
ఆ బాలిక చదివేది తొమ్మిదో తరగతి.. ఎగ్జామ్ టైమ్ వచ్చింది. కానీ ఆ బాలిక స్కూల్ ఫీజు రూ. 800 కట్టాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించక ఆ కొద్ది మొత్తాన్ని పరీక్షల నాటికి కట్టలేకపోయింది. ఇంకేముందే పరీక్షలు రాయడానికి స్కూల్ యాజమాన్యం అంగీకరించకపోగా, అవమానించింది. ఇది కూడా బహిరంగంగా ఆ అమ్మాయిని స్కూల్ యాజమాన్యం అవమానించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గడ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది.
స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ దగ్గర్నుంచీ స్కూల్ మేనేజర్ సంతోష్ కుమార్, ఆఫీసర్ దీపక్ సరోజ్ లు ఆ బాలికను అవమానానికి గురి చేశారు. స్కూల్ పరీక్ష ఫీజు కట్టలేకపోయిందంటూ అవమానించారు. అంతేకాకుండా పరీక్షలకు అనుమతించేది లేదని చెప్పారు. ఇక చేసేది లేక అక్కడ ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది. లోపలకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆమె తల్లి పొలం పనికి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి విగత జీవిలా కనిపించింది.

స్కూల్ ఫీజు కట్టలేదని ఆమెను పరీక్షకు అనుమతించడమే కాకుండా అవమానించడం దారణమని న్యాయవాది, స్థానిక పంచాయతీ సభ్యుడైన మొహ్మద్ అరిఫ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యాలు అవమానించాయంటే అది నేరం కిందకు వస్తుందన్నారు.
తన కూతురు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. దీనిపై భారతీయ న్యాయ సన్నిహిత సెక్షన్ 107 కింద స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com