
'ప్రతీ ఒక్కరి జీవితంలో.. సిగ్గు, బిడియాలు ఉండక తప్పవు. కాస్త అవి ఎక్కువైతే.. మాట్లాడడాలు, మాట్టాడుకోవడాలు ఉండనే ఉండవు. అవి కాస్త ముదిరితే.. ఏం చేయాలో తెలియక మనలో మనమే మదన పడుతూంటాం. ఇక ఆ పరిస్థితే.. ఓ బాలీవుడ్ యాక్టర్‌కి పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. వారెవరో చూద్దాం..'
అభిషేక్ బచ్చన్‌కి బిడియం ఎక్కువ. నలుగురిలో మాట్లాడలేడు. తనతోపాటు నలుగురు లేనిదే ఎక్కడికీ కదలడు. కొత్తవాళ్లతో కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడడు. అంతెందుకు హోటల్ రూమ్‌లో ఉంటే.. రూమ్ సర్వీస్ ఎంత అవసరమైనా.. ఫోన్ చేసి అడగడట. ఆకలి దంచేస్తున్నా ఫుడ్ ఆర్డర్ పెట్టడట. అతని సిగ్గు, బిడియం, బెరుకు ఆ రేంజ్‌లో ఉంటాయని ఓ ఇంటర్వ్యూలో అభిషేకే చెప్పాడు.
ఇవి చదవండి: సిద్ధి ఇద్నానీ: ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం!