
ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్ రాక్షసత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అయితే ఈ కేసులో వీరద్దర్నీ అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. దీనిలో భాగంగా చౌదరి చరణ్ సింగ్ జైల్ లో ఉన్న వీరిని పోలీసులు విచారిస్తున్నారు.
జైల్లో కూడా కలిసే ఉంటామని..
భర్తను హత్య చేసి జైలు పాలయ్యానన్న కనీస పశ్చాత్తాపం కూడా ముస్కాన్ లో కనిపించడం లేదు. జైల్లో కూడా తామిద్దరం కలిసే ఉంటామని పట్టుబట్టారు. ఇద్దర్నీ వేరు వేరు సెల్ లో వేయకండి.. తాము ఇద్దరం ఒకే చోట ఉంటామంటూ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇది జైలు నియమాలకు విరుద్ధమని, ఇలా ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి ఉండటం సాధ్యం కాదని సదరు అధికారులు స్పష్టం చేశారు.
ఇప్పటివరకూ వారిద్దరితో మిగతా ఖైదీలు ఎవరూ మాట్లాడలేదని జైలు సూపరెండెంట్ విరేష్ రాజ్ శర్మ తెలిపారు. తొలిరోజు వీరు ఏమీ తినలేదని, తర్వాత నుంచి భోజనం చేస్తున్నారన్నారు. అయితే ఒకే సెల్ లో ఉంచాలని కోరినట్లు విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. ఇది విరుద్దం కావడంతో వారి అభ్యర్థనను తిరస్కరించినట్లు చెప్పారు. వీరిద్దరికి సెపరేట్ బారక్ లు ఇచ్చామని, దాంతో వారు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఉండదన్నారు.
వీరిద్దరూ డ్రగ్స్‌కు బానిసలు
వీరిద్దరూ డ్రగ్స్ కు బానిసలైన సంగతని విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. మెడికల్ రిపోర్ట్ లు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వీరికి ట్రీట్ మెంట్ కు కూడా ఇప్పించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకి తెలియజేశారు.
మాకు లాయర్ ను ఏర్పాటు చేయండి
తమ తరఫున వాదించడానికి లాయర్ కావాలని విజ్ఞప్తి చేశారు ఆ నిందితులిద్దరూ. తమ కుటుంబానికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే స్థోమత లేదని, అందుచేత తమ తరఫున వాదించడానికి ప్రత్యేక గవర్నమెంట్ లాయర్ ను ఏర్పాటు చేయాలని చెప్పినట్లు మరో సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
#WATCH | Saurabh Rajput murder case | On accused Muskan Rastogi and Sahil Shukla, Senior Jail Superintendent Viresh Raj Sharma says, "They arrived 3 days ago and they said that they be lodged together or nearby barracks. They were told that as per the system in jail, there is no… pic.twitter.com/5vKpgzXEe0
— ANI (@ANI) March 23, 2025
ప్రియుడితో కలిసి భర్త హత్య
సౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్‌లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.
ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్‌పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.
ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు.
ఆరేళ్ల చిన్నారి తండ్రి హత్యను కళ్లారా చూసింది.. తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచడం గమనించింది. అయితే, అది దాచడం కాదని, నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు. మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు ‘డ్రమ్ములో ఉన్నాడు’ అంటూ చెప్పింది. ఆ మాటల వెనకున్న విషాదం తెలియక చిన్నపిల్ల ఏదో చెబుతోందని వారంతా అనుకున్నారు. కానీ నిజంగానే పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేకపోయారు.