే రూ. 15 కోట్లు ఇస్తున్నారా? - Sakshi

కవిత కోసమే రూ. 15 కోట్లు ఇస్తున్నారా?

కాంగ్రెస్ నాయకురాలు నేరెళ్ల శారద
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 15 కోట్లు కేవలం సీఎం కేసీఆర్ కూతురు కవిత కోసమే కేటాయించారా అని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ కేవలం కేసీఆర్ బిడ్డకోసం, రాజకీయ అవసరాల కోసం కాకుండా బతుకమ్మ పండుగ సంస్కృతిని కాపాడటానికి ప్రజల సొమ్మును ఖర్చు చేస్తే బాగుంటుందన్నారు. కేసీఆర్ కూతురు కవిత ఎక్కడ బతుకమ్మ ఆడితే అక్కడ నిధులు కేటాయించడం దారుణమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 15 కోట్లు ఏయే గ్రామాలకు ఎంత కేటాయించారో, ఆ నిధులతో బతుకమ్మ పండుగ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ నిధులను అన్ని గ్రామ పంచాయతీలకు నేరుగా కేటాయించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement